దిమ్మతిరిగే రొమాన్స్తో ట్రైలర్ రిలీజ్ | 'Befikre' trailer launch: Eiffel Tower witnesses desi romance | Sakshi
Sakshi News home page

దిమ్మతిరిగే రొమాన్స్తో ట్రైలర్ రిలీజ్

Published Tue, Oct 11 2016 11:20 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దిమ్మతిరిగే రొమాన్స్తో ట్రైలర్ రిలీజ్ - Sakshi

దిమ్మతిరిగే రొమాన్స్తో ట్రైలర్ రిలీజ్

పారిస్: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్, వాణికపూర్ జంటగా నటించిన ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బేఫికర్' చిత్రం ట్రైలర్ విడుదలైంది. పారిస్ లోని ఈపిల్ టవర్ దగ్గర చిత్ర యూనిట్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ప్రపంచంలోని చరిత్ర ప్రసిద్ధమైన కట్టడాల్లో ఒకటైన ఈపిల్ టవర్ వద్ద ట్రైలర్ విడుదల చేసిన తొలి భారతీయ చిత్రంగా బేఫికర్ నిలిచింది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ల మధ్య ఫుల్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి.

బయటి ప్రపంచానికి ఏమాంతం భయపడకుండా ఇద్దరు యువతీ యువకులు తమకు నచ్చింది ఎలా చేశారని కథాంశంతోపాటు కొంత సందేశం కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ముద్దు సీన్లకు కొదువే లేదు. మొత్తంగా చెప్పాలంటే దేశీ రోమాన్స్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర ట్రైలర్ ప్రకారం ఈ సినిమాలో రణ్ వీర్ ఏమాత్రం జంకూబొంకూ లేకుండా నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ కోసం పారిస్ తమకు చాలా బాగా సహకరించిందని, షూటింగ్లకు సహకరించే నగరాల్లో పారిస్ ముందుంటుందని చెప్పొచ్చని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement