విదేశాల్లో చక్కర్లు కొడుతున్న 'భాయ్ ' | Nagarjuna shoots in over 700-year-old Slovenian castle for 'Bhai' | Sakshi
Sakshi News home page

విదేశాల్లో చక్కర్లు కొడుతున్న 'భాయ్ '

Published Mon, Aug 5 2013 3:46 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna shoots in over 700-year-old Slovenian castle  for 'Bhai'

నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ చిత్ర  సన్నివేశాలు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు చిత్ర యూనిట్ విదేశాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యే కొన్ని చిత్ర సన్నివేశాలను స్లొవేనియా దేశంలో 700 సంవత్సరాల పురాతన చరిత్ర గల ఒక కోటలో నిర్మించారు. కాగా, కొన్ని పాటలను ఐస్లాండ్‌లో చిత్రీకరించారు. కోట సన్నివేశాల గురించి  హీరో నాగార్జునతో మాట్లాడితే.. ఆ పురాతణమైన కోటలో నిర్మించిన పాట చిత్రీకరణ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు. అక్కడ షూటింగ్ చేయడం ఒక మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందన్నారు.
 
దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి ఇప్పటికే టాకీని ముగించాడు. ఇంకోవైపు డబ్బింగ్‌ జరుగుతోంది. కామ్నజఠ్మలానీ ఇందులో తెలంగాణా యాసలో మాట్లాడనుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాఫియా నేపథ్యమైనా అది ఎక్కువగా ఉండదని అంటున్నారు. రిచా, హంసానందిని, కామ్న, నథాలియాకౌర్‌ వంటి వారు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది.  ఈనెల 16న ఆడియోను విడుదలచేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు.  ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం మరియు జయప్రకాశ్ రెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


 నాగార్జునలోని మాస్ యాంగిల్‌ని క్లాస్‌గా ప్రెజెంట్ చేస్తూ వీరభద్రం చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంభాషణలు చాలా శక్తిమంతంగా ఉంటాయనేది యూనిట్ వర్గాల సమాచారం. కామెడీ, యాక్షన్ కొత్త పుంతలు తొక్కే విధంగా ఉంటాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement