నాపై ఓ ఫెంటాస్టిక్ రూమర్: హీరోయిన్
నాపై ఓ ఫెంటాస్టిక్ రూమర్: హీరోయిన్
Published Wed, Jan 18 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
తాజాగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన బేఫిక్రే సినిమాలో నటించిన వాణీ కపూర్.. తన మీద ఓ ఫెంటాస్టిక్ రూమర్ వచ్చిందని చెబుతోంది. ఆ రూమర్ గురించి ఆమె కాస్తంత సంతోషించింది కూడా లెండి. ఇంతకీ ఆ రూమర్ ఏమిటంటే.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఆమె నటించబోతోందని! ఎలె ఇండియా గ్రాడ్యుయేట్స్ ఫ్యాషన్ షోకు వచ్చిన ఆమెను మీడియా వాళ్లు పలకరించి.. ''ఏంటి, బేఫిక్రే తర్వాత షారుక్ సరసన నటించడానికి మిమ్మల్ని చోప్రా అడిగారట, సైన్ కూడా చేయించేస్తున్నారట'' అని అడిగారు.
''అలా జరిగితే చాలా సంతోషించేదాన్ని. అదో ఫెంటాస్టిక్ రూమర్. అది నిజమైతే బాగుండని అనుకుంటున్నాను. కానీ దాని గురించి నాకు ఏమీ తెలియదు. ఇప్పటికైతే.. ఆ సినిమాలో నేను లేను'' అని వాణీకపూర్ చెప్పింది. రాబోయే సినిమాల సంగతేంటని అడిగితే, ఇప్పటివరకు ఏమీ ప్లాన్ చేయలేదని, ప్రస్తుతం స్క్రిప్టులు చదువుతున్నాను గానీ వేటినీ అంగీకరించలేదని తెలిపింది. ఏదైనా సినిమాకు సైన్ చేస్తే తప్పకుండా చెబుతానంది. ఇక బేఫిక్రే సినిమా కొంతమందికి నచ్చింది గానీ, కొంతమందికి అసలు కనెక్ట్ కాలేదంది. అది రొమాంటిక్ కామెడీ అని.. అలాంటి సినిమా నుంచి ఇంకేం ఆశిస్తారని అడిగింది.
Advertisement
Advertisement