ఆ సినిమా ట్రైలర్ కు 2 కోట్ల వ్యూస్ | Befikre Official Trailer Grab 2 Crore Views | Sakshi
Sakshi News home page

ఆ సినిమా ట్రైలర్ కు 2 కోట్ల వ్యూస్

Published Tue, Oct 18 2016 12:24 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

ఆ సినిమా ట్రైలర్ కు 2 కోట్ల వ్యూస్

ఆ సినిమా ట్రైలర్ కు 2 కోట్ల వ్యూస్

పారిస్: రణవీర్ సింగ్, వాణికపూర్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బేఫికర్' సినిమా ట్రైలర్ ఆన్ లైన్ లో దూసుకుపోతోంది. వారం క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ను రెండు కోట్లుపైగా వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ లో ఇప్పటి వరకు 20,583,372 మంది ఈ ట్రైలర్ వీక్షించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే కోటికి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.

ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్, వాణి కపూర్ల మధ్య రొమాంటిక్ సీన్స్ కనువిందు చేస్తున్నాయి. వీరిద్దరూ ఏమాత్రం మొహమాటం లేకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో విజృంభించారు. ఈ సినిమాలో ముద్దు సీన్లకు కొదువే లేదు. ఫ్యాషన్ కు పుట్టినిల్లు అయిన పారిస్ లో అత్యధిక భాగం షూటింగ్ చేశారు. డిసెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement