gabbar singh-2
-
మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు చుక్కలు చూపిస్తా!
ఓ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు దాని తాలూకు సన్నివేశమో, పాటో, డైలాగో... ఏదో ఒకటి బయటికి వచ్చేస్తుంటుంది. చిత్రబృందం ప్రమేయం లేకుండా లీకువీరులు ఎలాగోలా వాటిని తస్కరించి, బయటపెట్టేస్తుంటారు. ఇవి ఆ చిత్రబృందానికి మాత్రమే కాకుండా, యావత్ పరిశ్రమనూ షాక్‌కి గురి చేస్తుంటాయ్. ‘అత్తారింటికి దారేది’ చిత్రం విషయంలో మరీ షాకిచ్చారు లీకువీరులు. విడుదల తేదీ దగ్గర పడ్డాక ఏకంగా సినిమానే లీక్ చేసేశారు. వచ్చే నెల విడుదల కానున్న ‘బాహుబలి’ చిత్రంలోని సన్నివేశం కూడా ఇటీవల బయటకు వచ్చేసి సందడి చేసింది. ఈ చిత్రకథ ఇదేనంటూ ‘వాట్సప్’లో సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ‘గబ్బర్‌సింగ్ 2’ రూపంలో మరో లీక్ తెరమీదకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన సీన్లు, పాటలు కాదు.. డైలాగులు హల్చల్ చేస్తున్నాయి. పవన్‌కల్యాణ్ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని సంభాషణలు ప్రస్తుతం ‘వాట్సప్’లో వీర విహారం చేసేస్తున్నాయి. నిజంగానే సినిమాలో ఆ డైలాగ్స్ ఉంటాయే లేదో తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. కానీ, లీకైన డైలాగ్స్ విన్నవాళ్లు మాత్రం అదిరాయంటున్నారు. ఆ డైలాగ్స్‌లో కొన్ని... 1) నేను పంచ్‌లేస్తే విజిల్స్ పడతాయి... అదే నాపైనే పంచ్లెయ్యాలని ట్రై చేస్తే నేనిచ్చే కౌంటర్‌కు ఎన్కౌంటర్ అవుతావ్... 2)మొన్న తిక్క చూపించా... ఇప్పుడు చుక్కలు చూపిస్తా... నేను టెంపర్ లాస్ అయితే టెంపో లేకుండా కొడతా 3)ఎవడు కొట్టినా బ్లడ్ వస్తుంది... కానీ నేను కొడితే బ్లడ్తో పాటే భయం కూడా వస్తుంది. -
గబ్బర్ సింగ్ 2లో 'ఆమే' హీరోయిన్!
టాలీవుడ్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసిన గబ్బర్ సింగ్ సినిమా సీక్వెల్లో హీరోయిన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న 'గబ్బర్ సింగ్ -2'లో హీరోయిన్ అవకాశం రకుల్ ప్రీత్ సింగ్‌ను వరించినట్లు సమాచారం. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన రకుల్...అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన లౌక్యం కూడా హిట్ కొట్టడంతో రకుల్‌కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. రకుల్ ప్రీత్ సింగ్ నటనకు పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. దాంతో ఆమెను హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుందని దర్శక, నిర్మాతలకు ఆయన సూచించినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రం కొద్ది నెలల ముందే లాంఛనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనటంతో పాటు 'గోపాల గోపాల' చిత్రంతో బిజీగా ఉన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 రెగ్యులర్ షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. దాంతో దర్శక, నిర్మాతలు హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. పలువురి హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చినా...చివరికి రకుల్ ప్రీత్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్ తెలుగుతో పాటు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. -
తెరపై మరో మిస్ ఇండియా
-
పవన్ కళ్యాణ్ సరసన వాణి కపూర్?
'ఆహా కళ్యాణం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వాణి కపూర్ అదృష్టం బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. గబ్బర్ సింగ్-2 లో పవన్ కళ్యాణ్ సరసన వాణి కపూర్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు ఫిలింనగర్ లో టాక్. ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కితే వాణి కపూర్ కు దశ తిరిగినట్టే అని సినీ వర్గాలు అంటున్నారు. యష్ రాజ్ సంస్థ నిర్మించిన 'శుద్ద్ దేశీ రొమాన్స్' ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించిన వాణి కపూర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆతర్వాత యష్ రాజ్ సంస్థ తమిళంలో నిర్మించిన 'ఆహా కళ్యాణం'లో నాని సరసన నటించింది. ఈ చిత్రంలో వాణి కపూర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో గబ్బర్ సింగ్-2లో వాణి కపూర్ ను నటింప చేయడానికి ఆ చిత్ర నిర్మాత ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. -
గబ్బర్‌సింగ్ మళ్లీ గుర్రం ఎక్కుతున్నాడు!
‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్‌లో పవన్‌కల్యాణ్ నటించనున్నారు. ఇటీవల ఈ వార్త వెలుగు చూసింది. అంతకు ముందే.. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారితో పవన్ భారీ డీల్ కుదుర్చుకున్నారని, ఆ సంస్థ నిర్మించబోయే చిత్రాల్లో పవన్ నటించబోతున్నారని ఓ వార్త మీడియాలో హంగామా చేసింది. పవర్‌స్టార్‌ని కేంద్రంగా చేసుకుని పుట్టుకొస్తున్న ఈ వార్తల మధ్య ‘గబ్బర్‌సింగ్-2’ నిజంగా నలిగిపోతున్నాడు. అసలు ఆ సినిమా ఉన్నట్టా? లేనట్టా? స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. సంపత్‌నందిని దర్శకునిగా తీసుకున్నారు. మరి ఉన్నట్లుండి పవన్‌కి ఈ కొత్త కమిట్మెంట్లేంటి? ఇప్పుడు ఫిలింనగర్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎట్టకేలకు ఆ చర్చకు తెర పడింది. ‘గబ్బర్‌సింగ్’ రెండోసారి గుర్రం ఎక్కేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు. మార్చిలో కానీ, ఏప్రిల్‌లో కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. వీలైతే... ‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్‌కు సమాంతరంగా ‘గబ్బర్‌సింగ్-2’ షూటింగ్‌ను కూడా జరపాలని శరత్ మరార్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.