లండన్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారట హీరోయిన్ వాణీ కపూర్. విహార యాత్ర కోసం కాదు. షూటింగ్ కోసం సూట్‌కేస్ సర్దుకోనున్నారు వాణీ కపూర్. దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె హిందీ చిత్రం అంగీకరించారు. పరేష్ రావల్, వాణీ కపూర్, అపర్‌శక్తి ఖురానా ప్రధాన ΄ాత్రధారులుగా ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నవ్యజోత్ గులాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ కథ రీత్యా వాణీ కపూర్, అపర్‌శక్తి సోదరీ సోదరుడుగా నటించనున్నారట. ప్రస్తుతం మానవ సంబంధాలు ఏ విధంగా మారుతున్నాయి? ఈ మార్పులు వారి కుటుంబాలపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తున్నాయి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని టాక్. ఈ సినిమా చిత్రీకరణను ముందుగా వేసవిలో లండన్‌లో ΄్లాన్ చేస్తున్నారట. ఎక్కువ శాతం షూటింగ్ అక్కడే జరుగుతుందట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలన్నది చిత్ర యూనిట్ ΄్లాన్ అని భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment