‘ప్రేక్షకురాలిగా అతడి సినిమాలు ప్రేమిస్తా’ | As an audience, I love watching Ranveer's films: Vaani Kapoor | Sakshi
Sakshi News home page

‘ప్రేక్షకురాలిగా అతడి సినిమాలు ప్రేమిస్తా’

Published Tue, Dec 6 2016 6:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

‘ప్రేక్షకురాలిగా అతడి సినిమాలు ప్రేమిస్తా’ - Sakshi

‘ప్రేక్షకురాలిగా అతడి సినిమాలు ప్రేమిస్తా’

ముంబయి: ఒక ప్రేక్షకురాలిగా ఉన్నప్పుడు తాను రణ్‌వీర్‌ సింగ్‌​ చిత్రాలను చూసేందుకు తెగ ఇష్టపడతానని బాలీవుడ్‌ ప్రముఖ నటి వాణి కపూర్‌ చెప్పింది. రణ్‌ వీర్‌ సింగ్‌లాంటి సహనటుడిని తాను ఇంత వరకు చూడలేదని అభిప్రాయపడింది. ‘నాకు రణ్‌ వీర్‌ సింగ్‌తో నటించడమంటే చాలా ఇష్టం అని ముందునుంచే చెబుతున్నాను. ఒక నటిగా, ప్రేక్షకురాలిగా అతడిని బాగా ఇష్టపడతాను. అతడి సినిమాలను చూడడమంటే నాకు చాలా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది.

తన రెండో చిత్రంతోనే రణ్‌ వీర్‌ సింగ్‌ పక్కన నటించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని మురిసిపోయింది. తనకు తెలిసి రణ్‌ వీర్‌ సింగ్‌ చాలా గొప్పవాడని చెప్పింది. వీరిద్దరు కలిసి బేఫికర్‌ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement