
ముంబై: లైవ్ చాట్‌లో తన శరీరంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నెటిజన్‌కు హీరోయిన్ వాణి కపూర్ తనదైన శైలిలో స్పందించి నోరు మూయించారు. తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ.. అతడిపై మండిపడకుండా సానుకూలంగా స్పందిస్తూనే దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన ఆమె తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఏ క్వశ్చన్’ పేరుతో సోమవారం రాత్రి ఆమె లైవ్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ తనపై చేసిన అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు. ఆమె దీనిపై స్పందిస్తూ... ‘మీకు హృదయం ఉంది. కాస్తా మనసుతో ఆలోచించండి. ఎదుటివారిని ద్వేషించకండి’ అంటూ సమాధానం ఇచ్చారు. (వివాదాస్పదంగా బ్లౌజ్.. నటిపై కేసు)
అయితే గతంలో కూడా వాణికి సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్ తన ఫొటో షేర్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. వ్యాయామం దుస్తుల్లో అద్దం ముందు నిలుచుని ఉన్న ఓ ఫొటోను ఇటీవల షేర్ చేశారు. అది చూసిన ఓ నెటిజన్ ‘ఏంటీ మీరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారా?’ అంటూ తన శరీర ఆకృతిపై విమర్శలు చేశాడు. దీనికి వాణి స్పందిస్తూ.. ‘‘జీవితంలో మీరు ఎందుకు కొత్తగా ఉంటానికి ప్రయత్నించడం లేదు. ఎప్పుడు ఇతరులపై విమర్శలు చేయకుండా కాస్తా దయతో వ్యవహరించండి. దయచేసి మీకు మీరు కఠినంగా ఉండటాన్ని మానుకోండి. ద్వేషాన్ని చూపడం ముగించినప్పుడే జీవితం చాలా బాగుంటుంది’’ అంటూ కామెంటుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment