పవన్ కళ్యాణ్ సరసన వాణి కపూర్?
'ఆహా కళ్యాణం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వాణి కపూర్ అదృష్టం బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. గబ్బర్ సింగ్-2 లో పవన్ కళ్యాణ్ సరసన వాణి కపూర్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు ఫిలింనగర్ లో టాక్. ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కితే వాణి కపూర్ కు దశ తిరిగినట్టే అని సినీ వర్గాలు అంటున్నారు.
యష్ రాజ్ సంస్థ నిర్మించిన 'శుద్ద్ దేశీ రొమాన్స్' ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించిన వాణి కపూర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆతర్వాత యష్ రాజ్ సంస్థ తమిళంలో నిర్మించిన 'ఆహా కళ్యాణం'లో నాని సరసన నటించింది. ఈ చిత్రంలో వాణి కపూర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో గబ్బర్ సింగ్-2లో వాణి కపూర్ ను నటింప చేయడానికి ఆ చిత్ర నిర్మాత ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.