జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అన్న మాదిరి ‘‘ప్రతి ఒక్కరి కెరీర్‌లో డిఫరెంట్ జర్నీస్ ఉంటాయి. ఒకరితో ఒకరికి పోలికలు పెట్టి చూడడం సరికాదు’’ అంటున్నారు కథానాయిక వాణీకపూర్. ఈ బ్యూటీ ఈ స్టేట్‌మెంట్ ఇవ్వడం వెనక ఓ కారణం ఉంది. అదేంటంటే... దాదాపు ఐదేళ్ల క్రితం ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ మూవీతో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చారు వాణి. ఆ తర్వాత ‘ఆహా కల్యాణం’ సినిమాతో సౌత్ గడప తొక్కారు. మళ్లీ బాలీవుడ్‌కి వెళ్లి ‘బెఫీక్రే’ (2016) సినిమా చేశారు. ఆ తర్వాత కాస్త స్లో అయ్యారు. మళ్లీ ఈ ఏడాది ఫామ్‌లోకి వచ్చి రణ్‌వీర్‌సింగ్‌తో ఓ సినిమా, హృతిక్–టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ మూవీలో హీరోయిన్‌గా చేయడానికి ఓకే అన్నారు.
మరి.. ఈ ఐదేళ్లలో రెండంటే రెండే బాలీవుడ్ సినిమాలు ఎందుకు చేశారు? అని వాణీని అడిగితే– ‘‘యాక్టర్స్ అందరి కెరీర్ గ్రాఫ్ ఒకేలా ఉండదు. ఎవరి జర్నీ వారికి ప్రత్యేకం. అది వారు ఎంచుకున్న చాయిస్‌లపై ఆధారపడి ఉంటుంది. అలాగే నా పాత్రలను నేనూ ఎంచుకున్నా. కష్టపడ్డాను. కానీ అన్నీ సక్సెస్ అవ్వాలని లేదు. ఆశించిన ఫలితం సాధించినప్పుడు అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయినా నేనీ గ్యాప్‌లో బాగా రిలాక్స్ అయ్యాను. సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలనుకున్నా. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు వాణీకపూర్.
పోలిక వద్దు
Published Wed, Sep 5 2018 12:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment