న్యూలుక్‌తో ‘భాయ్’
న్యూలుక్‌తో ‘భాయ్’
Published Thu, Aug 15 2013 11:49 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
మంచి పాత్రలు ఎన్ని పోషించినా... ఇంకా కొత్తదనం కోసం ఉవ్విళ్లూరుతుంటారు. నాగార్జున. తన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తుంటారు. ఇటీవలే విడుదల చేసిన ‘భాయ్’ ఫస్ట్‌లుక్ చూస్తే... అది నిజమని ఎవరైనా అంగీకరించాల్సిందే. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ్ ఆహార్యమే కాదు, పాత్ర చిత్రణ కూడా కొత్తగా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
నేడు ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహక నిర్మాత ఎన్.సాయిబాబు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకుల అంచనాలకు అందని స్థాయిలో వీరభద్రం చౌదరి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. దర్శకునిగా ఆయనకిది మూడో సినిమా. కచ్చితంగా హేట్రిక్ విజయాన్ని సాధిస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే సినిమా ఇది.
‘భాయ్’ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. నేటి సాయంత్రం 8 గంటలకు అన్నపూర్ణ స్టూడియో వారి అధికారిక యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 1న పాటలను, అదే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నథాలియాకౌర్, కామ్నాజఠ్మలాని, హంసానందిని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు, డా.బ్రహ్మానందం, చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, సయాజీషిండే, రాహుల్‌దేవ్, ఆదిత్యమీనన్, సుప్రీత్, అజయ్, నాగినీడు, గీతాంజలి, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.
Advertisement
Advertisement