స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నా: నాగార్జున | I wanted to dance for Bhai Audio function : Nagarjuna Akkineni | Sakshi
Sakshi News home page

స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నా: నాగార్జున

Published Mon, Oct 14 2013 5:14 PM | Last Updated on Fri, Sep 1 2017 11:39 PM

స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నా: నాగార్జున

స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నా: నాగార్జున

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేదీ' సినిమా పరిశ్రమకు ఒక దారి చూపించిందని 'కింగ్' నాగార్జున అన్నారు. మంచి సినిమాను పైరసీ ఆపలేదని ఈ చిత్రం నిరూపించిందన్నారు. నేడు జరిగిన 'భాయ్' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్ను భారీగా చేయాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇందుకు కొంచెం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ధూం ధాంగా చేద్దామనుకున్నామని, స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నానని వెల్లడించారు. హీరోయిన్లు కూడా రెడీ అయ్యారని అన్నారు. అయితే సమయాభావం వల్ల ఇవన్నీ చేయలేకపోయామని వివరించారు. 'భాయ్' సినిమాను 25న విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.

ఈ సినిమాకు  సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్.. బ్యాంకాక్లో మ్యూజిక్ సిట్టింగ్లో ఉండడం వల్ల ఆడియో ఫంక్షన్ రాలేకపోయాడని తెలిపారు. అత్తారింటికి దారేదీలో దేవీశ్రీ ప్రసాద్ ఒక పాటలో బాగా నటించాడని నాగార్జున కితాబిచ్చారు. ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రమ్, హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement