Vaani kapoor
-
'ది రోషన్స్' సిరీస్ పార్టీ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
నెట్‌ఫ్లిక్స్‌తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
'ఖేల్ ఖేల్ మే' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మెరిసిన వాణి కపూర్ , ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)
-
లండన్ కాలింగ్
లండన్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారట హీరోయిన్ వాణీ కపూర్. విహార యాత్ర కోసం కాదు. షూటింగ్ కోసం సూట్‌కేస్ సర్దుకోనున్నారు వాణీ కపూర్. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె హిందీ చిత్రం అంగీకరించారు. పరేష్ రావల్, వాణీ కపూర్, అపర్శక్తి ఖురానా ప్రధాన ΄ాత్రధారులుగా ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నవ్యజోత్ గులాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ కథ రీత్యా వాణీ కపూర్, అపర్శక్తి సోదరీ సోదరుడుగా నటించనున్నారట. ప్రస్తుతం మానవ సంబంధాలు ఏ విధంగా మారుతున్నాయి? ఈ మార్పులు వారి కుటుంబాలపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తున్నాయి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని టాక్. ఈ సినిమా చిత్రీకరణను ముందుగా వేసవిలో లండన్‌లో ΄్లాన్ చేస్తున్నారట. ఎక్కువ శాతం షూటింగ్ అక్కడే జరుగుతుందట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలన్నది చిత్ర యూనిట్ ΄్లాన్ అని భోగట్టా. -
హిందీ బ్యూటీ బ్యాక్ పోజులు.. చాన్నాళ్లకు అలా కనిపించిన ఆండ్రియా!
క్యూట్ పోజుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చాన్నాళ్లకు కనిపించిన ముద్దుగుమ్మ ఆండ్రియా మత్తెక్కించే స్టిల్స్ ఇచ్చిన అదితీ రావ్ హైదరీ కొత్త షో కోసం కత్తిలా తయారైన యాంకర్ శ్రీముఖి బ్లాక్ డ్రస్‌లో కిక్కిస్తున్న నటి తేజస్వి మదివాడ బ్యాక్ చూపించి మరీ పిచ్చెక్కిస్తున్న వాణీ కపూర్ హీరోయిన్ ప్రణీత రొమాంటిక్ పోజులు.. చూస్తే మాత్రం నవంబరు జ్ఞాపకాల్ని వీడియోగా షేర్ చేసిన శ్రుతిహాసన్ అబ్బా అనిపించేలా వయ్యారంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ బ్లాక్ డ్రస్‌లో మాయ చేసేస్తున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
Actress Vaani Kapoor: వాణి కపూర్ మైండ్ బ్లోయింగ్ (ఫోటోలు)
-
స్టైల్ ఐకాన్ అవార్డ్స్ లో మెరిసిన తారలు
-
ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను
‘‘దక్షిణాది ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమిస్తారు. నేను కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రణ్‌బీర్ కపూర్ అన్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ జంటగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్ రాజ్ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ– ‘‘కరణ్ మల్హోత్రాగారు ‘షంషేరా’ స్క్రిప్ట్ చెప్పగానే బాగా నచ్చేసింది. ఈ చిత్రంలో బల్లి, షంషేరా వంటి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. సామాజిక విలువల కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తాను. ఇలాంటి సినిమా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. కరణ్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘షంషేరా’ ఫిక్షనల్ కథ. 1871లో ఓ ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటలను ఆధారంగా చేసుకుని ఫిక్షనల్‌గా పాత్రలు, కథ రూపొందించాం. మా చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. ‘‘షంషేరా’లో శుద్ సింగ్ అనే డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు సంజయ్ దత్. ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ‘షంషేరా’లోని పాత్ర పూర్తి భిన్నమైనది. నా పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు వాణీ కపూర్. -
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
Vaani Kapoor Reveals Her Horse Riding Experience: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ వాణీ కపూర్. నాని నటించిన 'ఆహా కల్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు కమర్షియల్ మూవీస్తోపాటు మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్‌లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం 'షంషేరా'. రణ్‌బీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో సోనా అనే పాత్రలో అలరించనుంది వాణీ కపూర్. అయితే ఈ పాత్ర కోసం వాణీ కపూర్ స్పెషల్‌గా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపింది. గుర్రపు స్వారీ నేర్చుకున్న అనుభవాలను 'షంషేరా' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఇది నాకెంతో ఛాలేంజింగ్ పాత్ర. దీనికోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నా. నా దృష్టిలో గుర్రాలు అత్యంత అందమైన జంతువులు. వాటికి ప్రేమ భాష మాత్రమే తెలుసు. స్వారీ నేర్చుకోవడానికి ముందు వాటితో సన్నిహితంగా ఉండటం, స్నేహం చేయడం, ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడం అవసరం. లేకపోతే అవి మనల్ని విసిరేస్తాయి. అందుకే శిక్షణ సమయంలో నేను వాటికోసం ఆహారం తీసుకొచ్చేదాన్ని. అలా వాటిని మచ్చిక చేసుకుని స్వారీ నేర్చుకున్నా.' అని తెలిపింది వాణీ కపూర్. కాగా కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన 'షంషేరా' చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Meet Sona ✨ Watch how Sona's character came to life.. pic.twitter.com/loe1mbEgUR Shamshera releasing in Hindi, Tamil & Telugu. Celebrate #Shamshera with #YRF50 only at a theatre near you on 22nd July. #RanbirKapoor @duttsanjay @RonitBoseRoy @saurabhshukla_s @karanmalhotra21 @yrf — Vaani Kapoor (@Vaaniofficial) July 9, 2022 -
కాన్ఫిడెంట్ ఈమె కళ్లలోనే.. మెస్మరైజింగ్ వాణీకపూర్ ఫొటోలు
-
బాలీవుడ్ సోయగం, పొడుగుకాళ్ల సుందరి వాణి కపూర్ ఫోటోలు
-
ఇంకా టైమ్ ఉంది!
కోవిడ్ సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ తిరిగి ఆరంభమైంది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ శనివారం ముంబయ్‌లో ప్రారంభమైంది. అయితే హీరో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రాధేశ్యామ్’ చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రభాస్, ఇక్కడ షెడ్యూల్ పూర్తయ్యాక ‘ఆదిపురుష్’ సినిమా సెట్లో జాయిన్ అవుతారు. అంటే... ‘ఆదిపురుష్’ సినిమా సెట్లోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ‘సలార్’లో వాణీ కపూర్? ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. ఇందులో ఓ కీలక పాత్రకు వాణీ కపూర్‌ను సంప్రదించారని టాక్. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఆగస్టులో తిరిగి ప్రారంభం కానుంది. -
హీరోయిన్ వాణీ కపూర్ గ్లామర్ ఫోటోలు
-
హీరోయిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఆ తర్వాత!
ముంబై: లైవ్ చాట్‌లో తన శరీరంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నెటిజన్‌కు హీరోయిన్ వాణి కపూర్ తనదైన శైలిలో స్పందించి నోరు మూయించారు. తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ.. అతడిపై మండిపడకుండా సానుకూలంగా స్పందిస్తూనే దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన ఆమె తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఏ క్వశ్చన్’ పేరుతో సోమవారం రాత్రి ఆమె లైవ్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ తనపై చేసిన అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు. ఆమె దీనిపై స్పందిస్తూ... ‘మీకు హృదయం ఉంది. కాస్తా మనసుతో ఆలోచించండి. ఎదుటివారిని ద్వేషించకండి’ అంటూ సమాధానం ఇచ్చారు. (వివాదాస్పదంగా బ్లౌజ్.. నటిపై కేసు) అయితే గతంలో కూడా వాణికి సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఇన్స్టాగ్రామ్ తన ఫొటో షేర్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. వ్యాయామం దుస్తుల్లో అద్దం ముందు నిలుచుని ఉన్న ఓ ఫొటోను ఇటీవల షేర్ చేశారు. అది చూసిన ఓ నెటిజన్ ‘ఏంటీ మీరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారా?’ అంటూ తన శరీర ఆకృతిపై విమర్శలు చేశాడు. దీనికి వాణి స్పందిస్తూ.. ‘‘జీవితంలో మీరు ఎందుకు కొత్తగా ఉంటానికి ప్రయత్నించడం లేదు. ఎప్పుడు ఇతరులపై విమర్శలు చేయకుండా కాస్తా దయతో వ్యవహరించండి. దయచేసి మీకు మీరు కఠినంగా ఉండటాన్ని మానుకోండి. ద్వేషాన్ని చూపడం ముగించినప్పుడే జీవితం చాలా బాగుంటుంది’’ అంటూ కామెంటుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram 🔙 to the grind ✔️ A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) on Jan 5, 2020 at 7:25pm PST -
ఉత్కంఠ భరితంగా ‘వార్’ టీజర్
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్స్ హృతిక్‌రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న ‘వార్’ చిత్రం టీజర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మక యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో వాణికపూర్ హీరోయిన్గా నటిస్తోంది. టీజర్ చూస్తుంటే సినిమా ప్రేమికులకు ఓ భారీ కానుకలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ టీజర్లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ఒకరికొకరు యుద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వీరోచితంగా కనిపిస్తున్నారు. ఈ దృష్యాలు యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎవరికి ఎవరు తీసిపోకుండా ఇద్దరు సమవుజ్జీవులుగా పోరాడుతూ కనిపిస్తున్నారు. చిత్ర డైరెక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాకు వార్ అనే టైటిల్ సరిగా ప్రతిబింభిస్తుందని, ఇద్దరు స్టార్లను ఒకే సినిమాలో విలన్‌లాగా చూపించాలంటే ఈ టైటిల్ మాత్రమే సరిపోతుందని అనిపించిందన్నారు. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారనేది సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకులకు ముందుకు రానుంది. -
అప్పుడు సింగపూర్... ఇప్పుడు రోమ్
కాస్త టైమ్ దొరికితే చాలు హాలిడేని జాయింట్‌గా ఎంజాయ్ చేస్తారు రాశీ ఖన్నా, వాణీ కపూర్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎప్పటినుంచో మంచి స్నేహితులని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది జూన్‌లో సింగపూర్‌లో మస్త్ మజా చేసిన వాణీ, రాశీ ఇప్పుడు రోమ్ నగరానికి వెళ్లారు. అక్కడ సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ, నచ్చిన ఫుడ్‌ను ఫుల్‌గా లాగిస్తున్నారు. అందమైన లొకేషన్స్‌లో హ్యాపీగా సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడున్నది ఆ సెల్ఫీనే. మరి సినిమాల సంగతేంటీ అంటే... తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్ ‘అయోగ్య’, తెలుగులో విజయదేవరకొండ సరసన ఓ సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా. ఇక వాణి బ్యాంకులో ఉన్న సినిమాల లిస్ట్ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందనున్న సినిమాతో పాటు, రణ్‌బీర్ కపూర్ సరసన ‘షంషేర్’లో నటిస్తున్నారు. -
పోలిక వద్దు
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్న మాదిరి ‘‘ప్రతి ఒక్కరి కెరీర్లో డిఫరెంట్ జర్నీస్ ఉంటాయి. ఒకరితో ఒకరికి పోలికలు పెట్టి చూడడం సరికాదు’’ అంటున్నారు కథానాయిక వాణీకపూర్. ఈ బ్యూటీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఓ కారణం ఉంది. అదేంటంటే... దాదాపు ఐదేళ్ల క్రితం ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ మూవీతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చారు వాణి. ఆ తర్వాత ‘ఆహా కల్యాణం’ సినిమాతో సౌత్ గడప తొక్కారు. మళ్లీ బాలీవుడ్‌కి వెళ్లి ‘బెఫీక్రే’ (2016) సినిమా చేశారు. ఆ తర్వాత కాస్త స్లో అయ్యారు. మళ్లీ ఈ ఏడాది ఫామ్‌లోకి వచ్చి రణ్‌వీర్‌సింగ్‌తో ఓ సినిమా, హృతిక్–టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ మూవీలో హీరోయిన్గా చేయడానికి ఓకే అన్నారు. మరి.. ఈ ఐదేళ్లలో రెండంటే రెండే బాలీవుడ్ సినిమాలు ఎందుకు చేశారు? అని వాణీని అడిగితే– ‘‘యాక్టర్స్ అందరి కెరీర్ గ్రాఫ్ ఒకేలా ఉండదు. ఎవరి జర్నీ వారికి ప్రత్యేకం. అది వారు ఎంచుకున్న చాయిస్లపై ఆధారపడి ఉంటుంది. అలాగే నా పాత్రలను నేనూ ఎంచుకున్నా. కష్టపడ్డాను. కానీ అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు. ఆశించిన ఫలితం సాధించినప్పుడు అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయినా నేనీ గ్యాప్‌లో బాగా రిలాక్స్ అయ్యాను. సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలనుకున్నా. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు వాణీకపూర్. -
హ్యాపీ అడ్వెంచర్
ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది ఎంజాయ్మెంట్. కొందరు ట్రావెలింగ్‌ని, మరికొందరు ఫుడ్‌ని, ఇంకొందరు వెదర్ని.. ఇలా ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కో విధంగా ఉంటుంది. అడ్వెంచర్‌లో ఎంజాయ్మెంట్ను ఫీల్ అయ్యే కోవలోకి వస్తారు హీరోయిన్లు రాశీఖన్నా అండ్ వాణీ కపూర్. ఇద్దరూ కలసి సింగపూర్‌లో హ్యాపీ స్వింగ్‌లో ఉన్నారు. ఆదివారం ఓ అడ్వెంచర్ చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాశీ ఖన్నా. ఇక సినిమాల విషయానికొస్తే.. మూడు తమిళం, ఒక తెలుగు ప్రాజెక్ట్‌తో రాశీ ఖన్నా, దాదాపు రెండేళ్ల తర్వాత ఒక హిందీ సినిమాతో వాణీకపూర్ బిజీగా ఉన్నారు. అంతా ఓకే కానీ టీటౌన్ రాశీ, బీటౌన్ వాణీ ఎందుకు కలిశారు? కలిసి నటించడానికా? కాదు. వీరిద్దరిది దోస్త్ మేరా దోస్త్ అన్న మాదిరి స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. సరదాగా ట్రిప్ ప్లాన్ చేసుకుని, ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. -
న్యూ బిగినింగ్
కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు నటి వాణీ కపూర్. ఇంతకీ ఈ బ్యూటీ తెలుసు కదా. నాలుగేళ్ల క్రితం నాని హీరోగా వచ్చిన ‘ఆహా కల్యాణం’ చిత్రం తో సౌత్‌కు ఎంట్రీ ఇచ్చారామె. ఫస్ట్ ‘శుద్ద్ దేశీ రొమాన్స్’ హిందీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారామె. అయితే చాన్స్‌లు మాత్రం ఆశించినంతగా రాలేదు. రెండేళ్ల క్రితం రణ్వీర్ సింగ్ సరసన చేసిన ‘బేఫికర్’ వాణీ కపూర్ చివరి చిత్రం. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రూపొందనున్న ‘షంషేరా’ చిత్రంలో కథనాయికగా ఎంపికయ్యారు. ‘‘న్యూ బిగినింగ్స్.. ‘షంషేరా’ చిత్రం లో రణ్‌బీర్ కపూర్ సరసన నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు వాణీ కపూర్. రెండేళ్ల బ్రేక్ తర్వాత నూతనోత్సాహంతో న్యూ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసిన వాణీ కపూర్ కెరీర్ ఇకనైనా గుడ్ ట్రాక్‌పై నడవాలని ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు. ‘‘వాణీ ఫైనెస్ట్ యాక్టర్. సూపర్ డ్యాన్సర్. ఈ సినిమాలోని పాత్రకు కరెక్ట్‌గా సూట్ అవుతుందని ఎంపిక చేశాం’’ అన్నారు దర్శకుడు కరణ్. ఈ సినిమాలో సంజయ్‌దత్ కీలక పాత్ర చేయనున్నారు. -
బేఫికర్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్..!
నాలుగేళ్ల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన ఓ బాలీవుడ్ హీరోయిన్ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. శుద్ దేశీ రొమాన్స్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన వాణీ కపూర్ తరువాత సౌత్ లో ఆహా కళ్యాణం, బేఫికర్ సినిమాల్లో నటించినా.. సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటించనుంది. యష్ రాజ్ ఫిలింస్ సంస్థ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో రూపొందిస్తున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో వాణీకపూర్ హీరోయిన్ గా నటించనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాణీ హృతిక్ రోషన్ కు జోడిగా నటించనుందట. ఈ సినిమాలో హృతిక్, టైగర్ లు ఒకరితో ఒకరు తలపడే పాత్రల్లో నటించనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాను 2019 జనవరి 25న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. .@Vaaniofficial | @iHrithik | @iTIGERSHROFF pic.twitter.com/NAlSBPuvbe — Yash Raj Films (@yrf) 12 October 2017 -
నాపై ఓ ఫెంటాస్టిక్ రూమర్: హీరోయిన్
తాజాగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన బేఫిక్రే సినిమాలో నటించిన వాణీ కపూర్.. తన మీద ఓ ఫెంటాస్టిక్ రూమర్ వచ్చిందని చెబుతోంది. ఆ రూమర్ గురించి ఆమె కాస్తంత సంతోషించింది కూడా లెండి. ఇంతకీ ఆ రూమర్ ఏమిటంటే.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఆమె నటించబోతోందని! ఎలె ఇండియా గ్రాడ్యుయేట్స్ ఫ్యాషన్ షోకు వచ్చిన ఆమెను మీడియా వాళ్లు పలకరించి.. ''ఏంటి, బేఫిక్రే తర్వాత షారుక్ సరసన నటించడానికి మిమ్మల్ని చోప్రా అడిగారట, సైన్ కూడా చేయించేస్తున్నారట'' అని అడిగారు. ''అలా జరిగితే చాలా సంతోషించేదాన్ని. అదో ఫెంటాస్టిక్ రూమర్. అది నిజమైతే బాగుండని అనుకుంటున్నాను. కానీ దాని గురించి నాకు ఏమీ తెలియదు. ఇప్పటికైతే.. ఆ సినిమాలో నేను లేను'' అని వాణీకపూర్ చెప్పింది. రాబోయే సినిమాల సంగతేంటని అడిగితే, ఇప్పటివరకు ఏమీ ప్లాన్ చేయలేదని, ప్రస్తుతం స్క్రిప్టులు చదువుతున్నాను గానీ వేటినీ అంగీకరించలేదని తెలిపింది. ఏదైనా సినిమాకు సైన్ చేస్తే తప్పకుండా చెబుతానంది. ఇక బేఫిక్రే సినిమా కొంతమందికి నచ్చింది గానీ, కొంతమందికి అసలు కనెక్ట్ కాలేదంది. అది రొమాంటిక్ కామెడీ అని.. అలాంటి సినిమా నుంచి ఇంకేం ఆశిస్తారని అడిగింది. -
రెండో రోజు పెరిగిన కలెక్షన్లు
ముంబై: రణవీర్ సింగ్, వాణి కపూర్ నటించిన బాలీవుడ్ సినిమా బేఫికర్కు రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు 10.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో రోజు శనివారం 11.60 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండు రోజుల్లో మొత్తం 21.96 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్, వాణి కపూర్ లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా 2100 స్క్రీన్లలో విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా మంచి వసూళ్లు రాబడుతోంది. -
ఆ మూవీ తొలిరోజు కలెక్షన్లు అదుర్స్
రణవీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బేఫికర్'. దర్శకనిర్మాత ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ మూవీ శుక్రవారం విడుదలై భారీ వసూళ్లు వసూలుచేస్తోంది. రిలీజైన తొలిరోజు మొత్తం రూ. 10.36 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల కిందట ఆ మూవీ యూనిట్ ట్రైలర్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగానే భారీగా వీక్షించారు. అందులోనూ మూవీలో రణవీర్, వాణీల లిప్ లాక్ సీన్లు ఉండటం మూవీకి కలిసొస్తుందని నటీనటులతో పాటు టెక్నిషియన్లు భావించారు. వారు అనుకున్నట్లుగానే మూవీకి మంచి ఓపెనింగ్ లభించిందని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. 45 శాతం మార్నింగ్ షోలకే టికెట్లు బుక్ అవుతున్నాయని సమాచారం. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ భారత్ లో 2100 స్క్రీన్లు, విదేశాలలో 800 స్క్రీన్లలో విడుదల చేశారు. నోట్ల రద్దుతో సతమతమవుతున్నా ట్రైలర్ చూసిన వాళ్లు కచ్చితంగా థియేటర్లకు రావడం ఖాయమని మూవీ యూనిట్ ధీమాగా ఉంది. ఎన్నో హాట్ లిప్ లాక్స్ ఉన్నా మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ లభించడం కలిసొచ్చిందని చెప్పవచ్చు. -
ఆ వదంతులు నమ్మవద్దు: హీరోయిన్
ముంబై: అందంగా కనిపించేందు సర్జరీలు చేయించుకుందని తనపై వస్తున్న వదంతులకు బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ చెక్ పెట్టింది. ఇటీవల 'బేఫికర్' మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ చూసిన నెటిజన్లు మొదట రణవీర్ సింగ్, వాణీ కపూర్ లిప్ లాక్ సీన్లపై కామెంట్ చేయగా, ఇప్పుడు వాణీ అందంపై వదంతులు ప్రచారం చేశారు. మూడేళ్ల కింద వాణీ ఎలా ఉంది ఇప్పుడు ఇంత అందంగా కనిపిస్తుందేంటని ఆశ్చర్చపోతున్నారు. కచ్చితంగా ముఖానికి సర్జరీ చేయించుకుందని, అందుకే మునుపటి కంటే కూడా ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. తాను అందంగా ఎలా మారిందో స్వయంగా హీరోయిన్ వాణీనే ఓ కార్యక్రమంలో తెలిపింది. 'గతంలో కంటే ఇప్పుడు ఎంతో బరువు తగ్గాను. అందుకే నా ముఖంలో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో మార్పును గమనిస్తున్నారు. దీంతో పాటు మేం 'బేఫికర్' షూటింగ్ కోసం పారిస్ వెళ్లాం. అక్కడికి వాతావరణం ఎంతో చల్లగా ఉంటుందని, అది కూడా చాలా హెల్ప్ అయింది. కెమెరా పలు యాంగిల్స్ లో హీరోయిన్లు చాలా విభిన్నంగా కనిపిస్తారు. నా రెండో మూవీ 'బేఫికర్' ఈ 9న విడుదలకు సిద్ధంగా ఉంది' అని వాణీ చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని, హీరోయిన్లు ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా వారిపై కామెంట్ చేయడం తనకు ఇష్టం ఉండదని 'బేఫికర్' భామ వాణీకపూర్ అంటోంది. -
‘ప్రేక్షకురాలిగా అతడి సినిమాలు ప్రేమిస్తా’
ముంబయి: ఒక ప్రేక్షకురాలిగా ఉన్నప్పుడు తాను రణ్వీర్ సింగ్ చిత్రాలను చూసేందుకు తెగ ఇష్టపడతానని బాలీవుడ్ ప్రముఖ నటి వాణి కపూర్ చెప్పింది. రణ్ వీర్ సింగ్‌లాంటి సహనటుడిని తాను ఇంత వరకు చూడలేదని అభిప్రాయపడింది. ‘నాకు రణ్ వీర్ సింగ్‌తో నటించడమంటే చాలా ఇష్టం అని ముందునుంచే చెబుతున్నాను. ఒక నటిగా, ప్రేక్షకురాలిగా అతడిని బాగా ఇష్టపడతాను. అతడి సినిమాలను చూడడమంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది. తన రెండో చిత్రంతోనే రణ్ వీర్ సింగ్ పక్కన నటించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని మురిసిపోయింది. తనకు తెలిసి రణ్ వీర్ సింగ్ చాలా గొప్పవాడని చెప్పింది. వీరిద్దరు కలిసి బేఫికర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. -
నలభై ముద్దులు!
‘బేఫికర్’... అంటే ‘నిశ్చింత’ అని అర్థం. హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ వాణీ కపూర్, దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా ప్రస్తుతం అలానే ఉన్నారు. ఎందుకంటే సెన్సార్ కత్తెర నుంచి వీరి ‘బేఫికర్’ సినిమా సునాయాసంగా తప్పించేసుకుంది. రణవీర్, వాణీ జంటగా ఆదిత్యా చోప్రా తీసిన ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ చిత్రంలో మొత్తం 40 ముద్దు సీన్లు ఉన్నాయి. ట్రైలర్, ఫొటోలు చూసి.. ‘మాంచి రొమాంటిక్ మూవీ’ అని ఇప్పటికే చాలామంది ఫిక్సయ్యారు. సినిమా విడుదల కోసం కొంతమంది ఎదురు చూస్తుంటే.. ఆదిత్యా చోప్రాను సెన్సార్ బోర్డ్ ఏ విధంగా తిప్పలు పెడుతుందో చూడాలని మరికొంతమంది వెయిట్ చేశారు. కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా సెన్సార్ పాస్ అయింది. ఒక్క ముద్దు సీన్‌కి కూడా కట్ చెప్పకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్. రొమాంటిక్ సన్నివేశా లను ఆదిత్యా చోప్రా కళాత్మకంగా తీస్తారని చెప్పడానికి ఒక్క ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ చాలు. తాజా చిత్రం ‘బేఫికర్’లో కూడా అలానే తీశారట. ఇక... సెన్సార్ బోర్డ్ మాత్రం ఏమంటుంది? ‘భలే తీశారు’ అని అభినందించిందట కూడా. సో.. రొమాంటిక్ పీపుల్ నిశ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే.. షూట్ చేసిన నలభై ముద్దు సీన్లూ సినిమాలో ఉంటాయి. ఈ సీన్స్‌లో రణవీర్, వాణీ కెమిస్ట్రీ అదిరిపోయిందట. -
'ఆ సీన్లు తెలివైనవారికే అర్థమవుతాయి'
ముంబయి: సంబంధబాంధవ్యాల విషయంలో తాను పక్కా సాంప్రదాయవాదిలా ఉంటానని ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ చెప్పాడు. సంబంధాల విషయంలో తరాల వ్యత్యాసం ఉందని అన్నాడు. రోమాంటిక్ రిలేషన్ కు చాలా పొరలు ఉంటాయని, దేనికి కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని జోడించి చెప్పకూడదని, అలాగే రహస్యంగా ఉంచకూడదని అభిప్రాయపడ్డాడు. తాను సోషల్ మీడియా ప్రభావం తక్కువగా ఉన్న రోజుల్లో పెరిగి పెద్దవాడినయ్యానని, సాంప్రదాయవాదినని తెలిపాడు. దీపికా పదుకొనె, వాణి కపూర్ వంటి బాలీవుడ్ నటీమణులతో వెండితెరపై రణ్ వీర్ ఎలాంటి రోమాన్స్ పండించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బేఫికర్ సినిమాలో అయితే, అది కాస్త పదింతలు ఉండనుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ చిత్ర విశేషాలు తెలియజేస్తూ తాను, వాణికపూర్ నటించి బేఫికర్ చిత్రం నేటి యువతరం ఆలోచనలు ప్రతిబింబించేలా ఉంటుందని చెప్పాడు. ముద్దు సన్నివేశాల గురించి ప్రశ్నించగా.. ప్రతి ఒక ముద్దులో ప్రేమను వ్యక్తంపరచడం ఉంటుందని, తెలివైనవారే వాటిని అర్ధం చేసుకుంటారని, తప్పుగా అనుకోరని అన్నాడు. ఈ సినిమాలో పలు రకాల ముద్దు సన్నివేశాలు ఉన్నాయని, వాటిని చూశాక ఏ ఒక్కరు విమర్శించబోరని అభిప్రాయపడ్డాడు. వాణి కపూర్ మంచి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నటి అని, స్వీట్ గర్ల్ అని చెప్పాడు. వాణి కపూర్ మాట్లాడుతూ తాను రిలేషన్ ల విషయంలో చాలా సాధారణంగా ఉంటానని, ఎదుటి వారి నుంచి ఎలాంటిది ఆశించకుండా ఉంటానని తెలిపింది. -
ఆ సినిమా ట్రైలర్ కు 2 కోట్ల వ్యూస్
పారిస్: రణవీర్ సింగ్, వాణికపూర్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బేఫికర్' సినిమా ట్రైలర్ ఆన్ లైన్ లో దూసుకుపోతోంది. వారం క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ను రెండు కోట్లుపైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ లో ఇప్పటి వరకు 20,583,372 మంది ఈ ట్రైలర్ వీక్షించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే కోటికి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్, వాణి కపూర్ల మధ్య రొమాంటిక్ సీన్స్ కనువిందు చేస్తున్నాయి. వీరిద్దరూ ఏమాత్రం మొహమాటం లేకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో విజృంభించారు. ఈ సినిమాలో ముద్దు సీన్లకు కొదువే లేదు. ఫ్యాషన్ కు పుట్టినిల్లు అయిన పారిస్ లో అత్యధిక భాగం షూటింగ్ చేశారు. డిసెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
దిమ్మతిరిగే రొమాన్స్‌తో ట్రైలర్ రిలీజ్
పారిస్: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్, వాణికపూర్ జంటగా నటించిన ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బేఫికర్' చిత్రం ట్రైలర్ విడుదలైంది. పారిస్ లోని ఈపిల్ టవర్ దగ్గర చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రపంచంలోని చరిత్ర ప్రసిద్ధమైన కట్టడాల్లో ఒకటైన ఈపిల్ టవర్ వద్ద ట్రైలర్ విడుదల చేసిన తొలి భారతీయ చిత్రంగా బేఫికర్ నిలిచింది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ల మధ్య ఫుల్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. బయటి ప్రపంచానికి ఏమాంతం భయపడకుండా ఇద్దరు యువతీ యువకులు తమకు నచ్చింది ఎలా చేశారని కథాంశంతోపాటు కొంత సందేశం కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ముద్దు సీన్లకు కొదువే లేదు. మొత్తంగా చెప్పాలంటే దేశీ రోమాన్స్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర ట్రైలర్ ప్రకారం ఈ సినిమాలో రణ్ వీర్ ఏమాత్రం జంకూబొంకూ లేకుండా నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ కోసం పారిస్ తమకు చాలా బాగా సహకరించిందని, షూటింగ్‌లకు సహకరించే నగరాల్లో పారిస్ ముందుంటుందని చెప్పొచ్చని అన్నారు. Celebrate love the Befikre way with Dharam & Shyra's free spirited & carefree tale. #BefikreTrailer #BefikreInParis https://t.co/JVyRi7jxTY — #Befikre (@befikrethefilm) 10 October 2016 -
ముద్దు పెట్టుకోలేదా?
‘ముద్దుతో ఓనమాలు నేర్పించనా.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా’ అని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో మోహన్‌బాబు, నగ్మా పాడుకున్న పాట గుర్తుందా? రణ్వీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న హిందీ సినిమా ‘బేఫికర్’ స్టిల్స్ చూస్తే ఠక్కున ఈ పాట గుర్తు రాకుండా ఉండదు. ‘బేఫికర్’ అంటే నిశ్చింతగా ఉండటం అని అర్థం. టైటిల్‌కి తగ్గట్టు నిశ్చింతగా గాల్లో ఎగురుతూ ప్రియుడి పెదాలపై ఓ ముద్దు.. డ్యాన్స్ చేస్తూ మరో ముద్దు.. బీచ్‌లో ఇంకో ముద్దు.. ప్యారిస్ నగరం అంతా కనబడేలా ఓ బిల్డింగ్ టై మీద కూర్చుని మళ్లీ ముద్దు.. ముద్దులు తప్ప సినిమాలో ఇంకేమీ లేనట్టు రణ్వీర్ సింగ్, వాణీ కపూర్లు లిప్‌లాక్‌లతో రెచ్చిపోయారు. పెదవి ముద్దుల పోస్టర్లతోనే సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. ఏంటీ ముద్దులు? అని ఎవరైనా అడిగితే.. కళాత్మక దృష్టితో చూడండని సలహా కూడా ఇచ్చారు చిత్రబృందం. ఇప్పటివరకూ విడుదల చేసిన పోస్టర్స్ అన్నీ ముద్దుకి సంబంధించినవే. వాణీ కపూర్ బర్త్‌డే సందర్భంగా లిప్‌లాక్ లేకుండా ఓ స్టిల్ రిలీజ్ చేసేసరికి షాకవ్వడం ప్రేక్షకుల వంతైంది. నార్మల్‌గా లిప్‌లాక్ స్టిల్స్ ఆడియన్స్‌లో డిస్కషన్స్‌కి కారణం అవుతాయి. బట్ ఫర్ ఎ చేంజ్.. ఈసారి ముద్దు పెట్టుకోలేదా ఏంటీ? అంటూ రివర్స్‌లో ఆడియన్స్ డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో మొత్తం 23 ముద్దులున్నాయట. ప్రతి ముద్దుకీ కథలో ప్రాముఖ్యత ఉంటుందట. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. -
'హాట్' టాపిక్: ఫ్రెంచ్ కిస్‌తో ఫస్ట్ పోస్టర్!
ఈఫీల్ టవర్ ఎదురుగా.. హీరో-హీరోయిన్ల మధ్య ఘాటైన 'ఫ్రెంచ్ కిస్'తో తొలి పోస్టర్‌ను విడుదల చేసింది 'బెఫికర్' టీమ్. 'బాజీరావు మస్తానీ' హీరో రణ్వీర్ సింగ్, వాణీకపూర్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్న ఈ సినిమా తొలిచిత్రాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ పోస్టర్లో పెదవులతో పెదవులు పెనవేసుకొని.. తమకంగా 'ఫెంచ్ కిస్' పెట్టుకుంటున్న రణ్వీర్, వాణీ కపూర్ జోడీ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈఫీల్ టవర్‌కు దూరంగా ఓ ఎత్తైన బిల్డింగ్ మీద కూర్చొని వీరు ముద్దుపెట్టుకుంటూ పోస్టర్లో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీ అని ఫస్ట్ పోస్టర్‌తో చిత్రబృందం చెప్పకనే చెప్పిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అత్యంత ఎత్తులో తీసిన 'ఫ్రెంచ్ కిస్' షాట్ అద్భుతమంటూ హీరోయిన్ వాణీకపూర్ ఈ ఫస్ట్ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేసింది. This view from the top is breathtaking @RanveerOfficial #BefikreOn9th @befikrethefilm pic.twitter.com/syEj3jZtHY — vaani kapoor (@Vaaniofficial) May 9, 2016 -
పవన్ కళ్యాణ్ సరసన వాణి కపూర్?
'ఆహా కళ్యాణం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వాణి కపూర్ అదృష్టం బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. గబ్బర్ సింగ్-2 లో పవన్ కళ్యాణ్ సరసన వాణి కపూర్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు ఫిలింనగర్ లో టాక్. ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కితే వాణి కపూర్ కు దశ తిరిగినట్టే అని సినీ వర్గాలు అంటున్నారు. యష్ రాజ్ సంస్థ నిర్మించిన 'శుద్ద్ దేశీ రొమాన్స్' ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించిన వాణి కపూర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆతర్వాత యష్ రాజ్ సంస్థ తమిళంలో నిర్మించిన 'ఆహా కళ్యాణం'లో నాని సరసన నటించింది. ఈ చిత్రంలో వాణి కపూర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో గబ్బర్ సింగ్-2లో వాణి కపూర్ ను నటింప చేయడానికి ఆ చిత్ర నిర్మాత ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. -
సినిమా రివ్యూ: ఆహా కళ్యాణం
నటీనటులు: నాని, వాణి కపూర్, సిమ్రాన్ సంగీతం: ధరన్ కుమార్ కెమెరా: లోగనాధన్ శ్రీనివాసన్ నిర్మాత: ఆదిత్య చోప్రా దర్శకత్వం: గోకుల్ కృష్ణ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన బ్యాండ్ బాజా బారాత్ చిత్ర రీమేక్ గా నానీ, వాణీ కపూర్ (శుద్ద్ దేశి రొమాన్స్ ఫేం)ల కాంబినేషన్ లో 'ఆహా కళ్యాణం' రూపొందించారు. అయితే 'బ్యాండ్ బాజా బారాత్' చిత్రాన్ని తెలుగులో సమంత, సిద్ధార్థ్ లతో 'జబర్దస్త్' గా రూపొందించడం వివాదస్పదమైంది. ఆ కారణంగా ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందించి తెలుగులో 'ఆహా కళ్యాణం'గా ఫిబ్రవరి 21 తేది శుక్రవారం విడుదల చేశారు. 'పైసా' తర్వాత నానీ, తెలుగులో తొలిసారి నటించిన వాణి కపూర్ చిత్రం 'ఆహా కళ్యాణం' కథేంటో తెలుసుకుందాం! వెడ్డింగ్ ప్లానర్ గా స్థిరపడి.. ఆతర్వాత తల్లితండ్రులు కుదర్చిన పెళ్లితో జీవితంలో సెటిల్ అవుదామనే లక్ష్యంతో శృతి సుబ్రమణ్యం (వాణి కపూర్) ప్రయత్నిస్తుంటుంది. శృతికి అల్లరి చిల్లరిగా తిరిగే శక్తి(నాని) పరిచయమవుతాడు. ఫైనాన్స్, రొమాన్స్ ను మిక్స్ చేయకూడదనే రూల్ తో శృతి, శక్తి లిద్దరూ 'గట్టి మేళం' అనే కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మ్యారేజ్ ఈవెంట్లను నిర్వహించడంలో 'గట్టి మేళం'కు అనూహ్య పాపులారిటీ వస్తుంది. కాని గట్టి మేళాన్ని ఓ రేంజ్ తీసుకువెళ్లిన శృతి, శక్తిల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. శక్తి హ్యపీ వెడ్డింగ్ అనే పేరుతో మరో ఆఫీస్ ను తెరుస్తాడు. అయితే శృతి, శక్తిల మధ్య విభేదాలకు కారణమేంటి? హ్యాపీ వెడ్డింగ్ ను ప్రారంభించిన శక్తి పరిస్థితేంటి? తమ మధ్య తలెత్తిన విభేదాలను శృతి, శక్తి పరిష్కరించుకున్నారా? శృతి పెద్దలు కుదర్చిన వివాహమే చేసుకుందా? శక్తి, శృతిల విభేదాలకు దర్శకుడు ఎలాంటి పరిష్కారాన్ని చూపారనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. ఇటీవల కాలంలో యువతరం నటుల్లో నాని ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆహా కళ్యాణంలో తన పాత్ర పరిధిమేరకు నాని పూర్తి న్యాయం చేకూర్చాడు. ఈ చిత్రంలో కామెడిని కూడ కొంత తన భుజాన వేసుకుని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. నాని డైలాగ్స్, కామెడీ పంచ్ ల టైమింగ్ బాగుంది. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి' అనే పాటలో నాని జోష్ ఆకట్టుకునేలా ఉంది. వాణి కపూర్ తో నాని కెమిస్ట్రీ ఫర్ ఫెక్ట్ గా ఉంది. నటుడిగా ఆహా కళ్యాణంతో మరోసారి నాని ఆకట్టుకున్నాడు. ఆహా కళ్యాణం చిత్రాన్ని పరిగణనలోకి తీసుకుని శృతి పాత్రను పరిశీలిస్తే వాణి కపూర్ బ్రహ్మండమైన పెర్ఫార్మెన్స్ అందించింది. చాలా సన్నివేశాల్లో నానిని డామినేట్ చేసే విధంగా ఎమోషన్స్ ను పలికించింది. ఫెర్ఫార్మెన్స్ కాకుండా గ్లామర్ తో అదరగొట్టింది. కొన్ని సన్నివేశాల్లో కత్రినా కైఫ్ లా కనిపించింది. తన స్క్రీన్ ప్రజెన్స్ తో టాలీవుడ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, అభిమానులను సంపాదించుకోవడానికి 'ఆహా కళ్యాణం' వాణి కపూర్ కు చక్కటి అవకాశం. టాలీవుడ్ లో వాణి కపూర్ కు అవకాశాలు పెరగడానికి ఈ చిత్రం దోహదపడుతుందని చెప్పవచ్చు. సిమ్రాన్ అతిధి పాత్రలో కనిపించింది. అయితే పెద్గగా ప్రాముఖ్యత లేని పాత్రలో సిమ్రాన్ దర్శనమిచ్చింది. నానీ. సిమ్రాన్ లు తప్ప వాణి కపూర్ తో సహా అందరూ టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియని వారు ఆహా కళ్యాణంలో ఉండటం ప్రధాన లోపం. 'ఆహా కళ్యాణం' ఆకట్టుకోలేకపోతే అదే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. సాంకేతికంగా రీరికార్డింగ్ బాగుంది. పాటలు ఆకట్టుకునేలా లేకపోవడం మరో లోపం. ఈ చిత్రం రీమేక్ కావడం వలన దర్శకుడు గోకుల్ కృష్ణ ప్రతిభను అంచనా వేయడానికి పెద్దగా అవకాశమే లేకపోయింది. కెమెరా పనితనం పర్వాలేదనింపించింది. రీరికార్డింగ్ ఓకే అనిపించేలా ఉన్నా.. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలుగులో తొలి చిత్రాన్ని అందించిన యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒకవేళ జబర్ధస్త్, బ్యాండ్ బాజా బారాత్ చూసినా వాణి కపూర్ ను చూడాలనిపిస్తే ధైర్యం చేయవచ్చు. చివరగా 'జబర్దస్త్' మిస్ అయిన ప్రేక్షకులకు 'ఆహా కళ్యాణం' ద్వారా మరో అవకాశం చిక్కింది.తమిళ వాసనలతో ఉన్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుడ్ని ఆకట్టుకోవడమనేది కష్టమే. -రాజబాబు అనుముల -
చీరలు, చుడీదార్లు వేసుకుని ఈత కొట్టలేముగా...
తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో బాలీవుడ్ కథానాయిక వాణీకపూర్. ‘ఆహా కల్యాణం’లో నానికి జంటగా నటించిన ఈ ఢిల్లీ భామ, ‘శుద్ద్ దేశీ రొమాన్స్’ చిత్రంతో యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ‘ఆహా కల్యాణం’తో తెలుగు ప్రేక్షకులతోనూ ఆహా అనిపించుకుంటానంటోన్న వాణీకపూర్‌తో ‘సాక్షి’ స్పెషల్ చిట్‌చాట్... * మీరేమో ఉత్తరాది అమ్మాయి. మీ పేరు చూస్తే దక్షిణాది వారిలా అనిపిస్తోంది? మా నాన్నగారే నాకు ఈ పేరు పెట్టారు. ప్రత్యేక కారణం కూడా ఏమీ లేదట. బహుశా భవిష్యత్తులో నాకు సినిమాల ద్వారా దక్షిణాదితో అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ఆ పేరు సెట్ అయ్యిందేమో. * అసలు సినిమా రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. మన భారతీయ సినిమాలకు బలం పాటలే. సినిమాల్లో పాటలు, డాన్సులు చూసినప్పుడు నాకు భలే అనిపించేది. పైగా, నేను ఏ విషయాన్నయినా చక్కగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాను. అందుకే సినిమాలనే కెరీర్‌గా ఎంపిక చేసుకున్నాను. * మీ తొలి చిత్రమే (శుద్ద్ దేశీ రొమాన్స్) యశ్‌రాజ్ సంస్థలో చేశారు. ఆ అవకాశం ఎలా వచ్చింది? ముంబయ్‌లో మోడలింగ్ చేసేటప్పుడు ఓ కాస్టింగ్ డెరైక్టర్ ద్వారా యశ్‌రాజ్ సంస్థలో ఆడిషన్స్‌కి వెళ్లాను. ఆ తర్వాత చాలాసార్లు ఆడిషన్స్ చేశారు. ఓ ఆరేడు నెలలు ఉండి, సినిమా కుదిరితే ఓకే.. లేకపోతే ఢిల్లీ వెళ్లిపోవాలనుకున్నాను. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా అవకాశం ఇచ్చారు. ఈ బేనర్లో తొలి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా రెండో సినిమా కూడా ఇందులో చేయడం ఆనందంగా ఉంది. * ఇంతకీ ‘ఆహా కల్యాణం’ మాతృక ‘బ్యాండ్ బాజా బారాత్’ చూశారా? ఆ సినిమా విడుదలవ్వగానే చూశాను. అయితే, ఈ చిత్రం ‘ఆహా కల్యాణం’గా రీమేక్ అవుతుందని, అందులో నాకే అవకాశం వస్తుందని అనుకోలేదు. వచ్చిన తర్వాత మాత్రం చూడలేదు. ఎందుకంటే, అనుష్క శర్మ ప్రభావం నా మీద ఉండకూడదనుకున్నా. * ‘పెళ్లి’ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.. అసలు పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదో రోజు పెళ్లి చేసుకుని సెటిలవుతా. వివాహ బంధం చాలా గొప్పది. * పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఏంటనుకుంటున్నారు? వయసుతో సంబంధం లేదు. జీవితంలో సెటిల్ అవ్వడం ప్రధానం. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మానసికంగా రెడీ అయినప్పుడే పెళ్లి చేసుకోవాలి. నా సిస్టర్ నుపుర్‌కి పద్ధెనిమిదేళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ‘నువ్వు మాత్రం అలా చేసుకోవద్దు’ అని చెప్పింది. కొన్నాళ్లు జీవితాన్ని ఎంజాయ్ చేసి, పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది. * ఈ సినిమాలో నానితో మీ పెళ్లి చాలా వైభవంగా జరిగి ఉంటుంది. నిజజీవితంలో ఎలాంటి వ్యక్తిని పెళ్లాడాలను కుంటున్నారు. వైభవంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి వ్యక్తిని పెళ్లాడాలో నిర్ణయించుకోలేదు. నా పెళ్లి నిరాడంబరంగా జరిగినా ఫర్వాలేదు. కానీ, నా పెళ్లికి వచ్చేవాళ్లందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలి. * నాని గురించి చెప్పండి? నాని యాక్ట్ చేసిన ‘ఈగ’ సినిమాలో కొన్ని సీన్స్ చూశాను. తను మంచి నటుడు. ఎప్పుడైతే కోస్టార్ మంచి పర్ఫార్మరో, అప్పుడు ఆటోమేటిక్‌గా తనకు పోటీగా బాగా యాక్ట్ చేయాలనే పట్టుదల ఏర్పడుతుంది. * అవసరమైతే బికినీ ధరిస్తానని, లిప్ లాక్కి రెడీ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎప్పటికీ ఆ మాట మీదే ఉంటారా? తప్పకుండా. చీరలు, చుడీదార్లు వేసుకుని ఈత కొట్టలేముగా? మరి.. సినిమాలో అలాంటి సీన్స్‌లో బికినీ వేసుకుంటే తప్పేంటి? అలాగే మంచి రొమాంటిక్ స్టోరీ అనుకోండి... హీరో హీరోయిన్ మధ్య లిప్‌లాక్ సీన్స్ ఉంటాయి కదా. అవి చేస్తేనే సీన్ పండుతుంది. కథకి అవసరమైనవి చేయడానికి నేను వెనకాడను. -
సినిమా చూస్తే పెళ్లి మండపంలో ఉన్నట్లే...
‘‘ఓ సూపర్‌హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే ఎవరికైనా కొంచెం టెన్షన్‌గానే ఉంటుంది. ఆ సినిమా వంద శాతం విజయం సాధిస్తే, రీమక్ 150 శాతం సక్సెస్ అయ్యేలా వర్క్ చేయాలి’’ అన్నారు నాని. హిందీలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘బ్యాండ్ బాజా బరాత్’. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నాని, వాణికపూర్ జంటగా తెలుగులో ‘అహా కళ్యాణం’ పేరుతో తెలుగులో పునర్నిర్మించింది. ఎ. గోకుల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ధరన్‌కుమార్ స్వరపరచిన ఈ చిత్రం పాటలు విజయం సాధించిన నేపథ్యంలో బుధవారం ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ -‘‘బ్యాండ్ బాజా ఢిల్లీ నేపథ్యంలో సాగుతుంది. ఈ రీమేక్ మన దక్షిణాదికి అనుగుణంగా చేయడం జరి గింది. ఇలాంటి కథలతో సినిమాలు వచ్చినప్పటికీ, ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురి చేస్తుంది. మన ఇంట్లో పెళ్లి జరుగుతున్న ఫీల్‌ని కలగజేస్తుంది’’ అన్నారు. తొలి ప్రయత్నంగా తెలుగులో నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానని యశ్‌రాజ్ సంస్థ ప్రతినిధి పదమ్‌కుమార్ చెప్పారు. ఈ సంస్థలో చేసిన రెండో సినిమా ఇదని వాణీకపూర్ తెలిపారు. ఇంకా ధరన్కుమార్తో పాటు పాటల రచయిత కృష్ణచైతన్య కూడా పాల్గొన్నారు. -
రేడియో మిర్చి లో ఆహా కళ్యాణం టీమ్
-
నాని నాకు గర్ల్‌ఫ్రెండ్!
టాలీవుడ్ నటుడు నాని నాకు గర్ల్ ఫ్రెండ్ లాంటివాడంటోంది బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ పంజాబీ భామ యాష్ ఫిలింస్ సంస్థ నిర్మించిన సుద్ద దేశి రొమాన్స్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తాజాగా అదే సంస్థ తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఆహా కల్యాణం చిత్రంతో దక్షిణాదికి వేంచేస్తోంది. టాలీవుడ్ నటుడు నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం త్వరలో తెరపైకి రానుంది. వాణీ కపూర్ మాట్లాడుతూ హిందీలో తెరకెక్కిన బాండ్ బాజా బారాత్ నా ఫేవరెట్ చిత్రాల్లో ఒకటని పేర్కొంది. ఈ చిత్ర కథ, పాత్రలు చాలా సహజ సిద్ధంగా ఉంటాయని అంది. మంచి ఎమోషనల్ అంశాలతో కూడిన అందమైన ప్రేమ కథా చిత్రానికి చెప్పింది. అలాంటి చిత్రం తమిళం, తెలుగు రీమేక్‌లో నటించే అవకాశం రావడంతో మరో మాట లేకుండా నటించడానికి ఒప్పేసుకున్నట్లు తెలిపింది. చాలా మంది ఉత్తరాది హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారని అందుకే భాష తెలియకపోయినా ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ చిత్రంలో నటించానని చెప్పింది. చిత్రంలో నటించిన సహ నటుడు నాని గురించి చెప్పమంటే తాను ఆయన్ని ఒక గర్ల్‌ఫ్రెండ్‌గా ట్రీట్ చేశానని తెలిపింది. షూటింగ్లో ఆయన్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. పోట్లాడాను కూడా. ఇవన్నీ నాని చాలా ఓర్పుగా భరించారు. ఆయన చాలా నెమ్మదస్తుడు. మర్యాదస్తుడు. షూటింగ్ తొలి షాట్ పూర్తి అవగానే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యిపోయాం. నటనాపరంగా నాన్ని చాలా హెల్ప్ చేశారు. చాలా స్వీట్ పర్సన్. ఆయన భార్య కూడా నానితో కలిసి నటించడం చాలా కంఫర్టబుల్‌గా ఉంది అని పేర్కొంది. -
'ఆహా కళ్యాణం' మూవీ స్టిల్స్
-
'ఆహా కళ్యాణం' ఆడియో ఆవిష్కరణ
-
సవాళ్లతో కూడిన సినిమా : వాణీకపూర్
న్యూఢిల్లీ: నటనలో అనుభవం లేకపోవడం వల్ల శుద్ధ్ దేసీ రొమాన్స్ షూటింగ్ సమయంలో చాలా కంగారు పడ్డానని చెప్పింది ఢిల్లీ యువతి వాణీకపూర్. ఇందులో సుశాంత్‌సింగ్, పరిణీతి చోప్రా ప్రధానపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. జైపూర్ నేపథ్యంగాసాగే ఈ ప్రేమకథను యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆడిషన్లో అందరినీ మెప్పించిన వాణికి ఇందులో అవకాశం ఇచ్చారు. ఈ సంస్థ నుంచి ఎందరో పెద్ద నటులుగా ఎదిగారని, అందుకే షూటింగ్ సమయంలో ఎంతో బాధ్యతగా నడుచుకున్నానని తెలిపింది. ‘నాకు ఇందులో అవకాశం వచ్చిందని తెలియగానే సంతోషం కంటే సవాల్‌ను ఎదుర్కొంటున్నట్టు అనిపించింది. నాపై ఎంతో బాధ్యత ఉందని గ్రహించాను. బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు మనీశ్‌శర్మ, నిర్మాత ఆదిత్యచోప్రాను ఇబ్బంది పెడుతున్నానేమోనని మొదట్లో భయపడ్డాను’ అని వివరించింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తదనంతరం నిర్మించే మూడు సినిమాల్లోనూ వాణి హీరోయిన్గా కనిపిస్తుంది. బ్యాండ్ బాజా బారాత్ తెలుగు/తమిళ రీమేక్‌లోనూ ఈ బ్యూటీ మెరవనుంది. దీనిని కూడా యశ్ సంస్థే తీస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ‘కథలో పెద్దగా మార్పు ఉండదు కానీ సాంస్కృతిక అంశాలు మాత్రం వేరుగా ఉంటాయి. మూలకథలోని విషయాలను దక్షిణాది ప్రేక్షకులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దాం’ అని చెప్పింది. సినీ కుటుంబం నుంచి రాలేదు కాబట్టి నటనకు అలవాటు పడడం కాస్త కష్టమేనని చెప్పిన వాణి మొదట మోడల్‌గా పనిచేసి తరువాత బాలీవుడ్లో అడుగుపెట్టింది. ‘మాది ఢిల్లీ. ముంబైలో ఎవరూ తెలియకున్నా అక్కడికి వెళ్లాలి. కాబట్టి బాలీవుడ్‌కు అలవాటుపడడానికి కాస్త సమయం పడుతుంది’ అని వివరించింది.