రిచాతో నాగ్ డ్యూయెట్ | Nagarjuna, richa duet song in 'Bhai' movie | Sakshi
Sakshi News home page

రిచాతో నాగ్ డ్యూయెట్

Published Fri, Sep 13 2013 12:52 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

రిచాతో నాగ్ డ్యూయెట్ - Sakshi

రిచాతో నాగ్ డ్యూయెట్

కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తుంటాయి. ‘భాయ్’ చిత్రం విషయంలో అదే జరుగుతోంది. ఇందులో నాగార్జున ఆహార్యం, టీజర్‌లో నాగ్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీనికి తోడు నాగార్జునే ఈ చిత్రాన్ని నిర్మించడం, దర్శకుడు వీరభద్రం చౌదరి గత విజయాలు... ఇవన్నీ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యాయని చెప్పొచ్చు. 
 
తొలి, మలి విజయాలను అందుకున్న వీరభధ్రం... తప్పకుండా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే టాకీ పూర్తయిన ఈ చిత్రం డబ్బింగ్‌ని కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆఖరి పాట చిత్రీకరణ జరుగుతోంది. నేటి నుంచి నాగ్, కథానాయిక రిచా గంగోపాథ్యాయ, వందమంది డాన్సర్లపై నృత్యదర్శకుడు రాజు సుందరం నేతృత్వంలో ఓ మాస్ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారు వీరభద్రం. 
 
భాస్కరభట్ల రాసిన ఈ పాట కోసం 60 లక్షలతో అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్‌ని నిర్మించారు. ఈ నెల 20న పాటలను విడుదల చేయడానికి నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 4న సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement