ఆశలొద్దు: నటనకు హీరోయిన్ గుడ్ బై! | No acting ambitions in it, says Richa Gangopadhyay | Sakshi
Sakshi News home page

ఆశలొద్దు: నటనకు హీరోయిన్ గుడ్ బై!

Published Mon, Oct 23 2017 7:53 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

No acting ambitions in it, says Richa Gangopadhyay - Sakshi

సాక్షి, సినిమా: తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన నటి రిచా గంగోపాధ్యాయ్. నటనతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. కానీ అవకాశాలు రావడం లేదనో, లేక ప్రాధాన్యమున్న పాత్రలు దక్కడం లేదనో గానీ గత నాలుగేళ్లుగా సినీ ఇండస్ట్రీకి రిచా దూరంగా ఉంటున్నారు. నటనకు గుడ్ బై చెప్పానని తనమీద ఇక ఆశలు పెట్టుకోవద్దంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దర్శకుడు శేఖర్ కమ్ముల 'లీడర్‌'తో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆపై ప్రభాస్‌తో మిర్చి, రవితేజతో సారొచ్చారు, మిరపకాయ్ మూవీలు.. వెంకటేశ్‌తో నాగవల్లి మూవీలో నటించారు. చివరగా నాగార్జునతో భాయ్ చిత్రంలో నటించారు. 2013లో భాయ్ విడుదలైంది. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయారు.

ఇటీవల ట్విట్టర్ ద్వారా రిచా తాను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్లు స్వయంగా తెలిపారు. ఆమె ఫాలోయర్లు కొందరు.. మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి.. మళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తారు అంటూ హీరోయిన్ రిచాకు తెగ ట్వీట్లు చేస్తున్నారట. దీంతో తన అభిమానులు, ట్విట్టర్ ఫాలోయర్లకు ఆమె వరుస ట్వీట్లతో వివరణ ఇచ్చారు. 'నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారు. కానీ అందరికీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా. నా చివరి మూవీ విడుదలై దాదాపు ఐదేళ్లు కావొస్తుంది. నా వివరాలు గూగుల్‌లో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం నా జీవితంలో వేరే దశలో ఉన్నాను. ఇందులో నటన అనే అంశమే లేదంటూ' సినిమాలకు గుడ్ బై చెప్పేశానని నటి రిచా గంగోపాధ్యాయ్ వరుస ట్వీట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement