attarintiki daredi
-
అత్తారింటికి దారేది.. దించేశారు
తెలుగులో ఘనవిజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను కోలీవుడ్‌లో ‘వంత రాజవథాన్ వరువెన్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసింది. ఈ సినిమా తమిళ్ రీమేక్‌లో పవన్‌కల్యాణ్ పాత్రలో శింబు నటించనుండగా.. ఆయనకు జోడీగా మేఘాఆకాష్, కేథరిన్ థెరీసా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సుందర్.సి దర్శకుడు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. తొలిసారి సుందర్- శింబు జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫన్, సెంటిమెంట్, ఎమోషన్స్‌తో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన అత్తారింటికి దారేది.. విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. ‘వంత రాజవథాన్ వరువెన్’ టీజర్లోనూ అవే ఎలిమెంట్స్‌తో, కథ కథనంలో ఎలాంటి మార్పులు చేయకుండానే చిత్రాన్ని తెరకెక్కిచ్చినట్టు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ఇందులోని సీన్స్ చాలా భాగం తెలుగు వర్షన్ మాదిరిగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభు, నాజర్, యోగిబాబు, మోట్టా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. -
మరోసారి అత్తగా..
ఇటీవల వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో పవర్ఫుల్ అత్తగా కనిపించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్నారు. ముందుగా నదియా పాత్రలో ఖుష్భు కనిపిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా శింబు అత్త పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా నటిస్తున్నారు. ఫైనల్‌గా అత్త దొరికేసింది. ఇక అత్తారింటికి దారి వెతికే పనిలో బిజీ అయ్యారు శింబు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. -
మరదలు దొరికింది
అత్తారింటికి దారి కనుక్కునే పనిలో తమిళ హీరో శింబు బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆయనతో ప్రయాణానికి కేథరిన్ కూడా తోడయ్యారట. సుందర్ సి. దర్శకత్వంలో శింబు హీరోగా తెలుగు హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మేఘా ఆకాశ్ ఓ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేథరిన్ థెరీసా కూడా తోడయ్యారు. దీంతో బావకు ఇద్దరు మరదళ్లు దొరికారు. తెలుగులో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే. మరి.. మేఘా, కేథరిన్ ఏయే పాత్రలు చేస్తారన్నది ఇంకా బయటకు రాలేదు. అలాగే శింబుకు అత్తగా ఎవరు నటిస్తారన్నది కూడా చిత్ర బృందం వెల్లడించలేదు. ఖుష్బూ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. -
అత్తారింటికి దారేది: శింబుతో మేఘా రొమాన్స్!
సాక్షి, తమిళసినిమా : నటుడు ధనుష్‌తో జోడీ కట్టిన హీరోయిన్ తాజాగా శింబుతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోందట. నటుడు శింబు చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అయ్యిపోతున్నారు. ఈయన మణిరత్నం దర్వకత్వంలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘సెక్క సివంద వానం’ (తెలుగులో నవాబ్) సినిమా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక, దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయా- 2 చిత్రాలలో నటించడానికి శింబు కమిట్ అయ్యారు. అదేవిధంగా ఇటీవల లైకా సంస్థ కూడా శింబుతో చిత్రం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్ద తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్ర రీమేక్ హక్కులను పొందిన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రీమేక్‌లో పవన్‌కల్యాణ్ పాత్రలో శింబు నటించనుండగా.. ఆయనకు జోడీగా మేఘాఆకాష్కు అవకాశం వరించిందట. ఈ అమ్మడు ఇప్పటికే కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా ‘ఎన్నై నోక్కి పాయుం తూటా’ చిత్రంతోపాటు ఒరు పక్క కథై, అధర్వకు జతగా బూమరాంగ్ చిత్రాలలో నటిస్తోంది. అయితే ఈ మూడింటిలో ఏ ఒక్క చిత్రం ఇంకా తెరపైకి రాలేదు. తెలుగులో ఇప్పటికే లై, ఛల్ మోహనరంగా వంటి చిత్రాల్లో నటించింది. ఇక, అత్తారింటికి దారేది చిత్రంలో సమంత పాత్రను మేఘా ఆకాశ్ పోషించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మరో పాత్రను నటి ప్రణీత చేయగా.. తమిళంలో ఆ పాత్ర ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. -
జనవరిలో అత్తారింటికి!
అత్తారింటికి అడ్రస్ వెతుకుతున్నారు శింబు. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయా? అంటే కాదు. తెలుగు సినిమా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్‌లో శింబు హీరోగా నటించడానికి వర్క్స్ మొదలయ్యాయి. సుందర్. సి దర్శకత్వం వహించనున్నారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘‘సుందర్ డైరెక్షన్లో శింబు హీరోగా ‘అత్తారింటికి దారేది’ తమిళ రీమేక్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లైకా ప్రొడక్షన్స్ ప్రతినిథులు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న పొలిటికల్ మూవీ ‘మానాడు’లో నటిస్తున్నారు శింబు. ‘అత్తారింటికి దారేది’ రీమేక్ జనవరిలో రిలీజ్ అంటే.. ఈ రెండు సినిమాల చిత్రీకరణలతో శింబు బిజీగా ఉంటారన్న మాట. -
బీఎన్ఆర్ స్మారక పురస్కార ప్రధానోత్సవం
-
అలా ఎవరూ చేయలేదు!
నాపై అలా ఎవరూ ఒత్తిడి చేయలేదని అంటోంది నటి ప్రణిత. అమ్మో బాపుగారి బొమ్మో పాట వర్ణణకు పేటెంట్ ఈ సుందరి. గుండరాల్లాంటి కళ్లతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే ప్రణితను కథానాయకి పాత్రలు మాత్రం పెద్దగా దరి చేరడం లేదు. తెలుగు చిత్రం అత్తారింటికి దారేదితో సహా చాలా చిత్రాల్లో రెండవ కథానాయకి పాత్రలకే పరిమితం అవుతోంది. తమిళంలో ఉదయన్ చిత్రంలో నాయకిగా పరిచయమైన ప్రణిత ఆ తరువాత శకుని, మాస్ లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను చేసింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒక్కో చిత్రం చేతిలో ఉన్న ప్రణితతో చిట్‌చాట్. ప్ర: తమిళంలో అవకాశాలు తగ్గినట్లున్నాయే? జ: అధిక చిత్రాల్లో నటించాలన్న కోరిక, ఏడాది మొత్తం నటిస్తూ బిజీగా ఉండాలన్న ఆశ నాకు లేవు. నా తల్లిదండ్రులు డాక్టర్లు. వారి కలలు, లక్ష్యం నెరవేర్చే మంచి కూతురిగా ఉండాలనే ఆశిస్తున్నాను. తెలుగు, కన్నడ భాషల్లో నాకు నటిగా మంచి ఆదరణే లభిస్తోంది. అక్కడి చిత్రాలు పూర్తి చేయడానికే టైమ్ సరిపోతోంది. ప్ర: బాలీవుడ్ ఆశ లేదా? అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? జ: హిందీ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి లేదు. అక్కడి వరకూ ఎందుకు మాలీవుడ్ చిత్రాలే చేయలేదు. ప్ర: రోజుకో భాషలో పూటకో కథానాయకి అంటూ కొత్త వారు వస్తున్నారు. వారితో పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు? జ: నిజమే పలు భాషల్లో పలువురు నటీమణులు, సాంకేతిక కళాకారులు పరిచ యం అవుతున్నారు. అయితే వాళ్లను ఎం దుకు పోటీగా భావించాలి? ఇక్కడ ఎవరికి ఎవరూ పోటీ కాదు. వారి వారి ప్రతి భ, శ్రమనే ఉన్నతి స్థాయికి చేరుస్తాయి. ప్ర: తెలుగు చిత్రాల్లో గ్లామర్‌కు గేట్లు తెరిచారట? జ: తెలుగులో అధిక గ్లామర్‌ను ఆశిస్తారనే ప్రచారం ఉన్న మాట నిజమే. నాకక్కడ హోమ్లీ ఇమేజ్ ఉంది. గ్లామరస్‌గా నటించమని ఇప్పటి వరకూ నన్నెవరూ ఒత్తిడి చేయలేదు. ప్ర: ఇంకా ఎంత కాలం నటిగా కొనసాగుతారు? జ: అది నా చేతిలో లేదు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలంటూ ఏమీ లేవు. ఈ రోజు మంచిగా గడిచిపోయిందా? అన్నదాని గురించే ఆలోచిస్తాను. ఇక నటిగా అంటారా అభిమానులు ఆదరించే వరకూ నటిస్తాను. ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు? జ: బాహుబలి చిత్రంలో నటించిన కథానాయికలందరూ నాకిష్టమైన వారే. అదే విధంగా హిందీ చిత్రం బాజీరావ్ మస్తానీలో దీపికాపదుకొణె నటన చాలా నచ్చింది. అలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను. ప్ర: అవార్డులను ఆశిస్తున్నారా? జ: నాకు అభిమానుల చప్పట్లు, ప్రశంసలు, మంచి విమర్శలే ముఖ్యం. ఉత్తమ నటి అవార్డు లభిస్తే సంతోషమే. అంతే గానీ అవార్డుల కోసమే నటించాలనుకోవడం లేదు. ప్ర: చివరి ప్రశ్న. పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: ఇప్పటి వరకూ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఎవరినీ ప్రేమించలేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. అమ్మానాన్నలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను. -
డై..లాగి కొడితే....
సినిమా : అత్తారింటికి దారేది రచన - దర్శకత్వం: త్రివిక్రమ్ గౌతమ్ నంద (పవన్‌కల్యాణ్) తన అత్త కూతురైన ప్రమీలను (ప్రణీత) ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వన్ ఫైన్ డే అత్త కూతురికి తన ప్రేమ విషయం చెబుదామని వెళతాడు. కానీ, అనుకొన్నదొక్కటి అయినదొకటి. గౌతమ్ రూమ్‌లోకి ఎంటరవ్వగానే తాను భరత్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, తనకు రేపు పెళ్లి జరగబోతోంది, అది చెడగొట్టి భరత్‌ని తీసుకు రమ్మని అసలు మ్యాటర్ చెబు తుంది ప్రమీల. ఆ షాక్ నుంచి తేరుకున్న గౌతమ్, ఆమె ప్రియుణ్ణి తీసుకు రావడానికి వెళతాడు. భరత్ తండ్రి సిద్ధప్ప (కోట శ్రీనివాస రావు) పెద్ద ఫ్యాక్షనిస్టు. అతని కొడుకుని కిడ్నాప్ చేయడమంటే మాటలు కాదు. కానీ, గౌతమ్ అడ్డమొచ్చినవారిని రప్ఫాడించి, భరత్‌ను తన వెంట తీసుకెళుతూ కోటకు వార్నింగ్ ఇస్తాడు. ‘చూడప్పా సిద్ధప్పా.. నేను సింహం లాంటోణ్ణి. అది గెడ్డం గీసుకోలేదు.. నేను గీసుకుంటా. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్’. అని ఆ పంచ్ డైలాగ్‌తో హెచ్చరించి మరీ వెళతాడు. డైలాగ్ అదిరింది కదూ! -
పవర్ స్టార్‌ను వెనక్కి నెట్టిన అభిమాని
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నితిన్. తన సినిమాల్లో, సినిమా ఫంక్షన్లలో కూడా పవన్ జపమే చేసే నితిన్, ఇప్పుడు తన అభిమాన నటుడి రికార్డ్‌ను దాటేశాడు. తన తాజా సినిమా అ..ఆ.. కలెక్షన్లతో పవర్ స్టార్కే షాక్ ఇచ్చాడు.. ఈ యంగ్ హీరో. పవన్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమా ఓవర్సీస్ కలెక్షన్లను నితిన్ ఎనిమిది రోజుల్లో దాటేయటం విశేషం. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అత్తారింటికి దారేది. భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓవర్సీస్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫుల్ రన్లో 1.89 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి అప్పట్లో టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే ఆ తరువాత విడుదలైన బాహుబలి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో సినిమాలు పవన్ మార్క్‌ను దాటి ముందు నిలిచాయి. దీంతో పవన్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే పవన్‌ను ఫోర్త్ ప్లేస్ నుంచి కూడా వెనక్కి నెట్టేశాడు నితిన్. నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ.. కేవలం ఎనిమిది రోజుల్లోనే 1.9 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, ఓవర్ సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. ఇప్పటీ మంచి వసూళ్లను సాధిస్తుండటంతో ఈ సినిమా నాన్నకు ప్రేమతోనూ కూడా వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలవటం కాయం అంటున్నా ట్రేడ్ పండితులు. -
ఎంత ఎత్తుకి ఎదిగినా... మూలాలే ఆధారం!
పాటతత్వం త్రివిక్రమ్‌గారితో సినిమా అంటే ఓ మంచి పుస్తకం చదివినట్లే. అలాంటిది ఆయనతో ‘జులాయి’ చిత్రం తర్వాత రెండో సారి పనిచేసే అవకాశం వచ్చింది. అదే ‘అత్తారింటికి దారేది’. పవన్‌కల్యాణ్ గారు హీరో అనగానే నాకు కాస్త టెన్షన్‌గా అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాకి పనిచేయడం ఇదే తొలిసారి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నాకు హీరో పరిచయ గీతం రాసే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌గారు ఆల్రెడీ ట్యూన్ కూడా ఇచ్చేశారు. నేనిక పాట రాయడమే ఆలస్యం. ఫస్ట్ వెర్షన్ రాసుకెళ్లా. ఎందుకో త్రివిక్రమ్‌గారికి నచ్చలేదు. అలా ప్రతి రోజు రెండు మూడు వెర్షన్లు రాసుకెళ్లా. ఈ పాటలోని మొదటి రెండు లైన్లకే పది రోజులు టైమ్ పట్టేసింది. ఈ సినిమా చిత్రీకరణ నిమిత్తం త్రివిక్రమ్ స్పెయిన్ వెళ్లడంతో కొన్నాళ్లు నా మకాం చెన్నైకి మారింది. త్రివిక్రమ్‌గారు అందుబాటులో లేకపోతే అందులో కొన్ని లైన్లు దేవిశ్రీ ప్రసాద్‌గారు ఓకే చేశారు. ఇలా ఏకంగా ఒక్క పాట కోసమే 45 రోజులు టైం తీసుకున్నా. గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలిమబ్బు కోసం/ తరలింది తనకు తానే ఆకాశం పరదేశం/శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్కకోసం /విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం.. సిరి సంపదలున్నా, పేరు ప్రతిష్ఠలున్నా మన సంతోషాన్ని, బాధనీ పంచుకునే సొంతవాళ్లు దగ్గర లేనప్పుడు ఆ లేమిని తూకం వెయ్యలేం. కొన్ని వేల కోట్లకు అధిపతి అయినా పిల్లా పాపలతో కళకళలాడాల్సిన ఇల్లు తాను చేసిన చిన్న పొరపాటు వల్ల వెలవెలబోతుంది. వారసుడిగా తాత సంపదనే కాకుండా బాధను కూడా పంచుకున్న ఆ కథానాయకుడు ఆ సిరిని మళ్లీ తిరిగి తీసుకొస్తానని బయలుదేరే సందర్భంలో ఈ పాట మొదలవుతుంది. ఒక వ్యక్తి తాలూకు బాధని, గుండెలోతుని ప్రతిబింబించే విధంగా ఉన్న ఆ రెండు వాక్యాల్లో బోల్డెంత ఫిలాసఫీ కూడా ఉంది. ఇది త్రివిక్రమ్‌గారి తాత్వికత లేక సందర్భంలోని గాఢతో తెలియదుగానీ ఈ పాట రాయడానికి ఆయన చెప్పిన రెండు పిట్ట కథలే మూలం అని చెప్పొచ్చు. - ఒక చెట్టుపై ఓ పక్షి గూడుపెట్టుకుంది. కొంతకాలానికి ఆ పక్షి వలస వెళ్లిపోయింది. అలా వెళ్లి తిరిగిరాని పక్షి కోసం చెట్టు కదిలి వెళితే... - ఆకాశాన్ని ఆవాసంగా చేసుకుని మబ్బులు ఉంటాయి. అలా వెళ్లిపోయిన మబ్బు కోసం ఆకాశమే తరలి వెళితే... ఇవి మన నిత్యజీవితంలో జరిగే సన్నివేశాలే... మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో విలువైనవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పక్కన ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. దూరం అయ్యాక అవి దొరికే అవకాశం ఉండదు. మనిషి ఎప్పుడూ ఈ రెండు సంఘటనల మధ్య నలిగిపోతూ ఉంటాడు. అలా కోల్పోయిన అతి విలువైన వస్తువుల్ని తిరిగి పొందడం కోసం ఏదైనా చేయాలనుకుంటాడు. సరిగ్గా అలాంటిదే ఈ సందర్భం కూడా. ‘అత్తారింటికి దారే ది’ సినిమాలో మొదటి పాటగా ఈ సందర్భోచితమైన పాట పెట్టడం ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో తెలిసిపోతుంది. ఆ తర్వాత పల్లవిగా మొదలయ్యే భైరవుడో, భార్గవుడో వాక్యాలు సినిమాలో కథానాయకుడి తదుపరి పరిణామ క్రమాన్ని ఊహిస్తున్నట్టుగా ఉన్నా ‘వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు’ అనే పల్లవి ముగింపు పదాలతో వీడు అనుకున్నది సాధిస్తాడని చెప్పకనే చెబుతుంటాయి. ఈ పాట రాసేటప్పుడే హీరో పవ న్కల్యాణ్గారి ఇమేజ్‌నీ, త్రివిక్ర మ్గారి స్టాండర్డ్స్నీ హృదయంలో పెట్టుకుని మరీ రాశాను. మొదటి చరణంలో ‘దివినుంచి భువిపైకి భగభగమని కురిసేటి వినిపించని కిరణం చప్పుడు వీడు’ లాంటి వాక్యాల ద్వారా కథనాయకుని గుణగణాలను వివరిస్తే, ‘శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు’ వాక్యాన్ని అతని మానసిక సంఘర్షణకి అద్దం పట్టేలా రాశాను. దీని ద్వారా సామాన్యులందరికీ ఆ భావం అర్థమయ్యేటట్లు, తమను తాము ఆ పాత్రలో ఊహించుకోవడానికి అవకాశం దొరికి నట్టైంది. తదుపరి చరణంలో ‘తన మొదలే వదులుకుని పెకైదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు.. తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికి తన తూరుపు పరిచయమే చేస్తాడు’ వాక్యాల ద్వారా మనం ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదనీ, మనం ఎంత ప్రకాశిస్తున్నా ఆ వెలుగుకు కారణాన్ని మర్చిపోకూడదన్న గొప్ప సందేశంతో ఈ పాటను ముగించడం జరిగింది. సినిమాలో మొదట వచ్చే పాటైనా సరే, అన్ని పాటలకన్నా చివరిగా రికార్డ్ చేసిన పాట ఇదే. ఎన్నో ప్రశంసలను అందించిందీ పాట. ఒక వ్యక్తికే పరిమితం కాకుండా మొత్తం అందరికీ ఉపయోగపడే భావావేశం నింపడం వల్ల పవన్‌కల్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న హీరో పై ఈ పాటను చిత్రీకరించడంతో జనరంజకమైందని చెప్పొచ్చు. ఎన్ని పాటలు రాసినా, రాస్తున్నా ‘గగనపు వీధి వీడి...’ పాట నేనెప్పటికీ నేర్చుకునే పాఠంగా నా డైరీలో ఉండిపోతుంది. సేకరణ: శశాంక్.బి - శ్రీమణి, గీతరచయిత -
నిర్మాత ప్రసాద్‌పై పవన్ కల్యాణ్ ఫిర్యాదు
ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్‌పై హీరో పవన్ కల్యాణ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు ఫిర్యాదు చేశారు. 'అత్తారింటికి దారేది' సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ విషయంలో ఆయన మాట తప్పారని ఆరోపించారు. సినిమా సమయంలో ఆయన తనకు కొంత వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని, మిగిలినది 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదల సమయంలో ఇస్తానని చెప్పారని పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తనకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకపోవడంతో ఆయన 'మా'ను ఆశ్రయించినట్లు సమాచారం. 2013 సెప్టెంబర్‌లో అత్తారింటికి దారేది విడుదలైంది. దానికి ముందే సినిమాలో కొంత భాగం లీకైంది. దాంతో సినిమా ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందేమోనన్న అనుమానంతో.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో పవన్ కల్యాణ్ తమ రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని ఆపుకొన్నారు. సినిమా బ్రేక్ ఈవెన్ అయితే మళ్లీ మిగిలిన మొత్తం ఇస్తామన్నారు. అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాక.. భారీ వసూళ్లు సాధించింది. బాహుబలికి ముందువరకు అదే ఇండస్ట్రీ రికార్డుగా ఉంది. పవన్‌కు నిర్మాత ప్రసాద్ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంది. నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ముందే ఆ మొత్తం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఇవ్వకపోవడంతో 'మా'కు ఆయన ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి అది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు, అటు నుంచి నిర్మాత ప్రసాద్‌కు వెళ్లింది. సాయంత్రంలోగా ఆ విషయం సెటిలైతే పర్వాలేదు గానీ, లేని పక్షంలో 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదలకు కూడా ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. 13న నాన్నకు ప్రేమతో, 14న డిక్టేటర్ విడుదలవుతున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమా విషయంలో ఇప్పటికే చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనికి పలు ప్రాంతాల్లో థియేటర్లు తగ్గించడం లాంటి సమస్యలున్నాయి. డబ్బింగ్ చెప్పే ఒక అమ్మాయి యూనిట్ మీద కేసు పెట్టింది. పవన్ కల్యాణ్ కూడా టీడీపీ-బీజేపీలకు మద్దతు ఇచ్చారు కాబట్టి.. ఆయన కూడా టీడీపీ వాళ్ల ఒత్తిడి మేరకు ఇప్పుడే ఫిర్యాదు చేశారా అన్న అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. -
డెఫినెట్లీ.. మిసెస్ గోడ్బోలే!
బిరబిరా పారే నది... నదియా! ... జరీనా మొయిదు నుంచి నదియా దాకా... నదియా నుంచి మిసెస్ గోడ్బోలే దాకా... మిసెస్ గోడ్బోలే నుంచి ‘అత్తారింటికి దారేది’ దాకా... నదియా మలుపులు మన గుండెల్ని తట్టాయి. ఎన్ని మలుపులు తిరిగినా తనకు బాగా నచ్చిన పాత్ర... డెఫినెట్లీ... మిసెస్ గోడ్బోలే! * వెల్కమ్ బ్యాక్ టు ‘సుందరి ఆఫ్ సౌత్’! ఇంతకీ మీకు ఆ పేరెలా వచ్చింది? నదియా: తమిళ్లో తొలిచిత్రం ‘పూవే పూచూడవా’లో పాత్ర పేరు సుందరి. అంతకు ముందు మలయాళంలో పేరొచ్చినా, ఆ చిత్రంతో సౌత్‌లో పాపులరయ్యా. బహుశా, అందుకే ‘సుందరి ఆఫ్ సౌత్’ అని అంటారేమో. * క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? హీరోయిన్గా చేసిన ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్నైన ఈ సెకండ్ ఇన్నింగ్స్నే ఆస్వాదిస్తున్నా. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని అందరూ మా అక్క, మా అత్త, మా అమ్మ ఇలా ఉంటే బాగుండుననుకుంటున్నారు. పురుషాధిక్యమెక్కువ, హీరోయిన్ల షెల్ఫ్‌లైఫ్ తక్కువ ఉండే సినీ రంగంలో నా లాంటి మిడిల్ ఏజ్డ్ ఉమెన్ విజయంగా దీన్ని భావిస్తున్నా. * ఇప్పటికీ మీరు అందంగా ఉన్నారు. హీరోయిన్గా కూడా చేయచ్చేమో? (నవ్వేస్తూ) ఆ మాట అన్నవాళ్ళందరితో ‘అలాగైతే, నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు కథ రాయండి’ అని అడుగుతుంటా. ఒకప్పుడు హీరోయిన్ ఒరియంటెడ్ ఫిల్మ్స్ చాలా వచ్చేవి. ఇప్పుడెన్ని వస్తున్నాయి! వయసును బట్టి, మారిన కాలాన్ని బట్టి మనమూ మారాలి. హీరోయిన్గా మొదలెట్టాం కాబట్టి, పాతికేళ్ళ తర్వాతా అవే పాత్రలు చేస్తామంటే ఎలా? * మీ అమ్మా నాన్నల గురించి చెప్పండి. వాళ్ళతో మీది బలమైన బంధమట? మా నాన్న గారి పేరు - ఎన్.కె. మొయిదు. ముస్లిమ్. అమ్మ పేరు- లలిత. హిందువు. ఇద్దరూ మలయాళీలే. ‘టాటాస్’ సంస్థలో పనేచేసేవారు. మా అమ్మానాన్నకు ఇద్దరు పిల్లలం - నేను, చెల్లెలు హసీనా. నా అసలు పేరు జరీనా మొయిదు. సినిమాల్లోకి వచ్చాకా నా బాగోగులన్నీ నాన్న గారే చూసుకొనేవారు. స్క్రిప్ట్‌లు నేను, ఆయన కలసి వినేవాళ్ళం, నిర్ణయం తీసుకొనేవాళ్ళం. మరీ గ్లామరస్ పాత్రలు, వాన పాటలుంటే నో చెప్పేస్తుండేవాళ్ళం. ఒక్క మాటలో - మై ఫాదర్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మి! హి ఈజ్ వెరీ స్పెషల్ టు మి. మా అమ్మ మాకు పెద్ద సెలైంట్ సపోర్టర్! * మరి, హీరోయిన్గా పీక్‌లో ఉన్నప్పుడే పెళ్ళిచేసుకొని, స్టేట్స్ వెళ్ళిపోయారేం? ముంబయ్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే నాకూ, మా ఆయన శిరీష్ గోడ్బోలేకూ పరిచయం. ప్రసిద్ధ దర్శకుడు ఫాజిల్ వాళ్ళ బ్రదర్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. నేను కాలేజ్‌లో చదువుకొంటున్నప్పుడే ఫాజిల్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తూ, నన్ను ఆ పాత్ర చేయమన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్ కావడం వల్ల ఆయనను నమ్మి, ఈ రంగంలోకి వచ్చా. అయితే, వచ్చినప్పుడే తెలుసు... పెళ్ళి చేసుకొని, ఈ రంగానికి దూరంగా వెళ్ళిపోతానని! పద్ధెనిమిదేళ్ళ వయసులో మలయాళ చిత్రం ‘నోక్కెత్త దూరత్తు కన్నుమ్ నట్టు’ (1984)తో వచ్చా. తొలి సినిమాకే ‘ఉత్తమ నటి’గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. అయిదేళ్ళు హీరోయిన్గా చేశా. శిరీష్ నిలదొక్కుకోగానే, పెళ్ళి చేసుకొని స్టేట్స్ వెళ్ళిపోయా. పదిహేనేళ్ళ గ్యాప్ తర్వాత తమిళ ‘ఎం కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి’ (2004)తో మళ్ళీ వచ్చా. * ఇంతకీ మీ పేరును నదియా అని మార్చిందెవరు? నేను సినిమాల్లోకి వస్తున్నప్పటికే హిందీ నటి జరీనా వహాబ్ ఫేమస్. అందుకని నా పేరు మార్చారు. ఫాజిల్ గారి సోదరుడి వరుసయ్యే ఆయన మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పా కదా! ఆయనకు ఒక సిస్టర్ ఉండేది. నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు నిరంతరం ప్రవహించే నదిలా నా ప్రయాణం సాగిపోవాలని ఆమే నా పేరు ‘నదియా’ అని మార్చింది. * పెళ్ళితో హీరోయిన్గా అన్నీ వదులుకొని వెళ్ళిపోవడం కఠిన నిర్ణయమేనే! జీవితంలో తీసుకున్న కీలకమైన, తెలివైన నిర్ణయమదే. ఎందుకంటే, కెరీర్లో ఎంత పేరు తెచ్చుకున్నా, ఎంత సంపాదించినా వ్యక్తిగత జీవితమూ బాగుండాలి. అయామ్ ప్రౌడ్ దట్ ఐ మేడ్ ఎ రైట్ ఛాయిస్. * మరి, సినిమాల్లోకి మళ్ళీ ఎలా? దర్శకుడు రాజా ఎలా ఒప్పించారు? ఒకసారి సెలవులకి ముంబయ్‌కి వచ్చా. ఎలా తెలిసిందో ఏమో దర్శకుడు ‘జయం’ రాజా వాళ్ళు ఫోన్ చేసి, ఆ పాత్ర ఆఫర్ చేశారు. ముంబయ్ వచ్చి, తెలుగు మాతృక ‘అమ్మ.నాన్న..ఒక తమిళమ్మాయి’ సీడీ ఇచ్చారు. అందులో హుందాగా ఉన్న తల్లి పాత్ర చూసి, ఒప్పుకున్నా. * సినిమాల్లో కొనసాగినప్పుడు నిజజీవితంలో తల్లిగా ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇప్పుడు మేము ముంబయ్‌కి షిఫ్ట్ అయిపోయాం. సినిమాల్లో నటిస్తున్నా, సెట్స్‌లో లేనంటే, ముంబయ్‌లో అందరు అమ్మల్లాగే ఇంటా, బయట పనులు చేసుకుంటూ ఉంటా. ఇప్పటికీ చాలా సెలెక్టివ్. ఏడాదికి ఒకటో, రెండో ఫిల్మ్స్ చేస్తున్నా. త్రివిక్రమ్ ‘అ..ఆ..’ నా 41వ సినిమా. * పదిహేనేళ్ళ గ్యాప్ మాట అటుంచితే, 31 ఏళ్ళ కెరీర్లో ఇన్ని సినిమాలేనా? చేసినవి కొన్నే అయినా, టైటిల్ రోల్స్. రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్మూట్టి లాంటి అగ్ర హీరోలతో, గుర్తుండిపోయే పాత్రలు చేశా. అప్పట్లో నా సమకాలీన హీరోయిన్లయిన రాధ, రాధిక, అంబిక, రేవతి వందల సినిమాలు చేశారు. అయామ్ స్టిల్ ఎ జూనియర్! (నవ్వులు) * హిందీ హీరోయిన్గా చాన్స వస్తే వదిలేశారట? సుభాష్ ఘయ్ సహా కొంతమంది సంప్రతించారు. సల్మాన్‌ఖాన్ తొలినాళ్ళ సూపర్‌హిట్ ‘మై నే ప్యార్ కియా’కు హీరోయిన్గా నన్ను అడిగారు. నిర్మాతలైన బర్జాత్యాలు మా ఇంటికి కూడా వచ్చారు. కానీ, పెళ్ళికి సిద్ధమవుతున్న నేను వద్దనేశా. ఇప్పటికీ ఆ విషయం మా పిల్లలతో సరదాగా చెబుతూ, ‘సల్మానా? మీ డాడీనా?’ అంటే, ‘మీ డాడీకి ఓటేశా’ అంటూ ఉంటా. ‘మైనే క్యా కియా’ అని ఆట పట్టిస్తుంటా. * శిరీష్ గోడ్బోలేతో మీ ప్రేమకథ చెప్పలేదు! మేము ముస్లిమ్‌లం. వాళ్ళు మహారాష్ట్ర బ్రాహ్మణులు. ముంబయ్‌లో మా ఇళ్ళు కొద్ది దూరంలోనే ఉండేవి. కామన్ ఫ్రెండ్స్ వల్ల మా ఇద్దరికీ ముందు నుంచే పరిచయం. అప్పటికి నాకు 17 ఏళ్ళు. ఆయనకు 20 ఏళ్ళు. నేనింకా చదువుకుంటున్నా. చదువు, ఉద్యోగం కోసం శిరీష్ అమెరికా వెళ్ళినా మా ప్రేమ, స్నేహం కొనసాగింది. అప్పట్లో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇ-మెయిల్స్ లేవు. ట్రంక్ కాల్ బుక్ చేయాలి. లేదంటే, ఉత్తరాలు. అలా మేము చాలా ఉత్తరాలే రాసుకున్నాం. మా ప్రేమ రెండువైపులా తెలిసింది. మా పెళ్ళి అయింది. * కులమతాలు తేడా. రాజీపడాల్సి వచ్చిందా? నేను, ఆయన ముంబయ్‌లో పెరిగినవాళ్ళం. మెట్రోపాలిటన్ ఆలోచనా దృక్పథం, మా సోషల్ సెటప్ ఒకేలా ఉండేవి. అందుకే, కుటుంబాలు బాగా కలిసిపోయాయి. నేను మరాఠీ ధారాళంగా మాట్లాడతా. మావారి ఇంట్లో చేసే ప్రతి పండుగ మనస్ఫూర్తిగా చేస్తా. మా అత్తమామల్ని ‘మాయి’ (అమ్మ), డాడీ అనే పిలుస్తా. * మరి, ఇంతకీ మీరు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు? మా నాన్న గారు ముస్లిమ్ అయినా, మాకు ముస్లిమ్ పేర్లు పెట్టినా, మేమెప్పుడూ ఒకే మత ధర్మాన్ని అనుసరించలేదు. ఇప్పటికీ రాత్రి నిద్రపోయే ముందు మా నాన్న గారు నేర్పిన ఖురాన్‌లోని ప్రార్థనలు, మా అత్త గారింట్లో నేర్చుకున్న గణేశ్ హారతి, చిన్నతనంలో పారసీ స్కూల్లో నేర్చుకున్న పారసీ ప్రార్థనలు చేసి కానీ పడుకోను. అల్లా బిజీగా ఉంటే వినాయకుడు, ఆయన బిజీగా ఉంటే మరో పారసీ దేవుడు కాపాడతారని మా వాళ్ళతో సరదాగా అంటుంటా. * అప్పటికీ, ఇప్పటికీ పెంపకంలో తేడా? అప్పట్లో పిల్లలం అమ్మానాన్న ఏం చెబితే అది, ప్రశ్నలు వేయకుండా వినేవాళ్ళం. కానీ, ఈ తరం పిల్లలు ప్రశ్నలడుగుతారు. వాళ్ళకు లాజికల్‌గా జవాబివ్వాలి. అప్పటి తల్లితండ్రులు మంచి వక్తలైతే, ఇప్పటివాళ్ళు మంచి శ్రోతలవాలి. పిల్లల కష్టసుఖాలు విని, జవాబివ్వాలి. * మీ అందం, ఆహార, వ్యాయామ సీక్రెట్స్? (నవ్వేస్తూ) అనేక అంశాల కలయిక. ప్రధానంగా అమ్మానాన్నల జీన్స్ నుంచి వచ్చింది. బాగా వండుతా. బాగా తింటా. అందుకు తగ్గట్లే వ్యాయామం చేస్తా.రోజూ వాకింగ్, వెయిట్ ట్రైనింగ్, యోగా - మూడూ చేస్తా. నెగటివ్ ఎనర్జీకీ దూరంగా ఉంటా. వాట్సప్ మినహా ఏ సోషల్ మీడియాలోనూ లేను. ఐ కీప్ మై లైఫ్ సింపుల్. * మీ తాజా సినిమా గురించేం చెబుతారు? త్రివిక్రమ్ ‘అ...ఆ...’లో చేస్తున్నా. ఆయన సూపర్డెరైక్టర్. ఇది ఆయన శైలి మంచి రొమాంటిక్ కామెడీ. సమంతకు తల్లిగా మహాలక్ష్మిపాత్ర కొత్తగా ఉంటుంది. * జరీనాకూ, తెర జీవిత నదియాకూ తేడా? నటినైనా నేల విడిచి సాము చేయను. అందరిలా మామూలు మనిషిలా ఉంటా. ఒక్క మాటలో జరీనా, మిసెస్ గోడ్బోలే- ఒరిజినల్ జీవితం. నదియా - తెరపై అందరినీ నమ్మించే కల్పన. - రెంటాల జయదేవ అమ్మ-నాన్న-ఇద్దరు మరాఠీ అమ్మాయిలు * మా ఆయన శిరీష్ గోడ్బోలే అమెరికాలో చదువుకున్నారు. ప్రస్తుతం అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘మోర్గాన్ స్టాన్లీ’కి మేనేజింగ్ డెరైక్టర్. మా పెద్దమ్మాయి సనమ్‌కి 19 ఏళ్ళు. యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో లిబరల్ ఆర్ట్స్, ఆంత్రొపాలజీతో డిగ్రీ చేస్తోంది. ఇక, జానాకి 14 ఏళ్ళు. నైన్త్ గ్రేడ్ చదువుతోంది. * పెద్దమ్మాయి వెస్ట్రన్ మ్యూజిక్ సింగర్. చాలా సంగీత నాటకాల్లో పాల్గొంది. చిన్నమ్మాయికి డ్యాన్స్ ఇష్టం. హిప్హాప్, జాజ్ డ్యాన్స్ చేస్తుంది. ప్రస్తుతానికైతే పిల్లల దృష్టి చదువు మీదే! -
మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా!
ఓ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు దాని తాలూకు సన్నివేశమో, పాటో, డైలాగో... ఏదో ఒకటి బయటికి వచ్చేస్తుంటుంది. చిత్రబృందం ప్రమేయం లేకుండా లీకువీరులు ఎలాగోలా వాటిని తస్కరించి, బయటపెట్టేస్తుంటారు. ఇవి ఆ చిత్రబృందానికి మాత్రమే కాకుండా, యావత్ పరిశ్రమనూ షాక్‌కి గురి చేస్తుంటాయ్. ‘అత్తారింటికి దారేది’ చిత్రం విషయంలో మరీ షాకిచ్చారు లీకువీరులు. విడుదల తేదీ దగ్గర పడ్డాక ఏకంగా సినిమానే లీక్ చేసేశారు. వచ్చే నెల విడుదల కానున్న ‘బాహుబలి’ చిత్రంలోని సన్నివేశం కూడా ఇటీవల బయటకు వచ్చేసి సందడి చేసింది. ఈ చిత్రకథ ఇదేనంటూ ‘వాట్సప్’లో సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ‘గబ్బర్‌సింగ్ 2’ రూపంలో మరో లీక్ తెరమీదకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన సీన్లు, పాటలు కాదు.. డైలాగులు హల్చల్ చేస్తున్నాయి. పవన్‌కల్యాణ్ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని సంభాషణలు ప్రస్తుతం ‘వాట్సప్’లో వీర విహారం చేసేస్తున్నాయి. నిజంగానే సినిమాలో ఆ డైలాగ్స్ ఉంటాయే లేదో తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. కానీ, లీకైన డైలాగ్స్ విన్నవాళ్లు మాత్రం అదిరాయంటున్నారు. ఆ డైలాగ్స్‌లో కొన్ని... 1) నేను పంచ్‌లేస్తే విజిల్స్ పడతాయి... అదే నాపైనే పంచ్లెయ్యాలని ట్రై చేస్తే నేనిచ్చే కౌంటర్‌కు ఎన్కౌంటర్ అవుతావ్... 2)మొన్న తిక్క చూపించా... ఇప్పుడు చుక్కలు చూపిస్తా... నేను టెంపర్ లాస్ అయితే టెంపో లేకుండా కొడతా 3)ఎవడు కొట్టినా బ్లడ్ వస్తుంది... కానీ నేను కొడితే బ్లడ్తో పాటే భయం కూడా వస్తుంది. -
కన్నడంలోనూ బాక్సాఫీస్‌కు దారిదే!
పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ గుర్తుందిగా! రిలీజ్‌కు ముందే పైరసీకి గురై, అందరినీ ఉలిక్కిపడేలా చేసిన సినిమా! అనేక అవాంతరాలను దాటుకొని విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నిటినీ దాటుకొని, తెలుగు చిత్రసీమలో రూ. 100 కోట్ల ఆదాయం దాటిన తొలి సినిమా! తమిళ, కన్నడ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ వసూళ్ళ వర్షం కురిపించిన తెలుగు సినిమా. విచిత్రమేమిటంటే, ఇప్పుడు ఇదే సినిమా మళ్ళీ కన్నడంలో వచ్చి, బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. కన్నడంలో ‘రన్న’గా రీమేకైన మన ‘అత్తారింటికి దారేది’ అక్కడ ఈ జూన్ 4న విడుదలై, కాసుల వర్షం కురిపిస్తోంది. ‘ఈగ’ ఫేమ్ సుదీప్ ఇందులో హీరో. రచితారామ్ హీరోయిన్. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలిరోజే రూ. 3.6 కోట్ల దాకా వసూలు చేసి, మూడు రోజుల్లో 10 కోట్ల మార్కు దాటేసింది. రానున్న రోజుల్లో ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ రికార్డులన్నిటినీ తిరగరాసే అవకాశమున్నట్లు సినీ వ్యాపారవర్గాల భోగట్టా. కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ దర్శక - రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో చేసిన ఈ సకుటుంబ కథా చిత్రం కన్నడ ప్రేక్షకులను వారి భాషలోనూ సమ్మోహితుల్ని చేస్తోంది. కన్నడస్టార్ స్వర్గీయ డాక్టర్ విష్ణువర్ధన్ పాపులర్ డైలాగులను హీరో సుదీప్తో పదే పదే పలికించడంతో పాటు, అక్కడి నేటివిటీకి తగ్గట్లు చేసిన మార్పులు జనానికి పట్టాయని బెంగుళూరు వర్గాల ఉవాచ. రికార్డుల మాటెలా ఉన్నా, కొన్ని కథలు భాష, ప్రాంతాలకతీతంగా బాక్సాఫీస్‌కు దారిదే అని రుజువు చేస్తాయి కదూ! -
ఇంకా నేర్చుకుంటున్నా...
సీనియర్ల సలహాలు తీసుకుంటున్నా నటి, యాంకర్ గాయత్రి భార్గవి బొబ్బిలి: తాను ఇంకా నటన నేర్చుకుంటున్నానని, షూటింగ్ ప్రదేశంలో ప్రతి ఒక్క ఆర్టిస్టును గమనించి మెలకువలు తెలుసుకుంటున్నానని నటి, టీవీ యాంకర్ గాయత్రి భార్గవి అన్నారు. బొబ్బిలిలో ముళ్లపూడి వర ద ర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను 18వ ఏట నుంచి ఈ రంగంలోనే ఉన్నానని తెలిపారు. చదువుతుండగా అవకాశాలు రావడంతో ఇటువైపు దృష్టి పెట్టానని, అయినా చదువు పూర్తి చేశానని చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన తోక్కుడు బిళ్లాట యాడ్ ఫిల్మ్‌లో నటించానన్నారు. ఆ సమయంలో ముళ్లపూడి వర ఆ యాడ్‌కు సారథ్యం వహించారని తెలిపారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. బీకాం చదువుతుండగానే అవకాశాలు వచ్చాయని, జెమినీలో డ్రీం గర్ల్ బ్యూటీషియన్ కాంటెస్టుతో ముందుగా టీవీ రంగంలోనికి అడుగుపెట్టానని తెలిపారు. ఆ తరువాత ఆట కావాలా.. పాట కావాలా.., అదిరింది వంటి షోలు చేసి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నట్లు తెలిపారు. ఇటీవల సాక్షి టీవీ ‘ఫ్యామిలీ షో’కు మంచి స్పందన వచ్చిం దని చెప్పారు. దాదాపు ఆరు మాసాల పాటు కుటుంబాల్లో వ్యక్తులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భార్యభర్తల కల హాలు వంటి వాటిని పూర్తిస్థాయిలో తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కార మార్గం కూడా చూపించగలగడం సంతృప్తికరంగా ఉందని అన్నారు. సినీ ఇండస్ట్రీలో అగ్రనటులను ఇంటర్వ్యూ చేస్తుండడంతో పాటు స్టేజీ షోలు కూడా చేస్తున్నానని తెలిపారు. తాను మొదట సురేష్ ప్రొడక్షన్సలో వచ్చిన రవితేజ బలాదూర్ సినిమాలో నటించానని, తర్వాత గాలిపటం, అవును, బ్రహ్మిగాడి కథ, ఒక లైలా కోసం, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో నటించానని చెప్పారు. అబ్బో చాలా తేడా ఉంది యాంకరింగుకు, యాక్టింగుకు చాలా తేడా ఉందని ఆమె అన్నారు. సమయస్ఫూర్తితో ఎవరినీ నొప్పించకుండా అప్పటికప్పుడు తెలివితేటలను ఉపయోగించి యాంకరింగు చేయాలని తెలిపారు. యాంకరింగ్‌లో కొంచెం కూడా ఏమరపాటు అనేదే ఉండకూడదని అన్నారు. సినిమాల్లో మాత్రం అంతా దర్శకుడి చేతుల్లో ఉంటుందని చెప్పారు. తన భర్త ఆర్మీలో పనిచేస్తున్నారని, తనకు ఏడేళ్ల కొడుకున్నాడని, కుటుంబ జీవనానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకవైపు చూసుకుంటూ మరో వైపు సినిమా, టీవీ రంగాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. సీనియర్లు ఝాన్సీ, సుమల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తీసుకుంటున్నానని చెప్పారు. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ వృత్తిలో ముందుకు వెళుతున్నానని అన్నారు. -
కనుల పండుగ!
‘జులాయి’ సినిమాతో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న కాంబినేషన్ అల్లు అర్జున్, తివిక్రమ్. ‘జులాయి’ తర్వాత వీరిద్దరూ విడివిడిగా కూడా విజయాలను అందుకొని మంచి జోష్ మీదున్నారు. త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ అంటూ... ఇండస్ట్రీ రికార్డ్ సృష్టిస్తే, బన్నీ ‘రేసుగుర్రం’లా రెచ్చిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘జులాయి’ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. ఈ నెలాఖరుతో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. డిసెంబర్లో పాటల్ని, పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. అదే నెలలో సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేస్తారు. ఫిబ్రవరి 5న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మళ్లీ ‘జులాయి’ కాంబినేషన్లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ నటన ఈ చిత్రానికి హైలైట్. సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ ఇందులో కథానాయికలు. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ ఇందులో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఆద్యంతం నిండుగా, కన్నుల పండువగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. సింధూతులాని, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.డి.ప్రసాద్, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్. -
ఐటమ్ సాంగ్ ఏంటి?
ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్కంటూ ప్రత్యేకంగా కొందరు భామలుండేవారు. అయితే ఇప్పుడు ఆ భామలకు దీటుగా కథానాయికలే అంగాంగ ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. ఇంతకుముందు ఈ ట్రెండ్ బాలీవుడ్లోనే ఉండేది. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ అంటూ అంతటా విస్తరించేసింది. ఇలాంటి పాటలకిప్పుడు అరకోటి వరకు ఈ ముద్దుగుమ్మలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లు శ్రుతిహాసన్, తమన్న, శ్రీయ లాంటి వారు సింగిల్ సాంగ్‌కు సై అంటున్నారు. తాజాగా జాబితాలో చెన్నై చిన్నది త్రిష చేరిందనే ప్రచారం హోరెత్తింది. నటిగా దశాబ్దం దాటిన ఈ మూడు పదుల భామ రేస్‌లో కాస్త వెనుకబడ్డారు. అయినా అవకాశాలు మాత్రం అస్సలు లేకుండా పోలేదు. లేటెస్ట్గా కన్నడ చిత్ర రంగప్రవేశం చేసిన త్రిష తెలుగు చిత్రం దూకుడు రీమేక్‌లో పునిత్ రాజ్‌కుమార్‌తో రొమాన్స్ చేశారు. ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో ఈ ముద్దుగుమ్మకక్కడ చిత్ర పరిశ్రమలో క్రేజ్ వచ్చేసింది. అయితే ఆ క్రే జ్ను అక్కడ దర్శక నిర్మాతలు మరో విధంగా వాడుకోవాలని చూస్తున్నారని సమాచారం. అదేనండి ఐటమ్ సాంగ్స్‌తో క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారట. తాజాగా నాన్ఈ ఫేమ్ సుదీప్ కన్నడంలో నటిస్తున్న తాజా చిత్రంలో త్రిషకు ఐటమ్ సాంగ్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. ఇది తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో రచితారామ్, హరిప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలో ముంతాజ్ నటించిన ఐటమ్ సాంగ్‌ను కన్నడంలో త్రిష నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మీడియూ ప్రచారం. ఇదే విధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలోను త్రిష సింగిల్సాంగ్కు చిందేయనున్నారనే ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని త్రిష తల్లి ఉమ కొట్టిపారేశారు. అసలు త్రిషను ఐటమ్‌సాంగ్ చెయ్యమని తమ నెవరూ అడగలేదని ఆమె స్పష్టం చేశారు. -
హీరోయిన్గా సమంత చెల్లెలు!
బాలనటులుగా చేసినవాళ్లంతా ఒక్కొక్కళ్లూ హీరోయిన్లుగా మారిపోతున్నారు. నిన్న కాక మొన్న జై చిరంజీవలో నటించిన శ్రేయా శర్మ హీరోయిన్ అవ్వగా, ఇప్పుడు నవికా కోటియా కూడా ఆ జాబితాలో చేరిపోయింది. పవన్ కల్యాణ్ నటించి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన అత్తారింటికి దారేది చిత్రంలో సమంతకు చెల్లెలి పాత్రలో నటించిన నవిక.. ఇప్పుడు ఓ తమిళ సినిమాలో హీరోయిన్గా నటించబోతోంది. యూత్ లవ్‌స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో శరవణన్ సరసన ఆమె హీరోయిన్గా చేస్తోంది. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాలో శ్రీదేవి చిన్న కూతురిగా మంచి బబ్లీగా కూడా నవిక కనిపిస్తుంది. వెండితెరమీదకు రావడానికి ముందు నవిక బుల్లితెరమీద కూడా కనిపించింది. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్లో ఆమె నటించింది. ఇప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు. -
పది కోట్లు దాటిన సినిమాకు 30 శాతం పన్ను విధించాల్సిందే
‘‘ప్రస్తుతం కొంతమంది పెద్ద నిర్మాతలు గొప్ప కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఒక దర్శకుడి సినిమా హిట్టయితే, అప్పటివరకూ 5 కోట్లు తీసుకున్న అతనికి పది కోట్లు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా నిర్మాతలు బెంజ్ కారు నుంచి మారుతి 800 స్థాయికి, దర్శకులు మారుతి నుంచి బెంజ్‌కి ఎదుగుతున్నారు. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న అగ్ర నిర్మాతలు ఒక్కొక్కరు 150 నుంచి 180 కోట్లు అప్పుల్లో ఉన్నారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో లాభాలు తెచ్చిపెట్టిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ మాత్రమే’’ అని చెప్పారు నట్టికుమార్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పత్రికలవారితో మాట్లాడుతూ - ‘‘మా అబ్బాయి నట్టి క్రాంతి దర్శకత్వంలో వచ్చే ఏడాది ఓ సినిమా మొదలవుతుంది. మావాడికి హీరోగా చేయాలని ఆకాంక్ష కూడా ఉంది. మా అమ్మాయి లక్ష్మీ కరుణ నిర్మాతగా రావాలనుకుంటోంది’’ అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని, తన వంతుగా వైజాగ్‌లో డబ్బింగ్, రీ-రికార్డింగ్ థియేటర్లు కట్టించానని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ చిన్న చిత్రాల షూటింగ్ అనుమతిని సింగిల్ విండో పద్ధతిలో ఇవ్వాలని ఆయన కోరారు. పది కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం దాటిన ప్రతి సినిమాకీ, అలాగే అనువాద చిత్రానికీ 30 శాతం పన్ను విధించాల్సిందేనని సూచించారు. 2006 నుంచి ప్రభుత్వానికి థియేటర్లవారు సేవా పన్ను చెల్లించలేదనీ, ఆ బకాయి 600 కోట్లకు చేరిందని నట్టికుమార్ అన్నారు. ఆ వివరాలు చెబుతూ - ‘‘పన్ను కట్టాల్సిన అవసరం లేదని, తమకు డబ్బు ఇస్తే అది మాఫీ చేయిస్తామని అశోక్‌కుమార్‌తో పాటు కొంతమంది నిర్మాతలు రెండు రాష్ట్రాల్లో దాదాపు 1800 మంది థియేటర్ అధినేతల దగ్గర అనధికారంగా 12 కోట్లు వసూలు చేశారు. అందుకే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, సీబీఐ దృష్టికి తీసుకెళ్లాం’’ అన్నారు. చలన చిత్ర వాణిజ్య మండలి, కౌన్సిల్ ఎన్నికలను వెంటనే జరపాలని కోరారు. -
సంతోషంగా దక్షిణ భారత సినీ పురస్కారాల వేడుక
నృత్యతారగా ఒక తరాన్ని ఉర్రూతలూగించిన జయమాలిని దాదాపు 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో కనబడ్డారు. ‘సంతోషం’ సినీవారపత్రిక ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ భారత సినీ అవార్డుల వేడుకలో జయమాలిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహమయ్యాక సంసార బాధ్యతల్లో నిమగ్నమై ఇంటికే పరిమితమైన జయమాలిని తొలిసారిగా పాల్గొన్న సినీ వేడుక ఇదే కావడం విశేషం. అంతేకాదు, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వేదికపై నర్తించి, ఆహూతులందరిలో ఆనందాన్ని నింపారు. చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన ఏయన్నార్ స్మారక పురస్కారాల్ని సూపర్‌స్టార్ కృష్ణ (తెలుగు), షావుకారు జానకి (తమిళం), బి.సరోజాదేవి (కన్నడం), అంబిక (మలయాళం) అందుకున్నారు. అలాగే షావుకారు జానకి, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, చంద్రమోహన్, జయమాలిని, అంబికలకు జీవితకాల సాఫల్య పురస్కారాలను అందించారు. ఈ వేడుకలో భాగంగా ‘దర్శకేంద్రుని సినీ స్వర్ణోత్సవ సత్కారం’ పేరిట కె.రాఘవేంద్రరావును ఘనంగా సత్కరించారు. తెలుగు నుంచి ఉత్తమ చిత్రం పురస్కారాన్ని ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి అందించగా, ఉత్తమనటుడు, ఉత్తమ నటిగా అవార్డులు ఆ సినిమా హీరో హీరోయిన్లు పవన్‌కల్యాణ్, సమంతలను వరించాయి. ఉత్తమ దర్శకుని పురస్కారం ఆ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్‌కు దక్కింది. ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్‌గా ‘సాక్షి’ సీనియర్ సినిమా రిపోర్టర్ డి.జి.భవాని పురస్కారం అందుకున్నారు. ఇంకా దక్షిణాదిలోని నాలుగు భాషలకు చెందిన చిత్రాలకు సంబంధించిన ముఖ్య శాఖలన్నింటికీ ఈ పురస్కారాలందించారు. ‘సంతోషం’ పత్రికాధినేత సురేశ్ కొండేటి ఈ వేడుకను దిగ్విజయంగా నిర్వహించారు. -
సూపర్‌స్టార్ సినిమానే కాదంది!!
-
కిచ్చ సుధీప్‌కు హ్యండిచ్చిన హనీ
-
'అత్తారింటికి దారి'ని వెతుక్కుంటున్న సుదీప్!
-
ఇప్పుడు కూడా నేను తెలియని వారున్నారా!
స్టార్డమ్ వస్తే... కనీసం సరదాగా షాపింగ్ కూడా చేసే పరిస్థితి ఉండదు. అందుకే... స్టార్లందరూ సాధారణ జీవితం అనుభవించడానికి ఇతర దేశాలకు వెళుతుంటారు. అక్కడ యదేచ్ఛగా షాపింగులు గట్రా చేస్తుంటారు. ఎందుకంటే... అక్కడి జనాలు మనవాళ్లను గుర్తు పట్టరు కాబట్టి. అది కూడా ఓ విధంగా ఓ గొప్ప అనుభూతే. అయితే... ఇక్కడున్న మన జనాలే మన స్టార్లను గుర్తు పట్టకపోతే? అది నిజంగా అవమానం. అలాంటి పరిస్థితే ఇటీవల ప్రణీతకు ఎదురైంది. ఇటీవల హైదరాబాద్‌లోనే ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లి రిబ్బన్ కట్ చేసిందట ప్రణీత. అయితే... అక్కడి ప్రణీతను చూసిన చాలామంది ‘ఎవరు?’ అని చెవులు కొరుక్కున్నారట. ఇది విని షాక్ తినడం ప్రణీత వంతు అయ్యిందట. ‘‘ ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్‌లో హీరోయిన్గా నటించిన, నేను కూడా తెలీని వారు ఉన్నారా!’’ అని సదరు సంస్థ యాజమాన్యంతో ఆశ్చర్యం వెలిబుచ్చిందట ప్రణీత. ఇది ముస్లిం ఏరియా అని, ఇక్కడ తెలుగు సినిమాలు చూడరని, బాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఈ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం సర్ది చెప్పడంతో ప్రణీత ఊపిరి పీల్చుకుందట. ఏదిఏమైనా ప్రణీతకు ఇది కాస్త చేదు అనుభవమే. -
బి.నాగిరెడ్డి స్మారక పురస్కార కార్యక్రమం
-
నిర్మాతగా నాగిరెడ్డి చిరస్మరణీయుడు : వీబీ రాజేంద్రప్రసాద్
‘‘వాహినీ స్టూడియోలోని 22 ఫోర్లూ ఎప్పుడూ కళకళలాడుతుండేవి. ప్రతి సెట్‌కీ వెళ్లి... ఈ సెట్ ఎందుకు? ఇంత ఖర్చు దేనికి? అని అడుగుతుండేవారు నాగిరెడ్డి. నిర్మాత శ్రేయస్సు కోరి, వారి బాగోగులు చూసుకున్న మనసున్న వ్యక్తి ఆయన. ఆ చిరస్మరణీయుని పురస్కారం బీవీఎస్ఎన్ ప్రసాద్‌కి దక్కడం అతని అదృష్టం’’ అని వీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా ప్రముఖ నిర్మాతలకు అందజేసే బి.నాగిరెడ్డి స్మారక పురస్కార కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. 2013వ సంవత్సరానికి గాను ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు కింద లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక వీబీ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. వీబీ రాజేంద్రప్రసాద్ ఇంకా చెబుతూ-‘‘అక్కినేనిగారితో ‘ఆత్మబలం’ తీస్తున్న రోజులవి. అప్పుడాయన షూటింగులన్నీ సారథీ స్టూడియోలోనే జరిగేవి. కానీ... బి.సరోజాదేవిగారిది చెన్నయ్ వదిలి రాలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో నాగేశ్వరరావుగారి అనుమతి తీసుకొని వాహినీ స్టూడియోలోనే సెట్లు వేశాం. మొత్తం ఏడు ఫ్లోర్లూ మాకే కేటాయించి షూటింగ్ సకాలంలో పూర్తి చేయడానికి నాగిరెడ్డి మాకు అందించిన సహకారం ఎప్పటికీ మరచిపోలేను’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు. ఎస్.జానకి మాట్లాడుతూ- ‘‘విజయా సంస్థ అనగానే... అద్భుతమైన చిత్ర రాజాలు కళ్లముందు కదులుతాయి. ఆ సినిమాల్లోని పాటలు ఎంత బావుంటాయో! ఇప్పుడు అలాంటి పాటలు రావడం లేదు. విజయా సంస్థకు పాడే అదృష్టం నాక్కూడా దక్కింది. ‘భైరవద్వీపం’లో నేను పాడిన ‘నరుడా ఓ నరుడా’ పాట నాకు మంచి పేరు తెచ్చింది’’ అన్నారు. ‘‘సకుటుంబంగా చూడదగ్గ క్లాసిక్స్ నిర్మించారు నాగిరెడ్డి. ఇటీవల వచ్చిన సినిమాల్లో కుటుంబ ప్రేక్షకులను సైతం మెప్పించిన సినిమా ‘అత్తారింటికి దారేది’. ఆ చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కి నాగిరెడ్డిగారి పురస్కారం దక్కడం ముదావహం’’ అని వెంకటేశ్ అన్నారు. తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే ఆణిముత్యాల్లాంటి సినిమాలు నాగిరెడ్డి నిర్మించారని తనికెళ్ల భరణి కొనియాడారు. పురస్కార గ్రహీత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘చిన్నప్పుడు బడి ఎగ్గొట్టి మరీ విజయావారి సినిమాలు చూసేవాణ్ణి. నాకు సినిమాపై ఇష్టాన్ని పెంచింది విజయావారి సినిమాలే. నా తొలి సినిమా కోసం విజయా గార్డెన్స్‌లో రికార్డింగ్స్ జరిపాం. అప్పుడు నాగిరెడ్డిగారు అక్కడకొచ్చి నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయన అవార్డునే అందుకున్నాను’’ అని ఆనందం వెలిబుచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగీతం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతిరావు, బి.నాగిరెడ్డి తనయుడు వెంకటరామిరెడ్డి, మాధవపెద్ది సురేశ్, విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సీఈవో భారతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమంతకు చెమటలు పట్టిస్తున్న ప్రణీత
-
నాకు అంత సీన్ లేదు!
ప్రణీత అంటే ఐరన్ లెగ్!... ‘అత్తారింటికి దారేది’ ముందు వరకూ ఆమెకు అదే ఇమేజ్. ఆ సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్డమ్ వచ్చేసిందామెకు. కన్నడ అమ్మాయి అయినా కూడా అచ్చం బాపు బొమ్మలాగానే ఉంటుంది. స్మయిలిష్‌గా... స్టయిలిష్‌గా కనబడే ప్రణీతతో మాట్లాడుతూ ఉంటే కాలం ఘనీభవించినట్టే అనిపిస్తుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారట..? ప్రణీత: అవును. మా అమ్మానాన్నలిద్దరూ డాక్టర్సే. మాకు బెంగళూరులో ఆస్పత్రి ఉంది. ‘నువ్వు డాక్టర్ అవాలి’ అంటూ చిన్నప్పట్నుంచీ చెబుతూ పెంచారు నన్ను. నాకైతే ఆ మాట విన్నప్పుడల్లా చాలా ఒత్తిడిగా అనిపించేది. మార్కులైతే వందకు వంద రావాలనేవారు. అందుకని ఎప్పుడూ పుస్తకాలతో బిజీగా ఉండేదాన్ని. మరి.. హీరోయిన్ అవుతానంటే ఏమన్నారు? ప్రణీత: చాలామంది పేరంట్స్‌లానే కుదరదంటే కుదరదన్నారు. నేను ఏమాత్రం ట్రై చేయకుండానే నాకు అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. దాంతో అమ్మ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆలోచనలో పడింది. ఒకవేళ సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని రాసి పెట్టి ఉందేమో అనుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ విధంగా ‘పోకిరి’ కన్నడ రీమేక్ ‘పొర్కి’ ద్వారా హీరోయిన్ అయ్యాను. అందమైన అమ్మాయిలకు ప్రేమలేఖలు రావడం సర్వసాధారణం. మరి మీరెన్ని అందుకున్నారు? ప్రణీత: ఒక్కటి కూడా అందుకోలేదు. పోనీ.. మీరెవరికైనా రాశారా? ప్రణీత: పుస్తకాల్లో పాఠాలు రాసుకోవడం తప్ప ప్రేమలేఖలు రాసేంత సీన్ నాకు లేదు. అసలు ఆ యాంగిల్లో ఇప్పటివరకు నేను ఏ అబ్బాయినీ చూడలేదు. మీలా సన్నగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రణీత: నూనె లేకుండా చేసిన వంటకాలు తినాలి. హోటల్‌కెళ్లినప్పుడు, నాకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసేసి, ఇవన్నీ నూనె లేకుండా తయారు చేయాలని చెబుతుంటాను. అప్పుడు ‘కొంచెం కూడా నూనె లేకుండా ఎలా వండమంటారు?’ అని కుక్స్ అడిగితే, ఎలాగోలా వండండి. నాకు మాత్రం ఆయిల్ ఫ్రీ ఫుడ్డే కావాలని చెప్పేస్తాను. మనం ఎప్పుడైతే ఆహారం విషయంలో హద్దులు పెట్టుకుంటామో అప్పుడు ఆరోగ్యంగానూ ఉండగలుగుతాం. అలాగే వ్యాయామాలు చేయాలి. సినిమాల్లో పాత్రకు అనుగుణంగా కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. విడిగా మీ అభిరుచి ఏంటి? ప్రణీత: సినిమా తారలు సమ్మర్లో స్వెటర్ వేసుకుని బయటికెళ్లినా, ‘ఇప్పుడీ ట్రెండ్ నడుస్తుందేమో’ అనుకుని అది ఫాలో అవుతారు చాలామంది. అందుకే, నేను దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. వీలైనంత స్టయిలిష్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను. డాక్టర్ అవకుండా యాక్టర్ అయ్యామని ఎప్పుడైనా ఫీలయ్యారా? ప్రణీత: అస్సలు లేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నేను పశ్చాత్తాపపడను. ఎన్నో రకాల జీవితాలను తెరపై జీవించే అవకాశం ఒక్క కళాకారులకే ఉంటుంది. ఒక్కో పాత్ర మాకు ఒక్కో పాఠం. ఆ పాత్ర తాలూకు అనుభవాలు ఒక్కోసారి మా జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే షూటింగ్లో భాగంగా మేం విదేశాలకూ వెళుతుంటాం. అక్కడి వేష, భాషలు సంప్రదాయాలు తెలుస్తుంటాయి. మన దేశంలోనే పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలు తెలుస్తాయి. వాటిలో ఆచరించదగ్గ మంచి విషయాలుంటాయి. మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? ప్రణీత: ఒక్క పౌరాణిక పాత్రైనా చేయాలని ఉంది. ఆ పాత్రలకు వేసే కాస్ట్యూమ్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఆ సినిమాల్లో వచ్చే గ్రాఫిక్స్‌కి థ్రిల్ అయిపోతుంటాను. అరుంధతి, మగధీర చిత్రాలను ఎగ్జయిట్‌మెంట్‌తో చూశాను. సేవా కార్యక్రమల సంగతేంటి? ప్రణీత: కచ్చితంగా చేస్తాను. దానికోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టాను. ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి నాకు కుదిరినంతవరకూ సేవా కార్యక్రమాలు చేయాలని ఉంది. -
అత్తారింటికీ దారేది మూవీ మేకింగ్
-
అత్తారింటికి దారేది అంటున్న పెద్దల సభ
-
అత్తారింటికి దారి..!
పల్లెలన్నీ అల్లుళ్లతో కళకళలాడే పెద్ద పండుగ సంక్రాంతి. ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలంలోని భూదేవిపేటకు మాత్రం ఆ కళ ఏడాదంతా ఉంటుంది! ఈ గ్రామంలో ఉన్నవారంతా ఇల్లరికపుటల్లుళ్లు కావడమే అందుకు కారణం. ఎక్కడెక్కడో ఉన్న అల్లుళ్లంతా సంక్రాంతినాడు అత్తారిళ్లకు చేరితే ఇక్కడి అల్లుళ్లు మాత్రం ఊరు దాటకుండానే పండుగ సంబరాల్లో మునిగి తేలతారు. 120 కుటుంబాలున్న ఈ గ్రామంలో 115 మంది ఇల్లరికం అల్లుళ్లే కావడం గ్రామానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. ఆడపడుచులకు ఇక్కడ లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. దీనివల్ల అల్లుళ్లను ఈ ఊరు అక్కున చేర్చుకుంటోంది. అత్తమామలే వారికి కన్నవారితో సమానులు. అత్తిల్లే వారికి సొంతిల్లు. అత్తమామల ఆదరణ కారణంగా ఇల్లరికం అల్లుళ్లతో రికార్డు సృష్టించింది భూదేవిపేట. ఊళ్లో ఐదుగురు అమ్మాయిలను మాత్రమే వేరే ప్రాంతాల వారికి ఇచ్చి పెళ్లి చేయగా, కేవలం వారు మాత్రమే ఆయా ఊళ్లలో నివాసాలుంటున్నారు. మిగతా నూట పదిహేనుమంది అమ్మాయిలకు సొంతూరే అత్తింటి చిరునామాగా స్థిరపడింది. ఈ ఊరికి అల్లుళ్లుగా వచ్చిన వారిలో పశ్చిమ, తూర్పుగోదావరిజిల్లాలతోపాటు, శ్రీకాకుళం, ఖమ్మం జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఇలా వచ్చిన అల్లుళ్లు ఇదే గ్రామానికి చెందిన వారిని మళ్లీ అల్లుళ్లను చేసుకోవడంతో ఇది అల్లుళ్ల గ్రామంగా పేరొందింది. పూర్వం ఈ గ్రామానికి బుడ్డిపేటగా పేరుండేది. వసంతవాడ పెదవాగు ఇవతలి ఒడ్డున ఈ గ్రామం ఉండేది. 60 ఏళ్లకు పూర్వం శ్రీకాకుళం జిల్లా బుడ్డిపేట గ్రామానికి చెందిన సన్నిపల్లి నర్సయ్య, అప్పారావు, వీరయ్య, రామయ్య, అనే నాలుగు వెలమ దొరలకుటుంబాలు ఈ ప్రాంతానికి వలస వచ్చాయి. క్రమేపీ ఈ కుటుంబాలు 20 అయ్యాయి. వీరి పూర్వీకులు అప్పట్లో భూదేవిపేటగా నామకరణం చేశారు. 1986వ సంవత్సరంలో వచ్చిన గోదావరి వరద సమయంలో ఊరంతా కొట్టుకుపోవడంతో వరద మునగని మెరకప్రాంతాన్ని ఎంచుకొని వలస వచ్చారు. పాతభూదేవిపేట నివాస ప్రాంతమంతా పొలాలుగా మారింది. ఈ గ్రామం అంతరించి పోయింది. ఆ స్థానంలో నేడు కొత్తభూదేవిపేట గ్రామం ఆవిర్భవించింది. అల్లుళ్ల గ్రామంగా పేరు పొందింది. - ఎం.ఏ సమీర్ సాక్షి, వేలేరుపాడు, ఖమ్మం జిల్లా మొదటి అల్లుణ్ణి: మాది అశ్వారావుపేట మండలం నారాయణపురం.1969లో కర్నాటి చినరామయ్య అల్లుడిగా ఇల్లరికం వచ్చా. అత్తమామలు పెళ్లికానుకగా రెండు ఎకరాలు పొలం ఇవ్వగా, మరో రెండు ఎకరాలు కొనుక్కున్నాను. అందులో వ్యవసాయం చేస్తున్నాను. మా గ్రామంలో ఉన్నంత ప్రశాంత వాతావరణం ఎక్కడా ఉండదని తెలుసుకున్నాను. - చందా ముత్తయ్య 32 ఏళ్ల క్రితం ఇల్లరికానికి... మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. 32 ఏళ్ల క్రితం భూదేవిపేటకు చెందిన నాగమణితో వివాహమైంది. ఇల్లరికం అల్లుడిగా వచ్చా. మా మామగారు రెండెకరాల భూమి మాకిచ్చారు. అందులో వ్యవసాయం చేసుకుంటున్నాం. - ఎం. నర్శింహారావు ఒరిస్సానుంచి వచ్చా... ఒరిస్సా లోని మోట్ నుండి 22 ఏళ్ల క్రితం అల్లుడిగా వచ్చి, భూదేవిపేటలో సెటిల్ అయిపోయాను. ఈ గ్రామానికి చెందిన రమాదేవిని పెళ్లాడాను. అప్పటి నుంచి టైలరింగ్ వృత్తిని సాగిస్తూ బతుకుబండి లాగిస్తున్నాను. నాకు ఇద్దరుఅమ్మాయిలు. వీరిలో ఒకరికి ఇదే గ్రామంలో వివాహం చేశాను. - ఇందారపు రాము -
'1' నేనొక్కడినే ఓపెనింగ్ కలెక్షన్ రూ. 8.4 కోట్లు
చెన్నై: 'ప్రిన్స్' మహేష్‌బాబు నటించిన '1' నేనొక్కడినే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ. 8.4 కోట్లు కలెక్షన్లు వసూలు సాధించింది. అయితే 'అత్తారింటికి దారేది' సినిమా ప్రారంభ వసూళ్లను '1' అధిగమించలేకపోయింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు లేవని విశ్లేషకులు అంటున్నారు. రూ. 70 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 1400 స్ర్కీన్లపై విడుదల చేశారు. సైకాలజికల్ థిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. భారీ అంచనాలు, డిపెరెంట్ నేరేషన్, నిడివి ఎక్కువగా ఉండడం సినిమాకు ప్రతిబంధకంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. మిశ్రమ స్పందన వ్యక్తమవడంతో సినిమా నిడివి తగ్గించినట్టు సమాచారం. -
రికార్డులున్నా... అసంతృప్తే!
174 డెరైక్ట్ చిత్రాలు... కానీ విజయాలు మాత్రం పదిహేనే. 2013లో డిసెంబర్ 24 వరకూ మన చిత్రసీమ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. అంకెల పరంగా చూస్తే ఓకే గానీ, విజయాల పరంగా మాత్రం వీకే. ఈ విజయాలు ఏ మాత్రం బాక్సాఫీస్ దప్పికను తీర్చలేవనేది కరాఖండీగా చెప్పేయొచ్చును. మన తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్‌కు (గ్రాస్ పరంగా) చేరుకోవడమనేది 2013లో ఓ గొప్ప విజయం. దాంతోపాటు మరో నాలుగు సినిమాలు 50 కోట్ల మైలురాళ్లను (షేర్ పరంగా) అందుకోవడం మరో తీయటి అనుభూతి. చాలామట్టుకు సినిమాలను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. కంటెంట్ లేకపోతే ఒక్క టిక్కెట్ కూడా తెగడంలేదనేది కాదనలేని వాస్తవం. రికార్డులను చూసి ఆనందపడాలో, పరాజయాలను తల్చుకుని కుమిలిపోవాలో తెలియని అసందిగ్ధావస్థ ఇది. విజయాలు సాధించిన సినిమాలను విశ్లేషించి చూస్తే, కుటుంబ కథాచిత్రాలకు మళ్లీ ఆదరణ మొదలైందని అర్థమవుతోంది. అందుకు నిదర్శనం ‘అత్తారింటికి దారేది’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రాల ఘనవిజయాలే. మరో పక్క మాస్ ఎంటర్టైనర్లకూ ప్రేక్షకులు పట్టం కట్టారు. కుటుంబ కథ, ప్రేమకథ, మాస్ మసాలా, చివరకు హారర్ స్టోరీ అయినా వినోదం ఉండి తీరాల్సిందే. అలా అయితేనే ప్రేక్షకుడు సినిమాకి వస్తున్నాడు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉదృతంగా జరిగిన తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు చిత్రసీమపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. చాలా సినిమాల విడుదలలు వెనక్కి ముందుకి ఊగిసలాడాల్సిన పరిస్థితి. ఒక దశలో పెద్ద సినిమాలన్నీ విడుదలకు వెనుకంజ వేస్తే... వారానికి అయిదారు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే.. ఇవన్నీ ఎంత త్వరగా వచ్చాయో... అంతే త్వరగా వెళ్లిపోయాయి. ఈ ఏడాది విజయతీరానికి చేరుకున్న 15 సినిమాలేంటో ఒకసారి చూద్దాం... బ్లాక్‌బస్టర్ ఆఫ్‌ది ఇయర్: సినిమా రిలీజ్‌కి రెడీ. కానీ ఈ లోగా రాష్ట్రంలోని ఉద్యమం ఊపందుకుంది. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. జూలైలో అనుకున్న సినిమా సెప్టెంబర్ వరకూ సెలైంట్‌గా ఉండిపోవాల్సివచ్చింది. ఈ లోగా ఓ పిడుగులాంటి వార్త. బాక్సాఫీస్‌కి గుండెపోటు తెప్పించే వార్త. ఈ సినిమా ప్రథమార్ధం అంతా ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. దానికి తోడు అనేక పైరసీ ప్రింట్లు. ఇక ఈ సినిమా పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. అయినా మొండిగా సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేశారు. కట్ చేస్తే... ‘అత్తారింటికి దారేది’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇన్ని అవరోధాలను దాటుకొని ఇంతటి ఘనవిజయం సాధించడమంటే... మాటలు కాదు. ఇది పవన్‌కల్యాణ్ మ్యాజిక్. దర్శకుడు త్రివిక్రమ్ మ్యాజిక్. వంద కోట్ల రూపాయల పై చిలుకు గ్రాస్నీ, 80 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసి తెలుగు సినిమా స్టామినాను బాక్సాఫీస్‌కి చాటిచెప్పింది. ‘గబ్బర్‌సింగ్’తో ఫామ్‌లోకొచ్చిన పవన్‌ని నంబర్‌వన్ రేస్‌లో ముందుండేలా చేసింది. కుటుంబ కథలు కనుమరుగైపోయిన నేటి తరుణంలో పవన్ ఈ కథను ఎంచుకొని మళ్లీ కొత్త ట్రెండ్‌కి నాంది పలికారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఓ సంచలనం. అత్త పాత్రలో నదియా కూడా పెద్ద ప్లస్. నాయక్(జనవరి 9) ఈ ఏడాదికి ఇదే తొలి హిట్. మాస్ అంశాలే ఈ సినిమాకు శ్రీరామరక్ష. ‘రచ్చ’ తర్వాత చరణ్‌కి ఇది మరో మాస్ హిట్. 50 కోట్ల పైచిలుకు షేర్ వసూలు చేసింది. చరణ్, వినాయక్ కాంబినేషన్ మాస్‌ని ఆకట్టుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు(జనవరి 11) వెంకటేష్, మహేష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి చేసిన సినిమా. అదీ కుటుంబ కథ కావడం విశేషం. క్లీన్ మూవీ. అనుబంధాలు, అలకలు, అల్లర్లు, కోనసీమ అందాలు ప్రేక్షకుల మనసు నిండేలా చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అందుకేనేమో 50 కోట్ట పైచిలుకు షేర్ రాబట్టగలిగింది. ఓవర్సీస్లో కొత్త రికార్డ్ సృష్టించింది. మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్‌కి కొత్త ఊపిరిచ్చింది. మిర్చి(ఫిబ్రవరి 8) ఫ్యామిలీ డ్రామాకు ఫ్యాక్షన్ కలగలిపితే వచ్చిన ఘాటైన సినిమా ఇది. ఈ సినిమాతో ప్రభాస్ మాస్‌కి మరింత చేరువయ్యారు. రచయిత కొరటాల శివ దర్శకునిగా మెప్పించారు. ఈ సినిమా కూడా 50 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టుకుంది. స్వామి రారా( మార్చి 23) కొత్త కాన్సెప్ట్‌తో కొత్తగా తీస్తే... చిన్న సినిమా అయినా పెద్ద రేంజ్లో ఆడుతుంది అనడానికి స్వామి రారా ఓ అందమైన నిదర్శనం. కొత్త దర్శకుడు సుధీర్‌వర్మ ఈ సినిమాను డీల్ చేసిన విధానమే మెయిన్ హైలైట్. బాద్షా(ఏప్రిల్ 5) ఈ ఏడాది యాభై కోట్ల పై చిలుకు షేర్ వసూలు చేసిన సినిమాల్లో ‘బాద్షా’ ఒకటి. ఊసరవెల్లి, దమ్ము చిత్రాలతో పోల్చుకుంటే... ఎన్టీఆర్‌కి ఇది మంచి ఊరట. శ్రీనువైట్ల శైలి ఈ సినిమాకు కలిసొచ్చింది. గుండెజారి గల్లంతయ్యిందే(ఏప్రిల్ 19) చాలాకాలం తర్వాత వచ్చిన క్లీన్ అండ్ కలర్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. నితిన్, నిత్యామీనన్ల కెమిస్ట్రీ మరోసారి అదిరింది. అనూప్ మ్యూజిక్ మ్యాజిక్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. దర్శకుడు విజయ్‌కుమార్ కొండా ప్రయత్నం ఫలించింది. తడాఖా(మే 10) తమిళ ‘వేట్టై’కి రీమేక్ ఇది. సునీల్, నాగచైతన్య కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. నాగచైతన్యకు మాస్ ఇమేజ్ జతకూడింది. డాలీ ఈ రీమేక్‌ని బాగా డీల్ చేశారు. ప్రేమకథాచిత్రమ్ (జూన్ 9) హారర్ సినిమా చూసి ఎవరైనా భయపడతారు. కానీ హారర్‌తో కూడా పొట్టచెక్కలయ్యేంత కామెడీ సృష్టించొచ్చని ‘ప్రేమ కథాచిత్రమ్’ నిరూపించింది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో కెమెరామేన్ ప్రభాకరరెడ్డి డెరైక్ట్ చేశారీ సినిమా. ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం ఇదే. సుధీర్‌బాబుని హీరోగా నిలబెట్టింది. బలుపు(జూన్ 28) రెండేళ్ల దోబూచులాట తర్వాత రవితేజకు ‘బలుపు’తో విజయం దక్కింది. పంచ్ డైలాగులు బాగా పండాయ్. పెరిగిన టికెట్ రేట్లను బాగా సద్వినియోగం చేసుకోగలిగిందీ సినిమా. అంతకు ముందు ఆ తరువాత(ఆగస్ట్ 23) సహజీవనం అనేది కత్తిమీద సాములాంటి కాన్సెప్ట్. ఏ మాత్రం అటూఇటూ అయినా... చాలా తేడా వస్తుంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ చాలా తెలివిగా ఈ సినిమాను మలిచారు. సుమంత్ అశ్విన్‌కి హీరోగా ఓ మంచి బ్రేక్. దామూకి నిర్మాతగా వేల్యూ పెంచింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (నవంబర్ 29) ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా. కొత్త దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా ఇన్నోవేటివ్‌గా ఈ కథను తెరకెక్కించాడు. సందీప్‌కిషన్‌కి సోలో హీరోగా తొలి విజయం. మంచు మనోజ్ కెరీర్లోనే భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ‘పోటుగాడు’. మేకింగ్ దశలోనే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఫలితంగా ప్రారంభ వసూళ్లు ఆకర్షణీయంగా వచ్చాయి. చాలా విరామం తర్వాత గోపిచంద్ చేసిన ‘సాహసం’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచింది. ఆయన స్థాయి విజయం కాకపోయినా... రన్ మాత్రం బాగానే వచ్చింది. ‘అడ్డా’ సినిమా కూడా సెలైంట్‌గా వసూళ్లు రాబట్టింది. సుశాంత్‌కి ఓ విధంగా ఇదే తొలి విజయం. -
బికినీలో ప్రణీత?
బాపుగారి సినిమాల్లో నటించకుండానే బాపుబొమ్మ అయి కూర్చుంది ప్రణీత. ‘అత్తారింటికి దారేది’ పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మను అందరూ బాపు బొమ్మా అనే అంటున్నారు. ప్రస్తుతం ఈ బాపు బొమ్మ తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో మొదటిది ఎన్టీఆర్ ‘రభస’ కాగా, రెండోది మంచు ఫ్యామిలీ సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెదా’. అయితే... ఈ రెండు చిత్రాల్లోనూ ప్రణీతను సెకండ్ హీరోయిన్ పాత్రలే వరించాయి. తన తొలి విజయం ‘అత్తారింటికి దారేది’లో సెకండ్ హీరోయిన్ పాత్ర చేయడం వల్ల... తర్వాతి చిత్రాల్లో కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలే రావడం ప్రణీతను వేదనకు గురిచేస్తున్న అంశం. సాటి హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్‌ని పలికించినా... సరైన అవకాశాలు రాకపోవడంతో... తన అంబుల పొదిలోంచి చివరి అస్త్రాన్ని సంధించడానికి ప్రణీత సంసిద్ధమయ్యారు. తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పాండవులు పాండవులు తుమ్మెదా’లో బికినీలో సాక్షాత్కరించబోతున్నారట. వెయిట్ అండ్ సీ. -
నటుడిగా బిజీ అయినా... వైద్యవృత్తిని వదులుకోను!
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామంటారు చాలామంది. కానీ డాక్టరూ యాక్టరూ అయ్యే అవకాశం చాలా కొంతమందికే లభిస్తుంది. డాక్టర్ భరత్‌రెడ్డి ఆ జాబితాకు చెందినవారే. హైదరాబాద్‌లో గుండె వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న భరత్‌రెడ్డి తనకు నటనే గుండె చప్పుడు అని చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా రాణిస్తున్న ఈ యువ నటునితో జరిపిన సంభాషణ... ‘అత్తారింటికి దారేది’లో మీ పాత్రకు మంచి పేరొచ్చినట్టుంది? అవునండి. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒకెత్తయితే, ఈ సినిమా మరొక ఎత్తు. ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో నటిస్తే వస్తే కిక్ ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. ఈమధ్య తిరుపతిలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ నా చుట్టూ గుమిగూడేసరికి, మా బంధువులూ స్నేహితులూ నా ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయారు. డాక్టర్‌గా గుర్తింపు బావుందా? నటునిగా వస్తోన్న క్రేజ్ బావుందా? దేని సంతృప్తి దానిదే. మోటార్ సైకిల్ అంటేనే తెలీని మధ్య తరగతి కుటుంబం మాది. అలాంటిది నేను డాక్టర్ని కాగలిగాను. ఇప్పటివరకూ 350 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగాను. ఇది నాకు దేవుడిచ్చిన అవకాశంగానే భావిస్తున్నాను. ఇక నటుడు కావడమనేది మరో గొప్ప అవకాశం. భవిష్యత్తులో నటుడిగా బాగా బిజీ అయితే, వైద్య వృత్తిని వదిలేస్తారా? లేదు. నటన, వైద్యం నాకు రెండు కళ్లులాంటివి. నటుడిగా ఎంత బిజీ అయినా, వైద్యాన్ని మానుకోను. శని, ఆదివారాలైనా సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. అసలు నా దృష్టిలో వైద్యం అంటే సమాజసేవ. వైద్య వృత్తిలోకి ఎలా వచ్చారు? అసలు నేను డాక్టరూ యాక్టరూ అవుతానని ఏనాడూ అనుకోలేదు. మాకంత స్తోమత కూడా లేదు. మా కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఉద్యోగం వస్తే చాలు అనుకున్నాను. కడపలో సూపర్‌మార్కెట్ అయినా పెట్టుకుని బతికేద్దామను కున్నాను. మా అమ్మకు మాత్రం నన్ను డాక్టర్ చేయాలని ఉండేది. తన కోరికే నన్ను ఈ రంగంలోకి తెచ్చింది. మరి యాక్టింగ్ వైపు రావాలని ఎందుకనిపించింది? చెన్నైలో చో రామస్వామిగారి స్కూల్లో చదువుకుంటున్నపుడు కొన్ని స్టేజ్ ప్లేల్లో నటించాను. అప్పటి నుంచీ నటనపై అభిలాష మొదలైంది. డాక్టర్‌గా పనిచేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాను. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక విచిత్రం’ సినిమాలో 37 సెకన్లు కనపడే వేషం దొరికింది. ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు చాలా చేశాను. మరి బ్రేక్ ఎప్పుడొచ్చింది? జేడీ చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన ‘సిద్ధం’ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా ద్వారానే ‘ఈనాడు’లో కమల్‌హాసన్‌తో నటించే సువర్ణావకాశం కూడా నాకు దక్కింది. ‘ఈనాడు’ తర్వాత నాకు పోలీస్ ఇమేజ్ వచ్చేసి, వరుసగా అలాంటి పాత్రలు చాలా వచ్చాయి. కమల్‌హాసన్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది? యాక్టింగ్‌లో ఆయనొక యూనివర్శిటీలాంటివారు. ఆయనతో రెండుమూడు సినిమాలు చేస్తే చాలు నటన మీద మనకో భరోసా వచ్చేస్తుంది. ‘ఈనాడు’ సమయంలో నాకు మంచి సూచనలు ఇచ్చేవారు. ‘విశ్వరూపం’ తెలుగు వెర్షన్లో ఓ పాత్రకు నన్ను డబ్బింగ్ చెప్పమని ఆయనే అడిగారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. తమిళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నట్టున్నారు? అవునండీ. ప్రస్తుతం తమిళంలో 3, కన్నడంలో 1 సినిమా చేస్తున్నాను. నాకు 8 భాషలు వచ్చు. అందుకే నాకు భాషా సమస్య లేదు. రేపు మలయాళంలో అవకాశం వచ్చినా చేయగలను. ఇక తెలుగు విషయానికొస్తే ‘పైసా’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘ఆగడు’లో చేయబోతున్నాను. నటునిగా మీ లక్ష్యం? యాంటీ హీరో, నెగిటివ్ షేడ్‌తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేయాలని ఉంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత హీరోగా చేయమని కొంతమంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి హీరోగా చేసే ఉద్దేశం లేదు. -
స్పెషల్ సాంగ్స్‌కే కాదు...ఆర్ట్ సినిమాలకూ రెడీ!
సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరికి బ్రేక్ వస్తుందో ఎవరూ ఊహించలేరు. ‘ఈగ’లో అతిథి పాత్రకు అంగీకరించినప్పుడు హంసానందిని కూడా తన కెరీర్‌కి అది మంచి మలుపు అవుతుందని ఊహించలేదు. ‘ఈగ’ తర్వాత వరుసగా మిర్చి, అత్తారింటికి దారేది, భాయ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారామె. ఈ ఆరడుగుల అందం అసలు పేరు పూనమ్. ‘అనుమానాస్పదం’తో కథానాయికగా పరిచయం చేసినప్పుడు సీనియర్ దర్శకుడు వంశీ ఆమె పేరుని హంసానందినిగా మార్చారు. ఆ పేరంటే తనకెంతో ఇష్టమంటున్న హంసానందినితో జరిపిన ఇంటర్వ్యూ... ఈ మధ్య అతిథి పాత్రలు, ఐటమ్ సాంగ్స్‌కు మీరే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినట్టున్నారు. ఈ పరిణామం ఎలా అనిపిస్తోంది? లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే, నేను స్క్రీన్ మీద కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు బాగానే గుర్తుండిపోతున్నాను. హంసా చాలా స్టయిలిష్‌గా ఉందనీ గ్లామరస్‌గా ఉందనీ అభినందిస్తున్నారు. ఇలా ఐటమ్ సాంగ్స్‌కే పరిమితమైపోవాలనుకుంటున్నారా? అలా ఏం లేదు. నేను చేసేవి ఐటమ్ సాంగ్స్ కాదు... స్పెషల్ సాంగ్స్ అనాలి. ఎందుకంటే, మీరిప్పటివరకు నేను చేసిన పాటలను చూస్తే కథలో భాగంగానే అవి ఉంటాయి. అలాగే, పాటలో మాత్రమే కాకుండా రెండు, మూడు సీన్స్‌లో కూడా ఉంటాను కదా. స్పెషల్ సాంగ్స్ చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. అలాగని పాటలకే పరిమితమైతే నాకు నేను బోర్ కొట్టడంతో పాటు ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేస్తాను. అందుకే లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. ‘ఈగ’ ఒప్పుకున్నప్పుడు గెస్ట్ రోల్స్ పరంగా మీకు డిమాండ్ పెరుగుతుందనుకున్నారా? అస్సలు ఊహించలేదు. ఆ సినిమాకి రాజమౌళిగారు అడిగినప్పుడు, మీ పాత్ర తెరపై కనిపించేది కాసేపే... ఎక్కువసేపు కనిపిస్తే అంత ఇంపాక్ట్ ఉండదన్నారు. ఆయన మాటలు అక్షరాలా నిజం. ‘ఈగ’లో నేను తక్కువ సమయం కనిపించినా, మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా విడుదలైన తర్వాత చాలామంది దర్శక, నిర్మాతలు ఫోన్ చేసి, చిన్న పాత్ర అయినా క్యూట్‌గా ఉందన్నారు. వంశీ ‘అనుమానాస్పదం’లో కథానాయికగా చేశారు.. ఆ తర్వాత హీరోయిన్గా రాణించలేకపోవడానికి కారణం ఏంటి? వంశీగారు ఎంత మంచి దర్శకులో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలో కథానాయికగా చేసే అవకాశం రావడం ఓ అదృష్టం. ఆ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో తప్పు జరిగింది. దానివల్ల కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు. ఇప్పుడు హీరోయిన్గా ఏమైనా సినిమాలు చేస్తున్నారా? నేను చేసే అతిథి పాత్రలకు ఎంత పేరొచ్చినా, ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసినప్పుడు లభించే సంతృప్తి వేరు. అందుకే, లీడ్ రోల్స్‌పై దృష్టి సారించాలనుకుంటున్నాను. కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయి. ఏది పడితే అది కాకుండా మంచి ప్రాజెక్ట్‌ని ఎన్నుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం చేస్తున్న ‘రుద్రమదేవి’లో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఇందులో నా పాత్ర పేరు ‘మధానికా’. ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాను. ఏడెనిమిది లుక్స్ టెస్ట్ చేసిన తర్వాత ఓ లుక్‌ని ఫైనలైజ్ చేశారు. ఈ సినిమా కోసం నా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాను. గ్లామరస్ రోల్స్ మాత్రమేనా.. డీ-గ్లామర్ రోల్స్ కూడా చేయాలనుకుంటున్నారా? నటిగా నిరూపించుకునే అవకాశం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తాను. కథ, కేరక్టర్ బాగుంటే ఆర్ట్ ఫిల్మ్‌లో చేయడానికి కూడా రెడీ. అలాగే మంచి ఫైట్స్ డిమాండ్ చేసే యాక్షన్ మూవీస్‌లో చేయడానికి కూడా సిద్ధమే. -
రెండో గబ్బర్‌సింగ్ డిసెంబర్లో స్టార్ట్
‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర జయభేరి మోగించడంతో ఎక్కడ చూసినా పవన్‌కల్యాణ్ నామజపమే. ప్రస్తుతం ఆయనేం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషన్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఆయన ఇవేవీ పట్టించుకోకుండా ‘రెండో గబ్బర్‌సింగ్’ని తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 2న ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడం ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడందుకుంది. దర్శకుడు సంపత్‌నందితో పాటు ప్రతిభావంతులైన రచయితల బృందం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అహర్నిశలూ శ్రమిస్తున్నారు. పవన్‌కల్యాణ్ దగ్గరుండి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 2 నాటికి ఈ సినిమా సెట్స్‌కు వెళ్లాలనే కసితో పనిచేస్తున్నారట. బాలీవుడ్ ‘దబాంగ్’కి రీమేక్ ‘గబ్బర్‌సింగ్’. అయితే... ‘గబ్బర్‌సింగ్-2’ మాత్రం ‘దబాంగ్-2’కు రీమేక్ కాదు. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఇందులో పవర్‌స్టార్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు పనిచేసే కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. -
పవన్, త్రివిక్రమ్‌లతో చిట్ చాట్
-
'అత్తారింటికి దారేది' సక్సెస్ మీట్లో పవన్ ఫైర్
''పైరసీని బయటి జనం చూడలేదేమో గానీ, చిత్రపరిశ్రమలో చాలామంది ప్రముఖులు చూసేశారు. ఇండస్ట్రీని నమ్ముకున్నవాళ్లు, పరిశ్రమే వాళ్ల కుటుంబాలకు ఆధారం అయినవాళ్లు మాత్రం పైరసీని బాగానే ప్రోత్సహించారు. సినిమాను ఐప్యాడ్‌లోకి, డెస్క్‌టాప్ లోకి డౌన్లోడ్ చేసుకుని మరీ చూశారు. పోని చూసి వదిలేశారా.. మాకు ఫోన్ చేసి, మీరేం భయపడక్కర్లేదు సినిమా చాలాబాగుందనేసరికి వాళ్లను చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఒక్కళ్లు, ఇద్దరయితే పేర్లు చెప్పచ్చు. కానీ ఎంతమందని చెప్పాలి? అలా వింటూ కూర్చున్నాం. అసలు వీళ్లకి కామన్ సెన్స్ ఉందా? ఎద్దుపుండు కాకికి రుచి.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నాం. కంచే చేను మేసినట్లుగా, ద్రోహం చేసింది బయటివారు కాదు.. లోపలివాళ్లే. ఇది పైరసీ అనిపించట్లేదు.. ఇదో కాన్స్పిరసీ. నిజంగా పైరసీ చేయాలనుకుంటే 50 రోజులు అలా గుప్పెట్లో పెట్టుకోరు. ఎవరి మాటలు విని వీళ్లు పైరసీ చేశారో, వాళ్లందరినీ నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఈ పైరసీని చెయ్యమని ఎవరైతే ప్రోత్సహించారో.. వాళ్లందరినీ రాబోయే సంవత్సరాల్లో పేరుపేరునా గుర్తుపెట్టుకుంటా. వాళ్లు ఏ స్థాయివాళ్లయినా సరే.. అందరికీ ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం జరిగేలా చూస్తాను. సహిస్తా.. భరిస్తా.. అవసరమైతే తాటతీస్తా'' అని పవన్ అన్నారు. చలన చిత్ర అభివృద్ధి మండలి (ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ -ఎఫ్డీసీ) సభ్యులలో కొంతమంది కూడా పైరసీ సినిమా చూసేశారని, వాళ్లు ఆ తర్వాత తనకు నేరుగా ఫోన్ చేసి, సినిమా బాగుంది కాబట్టి పైరసీ గురించి ఏమాత్రం భయపడొద్దని చెప్పారన్నారు. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. చివరకు ఎఫ్డీసీ సభ్యులు కూడా పైరసీ సినిమాలు చూస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందని అనుకోవాలా? లేదా... పైరసీ సినిమాలను ఎవరెవరు చూశారన్న విషయం కూడా.. అంటే పేర్లు కూడా ఆయనకు తెలిసినా పోలీసులకు చెప్పకుండా ఊరుకున్నందుకు ఆయన నిజాయితీని కూడా అనుమానించాలా అని టాలీవుడ్ వర్గాలు విస్తుపోతున్నాయి. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా పవన్ చాలా నిజాయితీగా ఉంటారని అత్తారింటికి సినిమా దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు సందర్భాల్లో చెప్పారు. -
ప్రేమిస్తా... ఓపిక పడతా.. భరిస్తా.. అవసరమైతే తాట తీస్తా! - పవన్‌కల్యాణ్
‘‘మా సినిమాకు జరిగింది పైరసీ కాదు... కుట్ర. కంచె చేను మేసినట్లుగా, అయినవారే నమ్మక ద్రోహం చేశారు. ఈ దుశ్చర్యకి పాల్పడినవారికి, అందుకు సహకరించిన వారికీ నేను చెప్పేది ఒక్కటే. ఎవ్వరినీ వదలను. శిక్షించి తీరతాను. సినిమా హిట్ అయ్యిందిలే... మరిచిపోతాడులే అనుకుంటే వాళ్లు పొరపడ్డట్టే. ప్రేమిస్తా... ఓపిక పడతా.. భరిస్తా.. అవసరమైతే తాట తీస్తా. ఎవ్వర్నీ వదిలేది లేదు’’ అని ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని యూట్యూబ్‌లో పెట్టి, పైరసీకి కారణం అయిన వారికి హెచ్చరిక జారీ చేశారు పవన్‌కల్యాణ్. దసరా రోజు రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘అత్తారింటికి దారేది’ ‘థ్యాంక్స్ మీట్’లో పవన్ భావోద్వేగంగా ప్రసంగించారు. పవన్ మాటల తూటాలు ఇంకా ఇలా పేలాయి. *** మాది నిగ్రహం.. చేతకాని తనం కాదు నిజంగా పైరసీకి పాల్పడాలనుకునేవారెవరూ 50 రోజుల పాటు గుప్పెట్లో సినిమాను పెట్టుకొని కూర్చోరు. ఈ దుర్మార్గానికి కారకులైన అసలు వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. పోలీసులు పట్టుకుంది పావుల్ని మాత్రమే. ఆటగాళ్లు వేరే ఉన్నారు. వాళ్లు కూడా త్వరలోనే బయటికొస్తారు. దేశభక్తి, సమాజంపై గౌరవం, ప్రస్తుత పరిస్థితులు మా నోరు జారనీయకుండా చేశాయి. ఇది నిగ్రహం తప్ప చేతకాని తనం కాదు. అన్ని రోజులూ మావే కావాలని, మా సినిమాలు మాత్రమే ఆడాలని కోరుకునే తక్కువస్థాయి మనుషులం కాదు మేం. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కుదిరినంతవరకూ సర్దుకుపోతాం. లేదంటే ఊహించని రీతిలో తిరగబడతాం. *** వారి రియాక్షన్ చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు సినిమా యూట్యూబ్‌లోకి రాగానే.. బయట జనాలు, అభిమానులు పెద్దగా చూడలేదేమో కానీ.. పరిశ్రమ ప్రముఖులు మాత్రం చాలామంది చూసేశారు. ఎవరికైతే సినిమా జీవితాన్ని ఇచ్చిందో, ఎవరైతే ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుతున్నారో వారే... తమ తమ ఐప్యాడ్స్‌లో, ల్యాప్ టాప్ల్లో సినిమాను చూసేసి.. ‘సినిమా బాగా వచ్చింది.. మీరేం భయపడకండి’ అని ఫోన్ చేసి మరీ మాకు ధైర్యాన్ని చెప్పారు. వారి రియాక్షన్ చూసి నవ్వాలో ఏడ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మా పరిస్థితి ఉంటే... ఎద్దు పుండు కాకికి రుచి అన్నట్టుంది వారి పని. అయితే... సినిమా పైరసీకి గురికాగానే... ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌వారు స్పందించి, చర్యలు తీసుకున్న తీరు మాత్రం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. *** మీ ప్రేమాభిమానాలకు ప్రతిగా నా ప్రాణాలివ్వలేనా.. అనేక నెలలు కష్టపడి ఈ సినిమా తీశాం. మూడేళ్లు కష్టపడి త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ తయారు చేశాడు. 60 కోట్ల రూపాయలు వెచ్చించి బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని తీశారు. ఇన్నిరకాల వ్యయప్రయాసలకోర్చి తీసిన సినిమా రాత్రికి రాత్రి పైరసీకి గురయ్యిందంటే పనిచేసిన వారికి ఎలా ఉంటుంది చెప్పండి? నేను ‘గబ్బర్‌సింగ్-2’ స్క్రిప్ట్ విషయమై గోవాలో ఉన్నాను. సడన్‌గా త్రివిక్రమ్ నుంచి ఫోన్. సినిమా నెట్లో వస్తోందని. షాక్‌కి గురై.. వెంటనే బయలుదేరా. నిజానికి ఈ సినిమా విజయంపై మాకు ఎలాంటి సందేహాలు లేవు. ప్రతి ఒక్కరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పైరసీకి గురవ్వగానే మా మైండ్‌సెట్టే మారిపోయింది. ఒకసారి బయటకెళ్లిన సినిమాను ఇక థియేటర్లలో జనాలు ఏం చూస్తారు అనే టెన్షన్. కానీ మా సందేహాలను పటాపంచలు చేశారు నా ఫ్యాన్స్. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. మీరు లేకపోతే నేను ఉండగలనా? నా తల్లిదండ్రులు, నా అన్న, వదినల తర్వాత నాకు శక్తినీ సామర్థాన్నీ భరోసానీ ఇచ్చింది మీరు కాదా? మీరు చూపించే ప్రేమాభిమానాలకు ప్రతిగా నా ప్రాణాలివ్వలేనా? *** రైతుగా బతకాలనే కోరిక ఇంకా బలంగానే ఉంది నేను నటుణ్ణి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. రైతుగా బతకాలనుకున్నాను. అది కూడా అర ఎకరం పొలం దొరికితే చాలు మొక్కలేసుకొని బతికేద్దాం అనుకున్నాను. కానీ విధి నన్ను నటుణ్ణి చేసింది. మొదటి సినిమా ‘అక్కడబ్బాయి- ఇక్కడమ్మాయి’ ఏదో మొక్కుబడిగా చేసేశాను. రెండో సినిమా ‘గోకులంలో సీత’ నాకు నచ్చింది. నా సొంత నిర్ణయంతో చేసిన ‘తొలిప్రేమ’ నన్ను పూర్తిస్థాయి నటుడిగా మార్చింది. ‘ఖుషి’ నుంచి నా మైండ్ సెట్ మారింది. నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగానే బతకడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు కూడా ఎదుర్కొన్నాను. అందులో ‘అత్తారింటికి దారేది’ పైరసీ ఓ పరీక్ష. కానీ ప్రతి విషయానికీ వణికిపోయే తత్వ కాదు నాది. *** అందుకే సమంతను అందరూ ఇష్టపడుతున్నారు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో అవయవాలు కోల్పోయిన అభాగ్యుల గురించి ప్రభుత్వం మరిచిపోయింది. రాజకీయనాయకులు కూడా మరిచిపోయారు. కానీ సమంత మరిచిపోలేదు. తన వంతు సహాయంగా ఇద్దరికి కృత్రిమ అవయవాలను డొనేట్ చేసింది. ఇంకా చేయడానికి సిద్ధమని చెప్పింది కూడా. అందుకే ఆ అమ్మాయిని అందరూ ఇష్టపడుతున్నారు. *** త్రివిక్రమ్ రుణం ఎలా తీర్చుకోవాలి ‘జల్సా’ తర్వాత త్రివిక్రమ్ భావజాలం, నా భావజాలం బాగా కనెక్ట్ ఆయ్యాయి. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో కూడిన కథ దొరికితే చేద్దాం అనుకుంటున్న సమయంలో త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ కథ చెప్పాడు. అత్త పాత్రలను చులకనగా చూపిస్తున్న నేటి తరుణంలో మేనత్త అంటే తల్లితో సమానం అని చెప్పిన సంస్కారవంతుడు త్రివిక్రమ్. విలువలతో కూడిన సినిమా తీసి అటు ప్రేక్షకులకు, ఇటు నాకు ఆనందాన్ని అందించిన నా మిత్రుడు, ఆత్మీయుడు త్రివిక్రమ్ రుణం ఎలా తీర్చుకోవాలి. *** కోట్లమందికి కృతజ్ఞత చెప్పుకోవడానికే... ‘ఖుషి’ తర్వాత సరైన సినిమా రాలేదు. కానీ సినిమాలు చేశానంటే కారణం అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమే. నేను జయాలకు పొంగిపోను, అపజయాలకు క్రుంగిపోను. పదేళ్ల తర్వాత ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తగిలినా... నేను సక్సెస్మీట్లు పెట్టలేదు. సినిమాల్లో నటించడం తప్ప సక్సెస్ మీట్లు పెట్టడం నాకు తొలినుంచి ఇష్టంలేదు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సక్సెస్ మీట్ కావాలనిపించింది. కోట్లమందికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఓ వేదికగా ఈ వేడుక నాకు ఉపయోగపడింది’’ అని పవన్ ఆద్యంతం ఉద్వేగంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇంకా త్రివిక్రమ్, కోట, బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బీవీఎస్ఎన్ ప్రసాద్, అలీ, రావు రమేష్, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు మాట్లాడారు. -
ఇది పైరసీ కాదు.. నామీద చేసిన కుట్ర: పవన్ కళ్యాణ్
'సహిస్తా.. భరిస్తా.. అవసరమతే తాటతీస్తా' అంటూ పవన్ కళ్యాణ్ తన 'అత్తారింటికి దారేది' సక్సెస్ మీట్లో తొడగొట్టారు. సినిమా విడుదలకు ముందే పైరసీ సీడీలు మార్కెట్లోకి విడుదల కావడం కేవలం తమ మీద చేసిన కుట్రేనని ఆయన మండిపడ్డారు. తాను అందరి సంగతి చూసుకుంటానని చెబుతూ.. అది ఏస్థాయి వాళ్లయినా వారికి తగిన శాస్తి జరుగుతుందన్నారు. సోమవారం రాత్రి జరిగిన సినిమా సక్సెస్ మీట్లో పవన్ ఇలా మాట్లాడారు... ''పైరసీని బయటి జనం చూడలేదేమో గానీ, చిత్రపరిశ్రమలో చాలామంది ప్రముఖులు చూసేశారు. ఇండస్ట్రీని నమ్ముకున్నవాళ్లు, పరిశ్రమే వాళ్ల కుటుంబాలకు ఆధారం అయినవాళ్లు మాత్రం పైరసీని బాగానే ప్రోత్సహించారు. సినిమాను ఐప్యాడ్‌లోకి, డెస్క్‌టాప్ లోకి డౌన్లోడ్ చేసుకుని మరీ చూశారు. పోని చూసి వదిలేశారా.. మాకు ఫోన్ చేసి, మీరేం భయపడక్కర్లేదు సినిమా చాలాబాగుందనేసరికి వాళ్లను చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఒక్కళ్లు, ఇద్దరయితే పేర్లు చెప్పచ్చు. కానీ ఎంతమందని చెప్పాలి? అలా వింటూ కూర్చున్నాం. అసలు వీళ్లకి కామన్ సెన్స్ ఉందా? ఎద్దుపుండు కాకికి రుచి.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నాం. కంచే చేను మేసినట్లుగా, ద్రోహం చేసింది బయటివారు కాదు.. లోపలివాళ్లే. ఇది పైరసీ అనిపించట్లేదు.. ఇదో కాన్స్పిరసీ. నిజంగా పైరసీ చేయాలనుకుంటే 50 రోజులు అలా గుప్పెట్లో పెట్టుకోరు. ఎవరి మాటలు విని వీళ్లు పైరసీ చేశారో, వాళ్లందరినీ నేను సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఈ పైరసీని చెయ్యమని ఎవరైతే ప్రోత్సహించారో.. వాళ్లందరినీ రాబోయే సంవత్సరాల్లో పేరుపేరునా గుర్తుపెట్టుకుంటా. వాళ్లు ఏ స్థాయివాళ్లయినా సరే.. అందరికీ ఎలాంటి న్యాయం జరగాలో అలాంటి న్యాయం జరిగేలా చూస్తాను. సహిస్తా.. భరిస్తా..అవసరమైతే తాటతీస్తా'' అని పవన్ అన్నారు. అయితే.. పవన్ ప్రసంగం మొత్తమ్మీద వివాదాస్పద విషయం మరోటి ఉంది. చలన చిత్ర అభివృద్ధి మండలి (ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ -ఎఫ్డీసీ) సభ్యులలో కొంతమంది కూడా పైరసీ సినిమా చూసేశారని, వాళ్లు ఆ తర్వాత తనకు నేరుగా ఫోన్ చేసి, సినిమా బాగుంది కాబట్టి పైరసీ గురించి ఏమాత్రం భయపడొద్దని చెప్పారన్నారు. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. చివరకు ఎఫ్డీసీ సభ్యులు కూడా పైరసీ సినిమాలు చూస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందని అనుకోవాలా? లేదా... పైరసీ సినిమాలను ఎవరెవరు చూశారన్న విషయం కూడా.. అంటే పేర్లు కూడా ఆయనకు తెలిసినా పోలీసులకు చెప్పకుండా ఊరుకున్నందుకు ఆయన నిజాయితీని కూడా అనుమానించాలా అని టాలీవుడ్ వర్గాలు విస్తుపోతున్నాయి. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా పవన్ చాలా నిజాయితీగా ఉంటారని అత్తారింటికి సినిమా దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు సందర్భాల్లో చెప్పారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పేర్లు బయటపెట్టకపోవడంతో పవన్ మీద విమర్శలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. -
స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నా: నాగార్జున
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేదీ' సినిమా పరిశ్రమకు ఒక దారి చూపించిందని 'కింగ్' నాగార్జున అన్నారు. మంచి సినిమాను పైరసీ ఆపలేదని ఈ చిత్రం నిరూపించిందన్నారు. నేడు జరిగిన 'భాయ్' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను భారీగా చేయాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇందుకు కొంచెం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ధూం ధాంగా చేద్దామనుకున్నామని, స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నానని వెల్లడించారు. హీరోయిన్లు కూడా రెడీ అయ్యారని అన్నారు. అయితే సమయాభావం వల్ల ఇవన్నీ చేయలేకపోయామని వివరించారు. 'భాయ్' సినిమాను 25న విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్.. బ్యాంకాక్‌లో మ్యూజిక్ సిట్టింగ్‌లో ఉండడం వల్ల ఆడియో ఫంక్షన్ రాలేకపోయాడని తెలిపారు. అత్తారింటికి దారేదీలో దేవీశ్రీ ప్రసాద్ ఒక పాటలో బాగా నటించాడని నాగార్జున కితాబిచ్చారు. ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రమ్, హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు -
కొత్త సినిమాలు ఒప్పుకోను : సమంత
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని కథానాయికలందరూ చూస్తుంటే సమంత మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇక కొత్త సినిమాలను ఒప్పుకోనని ట్విట్టర్ ద్వారా కరాఖండీగా చెప్పేశారు. ఇంకా చెబుతూ -‘‘ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేయడమే నా ముందున్న లక్ష్యం. కొత్త సినిమాలు అంగీకరించలేను. ఒక వేళ చేయాల్సి వస్తే... అది గొప్ప కథ అయ్యుండాలి. నా పాత్ర తీరుతెన్నులు పొందికగా ఉండాలి. నటిగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చే పాత్ర అయ్యుండాలి. అలాంటి పాత్రలు లభిస్తేనే సైన్ చేస్తాను. అంతేతప్ప అంతంతమాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రం చేయలేను’’ అని సమంత చెప్పారు. సమంత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలీయమైన కారణం ఉందని, తను పెళ్లి ఆలోచనలో ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది’ విజయంతో మంచి జోష్ మీదున్న సమంత... ‘రామయ్యా... వస్తావయ్యా’తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. ఇంకా ఆటోనగర్‌సూర్య, మనం, రభస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. -
‘అత్తారింటికి’ నకిలీ సీడీలు
బెంగళూరు, న్యూస్‌లైన్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నకిలీ డీవీడీలు, సీడీలు న గరంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. పవన్ కల్యాణ్, సమంత, ప్రణిత కాంబినేషన్లో దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమా విడుదలకు ముందే సీడీలు బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సినిమా విడుదలై భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్న సమయంలో నకిలీ డీవీడీలు, సీడీలు మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. బెంగళూరు నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా పైరసి సీడీలు విక్రయించడంతో అభిమానులతో పాటు థియేటర్ల యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చూసి చూడన ట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా నకిలీ డీవీడీలు విక్రయించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. -
'అత్తారింటికి దారేది' సినీ పరిశ్రమకే దారి చూపింది: రాజమౌళి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న ఉద్వేగ పరిస్థితుల నడుమ విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించడం చిత్ర పరిశ్రమకు పెద్ద ఉపశమనం కలిగించిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. బాహుబలి సినిమా షూటింగ్‌తో ప్రస్తుతం బిజీగా ఉన్న రాజమౌళి ఆదివారం తీరిక చేసుకుని అత్తారింటికి దారేది (ఏడీ) సినిమా చూశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని పవన్‌ను, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. 'ఏడీ సినిమా కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూశా. పవర్ స్టార్ నటన బాగుంది. కాటమ రాయుడా పాట నాకు బాగా నచ్చింది. త్రివిక్రమ్, పవన్‌కు ఇద్దరికీ అత్యుత్తమ చిత్రమిది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏడీ ఇతర సినిమాల విడుదలకు దారి చూపించింది' అని రాజమౌళి ట్వీట్ చేశారు. More than anything else, AD paved the way for the release of films in these difficult times. This is a big relief for the entire industry. — rajamouli ss (@ssrajamouli) September 29, 2013 Powerstar all the way…ninnu choodagane and katamarayuda are my best moments..one is Trivikram garu at his best one is PSPK at his best.. — rajamouli ss (@ssrajamouli) September 29, 2013 -
ఆత్మహత్య చేసుకోవాలనున్నా: త్రివిక్రమ్ శ్రీనివాస్
'అత్తారింటికి దారేది' సినిమా పైరసీ సీడీలు బయటకు రావడంతో ఆత్మహత్యే శరణ్యమనుకున్నామని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. తానెంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా దొంగదారిలో బయటకు రావడంతో ఆత్మహత్య ఒకటే మార్గమనుకున్నానని వెల్లడించాడు. తన స్థానంలో ఎవరున్నా ఇలాగే ఆలోచించేవారని పేర్కొన్నారు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా విడుదలకు ముందే అక్రమ మార్గంలో బయటకు వస్తే చావు తప్ప మరో మార్గం ఉండదన్నారు. ఇప్పటికే సినిమా బయర్లకు అమ్మేసినప్పటికీ డబ్బులు ఇంకా చేతికి రాలేదని చెప్పారు. 'పైరసీ సీడీలు బయటకు వచ్చాయని తెలిసిన వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాం. సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాం. వారు గొప్పగా స్పందించారు. 36 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ సమస్యను దశలవారిగా అధిగమించుకుంటూ వచ్చాం. క్షణక్షణం ఉత్కంఠకు గురయ్యాం. తర్వాత ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడింది. పవన్ కళ్యాణ్ అభిమానులు సీడీల పంపిణీని సమర్థవంతంగా అడ్డుకున్నారు. అలాగే ఇంటర్నెట్ డౌన్లోడ్ లింకులను ఆపేశారు. ఆ మూడు రోజులు నరకం అనుభవించాను. అయితే సినిమా విడుదలయిన తర్వాత ప్రేక్షకుల స్పందన చూసి కష్టాలన్నీ మర్చిపోయాను' అని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పైరసీ వ్యవహారంతో నిర్మాతకు తాను, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తిరిగిచ్చేశారని వచ్చిన ఊహాగానాలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించలేదు. -
అత్తారింటికి దారివ్వమంటున్న సమైక్యవాదులు
-
అత్తారింటికి దారివ్వమంటున్న సమైక్యవాదులు
విశాఖ : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా విడుదల విశాఖలో ఉద్రిక్తతకు దారితీస్తోంది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని సమైక్యవాదులు చెప్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సినిమాను అడ్డుకోనీయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోని వి మ్యాక్స్ థియోటర్ దగ్గర గందగోళ పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. అత్తారింటికి దారేది చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పైరసి వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇక ఆగస్ట్ లో విడుదల కావల్సిన ఈ సినిమా రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఓవైపు సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజలు పోరాడుతుంటూ కేంద్రమంత్రి చిరంజీవి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని.... అందుకు నిరసనగానే తాము ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ చిత్రాన్ని అడ్డుకుంటామని సమైక్యవాదులు స్పష్టం చేశారు. -
గీత స్మరణం
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ (2) కాటమరాయడ కదిరీ నరసింహుడనేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ (2) సేప కడుపున సేరి పుట్టితీ రాకాసిగాని కోపాన సీరికొట్టితీ ఓపినన్ని నీళ్లలోన యెలసియేగ తిరిగినీవు బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ (2) చిత్రం : సుమంగళి (1940) రచన : సముద్రాల సీనియర్ సంగీతం : చిత్తూరు వి. నాగయ్య గానం : గౌరీపతిశాస్త్రి హేయ్... కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా (3) మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా (2) బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా... సేపకడుపు సీరి బుట్టితి రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ హెయ్... హెయ్... హెయ్... బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా... కోటిమన్ను నీళ్లలోన యెలసి యేగమై తిరిగి కోటిమన్ను నీళ్లలోన... హెయ్... హెయ్... హెయ్... బాపనోళ్ల చదువులెల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ (2) బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా... సేపకడుపు సీరి బుట్టితి రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా... హో... య్యా... చిత్రం : అత్తారింటికి దారేది (2013) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : పవన్ కళ్యాణ్ వాహినీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం సుమంగళి (1940). ఈ చిత్రానికి సముద్రాల వారు మాటలు, పాటలు అందించారు. సంగీత దర్శకునిగా చిత్తూరు నాగయ్యకి ఇది రెండవ చిత్రం. ఈ చిత్రంలోని ‘కాటమ రాయుడా’ పాట సాహిత్యంలో కొన్ని మార్పులు చేసి ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడటంతో ఇప్పటికే యూట్యూబ్‌లో కొన్ని లక్షల క్లిక్స్ సంపాదించుకుంది. -
అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు
-
అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు
విజయవాడ: 'అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా పోలీసులు అయిదుగురిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పి ప్రభాకర రావు వారిని విలేకరుల ముందు హాజరుపరిచారు. పది సంవత్సరాల నుంచి సినిమా ప్రొడక్షన్ విభాగంలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న చీకటి అరుణ్ కుమార్ సూత్రదారిగా తేలింది. డివిడిలు ఇతరులకు చేరడానికి ప్రధాన కారకులు ఎపిఎస్పి కానిస్టేబుళ్లుగా గుర్తించారు. ఈ సినిమా విడుదల కాకముందే సిడిలు విడుదలయిన విషయం తెలిసిందే. ఎస్పి చెప్పిన కథనం ప్రకారం అరుణ్ కుమార్ 'అత్తారింటికి దారేది’ చిత్రంకు ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఆ సినిమా ఫైల్ ఉంచిన కంప్యూటర్ పాస్వర్డ్ కూడా ఇతని దగ్గర ఉంటుంది. దాంతో అతను రెండు డివిడిలలో ఆ చిత్రాన్ని కాపీ చేశాడు. ఆ రెండు డివిడిలను చూడటానికి మిత్రులకు ఇచ్చాడు. సినిమా చూసిన తరువాత సివిడిని విరగగొట్టమని వారికి చెప్పాడు. మిత్రులు ఆ డివిడిలను విరగొట్టకుండా ఇతరులకు ఇచ్చారు. ఈ డివిడిలు ప్రసన్న కుమార్ అనే కానిస్టేబుల్ నుంచి అనూక్ అనే కానిస్టేబుల్ వద్దకు చేరాయి. అతని వద్ద నుంచి ఎపిఎస్పి పోలీస్ కానిస్టేబుల్ కట్టా రవి కుమార్ ఎలియాస్ రవి వద్దకు చేరాయి. అతను వాటిని ఈ నెల 14న కొరియర్లో ద్వారా పెడనుకు పంపాడు. అవి పెడనులోని ఊటుకూరు సుధీర్ కుమార్ తీసుకున్నారు. అతని దగ్గర నుంచి వీరంకి సురేష్ కుమార్ వద్దకు, ఆ తరువాత దేవి మోబైల్ సెల్ రిపేర్ షాపు యజమాని కొల్లిపర అనీల్ కుమార్ వద్దకు చేరాయి. అక్కడ నుంచి మార్కెట్లో వచ్చేశాయి. నిర్మాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెడన, మచిలీపట్నంలలో దాడులు చేసి సిడిలను స్వాధీనం చేసుకున్నారు. ఐటి, కాపీరైట్ చట్టం, చీటింగ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. బందరు సిఐ పల్లంరాజు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన ఈ సినిమా పైరసీ సీడీని 50 రూపాయలకే అమ్మకాలు సాగించిన తీరుపై సోమవారం పెడన, బందరులో దాడులు చేసి పలు ఇంటర్నెట్, సెల్‌పాయింట్లు నుంచి కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. మంగళవారం సుమారు 30 మందిని విచారించారు. వారిలో 12 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అయిదుగురిని అరెస్ట్ చేశారు. ఈ సినిమా పైరసీ సీడీలు పెడనలో దొరుకుతున్నాయని, ఒక టీవీ చానల్‌కు అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌తో కలకలం రేగింది. చిత్ర నిర్మాత రెండు హైదరాబాద్‌లో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాలతో డీఎస్పీ కేవీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీస్ ప్రత్యేక బృందాలు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్లు, సీడీ షాపులపై దాడులు చేశారు. ఈ సంగతి తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున మొబైల్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గుమిగూడారు. ఓ చానల్ ప్రతినిధులు ఎస్పీ ప్రభాకరరావుకు సీడీని అందజేశారు. ఆయన ఆదేశంతో బందరు డీఎస్సీ డాక్టర్ కేవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ పల్లంరాజు పలువురు ఎస్సైలు మొబైల్ షాపులను తనిఖీ చేశారు. తొలుత దేవీ మొబైల్స్ షాపును పరిశీలించగా అక్కడేమి దొరకలేదు. దీంతో సీఐ పల్లంరాజు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, ఇంటర్నెట్ కంప్యూటర్ షాపులను తనిఖీ చేసి షాపుల్లో ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. -
‘అత్తారింటికి దారివ్వం..’
తార్నాక: తెలంగాణ ఏర్పాటు కాకుండా తరచూ అడ్డుపడుతున్న కేంద్రమంత్రి చిరంజీవి వైఖరికి నిరసనగా ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్ నటించిన చిత్రం ‘అత్తారింటికి దారేది..’ని అడ్డుకుంటామని ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. మంగళవారం ఓయూలో జరిగిన జేఏసీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజు, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు నెహ్రూనాయక్, ఓయూ అధ్యక్షుడు రవిలు విలేకరులతో మాట్లాడారు. మొదట సామాజిక న్యాయం అని ప్రగల్బాలు పలికి న చిరంజీవి.. మాటమార్చి 1500మంది తెలంగాణ విద్యార్థుల మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రాం తంలో పవన్‌కళ్యాణ్ సినిమాను ప్రదర్శించొద్దని థియేటర్ల యజమానులకు విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు సిని మాను కొనవద్దని హెచ్చరించారు. -
‘అత్తారింటికి దారేది’ పైరసీ కలకలం
సాక్షి (మచిలీపట్నం/పెడన), న్యూస్‌లైన్ : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు సమైక్య సెగ ఇబ్బందికరంగా మారిన తరుణంలో పైరసీ భూతం మరింత కలవరపెడుతోంది. ఈ సినిమా రూ.50లకే పైరసీ సీడీలు పెడనలో దొరుకుతున్నాయని, ఒక టీవీ చానల్‌కు అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌తో కలకలం రేగింది. విడుదలకు ముందే ఈ సినిమా పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చాయన్న ప్రచారం జరగడంతో చిత్ర నిర్మాత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. కాగా, సదరు టీవీ చానల్ దీనికి మరింత మసాలా దట్టించి, పైరసీ సీడీలు కృష్ణా జిల్లా పెడనలో దొరుకుతున్నట్లు ప్రత్యేక కథనాన్ని ప్రచారం చేసింది. దీంతో ఎలక్ట్రానిక్ మీడియా వ్యాన్లు సోమవారం పెడనలో చక్కర్లు కొట్టాయి. ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాలతో డీఎస్పీ కేవీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీస్ ప్రత్యేక బృందాలు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్లు, సీడీ షాపులపై దాడులు చేశారు. ఎక్కడా పైరసీ సీడీలు దొరక్కపోయినప్పటికీ పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున మొబైల్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గుమిగూడారు. ర్యాలీలు చేస్తూ పెడన బస్టాండ్ సెంటర్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పైరసీని అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. అత్తరింటికి దారేదీ సినిమా సీడీ పెడనలోని మొబైల్ షాపుల్లో దొరుకుతోందని రెండు రోజుల క్రితం ఒక టీవీ చానల్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సినిమా నిడివి (1.5 మెగా బైట్స్) 65 నిమిషాలు పాటు ఉంటుందని, దాన్ని సీడీలు, సెల్ మెమరీ కార్డుల్లోకి కాపీ చేసి రూ.50కి అమ్ముతున్నట్టు చెప్పాడు. తాను వడ్లమన్నాడు గ్రామానికి చెందిన రమేష్ అని, పెడనలోని గూడూరు రోడ్డులో దేవీ మొబైల్ షాపులో కొనుగోలు చేశానన్నాడు. కాగా, పైరసీ సీడీల్లో ఆ సినిమా మొదట నుంచి చివరి వరకు ఉందని మధ్య మధ్యలో కొన్ని బిట్లు లేవని సీడీలు చూసిన కొంత మంది తెలిపారు. దీనిపై ఓ చానల్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావుకు సీడీని అందజేశారు. ఆయన ఆదేశంతో బందరు డీఎస్సీ డాక్టర్ కేవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ పల్లంరాజు పలువురు ఎస్సైలు మొబైల్ షాపులను తనిఖీ చేశారు. తొలుత దేవీ మొబైల్స్ షాపును పరిశీలించగా అక్కడేమి దొరకలేదు. దీంతో సీఐ పల్లంరాజు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, ఇంటర్నెట్ కంప్యూటర్ షాపులను తనిఖీ చేసి షాపుల్లో ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా టీవీ చానల్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వ్యక్తి నంబరు మనుగడలో లేదని విచారణలో తేలింది. యూ ట్యూబ్ ద్వారా వచ్చిందా? ఇటీవలే అత్తారింటికి దారేదీ సినిమా అడియో ఫంక్షన్ హైదరాబాదులో జరిగింది. ఆ సమయంలో కొన్ని ైట్రెలర్స్ను విడుదల చేశారు. అలాంటి వాటినన్నింటినీ కలిపి యూట్యూబ్‌లో పెట్టి ఉండవచ్చని, పలువురు యువకులు నెట్ సహాయంతో డౌన్లోడ్ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో సినిమా విడుదల కాకుండనే సినిమా సీడీ బహిరంగ మార్కెట్లోకి వచ్చిందని పుకార్లు వచ్చి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. లోతుగా దర్యాప్తు : డీఎస్పీ ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు బందరు డీఎస్పీ కేవీ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. పెడనలో పలు మొబైల్ షాపులను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు దొరక లేదన్నారు. పలు షాపుల యజమానులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లు, మెమరీ కార్డులను ఐటీ నిపుణులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందించిన వ్యక్తి వడ్లమన్నాడు గ్రామానికి చెందినతనుగా చెప్పడంతో అక్కడ ఉన్న నాలుగు మొబైల్ షాపులను పరిశీలించి అక్కడ వారిని కూడా అదుపులోకి తీసుకున్నటుల తెలియజేశారు. టీవీ చానల్‌కు వచ్చిన ఫోన్ నంబరును సేకరించామని, ఆ నంబరు రెండు రోజులుగా పనిచేయడం లేదని తెలిపారు. అయితే ఆ నంబరు కాల్స్ లిస్టును సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భగ్గుమన్న పవన్ ఫ్యాన్స్.. పైరసీ సీడీల విషయమై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. వందల సంఖ్యలో అభిమానులు బస్టాండ్ ఎదుట గంట సేపు చిలంకుర్తి పృద్వీ ప్రసన్న నేతృత్వంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న విలేకరులతో మాట్లాడుతూ ఏ హీరో సినిమాను పైరసీ చేస్తే ఊరుకునేది లేదన్నారు. కోట్లాది రుపాయలు ఖర్చు చేసి సినిమాలు తీస్తే.. థియేటర్లోకి వెళ్లి చూడకుండా పైరసీ సీడీలు కొనుగోలు చేసి చూడటం దౌర్భాగ్యం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. -
అత్తారింటికి దొంగదారి!!
సినిమా అంటే కోట్లాది రూపాయల పెట్టుబడి.. వందలు, వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల శ్రమ ఫలితం. ఎంతోమంది అభిమానుల ఆశలకు ప్రతిరూపం. ఒక హీరో.. ఒక హీరోయిన్.. ఓ దర్శకుడు.. నిర్మాత.. ఇలా ప్రతి ఒక్కరికీ జీవన్మరణ పోరాటం. అలాంటి సినిమాలు.. విడుదలైన రెండు మూడు రోజులకే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఓ మాదిరి సినిమాలైతే మరీ దారుణంగా విడుదలైన రోజు సాయంత్రమో, మర్నాడో వచ్చేస్తున్నాయి. సినిమాలు పాత రికార్డులను తిరగరాస్తున్నాయంటే, అటు కలెక్షన్లలోనో.. ఇటు ఎక్కువ రోజులు ఆడటంలోనో అనుకుంటాం. కానీ 'అత్తారింటికి దారేది' చిత్రం మాత్రం మరో కొత్త మార్గంలో చరిత్రను తిరగరాసింది. అసలు సినిమా ప్రివ్యూ వేయకముందే, కనీసం యూనిట్ సభ్యుల కోసం వేసే ప్రదర్శన కూడా వేయకముందే పైరసీ సీడీ మార్కెట్లోకి వచ్చేసింది. ఫస్టాఫ్ సినిమా మొత్తాన్ని సీడీ రూపంలోకి మార్చేసి 50 రూపాయల చొప్పున అమ్మేశారు!! అది కూడా ఏ మెగా నగరాల్లోనో కాదు.. కృష్ణా జిల్లాలో ఎక్కడో మారుమల ఓ మండల కేంద్రమైన పెడన అనే ఊళ్లో. పెడన ప్రాంతం సాధారణంగా అయితే కలంకారీ పరిశ్రమకు పెట్టింది పేరు. చీరలు, పంజాబీ డ్రస్సుల మీద అద్దకం వేయడంలో ఈ ప్రాంతం వారిది అందెవేసిన చేయి. కానీ ఇప్పుడు సినిమాలను కూడా అలా అద్దకం అద్దేసినట్లు తేలింది!! ఎడిట్ రూంలో కూర్చున్న ఎవరో తన మిత్రులకు దాన్ని చూపించేందుకు యూట్యూబ్‌లో 90 నిమిషాల పాటు పెట్టగా, ఈలోపే దాన్ని చూసిన కొంతమంది దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసేసి.. పైరసీ సీడీలుగా రూపొందించారు. దాంతో ఆ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు పైరసీదారులపై డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఒక తల్లి బిడ్డను ప్రసవించడానికి ఎన్ని కష్టాలు పడుతుందో.. పుడమి తల్లి కడుపు చీల్చుకుని ఒక మొక్క పైకి వచ్చి, పెరిగి పెద్దదై ఫలాలు ఎలా ఇస్తుందో.. అలా, అన్ని కష్టాలు పడి మరీ ఒక సినిమాను విడుదల చేస్తారు. ఆ సినిమా ఎలా ఆడుతుందోనని అంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ప్రేక్షకుల ఆదరణ బాగుందంటే అందరికీ ఆనందమే. కానీ ఆ ఆనందాన్ని కాస్తా ఈ పైరసీ సీడీలు ఆవిరి చేసేస్తున్నాయి. కోట్ల రూపాయల కష్టాన్ని ఐదు రూపాయలకు దొరికే సీడీలోకి రైట్ చేసి, ఇట్టే అమ్మేస్తున్నారు. దీని గురించి గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహా అనేకమంది అగ్రహీరోలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇప్పటికీ పైరసీ భూతాన్ని అదుపులోకి తీసురాలేకపోయారు. ఎక్కడికక్కడ ఏదో ఒక రూపంలో ఇది బయట పడుతూనే ఉంది. అమెరికాలోనో.. అలాస్కాలోనో .. ఆఫ్రికాలోనో పైరసీ సీడీలు బయటపడుతూనే ఉన్నాయి. తమిళంలో అయితే అచ్చంగా పైరసీ, ఇతర వ్యవహారాల మీద 'అయ్యన్' అనే సినిమా కూడా విడుదలైంది. దాన్ని తెలుగులోకి 'వీడొక్కడే' పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయగా, అది కూడా సూపర్ హిట్ అయ్యింది. యాంటీ పైరసీ స్క్వాడ్ పేరుతో కొన్ని దళాలు వచ్చినా.. సైబర్ క్రైం పోలీసులు కూడా దీనిపై ఉక్కుపాదం మోపినా, ఇంకా విడుదల కాకముందే సీడీలు విడుదల కావడం పైరసీకి పరాకాష్ఠ. -
రామయ్యా వస్తాడా... అత్తారింటికి వెళ్తాడా?
టాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాతలను సమైక్యాంధ్ర ఉద్యమం గందరగోళంలో పడేసింది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతుండటంతో భారీ చిత్రాల విడుదలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చిత్ర పరిశ్రమకు ప్రతికూలంగా మారడంతో అగ్రనిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొద్దికాలం క్రితం తెలంగాణలో ఉద్యమ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన నిర్మాతలు.. కాస్తా తేరుకుని ఊపిరి పీల్చుకునే సమయంలోనే రాష్ట్ర విభజన ప్రకటన మళ్లీ ఇబ్బందుల్లోకి వారిని నెట్టింది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం భగ్గుమంది. అయితే రాష్ట్ర విభజన సమస్యకు తొందర్లోనే పరిష్కారం దొరుకుందని, త్వరలోనే సినిమాల విడుదల చేయవచ్చని ఆశించిన నిర్మాతలకు చుక్కెదురైంది. పలుమార్లు చిత్ర విడుదల తేదిన ప్రకటించి.. వాయిదా పరిస్థితి తెలెత్తింది. విడుదల తేదిని ప్రకటించిన వాయిదా వేసిన వాటిలో ఎవడు, అత్తారింటికి దారేది? రామయ్యా వస్తావయ్యా లాంటి భారీ చిత్రాలున్నాయి. ఓ దశలో ఓ చిత్ర నిర్మాతకు పెద్ద మొత్తంలో టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని అనధికారికంగా వార్తలు వెలువడ్డాయి. అయితే విడుదల వాయిదా పడి.. నెలకు పైగా వేచి ఉండాల్సి పరిస్థితి తెలెత్తడంతో ఆర్ధిక సమస్యలు ప్రారంభమైనట్టు తెలిసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే చిత్ర నిర్మాణం నుంచి తప్పుకునేందుకైనా సిద్ధం అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆరంభంలో ఉన్న పరిస్థితి కొంత సద్దుమణిగినట్టు కనిపించగానే చిన్న చిత్రాలు విడుదల జోరందుకుంది. అంతకుముందు..ఆ తర్వాత, పోటుగాడు, కమీనా, కిస్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిన్న చిత్రాలకు సమైక్య ఉద్యమకారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం గమనించిన చిత్ర పరిశ్రమ ప్రముఖులు భారీ చిత్రాల విడుదల తేదిలను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది?', యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రామయ్య వస్తావయ్యా', రామ్ చరణ్ 'ఎవడు' సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో విడుదలకు నోచుకోలేకపోయాయి. అయితే విజయదశమి కానుకగా భారీ చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల అంటేనే టాలీవుడ్ లో భారీ చిత్రాలతో నిజమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేసుకుని నిర్మాతలు కొంత ధైర్యాన్ని కూడగట్టుకుని విడుదల తేదిని ప్రకటించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9 తేదిన అత్తారింటికి దారేది?, 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదలకు సన్నద్దం చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని అక్టోబర్ 10 తేదిన విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10న రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో విడుదలతో భారీ అంచాలు నెలకొన్న అత్తారింటికి దారేది చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్టు నిర్మాత బి.ప్రసాద్ తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తే... సమైక్య ఉద్యమం జోరు ఏమాత్రం తగ్గకపోగా.. సెప్టెంబర్ నెలాఖరుకు మరికొంత ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రాష్ట్ర విభజనపై నోట్ పై కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్పష్టత ఇస్తే.. సీమాంధ్రలో ఉద్యమం మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితే తలెత్తితే..అత్తారింటికి దారేది..రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదల ప్రశ్నార్ధకమే. ఈ నేపథ్యంలో చిత్రాలు మరోసారి వాయిదా పడితే...ప్రేక్షకుల వద్దకు రామయ్యా వస్తాడా.. అత్తారింటికి వెళ్తారా అనేది సందేహమే. మళ్లీ అగ్ర నటుల చిత్రాలు మరోసారి వాయిదా పడితే సినిమా ప్రేక్షకులకు ఈ సంవత్సరపు దసరా సినీ పండుగ వాతావరణం దూరమైనట్టే. -రాజాబాబు అనుముల a.rajababu@sakshi.com -
ఒక్క రోజు వ్యవధిలో రెండు భారీ చిత్రాలు
విడుదల తేదీలు ఓ కొలిక్కి వచ్చాయి. ఎన్నో అంచనాలతో భారీ ఎత్తున తయారవుతోన్న ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాలు అక్టోబర్‌లో ఒక్క రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. ‘అత్తారింటికి దారేది’అక్టోబర్ 9న విడుదల కాబోతుండగా, ‘రామయ్యా వస్తావయ్యా’ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జల్సా’ తర్వాత పవన్‌కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ పాటలు ఇప్పటికే మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక పవన్‌కల్యాణ్ పాడిన ‘కాటమరాయుడా’ పాట యూట్యూబ్‌లో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిం చింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. సమంత, ప్రణీత ఇందులో కథానాయికలు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇక ‘రామయ్యా వస్తావయ్యా’ విషయానికొస్తే... ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హరీష్ శంకర్ చేస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్ ఇందులో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ‘బుడ్డోడా బుడ్డోడా అంటే గుడ్డలూడదీసి కొడతా’ అనే టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పాటలు ఈ వారంలో విడుదల కానున్నాయి. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలు. ‘బృందావనం’తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఎన్టీఆర్, ఈ సినిమాతో యువతకు మరింత చేరువవుతారని నిర్మాత ‘దిల్’రాజు చెబుతున్నారు. -
హేపీ బర్త్ డే పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినంగా సందర్భంగా అత్తారింటికి దారేటి లేటెస్ట్ స్టిల్స్ విడుదల చేశారు. -
గీత స్మరణం
పల్లవి : నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే... అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్లు ఒకటినొకటి తిట్టుకున్నవే... అదేమిటే ॥ ఏమిటో ఏం మాయో చేసినావె కంటిచూపుతోటి ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా ॥ చరణం : 1 అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీశావే భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్టా తిరిగేస్తూ తిరగ రాశావే హే... అలా నువ్వు చీరకట్టి చిందులేస్తే చీమలా నేను వెంటపడనా నావలా నువ్వు తూగుతూ నడుస్తు వుంటే కాపలాకి నేను వెంటరానా కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రా మరదలా ॥ బృందం: అత్తలేని కోడలుత్తమురాలు ఓలమ్మా కోడల్లేని అత్త గుణవంతురాలు కోడలా కోడలా కొడుకు పెళ్లామా ఓలమ్మా పచ్చిపాల మీద మీగడేదమ్మా ఆ వేడిపాలలోన వెన్న ఏదమ్మా చరణం : 2 మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా ఈ పాలసీసా అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా దాని మెరుపు నీలోనే దాగివుందని తెలియలే పాపం ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను తెలుగుభాషలో నాకు తెలిసిన పదాలు అన్నీ గుమ్మరించి ఇంత రాసినాను సిరివెన్నెల మూటలా... వేటూరి పాటలా... ముద్దుగున్నావే మరదలా ॥ చిత్రం : అత్తారింటికి దారేది.. (2013) రచన, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : దేవిశ్రీ ప్రసాద్, బృందం -
థియేటర్లకు దారేది?
పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ మేకింగ్ దశలోనే ఓ సెన్సేషన్. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూపులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నూరైనా ఆగస్టు 7న విడుదలవుతుందనుకున్న ‘అత్తారింటికి దారేది’కి సమైక్యాంధ్ర ఉద్యమం పెద్ద బ్రేక్ వేసింది. బిజినెస్‌తో సహా అన్ని వ్యవ హారాలు పూర్తి చేసుకుని, ఇక సినిమా రిలీజే ఆలస్యం అనుకుంటున్న సమ యంలో, సీమాంధ్రలో మొదలైన ఉద్యమం తాలూకు సెగలతో సినిమా విడుదలను అర్ధాంతరంగా నిలిపేయాల్సి వచ్చింది. ఉద్యమం వల్ల చిన్న సినిమాల విడుదలకు ఎటువంటి ఆటంకం లేకపోయినా, పెద్ద సినిమాల పరిస్థితే చాలా గందరగోళంగా ఉంది. ఎటు వెళ్తే ఏం ముంచుకొస్తుందో అనే శంక దర్శక నిర్మాతలను పట్టి పీడిస్తోంది. అందుకే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు వెనక్కెనక్కు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి కళ్లూ ‘అత్తారింటికి దారేది’ మీదే ఉన్నాయి. ఇప్పటికే ఆడియో సూపర్‌డూపర్ హిట్ కావడంతో సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. ఇప్పటివరకూ తెలుగు చిత్రసీమలోనే అత్యధిక స్థాయిలో ఈ సినిమా బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు. ఇంతకూ అత్తారింటికి వెళ్లడానికి దారి ఎప్పుడు సుగమం అవుతుంది? అందరిలోనూ ఇదే ఉత్కంఠ. ఈ వారమే వస్తోందంటూ వెబ్సైట్లలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఇంతవరకూ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు. సెప్టెంబరు 6న ‘తుఫాన్’ విడుదలవుతోంది. ఆ తరువాతి వారమే ‘అత్తారింటికి దారేది’ విడుదలయ్యే అవకాశం ఉందని ఫిలిమ్‌నగర్ వర్గాల సమా చారం. నిర్మాతలు కూడా అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ సెప్టెంబరు రెండోవారం కుదరకపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ మూడోవారం వచ్చేయాలని అటు పంపిణీదారులు కూడా పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. -
సాక్షి సినిమా 20th August 2013
-
గీత స్మరణం
పల్లవి : ఆమె: ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే మిల్లీమీటరైన వదలకుండ దిల్లో నిండినాడే కళ్లలోన కత్తులున్న తీవ్రవాదిలా మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో... హో పట్టుకో అతడు: Its time to party now... Its time to party now... నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్ ఒంటికొచ్చిన డ్యాన్సేదో చేసెయ్ చేసెయ్ రో బృందం: Its time to party (2) అ: చేతికందిన డ్రింకేదో తాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్ లోకమంతా ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో బృందం: Its time to party (2) అతడు: Come on come on lets chill and thrill and kill it now Come on come on పిచ్చెక్కించేద్దాంరో Come on come on lets rock it shake it break it now Come on come on తెగ జల్సా చేద్దాంరో Its time to party now... Its time to party now రావే ఓ పిల్లా Its time to party now చేద్దాం గోల Its time to party now రావే ఓ పిల్లా మనకంటే గొప్పోళ్లా టాటా బిర్లా ॥దేవుడో॥ చరణం : 1 ఆ: ఎడిసన్‌ను బల్బులోని ఫిలమెంటు వైరు నేను అట్టా నను టచ్ చేశావో ఇట్టా స్విచ్చునౌతాను బృందం: Its time to party (2) అ: మైక్రోవేవ్ మంటలాగా సెలైంటు ఫైరు నేను నువు కొంచెం అలుసిచ్చావో టాలెంటే చూపిస్తాను బృందం: Its time to party (2) హే భాయ్ అబ్బాయ్ లవ్ గాడ్‌కు నువ్వు క్లోనింగా అమ్మోయ్ అమ్మాయ్ తొలిచూపుకే ఇంతటి ఫాలోయింగా ॥Its time to party॥ చరణం : 2 ఆ: మై నేమ్ ఈజ్ మార్గరీటా మాక్టైల్లా పుట్టానంటా చూపుల్తో అందమంతా సరదాగా సిప్ చేయ్మంటా బృందం: Its time to party (2) అ: వాచ్మేనే లేనిచోట వయసే ఒక పూలతోట వెల్కమ్మని పిలిచావంటే తమ్మెదలా వాలిపోతా బృందం: Its time to party (2) ఆ: హల్లో హల్లో అని పిలవాలా నినుపేరెట్టి అ: పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారం కట్టి ॥Its time to party॥ చిత్రం : అత్తారింటికి దారేది.. (2013) రచన : రామజోగయ్యశాస్త్రి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : డేవిడ్ సిమోన్, మాల్గాడి శుభ, బృందం -
పవన్‌కల్యాణ్‌కి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం.
పవన్‌కల్యాణ్‌కి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అందుకు ఉదాహరణగా ‘తమ్ముడు’ చిత్రంలోని ‘నబో నబో నబరి గాజులు..’, ‘గుడుంబా శంకర్’లోని ‘కిళ్లి కిళ్లి కిళ్లి కిళ్లీ.. నమిలాక బాగున్నదే..’, ‘జానీ’లో ‘నారాజు గాకుర మా అన్నయ్య..’లాంటి పాటలను చెప్పొచ్చు. ఆ పాటలకు పవన్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఓ రేంజ్లో అలరించాయి. త్వరలో విడుదల కానున్న ‘అత్తారింటికి దారేది’లో కూడా అలాంటి ఓ పాట ఉంది. ‘కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా...’ అనే ఆ పాట తాలూకు వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇంతకుముందు పలు పాటలను పవన్‌కల్యాణ్ పాడినప్పటికీ వాటి విజువల్స్ బయటికి రాలేదు. కానీ ఈ పాటను పవన్ పాడుతున్నప్పుడు చిత్రీకరించి, ఆదివారం విడుదల చేశారు. ఇప్పటివరకు పవన్ పాడిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. యూ ట్యూబ్‌లో రెండు రోజుల్లోపే ఐదు లక్షలమందికి పైగా ఈ పాటను వీక్షించడం విశేషం. ఆ విధంగా ఇది సూపర్ డూపర్ హిట్టయ్యిందని అంచనా వేయొచ్చు. ఇక, మరో విషయం చెప్పాలంటే.. పాత హిట్ సాంగ్స్‌ని రీమిక్స్ చేయిస్తుంటారు పవన్‌కల్యాణ్. ‘మిస్సమ్మ’లోని ‘ఆడువారి మాటలకు...’ పాటను ‘ఖుషీ’ కోసం రీమిక్స్ చేయించారు. ఆ తర్వాత ‘చిట్టి చెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది..’ పాటను ‘జానీ’ కోసం రీమిక్స్ చేశారు. తాజాగా ‘కాటమ రాయుడు..’ పాట 1940లో విడుదలైన ‘సుమంగళి’లో నుంచి తీసుకున్నది. ఇక.. ఈ చిత్రాన్ని ఈ 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ రోజున సినిమాని విడుదల చేయడంలేదని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రనిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్ ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పవన్ సరసన సమంత కథానాయికగా నటించారు. -
'అత్తారింటికి దారేది' విడుదల వాయిదా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రానికి విభజన సెగ తగిలింది. అత్తారింటికి దారి(విడుదల తేది) తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రం విడుదల సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తొలుత ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత హీరో మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా చిత్రం విడువలను వాయిదావేయాలని నిర్మాతలు అనుకుంటున్నట్లు సమాచారం. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఈ సినిమాను విడుదల చేయడం అంత మంచిదికాదని వారు భావిస్తున్నారు. అవకాశం ఉంటే ఈ నెల 14న విడుదల చేయాలన్న ఆలోచనతో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తేదీ కాకపోతే ఉద్యమ పరిస్థితిని బట్టి వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అంశం చిరంజీవి కుటుంబ హీరోల చిత్రాల విడుదలకు అడ్డుతగులుతోంది. కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారి చిత్రాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. 'అత్తారింటికి దారేది' సినిమాకు ఇబ్బందిలేకుండా ఉండేదుకు గానీ లేక మరే కారణం వల్లనో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన ‘ఎవడు' సినిమా విడుదలను వాయిదా వేశారు. ముందు ప్రకటించిన ప్రకారం ఆ చిత్రం జులై 31న విడుదల కావాలసి ఉంది. దానిని 21కి వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఆ సినిమా 21న విడుదల అవుతుందో లేదో చెప్పడం కష్టం. ‘ఎవడు' కంటే ముందు విడుదల కావలసిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల వాయిదాపడుతుండటంతో పవర్ స్టార్ పవన్ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అదీగాక ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో పూర్తీగా హాస్యరస ప్రధానంగా నిర్మించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. పవన్ - బ్రహ్మానందంల హాస్యం - మహేష్ బాబు అతిధి పాత్ర - పవన్ కల్యాణ్ పాట....అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ పడిన పాటను యుట్యూబ్లో పెడితే కేవలం 24 గంటల్లో 3,70,000 మంది వీక్షించారంటే అభిమానులు ఏ రేంజ్లో ఎదురు చూస్తున్నారో ఊహించుకోవచ్చు. పవన్ అభిమానులతోపాటు ప్రిన్స్ మహేష్ అభిమానులు కూడా తమ హీరో ఎటువంటి పాత్ర పోషించాడో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా, పవన్ అత్తగా నదియా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అత్తారింటికి దారి వెతుకులాటలో ఏ తేది ప్రకటిస్తారో వేచి చూడవలసిందే. అభిమానులకు ఇదో పెద్ద ఆశాభంగం! -
'కాటం రాయుడా'కు పవర్ 'స్టార్' క్లిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గళం విప్పాడు. తమ్ముడు, ఖుషి చిత్రాల్లో జానపద గీతాలు పాడిన అతను తన తాజా చిత్రం 'అత్తారింటికి దారేది'లో ఓ పాట పాడాడు. అలనాటి చిత్రం 'సుమంగళి'లోని 'కాటం రాయుడా' పాటను ఆలపించాడు. ఈ పాట ప్రస్తుతం యుట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో 3,70,000 మంది ఈ వీడియోని వీక్షించారు. ఈ పాటను పవన్ ఈజీగా .... అరగంటలో పాడేశాడట. అయితే చిత్ర యూనిట్ ఆడియో విడుదల చేసేటప్పుడు మాత్రం ఈ పాట గురించి గోప్యంగా ఉంచారు. ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యంలో ముంచేందుకు ఈ పాటను ఇటీవల విడుదల చేసిన ఆడియో ఆల్బంలో పెట్టలేదు. ఇదే విషయాన్ని ఆడియో రిలీజ్ రోజు హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమాలో ఇంకో పాట ఉందని.. అది బయటపెడితే తనను చంపేస్తానన్నారని చెప్పిన విషయం తెలిసిందే. 'అత్తారింటికి దారేది'లో పవన్ సరసన సమంత...ప్రణీత హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈనెల 9న 'అత్తారింటికి దారేదీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరో మహేష్ బాబు కూడా ఓ అతిథి పాత్ర పోషించారు. ఓ పక్క పవన్ పాటతో పాటు, ప్రిన్స్ గెస్ట్ రోల్ చూసేందుకు ఇద్దరు హీరోల అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.