పవర్ స్టార్ను వెనక్కి నెట్టిన అభిమాని
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నితిన్. తన సినిమాల్లో, సినిమా ఫంక్షన్లలో కూడా పవన్ జపమే చేసే నితిన్, ఇప్పుడు తన అభిమాన నటుడి రికార్డ్ను దాటేశాడు. తన తాజా సినిమా అ..ఆ.. కలెక్షన్లతో పవర్ స్టార్కే షాక్ ఇచ్చాడు.. ఈ యంగ్ హీరో. పవన్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమా ఓవర్సీస్ కలెక్షన్లను నితిన్ ఎనిమిది రోజుల్లో దాటేయటం విశేషం.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అత్తారింటికి దారేది. భారీ హిట్గా నిలిచిన ఈ సినిమా ఓవర్సీస్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫుల్ రన్లో 1.89 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి అప్పట్లో టాప్ గ్రాసర్గా నిలిచింది. అయితే ఆ తరువాత విడుదలైన బాహుబలి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో సినిమాలు పవన్ మార్క్ను దాటి ముందు నిలిచాయి. దీంతో పవన్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు.
అయితే పవన్ను ఫోర్త్ ప్లేస్ నుంచి కూడా వెనక్కి నెట్టేశాడు నితిన్. నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ.. కేవలం ఎనిమిది రోజుల్లోనే 1.9 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, ఓవర్ సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. ఇప్పటీ మంచి వసూళ్లను సాధిస్తుండటంతో ఈ సినిమా నాన్నకు ప్రేమతోనూ కూడా వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలవటం కాయం అంటున్నా ట్రేడ్ పండితులు.