మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా! | The day before yesterday showed erratic .. dots show now! | Sakshi
Sakshi News home page

మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా!

Published Sat, Jun 27 2015 1:28 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా! - Sakshi

మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా!

ఓ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు దాని తాలూకు సన్నివేశమో, పాటో, డైలాగో... ఏదో ఒకటి బయటికి వచ్చేస్తుంటుంది. చిత్రబృందం ప్రమేయం లేకుండా లీకువీరులు ఎలాగోలా వాటిని తస్కరించి, బయటపెట్టేస్తుంటారు. ఇవి ఆ చిత్రబృందానికి మాత్రమే కాకుండా, యావత్ పరిశ్రమనూ షాక్‌కి గురి చేస్తుంటాయ్.
 
 ‘అత్తారింటికి దారేది’ చిత్రం విషయంలో మరీ షాకిచ్చారు లీకువీరులు. విడుదల తేదీ దగ్గర పడ్డాక ఏకంగా సినిమానే లీక్ చేసేశారు. వచ్చే నెల విడుదల కానున్న ‘బాహుబలి’ చిత్రంలోని సన్నివేశం కూడా ఇటీవల బయటకు వచ్చేసి సందడి చేసింది. ఈ చిత్రకథ ఇదేనంటూ ‘వాట్సప్’లో సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ‘గబ్బర్‌సింగ్ 2’ రూపంలో మరో లీక్ తెరమీదకొచ్చింది.
 
 ఈ చిత్రానికి సంబంధించిన సీన్లు, పాటలు కాదు.. డైలాగులు హల్‌చల్ చేస్తున్నాయి. పవన్‌కల్యాణ్ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని సంభాషణలు ప్రస్తుతం ‘వాట్సప్’లో వీర విహారం చేసేస్తున్నాయి. నిజంగానే సినిమాలో ఆ డైలాగ్స్ ఉంటాయే లేదో తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. కానీ, లీకైన డైలాగ్స్ విన్నవాళ్లు మాత్రం అదిరాయంటున్నారు. ఆ డైలాగ్స్‌లో కొన్ని...
 
 1) నేను పంచ్‌లేస్తే విజిల్స్ పడతాయి... అదే నాపైనే పంచ్‌లెయ్యాలని ట్రై చేస్తే నేనిచ్చే కౌంటర్‌కు ఎన్‌కౌంటర్ అవుతావ్...
 2)మొన్న తిక్క చూపించా... ఇప్పుడు చుక్కలు చూపిస్తా... నేను టెంపర్ లాస్ అయితే టెంపో లేకుండా కొడతా
 3)ఎవడు కొట్టినా బ్లడ్ వస్తుంది... కానీ నేను కొడితే బ్లడ్‌తో పాటే
 భయం కూడా వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement