లండన్‌లో ఘనంగా తాల్‌ 20వ వార్షికోత్సవం, ఉగాది సంబరాలు | TAL 20th Anniversary And Ugadi Celebrations In London, UK | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా తాల్‌ 20వ వార్షికోత్సవం, ఉగాది సంబరాలు

Published Mon, Apr 28 2025 10:07 AM | Last Updated on Mon, Apr 28 2025 10:18 AM

TAL 20th Anniversary And Ugadi Celebrations In London, UK

తెలుగు అసోసీయేషన్‌ ఆఫ్‌ లండన్‌(తాల్‌(TAL)) 20వ వార్షికోత్సవం తోపాటు, ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిలల​ 26న ఈస్ట్ లండన్‌లోని లేక్‌వ్యూమార్కీలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. దీంతో ఇది తాల్‌ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల తన బృందంతో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో ఈవెంట్‌ కన్వీనర్ రవీందర్ రెడ్డి గుమ్మకొండ, కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల ప్రత్యేక అథిధులుగా పాల్గొన్నారు. ముందుగా ఫల్గాం విషాద సంఘటనలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిముషాల మౌనం పాటించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాల్‌ సమైక్యతను, మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. 

తాల్‌ 20 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా  ఛైర్మన్‌ రవి సబ్బా ఈ తాల్‌ విజయ పరంపరకు తోడ్పడిన గత చైర్మన్‌లు, ట్రస్టీలు, ఉగాది కన్వీనర్‌లందర్నీ ఘనంగా సత్కరించారు. తాల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాములు దాసోజుని తాల్‌ కమ్యూనిటీ లీడర్‌షిప్‌ అవార్డుతో సత్కరించారు. తాల్‌ వార్షిక పత్రిక "మా తెలుగు 2025"ని కూడా ఈ వేడుకలో ఆవిష్కరించారు. అందుకు కృషి చేసిన సూర్య కందుకూరి,  ప్రధాన సంపాదకుడు రమేష్ కలవల తదితర సంపాదక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. 

అలాగే ఈ కార్యక్రమంలో తాల్‌ చరిత్రను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీ ప్రదర్శన ద్వారా గత రెండు దశాబ్దాల విశేషాలను చిత్ర మాలికా రూపంలో ప్రదర్శించారు. ఇక ఈ వేడుకలోనే స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ సత్య పెద్దిరెడ్డి  తాల్‌ ప్రీమియర్ లీగ్ (TPL) T20 క్రికెట్ సీజన్‌ను కూడా ప్రారంభించారు. ముఖ్యఅతిథి రామ్ మిరియాల2025 ఛాంపియన్ ట్రోఫీని ఆవిష్కరించారు.

(చదవండి: టంపాలోనాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement