నాని నాకు గర్ల్‌ఫ్రెండ్! | I treat Nani like one of my girlfriends | Sakshi
Sakshi News home page

నాని నాకు గర్ల్‌ఫ్రెండ్!

Published Tue, Feb 4 2014 4:05 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నాని నాకు గర్ల్‌ఫ్రెండ్! - Sakshi

నాని నాకు గర్ల్‌ఫ్రెండ్!

టాలీవుడ్ నటుడు నాని నాకు గర్ల్ ఫ్రెండ్ లాంటివాడంటోంది బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ పంజాబీ భామ యాష్ ఫిలింస్ సంస్థ నిర్మించిన సుద్ద దేశి రొమాన్స్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తాజాగా అదే సంస్థ తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఆహా కల్యాణం చిత్రంతో దక్షిణాదికి వేంచేస్తోంది. టాలీవుడ్ నటుడు నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం త్వరలో తెరపైకి రానుంది. వాణీ కపూర్ మాట్లాడుతూ హిందీలో తెరకెక్కిన బాండ్ బాజా బారాత్ నా ఫేవరెట్ చిత్రాల్లో ఒకటని పేర్కొంది. ఈ చిత్ర కథ, పాత్రలు చాలా సహజ సిద్ధంగా ఉంటాయని అంది. మంచి ఎమోషనల్ అంశాలతో కూడిన అందమైన ప్రేమ కథా చిత్రానికి చెప్పింది.
 
 అలాంటి చిత్రం తమిళం, తెలుగు రీమేక్‌లో నటించే అవకాశం రావడంతో మరో మాట లేకుండా నటించడానికి ఒప్పేసుకున్నట్లు తెలిపింది. చాలా మంది ఉత్తరాది హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారని అందుకే భాష తెలియకపోయినా ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ చిత్రంలో నటించానని చెప్పింది. చిత్రంలో నటించిన సహ నటుడు నాని గురించి చెప్పమంటే తాను ఆయన్ని ఒక గర్ల్‌ఫ్రెండ్‌గా ట్రీట్ చేశానని తెలిపింది. షూటింగ్‌లో ఆయన్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. పోట్లాడాను కూడా. ఇవన్నీ నాని చాలా ఓర్పుగా భరించారు. ఆయన చాలా నెమ్మదస్తుడు. మర్యాదస్తుడు. షూటింగ్ తొలి షాట్ పూర్తి అవగానే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యిపోయాం. నటనాపరంగా నాన్ని చాలా హెల్ప్ చేశారు. చాలా స్వీట్ పర్సన్. ఆయన భార్య కూడా నానితో కలిసి నటించడం చాలా కంఫర్టబుల్‌గా ఉంది అని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement