ఆ వదంతులు నమ్మవద్దు: హీరోయిన్ | Vaani Kapoor Finally what happen to her beautiful face | Sakshi
Sakshi News home page

ఆ వదంతులు నమ్మవద్దు: హీరోయిన్

Dec 7 2016 6:03 PM | Updated on Apr 3 2019 6:34 PM

ఆ వదంతులు నమ్మవద్దు: హీరోయిన్ - Sakshi

ఆ వదంతులు నమ్మవద్దు: హీరోయిన్

అందంగా కనిపించేందు సర్జరీలు చేయించుకుందని తనపై వస్తున్న వదంతులకు బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ చెక్ పెట్టింది.

ముంబై: అందంగా కనిపించేందు సర్జరీలు చేయించుకుందని తనపై వస్తున్న వదంతులకు బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ చెక్ పెట్టింది. ఇటీవల 'బేఫికర్' మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ చూసిన నెటిజన్లు మొదట రణవీర్ సింగ్, వాణీ కపూర్ లిప్ లాక్ సీన్లపై కామెంట్ చేయగా, ఇప్పుడు వాణీ అందంపై వదంతులు ప్రచారం చేశారు. మూడేళ్ల కింద వాణీ ఎలా ఉంది ఇప్పుడు ఇంత అందంగా కనిపిస్తుందేంటని ఆశ్చర్చపోతున్నారు. కచ్చితంగా ముఖానికి సర్జరీ చేయించుకుందని, అందుకే మునుపటి కంటే కూడా ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి.

తాను అందంగా ఎలా మారిందో స్వయంగా హీరోయిన్ వాణీనే ఓ కార్యక్రమంలో తెలిపింది. 'గతంలో కంటే ఇప్పుడు ఎంతో బరువు తగ్గాను. అందుకే నా ముఖంలో అభిమానులు, ప్రేక్షకులు ఎంతో మార్పును గమనిస్తున్నారు. దీంతో పాటు మేం 'బేఫికర్' షూటింగ్ కోసం పారిస్ వెళ్లాం. అక్కడికి వాతావరణం ఎంతో చల్లగా ఉంటుందని, అది కూడా చాలా హెల్ప్ అయింది. కెమెరా పలు యాంగిల్స్ లో హీరోయిన్లు చాలా విభిన్నంగా కనిపిస్తారు. నా రెండో మూవీ 'బేఫికర్' ఈ 9న విడుదలకు సిద్ధంగా ఉంది' అని వాణీ చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని, హీరోయిన్లు ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా వారిపై కామెంట్ చేయడం తనకు ఇష్టం ఉండదని 'బేఫికర్' భామ వాణీకపూర్ అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement