వాటికి ధీటుగా ‘భాయ్’ పాటలుంటాయి - నాగార్జున
వాటికి ధీటుగా ‘భాయ్’ పాటలుంటాయి - నాగార్జున
Published Wed, Oct 16 2013 1:42 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
‘‘అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేయాలనుకున్న ‘భాయ్’ పాటల్ని ఇలా సింపుల్‌గా విడుదల చేయడం బాధగా ఉంది. వేదికపై ఈ సినిమా టైటిల్ సాంగ్‌కి డాన్స్ చేయాలని ప్రిపేర్ అయ్యాను కూడా. కొన్ని కారణాల వల్ల అది కూడా కుదర్లేదు’’ అన్నారు నాగార్జున. వీరభద్రమ్ దర్శకత్వంలో ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘భాయ్’. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగార్జున ఆడియో సీడీని ఆవిష్కరించారు. ప్రచార చిత్రాలను శభాసిష్ సర్కార్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున ఇంకా మాట్లాడుతూ- ‘‘ఇటీవలే దేవిశ్రీ స్వరాలందించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా చూశాను. అందులో ఓ పాటలో తను కనిపించాడు కూడా. తన పెర్‌ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. ఆ సినిమాకు పాటలు కూడా అద్భుతంగా ఇచ్చాడు. ఆ పాటలకు ధీటుగా ‘భాయ్’ పాటలుంటాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఈ సినిమాకు హైలైట్ అవుతుంది. రిచా గంగోపాధ్యాయ నటన, నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు వీరభద్రమ్. తనకు కచ్చితంగా ఇది హ్యాట్రిక్ హిట్ అవుతుంది. సినిమాలో విషయం ఉంటే పైరసీ కూడా ఏమీ చేయలేదని ‘అత్తారింటికి దారేది’ సినిమా నిరూపించింది.
ఆ స్ఫూర్తితోనే మేం కూడా ముందుకు సాగుతున్నాం’’ అన్నారు. ‘‘‘భాయ్’ టైటిల్ రివీల్ చేసినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు అధికమయ్యాయి. నాగార్జునకి, కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. యాక్షన్ సన్నివేశాల్లో నాగార్జున పెర్‌ఫార్మెన్స్ అద్భుతం. ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తాం’’ అని వీరభద్రమ్ తెలిపారు. నాగార్జునతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని రిచా గంగోపాధ్యాయ ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా అనంతశ్రీరామ్, సాయిబాబు, విజయ్‌మాస్టర్ తదితరులు కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement