ugadi
-
హోలీ.. ఉగాది పండుగలు: మార్చిలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..
ఫిబ్రవరి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మార్చిలో బ్యాంక్ హాలిడేస్➤మార్చి 7 (శుక్రవారం): 'చాప్చార్ కుట్' పండుగను సందర్భంగా మిజోరాంలో సెలవు దినం.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤మార్చి 22 (శనివారం): 'బీహార్ దివస్' లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మార్చి 22న బీహార్‌లో బ్యాంకులకు సెలవు.➤మార్చి 27-28 (గురువారం-శుక్రవారం): ఇస్లామిక్ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు అయిన షబ్-ఎ-ఖదర్ను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ మార్చి 27న సెలవు దినంగా పాటిస్తుంది. రంజాన్ నెల చివరి శుక్రవారం అయిన జుమాత్-ఉల్-విదాను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం మార్చి 28న సెలవు దినంగా పాటిస్తుంది.➤మార్చి 31 (సోమవారం): మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మార్చిలో ఈద్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
ఉగాది సాహిత్య సమ్మేళనం, ఎంట్రీలకు ఆహ్వానం!
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆధ్వర్యంలో..విశ్వావసు నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగాఉగాది సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం ఉచితమని తెలిపారు. ‘విశ్వాససు’ నామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి ‘సాహిత్య స్వాగతం’ పలుకుతూ వైవిధ్యభరితమైన సాహిత్యాంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.తేదీ: ఏప్రిల్ 13, 2025, ఆదివారంసమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకావేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.సంగ్రహ కార్యక్రమం ప్రారంభ సభకవి సమ్మేళనంమహిళా పృఛ్ఛకులతో అష్టావధానం - ‘ద్విశతావధాని’ డా బులుసు అపర్ణనూతన పుస్తకావిష్కరణ సభ-2025కవి సమ్మేళనం నమోదు వివరాలుభారత దేశం, సింగపూర్, అమెరికా దేశ సంస్థల నిర్వహణలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహిత్య సమ్మేళనం లో పాల్గొని తమ స్వీయ కవితలని సభా ముఖంగా వినిపించే ఆసక్తి ఉన్నవారు సకాలంలో ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకుని సహకరించమని కోరుతున్నాం.నమోదు పత్రంhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSc8fSIPdScAsrz89h6Q9rAWNIqazuTtUeWPgpIpew93Wv3qEQ/viewformనమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025• నమోదు పత్రం లో అందిన కవితలు మాత్రమే పరిశీలించబడతాయి.• కవిత వ్యవధి 3 నిమిషాలు (25 వాక్యాలు) దాటరాదు.• కవిత ఏదైనా సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక అంశంపై రాయవచ్చు. మత కుల రాజకీయ ప్రసక్తి లేకుండా కవిత శుభసూచకంగా ఉండాలి.• స్థానికులకి తగిన గుర్తింపు, బయట ప్రాంతాలనుండి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.• కవితల ఎంపికలో అంతిమ నిర్ణయం నిర్వాహకులదే.నూతన పుస్తకావిష్కరణలునమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025 (ఉగాది)‘విశ్వావసు’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనంలో తమ నూతన గ్రంధాలు సభా ముఖంగా ఆవిష్కరించ దలచుకున్న వారు వివరాలతో సంప్రదించాలని, కేవలం 2025 లో ప్రచురించబడిన కొత్త పుస్తకాలు మాత్రమే ఆవిష్కరణకి పరిశీలిస్తామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.వివరాలకోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లుప్రధాన సమన్వయ కర్త: రాధిక మంగిపూడి (+91 9029409696)రత్న కుమార్ కవుటూరు +65 91735360 (సింగపూర్)డా. వంశీ రామరాజు +91 9849023852 (హైదరాబాద్)డా. వంగూరి చిట్టెన్ రాజు +1 8325949054 (హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా) మరిన్ని NRI వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి: -
ఉగాదికి గద్దర్(సినిమా)అవార్డులు: భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్:ఉగాదికి గద్దర్ (సినిమా) అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఈ మేరకు శనివారం(జనవరి18) సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు,అధికారులకు సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు.అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు చెప్పారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు.గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవార్డుల ప్రదానం జరగలేదన్నారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ఏటా అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ చర్చించింది.గతంలో తెలుగు సినిమా రంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు బహుకరించేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల సంప్రదాయం కొనసాగినప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సినిమా రంగానికి అవార్డులివ్వలేదు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత సినిమా రంగానికి తెలంగాణ యుద్ధనౌక గద్దర్ పేరుతో అవార్డులివ్వాలని నిర్ణయించింది. -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకేలో ఉగాది సంబరాలు!
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (తెలుగు సంఘం) వార్షిక ఉగాది సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇది తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు ఒక చిరస్మరణీయ వేడుక. ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, ఈ కార్యక్రమం సంస్థకు ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అంతేకాకుండా 2024-26 కాలానికి కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు.ఎడిన్బర్గ్ కాలేజ్-గ్రాంటన్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది తెలుగువారు హాజరయ్యారు. స్కాట్లాండ్లో నివశిస్తున్న తెలుగు సమాజంలో ఉన్నటువంటి బలమైన బంధం, ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది.ముఖ్య అతిథులుగా భారత కాన్సుల్ జనరల్ బిజయ్ సెల్వరాజ్, లోథియన్ ప్రాంతానికి చెందిన ఎంఎస్పిలు సారా బోయాక్, ఫోయ్సోల్ చౌదరి, కొల్లిన్టన్ కౌన్సిలర్ స్కాట్ ఆర్థర్ సహా ప్రముఖులు గౌరవ అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి ఉనికి ఈ కార్యక్రమం వైభవాన్ని పెంచింది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ఎడిన్బర్గ్ లాంటి నగరంలో ఉగాదిని జరుపుకోవడం గురించి, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.“టాస్-యుకె ఉగాది సంబరాలు 2024” లో తెలుగు సమాజం ప్రతిభ, సంప్రదాయాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అధికారులు.సిలికానాంధ్రా వారి ‘మనబడి’ ద్వారా తెలుగు నేర్చుకునే పిల్లలు “మా తెలుగు తల్లికి” ప్రార్థనాగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.2022-24 కాలానికి గాను సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించిన విజయ్ కుమార్ పర్రి తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతిథులు, ముఖ్య అతిథులు మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ క్రార్యక్రమాన్ని ప్రారభించారు. సమూహ నృత్యాలు, సోలో గానం, తెలుగు కవితల పారాయణ, అనంత్ రామానంద్ గార్లపాటి చేసిన ముఖ్యమైన ఉగాది పంచాంగంతో సహా మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలతో వేదిక ఆకర్షణీయంగా మారింది. ఐదుగురు గాయకులు, బ్యాండ్ ప్లేయర్లతో కూడిన స్థానిక భారతీయ బ్యాండ్ "వాయిస్ ఆఫ్ ఎకో" ప్రదర్శన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచింది. వారి ఆకర్షణీయమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, ఉత్సవాలకు అదనపు ఉత్సాహాన్ని జోడించాయి.హోస్ట్స్ సత్య శ్యామ్ జయంతి, రంజిత్ నాగుబండి, శ్రుతి పల్లెమోని, స్రవంతి పొట్లూరి, హిమజా మాచిరాజు రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు నైపుణ్యంగా మార్గనిర్దేశం చేసి, శక్తిని, ఉత్సాహాన్ని నింపారు. వారి చమత్కారమైన పరిహాసం, ఆకర్షణీయమైన సంభాషణలు హాజరైనవారిని రోజంతా వినోదభరితంగా ఉంచాయి.సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, ఈ కార్యక్రమంలో సాంప్రదాయ సమకాలీన దుస్తులలో వివిధ ఋతువుల పోకడలను ప్రదర్శించే ఫ్యాషన్ షో ప్రదర్శన కూడా జరగడం విశేషం.ఎడిన్బర్గ్ దీపావళి, కన్నడ అసోషియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ - ఎడిన్బర్గ్, ఎడిన్బర్గ్ హిందు మందిర్ అండ్ కల్చరల్ సెంటర్, ఇండియన్ ఆర్ట్స్ కనెక్షన్, 3 గుడ్ డీడ్స్, స్కాటిష్ ఇండియన్ ఆర్ట్స్ ఫోరం, ఒడిశా సొసైటి ఆఫ్ స్కాట్లాండ్, బీహార్ కమ్యూనిటీ మరియు స్కాటిష్ ఇండియన్ ముస్లిం అసోషియేషన్ వంటి ఇతర భారతీయ సంఘాల అతిథులు చేరడం ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.వేడుకను విజయవంతం చేయడంలో ఈవెంట్ స్పాన్సర్లు ప్రధాన స్పాన్సర్లు బ్రైటర్ మోర్టగేజెస్, బెల్లి ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్, సహ-స్పాన్సర్ అల్లి భవన్లు కీలక పాత్ర పోషించారు, .ఇక 2024-26 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన టాస్-యూకే ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గడ్డం, సంయుక్త కార్యదర్శి నిరంజన్ నూక, కోశాధికారి విజయ్ కుమార్ పర్రి, మహిళా మరియు ప్రాజెక్టుల కార్యదర్శి మాధవిలత దండూరి, కల్చరల్ సెక్రెటరీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి, క్రీడా కార్యదర్శి బాలాజీ కర్నాటి, యువజన శాఖా కార్యదర్శి రాజశేఖర్ సాంబ, ఐటి కార్యదర్శి జాకీర్ షేక్, పిఆర్ కార్యదర్శి నరేష్ దీకొండలను సభ్యులకు పరిచయం చేశారు.చివరిగా మాజీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా, గౌరవనీయ చైర్‌పర్సన్‌గా సత్కరించారు.జన గణ మన, కొత్తగా నియమితులైన జనరల్, జాయింట్ సెక్రటరీల ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది. ఇక ఈ కార్యక్రమంలో హాజరైన తెలుగువారు సంస్కృతి, స్నేహం, వేడుకలతో నిండిన రోజుగా మధురమైన జ్ఞాపకాలతో బయలుదేరారు.“టాస్-UK ఉగాది సంబరాలు 2024” ఒక తెలుగు వారసత్వ వేడుక మాత్రమే కాదు. తెలుగు సమాజం ఐక్యత, స్థితిస్థాపకతకు నిదర్శనం. టాస్-యుకె అభివృద్ధి చెందడమేగాక ఉగాది స్ఫూర్తిని తెలుగు వారిలో నింపుతూ.. రాబోయే సంవత్సరాల్లో మరింత మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా తెలుగు వారి శ్రేయస్సుకు చేదోడుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. (చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!) -
చికాగోలో ఘనంగా ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు!
అమెరికా ఇల్లినాయిస్లోని చికాగోలో చికాగో తెలుగు అసోసీయేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం చికాగోలోని బాలాజీ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిది. ఈ వేడకలకు దాదాపు 500 మందికి పైగా హాజరయ్యారు. సీటీఏ కల్చరల్ డైరెక్టర్ శ్రీమతి సుజనా ఆచంట, ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలకి, వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపాలు, శాస్త్రీయ సంగీతం, తెలుగు భాష స్కిట్లు ఎంతగానో అరించాయి. అలాగే ఉగాది పచ్చడి పోటీలు కూడా నిర్వహించారు. శోభా తమ్మన, జానకి నాయర్, ఆశా అడిగా, వనిత వీరవల్లి వంటి గౌరవనీయ గురువులు ఆధ్వర్యంలో దాదాపు వందమందికి పైగా పిల్లలు శాస్త్రీయ నృత్యాలు, సంగీతంతో అలరించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో గురు రమ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన అనతి నీయారాతో సహా..ముగింపులో రవిశంకర్ మరియు అతని బృందం పాడిన 'భో శంభో', 'బ్రహ్మ ఒకటే' వంటి భక్తి పాటలు హైలెట్‌గా నిలిచాయి. ఈ ఈవెంట్‌కి అతిధులుగా సత్య, ఏటీఏకు చెందిన కడిమళ్ల, కరుణాకర్ మాధవరం తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సీటీఏ కల్చరల్ కమిటీ సభ్యులు రాణి వేగే, సుజనా ఆచంట, అనిత గోలి, శ్రీ, చిట్టినేని, మధు ఆచంట, అనూష విడపలపాటి, ప్రత్యేక వాలంటీర్ల బృందం, సాయిచంద్ మేకల, భవానీ సరస్వతి, మాధవి తిప్పిశెట్టి, రత్న చోడ, వెంకట్ తొక్కాల,నాగభూషణ్ భీమిశెట్టి, పృద్వి సెట్టిపల్లి, సునీల్, రమేష్, నరేంద్ర, బాల, చక్రధర్, వివేక్ కిలారు, రామానుజం, శశిధర్, రమేష్, మృదుల, సీటీఏ బోర్డు సభ్యులు ప్రవీణ్ మోటూరు, రావు ఆచంట, శేషు ఉప్పలపాటి, అశోక్ పగడాల, ప్రసాద్ తాళ్లూరు, వేణు ఉప్పలపాటి, రాహుల్ విరాటపు, రమేష్ మర్యాల, తదితరులు కీలకపాత్ర పోషించారు. కాగా, సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, జయప్రదం చేయడంలో సహాయసహకరాలు అందించిన సీటీఏ బోర్డు సభ్యులకు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
ఉగాది రోజు ఊహించని అతిథి.. అలేఖ్య తారకరత్న ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో తారకరత్న కుటుంబం ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి తెలుగు నూతన సంవత్సర పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఉగాది వేడుకలకు స్వయంగా తానే తారకరత్న ఇంటికి వెళ్లారు. పండుగ రోజు సంతోషంగా వారితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అలేఖ్య తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా లైఫ్‌లో నాన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అంకుల్ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయి. కష్ట, సుఖాల్లోనూ ఎప్పుడు మా వెంటే ఉంటూ ధైర్యం చెప్పే వ్యక్తి. ఎలక్షన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం ప్రత్యేకంగా రావడం ఇంతకు మించిన సంతోషం లేదు. ఇలాంటి సమయంలో మాతో ఉంటే ఆ విలువేంటో ఆయనకే తెలుసు. ఉగాది రోజును మాకు స్పెషల్‌గా మార్చిన విజయ్‌సాయి అంకుల్‌పై మా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది' అంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. కాగా.. గతేడాది గుండెపోటుతో తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
ట్రెండీ లుక్‌లో యషికా ఆనంద్..కూతురితో మంచు లక్ష్మి సెలబ్రేషన్స్!
ట్రెండీ లుక్‌లో యషిక ఆనంద్.. ఉగాది ఫెస్టివల్ మూడ్‌లో అతుల్య రవి... నభా నటేశ్ ట్రైడిషనల్ లుక్ వైరల్... గ్రీన్ డ్రెస్‌లో తేజస్విని గౌడ హోయలు.. కూతురితో మంచు లక్ష్మి ఉగాది సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
-
అందరికీ మంచి జరగాలి..
-
Ugadi 2024: ఈ పండుగకి 'ఉగాది' అనే పేరు ఎలా వచ్చిందంటే..?
తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిళ్లలో క్రోధి నామ సంవత్సరం సందడి మొదలైంది. ఉగాది అంటే ప్రతీ ఒక్కరికి గుర్తుకొచ్చేది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే పండుగ ప్రత్యేకత. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే పచ్చడి. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైందని అర్థం. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాఢ్యమి తిథి రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’గా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ నేపథ్యంలో క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఇవి చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు? -
Ugadi 2024: ఆరు రుచులను కలపగా.. విరిసిన 'ఉగాది'
జీవితమనే చెట్టు గొప్ప గొప్ప లక్ష్యాల చిగుర్లు వేసింది ప్రయత్నాల పూత పూసింది విరివిగా కానీ చేదుగా; అభిమానం అడ్డొచ్చి పడింది పిందెలుగా అయితే గుత్తులు గుత్తులుగా, అంతలో.. చింత చిరాకుపడి, పులుపుని రేపడం మొదలుపెట్టింది ఊరుకోని పట్టుదల పచ్చపచ్చగా వ్యాపించి ఎదగడం మొదలుపెట్టింది; కటువుగా కారం చల్లినట్లు.. నిర్ణయాలు వాటి వాటి స్థానం తీసుకున్నాయి; ధైర్యం విషయ గుజ్జుని గ్రహించింది.. లోపాలకు వగరు మందేసింది.. పరిశ్రమ కఠోరంగా అన్నిటినీ కలిపంది.. విజయం తియ్యగా వరించింది కృతజ్ఞత ఎక్కువ మోతాదులో కాకుండా.. తగిన మోతాదులో ఉపయోగించాలని ఉప్పు ఉపదేశించింది.. మొత్తానికి కచ్ఛాపచ్ఛాగా పచ్చడవుతున్న జీవితం.. మాంఛి.. పసందైన షడ్రుచులతో నడుస్తున్నది! :::మాధవి మేళ్ళచెర్వు, గుంటూరు క్రోధి నామ సంవత్సర రాశిఫలాల కోసం క్లిక్ చేయండి -
ఉగాది పంచాంగం.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీ జాతకం తెలుసుకోండి
తెలుగు పంచాంగం ప్రకారం.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. ఆదాయం, ఆరోగ్యం, కుటుంబం, కెరీర్, విద్యా, వివాహ పరంగా ఎలా ఉంటుందనే పూర్తి వివరాలను ఉగాది సంబంధిత కథనాలు మీకోసం.. శ్రీ క్రోధి నామ సంవత్సర మేష రాశిఫలాలు (2024–25) ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3. అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ) గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.. -
Ugadi 2024: నూతన సంవత్సరంలో.. 2024-25 కాల నిర్ణయమిదే..
ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతాం. ఇది తెలుగువాళ్ల పండుగ. ఈ తెలుగు సంవత్సరాదిలో మన రాశి ఎలా ఉంది. ఈ ఏడాది కర్తరీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ రోజు నవనాయక ఫలితాలు ఎలా ఉంటాయి? వంటివి చూసుకుని గానీ కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెట్టారు. మరీ ఈ ఏడాది డొల్లు కర్తరీ ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే..? డొల్లు కర్తరీ ప్రారంభం.. ది.04.05.2024 ప.12:35లకు చైత్ర బహుళ ఏకాదశీ శనివారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం.. ది.05.11.2024, ఉ.10:27లకు వైశాఖ శుద్ధ చవితి శనివారం రోజు నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. కర్తరీ త్యాగం.. ది.28.05.2024 రా.7:21 వైశాఖ బహుళ పంచమి తత్కాల షష్ఠి మంగళవారం రోజు కర్తరీ త్యాగం. ‘‘మృద్దారు శిలాగహకర్మాణివర్జయేత్’’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించుటకు కర్తరీకాలము సరియగునది కాదు. పై సూత్రం ఆధారంగా వాస్తుకర్మలు నూతనంగా ఈ రోజు నుండి చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట మరియు పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, కప్పు విషయమై పని ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. రాబోవు విశ్వావసు నామ సంవత్సరం (2025–26) కర్తరీ నిర్ణయము 4 మే 2025 వైశాఖ శుద్ధ సప్తమి సుమారు సా.గం.7:00లకు డొల్లు కర్తరీ ప్రారంభం. 11 మే 2025 వైశాఖ శుద్ధ చతుర్దశీ సుమారు సా.గం.5:00లకు పెద్ద కర్తరీ ప్రారంభం. 28 మే 2025 జ్యేష్ఠ శుద్ధ విదియ రోజు సుమారు రా.గం.2:00లకు కర్తరీ త్యాగం. నవనాయక ఫలితాలు (2024– 2025) రాజు కుజుడు: కుజుడు రాజయిన సంవత్సరం అగ్నిభయం, వాయువు చేత అగ్ని రెచ్చ గొట్టబడడం, గ్రామ పట్టణాలలో తరచు అగ్ని భయములు ఉండును. వర్షములు ఉండవు. ధరలు అధికం అవుతాయి. రాజులకు యుద్ధములుండును. మంత్రి శని: వర్షపాతము తక్కువ. పంటలు తక్కువగా ఉంటాయి. సమాజంలో ఎక్కువ పాపకర్మలు ఇబ్బందులు సృష్టిస్తాయి. అన్ని వ్యవహారములు మందఫలములు ఇస్తాయి. తరచుగా సమాజంలో నిరంతరం ఆపదలు ఉంటాయి. గోవులకు ఇబ్బంది. తక్కువ స్థాయిలో ఉన్నవారు అందరూ అభివృద్ధిలోకి వస్తారు. సేనాధిపతి శని: సేనలకు రాజుకు సయోధ్య ఉండదు. ప్రజలు అధర్మ వర్తనులు అగుదురు. నల్లధాన్యములు ఫలించును. రాజులు అధర్మవర్తనులు అగుదురు. ప్రజలు పాప కర్మలు అధికం చేస్తారు. రవాణా సౌకర్యములలో యిబ్బంది ఉంటుంది. సస్యాధిపతి కుజుడు: కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రధాన్యజాతులు, ఎర్ర భూములు మంచి ఫలితాలనిస్తాయి. మెట్ట ధాన్యములు బాగా ఫలిస్తాయి. మాగాణి పంటలు, మధ్యమ ఫలితాలు యిస్తాయి. ధాన్యాధిపతి చంద్రుడు: గోవులు సమృద్ధిగా పాలు ఇచ్చును. వ్యాధులు ఉండవు. దేశము సువృష్టితో సుభిక్షంగా ఉండును. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార ధరలు సరసముగా ఉండును అని గ్రంథాంతర వచనము. అర్ఘాధిపతి శని: అర్ఘాధిపతి శని అయినచో మహాభయములు కలుగును. వర్షములు తగ్గును. రోగ, చోర, అగ్ని భయములు కలుగును. ఆహార సౌకర్యములు తగ్గును. ప్రజలలో భయము పెరుగును. పాఠాంతరంలో నల్లభూములు, నల్లధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మవస్తువులు, ఇనుము, తారు, నల్లమందు ధరలు సరసముగా ఉండును. మేఘాధిపతి శని: వర్ష ప్రతిబంధకములు ఎక్కువ. రాజులకు ధనము లోటు ఉండును. చలిబాధలు ప్రజలకు జ్వరములు, ఆహార ధాన్యం కొరత. వ్యాధులు ప్రబలును. నల్ల ధాన్యములు బాగా పండును. రసాధిపతి గురువు: గురువు రసాధిపతి అయినచో చందన, కర్పూర, కంద మూలములు సులభముగా దొరకును. కుంకుమ పువ్వు మొదలగు ఇతర రస వస్తువులు దొరకవు. అన్ని పంటలకు అనుకూల వర్షములు ఉంటుంది. వృక్షజాతులు ఫలించును. ఆరోగ్యములు బాగుంటాయి. పాఠాంతరంలో బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. నీరసాధిపతి కుజుడు: పుష్ప వృక్షములు, ఫల వృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉండును. బంగారం, మణులు, రక్తచందనము, కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి ధరలు పెరిగి నిలబడును. దానిమ్మ వంటివి బాగా ఫలించును. ఇవి చదవండి: Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..! -
ఉగాది వేళ బంగారం కొందామనుకుంటే.. ప్చ్!
Gold Rate today: ఉగాది వేళ బంగారం కొందామనుకున్న పసిడి ప్రియులకు బంగారం ధరలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 8) పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు 10 గ్రాములకు ఈరోజు రూ.490 మేర పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.65,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున పెరిగి రూ.71,620 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.450 పెరిగి రూ.66,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.490 చొప్పున పెరిగి రూ.72,650 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 ఎగిసి రూ.65,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 పెరిగి రూ.71,770 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.88,000 ఉంది. ఇది క్రితం రోజున రూ. 87,000 లుగా ఉండేది. -
Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..!
హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటేనే కొత్త ఆశలకు పునాది. కొత్త కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభించుకునేందుకు మంచి ముహూర్తం. ఈ సందర్భంగా ఈ ఏడాది ముహూర్తాలు, శుభ ఘడియలు ఎలా ఉన్నాయో చూద్దాం. చైత్ర మాసం (జనవరి) 09/04 శుద్ధ పాడ్యమి మంగళ అశ్వినీ వత్సరాది త్వేన నూతన వస్త్రాభరణ ధారణాదులకు మిథునం ప.గం.11:00 నుండి 11:45. 10/04 విదియ బుధ అశ్విని వ్యాపారాదులకు మేషం ఉ.6:50. భరణి, కృత్తికలు శుభ కార్య నిషేధం. 12/04 చవితి శుక్ర రోహిణి, అన్న, వ్యాపార, మేషం ఉ.గం.7:05. సీమంతం మిథునం ప.గం.10:20. 13/04 షష్ఠి శని మృగశిర సీమంతం వశ్చికం రా.గం.8:30ల 9:00వ. 14/04 షష్ఠి ఆది ఆర్ద్ర నక్షత్ర సంబంధ కర్మలకు వృషభం ఉ.గం.8.25. మిథునోపి ప.గం.11:19. 15/04 సప్తమి సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, సీమంత, వ్యాపార, పుంసవన, దేవాలయ కర్మలు, బోరింగ్, శంఖు, వషభం ఉ.గం.8:24 విశేషం. 17/04 శ్రీరామనవమి కళ్యాణములకు కర్కాటక లగ్నం ప.గం.11:34కు ప్రారంభం. 18/04 దశమి గురు మఘ వివాహం కర్కాటకం ప.గం.12:01. అగ్ని పంచకం 8 కు ఏకాదశీ వృశ్చికము వివాహముకు విశేషం రా.గం.8:54. 19/04 ఏకాదశీ శుక్ర మఘ వివాహము మిథునం ఉ.గం.11:00 విశేషం. 20/04 ద్వాదశీ శని ఉత్తర వివాహం, గర్భ, వ్యాపారం, వృశ్చికం (సగ్రహ) రా.గం.8:30. (గృప్రలకు శనివారం) సీమంతం రా.గం.8:00ల 8:30. త్రయోదశీ శని/ఆది ఉత్తర వివాహం, అత్యవసర గృప్ర మకరం రా.గం.1:10. 21/04 త్రయోదశీ ఆది ఉత్తర అత్యవసర విషయా లకు మిథునం అగ్నిపంచకం ఉ.గం.10:50. హస్త వివాహ, వ్యాపార, సీమంతం వృశ్చికం రా.గం.8:21 (సగ్రహ చంద్ర) ధనురపి రా.గం.11:32. 22/04 చతుర్దశీ సోమ హస్త అన్న వ్యాపార, సీమంత, సమస్త వాస్తుకర్మలు, సమస్త దేవాలయ పనులు మిథునం ప.గం.10:47. చిత్త గప్ర, గర్భాదానాదులకు ధనస్సు రా.గం.11:29. సీమంత వేడుకలకు రా.గం.8:00ల 8:30. 24/04 బ.పాడ్యమి బుధ స్వాతి అన్న, వ్యాపార, వృషభం ఉ.గం.7:47. అన్న, శంకు, వ్యాపార, సీమంత, బోరింగ్, దేవాలయ పనులు, మిథునం ఉ.గం.10:38. ధనుర్లగ్నం రాత్రి 10:30 అత్యవసరం. 26/04 తదియ శుక్ర అనురాధ సమస్త వాస్తు, దేవాలయ పనులకు వివాహ, సీమంత, వ్యాపార, ఉప, అక్షర, అన్న మిథునం ఉ.గం.10:30. (6చం). వివాహ గప గర్భాదానం ధనస్సు రా.గం.10:30. 27/04 చవితి శని జ్యేష్ఠ అత్యవసర విషయములకు మిథునం ప.గం.9:30. 28/04 పంచమి ఆది మూల వివాహం ధనస్సు రా.గం.11:50. లగ్న చంద్ర. సీమంత వేడుకలకు వృశ్చికం రా.గం.7:30ల 8:00 (6శుక్ర). సూచన 28 రాత్రి తెల్లవారితే 29 శుక్ర మూఢమి ప్రారంభం. 02/05 నవమి గురు ధనిష్ఠ అన్న, సీమంత మిథునం ఉ.గం.9:01. 03/05 దశమి శుక్ర శతభిష అన్న, సీమంత మిథునం ఉ.గం.10:01. 05/05 ద్వాదశీ ఆది ఉత్తరాభాద్ర అన్న సీమంత మిథునం ఉ.గం.9:50. 06/05 త్రయోదశీ సోమ రేవతి అన్న సీమంత మిథునం ఉ.గం.9:45 వైశాఖ మాసం (ఫిబ్రవరి) 10/05 తదియ శుక్ర రోహిణి అన్న, సీమంత, డోలా రోహణ మిథున ఉ.గం.9:30. 12/05 పంచమి ఆది పునర్వసు సీమంతాదులకు వృశ్చిక రా.గం.7:30ల 8:00. 13/05 షష్ఠి సోమ పునర్వసు అన్న, సీమంతాదులకు డోలారోహణం మిథున ఉ.గం.9:15. పుష్యమి సీమంతం వృశ్చికం రా.గం.7:30. 18/05 దశమి శని ఉత్తర అన్న, సీమంత, ఊయల, బోరింగ్, మిథునం ఉ.గం.8:55. సీమంతం వృశ్చికోగ్నిః రా.గం.7:00ల 7:30. 19/05 ఏకాదశీ ఆది హస్త మిథునం ఉ.గం.8:30. 20/05 ద్వాదశీ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల, బోరింగ్ మిథునం ఉ.గం.8:50. 23/05 పౌర్ణిమ గురు అనురాధ అన్న, సీమంత, ఊయల, బోరింగ్ కర్కాటకం ప.గం.11:01. సీమంతాదులకు ధనస్సు రా.గం.8:30. 24/05 పాడ్యమి శుక్ర అనురాధ అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.7:30 (6చం) 26/05 తదియ ఆది మూల అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.8:10. 27/05 చవితి సోమ ఉ.షాఢ అన్న, బోరింగ్, సీమంత ధనుః ఉ.గం.10:45. 29/05 షష్ఠి బుధ శ్రవణం మిథునం ఉ.గం.8:01. సప్తమి ధనిష్ఠ సీమంతం ధనస్సు రా.8:00. 30/05 సప్తమి గురు శతభిషం అన్న, బోరింగ్, సీమంతం కర్కాటకం ఉ.గం.9:01 (8 చం,శ) 01/06 దశమి శని ఉత్తరాభాద్ర కటకం ఉ.గం.8:50. 02/06 ఏకాదశీ ఆది రేవతి కటకం ఉ.గం.8:50. జ్యేష్ట మాసం (మార్చి) 07/06 పాడ్యమి శుక్ర మృగశిర కర్కాటకలగ్నం ఉ.గం.10:01 (8 శని) 09/06 తదియ ఆది పునర్వసు అన్న, సీమంత, బోరింగ్ మిథునం ఉ.గం.7:40. 10/06 చవితి సోమ పుష్యమి అన్న, సీమంత, బోరింగ్ కర్కాటకం ఉ.గం.8:34 (8 శని) 13/06 సప్తమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.8:30 (8 శని) 14/06 అష్టమి శుక్ర ఉత్తర కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం) 15/06 నవమి శని హస్త కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం) 17/06 ఏకాదశీ సోమ చిత్త కర్కాటకం ఉ.గం.8:01. అన్న, సీమంత, స్వాతి సీమంతం మకరం రా.గం.8:30ల 9:30. 19/06 త్రయోదశీ బుధ అనురాధ సా.గం.6:40. గోధూళి 20/06 చతుర్దశీ గురు అనురాధ కర్కాటకం అన్న, సీమంత కటకం ఉ.8:35. 21/06 పౌర్ణిమ శుక్ర మూల సీమంతం మకరం రా.గం.8:15ల 8:30. 22/06 పాడ్యమి శని మూల అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:25. 23/06 విదియ ఆది ఉత్తరాషాఢ సీమంత మకరం రా.గం.8:15ల 8:20. 24/06 తదియ సోమ ఉత్తరాషాఢ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:15. సీమంతం మకరం రా.8:01 (6శుక్ర) 26/06 పంచమి బుధ ధనిష్ఠ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:08. 27/06 షష్ఠి గురు శతభిషం అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:04. 29/06 అష్టమి శని ఉ.భా. అన్న, సీమంత కర్కాటకం ఉ.8:00. 30/06 నవమి ఆది రేవతి కర్కాటకం ఉ.గం.8:00. 01/07 దశమి సోమ అశ్విని కర్కాటకం ఉ.8:00. 03/07 ఏకాదశీ బుధ రోహిణి కర్కాటకం ఉ.8:00. ఆషాఢ మాసం (ఏప్రిల్) 06/07 పాడ్యమి శని పునర్వసు వృశ్చిక సా.గం.4:01. 07/07 విదియ ఆది పుష్యమి అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:01. సీమంతం మకరం రా.గం.7:30ల 8:30. 11/07 పంచమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.7:30. షష్ఠి ఉత్తర సీమంతం రా.గం.7:30ల 8:00. మూఢమి వెళ్ళి ఉత్తరాయనం వున్న కారణంగా దేవాలయ కార్యములు 16 వరకు గ్రాహ్యము. 12/07 సప్తమి శుక్ర హస్త సీమంతం మకర రా.గం.7:30. 13/07 అష్టమి శని చిత్త సీమంత మకరం రా.గం.7:30. 14/07 అష్టమి ఆది చిత్త అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:30. నవమి సీమంతం మకరం రా.గం.7:30. 15/07 నవమి సోమ స్వాతి అన్న, అక్షర, సీమంత, దేవాలయ ముహూర్తములు కటకం ఉ.7:30. 17/07 ఏకాదశీ బుధ అనురాధ తుల ప.గం.1:30 (8 కుజ) వృశ్చికం సా.4:01. సీమంతాదులకు ధనస్సు సా.5:30. 19/07 త్రయోదశి శుక్ర మూల సీమంతం ధనుః రా.గం.6:01. 21/07 పాడ్యమి ఆది ఉత్తరాషాఢ సీమంతం ధనస్సు సా.గం.4:30. 22/07 పాడ్యమి సోమ శ్రవణం అన్న, సీమంతం తుల ప.గం.12:01. విదియ సీమంత ధనుః రా.గం.5:30. 24/07 చవితి బుధ శతభిషం సీమంతం ధను సా.గం.5:30. 26/07 షష్ఠి శుక్ర ఉత్తరాభాద్ర అన్న, సీమంత తుల ప.గం.12:01. 27/07 సప్తమి శని రేవతీ అన్న, సీమంత తుల ప.గం.12:01. ధనస్సు సా.గం.4:45ల 5:00. 31/07 ఏకాదశి బుధ రోహిణి అన్న, సీమంత తుల ప.గం.11:30. ధనస్సు సా.గం.4:45ల 5:00. 01/08 ద్వాదశీ గురు మగశిర అన్న, సీమంత తుల ప.గం.11:30. 02/08 చతుర్దశీ శుక్ర పునర్వసు ధనస్సు సా.గం.5:01. శ్రావణ మాసం (మే) 05/08 విదియ సోమ మఘ మేషం రా.గం.11:39. 07/08 చవితి బుధ ఉత్తర వివాహం, గర్భాదానం మేషం రా.గం.11:34. బుధ/గురు వివాహం, గప్ర మిథునం తె.గం.2:30. 08/08 చవితి గురు ఉత్తర సీమంతం, వ్యాపారం ధనస్సు ప.గం.4:45. పంచమి గురు హస్త వివాహం, గప్ర మేషం రా.గం.11:27. గురు/శుక్ర మిథునం వివాహం, శంకు తె.గం.3:45. 09/08 పంచమి శుక్ర హస్త అన్న, సీమంత తుల ప.గం.11:01 (8 కు) సీమంతం ధనుః సా.గం.4:45. వివాహ, గర్భా మేషం రా.గం.11:23. షష్ఠి చిత్త శంకు గృప్ర మిథునం తె.గం.3:41. 10/08 షష్ఠి శని చిత్త సీమంతం, వ్యాపారం ధనుః సా.గం.4:00ల 4:30. సప్తమి శని/ఆది స్వాతి మిథునం తె.గం.3:44 విశేషం. 11/08 సప్తమి ఆది స్వాతి అన్న, అక్షర, సీమంతా దులకు తుల ప.గం.12:01 (8 కు) గర్భ, వివాహం మేషం రా.గం.11:19. ఆది సోమ మి«థునం తె.గం.3:01. 15/08 ఏకాదశీ గురు మూల తుల ప.గం.12:01 (8 కుజ) సీమంతం ధనస్సు సా.గం.4:15. వివాహం మేషం రా.గం.10:58. గురు/శుక్ర వివాహం, శంకు, మిథునం, వాస్తు కర్మలు వివాహం తె.గం.3:14. 17/08 త్రయోదశీ శని ఉత్తరాషాఢ సీమంత, వ్యాపార ధనుః ప.గం.3:50. వివాహం మేషం రా.గం.10:55. మిథునం తె.గం.3:10. 18/08 చతుర్దశి ఆది శ్రవణం సమస్త శుభాలకు తుల ప.గం.11:39. శ్రవణం మేషం రా.గం.10:51. వివాహం మిథునం తె.గం.5:06. కర్కాటక సంబంధిత కార్యములు తె.గం.4:30. 19/08 పౌర్ణిమ సోమ ధనిష్ఠ వివాహం మేషం రా.గం.10:47. సీమంతం, వ్యాపారం మకరం సా.గం.5:10ల 5:30. 22/08 తదియ గురు ఉత్తరాభాద్ర తుల ప.గం.11:23 (8 కుజ). వ్యాపారం ధనస్సు ప.గం.2:30. సీమంతాదులకు మకరం ప.గం.5:15. చవితి వివాహం, గర్భ, మేషం రా.గం.10:32. గురు/శుక్ర వివాహ, గృప్ర మిథునం తె.గం.2:50. కర్కాటకం తె.గం.4:30. 23/08 చవితి శుక్ర రేవతి తుల ప.గం.11:19 (8 కుజ) వ్యాపారం, సీమంత పంచమి మకరం సా.గం.5:11. వివాహం మేషం రా.గం.10:28. అశ్విని శుక్ర/ శని శంకు, గృప్ర మిధునం తె.గం.2:46. కర్కాటక తె.గం.4:30. 24/08 షష్ఠి శని అశ్విని వ్యాపారాదులకు ధనస్సు 2:00ల 3:00. మేషం రా.గం.10:17 వివాహం. 28/08 దశమి బుధ మృగశిర సమస్త శుభాలకు, దేవాలయ పనులకు, వాస్తు కర్మలకు తుల ప.గం.11:00. భాద్రపద మాసం (జూన్) 04/09 విదియ బుధ ఉత్తర అన్న, సీమంత వ్యాపారం తుల ఉ.గం.10:28. 05/09 విదియ గురు హస్త అన్న, సీమంత తుల ఉ.గం.9:01. 06/09 తదియ శుక్ర చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:25. 07/09 చవితి శని చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:21. గణేశ చతుర్థి. 08/09 పంచమి ఆది స్వాతి అన్న, సీమంత తుల ప.గం.10:17. 09/09 షష్ఠి సోమ అనురాధ మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం. 12/09 నవమి గురు మూల మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం 14/09 ఏకాదశి శని ఉత్తరాషాఢ మకరం ప.గం.4:00. 15/09 ద్వాదశీ ఆది శ్రవణం అన్న, సీమంతం తుల ఉ.గం.9:49. 16/09 త్రయోదశి సోమ ధనిష్ఠ అన్న, సీమంతం తుల ఉ.గం.9:45. మహాలయ పక్షం 18 ప్రారంభం. శుభకార్య నిషేధం. ఆశ్వీయుజ మాసం (జూలై) 03/10 పాడ్యమి గురు హస్త కలశస్థాపనాది సర్వములకు తుల ఉ.గం.7:00 ప్రా. 04/10 విదియ శుక్ర చిత్త అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.7:30. వ్యాపారాదులకు మకరం ప.2:00ల 3:00. స్వాతి మేషం రా.గం.7:33. వృషభం రా.గం.8:30. 05/10 తదియ శని స్వాతి అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.8:30. మేషం సా.గం.6:30ల 7:00. 07/10 పంచమి సోమ అనురాధ అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.8:20. వ్యాపారాదులకు మకరం ప.గం.2:30. మేషం రా.గం.7:35. 09/10 సప్తమి మూల బుధ మకరం ప.గం.2:11. మేషం సా.గం.7:00. 10/10 అష్టమి గురు పూర్వాషాఢ యంత్ర పూజలు మకరం ప.గం.2:00ల 2:30. 11/10 నవమి శుక్ర ఉత్తరాషాఢ యంత్ర పూజ, వాహన పూజలు తుల ఉ.గం.7:00ల 8:00. మకరం ప.గం.2:00ల 2:15. 12/10 విజయదశమి సందర్భంగా మకరం ప.గం.2:00ల 2:15. 13/10 ఏకాదశీ ఆది ధనిష్ఠ అన్న, అక్షర వైశ్యోపనయన, వివాహ, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం తుల ఉ.గం.7:57. మకరం వ్యాపారం ప.గం.1:37. వివాహం మేషం రా.గం.7:06. శతభిషం కర్కాటకం రా.గం.1:10. 14/10 ద్వాదశీ సోమ శతభిషం మకరం ప.గం.10:34. మేషం రా.గం.7:02. 16/10 చతుర్దశీ బుధ ఉత్తరాభాద్ర వ్యాపారాదులకు మకరం 1:27. మేషం వివాహాదులకు సా.గం.6:35. వివాహ, గృప్ర, గర్భాదానం వృషభం రా.గం.8:24. 17/10 పౌర్ణమి గురు రేవతి సమస్త శుభాలకు మకరం ప.గం.12:30ల 1:00. అశ్విని వివాహం వషభం రా.8:20. 20/10 చవితి ఆది రోహిణి వృషభం రా.గం.8:15. వివాహ, గప్ర, గర్భాదానాదులకు మిథునం రా.గం.10:59. 21/10 చవితి సోమ మృగశిర మకరం ప.గం.1:30. గృప్రలకు వషభం రా.గం.8:12 మిధునం రా.గం.10:55. అన్న, అక్షర, గృప్ర, వృశ్చికం ఉ.గం.8:25. 23/10 సప్తమి బుధ పునర్వసు మిథునం రా.గం.9:30. 24/10 అష్టమి గురు పుష్యమి మకరం ప.గం.12:15ల 12:30. మిథునం రా.గం.10:30. 26/10 దశమి శని మఘ వివాహం మిథునం రా.గం.10:35. 27/10 ఏకాదశీ ఆది మఘ వివాహం వృశ్చికం ఉ.గం.8:11. మకరం ప.12:15. కార్తీక మాసం (ఆగస్టు) 03/11 విదియ ఆది అనురాధ అన్న, అక్షర వైశ్యో పనయన, వివాహ, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, సీమంత, పుంసవన, ఊయల, నామకరణం, జాతకర్మ మకరం ప.గం.11:59. వివాహం గృప్ర వృషభ రా.7:12. గర్భ, గృప్ర, వివాహం మిధునం రా.గం.10:03 (6శు) 04/11 తదియ సోమ జ్యేష్ఠ వృశ్చికం ఉ.గం.7:33. 07/11 షష్ఠి గురు ఉత్తరాషాఢ వృషభం రా.గం.7:30ల 8:00 సీమంతం, వివాహం మిథునం రా.గం.9:50. 08/11 సప్తమి శుక్ర ఉత్తరాషాఢ సమస్త శుభాలకు వృశ్చికం ఉ.గం.7:20. 09/11 అష్టమి శని శ్రవణం వృశ్చికం ఉ.గం.8:15. నవమి ధనిష్ఠ వివాహాదులకు వృషభం రా.గం.6:53. నవమి వివాహం మిథునం రా.9:46. 10/11 నవమి ఆది ధనిష్ఠ సమస్త శుభాలకు, వైశ్యోపనయన, వాస్తుకర్మలు, దేవాలయ పనులకు వృశ్చికం 7:20. విశేషం. శతభిషం వృషభం రా.6:30. దశమి ఆది మిథునం రా.గం.9:40. 11/11 ఏకాదశి సోమ పూర్వాభాద్ర మిథునం రా.గం.8:00ల 8:30. 13/11 ద్వాదశీ బుధ రేవతి వృశ్చికం సమస్త కార్యములు ఉ.6:54. 14/11 త్రయోదశీ గురు అశ్విని సమస్త శుభాలకు వృశ్చికం ఉ.6:50. 17/11 విదియ ఆది రోహి వివాహం, గర్భ, గృప్ర, వ్యాపార, సీమంతాదులకు మిథునం రా.గం.7:30ల 8:00. పుష్కరాంశ 9:07. విదియ ఆది రోహిణి ధనస్సు ఉ.గం.9:30 (8 కు) శంకు వివాహం తుల తె.5:42. 18/11 తదియ సోమ మృగశిర వ్యాపారం, సీమంతం సా.5:00. 20/11 షష్ఠి బుధ పుష్యమి గృప్ర, గర్భదానం, వ్యాపారం మిథునం రా.8:53. 22/11 అష్టమి శుక్ర/శని మఘ వివాహం తుల తె.గం.5:22. 24/11 దశమి ఆది/సోమ ఉత్తర వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.5:14. 25/11 దశమి సోమ ఉత్తర గర్భ, గృప్ర, మిథునం రా.గం.8:33. 28/11 త్రయోదశీ బుధ స్వాతి మిథునం రా.8:28. మార్గశిర మాసం (సెప్టెంబరు) 02/12 విదియ సోమ మూల మేషం ప.గం.4:01. మిథునం రా.గం.7:30ల 8:00. 04/12 చవితి బుధ ఉత్తరాషాఢ వివాహం గర్భ, గృప్ర, మి«థునం రా.గం.8:04. 05/12 పంచమి గురు ఉత్తరాషాఢ వ్యాపారం మేషం ప.గం.3:50. శ్రవణం వివాహం, గర్భ మి«థునం రా.గం.7:49. గురు/శుక్ర శంకుస్థాపన, వ్యాపారం తుల తె.గం.4:30. 06/12 షష్ఠి శుక్ర శ్రవణం వ్యాపారం మేషం ప.గం.3:45. ధనిష్ఠ సీమంతాదులకు మిధునం రా.గం.7:00ల 7:30. శుక్ర/శని వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.4:30. 07/12 సప్తమి శని శతభిషం వివాహ గృప్ర మిథునం రా.గం.7:46. వ్యాపారం మేషం ప.గం.3:41. శంఖు, బోరింగ్, వివాహం తుల తె.గం.4:26. 09/12 నవమి సోమ ఉత్తరాభాద్ర మిథునం రా.గం.7:39. 14/12 చతుర్దశి శని రోహిణి మేషం ప.గం.3:08 వ్యాపారాదులకు. పౌర్ణమి శని రోహిణి వివాహం, గృప్ర, గర్భాదానం మిథునోగ్ని రా.గం.7:26. శంకు, బోరింగ్, వివాహం, వ్యాపారం తుల తె.గం.3:55 (కోరల పౌర్ణిమ) 15/12 పాడ్యమి ఆది మృగశిర వ్యాపారం మేషం ప.గం.3:04. 18/12 చవితి బుధ/గురు రోహిణి తుల రా.తె.గం.3:01. 20/12 షష్ఠి శుక్ర/శని మఘ వివాహం తుల రా.తె.గం.3:30. 22/12 అష్టమి ఆది/సోమ ఉత్తర వృశ్చికం తె.గం.4:19 సమస్త శుభాలకు. 24/12 దశమి మంగ/బుధ చిత్త వృశ్చికం తె.గం.4:11 శంకు. 25/12 ఏకాదశీ బుధ/గురు స్వాతీ వివాహ, శంకు, బోరింగ్ వృశ్చికం తె.గం.4:08లకు. పుష్య మాసం (అక్టోబర్) 01/01 విదియ బుధ ఉత్తరాషాఢ మేషం ప.గం.12:55. 02/01 తదియ గురు శ్రవణం మేషం ప.గం.12:55. వృషభం ప.గం.4:00. 03/01 చవితి శుక్ర ధనిష్ఠ మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10. 04/01 పంచమి శని శతభిషం మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10. 06/01 సప్తమి సోమ ఉత్తరాభాద్ర మేషం ప.గం.12:30. 08/01 నవమి బుధ అశ్విని మేషం ప.12:30. 11/01 త్రయోదశి శని రోహిణి మేషం ప.12:10. 12/01 చతుర్దశి ఆది మృగశిర మేషం ప.12:10. ఉత్తరాయనం అనుసరించి దేవాలయ పనులు అనుష్ఠించవచ్చు. 19/01 షష్ఠి ఆది ఉత్తర అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు మేషం ప.గం.12:01. 20/01 సప్తమి సోమ, హస్త, అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, అత్యవసర ఉపనయన, శంకు మేషం ప.గం.12:01. 24/01 దశమి శుక్ర అనురాధ అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు అత్యవసర ఉపనయన / శంకు మేషం ప.గం.12:01. 26/01 ద్వాదశీ ఆది మూల మేషం ప.12:01. మాఘ మాసం (నవంబర్) 30/01 పాడ్యమి గురు ధనిష్ఠ అన్న, సీమంత, వ్యాపారం మేషం ప.గం.11:59. 31/01 విదియ శుక్ర శత అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, వివాహం, అత్యవసర ఉపనయనం, వ్యాపారం, ఊయల మేషం ప.గం.11:55. 02/02 చవితి ఆది ఉత్తరాభాద్ర అన్న, అక్షర, సీమంత, వ్యాపార, అత్యవసర ఉపనయన, వివాహం దేవాలయ పనులు, వాస్తు కర్మలు, ఊయల, వ్యాపారం మేషం ప.గం.11:51. 03/02 షష్ఠి సోమ రేవతి అన్న, అక్షర వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, ఊయల, సీమంత మేషం ప.గం.11:47. 07/02 దశమి శుక్ర రోహిణి అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం, అత్యవసర ఉపనయనం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:43. 08/02 ఏకాదశి శని మృగశిర అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం అత్యవసర ఉపనయనం, ఊయల, సీమంతం ప.గం.11:39. గృప్ర. వృషభం ప.గం.12:15. 10/02 త్రయోదశీ సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:34. వృషభోపి ప.12:01. 13/02 బ.పాడ్యమి గురు మఘ వివాహం వృషభం ప.గం.12:01. 14/02 తదియ శని ఉత్తర ఉపనయనం (వారదోషం), అన్న, అక్షర, సీమంత, వాస్తుకర్మలు, దేవాలయ పనులు, ఊయల, వ్యాపారం, వివాహం మేషం ఉ.గం.11:01. 15/02 చవితి హస్త ఆది వృషభం ప.గం.11:59. 17/02 పంచమి సోమ చిత్త అన్న, అక్షర, సీమంత, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.10:45. 18/02 సప్తమి మంగళ/బుధ స్వాతి మకరం తె.గం.5:45. 20/02 అష్టమి గురు అనురాధ మేషం ప.గం.10:01. వృషభం ప.గం.11:59. 21/02 నవమి శుక్ర అనురాధ సమస్త శుభకర్మలు, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపార పనులకు మేషం ఉ.గం.10:38 వషభం ప.గం.12:01. 23/02 దశమి ఆది మూల సమస్త శుభములకు మేషం ఉ.గం.10:01. వషభం ప.గం.12:01. ఫాల్గుణ మాసం (డిసెంబర్) 01/03 తదియ శని/ఆది ఉత్తరాభాద్ర వివాహం, శంకు, వ్యాపారం మకరం తె.గం.4:30. 02/03 తదియ ఆది అన్న అక్షర, సీమంత, వ్యాపార, ఊయల, ఉప, వివాహం, దేవాలయ పనులు, వాస్తుకర్మలు మేషం ప.గం.9:58 విశేషం. వృషభం ప.గం.11:29. చవితి ఆది/సోమ రేవతి శంకు, వివాహం మకరం తె.గం.4:28. 03/03 చవితి సోమ రేవతి సమస్త శుభాలకు, వాస్తు కర్మలకు మేషం ఉ.గం.9:51. వృషభం అశ్విని ప.గం.11:20. 06/03 సప్తమి గురు రోహిణి అన్న, అక్షర, సీమంత, ఉప, వ్యాపార, దేవాలయ కర్మలు, వాస్తు కర్మలు మేషం ఉ.గం.9:12. వృషభం ఉ.గం.11:30. 09/03 ఏకాదశీ ఆది/సోమ పుష్యమీ శంకు మకరం తె.గం.3:56. 10/03 ఏకాదశీ సోమ పుష్యమి అన్న, అక్షర, ఊయల, సీమంత, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.8:40. 14/03 పౌర్ణమి శుక్ర ఉత్తర వృషభం ఉ.గం.10:30. 15/03 పాడ్యమి శని హస్త వృషభం ఉ.గం.10:30. అన్న, సీమంత, ఊయల. 16/03 విదియ ఆది హస్త వృషభం ఉ.గం.9:50. 17/03 తదియ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15. 20/03 షష్ఠి గురు అనురాధ అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15. 22/03 అష్టమి శని మూల వృషభం ఉ.గం.10:08. 24/03 దశమి సోమ ఉత్తరాషాఢ వృషభం ఉ.గం.10:00. ఇవి చదవండి: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.. -
ప్ర‘పంచాంగం’
విశ్వంలో ఏదైనా చక్రగతిలోనే తప్ప సరళరేఖలో సాగదు; మానవజీవితమూ దీనికి మినహాయింపు కాదు. పగటిని రాత్రి అనుసరిస్తుంది; సూర్యుని చంద్రుడూ, నక్షత్రాలూ అనుసరిస్తాయి. మనిషి జీవితంలోనూ సుఖాల వెలుగును వెన్నంటే కష్టాల చీకట్లూ ఉంటాయి. జీవపరిణామక్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది ఆలోచన పదునెక్కినకొద్దీ అతణ్ణి అమితంగా తికమక పెట్టిన వాటిలో ఈ చక్రగమనం ఒకటి. మనుగడ పూర్తిగానూ, నేరుగానూ ప్రకృతివనరులపై ఆధారపడిన ఆదిమకాలంలో వేడి, వర్షం, చలి చక్రగతిని ఎందుకు అనుసరిస్తాయన్నది, కడుపు నిండిన తర్వాత కలిగే జిజ్ఞాస కాదు; కడుపు నింపుకోవడంతో ముడిపడిన చిక్కుప్రశ్న. ఈ ఋతుపరివర్తనలో అతని చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోయి; తను ఆహారం కోసం ఆధారపడిన కొన్ని రకాల జంతువులు అదృశ్యమై, కొత్తవి అడుగుపెడుతున్నాయి! దీనిని అర్థంచేసుకోడానికీ, దీనికి ఎవరు కారణమో తెలుసుకోడానికీ సమయం పట్టింది. పెరిగి తరిగే చంద్రకళలే కారణమనుకుని వాటిని కాలానికి అన్వయించుకుని ఋతుచక్రానికి కాలచక్రాన్ని జోడించుకున్నాడు. అలా కాలగణనంలో చాంద్రమానం అడుగుపెట్టి ఇప్పటికీ ఒక సంప్రదాయంగా కొన సాగుతోంది. ఆ క్రమంలోనే రేపు, అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు మనం జరుపుకొంటున్నది స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఉగాది. ఉగాదిని ఇప్పుడు మనం ఒక పండుగగానే భావిస్తాం; గడిచిన ఏడాది ఎదురైన కష్టనష్టాలూ, ఆశాభంగాల పాత దుస్తులు విడిచేసి కొత్త ఆశలూ, ఉత్సాహాల ఉడుపులు ధరించే సందర్భమను కుంటాం; ఆరు రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సంకేతించేదిగా గుర్తుపెట్టుకుంటాం; పంచాంగ శ్రవణానికీ, కవితా శ్రవణానికీ కూడా చెవులు అప్పగిస్తాం. నూతనశోభకు, శుభానికి తలుపు తెరిచేలా తోచే ఏ సందర్భమైనా పండుగే. అయితే, ఉగాది పేరిట కొత్త సంవత్సర ప్రారంభాన్ని పండుగగా మలచడం వెనుక ఎంతో కథ ఉంది; అంతుబట్టని కాలచక్రపు తిప్పుళ్ళకు బిత్తరపోయి, తిరిగి నిలదొక్కుకోడానికి బతుకు చేసే పెనుగులాట ఉంది; కాలగమనాన్ని అర్థం చేసుకోవడానికి పడిన అంతులేని వైజ్ఞానిక ప్రయాస ఉంది; మనం అనాగరికునిగా పొరబడే ఆదిమానవుణ్ణే తొలి ఖగోళ వేత్తగా రూపించి నిరూపించే అద్భుత నేపథ్యం ఉంది. తప్పులు, సవరణల రూపంలో సాగిన ఆ కాలగణనం కసరత్తులోకి తొంగిచూసినప్పుడు నాటి మానవుల ఆరాటపోరాటాలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు మన కళ్లను మెరుపులా తాకి ఆశ్చర్యం గొలుపుతాయి. చంద్రుని వృద్ధిక్షయాల ఆధారంగా కాలాన్ని గణించడం, యాభైవేల సంవత్సరాల క్రితమే పాతరాతియుగంలో మొదలైనట్టు శాస్త్రవేత్తలు నిరూపించారు. అప్పటి గుహాచిత్రాలలో కనిపించిన పొడవాటి దండాన్ని చంద్రకళల ఆధారంగా కాలాన్ని కొలిచే సాధనంగా గుర్తించారు. ఇప్పటికీ పన్నెండు రాశులలో ఒకటిగా ఉన్న మేషరాశిని సూచించే పొట్టేలు బొమ్మతో సహా వివిధ జంతు వుల బొమ్మలు ఆ దండంపై ఉన్నాయి. అనంతరకాలంలో పురోహితులు, మాంత్రికులు, పాలకులు ధరించే దండాలకు అదే మాతృక అయినట్టు తేల్చారు. చంద్రునితో ఋతువుల మార్పును ముడి పెట్టి చాంద్రమానానికి అలా తెరదీయడం గొప్ప ముందడుగే కానీ; ఋతుచక్రానికి, చాంద్రమానంలోని మాసచక్రానికి పొంతన కుదరకపోవడంతో, ఋతుపరివర్తనకు సూర్యుడు కారణమన్న ఎరుక పుట్టి సౌరమానం అడుగుపెట్టింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ; ఇరవైమూడున్నర డిగ్రీల ఒంపుతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందన్న గ్రహింపు లేని ఆ కాలంలో కూడా సంవత్స రానికి 300 నుంచి 400 రోజులను లెక్కగట్టడాన్ని నేటి శాస్త్రవేత్తలు అబ్బురంగానే పరిగణిస్తారు. చాంద్రమానం సంవత్సరానికి 354 రోజులను లెక్కిస్తే, మరింత నిర్దుష్టమైన సౌరమానం 365 పైచిలుకు రోజులను లెక్కించింది. రెంటిమధ్యా ఉన్న 11 రోజుల పైచిలుకు తేడాను సరిపెట్టి రెండు మానాలనూ సమన్వయించడం ఖగోళ పండితులకు పెద్ద సవాలే అయింది. రోమన్, జూలి యన్, గ్రెగేరియన్ లాంటి ఎన్ని కాలగణన పద్ధతులు వచ్చినా ఇలాంటి సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని ‘కేలండర్ కథ’ అనే పుస్తకంలో డా. మహీధర నళినీమోహన్ అంటారు. మనదేశానికి చెందిన భాస్కరాచార్యులు సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఖగోళపండితులు సంవత్సరానికి 365 రోజుల పైచిలుకును సక్రమంగానే గుర్తించారు. కానీ అందులో ప్రకృతి సిద్ధంగా ఉన్న భిన్నాంకం వారి మేధకు లొంగేది కాదు. చాంద్రమానంలో భాగమైన నెలకు 29 రోజుల పైచిలుకు లెక్కా అలాంటిదే. భూభ్రమణంలో ఒంపు వల్ల కాలగణనంలో ఏర్పడే ఆ వైవిధ్యమే లేనప్పుడు ఋతుపరివర్తనే అంతరించి మరింత విషమసమస్య తలెత్తే మాటా నిజమే. మొత్తంమీద అప్పటినుంచీ ఇప్పటివరకూ కేవల చాంద్రమానం, కేవల సౌరమానం; చాంద్ర– సౌరమానాల సమన్వయం అనే మూడు పద్ధతులూ అమలులో ఉన్నాయి. విశేషమేమిటంటే, కాల గణనానికి అనుసరించిన పద్ధతుల్లోనూ, ఆ క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారంలో సాఫల్య, వైఫల్యాలలోనూ ప్రపంచానుభవం ఒక్కలాంటిదే. కనుక ‘పంచాంగం’ అనే మాటను ‘ప్రపంచాంగం’గానూ చెప్పుకోవడంలో తప్పులేదు. పైన చెప్పిన సౌర, చాంద్రమానాల సమన్వయాన్నే ‘యుగం’ అంటారని ‘జనకథ’ అనే పుస్తకంలో రాంభట్ల కృష్ణమూర్తిగారి వివరణ. అధికమాసాలను పాటించడం ఇందులో భాగమే. అప్పుడు కూడా రెండు మానాల సమన్వయం అయిదేళ్ళకోసారే సాధ్యమవుతుంది. అదే అసలైన ‘యుగాది’. ఇప్పుడు ‘ఉగాది’ పేరుతో ఏటా జరుపుకొంటున్నాం. -
ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు
వృషభ రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–7, అవమానం–3. కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో) గురువు మే 1 వరకు మేషం (వ్యయం)లోను తదుపరి వృషభం (జన్మం)లోను సంచరిస్తారు. శని కుంభం (దశమం)లోను రాహువు మీనం(లాభం)లోను కేతువు (పంచమం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో నూతనోత్సాహంతో పనులు చేస్తుంటారు. భోజనం, నిద్ర, వస్త్రధారణ వంటి నిత్యకృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు. అన్ని కార్యములలో ధనవ్యయం అధికమవడం, విఘ్నాలు రావడం జరిగినా, చివరకు కార్యవిజయం సాధిస్తారు. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, విఘ్నాలు ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమించగలుగుతారు. అధికారుల నుంచి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు. వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు స్పష్టిస్తాయి. తరచుగా బుద్ధి భ్రంశానిరి లోనయినా, మళ్లీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు. మంచికాలమే! కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యస్థితి బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరంగా చేయవలసిన శుభ, పుణ్యకార్యాలు అన్నీ జరుగుతుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతో కలసి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఉండవు. ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడటం మంచిది. మీరు అందరికీ బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది. అయినా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. మంచి కాలక్షేపం జరుగును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుంచి కాలం అనుకూలంగా ఉన్నది. ఇబ్బందికర ఘటనలు ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభమార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు అందుతాయి. కార్యవిజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉన్నది. మంచికాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి. అంతటా సహకరించేవారు ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ, మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితములే! జంతువులు, పక్షులు పెంచేవారికి లాభదాయకం. కృత్తిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసినా రావలసిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతుంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తుంటారు. వాహన చికాకులు తప్పవు. శాంతి మార్గం: తరచుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్ర పారాయణ చేయండి. గోపూజ, గురు జపం, దానం చేయించండి. ఏప్రిల్: తెలివిగా ఆర్థిక లావాదేవీలు సాగిస్తారు. సంకల్పించిన పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ జీవనం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చి, మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, నదీస్నానం చేస్తారు. ఆరోగ్య విషయంలో తెలివిగా ఉండి రక్షణ పొందుతారు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి కాలం. మే: కుజ– బుధ– శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలం. విందు వినోదాలు, విహారయాత్రలు ఉంటాయి. ద్వితీయార్ధంలో శారీరక అలసట, కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఉంటాయి. రవి, శివారాధన శుభప్రదం. మాసారంభం అనుకూలం. సమస్యలను తెలివిగా సాధించుకుంటారు. ఆరోగ్య, ఋణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మొదటి రెండు వారములు అనుకూలం. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. జూన్: వ్యయ కుజ, ద్వితీయ రవి సంచారం వలన తరచు సమస్యలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. 8వ తేదీ నుండి మృగశిర నక్షత్రం వారికి స్వల్ప ఆరోగ్య చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భక్తి, కాలక్షేపం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది. జులై: ప్రథమార్ధం మిశ్రమ ఫలితాలు. ద్వితీయార్ధంలో ఖర్చులు పెరుగును. మనోధైర్యంతో పనులు చక్కబెడతారు. పనిలో గుర్తింపు పొందుతారు. అధికారయోగం ఉంది. వివాదాలు సర్దుకుంటాయి. కుజస్తోత్ర పారాయణం చేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలను విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: కొంత ఒదిగి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల చురుకుదనం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. 2వ వారంలో శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నవగ్రహారాధన శుభప్రదం. 15వ తేదీ వరకు రోహిణీ నక్షత్రంతో కుజుడు జాగ్రత్తలు అవసరం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. సెప్టెంబర్: సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రవి– కుజ– శుక్రులకు శాంతి, శివకుటుం ఆరాధన శుభప్రదం. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అక్టోబర్: ఈ నెల అంతా శుభప్రదం. శత్రు, ఋణ బాధల నుంచి ఉపశమనం. ఉన్నతాధికారుల సందర్శన, స్థానచలనం, అధికారయోగం. రాజకీయ రంగంలో విశేష జనాకర్షణ. స్త్రీలతో స్వల్ప సమస్యలు ఉంటాయి. కుజ శాంతి, లక్ష్మీ–లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి అనుకూలం. రైతులకు, విద్యార్థులకు కూడా సానుకూలం. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలం. నవంబర్: ప్రయాణ లాభం. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కాలభైరవారాధన శుభప్రదం. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకుంటూ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. డిసెంబర్: మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఖర్చులు. గతంలో చేసిన అశ్రద్ధ వలన ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రుద్రాభిషేకం చేయుట మంచిది. ఉద్యోగంలో తోటివారి సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సత్ఫలితాలు. జనవరి: ప్రయాణమూలక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉమామహేశ్వర స్తోత్రపారాయణ మంచిది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం లాభాలు అధికం. షేర్ వ్యాపారులు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఫైనాన్స్ వ్యాపారులు మొండి బాకీలు వసూలులో జాగ్రత్తపడాలి. ఫిబ్రవరి: దైవానుగ్రహంతో సమస్యలు తీరుతాయి. పూర్వం నుంచి చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వృత్తిలో గుర్తింపు, విశేష కీర్తి కలుగుతాయి. అధికారయోగం. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన లాభం. ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. మార్చి: పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీలు అనుకూలం. ఋణ సమస్యలు తగ్గుతాయి. నూతన కనక–వస్తు–వాహన కొనుగోలు అనుకూలం. శుభకార్యాలు జరుగుతాయి. -
ఈ నూతన సంవత్సరాన ఈ రాశి వారికి ఋణ విషయాలలో విచిత్ర స్థితి
మిథున రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–3, అవమానం–6. మృగశిర 3,4 పాదములు (కా, కి) ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ) పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా) గురువు మే 1 వరకు మేషం (లాభం)లోను తదుపరి వృషభం (వ్యయం)లోను సంచరిస్తారు. శని కుంభం (భాగ్యం)లోను రాహువు మీనం (దశమం)లోను కేతువు (చతుర్థం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలిసీ తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరినీ నమ్మి, ఎవరి మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ పరిథిలో ఉన్న పనులు మాత్రమే చేయండి. వీలైనంత వరకు కొత్త వ్యవహారాలు చేపట్టవద్దు. మీకు కొన్ని సందర్భాలలో మంచి గురువులు మంచి సూచనలు చేస్తారు. ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు ఎప్పుడూ సహకరించనివారు కూడా ఈ సంవత్సరంలో సహకారం అందిస్తారు. కొన్ని సందర్భాలు విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అలాగే అధికారులతో కూడా జాగ్రత్తలు పాటించాలి. మితభాషణ చాలా అవసరం. తోటివారు కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. వర్కర్స్‌తో బహుజాగ్రత్తలు పాటించడం, వాక్కును నియంత్రించుకోవడం అవసరం. ఇంటిలో ఉండే పనివారితో కూడా జాగ్రత్తలు అవసరం. వ్యాపార విషయాలు అనుకూలమే. నూతన ప్రయత్నాలకు అనుకూలత తక్కువ. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని కోణాలలోనూ గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులు అందరితోనూ కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లల నడవడిక మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాల నిర్వహణ విషయంగా ధనవ్యయం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భములలో అధిక ధనలాభం చేకూరుతుంది. అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు సాగుతాయి. ఋణ విషయాలలో విచిత్ర స్థితి ఉంటుంది. కావలసిన కొత్త ఋణాలు ఆలస్యంగా అందుతాయి. భార్యాపిల్లలు తరచుగా ప్రయాణాలు చేయుట వలన ధనవ్యయం అధికం అవుతుంది. ఆరోగ్య విషయంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మంచి వైద్యం లభిస్తుంది. చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి. హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. కుటుంబ విషయాలు, సాంఘిక వ్యవహారాలను సమర్థంగా నడుపగలుగుతారు. అందరి నుంచి సహకారం ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయసంచారం దృష్ట్యా మే నుంచి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు కానీ, నష్టాలు మాత్రం ఉండవు. మంచికాలమే. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా వ్యాసంగంలో వారికి అనుకూలత తక్కువ. ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి కాలం అనుకూలం. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతుంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురువు వ్యయస్థితి సంచార ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాలి. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా, నష్టం మాత్రం ఉండదు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి అసహనం పెరుగుతుంది. గొప్ప కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నమ్మి పనులు తలపెట్టవద్దని ప్రత్యేక సూచన. మితభాషణ మీకు రక్షణ. ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. అవమానకర ఘటనలు, అధిక ధనవ్యయం చికాకు పెడతాయి. వాహన లాభం ఉంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా నష్టం జరుగుతుంది. ఋణ, ఆరోగ్య విషయాలు ద్వితీయార్ధంలో చికాకు కలిగిస్తాయి. శాంతి మార్గం: మే నెలలో గురుశాంతి చేయించండి. తెల్లజిల్లేడు, మారేడు, గరికలతో గణపతి అర్చన, ప్రాతఃకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజూ ‘గజేంద్ర మోక్షం’ పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్ష ధరించండి. ఏప్రిల్: ఈనెల శుభవార్తలు వింటారు. అన్ని రంగాలలో రాణిస్తారు. అధికారలాభం, అనుకూల స్థానచలనం. రాజకీయరంగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు, కార్యజయం కలుగుతాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులకు శ్రమ ఎక్కువైనా, లాభం ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యో గులు ఇబ్బంది పడతారు. స్వబుద్ధితో చేసే పనులన్నీ లాభిస్తాయి. రైతులకు చికాకులు ఉంటాయి. మే: అనుకున్న పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శత్రుబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. నిత్య శివదర్శనం, తీర్థస్నానాలు మంచివి. షేర్ వ్యాపారులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. విద్యార్థులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడతారు. జూన్: ప్రయాణాలవల్ల శారీరక అలసట. లాభాలు ఉన్నా, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన మంచిది. కోర్టు, ఋణ వ్యవహారాల్లో పరిష్కారమార్గం దొరుకుతుంది. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. జులై: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతాయి. నిత్యం శివ, సుబ్రహ్మణ్య ధ్యానం మంచిది. అధికారులు ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎప్పుడు ఆగ్రహిస్తారో తెలియని పరిస్థితి. స్థిరాస్తి కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. రైతులకు, విద్యార్థులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెలలో అన్నివిధాలా బాగుంటుంది. ఆర్థికపుష్టి కలుగును, శుభవార్తలు వింటారు. పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నెలాఖరున కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. 15వ తేదీ నుంచి మృగశిర నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. కొత్త ఋణాలు సమయానికి అందుతాయి. పాతవి తీర్చగలుగుతారు. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంలో అనుకూలత ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల దర్శనం చేస్తారు. సెప్టెంబర్: కుటుంబ పరిస్థితులు అనుకూలం. వృత్తిలో ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. çసంతాన సౌఖ్యం, గృహ, వస్తు వాహన లాభం. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. రుద్రాభిషేకం, శివకుటుంబ ఆరాధన మంచిది. ఆర్ద్రా నక్షత్రం వారు కొంచెం ఇబ్బందికి గురవుతారు. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం అవుతుంది. విదేశీ, స్థిరాస్తి ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన లావాదేవీలను గోప్యంగా ఉంచడం మంచిది. అక్టోబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉంది. బంధువర్గంతో సమస్యలు, పనుల్లో ఆలస్యం, శారీరక శ్రమ ఉంటాయి. తరచు వివాదాలు ఉండే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అభిషేకం, శ్రీరామరక్షాస్తోత్రం పారాయణ మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు, పనిముట్ల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాలక్షేపం ప్రమాదకరం కాగలదు. నవంబర్: కుటుంబ ఖర్చులు పెరిగినా, అవసరానికి తగ్గ ధనం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడతాయి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ మంచిది. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు కొంచెం అనుకూల స్థితి తక్కువ. డిసెంబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలం. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులను ఇతరుల సహాయంతో అధిగమిస్తారు. వ్యర్థ ప్రయాణాలు, వృథా ఖర్చులు, లాభాలు అంతంత మాత్రం. నవగ్రహ శాంతి చేసుకోవాలి. ఋణ బాధల వల్ల ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు చికాకులు. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత. జనవరి: ఉద్వేగపూరిత ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు. బంధువర్గం అనుకూలత, మిత్ర సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక చికాకులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులకు శ్రమ ఎక్కువ. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు శుభసూచకం. ఆర్ద్రా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు. ఫిబ్రవరి: కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పనికీ అధిక ప్రయత్నం అవసరం. విష్ణు ఆరాధన శుభప్రదం. ఆర్ద్రానక్షత్రం వారికి లాభదాయకం. «శ్రమ ఎక్కువైనా కార్య సాఫల్యావకాశాలు బాగున్నాయి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. మార్చి : ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పెను మార్పులు. మీ మాటకు విలువ పెరుగుతుంది. -
ఉగాది ఆరంభంతో ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి అవకాశం
కర్కాటక రాశి ఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6 పునర్వసు 4వ పాదము (హి) పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా) ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ) గురువు మే 1 వరకు మేషం (దశమం)లోను తదుపరి వృషభం (లాభం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (అష్టమం)లోను రాహువు మీనం (నవమం)లోను కేతువు (తృతీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సమయపాలనతో ఏ పనీ కూడా చేయరు. పుణ్యకార్యాలలో ఎక్కువ కాలక్షేపం జరుగుతుంది. అన్న, వస్త్ర, స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి వస్తుంది. కొన్ని పనులను దాటవేసే ఆలోచనలు చేస్తారు. కొన్ని పనులను ధైర్యంగా సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. తరచుగా ‘నరఘోష’కు గురి అవుతుంటారు. తద్వారా చికాకు పడతారు. అష్టమ శని వల్ల అన్ని రంగాలలోనూ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కలహాలు తలెత్తుతాయి. జాగ్రత్తపడండి. ఉద్యోగ విషయాలు చాలా శ్రమాధిక్యం అవుతుంటాయి. మీకు గురుబలం దృష్ట్యా అన్ని పనులు చేయడానికి తగిన ఆలోచనలు చేయగలిగినా, అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రమోషన్‌కు తగిన అర్హతలు ఉన్నప్పటికీ అడ్డంకులు చాలా ఉంటాయి. నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేవారు అధికంగా ఉంటారు. వ్యాపారులకు వ్యాపారం బాగానే ఉన్నా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందుతాయి. కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాలలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు మీ బంధువులు బాగా సహకారం చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుంది. తరచుగా ప్రయాణములు అధికంగా చేయడం తద్వారా ఆరోగ్య, ఆర్థిక చికాకులు పొందడం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే 1 నుంచి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఆదాయం బాగా ఉన్నా, ఖర్చులు మీ ఇష్టానుసారం ఉండవు. పాత ఋణాలు తీర్చడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కొత్త ఋణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. వాహనాల కొనుగోలు ఆలోచనలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా సమస్యలను దాటవేసే ప్రయత్నంలో సఫలం అవుతారు. కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందు జాగ్రత్తలతో దాటవేయగలరు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు. అలాగని బాధపడక ముందుకు సాగుతారు. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది. కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి. మానసిక ఆందోళన ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలమైన సమయం గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కానీ నష్టపడే కాలం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అవరోధాలు ఎక్కువ. విద్య నిమిత్తంగా వెళ్ళేవారు శ్రమతో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు చికాకులు చూపుతాయి. కలçహాలు కోర్టు విషయంగా పెరగగలవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం సర్దుబాటు ఉన్నా, వస్తు నిర్ణయం విషయంలో శ్రమ ఎక్కువ. విద్యార్థులు విద్యా విషయంగా బాగుంటుంది. ఇతర, అనవసర విషయాలు తరచుగా ఇబ్బంది కలిగిస్తాయి. రైతుల విషయంలో తెలివిగా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయినా కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారుతుంది. పునర్వసు నక్షత్రం 4 వారికి బంధు మిత్రులు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి, వృత్తికి సమతూకంగా కాలం కేటాయించలేక అసహనం చెందుతారు. స్వయంగా పర్యవేక్షించే పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి తరచు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలు, స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అధిక వ్యయంతో సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్లు అనుకూలం, కొన్నాళ్లు ప్రతికూలంగా సంవత్సరం అంతా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలలో నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలలో గౌరవభంగం జరగవచ్చు. శాంతి మార్గం: శని, రాహువులకు జపం, దానం చేయించండి. ఆంజనేయస్వామి దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి, తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. ఏప్రిల్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. నూతన వస్త్రధారణ, ఆభరణ– వాహనాల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో మౌనం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితం అందుకుంటారు. మే: వృత్తి వ్యాపారాలలో ఊహించని అనుకూలత. ఆర్థిక లాభాలున్నా, ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. అవరోధాలను అధిగమిస్తారు. ఋణాల విషయంలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. రైతులకు అనుకూలం. జూన్: స్థానమార్పులు ఉంటాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫైనాన్స్ షేర్ వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాలలో కిందిస్థాయి వారితో చికాకులు తప్పవు. అధికారుల అండదండలు ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలం. జులై: పనులు లాభదాయకంగా ఉంటాయి. ధనం నిల్వ చేయగలరు. ఊహించని ప్రయాణాల వల్ల ఇబ్బందులు. శుభవార్తలు వింటారు. భూ–గృహలాభం ఉంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. రైతులు, విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: ఈ నెల ఏ పని చేపట్టినా అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ విషయమై డబ్బు నీళ్ళలా ఖర్చవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత లోపిస్తుంది. 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆశ్లేషా నక్షత్రం వారికి కుటుంబ సభ్యులతో సయోధ్య కుదరని సందర్భాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు అనుకూలం. సెప్టెంబర్: మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులు రాబోవు ఆరు మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, ఆర్థిక, ఋణ వ్యవహారాలలో రాబోవు ఆరు మాసాలు ప్రతికూల స్థితి. శని కుజ గ్రహముల శాంతి చేయించండి. అక్టోబర్: పనుల్లో ఆలస్యం, శారీరక రుగ్మతల బాధ పెరుగుతాయి. మనోధైర్యం తగ్గుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మీకు లేదా మీ కుటుంబ పెద్దలకు వైద్యం అత్యావశ్యకం అవుతుంది. అతి శ్రమ చేస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులు తెలివి, ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు. నవంబర్: రానున్న 5 నెలలు అనేక సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేసుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇతరులపై ఆధారపడకుండా వ్యవహరించాలి. మనస్పర్ధలు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు ఆలస్యం కావడం వల్ల కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలతలు లేవు. షేర్ వ్యాపారులు నష్టపడకుండా బయటకు రావడం కష్టసాధ్యం. శుభకార్య ప్రయత్నాలు, అభివృద్ధి ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దని సూచన. డిసెంబర్: వృత్తిలో విశేష గుర్తింపు లభిస్తుంది. నిరాటంకంగా పనులు పూర్తవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉన్నతాధికారుల సందర్శనం, అనుకూల బదిలీలు ఉంటాయి. ఋణ సమస్యలు తగ్గుతాయి. దాంపత్యంలో ఇబ్బందులు, పిల్లల నుంచి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువ. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించుకోవాలి. స్థిరాస్తి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలలో వాయిదాలు శ్రేయస్కరం. జనవరి: శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల ప్రయాణాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థల వలన మనస్తాపం. బంధువర్గం సహకరిస్తారు. ఋణవిముక్తి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వసు నక్షత్రంవారికి కలహ, ఋణ, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండవచ్చు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, రైతులకు బాగా అనుకూలం. ఫిబ్రవరి: మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతాయి. పనులు ఆలస్యమైనా, సహనంతో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు ఆరాధన మంచిది. బంధు మిత్రులకు సేవ చేయవలసిన పరిస్థితి వలన మీ దైనందిన కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు ఫలితాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలకు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: కుటుంబ పెద్దలకు స్వల్ప ఆరోగ్య సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తిలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మందగమనం. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు. -
ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
సింహ రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–2, అవమానం–2. మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే) పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ) ఉత్తర 1వ పాదము (టే) గురువు మే 1 వరకు మేషం (నవమం)లోను తదుపరి వృషభం (దశమం)లోను సంచరిస్తారు. శని కుంభం (సప్తమం)లోను రాహువు మీనం (అష్టమం)లోను కేతువు (ద్వితీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో సమయపాలన లేకపోవడం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా వెళతారు. అనవసర ఆలోచనలు, తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతాయి. మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే కాలం. ఇబ్బందులు పోగొట్టుకోవడం మీ ప్రయత్నాలలోనే ఉన్నది. వృథా కాలక్షేపాలు చేయవద్దు. సప్తమ శని వల్ల అన్ని పనులూ ఆలస్యం అవుతుంటాయి. అయితే స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదు. ఉద్యోగ విషయాలలో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరగగలదు. మే నుంచి సంవత్సరాంతం వరకు మీ తోటివారు, మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా కూడా సహకారం తగ్గగలదు. అందరితోనూ స్నేహభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతాయి. నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అదే రీతిగా నూతన ఉద్యోగ ప్రయత్లాలో కూడా సానుకూలత ఉంటుంది. అష్టమ రాహువు వలన మీరు అందరినీ అనుమానించడం, మీరు తరచుగా అవమానాలకు గురికావడం జరుగుతుంది. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు అలసత్వం ప్రదర్శిస్తారు. అది ఇబ్బందికరం అవుతుంది. మీకు, కుటుంబ సభ్యులకు మధ్య కార్య నిర్వహణ విషయంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. మనస్తాపం పెరుగుతుంది. బంధువులతో తరచుగా ఇబ్బంది ఉంటుంది. జ్ఞాతివైరం ఉన్నవారికి ఈ సంవత్సరం ఆ వైరం పెరగగలదు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఖర్చులను నియంత్రించలేని స్థితిలో ఉంటారు. ఋణ సౌకర్యం కూడా ఆలస్యంగా ఉంటుంది. పాత కొత్త ఋణాలు ప్రారంభంలో ఇబ్బందులు సృష్టించినా, క్రమంగా సానుకూలం అవుతుంటాయి. వృథాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. విద్యా విజ్ఞాన విహార యాత్రల విషయంగా ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. తీసుకుంటారు కూడా. చర్మవ్యాధులు, జీర్ణ సంబంధమైన ఇబ్బంది, రక్తపోటు ఉన్నవారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. గమనించండి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ అవుతుంటుంది. ఉద్యోగం, కుటుంబం విషయాలలో సమన్యాయంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఉండవు. ప్రతి పనీ ఆలస్యం అవుతుండటం వలన మీకు ఆగ్రహావేశాలు పెరుగుతుంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు చాలా అవసరం అనే చెప్పాలి. వైద్య సలహాలు జాగ్రత్తగా పాటించండి. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నెల తరువాత మీరు వేరే వారితో పోలిక లేకుండా ముందుకు సాగండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ఏ పనీ సవ్యంగా సాగదు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేయండి. కోర్టు వ్యవహారములలో ఉన్నవారికి చికాకులు పెరిగే అవకాశం ఉంటుంది. పనులు వ్యతిరేకం కాకుండా జాగ్రత్త తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి దారి తప్పించేవారు ఎక్కువ అవుతారు. అవకాశం ఉంటే కొనుగోలు వాయిదా వేయండి. విద్యార్థులకు మానసిక వ్యవస్థ విద్యా వ్యాసంగముల కంటే ఇతర అంశాల మీదకు ఎక్కువగా ప్రసరిస్తుంది. రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ఆశించిన ఫలితాలు అందవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. మఘ నక్షత్రం వారు పనులు వాయిదా వేయడం వలన సమస్యలు ఎదుర్కొంటారు. షేర్వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తించక గడ్డు పరిస్థితులు తెచ్చుకుంటారు. అవసరానికి తగిన ధనం సర్దుబాటు అవుతుంది. పుబ్బ నక్షత్రం వారు వృథా కాలక్షేపం చేస్తారు. విద్యా, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ధైర్యంగా అనేక విజయాలు సాధిస్తారు. బంధు మిత్రులు సహకరిస్తారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు పుణ్య, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. శాంతి మార్గం: శని, రాహు గ్రహశాంతి చాలా అవసరం. ప్రాతఃకాలంలో నిత్యం ఆంజనేయస్వామి వారి దేవాలయంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఈ నెల ప్రతివిషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇతరులపై పనిభారం మోపి, నిద్రావస్థలో ఉంటే నష్టపోతారు. అహంభావంతో ఇబ్బందుల్లో పడతారు. ఖర్చులు, ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు జాగ్రత్త కనబరచాలి. విద్యార్థు్థలకు, రైతులకు ఆశించిన ఫలితాలు అందవు. మే: ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు చూస్తారు. ఋణబాధల నుంచి విముక్తి. ఉన్నత పదవులు చేపడతారు. అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందం కలిగిస్తుంది. కుజశాంతి శుభప్రదం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం శూన్యం. రైతులకు అనుచిత సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు పనులు వాయిదా వేయడం శ్రేయస్కరం. జూన్: వృత్తిలో రాణిస్తారు. విశేష ధనలాభం. బదిలీలు అనుకూలం. రాజకీయ రంగంలో వారికి మంచి పదవులు దక్కుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నెలాఖరున ఒక శుభవార్త అనందం కలిగిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం కృషి చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు ఈ నెల రోజులు అనుకూలం. పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు. జులై: నేర్పుతో పనులన్నీ సునాయాసంగా పూర్తిచేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫైనాన్స్, వ్యాపారులు, షేర్ వ్యాపారులకు 16వ తేదీ తరువాత చికాకులు ఉంటాయి. ఆగస్ట్: పనిఒత్తిడి పెరిగినా, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఖర్చులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. 18వ తేదీ నుంచి మఘ నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు రాగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. రైతులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది. 13వ తేదీ వరకు పుబ్బ నక్షత్రంవారికి పనులు ఇబ్బందికరం కాగలవు. షేర్ వ్యాపారులు మంచి తెలివి, ధైర్యం ప్రదర్శించి కాలం అనుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సకాలానికి ఋణాలు అందుతాయి. అక్టోబర్: ఉన్నతాధికారులను సందర్శిస్తారు. విశిష్ట బాధ్యతలు చేపడతారు. శత్రుబాధల నుంచి విముక్తి. ఈనెల నుంచి ఊహించని ఖర్చులు, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, దాంపత్యసౌఖ్యం లోపించడం జరుగుతాయి. కుజశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. çసంతానం రాణింపు ఆనందం కలిగిస్తుంది. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు ఆలస్యం అవుతుంటాయి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. డిసెంబర్: ఈ నెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నది. మీ తప్పు లేకున్నా నిందలు పడవలసి వస్తుంది. స్త్రీ విరోధం, దాంపత్య విభేదాలు కలుగుతాయి. మౌనం మంచిది. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. షేర్ వ్యాపారులు ఇబ్బందికి గురవుతారు. కోర్టులు, స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. జనవరి: ఇతరుల విషయాలలో జోక్యం లేకుండా, మీ పనులలో శ్రద్ధవహిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారు. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటుతనం తగ్గించాలి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఫిబ్రవరి: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. అకాల భోజనం, వ్యర్థ ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు. వృత్తిలో ఊహించని మార్పులు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పుబ్బ నక్షత్రం వారు విశేష లాభాలు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులు, రైతులు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు. పనులు నత్తనడకన సాగుతాయి. స్థిరాస్తుల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. -
కన్యా రాశి వారికి ఈ ఉగాది సంవత్సరాన మంచి శుభవార్త
కన్యా రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–5, అవమానం–2. ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ) హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా) చిత్త 1,2 పాదములు (పే, పో) గురువు మే 1 వరకు మేషం (అష్టమం)లోను తదుపరి వృషభం (నవమం)లోను సంచరిస్తారు. శని కుంభం (షష్ఠ)లోను రాహువు మీనం (సప్తమం)లోను కేతువు (జన్మ)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చురుకుగా పాల్గొంటారు. నిద్ర, భోజనం వంటివి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెడతారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తుంటారు. తరచుగా శుభ కార్యాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తుంటారు. మే తరువాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే. ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుంచి ఫలితాలు బాగుంటాయి. అయితే మే తరువాత ఇంకా అనుకూలం. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు లభిస్తాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలము. అధికారుల సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ భయపడటం లేదా చికాకుపడటం వంటివి జరుగుతుంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్యవృద్ధి బాగా ఉండటం ఆనందానికి కారణం అవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల సహకారం బాగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను మే నుంచి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడంలో, అవసరానికి కావలసిన కొత్త ఋణాలు పొందడంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి. తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు చేతులు వాటి వేళ్ళు అనేక సందర్భా లలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుంచి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. మానసిక అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు ఉంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శనిబలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోనవ్వద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతాయి. లాభదాయకంగా కాలం గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే దగ్గర నుంచి గురుబలం బాగుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవ్వద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమవుతారు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యా, వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు వింటారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం 1, 2 వారికి రోజువారీ భోజనాది విషయాలలోనూ అనుకూలత తక్కువ. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు. శాంతి మార్గం: రాహు కేతువులకు జప దానాలు అవసరం. ప్రతిరోజూ గణపతిని, దుర్గను అర్చించిన తరువాత మిగిలిన పనులు చేయండి. ‘దుర్గాసప్తశ్లోకి’ స్తోత్రం రోజూ 11సార్లు పారాయణ చేయాలి. ఏప్రిల్: ఈనెల ప్రతికూల ఫలితాలు ఎక్కువ. శ్రమకు తగిన లాభం లేకపోవటం, ఖర్చులు పెరగటం జరుగుతాయి. వృత్తిలో మాటపడవలసి వస్తుంది. కుజ శాంతి, నవగ్రహారాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు ఆందోళనకర ఘటనలు ఎదుర్కొంటారు. మే: ఈ నెల కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లోపించటం, పని ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. రాబోవు మూడు మాసాలలో ఆరోగ్య ఋణ విషయాలలో శ్రద్ధ అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు పెరిగే కాలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి విషయాలు లాభదాయకం. జూన్: ఉద్యోగంలో రాణిస్తారు. అనుకూలంగా స్థానచలనం, అభివృద్ధి జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఋణ సమస్యలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి. గురువులను దర్శించుకుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఒత్తిడి తప్పదు. జులై: ఈనెల అంతా అనుకూలమే. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు, ప్రశంసలు లభిస్తాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది. 16వ తేదీ తరువాత పాత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. ఆగస్ట్: శ్రమతో కార్యజయం. నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. స్థానచలన సూచనలు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 18వ తేదీ తరువాత జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. సెప్టెంబర్: పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్ర సహకారం లభిస్తుంది. నిత్యం ధ్యానం చేయుట మంచిది. 13వ తేదీ నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి. చిత్త నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమైంది. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. అక్టోబర్: వ్యాపారంలో పెను మార్పులు, ఊహించని లాభాలు. రానున్న 6 నెలలు అత్యంత అనుకూలం. సమస్యలు, శత్రు బాధలను సునాయాసంగా అధిగమిస్తారు. వేగంగా పనులు పూర్తి చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ప్రయాణ సౌఖ్యం, సాంఘిక గౌరవం. నవంబర్: ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ నేతలకు ఉన్నత పదవులు లభిస్తాయి. శత్రుబాధలు తొలగుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలం. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: కుటుంబ ఒత్తిడి వలన కొన్ని చికాకులు ఉంటాయి. సంతానం విద్యలో రాణించటం వలన ఆనందం కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అనుకున్న దాని కంటే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఉంటుంది. షేర్ వ్యాపారులు మంచి ఆదాయం పొందుతారు. జనవరి: ఈ నెల ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, శత్రుబాధలు, పని ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఆర్ధిక బలం పెరుగుతుంది. çఉత్తర నక్షత్రం వారికి మానసిక కష్టాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు కూడా అనుకూలమే. ఫిబ్రవరి: గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహిం చని విధంగా అందరి సహకారం లభిస్తుంది. ప్రతిభకు తగిన గౌరవమర్యాదలు ఉంటాయి. ఆర్ధిక స్థిరత్వం, ఋణ రోగ శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతాయి. దాంపత్య జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండును. చిత్త నక్షత్రం వారికి కార్యలాభం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలం. రైతులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం.ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. మార్చి: ఈ నెల ప్రతికూలత ఎక్కువ. వ్యర్థ ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహారాధన చేయుట శుభకరం. -
తులారాశి వారికి ఈ సంవత్సరం ఇలా జరగవచ్చు
తులా రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–1, అవమానం–5. చిత్త 3,4 పాదములు (రా, రి) స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే) గురువు మే 1 వరకు మేషం (సప్తమ)లోను తదుపరి వృషభం (అష్టమం)లోను సంచరిస్తారు. శని కుంభం (పంచమం)లోను రాహువు మీనం (షష్ఠం)లోను కేతువు (వ్యయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాకాలం తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభం అయింది. పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. సమయం వృథా చేయవద్దని సూచన. ప్రతి కార్యంలోనూ మీకు ఎన్నో విఘ్నములు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా వ్యవహరిస్తే, మీకు విజయం దక్కుతుంది. గురువు సంచారం మే వరకు అనుకూలం. రాహు ప్రభావంగా అన్ని విషయాలలోను చాలా ధైర్యంగా కాలక్షేపం చేస్తారు. ఇది ప్రత్యేక వరము అనే చెప్పాలి. ఉద్యోగ విషయాలలో అధికమైన పరిశ్రమ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం, సహకారం చాలా అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది. శ్రమకొద్దీ లాభం అందుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు, అవరోధాలు రాగలవు. జాగ్రత్తపడండి. కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ అవుతుంది. జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉన్నట్లయితే, అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత ఋణాలు, కొత్త ఋణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తాయి. తరచుగా శుభ కార్యాలలో పాల్గొనడానికి, అలంకరణ వస్తువులు కొనుగోలుకు ఖర్చు బాగా పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వలన అమితోత్సాహంగా ఉంటారు. ఆరోగ్యవిషయంగా బహు శ్రద్ధ, జాగ్రత్తలు పాటిస్తారు. తద్వారా ఇబ్బంది లేని విధంగా జీవనం చేస్తారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్య సదుపాయం చేకూరుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలం అవుతుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై సుఖజీవనం సాగుతుంది. చాలా ప్రశాంత జీవనం చేస్తారు. షేర్ వ్యాపారులకు గురుబలం, రాహు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. సుఖంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి లాభదాయక కాలము. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అయినా, పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుంది. ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ. మంచి సలహాలు అందుతాయి. లాభాలు బాగా అందుతాయి. చిత్త నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుతారు. స్వాతి నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు అనుకోని లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 వారికి సకాలంలో ఋణ సౌకర్యం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు చేపడతారు. యోగ్యమైన జీవనం సాగిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. శాంతి మార్గం: తెలుపురంగు పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి మూడు మాసములకు ఒకసారి నవగ్రహ హోమం చేయండి. రోజూ భువనేశ్వరీ సహస్రనామ పారాయణ చేయండి. ఏప్రిల్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వ్యాపారలాభం, ప్రయాణ లాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. భూ– ఆభరణ కొనుగోలు చేస్తారు. షేర్ వ్యాపారులు మంచి నిర్ణయాలతో లాభిస్తారు. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అధికారుల తోడ్పాటు బాగుంటుంది. విద్యార్థులకు అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. గురువులను పూజ్యులను దర్శిస్తారు. శుభకార్య, సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మే: ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో జాగరూకతతో ఉండాలి. అధికారయోగం ఉంది. స్త్రీలతో వివాదాలు వద్దు. చేయవలసిన పనులు వదిలి అనవసరమైనవి చేస్తుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత తక్కువ. జూన్: వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాలలో మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి పనులు కొంత ఆలస్యమవుతాయి. స్వాతీ నక్షత్రం వారికి తరచు ఆరోగ్య సమస్యలు, కలహాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు, షేర్ వ్యాపారులకు మంచి సూచనలు అందవు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జులై: ఉద్యోగ వ్యాపారాలలో విశేష గౌరవం, లాభాలు ఉంటాయి. అధికారయోగం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. 3వ వారం నుంచి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. అన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రోజువారీ కార్యములు అస్తవ్యస్తంగా ఉంటాయి. స్వాతీ నక్షత్రం వారు కలహాలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: వృత్తిలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాహన కొనుగోలుకు అనుకూలం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కొత్త పరిచయాలు, ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. సెప్టెంబర్: దైవదర్శనం చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్రాభరణ లాభం ఉంది. చిత్త నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం సరిగా ఉండదు. ఖర్చులు, ఋణాలలో యిబ్బందులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కాలం ప్రతికూలం. విదేశీ ప్రయత్నాలలో అవరో«ధాలు ఎక్కువ. అక్టోబర్: మీ పనితీరులో మార్పులు చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకూల బదిలీలు ఉంటాయి. కుటుంబాభివృద్ధి, శుభకార్యాలు జరుగుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు మంచికాలం. నవంబర్: ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు. అధికార యోగం ఉంది. బదిలీలు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలు కారణంగా ఖర్చు పెరుగుతుంది. షేర్ వ్యాపారులకు అధిక లాభములు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కాలం పరిపూర్ణంగా అనుకూలం. డిసెంబర్: ఈ నెల అత్యంత అనుకూలం. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలం. స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జనవరి: ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బందులు. భూ– గృహ– వాహన కొనుగోలుకు అనుకూలం. అధికారుల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటారు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడండి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: ఈనెల అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ జాప్యం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు మీతో సన్నిహితంగా ఉన్నా, మీ జాగ్రత్తలో మీరుండాలి. పెట్టు బడులు ఆశించిన లాభాన్ని ఇవ్వవు. ఇతరుల విషయాలలో జోక్యం వలన ప్రతికూలత పెరుగుతుంది. నవగ్రహ ఆరాధన మంచిది. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతుంటాయి. విద్యార్థులు విద్యా వ్యాసంగానికి దూరం అవుతారు. సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలం. రైతులకు శ్రమాధిక్యం. ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. మార్చి: కార్యజయం. ఆరోగ్య, ఋణ సమస్యలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. రాజకీయరంగంలో అనుకూలత పెరుగుతుంది. స్త్రీవిరోధం వద్దు. లక్ష్మీస్తోత్ర పారాయణ మంచిది. -
ఈ రాశి వారికి ఈ ఉగాది నూతన సంవత్సరంతో ఫలితం ఎలా ఉందంటే?
వృశ్చిక రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–5. విశాఖ 4 వ పాదము (తొ) అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ) గురువు మే 1 వరకు మేషం (షష్ఠం)లోను తదుపరి వృషభం (సప్తమం)లోను సంచరిస్తారు. శని కుంభం (చతుర్థం)లోను రాహువు మీనం (పంచమం)లోను కేతువు (లాభం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సమయపాలన సరిగా ఉండదు. పైన చెప్పిన నాలుగు గ్రహాల సంచారం సరిగాలేదు. అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండటం వల్ల మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలరు. పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం, లేదా మీరే వాటిని ఎక్కడైనా మరచిపోవడం జరుగుతుంది. అప్రయత్నంగా శుభకార్యాలలో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి ఉంటాయి. ఉద్యోగ విషయాలలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంటుంది. మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానచలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు. అయితే విచిత్రం ఏమిటంటే వృత్తి రీత్యా ఈ సంవత్సరం మే నుంచి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టం ఉండదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకొని, ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీస్తాయి. అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయితో ఉంటాయి. అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు. తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినా, డబ్బు లేదని ఏ పనీ ఆగదు. గతం కంటే రాబడి తగ్గుతుంది. కానీ ఇబ్బంది కాదు. అనవసర ఖర్చులను నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులూ, పూజ్యుల రాకపోకలు దృష్ట్యా ధనవ్యయం అవుతుంది. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి. పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ప్రతి పనీ మీరే స్వయంగా చూసుకోండి. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తున్నది అనే చెప్పాలి. దూకుడువద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అందవు. నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు. పనులు ఆలస్యమవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. శాంతి మార్గం: శని, గురు, రాహువులకు శాంతి చేయించండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ ధ్యానం చేయండి. రోజూ గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. ఏప్రిల్: ఉద్యోగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. సంతానంతో అభిప్రాయ భేదాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలం. తరచు శుభవార్తలు వింటారు. మే: ఈనెల ప్రతికూలత ఎక్కువ. నిందలు పడవలసి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. నవగ్రహ శాంతి మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు అనుకూలం విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. స్థిరాస్తి, కోర్టు విషయాలు బాగా అనుకూలం. జూన్: తెలియని ఆందోళన ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది. ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి అందరి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు అనుకూలం. జులై: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నత అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు విజయవంతం అవుతాయి. మొదటి రెండు వారాలలో మంచి ఫలితాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువ. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఉద్యోగంలో మార్పులు. ఉన్నత పదవులు చేపడతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య, ఋణ సమస్యలు పెరుగుతాయి. కుజ శాంతి చేయాలి. సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. రైతులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సెప్టెంబర్: రాజకీయవేత్తలకు అనుకూలం. ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపారలబ్ధి. బదిలీలు అనుకూలం. ప్రయాణ లాభం. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. శుభపరిణామాలు కనిపిస్తాయి. కుజశాంతి మంచిది. రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి. విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు. అక్టోబర్: ఈనెల అనుకూలత తక్కువ. శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు ఉంటాయి. అవసరాలకు తగిన ఆదాయం అందదు. వృత్తి ఉద్యోగాల్లోను, ఆరోగ్యంపైన జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నవంబర్: ఈనెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. వ్యాపారం మందగిస్తుంది. కొత్త పనులు ఆలస్యమవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. నిరుత్సాçహానికి లోనవుతారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. డిసెంబర్: కుటుంబ, ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. స్థానచలనానికి ప్రయత్నిస్తారు. పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఋణ సమస్యలు పెరుగుతాయి. విష్ణు ఆరా ధన శ్రేయస్కరం. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. జనవరి: ఎప్పటి నుంచో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి. బదిలీలు అనుకూలం. భోజన సౌఖ్యం. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన మంచిది. అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. షేర్ వ్యాపారులు సరిగా వ్యాపారం చేయలేరు. ప్రతి విషయంలోనూ గోప్యత పాటించడం మంచిది. విద్యార్థులు, రైతులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఫిబ్రవరి: రవి–కుజ–బుధుల సంచారం ప్రతికూలముగా ఉన్నది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆలస్యం, కుటుంబ ఖర్చులు పెరగటం, శారీరక శ్రమ అధికమవడం జరుగుతాయి. పెద్దల, గురువుల సహకారంతో పనులు పూరవుతాయి. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. నవగ్రహారాధన చేయడం మంచిది. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ ఇతరుల సలహాలు స్వీకరింపవద్దు. ప్రతి పనీ స్వయంగా చూసుకోవాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. పెద్దలకు, పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలుంటాయి. మార్చి: ఈనెల గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఇతరులతో కొంత మితంగా వ్యవహరించుట మంచిది. వ్యర్థప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పనులు ఆలస్యమవుతాయి. ఉద్యోగంలో తోటివారితోను, అధికారులతోను విభేదాలు పెరుగును. పెద్దల సహాయం లభిస్తుంది. దైవారాధన మానవద్దు. -
ఈ రాశి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే..
ధనూ రాశి ఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–5 మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ) పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా) ఉత్తరాషాఢ 1వ పాదము (బే) గురువు మే 1 వరకు మేషం (పంచమం)లోను తదుపరి వృషభం (షష్ఠం)లోను సంచరిస్తారు. శని కుంభం (తృతీయం)లోను రాహువు మీనం (చతుర్థం)లోను కేతువు (దశమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడతారు. అన్ని విషయాలలోనూ స్వతంత్ర నిర్ణయాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సందర్భాలలో మీకు శుభవార్తలు అందుతాయి. మీ వ్యవహారాలలో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహార యాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకులు సృష్టించి, తద్వారా విభేదాలు తీసుకురాగలదు. వాగ్ధోరణిని నియంత్రించండి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి కానీ, అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలాగా చేస్తుంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శించకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం లేదా అనుకూల స్థలం చేరుకోగలరు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలం అవుతుంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది. కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పెడతాయి. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడకు అయినా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తుంది. తరచుగా శుభకార్య, పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనవ్యయం బాగా అధికం అవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురౌతాయి. మీ అందరితోనూ మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి చెంది స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఉంటాయి. అయితే ఇబ్బందికర ఘటనలు ఉండవు. కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తరువాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగున్నా, తగిన లాభాలు అందని పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా, సానుకూలం అవుతుంటాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి మే నెల నుంచి ధనవ్యయం అధికం అవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి కావలసిన వనరులు తేలికగా లభ్యం అవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి ఫలితాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు శ్రీరామరక్ష. మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి. అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ, ఆర్థిక, వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు. తరచు విహార యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నియమబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. అభివృద్ధి ఉన్నా, తగిన ఫలితాలు రావు. కుటుంబంలో సానుకూలత సాధిస్తారు. శాంతి మార్గం: సంవత్సర ఆరంభంలో రాహువుకు, మే నెలలో గురువుకు జపం చేయించండి. ప్రాతఃకాలంలో రోజూ తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పని మీద దృష్టి పెట్టలేరు. ఇతర కార్యకలాపాలపై ఆసక్తి వలన ఇబ్బందులు కలుగుతాయి. అశ్రద్ధ, అకాలభోజనం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహస్తోత్రం పఠించాలి. ఉద్యోగ వ్యాపారాలలో కోరిన విధంగా ముందుకు వెడతారు. కుటుంబ సమస్యలకు, ఋణ సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు మంచి పరిష్కారాలు పొందుతారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. మే: నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం గతంలోకన్నా లాభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. దుర్జన సాంగత్యం వలన ఊహించని సమస్యలు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ వ్యాపారుల ప్రణాళికలు సరిగా సాగవు. రైతులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. జూన్: తరచు ఊహించని ప్రయాణాలు. దాంపత్య జీవితంలో మనస్పర్థలు కలుగుతాయి. పనిఒత్తిడి వలన ఇంటి పనులు నిర్వహించలేరు. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. శివకుటుంబ ఆరాధన మంచిది. మూలనక్షత్రం వారు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయరాదు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు విచిత్ర సమస్యలు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. జులై: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారంలో విభేదాలు, శత్రుబాధలు తొలగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం. భూమి కొనుగోలు చేస్తారు. శివ–విష్ణు స్తోత్ర పారాయణ మేలు. క్రమంగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్ వ్యాపారులకు అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థులకు రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెల అనుకూలత తక్కువ. చెప్పుకోలేని సమస్యలు. వృథా కాలక్షేపం వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శాంతి చేయడం మేలు. పుణ్యకార్య శుభకార్య, కుటుంబ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఆర్థిక వెసులుబాటు తక్కువ. వస్తువులు చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. షేర్ వ్యాపారులకు దూకుడు తగదు. రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. అధికార యోగం. ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపార లబ్ధి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం లభింస్తుంది. రాబోవు ఆరుమాసాలు ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులకు, రైతులకు కూడా ఇబ్బందికరమైన కాలమే. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం కాదు. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి. రాజకీయవేత్తలు ఉన్నత పదవులు చేపడతారు. ఇప్పటి నుంచి 6 నెలలు పనులలో జాప్యం, తరచు ఆరోగ్య సమస్యలు, ఇతరులతో వివాదాలు ఉంటాయి. కుజ, సుబ్రహ్మణ్య శాంతి చేయాలి. వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ఓర్పుగా వ్యవహరించాల్సిన కాలం. నవంబర్: స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టంలేని బదిలీలు, ప్రయాణాలు వలన శ్రమాధిక్యం, అకాల భోజనం, పనుల్లో జాప్యం జరుగుతాయి. ఋణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించడం మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. డిసెంబర్: పనులన్నీ నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ప్రయాణాల వలన ఇబ్బందులు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. శివ–విష్ణు ఆరాధన శుభప్రదం. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. తెలివి ఉన్నా, ధైర్యం చేయలేక చాలా పనులు ఆపివేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. జనవరి: ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తారు. పనుల నిమిత్తం ఎక్కువగా తిరగవలసి రావటం, శ్రమాధిక్యం ఉంటాయి. కార్యజయం ఉన్నది. విష్ణుస్తోత్ర పారాయణ శ్రేయస్కరం. ఆదాయ వ్యయాల సమతుల్యత సాధించలేరు. దైనందిన జీవనం సరిగా సాగదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు అతి శ్రమ, స్వల్ప ఫలితం ఉంటాయి. ఫిబ్రవరి: నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి కోర్టు విషయాలు సర్దుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విష్ణు–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. çఅభివృద్ధి కోసం చేసే ప్రతి పనీ ఇబ్బందికరం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మార్చి: విశేష వ్యాపారలబ్ధి ఉంటుంది. పనులన్నీ నేర్పుతో పూర్తి చేస్తారు. వ్యాపార నిమిత్త ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నవగ్రహారాధన చేయుట మంచిది. -
ఈ ఉగాది సంవత్సరాన ఈ రాశి వారికి ప్రమోషన్ అవకాశమే
మకర రాశి ఆదాయం–14 , వ్యయం–14 , రాజయోగం–3 , అవమానం–1 . ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ) శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ) ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి) గురువు మే 1 వరకు మేషం (చతుర్థం)లోను తదుపరి వృషభం (పంచమం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (ద్వితీయం)లోను రాహువు మీనం (తృతీయం)లోను కేతువు (భాగ్యం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎక్కడా ఆటంకాలు ఉండవు. సమయపాలన బాగా చేస్తుంటారు. ఏలినాటి శని చివరి సమయంలో ఉన్నది. గురుబలం అనుకూలత దృష్ట్యా అంతా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగ మీరు సహవాసాలు నడుపుకోండి. తరచుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. స్వబుద్ధితో చేసే కార్యములు అన్నీ విజయమే అందిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ విషయాలలో అధికంగా తిరగవలసి ఉంటుంది. మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా ఈ తిరుగుడు ఉంటుంది. అయితే అది లాభదాయకమే. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే నెల తరువాత చాలా సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు. వ్యాపారులు స్వబుద్ధి, స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే నెల నుంచి అంతా శుభపరిణామాలే ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసు కోవడం జరుగుతుంది. అయితే క్రమేణా గురుబలం వలన అవి సమసి పోతాయి. పిల్లల విషయంలో మీ అంచనాలు చక్కటి ప్రతిఫలం చూపుతాయి. మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలం అవుతాయి. అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు పూర్తవుతాయి. పాత ఋణాలు తీర్చే విషయంలోను, అవసరమైన కొత్త ఋణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు వింటారు. గురువులను పూజ్యులను కలుస్తారు. విద్యార్జనపై ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదేని పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది. బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు రాకుండా కాలక్షేపం చేస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటుంది. ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయం అందుకుంటారు. అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై అంతా శుభపరిణామాలే గోచరిస్తున్నాయి. చక్కటి ఆరోగ్యస్థితి ఉంటుంది. షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం. ఎటువంటి చాంచల్యమూ లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి కాలం కలసి వస్తుంది. విద్యా విషయంగా వెళ్ళేవారికి లాభం ఎక్కువ. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు ఆలస్యం. శ్రమాధిక్యతతో లాభాన్నిస్తాయి. విజయం తథ్యము. స్థిరాస్తి కోనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు అందుకుంటారు. రైతుల విషయంలో అంతా శుభప్రదమే. మంచి సూచనలు, సలహాలు అందుకుని లాభం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3,4 వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితానికి పొంతనలేని స్థితి ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేక ఇబ్బంది పడతారు. అవసరానికి కావలసిన ధనం సర్దుబాటు కాక పనులు వాయిదా వేయవలసిన స్థితి ఉంటుంది. శ్రవణం నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుత ఫలితాలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రించడంలో విఫలం అవుతారు. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలవారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ వాయిదా వేసే లక్షణాలు ప్రదర్శిస్తారు. అనవసర విషయాలలో చర్చలు భయం, అవమానం కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. శాంతి మార్గం: అమ్మవారి అర్చన చేయండి. రోజూ సుబ్రహ్మణ్య, దుర్గాపూజలు చేస్తుండండి. ‘శ్రీమాత్రే నమః’ నామంతో ధ్యానం చేయడం, సుందరకాండ శ్రవణం చేయడం మంచిది. శని జపం చేయించండి. ఏప్రిల్: ఈనెల అన్ని రంగాలవారికీ కాలం కలసి వస్తుంది. 3వ వారంలో కొన్ని సమస్యలు ఎదురైనా, మనోధైర్యంతో ఎదుర్కొంటారు. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో కొంత అలజడి ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. షేర్ వ్యాపారులు లాభపడతారు. విదేశీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. స్థిరాస్తి ప్రయత్నాలలో కాలం అనుకూలం. మే: ఈ నెల పనులు సానుకూలంగా సాగుతాయి. ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడతాయి. విలాస జీవితం గడుపుతారు. కుటుంబంలో స్వల్ప మనస్పర్థలు ఏర్పడతాయి. శివ–విష్ణు స్తోత్రపారాయణ శుభప్రదం. విదేశీ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పథకాల రూపకల్పనకు, స్థిరాస్తి కొనుగోలుకు మంచి కాలం. పెద్దవారి ఆరోగ్యం బాగుండటం, పిల్లల అభివృద్ధి వలన సుఖపడతారు. జూన్: ఈ నెల అత్యంత అనుకూలం. అన్ని రంగాలవారు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. మొండి బాకీల వసూలవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జులై: ఈనెల గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది. ఎదుటి వారి మేలు కోసం మీరు చేసే పనుల వలన ఇబ్బందులు తప్పవు. అందరూ మీతో విరోధిస్తారు. వ్యాపారం గతం కన్నా తగ్గుతుంది. నవగ్రహారాధన మంచిది. ఋణ సమస్యలు విచిత్రంగా ఉంటాయి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ అయినా, ఇబ్బంది ఉండదు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు ఉండవు. ఆగస్ట్: ఈనెల ప్రథమార్ధం ఎటువంటి సమస్యలు లేక సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో పనులన్నిటా ఆటంకాలు ఎదురవుతాయి. 4వ వారంలో శుభాలు కలుగుతాయి. వృత్తిలో రాణిస్తారు. అనవసర విషయాలలో కలగ చేసుకొని కలహాలు తెచ్చుకుంటారు. మీ మాటకు గౌరవం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. సెప్టెంబర్: ఈ నెల అనేక శుభాలు జరుగుతాయి. వ్యాపార లబ్ధి. వృత్తిలో ఆటంకాలను అధిగమిస్తారు. స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూ వాహన కొనుగోలుకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. గురువులను సందర్శిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. అధికారయోగం ఉంది. రాజకీయవేత్తలకు అనుకూలం. ప్రభుత్వ సంబంధ పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో తెలియని అశాంతి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు. విద్యార్థులకు మంచి కాలం. షేర్ వ్యాపారులు అద్భుతంగా రాణిస్తారు. నెల అంతా పుణ్య, శుభకార్యాలు నిర్వహిస్తారు. నవంబర్: ఈనెల శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పటి నుంచి 5 నెలల పాటు జీవిత, వ్యాపార భాగస్వాములతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేయాలి. అధికారుల సహాయంతో ప్రమోషన్లు, స్థానచలనాల్లో లాభం అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు లాభదాయకం. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల సందర్శన చేసుకుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. డిసెంబర్: ఈనెల అన్ని రంగాలవారికీ అనుకూలమే. వ్యాపారలబ్ధి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. 16వ తేదీ తరువాత స్వయంకృతాపరాధం అన్నట్లుగా కొన్ని పనులు పాడు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఇతర చికాకులు 16వ తేదీ నుంచి పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. జనవరి: ఈనెల వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. ఫిబ్రవరి: వ్యాపారం లాభ దాయకంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలుంటాయి. మార్చి : ఈ నెల ఎక్కువ శుభపరిణామాలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం. -
ఈ ఉగాది కొత్త సంవత్సరంతో.. ఈ రాశి వారకి ఎలా ఉందంటే..?
కుంభ రాశి ఆదాయం–14, వ్యయం–14, రాజయోగం–6, అవమానం–1 ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే) శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు) పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా) గురువు మే 1 వరకు మేషం (తృతీయం)లోను తదుపరి వృషభం (చతుర్థం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (జన్మం)లోను రాహువు మీనం (ద్వితీయం)లోను కేతువు (అష్టమం)లోను సంచరిస్తారు. రోజూవారీ కార్యక్రమాలలో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని వలన సహజంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి. కానీ భయభ్రాంతులను చేసే స్థాయి కాదు అని గమనించాలి. ప్రతిపనీ రెండవసారి, మూడవసారి ఓర్పుగా వెంబడిస్తే లాభిస్తుంది. ఇది మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. ప్రాకృత ధర్మంలో ఉన్న వారికి సమస్యలు రావు. వేరే మార్గంలో మీ ప్రవృత్తిని మార్పు చేసుకొనేవారు మాత్రమే ఇబ్బంది పొందుతారు. శని ఆలస్యం చేస్తాడు కానీ పనులు పాడు చేయడు. ఇది నిజం. ఉద్యోగ విషయాలలో భయపడవద్దు. మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకు ఇది మంచి కాలం కాదు. చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి. ఇబ్బంది ఉండదు. చేస్తున్నది మానేసి కొత్త ప్రయత్నం చేస్తే అది వికటిస్తుంది. చేస్తున్న పనిలో సరైన గుర్తింపు రాలేదని బాధపడవద్దు. స్థానచలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించుకోకపోతే మీకు సానుకూలత లేని ప్రదేశం చేరుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. తరచుగా శుభవార్తలు వింటుంటారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా ఇబ్బందులు రాగలవు. అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు, కోరికలు సరిగా పూర్తి అవకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు ఉంటాయి. మీ ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. మీ వాక్కులు బాగా కఠినంగా వస్తుంటాయి. నియంత్రించండి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృథాగా ఖర్చు చేసే సందర్భాలు ఎన్నోసార్లు వస్తుంటాయి. ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు. ఆదాయం అందుతుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఋణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు. మీరు ఆర్థిక విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. మీరు వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేరు. వాహన ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్య విషయంగా, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టే అవకాశాలు ఉన్నాయి. నరాలు, చర్మం, ఎముకలు, గుండెజబ్బులు వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. కొత్త సమస్యలు కూడా రాగలవు. ఈ రాశికి చెందిన స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. తద్వారా కుటుంబ విషయాలకు ఉద్యోగ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితిలో ఉంటారు. జాగ్రత్తపడండి. గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం. వైద్య సలహాలు చాలా బాగా అనుసరించవలసి ఉంటుది. షేర్ వ్యాపారులకు స్థిరబుద్ధి అవసరం. ఇతరులతో పోలిక, ఇతరుల సూచనలు తీసుకున్నా మీ బుద్ధినే వాడండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు మందగిస్తాయి. ఒకటి లేదా రెండు సార్లు కూడా వైఫల్యం రావచ్చును. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఎవరినీ నమ్మి ఏ పనులు చేయవద్దని సూచన. కార్య సాఫల్యం తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి బహు జాగ్రత్తలు అవసరం. స్వబుద్ధి వికాసం ఈ విషయంలో అవసరం. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. బుద్ధి స్థిరం కోల్పోవు అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రైతుల విషయంలో మే తరువాత గురువు అనుకూలమే కాబట్టి పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 వారు తొందరపాటు ధోరణితో చికాకులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపార, ఋణ వ్యవహారాలను ఓర్పుగా నిర్వహించండి. శతభిష నక్షత్రం వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడవలసిన కాలం. విద్యార్థులు మందగొడిగా అధ్యయనం సాగిస్తుంటారు. శుభకార్యాల పనులు వేగంగా సాగుతాయి. పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 వారు పరిధి దాటి ఋణాలు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయు స్థితి ఉంటుంది. తరచుగా సంఘంలో పెద్దలను కలుసుకుంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. శాంతి మార్గం: రోజూ ఆంజనేయుని దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. శని, గురువులకు జపం దానం చేయండి. గోపూజ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పనులు శరవేగంగా పూరవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నతాధికారులను సందర్శిస్తారు. బదిలీలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్త అవసరం. విష్ణు ఆరాధన మంచిది. 15వ తేదీ తరువాత అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్య రక్షణ మీద దృష్టి ఉంచుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మే: ఈనెల ప్రతి విషయం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం మంచిది. బంధువర్గంతో విభేదాలు. చివరి వారం మంచి వార్తలు వింటారు. మీ కృషికి తగిన గౌరవం లభించదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార పెట్టుబడులు, నూతన వాహనాల కొనుగోలుకు సమయం అనుకూలము కాదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, వ్యాపారులకు, విద్యార్థులకు చివరి వారం అనుకూలం. జూన్: ఈ నెల అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా చేయగలరు. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు సర్దుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారం అనుకూలిస్తుంది. ద్వితీయార్ధంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట సరిపడని పరిస్థితి ఉంటుంది. శతభిషా నక్షత్రం వారికి అవమానకర ఘటనలు ఎదురవుతాయి. షేర్, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు సమస్యలను అధిగమిస్తారు. జులై: ఈ నెల ప్రథమార్ధంలో ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఋణ సమస్యలు తగ్గుతాయి. ద్వితీయార్ధంలో నిందలపాలవుతారు. నవగ్రహ ఆరాధన మంచిది. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అధిక జాగ్రత్తలు పాటించాలి. రైతులు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. ఆగస్ట్: దాంపత్యంలో అన్యోన్యత తగ్గుతుంది. ఇంటా బయట చికాకులు. వ్యర్థ ప్రయాణాల వలన శారీరక శ్రమ, ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. నవగ్రహారాధన శుభప్రదం. వృత్తిలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఋణ, ఆరోగ్య, ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. వస్తువులు చౌర్యానికి గురవుతాయి. సెప్టెంబర్: ఈ నెల కొంత ఒదిగి ఉండటం మేలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఒక శుభం జరుగుతుంది. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. ఋణ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల వలన ఇబ్బంది ఉంటుంది. అక్టోబర్: పనులకు ఆటంకాలు వచ్చినా, వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై జాగ్రత్తలు అవసరం. శతభిషా నక్షత్రం వారు కొన్ని సందర్భాలలో తెలివిగా ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. ధనం సర్దుబాటు ఇబ్బందికరమైనా, ప్రతి పనికీ ధనం సాధించుకుంటారు. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులకు, రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నవంబర్: ఈ నెల అంతా అనుకూలమే. సమస్యలు తొలగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. శత్రుబాధలు తొలగుతాయి. అవసరానికి తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. దూరప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. డిసెంబర్: ఇంటా బయటా అన్నింటా కార్యజయం. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేష అధికారయోగం. ఆదాయం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. భూ– వస్తు– వాహన– ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనాలతో జాగ్రత్త అవసరం. ఆటోమొబైల్ రంగం వారికి చికాకులు వస్తుంటాయి. వ్యాపారాలు మందగమనమే అయినా, అనుకున్న లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటు విడనాడాలి. జనవరి: తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తిలో విశేష గౌరవం. ఆరోగ్యం అనుకూలం. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్త్ర– ఆభరణ– గృహలాభం ఉంది. కొత్త ప్రయోగాలు చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి ప్రయత్నాలను తెలివిగా సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: కుటుంబంలో అందరూ ఉన్నతస్థానంలో ఉంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. తరచు ప్రయాణాలవల్ల శారీరకశ్రమ. మోసపూరిత వాతావరణం ఉంటుంది. విష్ణు స్తోత్ర పారాయణ మంచిది. 19వ తేదీ నుంచి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తారు. పెద్దల ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు విశేష ఫలితాలు. విదేశీ ప్రయత్నాలకు సానుకూలం. మార్చి: శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం అభివృద్ధి చూసి ఆనందిస్తారు. వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది. శివారాధన మంగళప్రదం. -
ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి
మీన రాశి ఆదాయం–11 , వ్యయం–5 , రాజయోగం–2 , అవమానం–4 పూర్వాభాద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా) రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి) గురువు మే 1 వరకు మేషం (ద్వితీయం)లోను తదుపరి వృషభం (తృతీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (వ్యయం)లోను రాహువు మీనం (జన్మం)లోను కేతువు (సప్తమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతుంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడికను సరిచేసుకోండి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. జాగ్రత్తపడండి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతుష్టి ఉండవు. ప్రతిరోజూ చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్య కర్మలను వాయిదా వేయవద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మ రాహువు కూడా ఇబ్బందికరమే. ప్రతిపనీ శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకూ ప్రాధాన్యమివ్వ వద్దు. గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది. అయినా ఓర్పు వహించండి. ప్రమోషన్ అందడం కష్టసాధనం. మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైన స్థానానికి స్థానచలనం కలుగుతుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శించండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ మీకు మాట కలవదు. వీలయినంతవరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించండి. పిల్లల అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలు దాటగలరు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరుచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత ఋణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త ఋణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం. ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తుంటాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు సరిగా కావు. అందుకోసం చింతించనవసరం లేదు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులూ చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిరబుద్ధిని బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనులు మందగమనంగా ఉంటాయి. కిందస్థాయి వారితో వృత్తి నష్టాలు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచికాలం కాదు. రేవతి నక్షత్రం వారు గృహ, వ్యాపార నిర్వహణలలో పనివాళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శాంతి మార్గం: శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని, సాయం సమయంలో శివాలయంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఏప్రిల్: ఈ నెల ఆర్థిక సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఋణం చేయవలసి వస్తుంది. పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఉద్యోగంలో పైఅధికారులతో సమస్యలు వస్తాయి. మీ పనులలో ఇతరుల ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. శారీరక మానసిక ఒత్తిడి తప్పదు. మే: పనిలో నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకోలేరు. విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు రాబోవు సంవత్సర కాలం అధిక జాగ్రత్తలు అవసరం. జూన్: ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ అవసరం, అభిప్రాయ భేదాల వల్ల మనస్తాపం ప్రయాణాలవల్ల అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. షేర్, ఫైనాన్స్, వ్యాపారాలలో చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులకు, రైతులకు చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. జులై: కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. పట్టుదలతో పెద్దపనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. భూ–వాహన–స్థిరాస్తి లాభం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధనం సర్దుబాటు కాకున్నా, కొన్ని పనులు వేగంగా సాగుతాయి. 16వ తేదీ తరువాత సానుకూలం. మాసాంతంలో కార్య విజయం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం సామాన్యం. ఆగస్ట్: కాలం అనుకూలం. ఉద్యోగంలో శత్రు బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఋణ రోగ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలలో మొండి వైఖరితో సమస్యలు పెంచుకుంటారు. వృత్తి విషయాలలో కోపావేశములతో కొన్నిసార్లు ఇబ్బంది పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఈనెల గ్రహానుకూలత తక్కువ. ఎదుటివారి విషయాలకన్నా స్వవిషంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఉద్యోగ బదిలీలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. విద్యార్థులకు, రైతులకు కాలం సరిగా లేదు. అక్టోబర్: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో స్త్రీలకు ఆరోగ్య ఇబ్బందులు. కుజ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. రైతులకు, మార్కెటింగ్ వ్యాపారులకు అనుకూలం కాదు. ధనం వెసులుబాటు జరగదు. నవంబర్: ఇంటా బయటా మీమాటకు విలువ తగ్గును. ఏపనికైనా పలుమార్లు చెప్పవలసి వచ్చును. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యల పట్ల ఆందోళన చెందక నేర్పుతో వ్యవహరిస్తారు. పిల్లల నుంచి సహకారం తక్కువ. ఉద్యోగ కుటుంబ వ్యవహారాల నిర్వహణలో సరైన దృష్టి ఉంచలేరు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. డిసెంబర్: ఉద్యోగంలో పెనుమార్పులు మీకు అనుకూలిస్తాయి. ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. శివ దర్శనం శుభప్రదం. మీ ఆరోగ్యం అనుకూలమే కానీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరం. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు, షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వేగం అవుతాయి. జనవరి: వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకం. రాజకీయవేత్తలు ప్రజల మన్ననలు పొందుతారు. అధికారయోగం ఉంది. శత్రుబాధల నుంచి విముక్తి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో మీ స్థిరత్వానికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సహకారం తక్కువ. ఫిబ్రవరి: తీర్థయాత్రలు చేస్తారు. సత్సాంగత్యం వలన లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభకరం. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. ఋణాలు అవసరానికి అందుతాయి. పాత ఋణ సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. మార్చి: ఎన్ని సమస్యలు ఉన్నా, ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీల వల్ల అలసట, శారీరక శ్రమ ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులపై ఆధారపడవద్దు. మోసపూరిత పరిస్థితులు ఉంటాయి. -
ఈ కొత్త సంవత్సరం మేష రాశివారికి ఆర్థిక లాభాలు ఉంటాయి
మేష రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3. అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ) గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. గురుబలం క్రమేణా పెరుగుతున్న కారణంగా ద్వితీయార్ధంలో సత్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే మీకు అభివృద్ధి సాగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పదు. అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావలసిన వారు జాగ్రత్తగా ప్రయత్నించాలి. అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు తీరుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంగా అనుకూల వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజ్యులు, గురువులు, బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే సమయానికి, అవసరానికి తగిన ఆదాయం బాగా అందుతుంది. గతంలో వున్న ఋణ సమస్యలు తీరడానికి ఈ సంవత్సరం అంతా అనుకూలం. అవసరానికి కావలసిన కొత్త ఋణాలు కూడా బాగా అందుతాయి. ప్రతి వ్యవహారములను ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు వుంటాయి. ఆరోగ్య విషయంగా అనవసర అనుమానాలు వస్తుంటాయి. మీకు ఈ సంవత్సరం గ్రహచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు. పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. కళ్లు, నరాల సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా వున్నది. వృత్తి రీత్యా అభివృద్ధి ఉన్నది. కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం లాభదాయకమే అవుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే రాహువు వలన మధ్య మధ్య చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు. జాగ్రత్తగా వ్యవహరించిన వారికి అంతా శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అవుతుంది. అయినా పని విజయవంతం అవుతుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన. ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్న వారికి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ప్రణాళికలు రూపుదాల్చుకుంటాయి. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుంచి చాలా విశేష ఫలితాలు ఉంటాయి. మే వరకు సాధారణం. రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉన్నది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. అశ్వని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్నా, మానసిక ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు. భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ. కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు. ఆరోగ్యశ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రవర్తన ఇతరులకు, ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందుతారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం వారికి అద్భుతమైన కాలం. ఊహకు అందని అవకాశాలు వస్తుంటాయి. శుభ పుణ్యకార్యాల నిమిత్తం ప్రయాణాలు, ధనవ్యయం. శాంతి మార్గం: రాహు సంచారం అనుకూలం లేని కారణంగా ‘దుర్గా సప్తశ్లోకీ’ పారాయణ చేయండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. రాహు శాంతికి జప దానాలు చేయించడం శ్రేయస్కరం. ఏప్రిల్: మానసిక శారీరక శ్రమ వల్ల అశాంతి. ధైర్యంగా ఉంటారు. పుణ్యకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాల వల్ల చికాకులు. ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలకు వెళ్ళవద్దు. కుటుంబ వ్యవహారాలను గోప్యంగా ఉంచండి. షేర్ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ చికాకులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ కలిగినా, ఫలితం అందదు. చివరి వారంలో రవి కుజ ప్రతికూలం. ఆరోగ్యశ్రద్ధ వహించాలి. మే: ఆర్థిక లాభాలు ఉంటాయి. అహంభావం వల్ల ఇబ్బందులు. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. ఉద్యోగంలో విభేదాలు ఉన్నా, మాట నియంత్రణతో పనులు పూర్తిచేస్తారు. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. కోర్టు, స్థిరాస్తి కొనుగోలు విషయాలు వాయిదా వేయండి. జూన్: ఉద్యోగ, వ్యాపారాల్లో విశేష రాణింపు, ఆర్థిక– వస్తు– వాహన లాభాలు ఉంటాయి. స్థానచలనం అనుకూలత ఉన్నది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ వల్ల శుభం. 19వ తేదీ వరకు అశ్వనీ వారికి, 19వ తేదీ నుండి భరణీ నక్షత్రం వారికి కలహాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితాలు శూన్యం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన సత్ఫలితాలు ఉంటాయి. జులై: మొదటి రెండువారాల్లో మిశ్రమ ఫలితాలు. 3, 4 వారాల్లో రవి– కుజుల ప్రభావంతో కుటుంబంలో చికాకులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు, షేర్ వ్యాపారాలకు అనుకూలం. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: కుజ– బుధ– శుక్రుల అనుకూలత వలన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక లాభం, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, భూలాభం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నరదృష్టి పెరుగుతుంది. కాలభైరవాష్టక పారాయణ మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన– వస్తు– వాహన– గృహ లాభ సూచనలు ఉన్నాయి. శత్రు ఋణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రునికి జప దానాదులు చేయాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు ద్వితీయార్ధంలో తగ్గుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. స్నేహితులతో కలసి చేసే వ్యవహారాలు చిక్కులు సృష్టిస్తాయి. విద్యార్థులకు రైతులకు అనవసర వ్యవహారాలు ప్రాధాన్యం అందుకుంటాయి. అక్టోబర్: ఈనెల ప్రతికూలత ఎక్కువ. విమర్శలు ఎదురవుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. వచ్చే 6 నెలలు కుజ సంచారం ప్రతికూలం. ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రవి, శుక్రులకు దానం, కుజునకు విశేష శాంతి చేయాలి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. అయితే నష్టాలు ఉండవు. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి. నవంబర్: చతుర్థ– అష్టమాల్లో కుజ– రవుల సంచారంతో అధికశ్రమ, తక్కువ ప్రతిఫలం. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. రైతులకు మంచి సలహాలు అందుతాయి. భరణీ నక్షత్రం వారికి ఉద్యోగంలో అధికారులు ఒత్తిడి పెంచినా, మీ తెలివితో వారిని ఆకర్షిస్తారు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. డిసెంబర్: అనవసర విషయాల్లో జోక్యం వలన ఇబ్బందులు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి పనుల్లో ఆలస్యం. రవి, కుజ, శుక్రులకు శాంతి చేయాలి. వ్యాపారులకు బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా సాగవు. జనవరి: పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనలాభం, గృహ వాహన వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, భూ కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు మంచి లాభాలు. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, కోర్టు వ్యవహారాలకు అనుకూలం. ఫిబ్రవరి: పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగవ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం. శుక్ర, లక్ష్మీ ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులకు దూకుడు కూడదు. ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. గురువులు, శ్రేయోభిలాషులు సహకారం అందిస్తారు. మార్చి: శ్రమకు తగిన గుర్తింపు. స్థానచలనం అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దైవదర్శనం, తీర్థస్నానం, యథాశక్తి దానధర్మాలు చేయడం మంచిది. -
Ugadi Rasi Phalalu 2024 To 25: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు..
మేష రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3. అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ) గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. గురుబలం క్రమేణా పెరుగుతున్న కారణంగా ద్వితీయార్ధంలో సత్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే మీకు అభివృద్ధి సాగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పదు. అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావలసిన వారు జాగ్రత్తగా ప్రయత్నించాలి. అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు తీరుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంగా అనుకూల వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజ్యులు, గురువులు, బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే సమయానికి, అవసరానికి తగిన ఆదాయం బాగా అందుతుంది. గతంలో వున్న ఋణ సమస్యలు తీరడానికి ఈ సంవత్సరం అంతా అనుకూలం. అవసరానికి కావలసిన కొత్త ఋణాలు కూడా బాగా అందుతాయి. ప్రతి వ్యవహారములను ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు వుంటాయి. ఆరోగ్య విషయంగా అనవసర అనుమానాలు వస్తుంటాయి. మీకు ఈ సంవత్సరం గ్రహచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు. పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. కళ్లు, నరాల సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా వున్నది. వృత్తి రీత్యా అభివృద్ధి ఉన్నది. కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం లాభదాయకమే అవుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే రాహువు వలన మధ్య మధ్య చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు. జాగ్రత్తగా వ్యవహరించిన వారికి అంతా శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అవుతుంది. అయినా పని విజయవంతం అవుతుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన. ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్న వారికి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ప్రణాళికలు రూపుదాల్చుకుంటాయి. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుంచి చాలా విశేష ఫలితాలు ఉంటాయి. మే వరకు సాధారణం. రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉన్నది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. అశ్వని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్నా, మానసిక ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు. భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ. కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు. ఆరోగ్యశ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రవర్తన ఇతరులకు, ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందుతారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం వారికి అద్భుతమైన కాలం. ఊహకు అందని అవకాశాలు వస్తుంటాయి. శుభ పుణ్యకార్యాల నిమిత్తం ప్రయాణాలు, ధనవ్యయం. శాంతి మార్గం: రాహు సంచారం అనుకూలం లేని కారణంగా ‘దుర్గా సప్తశ్లోకీ’ పారాయణ చేయండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. రాహు శాంతికి జప దానాలు చేయించడం శ్రేయస్కరం. ఏప్రిల్: మానసిక శారీరక శ్రమ వల్ల అశాంతి. ధైర్యంగా ఉంటారు. పుణ్యకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాల వల్ల చికాకులు. ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలకు వెళ్ళవద్దు. కుటుంబ వ్యవహారాలను గోప్యంగా ఉంచండి. షేర్ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ చికాకులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ కలిగినా, ఫలితం అందదు. చివరి వారంలో రవి కుజ ప్రతికూలం. ఆరోగ్యశ్రద్ధ వహించాలి. మే: ఆర్థిక లాభాలు ఉంటాయి. అహంభావం వల్ల ఇబ్బందులు. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. ఉద్యోగంలో విభేదాలు ఉన్నా, మాట నియంత్రణతో పనులు పూర్తిచేస్తారు. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. కోర్టు, స్థిరాస్తి కొనుగోలు విషయాలు వాయిదా వేయండి. జూన్: ఉద్యోగ, వ్యాపారాల్లో విశేష రాణింపు, ఆర్థిక– వస్తు– వాహన లాభాలు ఉంటాయి. స్థానచలనం అనుకూలత ఉన్నది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ వల్ల శుభం. 19వ తేదీ వరకు అశ్వనీ వారికి, 19వ తేదీ నుండి భరణీ నక్షత్రం వారికి కలహాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితాలు శూన్యం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన సత్ఫలితాలు ఉంటాయి. జులై: మొదటి రెండువారాల్లో మిశ్రమ ఫలితాలు. 3, 4 వారాల్లో రవి– కుజుల ప్రభావంతో కుటుంబంలో చికాకులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు, షేర్ వ్యాపారాలకు అనుకూలం. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: కుజ– బుధ– శుక్రుల అనుకూలత వలన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక లాభం, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, భూలాభం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నరదృష్టి పెరుగుతుంది. కాలభైరవాష్టక పారాయణ మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన– వస్తు– వాహన– గృహ లాభ సూచనలు ఉన్నాయి. శత్రు ఋణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రునికి జప దానాదులు చేయాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు ద్వితీయార్ధంలో తగ్గుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. స్నేహితులతో కలసి చేసే వ్యవహారాలు చిక్కులు సృష్టిస్తాయి. విద్యార్థులకు రైతులకు అనవసర వ్యవహారాలు ప్రాధాన్యం అందుకుంటాయి. అక్టోబర్: ఈనెల ప్రతికూలత ఎక్కువ. విమర్శలు ఎదురవుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. వచ్చే 6 నెలలు కుజ సంచారం ప్రతికూలం. ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రవి, శుక్రులకు దానం, కుజునకు విశేష శాంతి చేయాలి.షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. అయితే నష్టాలు ఉండవు. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి. నవంబర్: చతుర్థ– అష్టమాల్లో కుజ– రవుల సంచారంతో అధికశ్రమ, తక్కువ ప్రతిఫలం. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. రైతులకు మంచి సలహాలు అందుతాయి. భరణీ నక్షత్రం వారికి ఉద్యోగంలో అధికారులు ఒత్తిడి పెంచినా, మీ తెలివితో వారిని ఆకర్షిస్తారు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. డిసెంబర్: అనవసర విషయాల్లో జోక్యం వలన ఇబ్బందులు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి పనుల్లో ఆలస్యం. రవి, కుజ, శుక్రులకు శాంతి చేయాలి. వ్యాపారులకు బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా సాగవు. జనవరి: పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనలాభం, గృహ వాహన వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, భూ కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు మంచి లాభాలు. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, కోర్టు వ్యవహారాలకు అనుకూలం. ఫిబ్రవరి: పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగవ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం. శుక్ర, లక్ష్మీ ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులకు దూకుడు కూడదు. ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. గురువులు, శ్రేయోభిలాషులు సహకారం అందిస్తారు. మార్చి: శ్రమకు తగిన గుర్తింపు. స్థానచలనం అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దైవదర్శనం, తీర్థస్నానం, యథాశక్తి దానధర్మాలు చేయడం మంచిది. వృషభ రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–7, అవమానం–3. కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో) గురువు మే 1 వరకు మేషం (వ్యయం)లోను తదుపరి వృషభం (జన్మం)లోను సంచరిస్తారు. శని కుంభం (దశమం)లోను రాహువు మీనం(లాభం)లోను కేతువు (పంచమం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో నూతనోత్సాహంతో పనులు చేస్తుంటారు. భోజనం, నిద్ర, వస్త్రధారణ వంటి నిత్యకృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు. అన్ని కార్యములలో ధనవ్యయం అధికమవడం, విఘ్నాలు రావడం జరిగినా, చివరకు కార్యవిజయం సాధిస్తారు. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, విఘ్నాలు ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమించగలుగుతారు. అధికారుల నుంచి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు. వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు స్పష్టిస్తాయి. తరచుగా బుద్ధి భ్రంశానిరి లోనయినా, మళ్లీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు. మంచికాలమే! కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యస్థితి బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరంగా చేయవలసిన శుభ, పుణ్యకార్యాలు అన్నీ జరుగుతుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతో కలసి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఉండవు. ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడటం మంచిది. మీరు అందరికీ బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది. అయినా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. మంచి కాలక్షేపం జరుగును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుంచి కాలం అనుకూలంగా ఉన్నది. ఇబ్బందికర ఘటనలు ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభమార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు అందుతాయి. కార్యవిజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉన్నది. మంచికాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి. అంతటా సహకరించేవారు ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ, మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితములే! జంతువులు, పక్షులు పెంచేవారికి లాభదాయకం. కృత్తిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసినా రావలసిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతుంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తుంటారు. వాహన చికాకులు తప్పవు. శాంతి మార్గం: తరచుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్ర పారాయణ చేయండి. గోపూజ, గురు జపం, దానం చేయించండి. ఏప్రిల్: తెలివిగా ఆర్థిక లావాదేవీలు సాగిస్తారు. సంకల్పించిన పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ జీవనం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చి, మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, నదీస్నానం చేస్తారు. ఆరోగ్య విషయంలో తెలివిగా ఉండి రక్షణ పొందుతారు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి కాలం. మే: కుజ– బుధ– శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలం. విందు వినోదాలు, విహారయాత్రలు ఉంటాయి. ద్వితీయార్ధంలో శారీరక అలసట, కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఉంటాయి. రవి, శివారాధన శుభప్రదం. మాసారంభం అనుకూలం. సమస్యలను తెలివిగా సాధించుకుంటారు. ఆరోగ్య, ఋణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మొదటి రెండు వారములు అనుకూలం. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. జూన్: వ్యయ కుజ, ద్వితీయ రవి సంచారం వలన తరచు సమస్యలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. 8వ తేదీ నుండి మృగశిర నక్షత్రం వారికి స్వల్ప ఆరోగ్య చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భక్తి, కాలక్షేపం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది. జులై: ప్రథమార్ధం మిశ్రమ ఫలితాలు. ద్వితీయార్ధంలో ఖర్చులు పెరుగును. మనోధైర్యంతో పనులు చక్కబెడతారు. పనిలో గుర్తింపు పొందుతారు. అధికారయోగం ఉంది. వివాదాలు సర్దుకుంటాయి. కుజస్తోత్ర పారాయణం చేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలను విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: కొంత ఒదిగి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల చురుకుదనం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. 2వ వారంలో శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నవగ్రహారాధన శుభప్రదం. 15వ తేదీ వరకు రోహిణీ నక్షత్రంతో కుజుడు జాగ్రత్తలు అవసరం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. సెప్టెంబర్: సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రవి– కుజ– శుక్రులకు శాంతి, శివకుటుం ఆరాధన శుభప్రదం. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అక్టోబర్: ఈ నెల అంతా శుభప్రదం. శత్రు, ఋణ బాధల నుంచి ఉపశమనం. ఉన్నతాధికారుల సందర్శన, స్థానచలనం, అధికారయోగం. రాజకీయ రంగంలో విశేష జనాకర్షణ. స్త్రీలతో స్వల్ప సమస్యలు ఉంటాయి. కుజ శాంతి, లక్ష్మీ–లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి అనుకూలం. రైతులకు, విద్యార్థులకు కూడా సానుకూలం. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలం. నవంబర్: ప్రయాణ లాభం. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కాలభైరవారాధన శుభప్రదం. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకుంటూ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. డిసెంబర్: మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఖర్చులు. గతంలో చేసిన అశ్రద్ధ వలన ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రుద్రాభిషేకం చేయుట మంచిది. ఉద్యోగంలో తోటివారి సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సత్ఫలితాలు. జనవరి: ప్రయాణమూలక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉమామహేశ్వర స్తోత్రపారాయణ మంచిది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం లాభాలు అధికం. షేర్ వ్యాపారులు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఫైనాన్స్ వ్యాపారులు మొండి బాకీలు వసూలులో జాగ్రత్తపడాలి. ఫిబ్రవరి: దైవానుగ్రహంతో సమస్యలు తీరుతాయి. పూర్వం నుంచి చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వృత్తిలో గుర్తింపు, విశేష కీర్తి కలుగుతాయి. అధికారయోగం. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన లాభం. ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. మార్చి: పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీలు అనుకూలం. ఋణ సమస్యలు తగ్గుతాయి. నూతన కనక–వస్తు–వాహన కొనుగోలు అనుకూలం. శుభకార్యాలు జరుగుతాయి. మిథున రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–3, అవమానం–6. మృగశిర 3,4 పాదములు (కా, కి) ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ) పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా) గురువు మే 1 వరకు మేషం (లాభం)లోను తదుపరి వృషభం (వ్యయం)లోను సంచరిస్తారు. శని కుంభం (భాగ్యం)లోను రాహువు మీనం (దశమం)లోను కేతువు (చతుర్థం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలిసీ తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరినీ నమ్మి, ఎవరి మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ పరిథిలో ఉన్న పనులు మాత్రమే చేయండి. వీలైనంత వరకు కొత్త వ్యవహారాలు చేపట్టవద్దు. మీకు కొన్ని సందర్భాలలో మంచి గురువులు మంచి సూచనలు చేస్తారు. ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు ఎప్పుడూ సహకరించనివారు కూడా ఈ సంవత్సరంలో సహకారం అందిస్తారు. కొన్ని సందర్భాలు విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అలాగే అధికారులతో కూడా జాగ్రత్తలు పాటించాలి. మితభాషణ చాలా అవసరం. తోటివారు కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. వర్కర్స్‌తో బహుజాగ్రత్తలు పాటించడం, వాక్కును నియంత్రించుకోవడం అవసరం. ఇంటిలో ఉండే పనివారితో కూడా జాగ్రత్తలు అవసరం. వ్యాపార విషయాలు అనుకూలమే. నూతన ప్రయత్నాలకు అనుకూలత తక్కువ. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని కోణాలలోనూ గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులు అందరితోనూ కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లల నడవడిక మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాల నిర్వహణ విషయంగా ధనవ్యయం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భములలో అధిక ధనలాభం చేకూరుతుంది. అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు సాగుతాయి. ఋణ విషయాలలో విచిత్ర స్థితి ఉంటుంది. కావలసిన కొత్త ఋణాలు ఆలస్యంగా అందుతాయి. భార్యాపిల్లలు తరచుగా ప్రయాణాలు చేయుట వలన ధనవ్యయం అధికం అవుతుంది. ఆరోగ్య విషయంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మంచి వైద్యం లభిస్తుంది. చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి. హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. కుటుంబ విషయాలు, సాంఘిక వ్యవహారాలను సమర్థంగా నడుపగలుగుతారు. అందరి నుంచి సహకారం ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయసంచారం దృష్ట్యా మే నుంచి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు కానీ, నష్టాలు మాత్రం ఉండవు. మంచికాలమే. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా వ్యాసంగంలో వారికి అనుకూలత తక్కువ. ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి కాలం అనుకూలం. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతుంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురువు వ్యయస్థితి సంచార ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాలి. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా, నష్టం మాత్రం ఉండదు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి అసహనం పెరుగుతుంది. గొప్ప కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నమ్మి పనులు తలపెట్టవద్దని ప్రత్యేక సూచన. మితభాషణ మీకు రక్షణ. ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. అవమానకర ఘటనలు, అధిక ధనవ్యయం చికాకు పెడతాయి. వాహన లాభం ఉంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా నష్టం జరుగుతుంది. ఋణ, ఆరోగ్య విషయాలు ద్వితీయార్ధంలో చికాకు కలిగిస్తాయి. శాంతి మార్గం: మే నెలలో గురుశాంతి చేయించండి. తెల్లజిల్లేడు, మారేడు, గరికలతో గణపతి అర్చన, ప్రాతఃకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజూ ‘గజేంద్ర మోక్షం’ పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్ష ధరించండి. ఏప్రిల్: ఈనెల శుభవార్తలు వింటారు. అన్ని రంగాలలో రాణిస్తారు. అధికారలాభం, అనుకూల స్థానచలనం. రాజకీయరంగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు, కార్యజయం కలుగుతాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులకు శ్రమ ఎక్కువైనా, లాభం ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యో గులు ఇబ్బంది పడతారు. స్వబుద్ధితో చేసే పనులన్నీ లాభిస్తాయి. రైతులకు చికాకులు ఉంటాయి. మే: అనుకున్న పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శత్రుబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. నిత్య శివదర్శనం, తీర్థస్నానాలు మంచివి. షేర్ వ్యాపారులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. విద్యార్థులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడతారు. జూన్: ప్రయాణాలవల్ల శారీరక అలసట. లాభాలు ఉన్నా, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన మంచిది. కోర్టు, ఋణ వ్యవహారాల్లో పరిష్కారమార్గం దొరుకుతుంది. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. జులై: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతాయి. నిత్యం శివ, సుబ్రహ్మణ్య ధ్యానం మంచిది. అధికారులు ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎప్పుడు ఆగ్రహిస్తారో తెలియని పరిస్థితి. స్థిరాస్తి కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. రైతులకు, విద్యార్థులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెలలో అన్నివిధాలా బాగుంటుంది. ఆర్థికపుష్టి కలుగును, శుభవార్తలు వింటారు. పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నెలాఖరున కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. 15వ తేదీ నుంచి మృగశిర నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి.కొత్త ఋణాలు సమయానికి అందుతాయి. పాతవి తీర్చగలుగుతారు. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంలో అనుకూలత ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల దర్శనం చేస్తారు. సెప్టెంబర్: కుటుంబ పరిస్థితులు అనుకూలం. వృత్తిలో ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. çసంతాన సౌఖ్యం, గృహ, వస్తు వాహన లాభం. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. రుద్రాభిషేకం, శివకుటుంబ ఆరాధన మంచిది. ఆర్ద్రా నక్షత్రం వారు కొంచెం ఇబ్బందికి గురవుతారు. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం అవుతుంది. విదేశీ, స్థిరాస్తి ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు ఉంటాయి.ముఖ్యమైన లావాదేవీలను గోప్యంగా ఉంచడం మంచిది. అక్టోబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉంది. బంధువర్గంతో సమస్యలు, పనుల్లో ఆలస్యం, శారీరక శ్రమ ఉంటాయి. తరచు వివాదాలు ఉండే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అభిషేకం, శ్రీరామరక్షాస్తోత్రం పారాయణ మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు, పనిముట్ల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాలక్షేపం ప్రమాదకరం కాగలదు. నవంబర్: కుటుంబ ఖర్చులు పెరిగినా, అవసరానికి తగ్గ ధనం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడతాయి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ మంచిది. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు కొంచెం అనుకూల స్థితి తక్కువ. డిసెంబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలం. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులను ఇతరుల సహాయంతో అధిగమిస్తారు. వ్యర్థ ప్రయాణాలు, వృథా ఖర్చులు, లాభాలు అంతంత మాత్రం. నవగ్రహ శాంతి చేసుకోవాలి. ఋణ బాధల వల్ల ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు చికాకులు. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత. జనవరి: ఉద్వేగపూరిత ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు. బంధువర్గం అనుకూలత, మిత్ర సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక చికాకులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులకు శ్రమ ఎక్కువ. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు శుభసూచకం. ఆర్ద్రా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు. ఫిబ్రవరి: కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పనికీ అధిక ప్రయత్నం అవసరం. విష్ణు ఆరాధన శుభప్రదం. ఆర్ద్రానక్షత్రం వారికి లాభదాయకం. «శ్రమ ఎక్కువైనా కార్య సాఫల్యావకాశాలు బాగున్నాయి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. మార్చి : ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పెను మార్పులు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కర్కాటక రాశి ఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6 పునర్వసు 4వ పాదము (హి) పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా) ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ) గురువు మే 1 వరకు మేషం (దశమం)లోను తదుపరి వృషభం (లాభం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (అష్టమం)లోను రాహువు మీనం (నవమం)లోను కేతువు (తృతీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సమయపాలనతో ఏ పనీ కూడా చేయరు. పుణ్యకార్యాలలో ఎక్కువ కాలక్షేపం జరుగుతుంది. అన్న, వస్త్ర, స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి వస్తుంది. కొన్ని పనులను దాటవేసే ఆలోచనలు చేస్తారు. కొన్ని పనులను ధైర్యంగా సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. తరచుగా ‘నరఘోష’కు గురి అవుతుంటారు. తద్వారా చికాకు పడతారు. అష్టమ శని వల్ల అన్ని రంగాలలోనూ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కలహాలు తలెత్తుతాయి. జాగ్రత్తపడండి. ఉద్యోగ విషయాలు చాలా శ్రమాధిక్యం అవుతుంటాయి. మీకు గురుబలం దృష్ట్యా అన్ని పనులు చేయడానికి తగిన ఆలోచనలు చేయగలిగినా, అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రమోషన్‌కు తగిన అర్హతలు ఉన్నప్పటికీ అడ్డంకులు చాలా ఉంటాయి. నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేవారు అధికంగా ఉంటారు. వ్యాపారులకు వ్యాపారం బాగానే ఉన్నా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందుతాయి. కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాలలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు మీ బంధువులు బాగా సహకారం చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుంది. తరచుగా ప్రయాణములు అధికంగా చేయడం తద్వారా ఆరోగ్య, ఆర్థిక చికాకులు పొందడం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే 1 నుంచి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఆదాయం బాగా ఉన్నా, ఖర్చులు మీ ఇష్టానుసారం ఉండవు. పాత ఋణాలు తీర్చడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కొత్త ఋణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. వాహనాల కొనుగోలు ఆలోచనలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా సమస్యలను దాటవేసే ప్రయత్నంలో సఫలం అవుతారు. కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందు జాగ్రత్తలతో దాటవేయగలరు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు. అలాగని బాధపడక ముందుకు సాగుతారు. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది. కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి. మానసిక ఆందోళన ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలమైన సమయం గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కానీ నష్టపడే కాలం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అవరోధాలు ఎక్కువ. విద్య నిమిత్తంగా వెళ్ళేవారు శ్రమతో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు చికాకులు చూపుతాయి. కలçహాలు కోర్టు విషయంగా పెరగగలవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం సర్దుబాటు ఉన్నా, వస్తు నిర్ణయం విషయంలో శ్రమ ఎక్కువ. విద్యార్థులు విద్యా విషయంగా బాగుంటుంది. ఇతర, అనవసర విషయాలు తరచుగా ఇబ్బంది కలిగిస్తాయి. రైతుల విషయంలో తెలివిగా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయినా కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారుతుంది. పునర్వసు నక్షత్రం 4 వారికి బంధు మిత్రులు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి, వృత్తికి సమతూకంగా కాలం కేటాయించలేక అసహనం చెందుతారు. స్వయంగా పర్యవేక్షించే పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి తరచు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలు, స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అధిక వ్యయంతో సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్లు అనుకూలం, కొన్నాళ్లు ప్రతికూలంగా సంవత్సరం అంతా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలలో నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలలో గౌరవభంగం జరగవచ్చు. శాంతి మార్గం: శని, రాహువులకు జపం, దానం చేయించండి. ఆంజనేయస్వామి దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి, తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. ఏప్రిల్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. నూతన వస్త్రధారణ, ఆభరణ– వాహనాల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో మౌనం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితం అందుకుంటారు. మే: వృత్తి వ్యాపారాలలో ఊహించని అనుకూలత. ఆర్థిక లాభాలున్నా, ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. అవరోధాలను అధిగమిస్తారు. ఋణాల విషయంలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. రైతులకు అనుకూలం. జూన్: స్థానమార్పులు ఉంటాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫైనాన్స్ షేర్ వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాలలో కిందిస్థాయి వారితో చికాకులు తప్పవు. అధికారుల అండదండలు ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలం. జులై: పనులు లాభదాయకంగా ఉంటాయి. ధనం నిల్వ చేయగలరు. ఊహించని ప్రయాణాల వల్ల ఇబ్బందులు. శుభవార్తలు వింటారు. భూ–గృహలాభం ఉంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. రైతులు, విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: ఈ నెల ఏ పని చేపట్టినా అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ విషయమై డబ్బు నీళ్ళలా ఖర్చవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత లోపిస్తుంది. 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆశ్లేషా నక్షత్రం వారికి కుటుంబ సభ్యులతో సయోధ్య కుదరని సందర్భాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు అనుకూలం. సెప్టెంబర్: మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులు రాబోవు ఆరు మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, ఆర్థిక, ఋణ వ్యవహారాలలో రాబోవు ఆరు మాసాలు ప్రతికూల స్థితి. శని కుజ గ్రహముల శాంతి చేయించండి. అక్టోబర్: పనుల్లో ఆలస్యం, శారీరక రుగ్మతల బాధ పెరుగుతాయి. మనోధైర్యం తగ్గుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మీకు లేదా మీ కుటుంబ పెద్దలకు వైద్యం అత్యావశ్యకం అవుతుంది. అతి శ్రమ చేస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులు తెలివి, ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు. నవంబర్: రానున్న 5 నెలలు అనేక సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేసుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇతరులపై ఆధారపడకుండా వ్యవహరించాలి. మనస్పర్ధలు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు ఆలస్యం కావడం వల్ల కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలతలు లేవు. షేర్ వ్యాపారులు నష్టపడకుండా బయటకు రావడం కష్టసాధ్యం. శుభకార్య ప్రయత్నాలు, అభివృద్ధి ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దని సూచన. డిసెంబర్: వృత్తిలో విశేష గుర్తింపు లభిస్తుంది. నిరాటంకంగా పనులు పూర్తవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉన్నతాధికారుల సందర్శనం, అనుకూల బదిలీలు ఉంటాయి. ఋణ సమస్యలు తగ్గుతాయి. దాంపత్యంలో ఇబ్బందులు, పిల్లల నుంచి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువ. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించుకోవాలి. స్థిరాస్తి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలలో వాయిదాలు శ్రేయస్కరం. జనవరి: శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల ప్రయాణాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థల వలన మనస్తాపం. బంధువర్గం సహకరిస్తారు. ఋణవిముక్తి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వసు నక్షత్రంవారికి కలహ, ఋణ, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండవచ్చు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, రైతులకు బాగా అనుకూలం. ఫిబ్రవరి: మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతాయి. పనులు ఆలస్యమైనా, సహనంతో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు ఆరాధన మంచిది. బంధు మిత్రులకు సేవ చేయవలసిన పరిస్థితి వలన మీ దైనందిన కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు ఫలితాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలకు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: కుటుంబ పెద్దలకు స్వల్ప ఆరోగ్య సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తిలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మందగమనం. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు. ∙∙ సింహ రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–2, అవమానం–2. మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే) పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ) ఉత్తర 1వ పాదము (టే) గురువు మే 1 వరకు మేషం (నవమం)లోను తదుపరి వృషభం (దశమం)లోను సంచరిస్తారు. శని కుంభం (సప్తమం)లోను రాహువు మీనం (అష్టమం)లోను కేతువు (ద్వితీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో సమయపాలన లేకపోవడం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా వెళతారు. అనవసర ఆలోచనలు, తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతాయి. మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే కాలం. ఇబ్బందులు పోగొట్టుకోవడం మీ ప్రయత్నాలలోనే ఉన్నది. వృథా కాలక్షేపాలు చేయవద్దు. సప్తమ శని వల్ల అన్ని పనులూ ఆలస్యం అవుతుంటాయి. అయితే స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదు. ఉద్యోగ విషయాలలో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరగగలదు. మే నుంచి సంవత్సరాంతం వరకు మీ తోటివారు, మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా కూడా సహకారం తగ్గగలదు. అందరితోనూ స్నేహభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతాయి. నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అదే రీతిగా నూతన ఉద్యోగ ప్రయత్లాలో కూడా సానుకూలత ఉంటుంది. అష్టమ రాహువు వలన మీరు అందరినీ అనుమానించడం, మీరు తరచుగా అవమానాలకు గురికావడం జరుగుతుంది. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు అలసత్వం ప్రదర్శిస్తారు. అది ఇబ్బందికరం అవుతుంది. మీకు, కుటుంబ సభ్యులకు మధ్య కార్య నిర్వహణ విషయంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. మనస్తాపం పెరుగుతుంది. బంధువులతో తరచుగా ఇబ్బంది ఉంటుంది. జ్ఞాతివైరం ఉన్నవారికి ఈ సంవత్సరం ఆ వైరం పెరగగలదు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఖర్చులను నియంత్రించలేని స్థితిలో ఉంటారు. ఋణ సౌకర్యం కూడా ఆలస్యంగా ఉంటుంది. పాత కొత్త ఋణాలు ప్రారంభంలో ఇబ్బందులు సృష్టించినా, క్రమంగా సానుకూలం అవుతుంటాయి. వృథాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. విద్యా విజ్ఞాన విహార యాత్రల విషయంగా ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. తీసుకుంటారు కూడా. చర్మవ్యాధులు, జీర్ణ సంబంధమైన ఇబ్బంది, రక్తపోటు ఉన్నవారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. గమనించండి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ అవుతుంటుంది. ఉద్యోగం, కుటుంబం విషయాలలో సమన్యాయంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఉండవు. ప్రతి పనీ ఆలస్యం అవుతుండటం వలన మీకు ఆగ్రహావేశాలు పెరుగుతుంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు చాలా అవసరం అనే చెప్పాలి. వైద్య సలహాలు జాగ్రత్తగా పాటించండి. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నెల తరువాత మీరు వేరే వారితో పోలిక లేకుండా ముందుకు సాగండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ఏ పనీ సవ్యంగా సాగదు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేయండి. కోర్టు వ్యవహారములలో ఉన్నవారికి చికాకులు పెరిగే అవకాశం ఉంటుంది. పనులు వ్యతిరేకం కాకుండా జాగ్రత్త తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి దారి తప్పించేవారు ఎక్కువ అవుతారు. అవకాశం ఉంటే కొనుగోలు వాయిదా వేయండి. విద్యార్థులకు మానసిక వ్యవస్థ విద్యా వ్యాసంగముల కంటే ఇతర అంశాల మీదకు ఎక్కువగా ప్రసరిస్తుంది. రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ఆశించిన ఫలితాలు అందవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. మఘ నక్షత్రం వారు పనులు వాయిదా వేయడం వలన సమస్యలు ఎదుర్కొంటారు. షేర్వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తించక గడ్డు పరిస్థితులు తెచ్చుకుంటారు. అవసరానికి తగిన ధనం సర్దుబాటు అవుతుంది. పుబ్బ నక్షత్రం వారు వృథా కాలక్షేపం చేస్తారు. విద్యా, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ధైర్యంగా అనేక విజయాలు సాధిస్తారు. బంధు మిత్రులు సహకరిస్తారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు పుణ్య, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. శాంతి మార్గం: శని, రాహు గ్రహశాంతి చాలా అవసరం. ప్రాతఃకాలంలో నిత్యం ఆంజనేయస్వామి వారి దేవాలయంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఈ నెల ప్రతివిషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇతరులపై పనిభారం మోపి, నిద్రావస్థలో ఉంటే నష్టపోతారు. అహంభావంతో ఇబ్బందుల్లో పడతారు. ఖర్చులు, ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు జాగ్రత్త కనబరచాలి. విద్యార్థు్థలకు, రైతులకు ఆశించిన ఫలితాలు అందవు. మే: ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు చూస్తారు. ఋణబాధల నుంచి విముక్తి. ఉన్నత పదవులు చేపడతారు. అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందం కలిగిస్తుంది. కుజశాంతి శుభప్రదం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం శూన్యం. రైతులకు అనుచిత సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు పనులు వాయిదా వేయడం శ్రేయస్కరం. జూన్: వృత్తిలో రాణిస్తారు. విశేష ధనలాభం. బదిలీలు అనుకూలం. రాజకీయ రంగంలో వారికి మంచి పదవులు దక్కుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నెలాఖరున ఒక శుభవార్త అనందం కలిగిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం కృషి చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు ఈ నెల రోజులు అనుకూలం. పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు. జులై: నేర్పుతో పనులన్నీ సునాయాసంగా పూర్తిచేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫైనాన్స్, వ్యాపారులు, షేర్ వ్యాపారులకు 16వ తేదీ తరువాత చికాకులు ఉంటాయి. ఆగస్ట్: పనిఒత్తిడి పెరిగినా, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఖర్చులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. 18వ తేదీ నుంచి మఘ నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు రాగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. రైతులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది.13వ తేదీ వరకు పుబ్బ నక్షత్రంవారికి పనులు ఇబ్బందికరం కాగలవు. షేర్ వ్యాపారులు మంచి తెలివి, ధైర్యం ప్రదర్శించి కాలం అనుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సకాలానికి ఋణాలు అందుతాయి. అక్టోబర్: ఉన్నతాధికారులను సందర్శిస్తారు. విశిష్ట బాధ్యతలు చేపడతారు. శత్రుబాధల నుంచి విముక్తి. ఈనెల నుంచి ఊహించని ఖర్చులు, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, దాంపత్యసౌఖ్యం లోపించడం జరుగుతాయి. కుజశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. çసంతానం రాణింపు ఆనందం కలిగిస్తుంది. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు ఆలస్యం అవుతుంటాయి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. డిసెంబర్: ఈ నెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నది. మీ తప్పు లేకున్నా నిందలు పడవలసి వస్తుంది. స్త్రీ విరోధం, దాంపత్య విభేదాలు కలుగుతాయి. మౌనం మంచిది. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. షేర్ వ్యాపారులు ఇబ్బందికి గురవుతారు. కోర్టులు, స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. జనవరి: ఇతరుల విషయాలలో జోక్యం లేకుండా, మీ పనులలో శ్రద్ధవహిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారు. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటుతనం తగ్గించాలి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఫిబ్రవరి: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. అకాల భోజనం, వ్యర్థ ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు. వృత్తిలో ఊహించని మార్పులు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పుబ్బ నక్షత్రం వారు విశేష లాభాలు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులు, రైతులు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు. పనులు నత్తనడకన సాగుతాయి. స్థిరాస్తుల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కన్యా రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–5, అవమానం–2. ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ) హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా) చిత్త 1,2 పాదములు (పే, పో) గురువు మే 1 వరకు మేషం (అష్టమం)లోను తదుపరి వృషభం (నవమం)లోను సంచరిస్తారు. శని కుంభం (షష్ఠ)లోను రాహువు మీనం (సప్తమం)లోను కేతువు (జన్మ)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చురుకుగా పాల్గొంటారు. నిద్ర, భోజనం వంటివి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెడతారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తుంటారు. తరచుగా శుభ కార్యాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తుంటారు. మే తరువాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే. ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుంచి ఫలితాలు బాగుంటాయి. అయితే మే తరువాత ఇంకా అనుకూలం. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు లాభిస్తాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలము. అధికారుల సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ భయపడటం లేదా చికాకుపడటం వంటివి జరుగుతుంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్యవృద్ధి బాగా ఉండటం ఆనందానికి కారణం అవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల సహకారం బాగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను మే నుంచి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడంలో, అవసరానికి కావలసిన కొత్త ఋణాలు పొందడంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి. తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు చేతులు వాటి వేళ్ళు అనేక సందర్భా లలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుంచి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. మానసిక అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు ఉంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శనిబలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోనవ్వద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతాయి. లాభదాయకంగా కాలం గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే దగ్గర నుంచి గురుబలం బాగుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవ్వద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమవుతారు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యా, వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు వింటారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం 1, 2 వారికి రోజువారీ భోజనాది విషయాలలోనూ అనుకూలత తక్కువ. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు. శాంతి మార్గం: రాహు కేతువులకు జప దానాలు అవసరం. ప్రతిరోజూ గణపతిని, దుర్గను అర్చించిన తరువాత మిగిలిన పనులు చేయండి. ‘దుర్గాసప్తశ్లోకి’ స్తోత్రం రోజూ 11సార్లు పారాయణ చేయాలి. ఏప్రిల్: ఈనెల ప్రతికూల ఫలితాలు ఎక్కువ. శ్రమకు తగిన లాభం లేకపోవటం, ఖర్చులు పెరగటం జరుగుతాయి. వృత్తిలో మాటపడవలసి వస్తుంది. కుజ శాంతి, నవగ్రహారాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు ఆందోళనకర ఘటనలు ఎదుర్కొంటారు. మే: ఈ నెల కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లోపించటం, పని ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. రాబోవు మూడు మాసాలలో ఆరోగ్య ఋణ విషయాలలో శ్రద్ధ అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు పెరిగే కాలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి విషయాలు లాభదాయకం. జూన్: ఉద్యోగంలో రాణిస్తారు. అనుకూలంగా స్థానచలనం, అభివృద్ధి జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఋణ సమస్యలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి. గురువులను దర్శించుకుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఒత్తిడి తప్పదు. జులై: ఈనెల అంతా అనుకూలమే. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు, ప్రశంసలు లభిస్తాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది. 16వ తేదీ తరువాత పాత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. ఆగస్ట్: శ్రమతో కార్యజయం. నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. స్థానచలన సూచనలు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 18వ తేదీ తరువాత జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. సెప్టెంబర్: పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్ర సహకారం లభిస్తుంది. నిత్యం ధ్యానం చేయుట మంచిది. 13వ తేదీ నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి. చిత్త నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమైంది. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. అక్టోబర్: వ్యాపారంలో పెను మార్పులు, ఊహించని లాభాలు. రానున్న 6 నెలలు అత్యంత అనుకూలం. సమస్యలు, శత్రు బాధలను సునాయాసంగా అధిగమిస్తారు. వేగంగా పనులు పూర్తి చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ప్రయాణ సౌఖ్యం, సాంఘిక గౌరవం. నవంబర్: ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ నేతలకు ఉన్నత పదవులు లభిస్తాయి. శత్రుబాధలు తొలగుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలం. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: కుటుంబ ఒత్తిడి వలన కొన్ని చికాకులు ఉంటాయి. సంతానం విద్యలో రాణించటం వలన ఆనందం కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అనుకున్న దాని కంటే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఉంటుంది. షేర్ వ్యాపారులు మంచి ఆదాయం పొందుతారు. జనవరి: ఈ నెల ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, శత్రుబాధలు, పని ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఆర్ధిక బలం పెరుగుతుంది. çఉత్తర నక్షత్రం వారికి మానసిక కష్టాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు కూడా అనుకూలమే. ఫిబ్రవరి: గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహిం చని విధంగా అందరి సహకారం లభిస్తుంది. ప్రతిభకు తగిన గౌరవమర్యాదలు ఉంటాయి. ఆర్ధిక స్థిరత్వం, ఋణ రోగ శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతాయి. దాంపత్య జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండును. చిత్త నక్షత్రం వారికి కార్యలాభం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలం. రైతులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం.ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. మార్చి: ఈ నెల ప్రతికూలత ఎక్కువ. వ్యర్థ ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహారాధన చేయుట శుభకరం. తులా రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–1, అవమానం–5. చిత్త 3,4 పాదములు (రా, రి) స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే) గురువు మే 1 వరకు మేషం (సప్తమ)లోను తదుపరి వృషభం (అష్టమం)లోను సంచరిస్తారు. శని కుంభం (పంచమం)లోను రాహువు మీనం (షష్ఠం)లోను కేతువు (వ్యయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాకాలం తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభం అయింది. పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. సమయం వృథా చేయవద్దని సూచన. ప్రతి కార్యంలోనూ మీకు ఎన్నో విఘ్నములు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా వ్యవహరిస్తే, మీకు విజయం దక్కుతుంది. గురువు సంచారం మే వరకు అనుకూలం. రాహు ప్రభావంగా అన్ని విషయాలలోను చాలా ధైర్యంగా కాలక్షేపం చేస్తారు. ఇది ప్రత్యేక వరము అనే చెప్పాలి. ఉద్యోగ విషయాలలో అధికమైన పరిశ్రమ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం, సహకారం చాలా అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది. శ్రమకొద్దీ లాభం అందుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు, అవరోధాలు రాగలవు. జాగ్రత్తపడండి. కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ అవుతుంది. జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉన్నట్లయితే, అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత ఋణాలు, కొత్త ఋణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తాయి. తరచుగా శుభ కార్యాలలో పాల్గొనడానికి, అలంకరణ వస్తువులు కొనుగోలుకు ఖర్చు బాగా పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వలన అమితోత్సాహంగా ఉంటారు. ఆరోగ్యవిషయంగా బహు శ్రద్ధ, జాగ్రత్తలు పాటిస్తారు. తద్వారా ఇబ్బంది లేని విధంగా జీవనం చేస్తారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్య సదుపాయం చేకూరుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలం అవుతుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై సుఖజీవనం సాగుతుంది. చాలా ప్రశాంత జీవనం చేస్తారు. షేర్ వ్యాపారులకు గురుబలం, రాహు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. సుఖంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి లాభదాయక కాలము. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అయినా, పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుంది. ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ. మంచి సలహాలు అందుతాయి. లాభాలు బాగా అందుతాయి. చిత్త నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుతారు. స్వాతి నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు అనుకోని లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 వారికి సకాలంలో ఋణ సౌకర్యం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు చేపడతారు. యోగ్యమైన జీవనం సాగిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. శాంతి మార్గం: తెలుపురంగు పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి మూడు మాసములకు ఒకసారి నవగ్రహ హోమం చేయండి. రోజూ భువనేశ్వరీ సహస్రనామ పారాయణ చేయండి. ఏప్రిల్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వ్యాపారలాభం, ప్రయాణ లాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. భూ– ఆభరణ కొనుగోలు చేస్తారు. షేర్ వ్యాపారులు మంచి నిర్ణయాలతో లాభిస్తారు. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అధికారుల తోడ్పాటు బాగుంటుంది. విద్యార్థులకు అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. గురువులను పూజ్యులను దర్శిస్తారు. శుభకార్య, సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మే: ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో జాగరూకతతో ఉండాలి. అధికారయోగం ఉంది. స్త్రీలతో వివాదాలు వద్దు. చేయవలసిన పనులు వదిలి అనవసరమైనవి చేస్తుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత తక్కువ. జూన్: వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాలలో మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి పనులు కొంత ఆలస్యమవుతాయి. స్వాతీ నక్షత్రం వారికి తరచు ఆరోగ్య సమస్యలు, కలహాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు, షేర్ వ్యాపారులకు మంచి సూచనలు అందవు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జులై: ఉద్యోగ వ్యాపారాలలో విశేష గౌరవం, లాభాలు ఉంటాయి. అధికారయోగం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. 3వ వారం నుంచి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. అన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రోజువారీ కార్యములు అస్తవ్యస్తంగా ఉంటాయి. స్వాతీ నక్షత్రం వారు కలహాలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: వృత్తిలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాహన కొనుగోలుకు అనుకూలం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కొత్త పరిచయాలు, ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. సెప్టెంబర్: దైవదర్శనం చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్రాభరణ లాభం ఉంది. చిత్త నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం సరిగా ఉండదు. ఖర్చులు, ఋణాలలో యిబ్బందులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కాలం ప్రతికూలం. విదేశీ ప్రయత్నాలలో అవరో«ధాలు ఎక్కువ. అక్టోబర్: మీ పనితీరులో మార్పులు చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకూల బదిలీలు ఉంటాయి. కుటుంబాభివృద్ధి, శుభకార్యాలు జరుగుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు మంచికాలం. నవంబర్: ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు. అధికార యోగం ఉంది. బదిలీలు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలు కారణంగా ఖర్చు పెరుగుతుంది. షేర్ వ్యాపారులకు అధిక లాభములు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కాలం పరిపూర్ణంగా అనుకూలం. డిసెంబర్: ఈ నెల అత్యంత అనుకూలం. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలం. స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జనవరి: ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బందులు. భూ– గృహ– వాహన కొనుగోలుకు అనుకూలం. అధికారుల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటారు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడండి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: ఈనెల అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ జాప్యం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు మీతో సన్నిహితంగా ఉన్నా, మీ జాగ్రత్తలో మీరుండాలి.పెట్టు బడులు ఆశించిన లాభాన్ని ఇవ్వవు. ఇతరుల విషయాలలో జోక్యం వలన ప్రతికూలత పెరుగుతుంది. నవగ్రహ ఆరాధన మంచిది. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతుంటాయి. విద్యార్థులు విద్యా వ్యాసంగానికి దూరం అవుతారు. సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలం. రైతులకు శ్రమాధిక్యం. ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. మార్చి: కార్యజయం. ఆరోగ్య, ఋణ సమస్యలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. రాజకీయరంగంలో అనుకూలత పెరుగుతుంది. స్త్రీవిరోధం వద్దు. లక్ష్మీస్తోత్ర పారాయణ మంచిది. వృశ్చిక రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–5. విశాఖ 4 వ పాదము (తొ) అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ) గురువు మే 1 వరకు మేషం (షష్ఠం)లోను తదుపరి వృషభం (సప్తమం)లోను సంచరిస్తారు. శని కుంభం (చతుర్థం)లోను రాహువు మీనం (పంచమం)లోను కేతువు (లాభం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సమయపాలన సరిగా ఉండదు. పైన చెప్పిన నాలుగు గ్రహాల సంచారం సరిగాలేదు. అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండటం వల్ల మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలరు. పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం, లేదా మీరే వాటిని ఎక్కడైనా మరచిపోవడం జరుగుతుంది. అప్రయత్నంగా శుభకార్యాలలో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి ఉంటాయి. ఉద్యోగ విషయాలలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంటుంది. మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానచలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు. అయితే విచిత్రం ఏమిటంటే వృత్తి రీత్యా ఈ సంవత్సరం మే నుంచి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టం ఉండదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకొని, ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీస్తాయి. అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయితో ఉంటాయి. అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు. తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినా, డబ్బు లేదని ఏ పనీ ఆగదు. గతం కంటే రాబడి తగ్గుతుంది. కానీ ఇబ్బంది కాదు. అనవసర ఖర్చులను నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులూ, పూజ్యుల రాకపోకలు దృష్ట్యా ధనవ్యయం అవుతుంది. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి. పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ప్రతి పనీ మీరే స్వయంగా చూసుకోండి. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తున్నది అనే చెప్పాలి. దూకుడువద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అందవు. నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు. పనులు ఆలస్యమవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. శాంతి మార్గం: శని, గురు, రాహువులకు శాంతి చేయించండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ ధ్యానం చేయండి. రోజూ గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. ఏప్రిల్: ఉద్యోగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. సంతానంతో అభిప్రాయ భేదాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలం. తరచు శుభవార్తలు వింటారు. మే: ఈనెల ప్రతికూలత ఎక్కువ. నిందలు పడవలసి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. నవగ్రహ శాంతి మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు అనుకూలం విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. స్థిరాస్తి, కోర్టు విషయాలు బాగా అనుకూలం. జూన్: తెలియని ఆందోళన ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది. ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి అందరి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు అనుకూలం. జులై: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నత అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు విజయవంతం అవుతాయి. మొదటి రెండు వారాలలో మంచి ఫలితాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువ. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఉద్యోగంలో మార్పులు. ఉన్నత పదవులు చేపడతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య, ఋణ సమస్యలు పెరుగుతాయి. కుజ శాంతి చేయాలి. సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. రైతులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సెప్టెంబర్: రాజకీయవేత్తలకు అనుకూలం. ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపారలబ్ధి. బదిలీలు అనుకూలం. ప్రయాణ లాభం. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. శుభపరిణామాలు కనిపిస్తాయి. కుజశాంతి మంచిది. రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి. విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు. అక్టోబర్: ఈనెల అనుకూలత తక్కువ. శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు ఉంటాయి. అవసరాలకు తగిన ఆదాయం అందదు. వృత్తి ఉద్యోగాల్లోను, ఆరోగ్యంపైన జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నవంబర్: ఈనెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. వ్యాపారం మందగిస్తుంది. కొత్త పనులు ఆలస్యమవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. నిరుత్సాçహానికి లోనవుతారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. డిసెంబర్: కుటుంబ, ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. స్థానచలనానికి ప్రయత్నిస్తారు. పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఋణ సమస్యలు పెరుగుతాయి. విష్ణు ఆరా ధన శ్రేయస్కరం. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. జనవరి: ఎప్పటి నుంచో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి. బదిలీలు అనుకూలం. భోజన సౌఖ్యం. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన మంచిది. అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. షేర్ వ్యాపారులు సరిగా వ్యాపారం చేయలేరు. ప్రతి విషయంలోనూ గోప్యత పాటించడం మంచిది. విద్యార్థులు, రైతులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఫిబ్రవరి: రవి–కుజ–బుధుల సంచారం ప్రతికూలముగా ఉన్నది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆలస్యం, కుటుంబ ఖర్చులు పెరగటం, శారీరక శ్రమ అధికమవడం జరుగుతాయి. పెద్దల, గురువుల సహకారంతో పనులు పూరవుతాయి. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. నవగ్రహారాధన చేయడం మంచిది. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ ఇతరుల సలహాలు స్వీకరింపవద్దు. ప్రతి పనీ స్వయంగా చూసుకోవాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. పెద్దలకు, పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలుంటాయి. మార్చి: ఈనెల గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఇతరులతో కొంత మితంగా వ్యవహరించుట మంచిది. వ్యర్థప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పనులు ఆలస్యమవుతాయి. ఉద్యోగంలో తోటివారితోను, అధికారులతోను విభేదాలు పెరుగును. పెద్దల సహాయం లభిస్తుంది. దైవారాధన మానవద్దు. ధనూ రాశి ఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–5 మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ) పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా) ఉత్తరాషాఢ 1వ పాదము (బే) గురువు మే 1 వరకు మేషం (పంచమం)లోను తదుపరి వృషభం (షష్ఠం)లోను సంచరిస్తారు. శని కుంభం (తృతీయం)లోను రాహువు మీనం (చతుర్థం)లోను కేతువు (దశమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడతారు. అన్ని విషయాలలోనూ స్వతంత్ర నిర్ణయాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సందర్భాలలో మీకు శుభవార్తలు అందుతాయి. మీ వ్యవహారాలలో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహార యాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకులు సృష్టించి, తద్వారా విభేదాలు తీసుకురాగలదు. వాగ్ధోరణిని నియంత్రించండి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి కానీ, అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలాగా చేస్తుంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శించకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం లేదా అనుకూల స్థలం చేరుకోగలరు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలం అవుతుంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది. కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పెడతాయి. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడకు అయినా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తుంది. తరచుగా శుభకార్య, పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనవ్యయం బాగా అధికం అవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురౌతాయి. మీ అందరితోనూ మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి చెంది స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఉంటాయి. అయితే ఇబ్బందికర ఘటనలు ఉండవు. కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తరువాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగున్నా, తగిన లాభాలు అందని పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా, సానుకూలం అవుతుంటాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి మే నెల నుంచి ధనవ్యయం అధికం అవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి కావలసిన వనరులు తేలికగా లభ్యం అవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి ఫలితాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు శ్రీరామరక్ష. మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి. అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ, ఆర్థిక, వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు. తరచు విహార యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నియమబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. అభివృద్ధి ఉన్నా, తగిన ఫలితాలు రావు. కుటుంబంలో సానుకూలత సాధిస్తారు. శాంతి మార్గం: సంవత్సర ఆరంభంలో రాహువుకు, మే నెలలో గురువుకు జపం చేయించండి. ప్రాతఃకాలంలో రోజూ తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పని మీద దృష్టి పెట్టలేరు. ఇతర కార్యకలాపాలపై ఆసక్తి వలన ఇబ్బందులు కలుగుతాయి. అశ్రద్ధ, అకాలభోజనం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహస్తోత్రం పఠించాలి. ఉద్యోగ వ్యాపారాలలో కోరిన విధంగా ముందుకు వెడతారు. కుటుంబ సమస్యలకు, ఋణ సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు మంచి పరిష్కారాలు పొందుతారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. మే: నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం గతంలోకన్నా లాభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. దుర్జన సాంగత్యం వలన ఊహించని సమస్యలు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ వ్యాపారుల ప్రణాళికలు సరిగా సాగవు. రైతులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. జూన్: తరచు ఊహించని ప్రయాణాలు. దాంపత్య జీవితంలో మనస్పర్థలు కలుగుతాయి. పనిఒత్తిడి వలన ఇంటి పనులు నిర్వహించలేరు. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. శివకుటుంబ ఆరాధన మంచిది. మూలనక్షత్రం వారు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయరాదు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు విచిత్ర సమస్యలు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. జులై: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారంలో విభేదాలు, శత్రుబాధలు తొలగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం. భూమి కొనుగోలు చేస్తారు. శివ–విష్ణు స్తోత్ర పారాయణ మేలు. క్రమంగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్ వ్యాపారులకు అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థులకు రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెల అనుకూలత తక్కువ. చెప్పుకోలేని సమస్యలు. వృథా కాలక్షేపం వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శాంతి చేయడం మేలు. పుణ్యకార్య శుభకార్య, కుటుంబ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఆర్థిక వెసులుబాటు తక్కువ. వస్తువులు చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. షేర్ వ్యాపారులకు దూకుడు తగదు. రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. అధికార యోగం. ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపార లబ్ధి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం లభింస్తుంది. రాబోవు ఆరుమాసాలు ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులకు, రైతులకు కూడా ఇబ్బందికరమైన కాలమే. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం కాదు. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి. రాజకీయవేత్తలు ఉన్నత పదవులు చేపడతారు. ఇప్పటి నుంచి 6 నెలలు పనులలో జాప్యం, తరచు ఆరోగ్య సమస్యలు, ఇతరులతో వివాదాలు ఉంటాయి. కుజ, సుబ్రహ్మణ్య శాంతి చేయాలి. వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ఓర్పుగా వ్యవహరించాల్సిన కాలం. నవంబర్: స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టంలేని బదిలీలు, ప్రయాణాలు వలన శ్రమాధిక్యం, అకాల భోజనం, పనుల్లో జాప్యం జరుగుతాయి. ఋణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించడం మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. డిసెంబర్: పనులన్నీ నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ప్రయాణాల వలన ఇబ్బందులు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. శివ–విష్ణు ఆరాధన శుభప్రదం. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. తెలివి ఉన్నా, ధైర్యం చేయలేక చాలా పనులు ఆపివేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. జనవరి: ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తారు. పనుల నిమిత్తం ఎక్కువగా తిరగవలసి రావటం, శ్రమాధిక్యం ఉంటాయి. కార్యజయం ఉన్నది. విష్ణుస్తోత్ర పారాయణ శ్రేయస్కరం. ఆదాయ వ్యయాల సమతుల్యత సాధించలేరు. దైనందిన జీవనం సరిగా సాగదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు అతి శ్రమ, స్వల్ప ఫలితం ఉంటాయి. ఫిబ్రవరి: నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి కోర్టు విషయాలు సర్దుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విష్ణు–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. çఅభివృద్ధి కోసం చేసే ప్రతి పనీ ఇబ్బందికరం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మార్చి: విశేష వ్యాపారలబ్ధి ఉంటుంది. పనులన్నీ నేర్పుతో పూర్తి చేస్తారు. వ్యాపార నిమిత్త ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నవగ్రహారాధన చేయుట మంచిది. మకర రాశి ఆదాయం–14 , వ్యయం–14 , రాజయోగం–3 , అవమానం–1 . ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ) శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ) ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి) గురువు మే 1 వరకు మేషం (చతుర్థం)లోను తదుపరి వృషభం (పంచమం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (ద్వితీయం)లోను రాహువు మీనం (తృతీయం)లోను కేతువు (భాగ్యం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎక్కడా ఆటంకాలు ఉండవు. సమయపాలన బాగా చేస్తుంటారు. ఏలినాటి శని చివరి సమయంలో ఉన్నది. గురుబలం అనుకూలత దృష్ట్యా అంతా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగ మీరు సహవాసాలు నడుపుకోండి. తరచుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. స్వబుద్ధితో చేసే కార్యములు అన్నీ విజయమే అందిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ విషయాలలో అధికంగా తిరగవలసి ఉంటుంది. మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా ఈ తిరుగుడు ఉంటుంది. అయితే అది లాభదాయకమే. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే నెల తరువాత చాలా సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు. వ్యాపారులు స్వబుద్ధి, స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే నెల నుంచి అంతా శుభపరిణామాలే ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసు కోవడం జరుగుతుంది. అయితే క్రమేణా గురుబలం వలన అవి సమసి పోతాయి. పిల్లల విషయంలో మీ అంచనాలు చక్కటి ప్రతిఫలం చూపుతాయి. మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలం అవుతాయి. అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు పూర్తవుతాయి. పాత ఋణాలు తీర్చే విషయంలోను, అవసరమైన కొత్త ఋణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు వింటారు. గురువులను పూజ్యులను కలుస్తారు. విద్యార్జనపై ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదేని పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది. బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు రాకుండా కాలక్షేపం చేస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటుంది. ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయం అందుకుంటారు. అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై అంతా శుభపరిణామాలే గోచరిస్తున్నాయి. చక్కటి ఆరోగ్యస్థితి ఉంటుంది. షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం. ఎటువంటి చాంచల్యమూ లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి కాలం కలసి వస్తుంది. విద్యా విషయంగా వెళ్ళేవారికి లాభం ఎక్కువ. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు ఆలస్యం. శ్రమాధిక్యతతో లాభాన్నిస్తాయి. విజయం తథ్యము. స్థిరాస్తి కోనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు అందుకుంటారు. రైతుల విషయంలో అంతా శుభప్రదమే. మంచి సూచనలు, సలహాలు అందుకుని లాభం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3,4 వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితానికి పొంతనలేని స్థితి ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేక ఇబ్బంది పడతారు. అవసరానికి కావలసిన ధనం సర్దుబాటు కాక పనులు వాయిదా వేయవలసిన స్థితి ఉంటుంది. శ్రవణం నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుత ఫలితాలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రించడంలో విఫలం అవుతారు. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలవారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ వాయిదా వేసే లక్షణాలు ప్రదర్శిస్తారు. అనవసర విషయాలలో చర్చలు భయం, అవమానం కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. శాంతి మార్గం: అమ్మవారి అర్చన చేయండి. రోజూ సుబ్రహ్మణ్య, దుర్గాపూజలు చేస్తుండండి. ‘శ్రీమాత్రే నమః’ నామంతో ధ్యానం చేయడం, సుందరకాండ శ్రవణం చేయడం మంచిది. శని జపం చేయించండి. ఏప్రిల్: ఈనెల అన్ని రంగాలవారికీ కాలం కలసి వస్తుంది. 3వ వారంలో కొన్ని సమస్యలు ఎదురైనా, మనోధైర్యంతో ఎదుర్కొంటారు. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో కొంత అలజడి ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. షేర్ వ్యాపారులు లాభపడతారు. విదేశీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. స్థిరాస్తి ప్రయత్నాలలో కాలం అనుకూలం. మే: ఈ నెల పనులు సానుకూలంగా సాగుతాయి. ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడతాయి. విలాస జీవితం గడుపుతారు. కుటుంబంలో స్వల్ప మనస్పర్థలు ఏర్పడతాయి. శివ–విష్ణు స్తోత్రపారాయణ శుభప్రదం. విదేశీ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పథకాల రూపకల్పనకు, స్థిరాస్తి కొనుగోలుకు మంచి కాలం. పెద్దవారి ఆరోగ్యం బాగుండటం, పిల్లల అభివృద్ధి వలన సుఖపడతారు. జూన్: ఈ నెల అత్యంత అనుకూలం. అన్ని రంగాలవారు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. మొండి బాకీల వసూలవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జులై: ఈనెల గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది. ఎదుటి వారి మేలు కోసం మీరు చేసే పనుల వలన ఇబ్బందులు తప్పవు. అందరూ మీతో విరోధిస్తారు. వ్యాపారం గతం కన్నా తగ్గుతుంది. నవగ్రహారాధన మంచిది. ఋణ సమస్యలు విచిత్రంగా ఉంటాయి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ అయినా, ఇబ్బంది ఉండదు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు ఉండవు. ఆగస్ట్: ఈనెల ప్రథమార్ధం ఎటువంటి సమస్యలు లేక సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో పనులన్నిటా ఆటంకాలు ఎదురవుతాయి. 4వ వారంలో శుభాలు కలుగుతాయి. వృత్తిలో రాణిస్తారు. అనవసర విషయాలలో కలగ చేసుకొని కలహాలు తెచ్చుకుంటారు. మీ మాటకు గౌరవం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. సెప్టెంబర్: ఈ నెల అనేక శుభాలు జరుగుతాయి. వ్యాపార లబ్ధి. వృత్తిలో ఆటంకాలను అధిగమిస్తారు. స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూ వాహన కొనుగోలుకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. గురువులను సందర్శిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. అధికారయోగం ఉంది. రాజకీయవేత్తలకు అనుకూలం. ప్రభుత్వ సంబంధ పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో తెలియని అశాంతి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు. విద్యార్థులకు మంచి కాలం. షేర్ వ్యాపారులు అద్భుతంగా రాణిస్తారు. నెల అంతా పుణ్య, శుభకార్యాలు నిర్వహిస్తారు. నవంబర్: ఈనెల శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పటి నుంచి 5 నెలల పాటు జీవిత, వ్యాపార భాగస్వాములతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేయాలి. అధికారుల సహాయంతో ప్రమోషన్లు, స్థానచలనాల్లో లాభం అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు లాభదాయకం. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల సందర్శన చేసుకుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. డిసెంబర్: ఈనెల అన్ని రంగాలవారికీ అనుకూలమే. వ్యాపారలబ్ధి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. 16వ తేదీ తరువాత స్వయంకృతాపరాధం అన్నట్లుగా కొన్ని పనులు పాడు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఇతర చికాకులు 16వ తేదీ నుంచి పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. జనవరి: ఈనెల వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. ఫిబ్రవరి: వ్యాపారం లాభ దాయకంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలుంటాయి. మార్చి : ఈ నెల ఎక్కువ శుభపరిణామాలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం. కుంభ రాశి ఆదాయం–14, వ్యయం–14, రాజయోగం–6, అవమానం–1 ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే) శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు) పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా) గురువు మే 1 వరకు మేషం (తృతీయం)లోను తదుపరి వృషభం (చతుర్థం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (జన్మం)లోను రాహువు మీనం (ద్వితీయం)లోను కేతువు (అష్టమం)లోను సంచరిస్తారు. రోజూవారీ కార్యక్రమాలలో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని వలన సహజంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి. కానీ భయభ్రాంతులను చేసే స్థాయి కాదు అని గమనించాలి. ప్రతిపనీ రెండవసారి, మూడవసారి ఓర్పుగా వెంబడిస్తే లాభిస్తుంది. ఇది మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. ప్రాకృత ధర్మంలో ఉన్న వారికి సమస్యలు రావు. వేరే మార్గంలో మీ ప్రవృత్తిని మార్పు చేసుకొనేవారు మాత్రమే ఇబ్బంది పొందుతారు. శని ఆలస్యం చేస్తాడు కానీ పనులు పాడు చేయడు. ఇది నిజం. ఉద్యోగ విషయాలలో భయపడవద్దు. మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకు ఇది మంచి కాలం కాదు. చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి. ఇబ్బంది ఉండదు. చేస్తున్నది మానేసి కొత్త ప్రయత్నం చేస్తే అది వికటిస్తుంది. చేస్తున్న పనిలో సరైన గుర్తింపు రాలేదని బాధపడవద్దు. స్థానచలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించుకోకపోతే మీకు సానుకూలత లేని ప్రదేశం చేరుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. తరచుగా శుభవార్తలు వింటుంటారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా ఇబ్బందులు రాగలవు. అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు, కోరికలు సరిగా పూర్తి అవకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు ఉంటాయి. మీ ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. మీ వాక్కులు బాగా కఠినంగా వస్తుంటాయి. నియంత్రించండి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృథాగా ఖర్చు చేసే సందర్భాలు ఎన్నోసార్లు వస్తుంటాయి. ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు. ఆదాయం అందుతుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఋణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు. మీరు ఆర్థిక విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. మీరు వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేరు. వాహన ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్య విషయంగా, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టే అవకాశాలు ఉన్నాయి. నరాలు, చర్మం, ఎముకలు, గుండెజబ్బులు వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. కొత్త సమస్యలు కూడా రాగలవు. ఈ రాశికి చెందిన స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. తద్వారా కుటుంబ విషయాలకు ఉద్యోగ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితిలో ఉంటారు. జాగ్రత్తపడండి. గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం. వైద్య సలహాలు చాలా బాగా అనుసరించవలసి ఉంటుది. షేర్ వ్యాపారులకు స్థిరబుద్ధి అవసరం. ఇతరులతో పోలిక, ఇతరుల సూచనలు తీసుకున్నా మీ బుద్ధినే వాడండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు మందగిస్తాయి. ఒకటి లేదా రెండు సార్లు కూడా వైఫల్యం రావచ్చును. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఎవరినీ నమ్మి ఏ పనులు చేయవద్దని సూచన. కార్య సాఫల్యం తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి బహు జాగ్రత్తలు అవసరం. స్వబుద్ధి వికాసం ఈ విషయంలో అవసరం. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. బుద్ధి స్థిరం కోల్పోవు అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రైతుల విషయంలో మే తరువాత గురువు అనుకూలమే కాబట్టి పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 వారు తొందరపాటు ధోరణితో చికాకులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపార, ఋణ వ్యవహారాలను ఓర్పుగా నిర్వహించండి. శతభిష నక్షత్రం వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడవలసిన కాలం. విద్యార్థులు మందగొడిగా అధ్యయనం సాగిస్తుంటారు. శుభకార్యాల పనులు వేగంగా సాగుతాయి. పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 వారు పరిధి దాటి ఋణాలు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయు స్థితి ఉంటుంది. తరచుగా సంఘంలో పెద్దలను కలుసుకుంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. శాంతి మార్గం: రోజూ ఆంజనేయుని దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. శని, గురువులకు జపం దానం చేయండి. గోపూజ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పనులు శరవేగంగా పూరవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నతాధికారులను సందర్శిస్తారు. బదిలీలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్త అవసరం. విష్ణు ఆరాధన మంచిది. 15వ తేదీ తరువాత అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్య రక్షణ మీద దృష్టి ఉంచుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మే: ఈనెల ప్రతి విషయం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం మంచిది. బంధువర్గంతో విభేదాలు. చివరి వారం మంచి వార్తలు వింటారు. మీ కృషికి తగిన గౌరవం లభించదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార పెట్టుబడులు, నూతన వాహనాల కొనుగోలుకు సమయం అనుకూలము కాదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, వ్యాపారులకు, విద్యార్థులకు చివరి వారం అనుకూలం. జూన్: ఈ నెల అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా చేయగలరు. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు సర్దుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారం అనుకూలిస్తుంది. ద్వితీయార్ధంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట సరిపడని పరిస్థితి ఉంటుంది. శతభిషా నక్షత్రం వారికి అవమానకర ఘటనలు ఎదురవుతాయి. షేర్, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు సమస్యలను అధిగమిస్తారు. జులై: ఈ నెల ప్రథమార్ధంలో ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఋణ సమస్యలు తగ్గుతాయి. ద్వితీయార్ధంలో నిందలపాలవుతారు. నవగ్రహ ఆరాధన మంచిది. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అధిక జాగ్రత్తలు పాటించాలి. రైతులు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. ఆగస్ట్: దాంపత్యంలో అన్యోన్యత తగ్గుతుంది. ఇంటా బయట చికాకులు. వ్యర్థ ప్రయాణాల వలన శారీరక శ్రమ, ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. నవగ్రహారాధన శుభప్రదం. వృత్తిలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఋణ, ఆరోగ్య, ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. వస్తువులు చౌర్యానికి గురవుతాయి. సెప్టెంబర్: ఈ నెల కొంత ఒదిగి ఉండటం మేలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఒక శుభం జరుగుతుంది. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. ఋణ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల వలన ఇబ్బంది ఉంటుంది. అక్టోబర్: పనులకు ఆటంకాలు వచ్చినా, వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై జాగ్రత్తలు అవసరం. శతభిషా నక్షత్రం వారు కొన్ని సందర్భాలలో తెలివిగా ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. ధనం సర్దుబాటు ఇబ్బందికరమైనా, ప్రతి పనికీ ధనం సాధించుకుంటారు. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులకు, రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నవంబర్: ఈ నెల అంతా అనుకూలమే. సమస్యలు తొలగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. శత్రుబాధలు తొలగుతాయి. అవసరానికి తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. దూరప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. డిసెంబర్: ఇంటా బయటా అన్నింటా కార్యజయం. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేష అధికారయోగం. ఆదాయం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. భూ– వస్తు– వాహన– ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనాలతో జాగ్రత్త అవసరం. ఆటోమొబైల్ రంగం వారికి చికాకులు వస్తుంటాయి. వ్యాపారాలు మందగమనమే అయినా, అనుకున్న లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటు విడనాడాలి. జనవరి: తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తిలో విశేష గౌరవం. ఆరోగ్యం అనుకూలం. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్త్ర– ఆభరణ– గృహలాభం ఉంది. కొత్త ప్రయోగాలు చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి ప్రయత్నాలను తెలివిగా సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: కుటుంబంలో అందరూ ఉన్నతస్థానంలో ఉంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. తరచు ప్రయాణాలవల్ల శారీరకశ్రమ. మోసపూరిత వాతావరణం ఉంటుంది. విష్ణు స్తోత్ర పారాయణ మంచిది. 19వ తేదీ నుంచి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తారు. పెద్దల ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు విశేష ఫలితాలు. విదేశీ ప్రయత్నాలకు సానుకూలం. మార్చి: శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం అభివృద్ధి చూసి ఆనందిస్తారు. వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది. శివారాధన మంగళప్రదం. మీన రాశి ఆదాయం–11 , వ్యయం–5 , రాజయోగం–2 , అవమానం–4 పూర్వాభాద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా) రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి) గురువు మే 1 వరకు మేషం (ద్వితీయం)లోను తదుపరి వృషభం (తృతీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (వ్యయం)లోను రాహువు మీనం (జన్మం)లోను కేతువు (సప్తమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతుంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడికను సరిచేసుకోండి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. జాగ్రత్తపడండి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతుష్టి ఉండవు. ప్రతిరోజూ చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్య కర్మలను వాయిదా వేయవద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మ రాహువు కూడా ఇబ్బందికరమే. ప్రతిపనీ శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకూ ప్రాధాన్యమివ్వ వద్దు. గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది. అయినా ఓర్పు వహించండి. ప్రమోషన్ అందడం కష్టసాధనం. మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైన స్థానానికి స్థానచలనం కలుగుతుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శించండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ మీకు మాట కలవదు. వీలయినంతవరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించండి. పిల్లల అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలు దాటగలరు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరుచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత ఋణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త ఋణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం. ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తుంటాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు సరిగా కావు. అందుకోసం చింతించనవసరం లేదు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులూ చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిరబుద్ధిని బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనులు మందగమనంగా ఉంటాయి. కిందస్థాయి వారితో వృత్తి నష్టాలు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచికాలం కాదు. రేవతి నక్షత్రం వారు గృహ, వ్యాపార నిర్వహణలలో పనివాళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శాంతి మార్గం: శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని, సాయం సమయంలో శివాలయంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఏప్రిల్: ఈ నెల ఆర్థిక సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఋణం చేయవలసి వస్తుంది. పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఉద్యోగంలో పైఅధికారులతో సమస్యలు వస్తాయి. మీ పనులలో ఇతరుల ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. శారీరక మానసిక ఒత్తిడి తప్పదు. మే: పనిలో నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకోలేరు. విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు రాబోవు సంవత్సర కాలం అధిక జాగ్రత్తలు అవసరం. జూన్: ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ అవసరం, అభిప్రాయ భేదాల వల్ల మనస్తాపం ప్రయాణాలవల్ల అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. షేర్, ఫైనాన్స్, వ్యాపారాలలో చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులకు, రైతులకు చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. జులై: కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. పట్టుదలతో పెద్దపనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. భూ–వాహన–స్థిరాస్తి లాభం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధనం సర్దుబాటు కాకున్నా, కొన్ని పనులు వేగంగా సాగుతాయి. 16వ తేదీ తరువాత సానుకూలం. మాసాంతంలో కార్య విజయం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం సామాన్యం. ఆగస్ట్: కాలం అనుకూలం. ఉద్యోగంలో శత్రు బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఋణ రోగ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలలో మొండి వైఖరితో సమస్యలు పెంచుకుంటారు. వృత్తి విషయాలలో కోపావేశములతో కొన్నిసార్లు ఇబ్బంది పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఈనెల గ్రహానుకూలత తక్కువ. ఎదుటివారి విషయాలకన్నా స్వవిషంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఉద్యోగ బదిలీలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. విద్యార్థులకు, రైతులకు కాలం సరిగా లేదు. అక్టోబర్: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో స్త్రీలకు ఆరోగ్య ఇబ్బందులు. కుజ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. రైతులకు, మార్కెటింగ్ వ్యాపారులకు అనుకూలం కాదు. ధనం వెసులుబాటు జరగదు. నవంబర్: ఇంటా బయటా మీమాటకు విలువ తగ్గును. ఏపనికైనా పలుమార్లు చెప్పవలసి వచ్చును. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యల పట్ల ఆందోళన చెందక నేర్పుతో వ్యవహరిస్తారు. పిల్లల నుంచి సహకారం తక్కువ. ఉద్యోగ కుటుంబ వ్యవహారాల నిర్వహణలో సరైన దృష్టి ఉంచలేరు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. డిసెంబర్: ఉద్యోగంలో పెనుమార్పులు మీకు అనుకూలిస్తాయి. ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. శివ దర్శనం శుభప్రదం. మీ ఆరోగ్యం అనుకూలమే కానీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరం. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు, షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వేగం అవుతాయి. జనవరి: వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకం. రాజకీయవేత్తలు ప్రజల మన్ననలు పొందుతారు. అధికారయోగం ఉంది. శత్రుబాధల నుంచి విముక్తి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో మీ స్థిరత్వానికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి.విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సహకారం తక్కువ. ఫిబ్రవరి: తీర్థయాత్రలు చేస్తారు. సత్సాంగత్యం వలన లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభకరం. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. ఋణాలు అవసరానికి అందుతాయి. పాత ఋణ సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. మార్చి: ఎన్ని సమస్యలు ఉన్నా, ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీల వల్ల అలసట, శారీరక శ్రమ ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులపై ఆధారపడవద్దు. మోసపూరిత పరిస్థితులు ఉంటాయి. -
బిగ్ ‘సి’ ఉగాది ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ ఉగాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీల కొనుగోలుపై 7.50% వరకు తక్షణ తగ్గింపు అందిస్తుంది. ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో వీటిని కొనుగోలు చేయవచ్చు. మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు సంవత్సరం పూర్తిగా, రెండో ఏటా రూ.8వేల వరకు ‘మొబైల్ ప్రొటెక్షన్’ అదనంగా పొందవచ్చు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51% వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రజలంతా ఉగాది ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని సంస్థ సీఎండీ బాలు చౌదరి కోరారు. -
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్‌లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది) -
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఫొటోలు)
-
ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ.. ఊరట ఏమిటంటే..
-
అంతా సమానమే..
-
వారు ఆ విషయంలో జాగ్రత్త పాటించాలి
-
అదృష్టాన్ని నమ్ముకోవచ్చు..
-
రాజకీయ నాయకులకు అండదండలు.. కానీ
-
అన్నీ ఎక్కువే..
-
చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉగాది వేడుకలు
-
వేపకు మళ్లీ ‘డై బ్యాక్’ ముప్పు!
ల్లెపల్లెనా, రోడ్ల పక్కన, అడవుల్లో విస్తృతంగా పెరిగే మన వేపచెట్లకు మరోసారి ‘డై బ్యాక్’జబ్బు ముప్పు పొంచి ఉంది. సుమారు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ‘టీ మస్కిటో’, ఫంగస్ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న లక్షలాది వేపచెట్లు ఈ ఏడాది ఉగాది తర్వాత కోలుకుంటున్న క్రమంలో మళ్లీ టీ మస్కిటో దాడి మొదలుపెట్టింది. ఈసారి ఫిబ్రవరి నుంచి అకాల వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పంజా విసురుతోంది. ఫలితంగా చెట్లన్నీ కొమ్మలతో సహా ఎండి పోవడంతోపాటు ఆకులు రాలిపోతున్నాయి. దీనివల్ల చెట్లకు పోషకాలు అందక క్రమంగా చచ్చిపోతున్నాయి. దీన్నే డై బ్యాక్‌గా పిలుస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ తగ్గనున్న వేప విత్తన దిగుబడి... రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చని శాస్త్రేవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెగుళ్లు సోకడం వేపవిత్తనాల దిగుబడి భారీగా తగ్గిందని చెబుతున్నారు. ఈ ఏడాది 50 నుంచి 80% దాకా విత్త నాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని, దీని ప్రభావం వేప ఉత్పత్తులు, నీమ్కేక్స్, నీమ్ ఆయిల్, నీమ్ కోటింగ్‌పై ఆధారపడిన పరిశ్రమలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డై బ్యాక్ జబ్బును జాతీయ స్థాయిలో దీనిని కట్టడి చేసేందుకు కార్యాచరణను చేపట్టక పోతే భవిష్యత్‌లో వేప ఆధారిత ముడిపదార్థాలను విదేశాల నుంచి దివగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎదురుకావొచ్చని చెబుతున్నారు. కొనసాగుతున్న పరిశోధనలు.. ఈ సమస్యపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రిసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) ఐఐసీటీ, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విడి విడిగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వేపచెట్లకు ఎదురవుతున్న కీటక దాడు లు, చెదలు, ఫంగస్‌లను ఎలా కట్టడి చేయాలనే దాని పై పరిష్కారాలు కనుగునేందుకు కృషి చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఐలో పరి శోధన నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.జగదీశ్‌కుమార్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఫోమోప్సిస్ అజాడిరాచ్టే అనే పాథోజెన్ ద్వారా వేప చెట్లకు ఈ జబ్బు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ పాథోజెన్ గాలి ద్వారా సులభంగా వ్యాప్తికి అవకాశం ఉన్నందున వేపచెట్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాక వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. రాష్ట్రమంతటా వేప చెట్లు విస్తరించి ఉన్నందున అన్నింటికీ వివిధ రసా యన మిశ్ర మాలతో పిచికారీ చేయడం అసాధ్యంగా మారిందని వివరించారు. అయితే వేపకు బతికే శక్తిసామ ర్థ్యాలు ఎక్కువగా ఉన్నందున పెద్దచెట్లకు అంతగా నష్టం ఉండదని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం రిటైర్డ్ సంచాలకుడు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ అభిప్రాయపడ్డారు. కానీ గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు ఎక్కువ కావడంతో వేపచెట్టు నుంచి విత్తనం నేలపై పడి తిరిగి మొలకెత్తడం తగ్గిపోయిందన్నా రు. అందు వల్ల వేప ముడిపదార్థాల ఉత్పత్తి, సరఫరాలో తగ్గుదల కనిపిస్తోందని సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. -
తమిళ ఉగాది త్వరలోనే రానుంది
ఉగాది పర్వదినం ఎప్పటికీ ప్రత్యేకమే అని సినీనటి నమిత అన్నారు. వివరాలు.. తమిళ ఉగాది పండగను డిశంబర్ 31గా దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గతంలో మార్చిన విషయం తెలిసిందే. అయితే చాలామంది ఏప్రిల్ 14వ తేదీనే తమిళ ఉగాదిగా జరుపుకుంటున్నారు. మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పటి కుర్రకారు కలల నటి నమిత కూడా డిశంబర్ 31వ తేది తమిళ ఉగాది కాదు అని పేర్కొన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా వెలిగిన ఈమె తమిళంలో నటుడు విజయ్‌కాంత్‌కు జంటగా ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. తరువాత సత్యరాజ్, విజయ్, అజిత్, శరత్‌కుమార్ వంటి స్టార్ హీరోలతో జత కట్టి పాపులర్ అయ్యారు. అభిమానులను మచ్చాన్ అంటూ ముద్దుగా సంబోధిస్తూ వారి కలల రాణిగా మారారు. 2017లో తన ప్రేమికుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన నమిత అంతకు ముందే రాజకీయరంగ ప్రవేశం చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీలో కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈమె మంగళవారం ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో అందరికీ తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. అదే విధంగా తమిళ ఉగాది డిశంబర్ 31వ తేదీ కాదనీ, ఏప్రిల్ 14నేనని అన్నారు. తమిళ ఉగాది త్వరలోనే రానుందని, మీరంతా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటి నమిత -
పోస్టర్ చూద్దాం.. ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్
పండగ చేద్దాం.. పోస్టర్ చూద్దాం అన్నట్లు ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని పోస్టర్లను చూద్దాం. ♦ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. ♦ పల్లకి మోస్తున్నారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ♦ నాగచైతన్య పోలీస్‌గా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజవుతుంది. ♦ కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ♦ ‘మామా మశ్చింద్ర’ చిత్రంలో ట్రిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సుదీర్‌బాబు. దర్శక–నటుడు హర్షవర్థన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దుర్గ, పరశురామ్, డీజే పాత్రల్లో కనిపిస్తారు సుధీర్‌బాబు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది. ♦ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అర్జునదారి గాండీవ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ♦ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. 2012 యుగాంతం కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మాత. ♦ పోలీసాఫీసర్‌గా కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్’. అతుల్యా రవి హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల సమర్పణలో చెర్రీ (చిరంజీవి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. పి. కిరణ్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫీష్ ’. ఈ చిత్రానికి విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి సహనిర్మాతలు. ♦ రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను రమణ మొగిలి, తిరుపతిరెడ్డి బీరం నిర్మించారు. ‘‘స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
శ్రీవారి చెంత వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వ్రస్తాలను ధరింపచేసి పంచాంగ శ్రవణం నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తం గా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమలలోని క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్టుమెంట్లు నిండి ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 57,559 మంది స్వామివారిని దర్శించుకుని హుండీలో రూ.4.26 కోట్లు వేశారు. టైం స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో, దర్శన టికెట్లు లేని వారికి 12 గంటల్లో , ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్నవారికి 3 గంటల్లో దర్శనమవుతోంది. ప్రత్యేక ఆకర్షణగా ఫల పుష్పాలంకరణ ఉగాదిని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెంత ఎండు కొబ్బరితో దశావతారాలు, కొబ్బరిపూలతో చేసిన శ్రీలంక ఆర్ట్ అలంకరణలు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీపద్మావతి శ్రీనివాసుల కల్యాణఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయం వెలుపల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తీసుకెళుతున్న గరుత్మంతుడు అనే ఘట్టాన్ని రూపొందించారు. గొల్ల మండపం పక్కన ఉగాది లక్ష్మీదేవితో శ్రీమహావిష్ణువు, ఉద్యానవనంలో ఆడుకుంటున్న బాలల రూపంలో ఉన్న శ్రీరాముడు హనుమంతుడు, ఉగాది రోజున మామిడి వనంలో కాయలు కోస్తున్న శ్రీకృష్ణుడు, పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి న 150 మంది పుష్పాలంకరణ కళాకారులు 3 రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల, పుష్ప ఆకృతులను రూపొందించారు. -
శ్రీస్వామి వారి ఆదాయం 14, వ్యయం 11
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఆచార్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వయంభూలు కొలువైన ప్రధానాలయంలో భక్ష్యా లు తయారు చేసి, షడ్రుచులతో సిద్ధం చేసిన పచ్చడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి, అమ్మవార్లకు నివేదించారు. సాయంత్రం ముఖ మండపంలో శ్రీస్వామి వారిని అలంకరించి మాఢ వీధుల్లో సేవోత్సవం జరిపించారు. తూర్పు రాజగోపురం ముందు అధిష్టించి ఆచార్యులు పంచాగ పఠనం చేశారు. యాదాద్రి నృసింహస్వామిది తులా రాశి కాగా ఈ ఏడాది శ్రీస్వామి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, శ్రీలక్ష్మీ అమ్మవారిది మేషరాశి కాగా ఆదాయం 5, వ్యయం 5, ఆండాళ్ అమ్మవారిది సింహ రాశి కాగా ఆదాయం 14 వ్యయం 2 ఉన్నట్లు ఆచార్యులు వివరించారు. శ్రీశోభకృత్లో భక్తులతో పాటు ప్రజలంతా ఆనందంగా ఉంటారని ఆచార్యులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయని, వడగళ్లు సైతం పడతాయని తెలిపారు. రైతాంగానికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కలసి వచ్చే అంశం అని అన్నారు. వేసవిలో ఎండలు దంచి కొడతాయన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి వైరస్ ప్రజలకు సోకదని తెలిపారు. ఈ వేడుకల్లో ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు, పండితులు, పురోహితులు పాల్గొన్నారు. -
Telangana: సంవత్సరాంతంలో రాజకీయ ఒడిదుడుకులు
సాక్షి, హైదరాబాద్: ‘ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకర ఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ పరిణామాలు విపరీతమైన రాజకీయ ఒడిదుడుకులకు కారణమవుతాయి. అక్టోబర్ 31కి రాహువు, కేతు గ్రహాలు మారుతున్నందున.. ఈ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుంది’అని శృంగేరీ ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. అధికార పక్షంలోని కొందరినుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో అధికారంలోని పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచించారు. ఈ ఏడాది బుధుడు రాజుగా ఉన్నందున.. ఈ పరిణామాలను ప్రభుత్వం నిలువరించగలదన్నారు. సప్తమాధిపతి అయిన గురువు అష్ట్టమంలో మౌఢ్య స్థితిలో ఉన్నందున ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం బాగా కష్టపడాల్సి వస్తుందని వెల్లడించారు. శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఉదయం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పక్షాన ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగాన్ని పఠించారు. కొన్నేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నా..సామాజిక అశాంతి నెలకొంటుందని వెల్లడించారు. అశాంతి ఏర్పడ్డా, పోలీసు శాఖ సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గురుడు జలాశయ కారకుడు అయినందున రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలుగా మారతాయి. కేంద్ర, రాష్ట్రాలు విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. వర్సిటీల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలకు అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానాలు కీలక తీర్పులు ఇవ్వబోతున్నాయి. వచ్చే మార్చిలో ప్రకృతి ఉపద్రవాలు, మత ఘర్షణలు, సామాజిక అశాంతికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. బుధుడు భాగ్యమందు మంచి స్థితిలో ఉన్నందున రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతుంది. ధన భాగ్యాధిపతి శుక్రుడు కావటంతో ఆర్థిక రంగం కొంత పురోగమిస్తుంది. కీలక పథకాలను కొనసాగించాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారు. విద్య, వైజ్ఞానిక రంగాల్లో పరిశోధనలు సాగుతాయి. ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైన ఎండలు కాసే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్లలో భారీ వర్షాలు కురుస్తాయి. మంచి పంటలు పండుతాయి. గురు, శుక్ర మౌఢ్యాలు 40 రోజులు మాత్రమే ఉన్నందున రాష్ట్రంలో శుభకార్యాలు విపరీతంగా జరుగుతాయి. పాల ఉత్పత్తి బాగా పెరగనున్నా.. పాలల్లో, ఆహారపదార్థాల్లో కల్తీ సమస్య కూడా పెరుగుతుంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో తుపానులు ఏర్పడతాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు గంగా పుష్కరాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోవాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన కర్కాటక రాశికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నా యని సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. ఆదా యం 11 వ్యయం 8 రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుందని, రాహువులో రవి దశ ముగిసి చంద్ర దశ నడుస్తోందని, జనవరి 17న అష్టమ శని దోశం ఏర్పడినందున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోగలిగితే అవాంతరాలను అధిగమించే వీలుంటుందన్నారు. కాగా, మంచి వానలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగం సూచించటం పట్ల ఆనందంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పండితులను సన్మానించారు. -
ఉగాది పచ్చడి తింటాం.. చేయడం రాదు: శివాని, శివాత్మిక
హైదరాబాద్‌లో ఉంటే అమ్మ, నాన్న, మేమిద్దరం కలిసి పండగ జరుపుకుంటాం. అమ్మ ఉగాది పచ్చడి, గారెలు, పులిహోర, పాయసం.. ఇలా అన్నీ చేస్తుంది. ఒకవేళ మేం చెన్నైలో ఉంటే... అక్కడి మా బంధువులతో పండగ జరుపుకుంటాం. మా ఇద్దరికీ పచ్చడి తినడం తప్ప చేయడం రాదు. మా చిన్నప్పుడు ఇద్దరం ముగ్గులు వేసేవాళ్లం. పండగ అంటే మాకు ముగ్గులే ఎగ్జయిటింగ్. ఇక పండగ రోజున కొత్త బట్టలంటే అది ఆ రోజు మూడ్‌ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఫుల్ ట్రెడిషనల్‌గా డ్రెస్ చేసుకుంటాం.. చక్కగా నగలు పెట్టుకుని గుడికి వెళతాం. చీర, లంగా, ఓణీ, చుడీదార్.. ఇలా ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు చెన్నైలో ఉన్నాం. ఈసారి ఫుల్ ట్రెడిషనల్‌గా రెడీ అవుతాం. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంకా మంచి నటిగా ఎదగాలని ఉంది. అలాగే మంచి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ మెడిసన్ చేస్తున్నాను. ఏం చేసినా నిబద్ధతతో చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. వర్కవుట్, షూటింగ్, చదువు, హార్స్ రైడింగ్.. ఏదైనా మరింత క్రమశిక్షణగా చేయాలనుకుంటున్నాను. – శివాని ఈ సంవత్సరం చేతినిండా పని ఉండాలని కోరుకుంటున్నాను. తెలుగు, తమిళంలో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. కెరీర్‌పరంగా ఎదగాలన్నదే ప్రస్తుత లక్ష్యం. వీలైతే ఏదైనా స్పోర్ట్ నేర్చుకోవాలని ఉంది. ఏడాది మొత్తం చాలా ప్రశాంతంగా గడిచిపోవాలని ఉంది. ఆరోగ్యం బాగుండాలి. – శివాత్మిక -
Sri Shobhakruth Nama Ugadi 2023: శోభాయమానం
ఉగాది మన తొలిపండుగ. ఈసారి ఉగాదికి పేరు శోభకృత్. శోభ అంటే కాంతి. మన జీవితాలకు అవసరమైన...భాగ్యాల, సౌభాగ్యాల కాంతిని ఈ ఉగాది ఇస్తుందనిఆశిద్దాం. ఈసారి వసంత విషువత్ జరిగిన మరుసటి రోజున ఉగాది వచ్చింది. అంటే వసంత విషువత్ మొదలు అయిన మరుసటి రోజున చైత్రమాసంమొదలు అయింది. ఇది ఒక విశేషం. ఇలా జరగడం అరుదు. ఈ అరుదైన సంఘటన మనకు, దేశానికి, ప్రపంచానికి అత్యంత మేలు చెయ్యాలని అపేక్షిద్దాం. ఉగాదితో చాంద్ర–సౌర (లూని సోలర్) సంవత్సరం మొదలు అవుతుంది. పౌర్ణమి చంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో ఉండడం చైత్రమాసం. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పా డ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నాక్షత్రమాసం అవుతుంది. సూర్యుడు భూమధ్యరేఖను ఉత్తరంవైపుగా దాటడం వసంత విషువత్ అవుతుంది. వసంత విషువత్ మార్చ్ 21న జరుగుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్త ఋషులు నాక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగం పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువులో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అని అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి ఆనుగుణ్యంగానూ రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థాలు. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. నాక్షత్ర చాంద్ర– సౌర గమనాల ప్రా తిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. సప్త ఋషుల తరువాత విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపా దనలను, మార్పులను తీసుకువచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహర్షి సంవత్సరాదిని వసంత విషువత్ కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ వస్తోంది. వసంత విషువత్‌తో వసంతం మొదలు అవుతుంది; సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని ΄÷ందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం వేపపువ్వు, బెల్లం, మిరియాలపొడి, చింతపండు, ఉప్పు, మామిడి ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగ శ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను వ్యక్తులకు సూచన్రపా యంగా పంచాంగం చెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి; చేద్దాం.ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవ్వాలి, అవుదాం. మంచికి తొలి అడుగుగా, ఒక పండుగగా, తొలి పండుగగా ఉగాది మనకు అందివచ్చింది. ఇతర పండుగలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ ఉగాది. వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది. ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం. చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలు. వీటిని వసంతం తెస్తుంది, ఇస్తుంది. వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే ‘అహమృతూనాం కుసుమాకరః‘ అంటూ కృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చెప్పాడు. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘... సంతో వసంతవల్లోకహితం చరంతః ...’ అని వివేకచూడామణిలో ఆదిశంకరాచార్య అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం, హితం వంటివసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. – రోచిష్మాన్ -
విజయలక్ష్మి కటాక్షానికి అన్ని పార్టీల తహతహ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతిఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా? అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. సిరిసిల్ల: ఇక్కడి నుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆ ర్కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లే దు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతార న్న ప్రచారం సాగుతోంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్(బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అ భివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి న ర్సింగరావు(కాంగ్రెస్) గట్టిపోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జ రిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారమూ జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్(బీఆర్ఎస్)కు ఈసారి గట్టిపోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు(కాంగ్రెస్)కు, పుట్ట మధు(బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. రామగుండం: ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్(కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ(బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో భారతీయ జనతా పార్టీ( బీజేపీ ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడనుంచి రెండుసా ర్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటిపోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడేనుంచే పోటీచేసిన ఓరుగంటి ఆ నంద్ కూడా టికెట్ కోసం యత్నిస్తున్నా రు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనా రాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తు తం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
మిథున రాశి: అన్నింటా శుభయోగం.. ఆ ఒక్కటి చేస్తే మరింత రాజయోగం
మిథున రాశి (ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4) మిథునరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. చతుర్థ పంచమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, దశమ లాభస్థానాలలో గురు రాహువుల సంచారం, భాగ్యస్థానంలో శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. కీలకమైన స్థానాలలో ఉన్నవారి వల్ల లబ్ధి చేకూరుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. విదేశీయాన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. అగ్రిమెంట్స్, కాంట్రాక్టులు, మార్కెటింగ్, వాణిజ్య ప్రదర్శనలు, ప్రకటనలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లాభిస్తాయి. కంటి దోషాలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు, అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. స్పెక్యులేషన్‌కు దూరంగా వుండటం మంచిది. శత్రువర్గం ఇబ్బంది పెట్టలేని స్థాయిలో ఉంటారు. ఒకనాటి మిత్రులు అగర్భశత్రువులు అవుతారు. అందరూ బలహీనులు అని భావించవద్దు. తగిన సమయం కోసం వేచి ఉన్నారని గ్రహించండి. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. సాంకేతిక పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఎక్కువ ఆలస్యం చేయకుండా శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. పార్టీ మారడం వల్ల మంచి రాజకీయ ఫలితాలు పొందగలుగుతారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణాభరణాల భద్రతలో జాగ్రత్తలు అవసరం. సంతానం వల్ల కుటుంబానికి కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఎగుమతి, దిగుమతి వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్ల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. బంధువులకు సహాయం చేయడం వల్ల చికాకులు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు అంచనాల మేరకు ఫలిస్తాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ వ్యాపార భాగస్వాములు, సహోద్యోగులు అసూయాపరులై ఉంటారు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి, ఈఎన్టీ సమస్యలు రావచ్చు. కష్టపడి పనిచేసి ఫలితాలను ఆశిస్తారు. సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం, కాలహరణం జరుగుతుంది. మనుషుల మనోభావాల్ని స్పష్టంగా చదవగలరు. సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి. ప్రేమ వివాహాలు విఫలం అవుతాయి. విద్యారంగంలో కృషి చేసేవారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది. వాస్తవిక దృష్టితో ఆలోచించి, కుల మత వర్గాలకు అతీతంగా శక్తిసామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం వల్ల చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. ఇతరులు సలహాలు చెప్పడానికి వీలులేని వాతావరణం కలిగించవద్దు. పట్టువిడుపులు మంచికి దారితీస్తాయని గ్రహించండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం నవగ్రహ పాశుపత హోమం చేయాలి, శక్తికంకణం లేదా శక్తిరూపు ధరించాలి. ఉపయోగంలేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళను వదిలించుకోవడం కష్టంగా మారుతుంది. మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు ముఖం చాటువేస్తారు. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం బాగుంది. సన్నిహితులతో, ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే వారికి భంగపాటు తప్పదు. అవివాహితులకు ఘనంగా వివాహం జరుగుతుంది. సౌందర్య చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన వాటి వల్ల ప్రయోజనం పొందుతారు. ఆరావళి కుంకుమ, శ్రీలక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజిస్తే మంచిఫలితాలు ఉంటాయి. లీజులు, అగ్రిమెంట్లు, లైసెన్సులు లాభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో జీవితం మరో కొత్త పంథాలో నడుస్తుంది. విడిపోవాలన్న వారితో శాశ్వతంగా విడిపోతారు. సంతాన పురోగతి బాగుంటుంది. చెప్పుడు మాటలు విని నష్టపోతారు. శుభకార్యాలకు సంబంధించిన బరువు బాధ్యతలు దించుకుంటారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు సంభవిస్తాయి. మీ వివాదాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త వహించండి. కీళ్ళనొప్పులు, గైనిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లాభించదు. చిట్టీలు కట్టి మోసపోతారు. హనుమాన్ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అలంకార సామగ్రి అమ్మేవారికి, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు పిల్లల ముందు చర్చించకపోవడం మంచిది. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు మెరిట్ మార్కులు, స్కాలర్షిప్స్ వస్తాయి. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. జీవితభాగస్వామి లేదా తత్సమానమైన వ్యక్తితో విభేదాలు తీవ్రతరం అవుతాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు అత్యంత ప్రజాదరణకు నోచుకుంటాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. ధనాన్ని పొదుపు చేస్తారు. మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసి వస్తుంది. సొంత వ్యాపారాలు కలిసివస్తాయి. పొదుపు పథకాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువుల భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ చూపండి. బ్యూటీ పార్లర్స్ నడిపేవారికి, అలంకార సామగ్రి విక్రయాలు మొదలైన వ్యాపారాలు లాభిస్తాయి. కళా, సాంస్కృతిక రంగాలలో, నాట్య, సంగీత రంగాలలో రాణిస్తారు. చలనచిత్ర, టీవీ రంగాలలో అవకాశాలు లభిస్తాయి. పిల్లలను అతి గారాబం చేయడం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ రంగాలలోని వారు రాణిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యకు ఎంపికవుతారు. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. అనువంశికంగా మీకు రావలసిన ఆస్తిలో పెద్దలు రాసిన డాక్యుమెంట్స్‌లో కొన్ని లోపాలు బయటపడతాయి. ఈ లోపాల కారణంగా మీరు కానీ, మీ జీవిత భాగస్వామి కానీ నష్టపోయే అవకాశం ఉంది. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వల్ల నరదిష్టి, నరఘోష తొలగిపోతుయి, జనాకర్షణ ఏర్పడుతుంది. సాధారణ విద్యలోనూ, వైద్య విద్యలోనూ బాగా రాణిస్తారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. -
Ugadi 2023 బిగ్ ‘సి’: వినూత్నఫెస్టివ్ ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ ఉగాది పండుగ సందర్భంగా వినూత్న ఆఫర్లు ప్రకటించింది.మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ యం.బాలు చౌదరి తెలిపారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై పదిశాతం వరకు క్యాష్ బ్యాక్‌తో పాటు ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా సులభ ఈఎంఐలలో పొందొచ్చన్నారు. (March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!) స్మార్ట్ టీవీల కొనుగోలుపై 1,500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుందన్నారు. సులభ ఈఎంఐ పద్ధతిలో ల్యాప్టాప్స్ కొనే సౌకర్యం కూడా ఉందన్నారు. ‘‘ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుంది. మా రిటైల్ స్టోర్లలో ఆన్లైన్ కంటే తక్కువ ధరలకే ఉత్పత్తులు లభిస్తాయి. ప్రజలంతా ఈ ఆఫర్లను వినియోగించుకోవాలి’’ అని బాలు చౌదరి కోరారు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51 శాతం తగ్గింపు, ఐఫోన్ కొనుగోలుపై రూ.5,000 తక్షణ తగ్గింపు, రూ.2000 విలువైన అడాప్టర్ ఉచితం వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లలో శాంసంగ్ మొబైల్‌పై రూ.పదివేలు, Vivoపై రూ.5,000, Oppo మొబైల్‌పై 10 శాతంతగ్గింపు లాంటివి ఉన్నాయి. (వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు: ఫోన్‌పే రూ. 1,650 కోట్ల సమీకరణ) -
సకల శుభాల శోభ
ఉగాది రావడంతోనే వేసవి మనకు పరిచయం అవుతుంది. షడ్రుచులతో కొత్త చిగురుల సందడి మొదలవుతుంది.సకల శుభాలను మోసుకువచ్చే ఉగాదికి సకల హంగులూ అద్దేవి మన చేనేతలే. పండగ రోజులే కాకుండా వేసవి మొత్తం కాటన్ డ్రెస్సులతోనే కలర్ఫుల్గా కనిపించడం ఎలాగా అని ఆలోచించేవారికి సరైన ఎంపికతోనే సిద్ధంగా ఉన్నాయి. అచ్చతెలుగు అమ్మాయిలా లంగాఓణీలో కనిపించాలనుకున్నా, లెహంగాలో గ్రాండ్ లుక్‌తో మెరిసి΄ోవాలన్నా, చుడీదార్‌తో ఆధునికం అనిపించాలన్నా, చీర అంచుతోనే అందాన్ని చుట్టేయాలన్నా మన చేనేతలు ఎప్పుడూ అగ్రభాగాన ఉంటాయి. పట్టుకున్నప్రా ముఖ్యత కాటన్స్కు లేదు అనుకునేవారికి సరైన ఎంపిక అవుతున్నాయి. వాటిలో ఖాదీ, మంగళగిరి, ఇక్కత్, నారాయణపేట్, గద్వాల్, వెంకటగిరి... వంటి కాటన్ హంగులు తీరైన నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి. ప్రతిరోజూ పండగే అనిపించే శోభను మోసుకువస్తున్నాయి. ఈ వేసవిని శోభకృతుతో ఇంపైన కళగా మార్చేద్దాం. -
పాన్ ఇండియా సినిమాలు ...ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే!
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు ఓ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఇక ఆ సినిమాల అప్డేట్స్ కోసం మూవీ లవర్స్ తో పాటు...స్టార్ హీరోల అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అంటే వాళ్ల బర్త్‌డే కి మాత్రమే కాకుండా ఫెస్టివల్ కి కూడా ఏదొక అప్డేట్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాగే ఈ ఉగాదికి టాలీవుడ్ నుంచి చాలా సినిమా అప్డేట్స్ రాబోతున్నాయి. మహేశ్ బాబు -త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ #ssmb28. అతడు, ఖలేజా తర్వాత ఈ కాంబినేషనల్ రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఏప్రిల్ నెలాఖారు కల్లా సాంగ్స్ , ఒక ఫైట్ మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా డైరెక్టర్ త్రివిక్రమ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా రీస్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్డేట్ కోసం మహేశ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ లో ఈ మూవీ కి టైటిల్ ఏమి పెడతారనే విషయం పై చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఉగాది నాడు ఈ సినిమా టైటిల్ ప్రకటనతో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మార్చి 22న ఖచ్చితంగా అప్డేట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఇక నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా #NBK108 అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటిస్తోంది. ఇక ఉగాది నాడు ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లు ఓ పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారనే మాట టీటౌన్ లో వినిపిస్తోంది. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న అఖిల్ మూవీ ఏజెంట్. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న అఖిల్ మూవీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 28న రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఏజెంట్ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్ సాంగ్స్ విడుదల చేశారు. ఇక ఉగాది నాడు అక్కినేని సర్ప్రైజ్ ఇచ్చే విధంగా ఏజెంట్ మూవీ నుంచి ఓ అప్డేట్ ఉంటుందనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్ లో సాగుతోంది. గ్లోబల్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ బాలీవుడ్ లో నటించిన డెబ్యూ మూవీ ఆదిపురుష్. జూన్ 16న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి...ఓ క్రేజీ అప్డేట్ ఉగాది రోజు రానుందట. ఆదిపురుష్ మైథిలాజికల్ ఫిల్మ్ కాబట్టి ఉగాది నాడు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ ఓంరౌత్ టీమ్ ప్లాన్ చేస్తుందట. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.సి.15. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. కాబట్టి ఉగాది నాడు ఆర్.సి.15 టైటిల్ అనౌన్స్ చేసి...బర్త్‌డే రోజు టీజర్ రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా బోళా శంకర్...శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ ఉగాది రోజు మెగా ట్రీట్ ఖచ్చితంగా ఇస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సో...ఉగాది నాడు సినీ అభిమానులను ఏ మూవీ అప్డేట్స్ పలకరిస్తాయో చూడాలి మరి. -
విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్‌కు రెడీ.. మాస్ పోస్టర్ రిలీజ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. విశ్వక్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్‌పై కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించారు. రిలీజ్ డేట్ ప్రకటించి, విడుదల చేసిన పోస్టర్లో క్లాస్‌తో పాటు మాస్ లుక్‌లో కనిపించారు విశ్వక్ సేన్. ‘‘దాస్ కా ధమ్కీ’ని తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ కె. బాబు, సంగీతం: లియోన్ జేమ్స్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉగాది తర్వాత గొర్రెల పంపిణీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రెండో విడత గొర్రెల పంపిణీ ఉగాది, శ్రీరామనవమి పండగల తర్వాత చేపడతామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. గొర్రెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పథకం యూనిట్ వ్యయాన్ని కూడా పెంచుతామన్నారు. ఆదివారం సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, కురుమ సంఘం భవన నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో గొల్ల, కురుమల ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం గొల్ల, కురుమలను వాడుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.2 వేల కోట్లతో సరిపెట్టి, బీసీలకు అన్యాయం చేస్తోందని హరీశ్ విమర్శించారు. కురుమ సామాజిక వర్గంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవని, కల్యాణలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఈ బాల్యవివాహాలు బంద్ అయ్యాయన్నారు. రాష్ట్రంలో గొల్ల, కురమలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక మాజీ మంత్రి రేవన్న సీఎం కేసీఆర్‌ను కలిసి గొంగడి కప్పి అభినందించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ విషయంలో రేవన్నకు ఏఐసీసీ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. సభలో ఎంపీలు బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, హెచ్‌డీసీ రాష్ట్ర చైర్మన్ చింతప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గొల్ల కుర్మ సంఘం నేతలు నగేశ్, శ్రీహరి, పాండు తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలు: ‘తూర్పు’లో ఉగాదికి రెడీ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉగాది పండగ నాటికి లబ్ధిదారులను శాశ్వత గృహ యజమానులుగా మార్చేందుకు, తద్వారా వారి కుటుంబాల్లో పండగ సంతోషాన్ని సంపూర్ణంగా నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యాన్ని ఉగాదికి ఒక రోజు ముందే అధిగమించే ఏర్పాట్లలో జిల్లా అధికారులు తలమునకలవుతున్నారు. జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న పేదల ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కాలనీల్లో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను పూర్తి చేస్తున్నారు. మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేక బృందంగా ఏర్పడి గృహ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇల్లు కట్టుకోలేని వారికి అవగాహన కల్పించి, నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుండటంతో లబ్ధిదారులు సైతం ముందుకు వస్తున్నారు. ఉగాదికి 6,319 గృహ ప్రవేశాలు పేదలకు శాశ్వత నివాసం కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1.46 లక్షల మందికి ఉచితంగా ఇంటి పట్టాలు పంపిణీ చేసింది. వీటిలో తొలి దశలో రూ.113.48 కోట్లతో 63 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మరికొన్నింటిలో లబ్ధిదారులు గృహప్రవేశాలు సైతం చేసుకున్నారు. మిగిలిన వాటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఉగాది నాటికి 6,318 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికార యంత్రాంగం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,211 ఇళ్ల పనులు వంద శాతం పూర్తయ్యాయి. మిగిలిన 5,107 నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి మండలంలో హౌసింగ్ అధికారులు, తహసీల్దార్లు ప్రత్యేక బృందంగా ఏర్పడి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి వసతికి బోర్లు తవ్వుతున్నారు. తాగు, ఇతర అవసరాలకు నీటిని సమకూరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన కాలనీల్లో నివసించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. అనపర్తి, బిక్కబోలు, తొర్రేడు, చాగల్లు, కొవ్వూరు కృష్ణారావు చెరువు, కడియం, దామిరెడ్డిపల్లి, నిడదవోలు వైఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయి. జగనన్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం కల్పించే పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 755 కాలనీల్లో రూ.411 కోట్ల అంచనాతో పనులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో సైతం అధునాతన విధానం అవలంబిస్తున్నారు. మూడు పెద్ద లే అవుట్లు అయిన కొమరగిరి, వాకలపూడి (కాకినాడ), వెలుగుబంద (రాజానగరం) జగనన్న కాలనీల్లో ప్రయోగాత్మకంగా భూగర్భ విద్యుత్ సరఫరాకు కార్యాచరణ సిద్ధమైంది. ప్రతి వారం లబ్ధిదారులతో ముఖాముఖి ఉగాది నాటికి గృహప్రవేశాలకు ముమ్మర కసరత్తు చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. మిగిలినవి కూడా వేగవంతం చేసేందుకు ప్రతి శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతున్నాం. ఏవైనా సమస్యలుంటే చెప్పాలని కోరుతున్నాం. ఇల్లు కట్టుకుంటే బిల్లు సకాలంలో వస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైతన్యం తీసుకువస్తున్నాం. ఉగాది నాటికి అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి గృహప్రవేశాలు చేపడుతాం. జిల్లాలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 13,019 ఇళ్లకు విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. – కె.మాధవీలత, కలెక్టర్ లక్ష్యాన్ని అధిగమిస్తాం ఉగాది నాటికి ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణాల లక్ష్యాన్ని అధిగమిస్తాం. జిల్లా వ్యాప్తంగా 6,318 గృహప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఇప్పటికే 1,211 పూర్తి చేశాం. మిగిలినవి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రత్యేక హౌసింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ లబ్ధిదారులను చైతన్యపరుస్తున్నాం. – జి.పరశురాం, ఇన్చార్జి హౌసింగ్ పీడీ -
సంక్రాంతికి కాదు.. ఉగాదికి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఉగాది నాటికి సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. దీంతో సంక్రాంతి వేళ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవం సందిగ్ధంలో పడింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దాని ప్రారంభోత్సవంపై అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. ఆ దిశగా ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ►సంక్రాంతి నాటికి ప్రారంభం అన్నట్టుగా తనిఖీల సందర్భంలో ముఖ్యమంత్రి సూచించటం, సంక్రాంతికి ప్రారంభించనున్నట్టు మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొనటంతో అధికారులు పనుల్లో వేగం పెంచుతూ వచ్చారు. కానీ.. ప్రధాన భవన నిర్మాణం పూర్తయినా, భవనం లోపల వసతులు కల్పించే పనులు, డ్రైనేజీ, టెలిఫోన్, లైటింగ్, ఏసీ, నీటి పైప్‌లైన్.. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ పూర్తి కాలేదు. దీంతో ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించే పరిస్థితి లేదు. ఒకవేళ సంక్రాంతికి ప్రారంభించాలన్న అభిప్రాయంతోనే సీఎం ఉంటే, దానికి ఆటంకం కలగకుండా అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ప్రారంభోత్సవం అంటూ నిర్వహిస్తే, ఆ కార్యాలయంలోనే పూజ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఆ పూజా కార్యక్రమానికి సంబంధించి కూడా అధికారికంగా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. భవనం పూర్తి స్థాయిలో సిద్ధం కావటానికి మరో రెండు నెలల సమయం పడుతుందని, ఉగాది నాటికి అన్ని పనులూ పూర్తయి ప్రారంభించేందుకు వీలుగా సంసిద్ధమవుతుందంటూ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ మంత్రికి విన్నవించారు. ఒకవేళ సంక్రాంతి వేళ పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆదేశిస్తే, సీఎం కార్యాలయంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో సీఎం కార్యాలయం సిద్ధం కాగా, సీఎస్ కార్యాలయంలో ఆయన ఛాంబర్ వరకు పూర్తయింది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు సీఎస్ కార్యాలయంలో భాగంగా నిర్మిస్తున్న హాలు సిద్ధం కాలేదు. గత దసరాకు ప్రారంభించాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశించినప్పటికీ, భవనం పూర్తి కాకపోవటంతో అది కుదరలేదు. అప్పట్లో సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడూ సిద్ధం కాకపోవటంతో మళ్లీ ఉగాదికి మారింది. దాదాపు 3 వేల మంది కార్మికులు, ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో రాత్రింబవళ్లూ పనిచేస్తున్నా, భారీ నిర్మాణం, అనుబంధంగా ఎన్నో ఏర్పాట్లు ముడిపడి ఉండటం, ఇటీవల ఫార్ములా ఈరేసింగ్ కోసం ఆ ప్రాంగణంలోని కార్మికుల వసతి తొలగించడంతో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లాల్సిన పరిస్థితితో కొంత ఇబ్బంది ఏర్పడటం.. ఇలా రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది. లుంబినీపార్కు ఎదురుగా ప్రధాన ద్వారం.. కొత్త సచివాలయం ప్రధాన ద్వారం లుంబినీ పార్కు ఎదురుగా నిర్మితమవుతోంది. తెలంగాణ రాకముందు ఇక్కడే ప్రధాన ద్వారం ఉండేది. వాస్తుపరంగా అదే కుదరటంతో ఇప్పుడు అక్కడే ఆర్చితో కూడిన ప్రధాన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ ఇందులో నుంచే సచివాలయంలోకి ప్రవేశిస్తుంది. మూడు దిశలు.. నాలుగు ప్రవేశ ద్వారాలు.. కొత్త సచివాలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం తూర్పు దిశలో లుంబినీకి ఎదురుగా రానుండగా, ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు ఉన్న గేటు వద్ద ఉద్యోగుల ప్రవేశ ద్వారం నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం బిర్లామందిరం వైపు రోడ్డులో ఉన్న పౌరసరఫరాల శాఖ పెట్రోలు బంకును తొలగించారు. దాన్ని సికింద్రాబాద్ ఆర్.పి.రోడ్డులోకి మారుస్తున్నారు. తొలగించిన పెట్రోలు బంకు ఉన్న ప్రాంతంలో సందర్శకుల కోసం గేటు నిర్మిస్తున్నారు. దానికి తెలుగుతల్లి ఫ్లైఓవర్ దిగువ కూడలి నుంచి నేరుగా ఓ రోడ్డు నిర్మించారు. వాస్తుపరంగా మూడు ద్వారాలు ఉండటం సరికాదన్న ఉద్దేశంతో, భవనం వెనకవైపు మింట్ దిశలో నాలుగో ద్వారాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని అత్యవసర ద్వారంగా వాడతారు. అత్యవసర పరిస్థితిలో తప్ప సాధారణ రోజుల్లో దాన్ని వినియోగించరు. -
'అప్పటి వరకు ఇబ్బందులు తప్పవు.. రాబోయే రోజుల్లో మరిన్ని చావులు'
హుబ్లీ: కార్తీకమాసం నుంచి ఉగాది వరకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవని ధార్వాడలో కోడి శ్రీ మఠం స్వామీజీ జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరి వరకు, ఆ తర్వాత కూడా అశుభాలే ఉంటాయన్నారు. గాలి వానలు, భుకంపాలు, అగ్నిప్రమాదాలు, చావులు వంటివి పెరుగుతాయన్నారు. రోగాలతో జీవరాశులు మృత్యువాత పడుతాయన్నారు. రాజకీయ అస్థిరత ఉంటుందని, అన్ని పార్టీలు విడిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. మూడు పార్టీల్లో చిలికలు తప్పవన్నారు.తాను ఏ వ్యక్తినీ ఉద్దేశించి చెప్పడం లేదని, తాను సన్యాసినని పేర్కొన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగుతాయని, రబీ పంటలు అన్నదాతకు చేతికందుతాయన్నారు. చదవండి: (బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..) -
హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకల్ని ఆన్లైన్ వేదికగా నిర్వహించింది. ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కన్నుల విందుగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి ప్రారంభించగా, శాంతి మోగంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఉగాది వేడుకలను ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ గరదాస్ జ్ఞానేశ్వర్ తో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. -
దిగ్విజయంగా కొనసాగిన శ్రీమద్ భాగవత సప్తాహం
సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వారం రోజులపాటు "శ్రీమద్ భాగవత సప్తాహం" కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఉగాది రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగపూర్ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సమాపణోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, టీటీడీ పూర్వ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ వారం రోజులపాటు కార్యక్రమంలో వేర్వేరు తేదీలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధాన నిర్వాహకులు రత్న కుమార్ కవుటూరు, నీలం మహేందర్, ఊలపల్లి భాస్కర్, మరియు రాంబాబు పాతూరి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, రమేష్ గడప తదితరులు డాక్టర్ మేడసాని కి ఇతర అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియజేసి ప్రపంచ నలుమూలల నుండి తెలుగువారందరూ కలసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవసిన ఆవశ్యకత ఉందన్నారు. -
టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు
డల్లాస్ (టెక్సాస్): శ్రీ శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ 2022 ఏప్రిల్ 2వ తేదీని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర పత్రికా ప్రకటన విడుదల చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివశిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితో మమేకమవుతూ విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాలలో తెలుగువారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అన్నారు. తెలుగు వారికున్న క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల గౌరవం, వృత్తిపట్ల నిభద్దత, విద్య పట్ల శ్రద్ధ ఇతరులకు ఆదర్శప్రాయం అన్నారు. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆ అధికారిక ప్రకటనలో పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ టెక్సాస్ రాష్ట్రంలో చిరకాలం గా నివశిస్తున్న తెలుగు వారి పట్ల టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. ఉగాది పండుగ వేడుకల్లో గవర్నర్ సతీమని సిసీలియా కూడా మమేకమయ్యారని తెలిపారు. అంతేకాకుండా ఉగాది రోజుని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు. -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాది న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం మరియు విశేషపూజలతో పాటు,మహాగణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి వార్లకు అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో పాటు శ్రీవారి కళ్యాణోత్సవానికి ఏప్రిల్ 2 స్థానిక సెరంగూన్ రోడ్‌లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా,గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు. కళ్యాణోత్సవానంతరం శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సింగపూర్‌లో నిర్వహించిన వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీవారి కళ్యాణోత్సవానికి సింగపూర్ న్యాయ, హోం అఫ్ఫైర్స్ శాఖ మంత్రి కె షణ్ముగం సన్నిధిలో ఆశీస్సులు పొందారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగువారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు , కోవిద్ నిబంధనల మేరకు సింగపూర్ తెలుగు సమాజం గత రెండు సంవత్సరాలలో ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించ లేకపోయిందని, ఎంతో కాలం తరవాత ఉగాది పండగ సందర్భంగా అందరినీ ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉందని అన్నారు. అలానే ఈ ఉగాది నాడు సుమారు 4000 మందికి సింగపూర్ లోనే అరుదుగా లభించే వేపపువ్వు అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ని ప్రత్యేక ప్యాకెట్ రూపం లో సుమారు 5000 మందికి పైగా అందించామని తెలియచేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తి. తి. దే. కార్యవర్గ సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారి సహాయ సహకారాలతో కళ్యణోత్సవం లో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూ ప్రసాదం, వడ, అభిషేక జలం, తలంబ్రాలు మరియు వస్త్రాలు అందచేసామని తెలిపారు. కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు,దాతలకు, ప్రతి ఒక్కరికీ కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్నగారి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు, వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన మరియు లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు. -
వినువీధుల్లో ఉల్కాపాతం కనువిందు
ఆసిఫాబాద్/కోటపల్లి/రెబ్బెన: ఉగాది రోజు శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉల్కాపాతం కనువిందు చేసింది. ఆదిలాబాద్ జిల్లా తాంప్సీ, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి మీదుగా సుపాక, ఆలుగామ గ్రామం వైపు మహారాష్ట్రలోని తేకడా గ్రామం వరకు ఉల్కలు జారిపడ్డాయి. కుమ్రుంభీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్, వాంకిడి, బెజ్జూర్, రెబ్బెన మండలాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దులోని పలువురు ప్రజలు ఉల్కాపాతాన్ని వీక్షించారు. తోకచుక్కల మాదిరి ఉల్కలు భూమి మీదకు దూసుకు వస్తుండడంతో కొందరు సెల్ఫోన్లతో చిత్రీకించారు. నిప్పులు కక్కుతూ ఉల్కలు నేలరాలినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఉల్కాపాతం పడుతుందని టీవీ చానళ్లలో, సోషల్ మీడియాల్లో వార్తలు రావడంతో గ్రామస్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ
ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో విజేతల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. . ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా, అబు ధాభి. హాంగ్ కాంగ్, సింగపూర్, ఐర్లాండ్, భారత దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. విజేతలకు నిర్వాహాకులు అభినందలు తెలిపారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి ఉత్తమ కథానిక విభాగం విజేతలు 1) “మరో కురుక్షేత్రం”- పాణిని జన్నాభట్ల (బోస్ట్‌న్, ఎంఏ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) ‘‘ధారావాహిక హత్యలు” –నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్ (టాంపా, ఫ్లోరిడా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “భూలోక స్వర్గం” – డా. కె. గీత (మోర్గాన్హిల్, కాలిఫోర్నియా, ప్రశంసా పత్రం) 4) “ఆట – పోరు”- తాడికొండ కె. శివకుమార శర్మ, (గ్రేటర్ వాషింగ్టన్, డీసీ, ప్రశంసా పత్రం) ఉత్తమ కవిత విభాగం విజేతలు 1) “ఈ రాత్రికి సౌత్ ఆఫ్రికా” -గౌతమ్ లింగా (జోహెన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా) ($116 నగదు పారితోషికం) 2) “ఏమంటేనేం?”- స్వాతి శ్రీపాద (డెట్రాయిట్, మిచిగాన్, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఒంటరి సాయంత్రాలు”- రవి మంత్రిప్రగడ (డబ్లిన్, ఐర్లాండ్ ప్రశంసా పత్రం) 4) “పువ్వు” - సతీష్ గొల్లపూడి (ఆక్లాండ్, న్యూజీలాండ్, ప్రశంసా పత్రం) “నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు 1) “క్రైమ్ నెవెర్ పేస్” – వీకేవీ ప్రసాద్ (హైదరాబాద్, ఇండియా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “రెండు నిమిషాలు- అమృత వర్షిణి (లోన్ట్రీ, యూఎస్ఏ) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఆడ పిల్ల”- షేక్ షబ్బర్ హుస్సేన్ (కడప, ఏపీ) ప్రశంసా పత్రం "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు 1) “భూమిని హత్తుకునే క్షణాలకోసం”- అసిఫా గోపాల్ (నెల్లూరు, ఏపీ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “తను వెళ్ళిపోయింది”- రాజు గడ్డం (కడవిపల్లి గ్రామం, ఇండియా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “శిల-కల”- ఆవుల కార్తీక (హైదరాబాద్) ప్రశంసా పత్రం -
ఉగాదికి తెలుగు లోగిళ్ల ముస్తాబు
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగకు తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా పాల్గొననున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.50 గంటల వరకు ఉగాది కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వివిధ వేద పాఠశాలల విద్యార్థుల మంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలుకుతారు. 10.42 గంటలకు పంచాంగ శ్రవణం అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉగాది క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పంచాంగకర్తలతో పాటు వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులను సీఎం సన్మానించనున్నారని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అర్చకులు, వేద పండితులకు సన్మానం ఉగాది పండుగ సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులతో పాటు వేద పండితులను ఘనంగా సన్మానించనుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో 62 ఏళ్లకు పైబడిన ముగ్గురు ఆర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించనున్నారు. సన్మాన గ్రహీతలకు రూ.10,116 సంభావన, కొత్త వస్త్రాలను కలెక్టర్ల చేతుల మీదుగా అందజేస్తారు. ఇందుకు గాను దేవదాయ శాఖ ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. మరో వైపు రాష్ట్రంలోని అన్ని పెద్ద ఆలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఆ సందర్భంగా ఆ సమీపంలో ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే ఇద్దరు అర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని.. -
శ్రీ శుభకృతు నామ సంవత్సరం రాశి ఫలితాలు
-
ఉగాది 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
డొల్లు కర్తరీ ప్రారంభం: 04–05–2022, రా.12:04లకు అనగా (05/05) శుభకృత్‌నామ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం మృగశిరా నక్షత్రం రోజున రవి భరణి నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశించడంతో డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం: 11–05–2022, రా.10:04లకు శుభకృత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి బుధవారం ఉత్తరఫల్గుణీ నక్షత్రం రోజున రవి కృత్తికలో ప్రథమపాదంలో ప్రవేశించడంతో పెద్దకర్తరీ ప్రారంభం అవుతుంది. ‘మృద్దారు శిలాగృహకర్మాణి వర్జయేత్’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించడానికి కర్తరీకాలం సరైనది కాదు. పై సూత్రం ఆధారంగా దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంఖుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, పైకప్పు నిర్మాణ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. కర్తరీ పూర్తి (త్యాగం): 29–05–2022, ఉ.7:37లకు వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం కృత్తికా నక్షత్రం రోజున రవి రోహిణి నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశించడంతో కర్తరీకాలం పూర్తవుతుంది. మూఢమి వివరములు శుక్ర మూఢమి: (15–09–2022 నుంచి 1–12–2022 వరకు) మూఢమి ప్రారంభం: 15–9–2022 శుభకృత్ నామ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి గురువారం రోజున శుక్రుడు రవి నుండి ప్రాగస్తం (అనగా తూర్పుదిశగా అస్తమించడం వలన) మూఢమి ప్రారంభం అయినది. మూఢమి అంత్యం: 1–12–2022 మార్గశిర శుద్ధ అష్టమి రోజున శుక్రుడు రవి నుండి పశ్చాదుదయం (అనగా పశ్చిమ దిశగా ఉదయించడం) వలన మూఢమి పూర్తవుతుంది. నోట్: మూఢమికి ముందు కొన్ని రోజులు గ్రహాలకు వృద్ధత్వం అని పేరు. మూఢమి తరువాత బాలత్వం అని పేరు. ఆ రోజులలో శుభకార్యములు చేయరాదు. మకర సంక్రాంతి పురుష లక్షణమ్: 14–01–2023, రా.గం.2:14లకు (ఘ.49–01) స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్య మాసం బహుళ సప్తమి తత్కాల అష్టమి శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం చిత్తా నక్షత్రం రెండవ పాదం కన్యారాశి సుకర్మయోగం బాలవకరణం తులాలగ్నం సమయంలో రవి మకరరాశి ప్రవేశం. సూ.ఉ.6:38. సూ.అ.5:40. దినప్రమాణం 27:36. -
ఉగాది 2022: నవనాయక ఫలితాలు (2022– 2023)
రాజు – శని శని రాజు అయిన సంవత్సరంలో విచిత్ర వర్షాలు కురిసి పంటలు సామాన్యంగా ఫలిస్తాయి. రాజక్రోధం అధికమై యుద్ధాలు, చోరభయం కలుగుతాయి. రెండవ పంటలు, పర్వత పంటలు బాగా పండుతాయి. ధరలు సరిగా ఉండవు. స్వల్పవర్షాలు కురుస్తాయి. జనులు కపట స్వభాంతో సంచరిస్తారు. అధర్మమార్గంలో నడుచుకుంటారు. తక్కువస్థాయి ప్రజలు సుఖపడతారు. ఇది సహజ శని లక్షణం. అయితే శని స్వక్షేత్ర సంచారి కావడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. రాజవాహన ఫలములు అశ్వం రాజవాహనం– భూకంపాది ఉపద్రవాలు. రాజయుద్ధం, వర్షాభావం, పంటలు తగ్గడం, ఆహార ధాన్యాల కొరత, ధాన్యాదుల ధరలు పెరుగుదల, దుర్భిక్షం, జనహాని, ధనహాని కలుగుతాయి. మంత్రి–గురు గురువు మంత్రిగా ఉన్న సంవత్సరం అధిక ధాన్యపంటలు, సంపదలు, అధిక వర్షాలు, వృక్షాలు, çపంటలు బాగా ఫలిస్తాయి. భూమి గోకులంలా ఉంటుంది. సువృష్టితో భూమి సస్యసంపూర్ణమవుతుంది. భూమి సంపూర్ణ జలాలతో ఉంటుంది. రాజులు సమరోత్సాహం చూపుతారు. గ్రంథాతర వచనం: గోవులు అధిక క్షీరములు ఇచ్చును. ధాన్యము బాగా ఫలించును. క్షేమ, ఆరోగ్య, సుభిక్షములు కలుగును. సేనాధిపతి–బుధ మేఘాలకు వాయుబాధ ఎక్కువై కష్టంతో వర్షిస్తాయి. సస్యాలు కూడా దానికి తగినట్లుగానే ఫలిస్తాయి. ప్రజలు కామాచార పరాయణులై ఉంటారు. సస్యాధిపతి – రవి సూర్యుడు పూర్వ సస్యాధిపతి కావడం వల్ల ఈతిబాధలతో పూర్వ సస్యములు పీడింపబడును. ఉలవలు, శనగలు, కందులు, వేరుశనగ, ఎర్రధాన్యములు, మిర్చి, వక్కలు సమృద్ధిగా ఉత్పత్తి అయి ధరలు తగ్గి ఉంటాయి. తక్కిన ధాన్యములకు ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి ధరలలో ఒడిదుడుకులు ఉంటాయి. అని ఇతర గ్రంథ వచనం. ధాన్యాధిపతి –శుక్రుడు అతివృష్టి సుభిక్షము మంచి పంటలు ప్రజలకు ఆరోగ్యము లభించును. అర్ఘాధిపతి–బుధుడు మంచి వర్షాలు కురుస్తాయి. ధరలు బాగుంటాయి. మంచి పంటలు పండుతాయి. పాషండులు, ఇంద్రజాలికులు, యువకులు దుçష్టులుగా పెరుగుతారు. మేఘాధిపతి –బుధుడు మేఘగర్జనలు పిడుగుపాటులు గాలితో కూడిన వర్షములు వచ్చును. మధ్య దేశమునందు మంచి వర్షము వచ్చును. సర్వత్ర మధ్యస్థాయి వృష్టి సస్యములుండును అని గ్రంథాంతరము. రసాధిపతి – కుజుడు కుజుడు రసాధిపతిగా ఉన్నప్పుడు జీలకర్ర, ఉప్పు, నెయ్యి, తైలము, బెల్లము మొదలగునవి ధరలు పెరగవు. నీరసాధిపతి – రవి : రత్నములు మణులు చందనము వెండి, బంగారము, రాగి మొదలగు ధాతు లోహములకు ధరలు తగ్గును. రాష్ట్ర, రాజ, ప్రజాక్షోభములు జననాశము జరుగునని గ్రంథాంతర వచనము. -
వేపకూ ‘ఉగాది’
సాక్షి, హైదరాబాద్: వేప చెట్లు మంచు ముత్యాలతో నిండినట్టు తెల్లటి పూతతో కళకళలాడుతున్నాయి. చైత్రమాసం ముంగిట ఇలా ఇవి కొత్త శోభను సంతరించుకోవటం సహజం. కానీ, ఈసారి దీనికో ప్రత్యేకత ఉంది. సరిగ్గా 4 నెలల కిందట వేప పరి స్థితి వేరు. ఉంటుందా లేదా అన్నంత ప్రమాదంలో పడిందా వృక్ష జాతి. కానీ.. నిలువెల్లా ఔషధ గుణాలను ఇముడ్చుకున్న వేప భయంకరమైన శిలీంద్ర దాడిని ఎదుర్కొంది. చిగుళ్లు, ఆకులు, కొమ్మలు.. క్రమంగా వాడి, ఎండిపోతూ చెట్టు నిలువెల్లా మాడిపోయే పరిస్థితిని అధిగమినించింది. చైత్రం ముంగిట ఆ చెట్టుకు మరో‘ఉగాది’ప్రారంభమైంది. కొత్త సంవ త్సరం వేళ షడ్రుచుల ఉగాది పచ్చడిలో తన ప్రత్యేకతను నిలుపుకొనేందుకు సిద్ధమైంది. పూతతో పునరుజ్జీవ కళ ఫోమోస్సిస్ అజాడిరక్టేగా పిలిచే డై–బ్యాక్ వ్యాధి వేపను ప్రభావితం చేసింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వేపకు సోకిన ఈ వ్యాధి తెలంగాణలో గతేడాది ఆగస్టులో ప్రవేశించింది. తొలుత గద్వాల ప్రాంతంలో రిపోర్టు అయింది. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పాకి నవంబర్ చివరి నాటికి ఉధృతమైంది. గాలిద్వారా ప్రబలిన ఈ శిలీంద్రం దాదాపు అన్ని వేపచెట్లకు సోకింది. కొమ్మల చివర్లలో ప్రారంభమై క్రమంగా చెట్టు అన్ని ప్రాంతాలకు పాకుతూ ఆకులు మాడిపోయేలా చేసింది. శాస్త్రవేత్తలు దీనిని అతితీవ్ర వ్యాధిగా గుర్తించారు. దీంతో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వం దృష్టికి తెచ్చి, వెంటనే దాని నివారణకు పిచికారీ చేయాల్సిన మందులను సూచించింది. కానీ స్వతహాగా కీటక నాశని లక్షణాలున్న వేప.. జనవరి చివరి నాటికి శిలీంద్ర ప్రభావా న్ని తగ్గించుకోగలిగింది. వాతావరణంలో వచ్చి న మార్పులతో శిలీంద్రం క్రమంగా బలహీనపడింది. దీంతో పుంజుకున్న వేప మరొకసారి నిండుగా పూత పూసి పునరుజ్జీవ కళను సంతరించుకుంది. చనిపోయిన చెట్లు ఒక శాతంలోపే.. డై–బ్యాక్‌కు గురైన వేప చెట్లు క్రమంగా పుంజుకుని పూర్వ వైభవానికి చేరుకుంటున్నాయని, ఇప్పట్లో వాటికి మళ్లీ ప్రమాదం ఉండకపోవచ్చని అగ్రి వర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. డై–బ్యాక్‌కు గురైన చెట్లలో దాదాపు ఒక శాతం చెట్లు డిక్లైన్ (క్షీణత) బారినపడ్డట్టు గుర్తించారు. వాటిల్లో దాదాపు 0.7 శాతం చెట్లు ఈపాటికే చనిపోయాయని, మిగతావి కూడా కోలుకునే పరిస్థితి ఉండకపోవచ్చని వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. డై–బ్యాక్‌కు గురై కోలుకునే చెట్లకు కావాల్సిన పోషకాలు సకాలంలో అందాల్సి ఉంటుంది. కానీ చెట్ల చుట్టూ నీటిని పీల్చుకునేందుకు అవాంతరం కలిగించేలా కాంక్రీట్ చేసి ఉండటం, మురికినీరు నిరంతరం చుట్టూ నిలిచి ఉండటం లాంటివి చెట్లు చనిపోవటానికి ఎక్కువ కారణమవుతున్నాయని గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. పరీక్షల్లో కానరాని శిలీంద్రం.. వేప డై–బ్యాక్‌కు గురైన సమయంలో చాలా ప్రాంతాల నుంచి చెట్ల నమూనాలు సేకరించి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ల్యాబ్‌లో కల్చర్ టెస్టులు నిర్వహించారు ఇందులో చాలా రకాల శిలీంద్రాలు గుర్తించా రు. కానీ నాలుగైదు రకాలు ఎక్కువగా ఉన్న ట్టు తేలింది. ఇప్పుడు శిలీంద్రాన్ని జయించిన చెట్ల నుంచి మళ్లీ నమూనాలు సేకరించి వారం కింద మళ్లీ పరీక్షించారు. ఈసారి వాటిపై శిలీంద్రాల అవశేషాలు కనిపించలేదని పేర్కొన్నారు. పూత పూర్తిగా సురక్షితమే శిలీంద్ర ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో వేపపై పిచికారీ చేయాల్సిన రసాయనాలను మేం సూచించాం. కానీ ఇప్పుడు వేప పూర్తిగా కోలుకుంది. దాని పూత కూడా పూర్తిగా సురక్షితమే. ఉగాది పచ్చడిలో నిరభ్యంతరంగా వినియోగించొచ్చు. ఈ సమయంలో వేపచెట్లపై పురుగుమందుల పిచికారీ చేయకూడదు. అది పర్యావరణం, ఇతర జంతువులపై ప్రభావం చూపుతుంది. – జగదీశ్వర్, అగ్రి వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకులు -
సంస్కృతీ వటవృక్షాన్ని రక్షించుకోవాలి
ఉగాది పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. తెలుగు నూతన సంవత్సరాదిగా పిలుచుకునే ఈ రోజున... జీవితంలో ఎదు రయ్యే వివిధ రకాల అను భవాలకు ప్రతీకగా భావించే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసుకుని తినే ఆచారం ఉంది. ఇందులో కారం, పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు రుచులు ఉంటాయి. ఈ పచ్చడి తినడం... ఒక రకంగా పర్యావరణానికి ఇచ్చే గౌరవమే. ఇందులో వాడే ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదించిన చెట్ల నుంచి వచ్చిన పదార్థమే. ఇప్పుడు ఇందులో చేదును ప్రసా దించే వేప చెట్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘అజారక్టా ఇండికా’ అనే శాస్త్రీయ నామం కలి గిన వేప చెట్టును పురాణాలలో లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్పారు. ఈ భూమి మీద ఎక్కువగా మన దేశంలోనే కనిపించే చెట్టు వేప. ఈ ఆకులలో 150 రకాల విశి ష్టమైన రసాయనాల సమ్మేళనం ఉంది. పురాతన కాలం నుంచి వేపను వివిధ అవసరాలకు, చికిత్సలకు వాడుతున్నారు. వేప చెట్టు వేర్ల నుంచి చిగుర్ల వరకూ అన్ని భాగాలనూ భారతీయులు ఉపయోగించుకుం టున్నారు. ఆయుర్వేద వైద్యంలో వేపకు ఎంతో ప్రాధాన్యం వుంది. పేగుల్లో పురుగులు, మొలలు, దురదలు, దద్దుర్లు, పచ్చకామెర్లు, అల్సర్లు, అతి మూత్ర వ్యాధి; తామర, కుష్ఠు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు; జ్వరం, మలేరియా, రక్త సంబంధ వ్యాధులను తగ్గించడానికి ఈ వేప చెట్టు ఎంతో ఉపయోగకారి. మనదేశంలో దంతధావనం ఎక్కు వగా వేప పుల్లతోనే చేయడం మనకు తెలిసిన విష యమే. అతి ప్రాచీన కాలం నుంచీ పంటపొలాలకు వేప పిండి, వేప నూనెలను ఎరువుగా, కీటక నాశినిగా వాడుతున్నారు. మన సంప్రదాయ వ్యవసాయంలో వేప విడదీయరాని భాగం. ఇంతటి విశిష్టత కలిగిన ఈ వేప చెట్టు మనుగడ ప్రమాదంలో పడింది. గత రెండు మూడు సంవత్సరా లుగా వేపచెట్లు తరచుగా ఎండిపోతున్నాయి. చాలా చోట్ల కూలడమూ కనిపిస్తోంది. ముఖ్యంగా తెలం గాణ, రాయలసీమ ప్రాంతాలలో ఇటీవల ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. గత మూడు నాలుగు సంవ త్సరాల క్రితం గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం ప్రత్యేక అధ్యయనం చేసింది. బాగా ఎదిగిన వేపచెట్లపై ‘లొరాంథస్’ అనే పరాన్న మొక్క ఎదగ డమే ఇందుకు కారణమని గుర్తించారు. భారీగా ఎదిగిన వేప చెట్లను ఆసరా చేసుకుని ఎదిగే ఈ లొరాంథస్ వేప చెట్టులో ఉండే నీటితో పాటు లవణాలు, పోషకాలను పీల్చుకుంటుంది. ఫలితంగా వేప చెట్టు ఎండిపోయి కూలిపోతుంది. అయితే వేపచెట్లపై ఈ లొరాంథస్ను గుర్తించిన వెంటనే, చెట్టును మొత్తం కొట్టేయకుండా, అది ఉన్న కొమ్మను నరికివేయడం ద్వారా మిగతా చెట్టుకు వ్యాపించ కుండా కాపాడవచ్చునని అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. అయితే ఇటీవల కొద్ది నెలలుగా ‘డిపాక్ డిసీజ్ ఆఫ్ నీవ్ు’ అని వ్యవహరించే మరో వ్యాధితో వేప చెట్లు చనిపోవడం వెలుగు చూసింది. ఈ వ్యాధి నుంచి కాపాడాలంటే వైరస్ సోకిన కొమ్మలను కత్తరించి కాల్చివేయడం, అలాగే చెట్టుకు ఎక్కువ నీరు పోయడం వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నగరీకరణ వల్ల కాంక్రీట్ నిర్మాణాలు రావడం వల్ల చెట్టు కాండం వరకూ నిర్మాణాలు జరపడంతో చెట్టు వేర్లకు అందాల్సిన నీరు, పోషకాలు తగినంత అందకపోవడం వల్ల కూడా చెట్లు అంతరిస్తున్నాయి. ఎంతో విలువైన ‘వేప చేదులోని తియ్యదనాన్ని’ భావి తరాలకు అందించడానికి ప్రభుత్వాలు వేపచెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. మోతె రవికాంత్ వ్యాసకర్త ‘సెఫ్’ వ్యవస్థాపక అధ్యక్షులు మొబైల్ : 94919 24345+ -
Ugadi 2022: షడ్రుచుల ఉగాది
-
ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వాటి గురించి పిల్లలకు తెలుసా!
ఉగాది సమయం ఆ వేప పూత ఆ మావి వగరు ఆ చింత చిగురు ‘పదిగ్రాముల వేపపూత 200 రూపాయలు’... ఆన్లైన్లో చూసి కొనేంతగా ఎదిగాం. ప్రకృతితో కలిసి చేసేదే పండగ... ఉగాది వేళలో మావిచిగురు కోకిల పాట... గాలికి ఊగే వేపపూత... ఈకాలపు పిల్లలకు తెలియని దూరానికి చేరాం. గతంలో వేప చెట్టు, మావిడి చెట్టు... ప్రతి వీధిలో ఉండేవి. ఇప్పుడు? పండగ హడావిడికి సిద్ధమవుతున్నాం. ప్రకృతి స్తబ్దతను గమనిస్తున్నామా? ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వేపచెట్టు. వేపపువ్వు చేదుకి. మామిడి చెట్టు. మామిడి పిందె వగరుకి. చింతచెట్టు. పులుపు రుచికి. కొన్నిచోట్ల కొబ్బరి కోరు వేస్తారు. అంటే కొబ్బరి చెట్టు. మరికొన్ని చోట్ల బాగా మగ్గిన అరటిపండు ముక్కలు కలుపుతారు. అంటే అరటి చెట్టు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఇళ్లల్లో ఉన్నాయి. పిల్లలు ఎంతమంది వీటిని తాకి చూస్తున్నారు. ఎందరు వీటి నీడలో ఆడుతున్నారు. ఎందరు వీటిని చూశాం అని చెబుతున్నారు. నగరం అయినా.. పట్టణం అయినా.. పల్లె అయినా. ఆ వేప కొమ్మలు... చెట్టు పెంచడం మన ఆచారం. చెట్టుతో పాటు ఇల్లు ఉండాలనుకోవడం మన సంస్కృతి. ప్రతి వీధికి వేప చెట్టు అరుగు ఉండేది. వీధిలోని ఒకటి రెండు ఇళ్ల వాళ్లయినా ముంగిలిలో వేప చెట్టు వేసుకునేవారు. కొన్ని చెట్లు పెరిగి పెద్దవై ప్రహరీగోడను కప్పేసేవి. చెట్ల కొమ్మలు ఇంటి వైపుకు వాలి నీడను పెంచేసేవి. పిల్లలు రాలిన వేప ఆకులు తొక్కుకుంటూ ఆడుకునేవారు. పసుపుపచ్చటి వేపపండ్లు తుంచి వగరు తీపితో ఉండే వాటి రుచిని చూసేవారు. వాటి గింజలను గుజ్జును పారేసి ఖాళీ డిప్పలలో పుల్లను గుచ్చి ఆడుకునేవారు. వేణ్ణీళ్లలో వేపాకులను కలిపి తల్లులు స్నానం చేయిస్తుండేవారు. నెలకు ఒకటి రెండుసార్లు లేత వేపాకులను నూరి చిన్ని ముద్దలను చేసి చక్కెర అద్ది మింగించేవారు. దడుపు చేస్తే, జ్వరం వస్తే వేప మండలు దిష్టి తీసి నెమ్మది కలిగించేవారు. వేపపుల్లతో పళ్లుతోమడం అలవాటు చేసేవారు. వేపబద్దతో నాలిక గీసుకోవడం ఆరోగ్యం. ఉగాది పండగ రోజు వేపపూత పిల్లల చేతే కోయించేవారు. వేప బెరడుకు బంక కారితే పిల్లలు దానిని గిల్లి సీసాల్లో దాచుకునేవారు. వేప కాండంపై పాకే గండు చీమలు, గెంతుతూ వెళ్లే ఉడతలు, కొమ్మల్లో గూడు పెట్టే కాకులు, ఇంట్లో కోళ్లు పెంచుతుంటే గనక అవి ఎరిగి రాత్రిళ్లు ఆ కొమ్మలపైనే తీసే నిద్ర... పండగలో చెట్టును పెట్టింది చెట్టును కాపాడుకోమని. ప్రకృతిని తెలుసుకోమని. ఇవాళ పెద్ద చెట్లు వేస్తున్న ఇళ్లు ఎన్ని? పెద్ద చెట్లకు వీలైన స్థలం ఎక్కడ దొరుకుతోంది? పూల కుండీలు, మిద్దెతోట... సర్దుబాటు జీవనం... రెక్కలు సాచిన విశాలమైన వృక్షాలు గత చరిత్రగా మారాయి. ఆ మామిడి పిందెలు... మామిడి చెట్టు ఉన్న ఇంటికి మర్యాద జాస్తి. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వచ్చి మామిడి ఆకులు అడుగుతారు. ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే ‘ఆ మామిడి చెట్టున్న ఇల్లు’ అని చెబుతారు. మామిడి చెట్లు చాలామటుకు శుభ్రంగా ఉంటుంది. వాటి గుబురు ఆకులను చూస్తే ఆనందం కలుగుతుంది. వచ్చిన బంధువులంతా ‘ఏ మామిడి’ అని ఆరా తీస్తారు. బంగినిపల్లో, బెంగుళూరో, నీలమో, నాటు మామిడో... ఏదో ఒక జవాబు చెప్పాలి. పిల్లలు మామిడి కొమ్మలకు తాళ్లు కట్టి ఊయల ఊగుతారు. చిన్న కొమ్మలపై ఎక్కి కూచుంటారు. వేసవి వస్తే ఒళ్లంతా విరగబూసే మామిడి పూత మీద అందరి కళ్లు పడతాయి. పిందెల వేస్తున్నప్పటి నుంచి దిష్టి తగలకుండా యజమానులు నానా పాట్లు పడతారు. ఉండుండి పాడిగాలి వీచి పిందె రాలితే అదో బాధ. కోతుల దండు ఊడి పడితే వాటిని తరిమికొట్టే వరకూ గాబరా. కాయ గుప్పిటంత పెరిగాక కోసి పచ్చడి చేస్తే ఆ రుచి అద్భుతం. ఉగాది పచ్చడి మన ఇంటి కాయ తెచ్చే రుచి అద్భుతం. చిటారున గుబురులో పండిన కాయ పిల్లలు నిద్ర లేచి చెట్టు కిందకు వెళితే రాలి కనపడుతుంది. కోయిలలు వచ్చి పాట పాడి పిల్లలను బదులివ్వమంటుంది. చిలుకలు పండిన కాయలను సుష్టుగా భోం చేసి ఎర్ర ముక్కులు చూపించి పోతాయి. మామిడి చెట్టు ఉంటే ఇంట్లో ఇంకో మనిషి ఉన్నట్టే. కాని కారు పార్కింగ్ కోసం ఆ చెట్టును వదిలేసిన ఇళ్లే ఇప్పుడు. పిల్లలూ... మామిడిపండ్లను మీరు మోర్ మార్కెట్స్‌లోనే చూడక తప్పదు. చింతచెట్టు కథలు జాస్తి... చింతచెట్టు ఇంట్లో పెంచరు. ఆ చెట్టు ఊరిది. ప్రతి ఊళ్లో చింతచెట్టు అరుగు ఉంటుంది. అది మనుషులు కూడా తమ చింతలు మాట్లాడుకునేంత గాఢమైన నీడను కలిగి ఉంటుంది. వేసవి మధ్యాహ్నాలు చింత చెట్టు కింద పట్టే నిద్ర సామాన్యంగా ఉండదు. చింతకాయలు కాస్తే పిల్లలు వాటిని రాళ్లతో రాల్చి నోట పెట్టుకుంటారు. ఆడవాళ్లు దోటీలు పట్టుకుని వచ్చి చింత చిగురు కోసి వండుతారు. ఊరికి కొత్తగా ఎవరైనా వస్తే చింత చెట్టు ఆరా తీస్తుంది. గూడు లేని వాళ్లకు రాత్రిళ్లు అది ఇల్లు అవుతుంది. కాని చింత చెట్టు అంటే భయం కూడా ఉంటుంది. దెయ్యాలు దానిలో టూ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుని ఉంటాయని పుకార్లు ఉంటాయి. చింతచెట్టు కింద పడుకున్నవారి గుండెల మీద రాత్రుళ్లు దెయ్యం కూచుంటుంది. చింతచెట్టుకు రాత్రిళ్లు కార్బన్ డై ఆక్సైడ్ విడిచే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్లే తగిన ఆక్సిజన్ అందక ఈ భ్రాంతులు. చింతచెట్టు లేని బాల్యం చాలా బోసి. కొంగలు వాలడానికి ఇష్టపడే చెట్టు అది. ఇవాళ ఊళ్లలో ఫ్లెక్సీలు ఉన్నాయి. విగ్రహాలు ఉన్నాయి. చింత చెట్టు మాత్రం లేదు. ఆలోచించాలి అందరం... గతంలో ఎన్నో ఇళ్ల పెరళ్లలో అరటి చెట్లు ఉండేవి. చాలా ఇళ్లల్లో కొబ్బరి చెట్లు వేసేవారు. బాదం చెట్లు పెంచే ఇళ్లకు లెక్క ఉండేది కాదు. చెట్టుకు వదిలాకే కట్టుబడికి స్థలం వదిలేవారు. కట్టేది ఒక ఇల్లయితే చెట్టు నీడ ఒక ఇల్లు అని ఆ కాలంలో తెలుసు. కాని ఇవాళ కాంక్రీట్ ఇళ్లు మాత్రమే కట్టి వేడి పెంచుతున్నాం. ఎండ మండుతోందని అవస్థలు పడుతున్నాం. ఉగాది అంటే చెట్లకు ప్రాభవ సమయాలు ఉన్నట్టు బతుకుకు కూడా ప్రాభవ సమయాలు ఉంటాయని తెలుసుకోవడం. తీపిని ఆస్వాదించడంతో పాటు చేదును మింగాలని తెలుసుకోవడం. తుఫానొచ్చి కొమ్మలు విరిగి పడినా మళ్లీ చిగురించవచ్చని తెలుసుకోవడం. చెట్టుకు పిల్లల్ని దూరం చేయవద్దు. బాల్యాన్ని అరుచితో నింపొద్దు. ఆలోచించండి. కొత్త ఉగాదికి ఆహ్వానం పలకండి. -
Fashion: ఉగాదికి ఓణీ... తక్కువ ఖర్చుతోనే ఇలా అందంగా!
కాలం మంచితనంతో నేసిన ఆనందాలే మన వేడుకలు. నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు వేసే చోట.. సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలంటే మన చేనేతలతో మరింత కొత్తగా సింగారించుకోవాలి ఏడాది పొడవునా ఇంటింటా శుభాలు నిండాలి. తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి మన చేనేతలు. హైదరాబాద్ మేడ్చల్‌లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ తరుణి సిరిగిరి వేడుకలలో లంగా– ఓణీ చేనేత హంగామా గురించి ఇలా అందంగా పరిచయం చేస్తున్నారు. ‘‘సాధారణంగా వేడుకల్లో లెహంగా డిజైన్స్ భారీ ఫ్లెయిర్, నెటెడ్ మెటీరియల్‌తో చూస్తుంటాం. కానీ, ఇది వేసవి కాలం. ఈ సీజన్‌కి తగ్గట్టు మన అలంకరణ కూడా ఉంటే రోజంతా సౌకర్యంగా ఉండటంతో సందర్భాన్ని మరింతగా ఆనందిస్తాం. పచ్చని సింగారం కంచిపట్టు సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్ ఒక రంగు కాంబినేషన్ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్ కలర్ వాడతారు. ఇక్కడ పచ్చదనం మరింతగా హైలైట్ అవడానికి బ్లౌజ్, దుపట్టా రెండూ ఒకే రంగులో ఉన్నవి ఉపయోగించాను. ఇష్టమైన ఇకత్ ప్లెయిన్ ఇకత్ ఫ్యాబ్రిక్‌ను లెహంగాకు తీసుకున్నప్పుడు బార్డర్ లేకపోతే ఎలా అని ఆలోచిస్తారు. అందుకే, అంచుభాగాన్ని ఎంబ్రాయిడరీ చేసి, ఈ లెహెంగాను డిజైన్ చేశాను. అలాగే, బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదేరంగు ఇకత్తో డిజైన్ చేసి, కాంట్రాస్ట్ ఓణీని వాడాను. ఇది ఏ సంప్రదాయ వేడకకైనా అమ్మాయిలకు ఎవర్గ్రీన్ కాన్సెప్ట్ అవుతుంది- తరుణి సిరిగిరి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ భామకు గొల్లభామ తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్ మెటీరియల్ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహెంగా, దీని మీదకు కలంకారీ దుపట్టాను ఉపయోగించాను. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్ని పార్టీవేర్‌గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్ అనిపించే ఫ్యాబ్రిక్స్‌ని కూడా భిన్నమైన లుక్ వచ్చేలా హైలైట్ చేసుకోవచ్చు. గ్రాండ్‌గా గద్వాల్ పట్టు వివాహ వేడుకల్లో అమ్మాయి అలంకరణ గ్రాండ్‌గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్‌ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్‌తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. పెద్ద అంచు ఉన్న గద్వాల్ పట్టుతో డిజైన్ చేసిన లంగా ఓణీ కాంబినేషన్ ఇది. – ఎన్.ఆర్ -
అనకాపల్లి నూకాంబిక ఆలయంలో కొత్త అమావాస్య పూజలు
-
సింగపూర్‌లో తొలిసారిగా శ్రీమద్ భాగవత సప్తాహం
సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ సాంస్కృతిక పరివారంల సంయుక్తంగా ఉగాది పండగని పురస్కరించుకుని పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ చేతుల మీదుగా శ్రీమద్ భాగవత సప్తాహాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 2022 ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీరోజు సాయంత్రం 4:30 గంటలకు (సింగపూర్‌టైం రాత్రి 7 గంటలకు) శని, ఆదివారాల్లో రాత్రి 10:30 గంటలకు (సింగపూర్ టైం మధ్యాహ్నం ఒంటిగంట) వర్చువల్‌గా ఈ వేడుకలు నిర్వహిస్తారు. యూట్యూబ్, ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
ఏప్రిల్ 2న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం కొలిక్కి వస్తోంది. వారం రోజుల్లో తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారులు కార్యాలయాలను గుర్తించారు. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది రోజున (ఏప్రిల్ 2) లాంఛనంగా ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలకు కలెక్టర్, ఒక జేసీ, ఎస్పీని ప్రభుత్వం నియమించనుంది. రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. పోలీస్ శాఖలోనూ విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్థిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేస్తోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల పేర్లు మార్పు, కొన్ని మండలాల జిల్లాల మార్పులు వంటి అంశాలను ప్రభత్వుం పరిశీలిస్తోంది. చదవండి: (కాలిఫోర్నియా టు అనాతవరం.. సొంతూరిలో సాఫ్ట్వేర్ కంపెనీ) -
ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఉగాది నాటికి తొలివిడత నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. ఏప్రిల్ 2న ఉగాది పండుగ జరుపుకోనుండగా, మరో రెండువారాల్లోగా తొలి విడత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 27 ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దశలవారీగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా 30 వేల నుంచి 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఎక్కువ మంది ఈ మెగా ఉద్యోగమేళాలో భాగం పంచుకోవాలన్న ఉద్దేశంతో విడతలవారీగా ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం. ఒకేసారి 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడం వల్ల ఇబ్బందులుంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కాగా, వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగ ఖాళీల సమాచారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గురువారంనాటికి 10 ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించాయి. హోం, వైద్యారోగ్య, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. హోంశాఖలో 18,334 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 12,755, పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు కొన్ని మార్పులను సూచించగా ఒకటి రెండు రోజుల్లో ఆ శాఖల నుంచి తుది ప్రతిపాదనలు మళ్లీ ఆర్థిక శాఖకు అందనున్నాయి. సీఎం సూచనలు అందిన వెంటనే జీవోలు సీఎం కేసీఆర్ నుంచి సూచనలు అందిన వెంట నే శాఖల వారీగా తొలివిడత పోస్టుల భర్తీకి పరిపాలనాఅనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుంది. ఆ వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా నియామక సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారంలో ఎక్కడా తేడా రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్లో ఎలాంటి తప్పులు రాకుండా తగిన చర్యలు చేపట్టారు. తొలివిడత నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ రెండువారాల్లో పూర్తి కానుందని, వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్లు రావచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.. ఉగాది ఉత్తమ రచనల పోటీ
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి. ప్రధాన విభాగంలో భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుంచి అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నారు. కథలు, కవితల విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చు. బహుమతిగా 116 డాలర్లు అందిస్తారు. యూనికోడ్ ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించాలి. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. చేతివ్రాతలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదిస్తారు. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు. ఏప్రిల్ 1న విజేతల వివరాలు 2022 ఏప్రిల్ 1న ఉగాది పండుగ రోజు లేదా అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం. 2022 మార్చి 15లోగా ఎంట్రీలు పంపాలి. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణ కి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి. కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. ఆసక్తి ఉన్న వారు తమ రచనలను sairacha@gmail.com, vangurifoundation@gmail.com ఈమెయల్ చేయగలరు. -
కొత్త జిల్లాలకు ముహూర్తం ఖరారు.. సీఎం వైఎస్ జగన్ ఆర్డర్స్
-
ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత
-
ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మహామహోపాధ్యాయ, పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాస బిరుదాంకితులు, ప్రముఖ పురాణ వేదశాస్త్ర పండితులు, ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న చంద్రశేఖర శాస్త్రి స్వస్థలం గుంటూరు జిల్లా క్రోసూరు. ఆయనకు భార్య సీతారామ ప్రసన్నలక్ష్మి, ఆరుగురు కుమారులు రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఇద్దరు కుమార్తెలు ఆదిలక్ష్మి, సరస్వతి ఉన్నారు. చంద్రశేఖర శాస్త్రి భాతిక కాయానికి శనివారం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లాది కన్నుమూతపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి చంద్రశేఖర శాస్త్రి మరణంపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలను అవపోసన పట్టిన మహా పండితుడు ఆయనని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా బాధించింది: కిషన్‌రెడ్డి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం చెందడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా బాధించిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
అమెరికా: జార్జియాలో తెలుగుకు దక్కిన ఖ్యాతి
అట్లాంటా: తెలుగు జాతి, సంప్రదాయం ప్రపంచ పటంపై వెలుగుతోంది. తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తెలుగుకు అద్భుతమైన గుర్తింపు లభించింది. అక్కడ అధికారికంగా తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జార్జియా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీ ఉగాది సందర్భంగా ఆ రోజును తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలుగువారి సేవలను జార్జియా ప్రభుత్వం ప్రశంసించింది. దాంతోపాటు తెలుగు సంప్రదాయం, భాష బాగుంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా నార్త్ స్టెయిర్స్ ఆఫ్ జార్జియాలో జరిగిన ఉగాది వేడుకలో తెలుగు వారికి దానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని అధికారులు అందించారు. జార్జియాలో తెలుగువారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వైద్యులు, ఇంజనీర్లుగా జార్జియా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 500 మంది అక్కడి విద్యా రంగంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా ఉన్నారు. భారతదేశ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూనే తెలుగు వారుగా గుర్తింపు పొందుతున్నారు. ఏప్రిల్ 12వ తేదీని తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తించి ఆ రోజు పాటలు, ఆటలు, సాహిత్య పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. -
లండన్ లో ఘనంగా ఉగాది వేడుకలు
లండన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలను 24 ఏప్రిల్ 2021న ఘనంగా జరుపుకున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా తొలిసారి అంతర్జాలంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గేయరచయిత భువనచంద్ర హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా సింగర్ ఎస్పీ శైలజ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తాల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోగా, ఎంపీ సీమ మల్హోత్రా యూకేలో తాల్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖచిత్రంతో ఉన్న తాల్ ‘మా తెలుగు’వార్షిక సంచికను విశిష్ట అతిథులుగా ప్రముఖ రచయిత కాళిపట్నం రామారావు, సాహితివేత్త ఓలేటి పార్వతీశం ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి హేమ మాచర్ల సంపాదకీయం వహించిన ఈ సంచిక విడుదలకు సూర్య కందుకూరి మరియు తాల్ వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి సహకరించారు. ఆద్యంతం సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో, లండన్ లోని తెలుగువారే కాదు, తెలుగురాష్ట్రాల్లోని కళాకారులు అదిరే అభి, సినీ గాయకులు సాకేత్ కొమండూరిమరియు సాహితి చాగంటి, లండన్ ఆర్ జె శ్రీవల్లి, పేరడిగురుస్వామి, 4 లెగ్స్ కిరణ్, ఇమిటేషన్ రాజు వారి వారి ప్రదర్శనలతో అలరించారు. సురభి డ్రామా థియేటర్ వారి మాయాబజార్ నాటకం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాల్ కల్చరల్ సెంటర్ విద్యార్థులుప్రదర్శించిన భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు పద్యాలు అందరినీ అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో గాన గంధర్వుడు అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి తాల్ నివాళులు అర్పించింది. యూకేలోని తెలుగు గాయకులతో ఎస్ పీ శైలజ కలిసి ఎస్ పీ బాలు పాటలతో ఎస్ పీబికి స్వరాభిషేకం చేసారు. యూకే వైద్య మరియు కీలక రంగాల్లో సేవలందిస్తున్న తెలుగు వారికి ధన్యవాదాలు తెలుపుతూ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమానికి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ వేడుకల్లో తాల్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనగా, చైర్మన్ భారతి కందుకూరి తెలుగు వారి అందరికి ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, తాల్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. అలాగే ఈ వేడుకలను ఇంత వైభవముగా నిర్వహించిన కన్వీనర్లు వెంకట్ నీల, విజయ్ బెలిదే మరియు వారి బృందంని అభినందించారు. తాల్ ట్రస్టీలు కిషోర్ కస్తూరి, నవీన్ గాదంసేతి, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్ పుట్లూర్, అనిల్ అనంతుల, అనిత నోముల, ఈ కార్యక్రమ విజయానికి కారకులయిన కళాకారులు, చిన్నారులు, సహాయ సదుపాయాలు అందించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్ ట్రస్టీ అనిత నోముల మాట్లాడుతూ మే 15న ప్రారంభం అయి 3 నెలల పాటు జరిగే తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) గురించి వివరించి, అందరూ పాల్గొని యూకే తెలుగు క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. సుమారు ఎనిమిది గంటలపాటు సాగిన ఈ కార్యక్రమాన్నివివిధ అంతర్జాల మాధ్యమాలలో అంతరాయం లేకుండా నిర్విరామంగా పనిచేసిన తాల్ సాంకేతిక బృంద కీలక సభ్యులు వంశీ మోహన్ సింగులూరి, కిరణ్ కప్పెటలను తాల్ సభ్యులందరూ కొనియాడారు. అన్ని వయసుల వారిని అలరించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా అయిదు వేల మందికి పైగా వీక్షించారు. -
అంగరంగ వైభవంగా.. విశ్వవ్యాప్తంగా ప్లవ నామ ఉగాది
న్యూ యార్క్ : ప్రపంచ సాహిత్య చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, (తానా)సాహిత్య విభాగం – తానా ప్రపంచ సాహిత్య వేదికనిర్వహణలో - "ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం - 21" భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 10 వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 11ఉదయం 9 గంటల వరకు 25 గంటల పాటు అంతర్జాల దృశ్య సమావేశం నిర్విరామంగా,అపూర్వంగా జరిగింది. ప్లవ నామ ఉగాది పర్వదిన సందర్భంగా భారత దేశం, అమెరికా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లోని, 21తెలుగు సంఘాలనుండి 246 మంది కవులు, పండితులు, సాహితీప్రియులు,యువతీ యువకులు అత్యంత ఉత్సాహంగా ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు కళ్యాణి ద్విభాష్యం, ప్రముఖ గాయని లక్ష్మి భావజలు శ్రావ్యంగాగానం చేసిన “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన సందేశంలో – తానా సంస్థ తెలుగు భాషా సంస్క్రుతలకు ప్రాధాన్యమిస్తూ 21 దేశాల్లోని, 21 సంస్థలతో ప్రపంచ మహాకవి సమ్మేళనం నిర్వహించడం ఆనంద దాయకమని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న, వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తానా అధ్యక్షులుతాళ్ళూరి జయ శేఖర్ మాట్లాడుతూ "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తెలుగు భాష అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఇంతటి బృహత్ అక్షర యజ్ఞం తలపెట్టటం జరిగింది. మాతృభాషలోనే మన నాగరికత, ఉనికి ఇమిడి ఉన్నాయి. భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని" పిలుపునిచ్చారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం వివిధ అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం లో సాహిత్య సమావేశాలను, మరి కొన్ని ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలను జరుపుకుంటున్నామని, కాని ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకోవడం ఇదే మొదటిసారని, విశ్వ వ్యాప్తంగా ఈ సాహితీ యజ్ఞంలో పాల్గొంటున్న తెలుగు సంఘాల అధ్యక్షులకు, భాషాభిమానులకు, వీక్షకులకు ఘన స్వాగతం పలికారు. 25 గంటల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ ప్రపంచ మహాకవి సమ్మేళనం వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్నిర్వహణలో ఆద్యంతం అతి వైభవంగా జరిగింది.తానా మహిళా విభాగం సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల కావలసిన సాంకేతిక సహకారాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లబ్ద ప్రతిష్టులైన కవులు, పండితులు తమ కవితలతో ఆద్యంతం అలరించారు. ఒక్కో దేశానికి ఒక్కో గంట సమయం కేటాయించబడి ఆగంటలో ఆ దేశానికి సంబంధించిన కవులతో కవిసమ్మేళనాలు నిర్వహించబడ్డాయి. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ శ్రీ జి. చంద్రయ్య, విశిష్ట అతిథిగా మహా సహస్రావధాని బ్రహ్మ శ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్ హాజరై తెలుగు భాషా వైభవాన్ని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రసంగించారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా పద్మ భూషణ్ డా. కె. ఐ. వర ప్రసాద్ రెడ్డి హాజరై “నూతన పదకోశ అభివృద్దే భాషా పరిరక్షణకుమూలమని, ఆదిశగా అందరూఆలోచించాలని" అన్నారు.విశిష్ట అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి, ప్రత్యేక అతిధులుగా హాజరైన ప్రముఖ పాత్రికేయులు జాస్తి విష్ణు(ఈనాడు), కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), దిలీప్ రెడ్డి (సాక్షి) హాజరై భాషాభివృద్దికి విలువైన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు: శ్రీ సాంస్కృతిక కళా సమితి- సింగపూర్; మలేషియా తెలుగు సంఘం- మలేషియా; హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య- హాంకాంగ్; తెలుగు కళా సమితి – ఒమన్; తెలుగు కళాసమితి – ఖతర్; తెలుగు సంఘాల ఐక్యవేదిక – కువైట్; సౌదీ తెలుగు అసోసియేషన్- సౌదీ అరేబియా; తెలుగు కళా సమితి – బెహ్రైన్; తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా - సౌత్ ఆఫ్రికా; తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోట్స్వానా; నైజీరియా తెలుగు సంఘం – నైజీరియా; ఫ్రాన్స్ తెలుగు సంఘం – ఫ్రాన్స్; ఫిన్‌ల్యాండ్ తెలుగు సంఘం – ఫిన్లాండ్; డెన్మార్క్ తెలుగు సంఘం – డెన్మార్క్; నార్వే తెలుగు సంఘం – నార్వే; నార్తర్న్ ఐర్లండ్ తెలుగు సంఘం- నార్తర్న్ ఐర్లండ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – యూకే; తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్ లాండ్- స్కాట్ లాండ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజీల్యాండ్ – న్యూజీల్యాండ్; తెలుగు మల్లి – ఆస్ట్రేలియా; తెలుగు అసోసియేషన్ ఆఫ్ చైనా – చైనా; అమెరికా, మరియు భారతదేశం. వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేసిన యాజమాన్యాలకు, కార్యవర్గసభ్యులకు, తెలుగు సంఘాల అధ్యక్షులకు, పాల్గొన్న సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు ,తెలుగులోఉగాది శుభాకాంక్షలు
-
ఉగాది స్పెషల్ పోస్టర్లు: ఫిదా అంటున్న సినీ లవర్స్
ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆరగిస్తూ ఆ పోస్టర్లేంటో చూసేద్దాం.. ఆయుధమైనా ...అమ్మాయి అయినా ... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. #Acharya ఉగాది శుభాకాంక్షలు!!@AlwaysRamCharan @sivakoratala @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sW24eo5FJl — Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2021 ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది అంటూ ఆచార్య నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ పూజా హెగ్డే కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 13న థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. Ugadi wishes to you and your family ! Stay safe ... take care #Lovestory@sai_pallavi92 @sekharkammula@SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic @niharikagajula pic.twitter.com/lkpmupZ1TM — chaitanya akkineni (@chay_akkineni) April 13, 2021 నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం లవ్‌స్టోరీ. ఉగాది రోజు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా బాట పట్టింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. Looking forward to another fun schedule with the team 🙌! #HappyUgadi#F3Movie#F3OnAug27th@IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official pic.twitter.com/uby6jO2enY — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 పండగ రోజు కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాం అంటున్నారు ఎఫ్ 3 యూనిట్ సభ్యులు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఓ రేంజ్లో ఉంటుందని చెప్తున్న ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. #HappyUgadi from Team #Thimmarusu.. Get ready for an entertaining thriller in theatres from May 21!@ActorSatyadev#PriyankaJawalkar @actorbrahmaji @ActorAnkith@smkoneru @nooble451 @SharanDirects@EastCoastPrdns@SOriginals1 @vamsikaka @SricharanPakala @MangoMusicLabel pic.twitter.com/yNTva0xdSW — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి సత్యదేవ్ లుక్‌ను రిలీజ్ చేశారు. చిక్కుముడులను విప్పేందుకు తీక్షణంగా ఆలోచిస్తున్నట్లున్న కనిపిస్తున్న ఈ లుక్ ఉగాది పచ్చడిలా బాగుందంటున్నారు సినీ లవర్స్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 21న విడుదల కానుంది. Hope this Ugadi brings you peace & abounding happiness ! Let's stay safe while we celebrate the day with our loved ones 🙏#Narappa pic.twitter.com/SxtIuVqQRf — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 కుటుంబంతో కలిసి బయటకు పయనమయ్యాడు నారప్ప. ఇంతకుముందు ఉగ్రరూపంలో కనిపించి భయపెట్టిన వెంకటేశ్ ఇందులో మాత్రం ఫ్యామిలీమ్యాన్‌గా ఆకట్టుకున్నాడు. Ugadi wishes from the team of #VirataParvam pic.twitter.com/LVfzsevt8W — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2021 సాయి పల్లవి అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం. ఉగాది పర్వదినాన స్పెషల్ పోస్టర్‌తో విందు భోజనం పెట్టింది చిత్రయూనిట్. సాయిపల్లవి కడప మీద ముగ్గు వేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రానా దగ్గుబాటి నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతోంది. Baadshah @KicchaSudeep’s #K3Kotikokkadu Team Wishing everyone a #HappyUgadi Dubbing works are on full Swing, Release in Kannada&Telugu simultaneously!@ArjunJanyaMusic @MadonnaSebast14 @shraddhadas43 #ShivaKarthik @thegcgofficial @shreyasgroup @anandaudioTolly @Mymoviebazaar pic.twitter.com/o73wH0tMz4 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం కే3 కోటికొక్కడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు సుదీప్. డబ్బింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయంటోంది చిత్రయూనిట్. అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!!#TuckJagadish #HappyUgadi@NameisNani @riturv @aishu_dil @IamJagguBhai @DanielBalaje @ShivaNirvana @MusicThaman @praveenpudi @sahugarapati7 @harish_peddi @sahisuresh @Shine_Screens @adityamusic pic.twitter.com/HfT4JUHdRK — BARaju (@baraju_SuperHit) April 13, 2021 ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేసింది టక్ జగదీష్ టీమ్. ఇందులో నేచురల్ స్టార్ నాని సకుటుంబ సపరిమేతవారంగా పండగ వేడుకలు జరుపుకుటున్నట్లుగా ఉంది. అందరూ నవ్వులు చిందిస్తోన్న ఈ లుక్ నాని ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన టక్ జగదీష్‌ను కరోనా వల్ల వాయిదా వేశారు. ఉగాది శుభాకాంక్షలతో త్వరలో మీ ముందుకు వస్తున్నాము! Team #Seetimaarr wishes everyone #HappyUgadi 🌿@YoursGopichand @tamannaahspeaks @SS_Screens #ManiSharma @DiganganaS @bhumikachawlat @adityamusic @_apsara_rani @soundar16 @actorrahman @TarunRajArora pic.twitter.com/iVQZxg1qlb — Sampath Nandi (@IamSampathNandi) April 13, 2021 గోపీచంద్ సిటీమార్ నుంచి మాస్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఐదుగురు ఆడవాళ్లు బైక్ నడుపుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఇది ఊరమాస్‌గా ఉందంటున్నారు నెటిజన్లు. అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!#SonofIndia🇮🇳 #HappyUgadi pic.twitter.com/kCMO7bidPT — Mohan Babu M (@themohanbabu) April 13, 2021 సన్ ఆఫ్ ఇండియా నుంచి మోహన్‌బాబు లుక్‌ను రిలీజ్ చేశారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విష్ణు మంచ్ నిర్మిస్తున్నాడు. Thrilling Trilingual flick #Seethayanam movie Team wishes everyone a Happy Ugadi Here's the brand New Poster @akshith_sk @AnahitaBhooshan @DirPrabhakar #RohanBharadwaj #LalithaRajyalakshmi @padmanabhmusic @ColorCloudsEnt @LahariMusic @PulagamOfficial pic.twitter.com/ejlUqOaiML — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సీతాయణం నుంచి ఉగాది స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఉగాది శుభాకాంక్షలు 'మే' లో వస్తున్నాం @MeghamshSrihari @SamVegesna @RiddhiKumar_ @ItsMeghaC #RajendraPrasad @VegesnaSatish1 #MLVSatyanarayana @anuprubens@ShreeLyricist@rajeshmanne1 #LakshyaProductions #KothiKommachi pic.twitter.com/7s0ssBACvg — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మేలో వస్తున్నామంటున్న కోతి కొమ్మచ్చి.. సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టామంటున్న సర్కారు వారి పాట SuperStar @urstrulymahesh joins #SarkaruVaariPaata 2nd Schedule today with all necessary safety precautions 💥#HappyUgadi 😊@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/kerp3YcaL8 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Team #AndarubagundaliAnduloNenundali Wishes a Very Happy Ugadi ,Filled With laughter, joy and fulfilment! #HappyUgadi#Ali & @ItsActorNaresh #Mouryaani 🎬 : #SripuramKiran 🎼 : @RakeshPazhedam@SivaMallala @IamEluruSreenu pic.twitter.com/DBvbsaIIIV — BARaju (@baraju_SuperHit) April 13, 2021 అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!! Team #GullyRowdy wishes you A very Happy & safe Ugadi.#HappyUgadi@sundeepkishan @actorsimha #NehaHarirajShetty #GNageswaraReddy #RamMiryala @iamsaikartheek @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp @MangoMusicLabel pic.twitter.com/hHWtPiOcvZ — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు! - #101JillalaAndagadu #HappyUgadi#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda @DopRaamReddy @shakthikanth @bhaskarabhatla #KiranGanti #DilRaju @DirKrish @SVC_official @FirstFrame_Ent #Shirish @YRajeevReddy1 #JSaiBabu pic.twitter.com/f1Z4QDskIf — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Here's, the Captivating First Look Poster of #AadiSaiKumar's #BLACK 💥 Team #Black wishes everyone a Happy UGADI 🎋 Written & Directed : #GBKrishna Producer : #MahankaliDiwakar Music : #SureshBobbili DOP : #SatishMuthyala@IamEluruSreenu @dhani_aelay#HappyUgadi2021 pic.twitter.com/fOjTHgBd9x — BARaju (@baraju_SuperHit) April 13, 2021 #HappyUgadi from Team #HouseArrest!! 🎧 #FreeBirds ▶️ https://t.co/y9EjBrWr3L#HouseArrestOnMay7th@Sekhar_Dreamz @anuprubens @boselyricist @Chaitanyaniran @Niran_Reddy @AsrinReddy @Actorysr @IamSaptagiri @ChotaKPrasad @Yuvadop @Primeshowtweets @ARMusic2021 pic.twitter.com/cuNUpXyP1n — BARaju (@baraju_SuperHit) April 13, 2021 -
షడ్రుచులు దేనికి సంకేతం అంటే..
తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. మనవాళ్ళు.. ముఖ్యంగా మన తెలుగు వారు.. మామిడాకులతో తోరణాలు, రకరకాల రంగవళ్లులు, పిల్లల అల్లరి చేష్టలు, పెద్దల హడావుడి, కొత్త బట్టలతో ఇంచుమించు అందరి ఇళ్లు కళకళలాడుతూ ఉంటాయి. పల్లెటూళ్లలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఉగాది పండుగ రోజు నుంచి, శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఉగాది పండుగకే ప్రత్యేకంగా నిలిచేది ఉగాది పచ్చడి. షడ్రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ పచ్చడి మనిషి జీవితంలోని అనేక జ్ఞాపకాలకు ప్రతీక అని చెప్పవచ్చు. మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సంతోషం, బాధ, అవమానాలు అన్ని ఉంటాయి. వీటిన్నంటిని ఒక్కో రుచితో మేళవించారు పెద్దలు. షడ్రుచుల మిళితమైన శ్రేష్ట పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత కలదో.. ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణుల మాట. మన పుర్వీకులు గ్రంధాల్లో ప్రస్తావించిన ఆ షడ్రుచులు.. పేరు వినటమే గాని, ఆ రుచులేమిటో చాలా మందికి నిజంగా తెలియదు. ఇక ప్రస్తుత కాలంలో ఉగాది పచ్చడి కూడా నూతన పోకడలు పోతుంది. అసలు ఉగాది పచ్చడిని తయారు చేసే పదర్థాలు ఏవి అంటే బెల్లం, చింతపండు, మిరియాలు, వేప పువ్వు, ఉప్పు, మామిడి. ఈ పదార్థాలన్నింటిని కొత్త కుండలో కలిపి.. అచ్చమైన ఉగాది పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచులు దేనికి సంకేతం అంటే.. బెల్లం తీపి - ఆనందానికి సంకేతం ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు మిరియాలు - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు -
ఉగాది పండుగ వేళ.. యువతుల ఆనందహేల
-
ఉగాది... మార్కెట్లు కిటకిట
-
సాక్షి కార్టూన్ 13-04-2021
-
తెలంగాణ గవర్నర్, సీఎం ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాం క్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరూ పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవా లని ఆమె కోరుకున్నారు. ఈ ఉగాది తెలుగు వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరికీ మహమ్మారి రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారిని అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయం సాధించాలని ఆశించారు. ఈ నూతన సంవత్సరంలో అందరూ ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవనామ సంవత్సరం సందర్భంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సం వత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు చెబుతున్నాయని, తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందని సీఎం అన్నారు. కోటి ఎకరాలను మాగాణిగా చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలు అందుకుంటోందన్నారు. మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తోందన్నారు. రైతుల జీవితాల్లో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలను నింపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. -
ఉగాది సందర్భంగా ఘనంగా లేక్ ఫెస్టివల్ .. ఎక్కడంటే!
సాక్షి, సిద్దిపేటజోన్: ఉగాది పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు (మినీ ట్యాంక్‌బండ్)పై నేటి నుంచి ప్రారంభించనున్న లేక్ ఫెస్టివల్ (కోమటి చెరువు మహోత్సవం)కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు మున్సిపల్, పర్యాటకశాఖ, నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా 12న ఎకరం స్థలంలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద గ్లో గార్డెన్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఇందులో వన్యప్రాణుల ప్రతిమలు, వివిధ రకాల కృత్రిమ వృక్షాలను విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం వద్దనున్న మ్యూజికల్ ఫౌంటైన్ తరహాలో కోమటి చెరువుపైన ఓ ఫౌంటైన్‌ను 13న ప్రారంభించనున్నారు. 14న తెలంగాణ కళాకారులు, కవులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మూడ్రోజుల పాటు సాగే ఈ లేక్ ఫెస్టివల్‌కు కోమటి చెరువుపైన ఉన్న నెక్లెస్‌రోడ్డు, నీటిపై తేలియాడే వంతెన, అడ్వెంచర్ పార్క్, రాక్గార్డెన్లతో పాటు చెరువును విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. -
ఉగాది నాడు ఏం చేయాలో తెలుసా?
ఉగాది పండుగ మన పంచాంగం ప్రకారం మొదటి పండుగ. యుగప్రారంభాన్ని యుగాది అంటారు. ఈ యుగాది శబ్దం ఉగాది అనే కొత్త శబ్దాన్ని ఉత్పత్తి చేసింది. ఇక్కడ ఉగాది అంటే సంవత్సరానికి ప్రథమ దినం. మనకు నాలుగు యుగాలు ఉన్నాయి ఇవి చక్రంలా తిరుగుతూ ఒకదాని తరువాత వేరొకటి వస్తూ వుంటాయి. ఈ యుగాలు వరుసగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, చివరిది కలియుగం. ఇప్పుడు మనం కలియు గంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరంలో ఇప్పటివరకు ఇరవై ఏడు మహాయుగాలు జరిగిపోయాయి. ఇరవై ఎనిమిదవ యుగం జరుగుతోంది. ఈ మహాయుగంలో కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడచిపోయాయి. ఇప్పటికి కలియుగంలో 5120 సంవత్సరాలు పూర్తయ్యాయి. శార్వరి నామ సంవత్సరం సెలవు తీసుకుని13 ఏప్రిల్‌న శ్రీ ప్లవనామ సంవత్సరం ప్రవేశిస్తోంది. చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది పర్వదినం. కాలగమన సౌధానికి తొలి వాకిలి. ఋతు సంబంధ ప్రథమ ఆరోగ్యకోకిల గానం నూతన సంవత్సరానికి శ్రీకారం. ప్రజల మధ్య పెంపొందించే మమకారం. బహు సాంప్రదాయాలకు సాకార క్రియారూపం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలోఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఋతూనాం కుసుమాకరః– ఋతువుల్లో చెట్లు చిగిర్చి పూవులు పూయు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించు కుంటుంది. వసంత ఋతువు చైత్రమాసంతో మొదలవుతుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఉగాది నాడు ఏం చేయాలి? ఈనాడు మనమేం చేయాలో మన పెద్దలు నిర్దేశించారు. నూతన సంవత్సర కీర్తనలు చేస్తూ, తలంటు పోసుకుని నూతన వస్త్రాలు ధరించి, ధ్వజారోహణ చేయాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినాలి. వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు. దీని సేవనం వల్ల వాత, కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒకమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చేవరకు ఉంటుందని నమ్మకం. ఈ రోజు పంచాంగం వినాలి కాలగతిని లెక్కించడానికి చంద్రుని గమనాన్ని అనుసరించడం సులభమైన విధానం. అందువల్ల చైత్రమాసంలో కూడా శుద్ధపాడ్యమినే, అంటే చంద్రుడి కళలు వృద్ధి చెందడం మొదలయ్యే సమయమే ‘ఉగాది ’ అని కమలాకరభట్టు ప్రతిపాదించారు. ‘చతుర్వర్గ చింతామణి’ అను గ్రంథంలో బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజే మనం ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది అని ఆ గ్రంధకర్త హేమాద్రి పండితుడు తెలియజేసారు. అయితే ఈ పండుగ ఏ దేవుడి/దేవత ప్రీతి కొరకు చేస్తున్నాము, ఎవరిని ధ్యానించాలి? ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం పరమ ప్రయోజనం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది విశ్వ మానవ సౌభ్రాభృత్వాన్ని, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదని ఆకాంక్షిద్దాం. – గుమ్మా ప్రసాదరావు చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి -
రుచికరమైన షడ్రుచుల ఉగాది
పులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది. వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ.. ఉగాది పచ్చడి కావలసినవి: నీళ్లు – తగినన్ని; చింత పండు – తగినంత; చెరకు ముక్కలు – ఒక కప్పుడు; అరటి పండు – 2 (ముక్కలు చేయాలి); బెల్లం తరుగు – నీళ్లకు తగినన్ని; వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; మామిడి కాయ – 1 (ముక్కలు చేయాలి);ఉప్పు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేయాలి); మిరియాలు – 6 (పొడి చేయాలి) తయారీ: ►చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, పల్చ గా రసం తీసుకోవాలి ►ఒక గిన్నెలో చింతపండు రసం, తగినన్ని నీళ్లు, బెల్లం తరు గు, ఉప్పు వేసి గరిటెతో కలియబెట్టాలి ►శుభ్రం చేసి నీళ్లలో కడిగిన వేప పువ్వు, అరటి పండు ముక్కలు వేసి మరోమారు కలియబెట్టాలి ►సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, చెరకు ముక్కలు, పచ్చి మిర్చి వేసి బాగా కలిపి, చివరగా మిరియాల పొడి వేసి కలిపి, నివేదన చేసి, చిన్నచిన్న గ్లాసులలో ప్రసాదంగా అందించాలి. బెల్లం బీట్రూట్ అరటిపండు కేసరి కావలసినవి: బాగా ముగ్గిన అరటిపండు – 1; బీట్రూట్ ముక్కలు – అర కప్పు బొంబాయి రవ్వ – అర కప్పు; బెల్లం తురుము – కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; పాలు – అర కప్పు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు తయారీ: ►ముందుగా బీట్ రూట్ ముక్కలకు అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా తయారు చేసి, బీట్ రూట్‌ను గట్టిగా పిండి నీళ్లు వేరు చేసి పక్కన ఉంచాలి. ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి దోరగా వేయించాలి ►అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గుజ్జులా అయ్యేలా చేతితో మెదిపి, బాణలిలో వేసి బాగా కలపాలి ►పాలు జత చేసి బాగా కలిశాక, బీట్ రూట్ నీళ్లు పోసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ∙బెల్లం తురుము వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి నెయ్యి వేసి కలపాలి) ►చివరగా ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. అయ్యంగారి పులిహోర కావలసినవి: చింత పండు – 200 గ్రా; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; నువ్వుల నూనె – కప్పు; ఉప్పు – తగినంత పొడి కోసం: ధనియాలు – 3 టేబుల్ స్పూన్లు; మెంతులు – టీ స్పూను; ఎండు మిర్చి – 10; ఇంగువ – కొద్దిగా; అన్నం కోసం: బియ్యం – 4 కప్పులు; పోపు కోసం; మినప్పప్పు – 3 టీ స్పూన్లు; పల్లీలు – అర కప్పు; జీడి పప్పు – అర కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; నువ్వుల నూనె – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత తయారీ: ►రెండు కప్పుల వేడి నీళ్లలో చింతపండును సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడకూడదు) ►ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి ►చింత పండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి ►మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి ►మరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి ►ఒక ప్లేటులో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి ►ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలిపి, గంట సేపు అలా ఉంచేసి, ఆ తరవాత తింటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి పప్పు కావలసినవి: కంది పప్పు – కప్పు, పచ్చి మిర్చి – 10, టొమాటో – 1, చింత పండు రసం – టీ స్పూను, ఆవాలు – టీ స్పూను, ఎండు మిర్చి – 2, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – టేబుల్ స్పూను, ధనియాల పొడి – అర టీ స్పూను తయారీ ►ముందుగా కంది పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు కలపాలి ►మధ్యకు చీల్చి గింజలు తీసిన పచ్చిమిర్చి వేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన పప్పు వేసి బాగా మెదపాలి ►చింత పండు రసం, ధనియాల పొడి వేసి బాగా కలిపి, చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. మామిడికాయ నువ్వుపప్పు పచ్చడి కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2; నువ్వులు – కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – అర కప్పు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి ►వేరొక బాణలి లో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి ►వేయించి ఉంచిన మామిడి కాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది. వేప పువ్వు చారు కావలసినవి: వేప పువ్వు – 3 టీ స్పూన్లు; చింత పండు – కొద్దిగా; ధనియాల పొడి – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 4; పచ్చి మిర్చి – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – టీ స్పూను తయారీ: ►వేప పువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి ►చింత పండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి ►బాణలి లో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేసి వేయించాలి ►వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింత పండు రసం వేసి బాగా కలపాలి ►రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి. సేకరణ: పురాణపండ వైజయంతి -
మంత్రి ప్రకటన: 13వ తేదీనే ఉగాది
సాక్షి, హైదరాబాద్: ప్రతిసారి తెలుగు నూతన సంవత్సరం ఉగాది విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ఈసారి అలాంటిదేమీ లేకున్నా ఉగాది పండుగ విషయంలో మత్రం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈనెల 13వ తేదీన ఉగాది పండుగ చేసుకోవాలని మంత్రి ప్రకటించారు. ఆ రోజుల ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌లో గురువారం ఉగాది పండుగ నిర్వహణపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి కూడా ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన ఉగాది పర్వదినం పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి దేవస్థాన ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరిస్తామని వివరించారు. ఆరోజు ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. -
ఉగాదికి విద్యాశాఖ పోస్టుల భర్తీకి క్యాలెండర్
సాక్షి, అమరావతి: విద్యా శాఖలో ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టుల క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉగాది నాడు విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో మౌలిక వసతుల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుద ల చేయాలని సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారని చెప్పారు. వచ్చేనెల 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజులు చెల్లిస్తామన్నారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో ఈ పథకం నగదు జమ చేస్తామన్నారు. దీనివల్ల 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గతేడాదితో పోలిస్తే డిగ్రీ అడ్మిషన్లు 2.2 లక్షల నుంచి 2.7 లక్షలకు పెరిగాయన్నారు. ఆయన శుక్రవారం సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు విద్యార్థులకు ఉద్యోగా లు లభించేలా విద్యాబోధన చేయిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడే అటానమస్ కాలేజీలు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. అటానమస్ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందడం లేదు.. రాష్ట్రంలో పలు యూనివర్సిటీల పరిధిలో 109 అటానమస్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో సిల బస్, ప్రశ్నపత్రాల రూపకల్పనతోపాటు మూ ల్యాంకనం వంటివి అవే సొంతంగా చేపడుతు న్నాయి. దీనివల్ల నాణ్యమైన విద్య అందడం లేద ని గుర్తించాం. అంతేకాకుండా ప్రభుత్వ రాయి తీలు పొందుతూ.. అటానమస్ స్టేటస్‌ను అడ్డం పెట్టుకుని కొన్ని అక్రమాలకు పాల్పడుతు న్నాయి. ఇకపై అటానమస్ కాలేజీలు సొంతంగా ప్రశ్నపత్రాలు రూపొందించుకోవడం కుదరదు. వాటిలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్లే ఉద్యోగాలు రావడం లేదు. డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి అటానమస్ కాలేజీల్లో ఆడిట్ చేపట్టి, పరీక్ష విధానంలో సమూల మార్పులు తీసుకొస్తాం. ఇక నుంచి డిగ్రీ తరగతులకూ అప్రెంటీస్ విధానం అమలు చేస్తాం. ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర వర్సిటీలు, ఆర్జీయూకేటీ, జేఎన్టీయూ– కాకినాడ, అనంతపురంల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. -
ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు
ఏప్రిల్‌లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా? అయితే జాగ్రత్త. ఏప్రిల్‌లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే అని గుర్తుంచుకోవాలి. మీరు ఈ సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులను పూర్తీ చేసుకుంటే మంచిది. అలాగే, మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి మీ లావాదేవీలనుముందే ప్లాన్ చేసుకోవడం అవసరం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేయబడతాయి. ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి. ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు: ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 4: ఆదివారం ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు ఏప్రిల్ 10: రెండవ శనివారం ఏప్రిల్ 11: ఆదివారం ఏప్రిల్ 13: ఉగాది పండుగ ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 18: ఆదివారం ఏప్రిల్ 21: శ్రీరామ నవమి ఏప్రిల్ 24: నాల్గవ శనివారం ఏప్రిల్ 25: ఆదివారం చదవండి: క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాంకులు షాక్! -
2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లకు అవార్డులు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు వలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులతో ఉగాది రోజు నుంచి వారిని గౌరవించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. తన ఆత్మీయులుగా భావిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల చెల్లెమ్మలు, తమ్ముళ్ల సేవలకు గుర్తింపుగా ఇంకా ఏమి చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వలంటీర్ల సేవలను గుర్తిస్తూ వారిని సత్కరించే కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు ఇచ్చే ప్రసంశా పత్రం, మెడల్, బ్యాడ్జి, శాలువాలను ఆయన పరిశీలించారు. సేవలకు గుర్తింపుగా మూడు కేటగిరీల్లో మొత్తం 2,22,900 మంది గ్రామ, వార్డు వలంటీర్లను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు. ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజవర్గంలో వలంటీర్లకు అవార్డుల ప్రదానం, సత్కార కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో తాను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. కాగా, వచ్చే నెల 13వ తేదీన ఉగాది పండుగ రోజున రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు సత్కార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్షి్మ, గ్రామ, వార్డు సచివాలయాలు, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లెవల్–1 2,18,115 మంది వలంటీర్లకు ‘సేవా మిత్ర’ ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించిన 2,18,115 మంది గ్రామ, వార్డు వలంటీర్లను సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.10 వేలు నగదు, సర్టిఫికెట్ (ప్రసంశా పత్రం), శాలువా, బ్యాడ్జితో సత్కరించనున్నారు. లెవల్–2 4000 మంది వలంటీర్లకు ‘సేవా రత్న’ ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం.. తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా మండలానికి ఐదుగురు చొప్పున 659 మండలాల్లో 3,295 మంది, మున్సిపాలిటీల్లో ఐదుగురు చొప్పున 109 మున్సిపాలిటీల్లో 545 మంది, కార్పొరేషన్లలో పది మంది చొప్పున 16 కార్పొరేషన్లలో 160 మంది మొత్తంగా 4,000 మంది వలంటీర్లను ‘సేవా రత్న’ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.20 వేలు నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు. లెవల్–3 875 మంది వలంటీర్లకు ‘సేవా వజ్ర’ ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయించడం.. తదితర కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మంది వలంటీర్లను ‘సేవా వజ్ర’ అవార్డుకు ఎంపిక చేస్తారు. వీరిని రూ.30 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జి, మెడల్‌తో సత్కరించనున్నారు. -
అనారోగ్యం ‘మస్తు’
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రజలు సమష్టిగా ముందడుగు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పాటిస్తే ఈ భయంకర సమస్య నుంచి బయటపడతాం. ప్రభుత్వ సూచనలే కాదు, పంచాంగం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కొత్త ఏడాదిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వికారి నామ సంవత్సరం పోతూపోతూ ‘కరోనా’ వికారాన్ని అంటగంటి వెళ్లింది. కొత్త ఏడాది మార్చి 30 నుంచి మే 4 వరకు మకరరాశిలో కుజుడు, శని, గురువు సంచారం ఉంది. ఒకే రాశిలో మూడు గ్రహాల సంచారం వల్ల ఘోర ఫలితాలు ఎదురుకావచ్చు’ అని ప్రముఖ పౌరాణికులు బాచంపల్లి సంతోష్‌కుమారశాస్త్రి అన్నారు. శ్రీ శార్వరి నామ సంవత్సరం కాలసర్పయోగంతో మొదలైందని, అటువంటి యోగాలు ఈ ఏడాదిలో 6 ఉన్నందున ప్రజలకు ఆరోగ్యపర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అయితే, జాగరూకతతో వ్యవహరిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చన్నారు. శార్వరి నామ ఉగాది వేడుకలు బుధవారం ఉదయం దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు ఉండటంతో సాధారణ ప్రజలు, మీడియా ప్రతినిధుల హాజరు లేకుండా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ సమక్షంలో అర్చకులు, ఇతర అధికారుల మధ్య వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగం ప్రకారం ఈ ఏడాది యోగఫలాల వివరాలు బాచంపల్లి మాటల్లోనే.. ఈ ఏడాది వానలే వానలు.. ఈ ఏడాది వానలు బాగా కురుస్తాయి. రైతాంగానికి మేలు కలుగుతుంది. సంవర్త పేరుతో మేఘాలు ఉన్నందున మూడు కుంచాల వాన కురుస్తుందని పంచాంగం చెబుతోంది. ఎరుపు నేలలు, ఎరుపు రంగు పంటలు లాభిస్తాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడటంతో భారీ వర్షాలు, అడపాదడపా భూకంపాలు సంభవిస్తాయి. ఆషాఢంలోనూ ఈసారి వానలు కురుస్తాయి. ఆగస్టు, సెప్టెంబరుల్లో దక్షిణ భారతంతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. చెన్నైలో భారీ వానలు కురుస్తాయి. హైదరాబాద్‌లో మంచి వానలుంటాయి. కాళేశ్వరం ఫలితాలు రాష్ట్రమంతా అందే అవకాశం ఉంటుంది. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర నదీ పుష్కరాలు.. ఈయేడు ఐదు గ్రహణాలు ఏర్పడుతున్నా, దేశంలో రెండు మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. అందులో జూన్ 21 ఆదివారం ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 1.44 వరకు చూడామణి కంకణ సూర్యగ్రహణం ఉంటుంది. మాంద్యమున్నా రాష్ట్రం నెట్టుకొస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా.. మన దేశం, మన రాష్ట్రం విజయవంతంగా నెట్టుకొస్తాయి. ఈ సంవత్సరం మన దేశ సర్వ ఆదాయం 105, సర్వ వ్యయం 96. మిగులు 9. దానితోనే కేంద్ర, రాష్ట్రాలు నెట్టుకురావాలి. ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రజలకందే కొన్ని సబ్సిడీలు దూరమవుతాయి. ఆర్థిక మాం ద్యం దృష్ట్యా ప్రజలు పొదుపు మంత్రం పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణతోనే మేలు కలుగుతుంది. తరచూ జాతీయస్థాయి విపత్తులు సంభవిస్తాయి. ధరలు పెరుగుతాయి. శని రసాధిపతిగా ఉన్నందున పెట్రోలు, డీజిల్ ధరలు తారస్థాయికి చేరుతాయి. బ్యాంకులపై ప్రజలకు నమ్మకం సడలుతుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఈ సంవత్సరం కత్తిమీద సామే.. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. విద్యారంగంలో సాధారణ ఫలితాలుం టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదమ్ముల్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండటం ప్రజలకు మేలు చేస్తుంది. క్రీడారంగం, మిలిటరీలో ఉత్సాహం అంతంతే. ఈ ఏడాది 384 రోజులు.. 13 నెలలు ఈయేడు నవ నాయకుల్లో నాలుగు శుభగ్రహాలకు, ఐదు పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది. ఉగాది బుధవారం వచ్చినందున బుధుడు రాజుగా ఉంటాడు. బుద్ధిమంతు డు, యుక్తాయుక్త వివేచన కలవాడు రాజుగా ఉండేం దుకు అవకాశం కలుగుతుంది. రియల్ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లో కొత్తపుంతలు తొక్కుతుంది. శాంతిభద్రతలు బాగుంటాయి. సేనాధిపతి రవి అయినందున ప్రజలకు రక్షణ అందించేందుకు పోలీసు శాఖ బాగా పనిచేస్తుంది. మీడియా ఇబ్బందులు, ఆర్థికచిక్కులతో అతలాకుతలం కాక తప్పదు. సంక్షేమ శాఖలు, పరిశోధన రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. ఓ ప్రఖ్యా త కళాకారుడు మృత్యువాత పడతారు. శార్వరి నామ సంవత్సరంలో 384 రోజులుంటాయి. ఆశ్వయుజ మాసం అధికమాసంగా వచ్చినందున 13 నెలలుంటా యి. ఈ సంవత్సరం దైవం భాస్కరుడు. ప్రజలు సూర్యోదయా న్ని, చంద్రోదయాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఆదివారం మాంసాహారాన్ని మానితే ఆరోగ్యానికి మేలు. మనో సంకల్పం నెరవేరుతుంది.. కేసీఆర్: కర్కాటకం ఆదాయం–11, వ్యయం–8 రాజపూజ్యం–5, అవమానం–4 గ్రహస్థితి రీత్యా మిశ్రమ ఫలితాలున్నా వ్యక్తిగత జాతకరీత్యా పరిస్థితి అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతం రాహు మహాదశ కొనసాగుతోంది. సూర్యుడి స్థితి దాటుతున్నందున మనో సంకల్పం నెరవేరుతుంది. జూలై నుంచి అక్టోబరు వరకు ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూల సంవత్సరం. గతంలో కంటే అనుకూల ఫలితాలు మోదీ: వృశ్చికం ఆదాయం–5, వ్యయం–5 రాజపూజ్యం–3, అవమానం–3 మిశ్రమ ఫలితాలుంటాయి. అయితే, శని బాగా యోగిస్తున్నాడు. గురువు కొద్దికాలం మాత్రమే యోగించటం, రాహుకేతువులు అనుకూలంగా లేనందున విజయం కోసం కష్టపడాలి. గతేడాది కంటే అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. శని మూడో స్థానంలో ఉన్నందున చేపట్టిన పనిలో విజయం సా«ధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
తొలిసారి ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఆయన ట్విటర్ ఖాతాను తెరిచారు. చిరంజీవి కొణిదెల పేరుతో అకౌంట్‌ను ప్రారంభించిన ఆయన.. అభిమానులతో మాట్లాడటం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలకు శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంవత్సరాది రోజున ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందామని ఆయన పిలుపునిచ్చారు. (ఈ అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి: మోదీ) అలాగే కరోనా వైరస్ (కోవిడ్-19)ను అరికట్టడానికి భారత ప్రభుత్వం 21 రోజులపాటు ప్రజలందరిని ఇళ్లలోనే ఉండమని ఇచ్చిన ఆదేశానికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా మద్దతు తెలిపారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొవడానికి కేంద్ర తీసుకున్న నిర్ణయం అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.ఈ క్లిష్ట సమయంలో మనమంతా సురక్షితంగా ఉండటానికి ప్రధాని నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ ఇచ్చే ఆదేశాలను పాటిద్దామని పిలుపునిచ్చారు. ఇంటి పట్టునే ఉందామని.. సురక్షితంగా ఉండాలని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. (‘ఆర్ఆర్ఆర్’ టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల..) #HappySarvariUgadi DELIGHTED to directly engage with my beloved fellow Indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH — Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020 -
తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది... ఈ ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. అదే విధంగా వివిధ భాషల్లో ప్రజలకు ట్విటర్ వేదికగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: నిత్యావసరాలపై బెంగవద్దు) ఇక మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తి కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ పౌరుడిని జాగ్రత్తగా చూసుకుంటున్న వారి అంకితభావం గొప్పదని కొనియాడారు. జాతి కోసం వారు చేస్తున్న సేవలకు భారత్ సలాం చేస్తుందన్నారు. అదే విధంగా.. ఈ అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి. ఇంట్లోనే ఉండండి అంటూ ఓ వీడియోను మోదీ షేర్ చేశారు. (చదవండి: భారత్ @ 519) ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది. ఈ సంవత్సరం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతనశక్తిని ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ముఖ్యంగా ఆరోగ్యంతో వుండాలని ప్రార్ధిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) March 25, 2020 आइए इस मां की भावना का आदर करें और घर में रहें। वो हमें यही संदेश दे रही है। https://t.co/z555vu2qvz — Narendra Modi (@narendramodi) March 24, 2020 (చదవండి: 21 రోజులు దేశవ్యాప్తంగా లాక్డౌన్) -
అపాయం తొలగిస్తూ అడుగెట్టవమ్మా శ్రీశార్వరి
ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ‘ఉగాది’ అన్న తెలుగుమాట ‘యుగాది’ అన్న సంస్కృత పద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. దీనికి ఆధారం వేదాలను అధారం చేసుకొని వ్రాయబడిన ‘సూర్య సిద్ధాంతం’ అనే ఖగోళ జ్యోతిష గ్రంథం. బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం. ఉగాది సంప్రదాయాలు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం లో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబ కుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారమే. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది పూజ అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’, ‘అశోకకళికా ప్రాశనం’ అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేప పూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులు కానీ, పదిహేను రోజులు కానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ప్రస్తుతం కరోనా వైరస్ భయం మూలంగా ఉగాదికి పంచాంగ శ్రవణం చేసే అవకాశం లేదు కాబట్టి కనీసం యూట్యూబ్‌లో లేదా టీవీలలో, రేడియోలలో అయినా పంచాంగంలో రాశిఫలాలను తెలుసుకోవచ్చు. ఉగాది పర్వదినాన శిరఃస్నానం చేయకుండా ఉండటం, విడిచిన లేదా చిరిగిన దుస్తులు ధరించటం వల్ల జన్మజన్మల దరిద్రం, అనారోగ్యం పీడిస్తాయని పెద్దలు చెబుతారు కాబట్టి ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడం విధాయకం. ఎక్కడికీ కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చేసుకుని చివుళ్లు తొడిగి పూత, పిందెలతో కళకళలాడే ఈ వసంతరుతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి, శుచి, శుభ్రత, సంయమనం, సమయపాలన, సమయోచిత కార్యాలను ఆచరించటమనే సద్గుణాలను అలవరచుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ శ్రీ శార్వరి అంటే ఏమిటి? నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీశార్వరి అని పేరు. కాళరాత్రి అని, శుభకరి అని, చంద్రకాంత అని, హిమం అనీ, పంటలు బాగా పండేదనీ అనేక అర్థాలున్నాయి ఈ పదానికి. అంతేకాదు... శ్రీ శార్వరి అనేది అమ్మవారి నామాలలో ఒకటి. అమ్మవారి ముఖం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది కాబట్టి పసుపు పూసుకునేది మన సంప్రదాయం ప్రకారం సుమంగళి కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు మెరుగవుతాయనీ, పంటలు బాగా పండి అందరూ సుఖసంతోషాలతో ఉంటారనీ ఆశిద్దాం. -
సమాజానికి దగ్గరవ్వాలనే వస్తున్నా..
తమ అభిమానులకు చేరువగా ఉండేందుకు, అభిప్రాయాలను, సందేశాలను వ్యక్తపరిచేందుకు సినిమా స్టార్స్ సోషల్ మీడియాను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే అభిమాన తారలతో టచ్‌లో ఉండటానికి అభిమానులకు ఇదొక మంచి వేదిక. ఈ ఉగాది నుంచి (బుధవారం) తాను సోషల్ మీడియాలో ఎంటర్ అవుతున్నానని మంగళవారం ఓ వీడియో ద్వారా వెల్లడించారు చిరంజీవి. ‘‘ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి, అలాగే నేను అనుకున్న సందేశాలను కానీ, చెప్పాలనుకున్నవి ప్రజలతో చెప్పుకోవడానికి కానీ సోషల్ మీడియాను ఓ వేదికగా భావిస్తున్నాను. ఈ ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు చిరంజీవి. ప్రస్తుతం ‘ఆచార్య’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చిరంజీవి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : శ్రీ శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శార్వరిలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితి దృష్ట్యా ‘‘సామూహిక వేడుకలకు దూరంగా, మీ కుటుంబంతో వేడుకగా ’’ ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తెలిపారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు, దాని వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ప్రజలంతా తమతమ ఇళ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా మీద విజయం సాధించి నవయుగానికి బాటలు వేయటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, పూర్తి సహాయసహకారాలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. -
బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం
సాక్షి, హైదరాబాద్: ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు ‘బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో ఆదివారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది సంబరాల సందర్భంగా పూర్ణాలు, పూతరేకులు, గారెలు, పులిహోర, ఉగాది పచ్చడి, ఉలవచారు, పప్పు చారు, గుత్తి వంకాయ కూర, చల్ల మిర్చి...వంటి అచ్చ తెలుగు వంటకాల విశిష్టతకు అద్దం పడతూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది. హీరోయిన్ అనుష్క ప్రధాన ఆకర్షణగా.. నటుడు నాగబాబు, ఆయన కుమార్తె నీహారిక, యాంకర్స్ అనసూయ భరద్వాజ్, ప్రదీప్ మాచిరాజు, రవి, పలువురు డ్యాన్స్ మాస్టర్స్... పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా తమ నటనతో అదరగొట్టారు. నీహారిక ... ‘ఓ మై డాడీ’ అంటూ మైక్ పట్టి పాట పడితే... అనసూయ... ‘మహానటి’ గా అభినయించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. -
అర్హులందరికి ఇంటి స్థలం
-
ఇక ఉగాది కానుక!
సొంతింటి కల సాకారం దిశగా.. సొంత స్థలం కానుక కాబోతున్న వేడుక ఉగాది. ఆ రోజు రాక కోసం కోటి ఆశలతో నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని జీవితాంతం కష్టపడినా కాసింత జాగా కూడా కొనుక్కోలేని రోజులివి. పేదలను సొంతింటి మారాజులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుపేదల్లో ఆనందాలు నింపుతోంది. సాక్షి, మచిలీపట్నం: ఉగాది నాటికి జిల్లాలోని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రూపాల్లో అందిన దరఖాస్తులను ఇంటింటి సర్వేలో గ్రామ, వార్డు వలంటీర్లు క్షేత్ర స్థాయి పరిశీలన జరిపారు. దరఖాస్తు చేయని అర్హుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా జరిపిన సర్వేలో అర్హుల గుర్తింపు పూర్తి పారదర్శకంగా సాగింది. ఈ జాబితాలను ఇప్పటికే పంచాయతీలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించి వాటిని కూడా ఇటీవల జరిగిన గ్రామసభల్లో పరిష్కరించారు. ఇప్పటి వరకు సొంత ఇల్లు, ఇంటి స్థలం లేని అర్హులైన జాబితాను వివిధ కోణాల్లో పరిశీలన అనంతరం జిల్లాలో 2,71,033 మంది అర్హులుగా లెక్కతేల్చారు. వీరిలో గ్రామీణ జిల్లాలో 1,31,660 మంది, అర్బన్ ప్రాంతంలో 1,39,373 మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వీరికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇళ్ల స్థలాలు కేటాయిం చాలంటే కనీసం 4601.36 ఎకరాలు భూమి అవసరమని గుర్తించారు. ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో 2132.02 ఎకరాల ప్రభుత్వ భూములను ఆ ఇళ్ల స్థలాలకు అనువైనవిగా నిర్ధారించారు. కాగా మరో 2497.79 ఎకరాలు సేకరించాల్సి ఉందని లెక్కతేల్చగా, ఇప్పటి వరకు భూసేకరణ కోసం 960.2 ఎకరాల ప్రైవేటు భూములు గుర్తించారు. మరో 1537.77 ఎకరాల భూముల కోసం అన్వేషిస్తున్నారు. భూసేకరణ కోసం రూ.2326.80 కోట్లు అవసరమని అంచనా వేశారు. కాగా ఆ భూముల లెవలింగ్ కోసం మరో రూ.306.75 కోట్లు ఖర్చవుతాయని లెక్కతేల్చారు. మొత్తం జిల్లాకు 2633.52 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అర్బన్ ప్రాంతాల్లో అత్యధికంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 86,513 మంది అర్హులుగా లెక్క తేల్చగా, నందిగామలో కేవలం 1072 మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు. వీరంతా అర్హులని సమాచారం కూడా అందించారు. ఒకటికి పదిసార్లు ఇంకా ఎవరైనా అర్హులున్నారేమో బూతద్దంతో గుర్తించే కార్యక్రమం కూడా చేశారు. చివరకు ఎవరూ లేరని తేలడంతో అర్హుల జాబితాలను ప్రభుత్వామోదం కోసం పంపించారు. వీరందరికీ వచ్చే ఏడాది ఉగాది రోజున ఇళ్ల స్థలాలు కేటాయించి ఇచ్చేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన ప్రైవేటు భూముల కోసం త్వరలోనే ప్రభుత్వాదేశాల మేరకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు జిల్లాలో అర్హులను గుర్తించారు. వారికి ఇళ్ల స్థలాల కోసం ఎంత భూమి అవసరమో లెక్కతేలింది. అందుబాటులో ప్రభుత్వ భూముల గుర్తింపు పూర్తయింది. ఇక సేకరించాల్సిన ప్రైవేటు భూములను ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రభుత్వాదేశాలతో త్వరలోనే గుర్తించిన ప్రైవేటు భూముల కోసం భూసేకరణ ప్రక్రియ మొదలు పెట్టనున్నాం. ఏదిఏమైనా ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే ఏడాది ఉగాది రోజున అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి స్థలం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ -
పక్కాగా...అందరికీ ఇళ్లు!
కూడు... గూడు... గుడ్డ... ఇవీ మానవుని కనీస అవసరాలు. ఇప్పటికీ సొంత గూడులేని కుటుంబాలెన్నో ఉన్నాయి. ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా అలాంటివారిని స్వయంగా చూసిన ప్రజానేత జగన్మోహన్రెడ్డి తన పాలనలో వాటి పరిష్కారానికే తొలిప్రాధాన్యమిచ్చారు. అన్ని రంగాలవారినీ ఆదుకునేందుకు నవరత్నాలను తెచ్చారు. రాబోయే ఐదేళ్లలో సొంత స్థలం... ఇల్లు లేని పేదవారుండకూడదన్న సత్సంకల్పంతో ఈ ఉగాదినుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం అవసరమైన స్థలాలను అన్వేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 44వేల మంది అర్హులను గుర్తించిన అధికారులు... 653 ఎకరాల భూమినీ గుర్తించారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇల్లులేని ప్రతి పేదవాడికీ ఉగాది నాటికి గృహయోగం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జిల్లా అధికారులు అనువైన స్థలాలను అన్వేషిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరుకు అందిన 2 లక్షల 60 వేల దరఖాస్తుల్లో 44 వేల మందిని అర్హులుగా గుర్తించారు. జిల్లాలో ప్రస్తుతం 653.45 ఎకరాల భూమి పంపిణీకి అందుబాటులో ఉంది. ఒక్కో లబ్ధిదారునికి గ్రామాల్లో 72 గజాలు, పట్టణాల్లో 60 గజాలు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉన్న, ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకోవడం ద్వారా భూ పంపిణీకి అవసరమైన భూముని సేకరించే పనిలో పడ్డారు. 43వేల మందికి భూమి సిద్ధం.. జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూమి 646.98 ఎకరాలు ఉంది. చిన్న చిన్న తగాదాలతో మరో 6.47 ఎకరాలు ఉంది. దీనిలో పట్టణ ప్రాంతంలో ఉన్న భూమి 48.54 ఎకరాలు కాగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నది 604.86 ఎకరాలు. 40,602 మందికి గ్రామీణ ప్రాంతంలోనూ, 3262 మందికి పట్టణ ప్రాంతంలోనూ కలిపి దాదాపు 43వేల మందికి పంపిణీ చేయడానికి ఈ భూమి సరిపోతుంది. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులకు ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని పంచిపెట్టవచ్చు. అయితే జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కనీసం లక్ష మంది లబ్ధిదారులు ఉగాది నాటికి తేలవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయోనని క్షేత్రస్థాయిలో వెదుకుతున్నారు. స్థలాల కోసం వెదుకులాట.. జిల్లాలో 34 మండలాలు, 1543 రెవిన్యూ గ్రామాలుండగా 620 గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 923 గ్రామాల్లో భూములు గుర్తిస్తున్నారు. ఐదు పురపాలక సంఘాల్లో రెండింటిలోనే ప్రభుత్వ భూమి దొరుకుతోంది. మిగిలిన వాటిలో వెదుకుతున్నారు. ఈ పనిని జిల్లా వ్యాప్తంగా గ్రామ వలంటీర్ల సహాయంతో అధికారులు చేస్తున్నారు. జిల్లాలో విధుల్లో చేరిన 11,985 మందిలో 11,176 మందికి భూముల గుర్తింపు సర్వేపై శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో ప్రజాసాధికార సర్వే, ఇంటింటి సర్వేలు నిర్వహించి నియోజకవర్గాల వారీగా ఎన్ని ఇళ్లు అవసరమవుతాయనే లెక్కలు అధికారుల వద్ద ఉన్నాయి. వీటి ప్రకారం... చీపురుపల్లిలో 18,390, గజపతినగరంలో 18,607, నెల్లిమర్లలో 26,337, శృంగవరపుకోటలో 21,564, విజయనగరంలో 33,590, బొబ్బిలిలో 25,140, పార్వతీపురం 15,290, సాలూరులో 23,153, కురుపాంలో 19,975 చొప్పున మొత్తం 2,02,046 ఇళ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదీ ఇళ్ల నిర్మాణ ప్రగతి.. 2016–17 నుంచి 2019–20 సంవత్సరాల మధ్య జిల్లాలో గృహనిర్మాణాల ప్రగతిని ఒకసారి పరిశీలిస్తే... గ్రామీణ గృహనిర్మాణ పథకం ద్వారా జిల్లాకు 58788 కేటాయించారు. వీటిలో 31,988 రద్దు చేయడానికి ప్రతిపాదించారు. 26,800 గృహాలు చేపట్టి, 22,451 గృహాలు పూర్తి చేశారు. ఇంకా 4349 గృహాలు పూర్తికాలేదు. వీటిలో 3297 గృహాలు పునాదుల స్థాయిలోనే ఉన్నాయి. పీఎంఎవై–గ్రామీణ గృహ నిర్మాణ పథకం ద్వారా 6935 గృహాలు మంజూరైతే 3,747 పూర్తిచేశారు. 3188 మిగిలాయి. వీటిలో 1926 ఇళ్లు నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. పీఎంఎవై–ఆర్బన్ గృహనిర్మాణ పథకం ద్వారా 39,866 ఇళ్లు మంజూరుకాగా 3,985 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 35,881లో ప్రారంభానికి నోచుకోనివి 14,961 ఉన్నాయి. ఇక ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం(పట్టణ) ద్వారా ఫేజ్–1, ఫేజ్–2లో విజయనగరం, నెల్లిమర్ల, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో 11,837 ఇళ్లు మంజూరైతే 9,744 ఇళ్లు నిర్మాణం చేపట్టి 4624 ఇళ్లు పూర్తి చేశారు. ఈ లెక్కలను బట్టి గత ప్రభుత్వ హయాంలో పేదలెవరికీ కనీసం గూడు కూడా దొరకలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి తమ ప్రభుత్వ హయాంలో తలెత్తకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామవలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థలను పటిష్టంగా తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇప్పటికే ఏర్పడ్డ మంత్రుల కమిటీతో ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా అధికారులు భూములను గుర్తించే పని చేపడుతున్నారు. -
పేదింటి కల సాకారమయ్యేలా..
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలి.. ఇది రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను విధించుకున్న లక్ష్యం. ప్రజాసంకల్పయాత్రలో కోట్లాదిమంది కష్టసుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవి చేపట్టిన వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఉగాది నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం స్థలాల సేకరణలో నిమగ్నమైంది. గత ఐదేళ్లూ టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల పెత్తనంతో తమకు న్యాయం జరగదని నిరాశకు లోనైన బడుగువర్గాల్లో.. ప్రభుత్వ చర్యలతో మళ్లీ ఆశలు చిగురించాయి. జిల్లాలో సొంత ఇల్లు లేని వారు సుమారు 1.80 లక్షలమంది ఉన్నారు. వీరందరికీ ఇళ్ల స్థలాలు సమకూర్చాలంటే.. ఎం త స్థలం అవసరం, పట్టణాల్లో ఎంత కావాలి, గ్రామాల్లో ఎంత కావాలి.. తదితర వివరాలను సిద్ధం చేసిన అధికారులు భూ సేకరణకు కావా ల్సిన కసరత్తును ప్రారంభించారు. రెవెన్యూ అ«ధికారులు గ్రామాలవారీ, మండలాల వారీ, డివిజన్ల వారీగా భూసేకరణకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1211.73 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. మహిళ పేరిట ఇళ్ల పట్టాలు, ఇళ్లు... రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కుటుంబంలో మహిళ పేరిట ఇల్లు మంజూరు చేయనున్నారు. అంతే కాకుండా అన్ని హక్కులు కల్పిస్తూ వారి పేరిట రిజిస్ట్రేషన్ కూ డా చేసి మహిళకు హక్కులు కల్పించేందుకు నిబంధనలు రూపొందించారు. గ్రామీణ, పట్ట ణ, నగర ప్రాంతాల తేడాలు లేకుండా పేదలంతా పక్కా గృహాలు నిర్మించుకునేలా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. సొంత ఇల్లు, స్థలం లేని వారే అర్హులు.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల వారై ఉండి సొంత ఇల్లు లేని వారంతా ఈ పథకంలో లబ్ధి పొందేందుకు అర్హులే. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా గతంలో ఎలాంటి గృహ రాయితీ పొందకుండా ఉండాలి. 2.5 ఎకరాల మాగాణి లేదా అయిదు ఎకరాల మెట్టు కన్న తక్కువ భూమి ఉన్నవారే మాత్రమే అర్హులు. ఇంటి స్థలం కోసం ఏ ప్రాంతం నుంచి దరఖాస్తు చేసున్నారో ఆ ప్రాంతంవారై ఉండాలి, ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలి. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.3 లక్షల కంటే తక్కువ ఉండాలి. గ్రామం వార్డు, యూనిట్‌గా తీసుకొని ఈ దరఖాస్తు చేయా లి. ఆ గ్రామంలో ఉన్నారా లేదా తదితర వివరాలను గ్రామ వలంటీర్లు పరిశీలించి, అర్హుల జాబితాలను గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు. అనంతరం గ్రామ సభను నిర్వహించి అభ్యంతరాలుంటే వాటిని పరిశీలించి నిర్ణయాలు తీసుకొంటారు. తుది చర్చ అనంతరం ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. పట్టణాల్లో జీ ప్లస్ 3, 4 పద్ధతిలోనూ, గ్రామాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో ఇల్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న భూమి.. ఇల్లుకు అనువైన భూమిని రెవెన్యూ అధికా రులు గ్రామాల వారీగా గుర్తిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అనువైన స్థలం లేదు. దీంతో అక్కడ ప్రైవేటు భూముల్లో ఇళ్ల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నవి గుర్తించే పనిలో ఉన్నారు. జిల్లాలో 1863 రెవెన్యూ గ్రామాలు న్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1128 రెవె న్యూ గ్రామాల్లో 1211.73 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. ఇంకా కొన్ని గ్రామాల్లో భూములు గుర్తించాల్సి ఉంది. -శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 13 మండలాల్లో 562 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 333 రెవెన్యూ గ్రామాల్లో 418.04 ఎకరాలు గుర్తించారు. 226 గ్రామాల్లో అనువైన ప్రభుత్వ భూములు లేవు. -పాలకొండ డివిజన్లో 635 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 448 గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఉంది. 282.24 ఎకరాలు గుర్తించారు. 187 గ్రామాల్లో అనువైన భూములు లేవని తేల్చారు. -టెక్కలి డివిజన్లో 666 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో 347 గ్రామాలలో భూములు గుర్తించారు. 511.45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ డివిజన్లో 319 గ్రామాల్లో ఇళ్లకు అనువైన ప్రభుత్వ భూమి లేదు. -
ఎస్టీవీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
స్టుట్గార్ట్ : సమైక్య తెలుగు వేదిక(ఎస్టీవీ) ఆధ్వర్యంలో జర్మనీలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్టుట్‌గార్ట్‌లో జరిగిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలలో దాదాపు 200మందికి పైగా తెలుగు వారు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, వడపప్పు, పానకం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలు, పెద్దలు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సమైక్య తెలుగు వేదిక టీమ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ స్టుట్‌గార్ట్‌లో నివాసముంటున్న తెలుగువారు సమైక్యంగా తెలుగు సాంస్కృతిని వ్యాప్తి చేస్తూ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని పేర్కొన్నారు. -
ఎమ్‌టీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
కౌలాలంపూర్ : మలేషియా తెలుగు ఫౌండేషన్ (ఎమ్‌టీఎఫ్) ఆధ్వర్యంలో వికారి నామ సంవత్సర ఉగాది 2019 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సెలంగూర్ స్టేట్ కౌన్సిలర్ గణపతి రావు, మలేషియా ఇండియా హై కమిషన్ కౌన్సిలర్ నిషిత్ ఉజ్వల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రఖ్యాత గాయకుడు నాగూర్ బాబు (మనో), అతని బృందం హరిణి, సాయిచరణ్, అరుణ్ , సాహితి , శ్రీకాంత్ తదితరులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించారు. మనో మాట్లాడుతూ విదేశాలలో కూడా మన తెలుగు పండగలు సంస్కృతీ సంప్రదాయాలతో నిర్వహిస్తూ తెలుగూ భాషా, తెలుగు కోసం అహర్నిశలు కష్టపడుతున్న దాతో కాంతారావు, ప్రకాష్‌ని అయన అభినందించారు. ఈ కార్యాక్రమములో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ ఎమ్‌టీఎఫ్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా సేకరించిన విరాళాలని చారిటబుల్ ట్రస్ట్‌లకి అందజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జన్మదిన ఏడాదిని పురస్కరించుకొని వారి జ్ఞాపకార్థం వీడియో ప్రెసెంటేషన్, చిన్న స్కిట్ చేసి అందులో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌టీఎఫ్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్, మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి, పీకేకేటీఎమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకాష్ రావు, టీఏఎమ్ వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ రావు, పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, తెలుగు ఇంటెలెక్చువల్ సొసైటీ ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు, ఒకే కుటుంబం ప్రెసిడెంట్ అప్పన్న నాయుడు పాల్గొన్నారు. -
‘తామా’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
అట్లాంటా : తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(తామా) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక మెడోక్రీక్ హైస్కూల్లో నిర్వహించిన శ్రీ వికారి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలలో సుమారు రెండు వేల మందికి పైగా పాల్గొనగా తెలుగు సినీగాయని గీతామాధురి తన పాటలతో ఉర్రూతలూగించారు. ముందుగా పిల్లలకు క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాత్ బౌల్, స్పెల్ మాస్టర్ ఛాలెంజ్ పోటీలలో సుమారు 200 మంది పిల్లలు పోటీపడ్డారు. పొటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. సాంస్కృతిక కార్యదర్శి సుబ్బారావు మద్దాళి ఉగాది శుభాకాంక్షలతో అందరికి స్వాగతం పలుకగా, తామా కార్యవర్గ సభ్యులు వెంకీ గద్దె, భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియ బలుసు, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, సురేష్ బండారు, రూపేంద్ర వేములపల్లి, భరత్ అవిర్నేని, శ్రీవల్లి శ్రీధర్ బోర్డు సభ్యులు వినయ్ మద్దినేని, రాజశేఖర్ చుండూరి, నగేష్ దొడ్డాక, ఆనంద్ అక్కినేని, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, అలాగే గాయని గీతా మాధురి, వ్యాఖ్యాత సమీరా విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య పాఠశాలలవారు ప్రదర్శించిన సినిమా నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, ఫ్యాషన్ షో, యాంకర్ సమీరా వ్యాఖ్యానం అందరిని అబ్బురపరిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నవారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. తామా కార్యవర్గం, బోర్డు సభ్యుల చేతులమీదుగా స్పాన్సర్స్, సింగర్ గీతా మాధురి, యాంకర్ సమీరా, జార్జియా హౌస్ ప్రతినిధి టాడ్ జోన్స్‌లను పుష్పగుచ్చం, శాలువ,జ్ఞాపికలతో సత్కరించారు. ప్రముఖ వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో ఆభరణాలు, వస్త్రాలు, ప్రత్యేక ఆహార పదార్థాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీ సత్యనారాయణ స్వామి గుడి పూజారి రవి మేడిచెర్ల గారు పంచాంగ శ్రవణం చేశారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ భరత్ మద్దినేని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమవంతు సహాయసహకారాలు అందించిన ఆడియో లైటింగ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సేవలందించిన వాకిటి క్రియేషన్స్ శ్రీధర్ రెడ్డికి, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ సుజాత పొన్నాడకి, మెడోక్రీక్ హై స్కూల్ యాజమాన్యానికి, స్పాన్సర్స్‌కి, వాలంటీర్స్ శ్రీనివాస్ లావు, అంజయ్య చౌదరి లావు, అనిల్ ఎలమంచిలి, రాజేష్ జంపాల, రామ్ మద్ది, ఉపేంద్ర నర్రా, శ్రీని బలుసు, విజయ్ కొత్త, విజయ్ కొత్తపల్లి, గిరి సూర్యదేవర, మురళి బొడ్డు, సురేష్ ధూళిపూడి, బాల మడ్డ, అనిల్ కొల్లి, వెంకట్ అడుసుమిల్లి, మహేష్ పవార్, వెంకట్ మీసాల, శ్రీరామ్ రొయ్యల, యశ్వంత్ జొన్నలగడ్డ, హేమంత్ వర్మ పెన్మెత్స, రమేష్ వెన్నెలకంటి, సాన్వి, అక్షు, మోనిష్, తనీష్, రితిక్, రుషీల్, అఖిల్, వంశి కనమర్లపూడి, శ్రీనివాస్ కుక్కడపు, సంతోష్, సరితా, గౌతమి ప్రేమ్, సత్య నాగేందర్, అనిల్, నగేష్ మాగంటి, మూర్తి మొల్లివెంకట, శ్రీనివాస్ గోలి, శ్రీనివాస్ కోడెల, గిరిధర్ కోటగిరి, శశి కేలం, అప్పారావు గోపు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. -
సీటీఏ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
చికాగో : వికారినామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలు చికాగో తెలుగు అసోసియేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. చికాగోలోని బాలాజీ దేవస్థానం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి 600మందికి పైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా గాంధీ-కింగ్ స్కాలర్షిప్ అవార్డులను ప్రదానం చేశారు. సీటీఏ డైరెక్టర్ సుజనా ఆచంట అతిథులను ఆహ్వానించి, తెలుగు భాష కోసం సీటీఏ చేస్తున్న సేలను, ఈ ఏడాదిలో చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణంతోపాటూ, కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం, ఉగాది పచ్చడి పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుభద్రాచార్యులు శ్రీనివాసులు, డా.శారదా పూర్ణ సొంటి, ఆజాద్ సుంకవల్లిలకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి చికాగో స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ స్కాట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌ల పేరు మీదుగా విద్యార్థులకు సీటీఏ స్కాలర్షిప్లను ఇవ్వడాన్ని అభినందించారు. ఈ ఏడాదికిగానూ మనస్వి తుమె, రిషితా వజ్జాల, స్పందన్ రామినేని, భాస్కరాచారిలకు స్కాలర్‌షిల్‌లను స్కాట్ అందజేశారు. సీటీఏ వ్యవస్థాపకులు రవి ఆచంట, ప్రవీణ్ మోటూరు, ప్రెసిడెంట్ నాగేంద్ర వేగె, బోర్డు సభ్యులు రావు ఆచంట, శేషు ఉప్పటపాటి, చుండు శ్రీనివాస్, అశోక్ పగడాల, శ్రీని యెరమాటి, వెంకట గ్యాజంగి, రాహుల్ వీరటపు, రాణి వేగె, సుజనా ఆచంట, అనిత గోలి, వ్యాపారవేత్త రమేశ్ తూము, దేవాలయ ట్రస్టీలు ఎమ్. రావు, హరినాత్ కోనేరు, ఆటా వ్యవస్థాపకులు హనుమంత్ రెడ్డి, తాతా ప్రకాశంలు విజేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమ విజయవంతంగా నిర్వహించడంలో సీటీఏ సాంస్కృతిక విభాగం సభ్యులు సుజనా, రాణి వేగె, అనితా గోలి, అనూష విడపలపాటి, భవాని సరస్వతి, రత్న చోడ, తనూజ సజ్జ, సుధా కుంచనపల్లి, సుభద్ర బల్ల, సురేష్ బాదం, వాలంటీర్లు భూషణ్ భీమిశెట్టి, హరీష్ జన్ను, అదిల్, నవీన్ లగుడు, నవీన్ గార్గ, వినయ్ చెన్నుపాటి, బాల చోడ, నరేన్ సుంకర, మురళి కలాగారాలు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. సీటీఏ ప్రెసిడెంట్ నాగేంద్ర వేగె ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. -
చికాగోలో ఘనంగా సీఏఏ తృతీయ వార్షికోత్సవ వేడుకలు
చికాగో : వికారినామ సంవత్సర ఉగాది పండుగ రోజున చికాగో ఆంధ్రా సంఘం(సీఏఏ) తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. ఆటా, పాటలు, హాస్య, పౌరాణిక నాటికలు, సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడి నాట్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇల్లినాయిస్ రాష్ట్ర సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు, తెలుగువాడు, ఆంధ్ర ప్రాంతంలో మూలాలున్న శ్రీ రామ్ విల్లివాలం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నేటి యువతరం డాక్టర్, ఇంజనీర్ వృత్తులనే కాకుండా నచ్చిన ఏ రంగంలోనైనా నిరంతర కృషితో తమ కలలను సాకారం చేసుకోవచ్చని ప్రోత్సహించారు. ఫౌండర్స్ ప్రెసిడెంట్ దినకర్ కారుమూరి మాట్లాడుతూ రామ్ విల్లివాలం కూడా చిన్ననాటి నుంచి మన తెలుగు సంస్థలలో ప్రాతినిధ్యం వహించి, నేటి యువతకి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ రామారావుకి చిత్ర లేఖనం, కవిత్వం, రచనా రంగాలలో వారు చేసిన విశేష కృషిని అభినందిస్తూ జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి చికాగో ఆంధ్ర సమితి సభ్యులే కాకుండా చికాగో ఇండియన్ ఔట్ రీచ్ అసోసియేషన్ చైర్మన్ కృష్ణ బన్సల్ వంటి పలువురు విచ్చేసి చికాగో ఆంధ్రా సమితి సభ్యులకి ప్రోత్సహం అందించారు. చికాగో ఆంధ్ర సంఘం వారి సేవా విభాగం ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ప్రస్తుత, భవిష్యత్ ప్రణాళికలను ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి వివరించారు. చికాగో ఆంధ్రా సంఘం వ్యవస్థాపకులు, కార్యవర్గ సభ్యులు సహా 125 మందిపైగా వాలంటీర్లు, 30 మంది నృత్య గురువులు 3 నెలలపాటు శ్రమించి ఈ కార్యక్రమం విజయానికి కృషిచేశారు. శ్రీచైత్య పొనిపిరెడ్డి నాయకత్వంలో జయశ్రీ సోమిశెట్టి, సవిత యాలమూరి-వెర్నేకర్, మల్లేశ్వరి పెదమల్లు, రాజ్ మునగా వేదికను అందంగా అలంకరించగా, ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక బృందం సభ్యులు సాహితి ఆదిమూలం, రామకృష్ణ తాడేపల్లి, సమత పెద్దమారు, పావని కొత్తపల్లి అందరి ప్రశంసలనూ పొందేలా చక్కగా కూర్చి ఆద్యంతమూ చురుకుగా నడిపించారు. ఈ కార్యక్రమానికి సుందర్ దిట్టకవి, అన్విత పంచాగ్నుల, సవిత యాలమూరి-వెర్నేకర్, కార్తీక్ దమ్మాలపాటి వాఖ్యాతలుగా వ్యవహరించి తమ మాటలతో పాటలతో అలరించారు. ఉగాది సందర్భంగా షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు ఆంధ్ర ప్రాంత రుచులతో భోజనం వడ్డించారు. చికాగో ఆంధ్ర సంఘం ప్రెసిడెంట్ పద్మారావు అప్పాలనేని మాట్లాడుతూ, ఈ కార్యక్రమం విజయానికి సీఏఏ కార్యవర్గ సభ్యులు, వాలంటీర్ల కృషి మరువలేనిదని అన్నారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్,ఉపాధ్యక్షులు డాక్టర్ భార్గవి నెట్టెం మాట్లాడుతూ ఫౌండర్స్ కమిటీ చైర్మన్ దినకర్ కారుమూరి, సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, సుందర్ దిట్టకవి, రాఘవ జాట్ల, తన్వి జాట్ల, సంధ్య అప్పలనేని, సెక్రటరి శైలేష్ మద్ది, జాయింట్ సెక్రటరి రాజ్ పొట్లూరి, ట్రెజరర్ అను గంపాల, కార్యవర్గ సభ్యులు శిరీష కోలా, నీలిమ బొడ్డు, సురేష్ శనక్కాయల, సాయి రవి సూరిభొట్ల, సునీత రాచపల్లి, కిరణ్ వంకాయలపాటి, వెబ్ అండ్ డిజిటల్ డైరెక్టర్ శ్రీకృష్ణ మతుకుమల్లి, ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ వాణి దిట్టకవి, రామకృష్ణ తాడేపల్లి, లాజిస్టిక్స్ డైరెక్టర్ గౌరీశంకర్ అద్దంకి, మురళి రెడ్డివారి, సీనియర్స్ కమిటీ సభ్యులు శ్యామ్ పప్పు రమణమూర్తి ఎడవల్లి, రఘు బడ్డి, యూత్ కమిటీ సభ్యులు నిఖిల్ దిట్టకవి, శృతి మోత్కూరు, మైత్రి అద్దంకిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ విజయానికి ఎంతో శ్రమించిన కార్యకర్తలు విజయ్ కొరపాటి, సురేశ్ పొనిపిరెడ్డి, విష్ణు పెద్దమారు, సత్య తోట, సత్య నెక్కంటి, రమేశ్ నెక్కంటి, సురేశ్ ఐనపూడి, సరిత ఐనపూడి, వెంకట్ మక్కెన, మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ, హరచంద్ గంపాల, లక్ష్మీనాగ్ సూరిభొట్ల, ప్రోమో వీడియోలలో పాల్గొన్న సభ్యులకు, రామాలయ ట్రస్ట్ అధ్యక్షులు లక్ష్మణ్, వనమూర్తి, సతీశ్ అమృతూర్, అన్నపూర్ణ విశ్వనాధన్, వీడియో అండ్ ఫోటోగ్రఫీ సేవలందించిన యుగంధర్ నాగేశ్లతోపాటూ పలువురు కార్యకర్తలకు, అలాగే ఆర్థిక చేయూతనిస్తున్న స్పాన్సర్లకు అధ్యక్షులు పద్మారావు కృతజ్ఞతలు తెలిపారు. -
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో తెలుగువారి తొలి పండుగ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత శోభాయమానం ఈ వేడుకలు నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకొని, రాబోయే సంవత్సరంలో అందరికీ శుభం జరగాలనే సంకల్పంతో వేదపండితులు శ్రీవారికి ఉదయం పూట సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం, సహస్రనామార్చన, విష్ణు సహస్రనామ పారాయణ, ఇతర విశేషపూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కల్యాణము, ఆస్ధానం, ఊరేగింపు సాంప్రదాయబద్ధంగా వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా స్థానిక తెలుగువారు సకుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. వేదమంత్రోఛ్ఛారణలతో, భక్తుల గోవింద నామాలతో, భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పండితుల పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. అందరికీ షడ్రుచుల ఉగాది పచ్చడి, అన్నప్రసాద వితరణ చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తిరుమల నుంచి తెప్పించిన శ్రీవారి లడ్డు, శేషవస్త్రం, రవికలను అందించారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగువారందరికీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కల్యాణోత్సవములో పాల్గొన్న దంపతులకు, ఆహుతులందరికీ కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక సహాయ సహకారాలు అందించిన సమాజం సభ్యులకు, దాతలకు, కార్యకర్తలకు, కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉగాది 2019 వేడుకలు ఘనంగా జరిగాయి. సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 800 మంది ప్రవాసీ తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి, ప్రసాదం దాతలకు సొసైటీ తరపున అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, జూలూరి పద్మజ, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్‌లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి వెంకట్ రమణ, గోనె నరేంద్ర, కల్వ రాజు, రోజా రమణి, పద్మజ, ప్రసాద్‌లు వ్యవహరించారు. -
వేదపండితుల పంచాంగ శ్రవణంలో కవిత
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కవిత నక్షత్రం భరణి, మేషరాశికి ఈసారి కందాయ ఫలములు బేసి సంఖ్యలో రావడం ధన లాభాన్ని, అన్ని కార్యాల్లో జయమును సూచిస్తుందని వేద పండితులు కాందలై గోపాలాచార్యులు పేర్కొన్నారు. ఆదాయం 14, వ్యయం 14 ఉంటుందని, రాజ్యపూజ్యం మూడు, అవమానం ఆరు ఉందని పండితులు పేర్కొన్నారు. ఈ ఏడాదంతా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా మద్దతు పెరుగుతోందని పండితులు పేర్కొన్నారు. తెలంగాణను చాలా కాలం పాలించే యోగం టీఆర్ఎస్కు ఉందన్నారు. అంతకుముందు రాములవారికి కవిత పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌కు ఆ యోగం ఉంది
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ప్రజాశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ సిద్ధాంతి విష్ణుభట్ల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలను అమరావతిలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుభట్ల లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగం ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రహబలం బాగుందని, ఆయనకు అధికార యోగం ఉందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆయన విశేష ప్రజాదరణ పొందుతారని చెప్పారు. అలాగే సమర్థవంతమైన పరిపాలన అందిస్తారని ఉద్ఘాటించారు. జగన్ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధిస్తారని తెలిపారు. జగన్మోహన్రెడ్డిది ఆరుద్ర నక్షత్రం అయినందున ఈ ఏడాది ఆయనకు వృద్ధి అధికంగా ఉంటుందన్నారు. ఆయన హయాంలో వర్షాలు సకాలంలో కురుస్తాయన్నారు. దాంతో రాష్ట్రంలో పంటలు బాగా పండుతాయని, అదే సమయంలో గిట్టుబాటు ధరలు లభించి రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తెరిపించి వాటిని లాభాల్లో నడిపిస్తారని సిద్ధాంతి చెప్పారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా ఉన్నా అవి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి. అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధిస్తారు. జగన్ హయాంలో రియల్ ఎస్టేట్ బాగుంటుంది. అధికారులు ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తారు’’ అని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతలు పదిలంగా ఉంటాయని సిద్ధాంతి తెలిపారు. సిమెంట్, ఐరన్ ధరలు పెరుగుతాయన్నారు. కళాకారులు, సినిమా రంగంలో ఉన్నవారు, గాయనీ, గాయకులకు ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ప్రజల జీవితాల్లో ఆనందం విరియాలి: వైఎస్ జగన్ తెలుగువారి తొలి పండుగ ఉగాది ప్రజల జీవితాల్లో ఆనందం తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. తెలుగు వారికి ఆయన ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించిన వేదపండితులను జగన్ శాలువా కప్పి సత్కరించారు. -
శ్రీ వికారినామ సంవత్సర పంచాగశ్రవణం
-
ఎవరికి ఉపకారి.. ఎవరికి ‘వికారి’..!
తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది. ఈ నెల 6న(నేడు) ఉగాది పండగ జరుపుకోనున్నారు. వికారినామ సంవత్సరంలో విజయాలు చేకూరాలని.. సకల శుభాలు కలగాలని అందరికంటే ముందుగా వివిధ రాజకీయ పార్టీల శ్రేణులు కోరుకుంటున్నారు. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థులే గెలవాలని వేడుకుంటున్నారు. ఏటా ఉగాది పండగను రైతులే అత్యంత వైభవంగా జరుపుకునేవారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలతో ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకులంతా ఉగాదిపై ఆసక్తి కనబరుస్తున్నారు. పల్లెల్లో పండగ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ ఎన్నికల కాలంలో ఉగాది పర్వదినం కలిసిరావడం, పండగ తర్వాత ఐదు రోజులకే పోలింగ్ జరగడంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సాక్షి, సిరిసిల్ల: కాలచక్రం గిర్రున తిరుగుతోంది. కాలగమనంలో మరో తెలుగు ఏడాది కరిగిపోయింది. విలంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలికాం. కొత్త ఆశలు.. కొంగొత్త ఊసులతో ఉగాది పర్వదినాన ‘వికారి’నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. యుగానికి ఆదిఉగాది. తెలుగు సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న వేళ..‘ఆశలు చిగురించాలి.. ఆశయాలు నెరవేరాలి’. తీపి,పులుపుల మకరందం జీవితంలో అందరూ ఆస్వాదించాలి. తెలుగు సంవత్సరాది ఇంటింటా ఆనందాలు.. సంపదలు నింపాలి.. వికారినామ సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి సుర్రుమంటుంది. ఎన్ని‘కల’ బరిలో దిగిన నేతలంతా కొత్త పంచాంగంలో రాశిఫలాలను చూసుకుంటూ.. ఉగాది పచ్చడిని ఇష్టంగా ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు. ఈ వికారి నామ సంవత్సం ఎవరికి ఉపకరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. షడ్రుచుల వేళవింపు ఉగాది పర్వదినం రోజు షడ్రుచులను అందరూ ఆస్వాదిస్తారు. షడ్రుచులు అంటే.. చేదు, పులుపు, తీపి, వగరు, కారం, ఉప్పులతో కూడుకున్న ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. పంచాంగ పఠనం విని రాశిఫలాలు చూసుకుంటారు. ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఉగాది వేడుకల్లో పాల్గొంటూ.. పనిలో పనిగా ప్రచారాన్ని సాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విలంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలికి వికారినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని తిని పంచాంగాన్ని విని భవిష్యత్ ఆశలతో.. కొత్త ఊసులతో నేతలంతా పార్లమెంట్లో అడుగు పెట్టాలని లక్ష్యంతో ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. రాజయోగం ఎవరికో..! ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంది. గెలుపు లక్ష్యంతో ఎవరికి వారు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ ఓటరు మారాజు ఎవరిని దీవిస్తాడో.. ఎవరికి రాజయోగం కల్పిస్తాడో పంచాంగ శ్రవణం చేసే వేదమూర్తులకు అంతుచిక్కడం లేదు. ఉగాది పర్వదినం పూట.. రాశిఫలాల వారిగా ఆదాయ.. ఖర్చులను చెప్పె ఉగాది పంచాంగంలోనూ ఎన్నికల ఫలితాల ఊసు లేదు. కరీంనగర్ పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. పెద్దపల్లిలో 17 మంది, నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నిజామాబాద్‌లో పసుపు రైతులు తమ నిరసన గళాన్ని నామినేషన్ల రూపంలో తెలియజేశారు. నిజామాబాద్‌లో ఎన్నికల ఏర్పాట్లు ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. అన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాతో ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఎవరికి రాజయోగం పడుతుందో.. ఎవరికి చేదు, వగరు, కారం ఫలితాలు వస్తాయో వేచిచూడాలి. ఎన్నికలు రోజు తరుముకొస్తున్న వేళ.. ఉగాది పర్వదినం రావడం నేతలందరికీ కలిసొచ్చే అంశమే. రాజయోగాన్ని పరీక్షించుకోవడంతో పాటు.. ఉగాది పూట ప్రచార పంచాంగాన్ని వినిపించవచ్చు. భవిష్యత్‌పై ఆశలు ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ ఏడాది మాత్రం ఈ పంచాంగ శ్రవణానికి మరింత ప్రత్యేకత చేకూరనుంది. గ్రామాల్లో గ్రామస్థాయి నాయకులు, మండలాల్లో మండలస్థాయి నాయకులు, నియోజకవర్గంలో తాలూకా స్థాయి నాయకులు వికారినామ సంవత్సరం రోజున తాము బలపరుస్తున్న అభ్యర్థుల భవిష్యత్‌పై పంచాంగ బలాలను చూయించనున్నారు. పంచాంగ శ్రవణం పార్టీల ఆధ్వర్యంలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే పంచాంగ శ్రవణం జరపడం అనంతరం ప్రచారం చేసుకోవడం రెండు జరిగిపోతాయని నాయకులంతా దృష్టి సారిస్తున్నారు. పార్టీల నాయకుల జన్మ నక్షత్రాలు, రాశుల ఆధారంగా వారి భవిష్యత్ తెలుసుకోనున్నారు. మంచి ముహూర్తంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులకు వికారినామ సంవత్సర విజయాలు అందించాలని నాయకులంతా గ్రామగ్రామాన ఎదురుచూస్తున్నారు. కొత్త... పాత నేతల పోరుబాట.. ఉగాది పూట కొత్త కుండ.. చింతపండు.. మామిడికాయలు.. వేపపూత, కొత్త బెల్లంతో కలిసిన షడ్రుచుల మేళవింపు పరిపాటి. ఈ సారి ఎన్నికల్లో కొత్త నేతలు.. పాత నేతల మధ్య పోరు సాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల సమయం పతాక స్థాయికి చేరింది. ఎన్నికలకు ఐదు రోజులే ఉండగా.. ప్రచారానికి మూడే రోజులు ఉంది. కరీంనగర్ బరిలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ సిట్టింగ్ ఎంపీగా, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాజీ ఎంపీగా విస్తృత పరిచయాలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాత్రం కరీంనగర్లో కమలాన్ని వికసించేందుకు మోదీ మంత్రాన్ని జపిస్తున్నారు. పెద్దపల్లి బరిలో అందరూ కొత్తవారే కావడం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్థిగా బి.వెంకటేశ్ నేత, కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ.చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థిగా ఎస్.కుమార్ ఉన్నారు. వీరంతా కొత్త వారే కావడంతో ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి. నిజామాబాద్ బరిలో సిట్టింగ్ ఎంపీ కె.కవిత ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ మాజీ ఎంపీగా పరిచయాలు ఉన్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి డి.అరవింద్ రాజకీయంగా పట్టున్న వ్యక్తి కావడం విశేషం. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఎవరికి వారు ఆశల పల్లకిలో ఊరేగుతుండగా.. ఉగాది పూట ఏ రాశికి రాజయోగం ఉందో.. ఏ రాశి గురువు బలం ఉందో.. వికారి నామసంవత్సరం.. ఎవరికి ఉపకరిస్తుందో వేచి చూడాల్సిందే...! ఇక పదండి.. ఉగాది పచ్చడి స్వీకరించి.. పంచాంగాన్ని ఆలకిద్దాం.. రాశిఫలాలను చూసుకుందాం. -
వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం
-
అన్ని వర్గాలు సుఖశాంతులతో వర్ధిల్లాలి : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని.. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ‘ఈ నూతన సంవత్సరంలో మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రచారానికి విరామం ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకునే సమయంలో ప్రచార సభలతో ఇబ్బంది పెట్టరాదన్న ఉద్దేశంతో నేడు(ఏప్రిల్ 6న) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రచారానికి విరామం ప్రకటించారు. అమరావతిలోని స్వగృహంలో వైఎస్ జగన్ ఉగాది పండుగను జరుపుకోనున్నారు. -
హిట్ హిట్ హుర్రే
సాధారణంగా బిజినెస్ ఇయర్ మార్చి టు మార్చి జరుగుతుంది. ఆ ఏడాది జరిగిన లావాదేవీలన్నీ లెక్కలేస్తుంటారు. బిజినెస్ ఇయర్‌ను మేం కొంచెం మార్చాం. ఉగాది టు ఉగాది చేశాం. గత ఏడాది ఉగాది నుంచి ఈ ఉగాది వరకూ ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన కొత్త టాలెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఉగాది పచ్చడిలానే సినీపరిశ్రమలో ఫలితాలు కూడా షడ్రుచుల్లా ఉంటాయి. చేదు, పులుపు, తీపి, కారంలా హిట్టు, ఫ్లాప్, యావరేజ్, డిజాస్టర్లు ఉంటాయి. తొలి ప్రయత్నంలోనే తీపి రుచి చూసిన హీరో, హీరోయిన్లు, దర్శకులు గురించి చర్చించుకుందాం. వాళ్లపై స్పెషల్ స్టోరీ. లక్కీయారా తొలి పరిచయంలోనే స్టేట్ సీయంను ప్రేమలో పడేసిన హీరోయిన్ కియారా అద్వానీ. అదేనండీ.. ‘భరత్ అనే నేను’లో సీయం భరత్‌ని ప్రేమలో పడేశారు కదా. మహేశ్‌బాబు నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘భరత్ అనే నేను’తో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు బాలీవుడ్ బ్యూటీ కియారా. ‘భరత్ అనే నేను’ రిలీజ్ కాకముందే ‘వినయ విధేయ రామ’ సినిమాలో రామ్‌చరణ్‌తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేశారు. కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇద్దరు టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసి లక్కీయారా అనిపించుకున్నారు. ‘భరత్..’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా, ‘వినయ..’ సినిమా అంచనాలను అందుకోలేదు. అయినా నో ప్రాబ్లమ్. కియారాకి అవకాశాలు కొదవ లేదు. అఖిల్ కొత్త చిత్రంలో కియారా నటించే అవకాశముందని తెలిసింది. మజిలీ ఎటువైపు హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ’తో పరిచయమయ్యారు రుహానీ శర్మ. సినిమా ఆకట్టుకుంది. రుహానీ నటన కూడా బాగుందనే అన్నారు. కానీ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. రుహానీలా హిట్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా కూడా నెక్ట్స్ సినిమాను ఇంకా సైన్ చేయని హీరోయిన్లలో శోభితా ధూళిపాళ, ప్రియాంకా జవాల్కర్ ఉన్నారు. ‘గుఢచారి’ ద్వారా శోభిత, ‘టాక్సీవాలా’ ద్వారా ప్రియాంకా ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేశారు. నెక్ట్స్ ఏ సినిమా చేస్తున్నారు? అంటే.. ఇంకా ప్రకటించలేదు ఈ తెలుగమ్మాయిలు. ఇక నాగచైతన్య, సమంత చేసిన ‘మజిలీ’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యారు దివ్యాన్షాకౌశిక్. ఆమె నటనను మెచ్చుకున్నారు ప్రేక్షకులు. మరి.. ఈ సినిమా తర్వాత దివ్యాన్ష మజిలీ ఎటువైపో చూడాలి. సమ్మోహిని అదితీరావ్ హైదరీకి బాలీవుడ్లో తొమ్మిదేళ్ల కెరీర్ ఉంది. మణిరత్నం ‘చెలియా’ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఫస్ట్ టైమ్ పలకరించారు అదితీ. మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ ద్వారా తెలుగుకి స్ట్రయిట్ ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్‌తో సమ్మోహనపరచడమే కాకుండా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకొని మెప్పించారు. ఆ వెంటనే వరుణ్ తేజ్‌తో కలసి ‘అంతరిక్షం’లో ప్రయాణం చేశారు. ‘అంతరిక్ష’ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. తాజాగా మరోసారి ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారని తెలిసింది. సుధీర్‌బాబు, నానిలతో మోహనకృష్ణ ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అందులో నాని సరసన హీరోయిన్గా కనిపిస్తారట అదితీ. ఒక్క హిట్ నిధీ అగర్వాల్‌ది స్పెషల్ కేస్. వరుస సినిమాలను సంతకం చేస్తున్నారు కానీ ఫస్ట్ హిట్‌ను ఇంకా టేస్ట్ చేయలేదీ ఈ బెంగళూర్ భామ. నాగచైతన్య ‘సవ్యసాచి’తో పరిచయమైన నిధీ, ఆ తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’లో నటించారు. లేటెస్ట్గా రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా కనిపిస్తున్నారు. మరి.. అవకాశాలు అందుకుంటున్నట్లుగానే హిట్ ఎప్పుడు అందుకుంటారో చూడాలి. అది ‘ఇస్మార్ట్ శంకర్’తోనే దక్కుతుందనే ఊహలున్నాయి. భల్లే భల్లే పాయల్ గత ఏడాది ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన వారిలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఈ పంజాబీ భామ చేసిన బోల్డ్ రోలే అందుకు కారణం. ప్రస్తుతం వరుస సినిమాలు సైన్ చేసే పనిలో పడ్డారు పాయల్. ‘వెంకీ మామా’లో వెంకటేశ్ సరసన, ‘డిస్కో రాజా’లో రవితేజ సరసన, ‘మన్మథుడు 2’లో యాక్ట్ చేస్తున్నారు పాయల్. తమిళంలో ఆమె చేసిన ‘ఏంజెల్’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవల తెలుగులో ‘ఆర్డీఎక్స్’ అనే ఓ కొత్త చిత్రం కూడా స్టార్ట్ చేశారు. హాట్ ఎంట్రీతో ప్రస్తుతం హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు పాయల్. కొత్త ఐడియాలు క్లిక్ 2018 తెలుగు సినిమా విభిన్న కథలను చూసింది. సరికొత్త ఐడియాలతో కొత్త దర్శకులు ముందుకొచ్చారు. ‘ఆర్ఎక్స్100’ లాంటి బోల్డ్ అటెంప్ట్‌తో అజయ్ భూపతి ఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం ‘మహాసముద్రం’ అనే మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేస్తున్నారు అజయ్. తక్కువ బడ్జెట్లోనూ బాండ్ తరహా చిత్రాలు తెరకెక్కించవచ్చని ‘గూఢచారి’ సినిమా ద్వారా శశికిరణ్ తిక్క నిరూపించారు. మహేశ్‌బాబు నిర్మాణంలో ‘మేజర్’ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు శశికిరణ్. ‘చి. ల. సౌ’ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు హీరో రాహుల్ రవీంద్రన్. మంచి పేరు వచ్చింది. సెకండ్ సినిమాకే నాగార్జునను డైరెక్ట్ చేసే చాన్స్ లభించింది. నాగ్ సూపర్ హిట్ ‘మన్మథుడు’ సీక్వెల్ ‘మన్మథుడు 2’ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు రాహుల్. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ మిడిల్ క్లాస్ కథను చూపించిన వేణు ఉడుగుల ఈసారి పీరియడ్ ఫిల్మ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. రానా, సాయి పల్లవి జంటగా నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథను తయారు చేశారట. ‘కేరాఫ్ కంచెరపాలెం’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకటేశ్ మహా, ‘నన్ను దోచుకుందువటే’ ఆర్ఎస్ నాయుడు, ‘టాక్సీవాలా’ రాహుల్ సంక్రిత్యాన్ తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలింకా చెప్పలేదు. విజయ కార్తికేయం గత ఏడాది ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో కార్తికేయ బాగా మెరిశారు. ‘ఆర్ఎక్స్ 100’ బండిలానే దూసుకెళ్లారు. సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ వెంటనే తమిళ బడా చిత్రాల నిర్మాత కలైఫులి యస్ థాను నిర్మాణంలో ‘హిప్పీ’ సినిమా చేస్తున్నారు. నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చి, సంవత్సరం తిరక్కముందే విలన్ వేషాలకు కూడా రెడీ అయ్యారు. నాని– విక్రమ్ కె కుమార్ ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. శభాష్ నటేశ్ నిర్మాతగా హీరో సుధీర్‌బాబు తొలి ప్రయత్నం ‘నన్ను దోచుకుందువటే’. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు కన్నడ నటి నభా నటేశ్. సినిమా సక్సెస్‌లో తన పాత్ర ఎంతో ఉందనే ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు నటనకు కూడా శభాష్ అనిపించుకున్నారు. ఆ హిట్‌తో వరుస సినిమాలతో బిజీ అయ్యారు నభా. రవితేజ ‘డిస్కో రాజా’లో ఓ హీరోయిన్గా, పూరి జగన్నాథ్–రామ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’లో ఓ హీరోయిన్గా చేస్తూ బిజీగా ఉన్నారు. – గౌతమ్ మల్లాది -
కాల స్వరూపం అమోఘం
తెలుగు వారి నూతన సంవత్సరాన్ని శుభకామనలతో, కాలస్వరూపుడైన భగవంతుని ఆరాధనతో పవిత్రంగా ఆరంభించడం సంప్రదాయమని, పంచాంగం చూడటమనేది పెద్దల చాదస్తమని కొట్టి పారేయడం సరి కాదనీ, కాలగణన వెనక ఎంతో నిశితమైన పరిశీలన, దూరదృష్టి ఉన్నాయనీ, అదేవిధంగా జ్యోతిష్యమనేది అవాస్తవమని కొట్టిపారేయడం అవివేకమనీ, జ్యోతిషానికి శాస్త్ర ప్రమాణం ఉందని అంటున్నారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు సాక్షికి ప్రత్యేకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణంలో... ఉగాది ప్రాశస్త్యాన్ని, నూతన ఉగాది ఫలాలనీ వారి మాటలలోనే తెలుసుకుందాం.. మన భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి. మనదేశంలోనే యుగాది భేదాలతో కాల విభాగం, దైవిక లౌకిక కర్మ విభాగాలు ఉన్నాయి. ఇతర దేశాలలో లేవు. మన రుషులు కాల నిర్ణయం అద్భుతంగా చేశారు. కాలం అంటే ఏమిటీ! భూత.. భవిష్యత్.. వర్తమానాలే కదా కాలాలు. ఈ కాలానికి రూపమేది! అంటే ప్రాణుల కదలికలు, పెరుగుదల, తగ్గుదల, ఆధారం చేసుకుని మానవుల మదిలో మెదిలేదే కాలం. కాలానికి రూపం లేదు. వస్తువులకు రూపం ఉంది. జరిగిపోయిన కాలాన్ని భూతమని.. రాబోయే కాలాన్ని భవిష్యత్ అని.. జరుగుతున్న కాలాన్ని వర్తమానం అని అంటాం. అసలు వర్తమానానికి ఎక్కడి నుంచి ఎక్కడకు కొలమానం? అంటే దానికి స్పష్టత లేదు. ఈ వర్తమానాన్ని ఆధారం చేసుకుని భూత, భవిష్యత్ కాలాలు ఉన్నాయి. అయితే కాలం రూపం లేనిది.. నిలకడ లేనిది కనుక అది వాగారంభణమే.. అంటే నోటి మాట మాత్రమే అనేది వేదాంత సిద్ధాంతం. అయితే లోకం గురించి కాలనిర్ణయాన్ని మన పూర్వీకులు చాలా చక్కగా చేశారు. సూర్యచంద్రాది గ్రహాలు, భూమి పరివర్తన ఆధారం చేసుకుని తిథులు, నక్షత్రాలు ఆధారం చేసుకుని కాల నిర్ణయం చేశారు. ప్రతిరోజు, ప్రతిమాసం, ఋతువులతో సహా ఎలా ఏర్పడుతుంది, భూమి మీద అన్ని ప్రాణులకి ఋతువులతోను, మనుషులతోను, ఉత్తర, దక్షిణాయనాలతోనూ ఎలా సంబంధం ఉన్నది అన్నది మన పూర్వీకులు చూపించారు. అధి దైవికమైన సూర్యాది గ్రహాలు, నక్షత్రాలు, ఉరుములు, మెరుపులతో కూడిన సర్వదివ్యమైన జ్యోతనమైన అధి దైవికంతో భూగోళానికి ఉన్న సంబంధం మన కాల నిర్ణయం. దానినే జ్యోతిష్యం అంటాము. కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్మము అంటారు. ఖగోళ, భూగోళ సంబంధాన్ని తెలియజేసేది ప్రత్యక్షంగా కనిపించే ప్రపంచ చిత్రపటలాన్ని నమ్మము అంటే అవివేకమే.జ్యోతిష్యం అంటే మూఢ విశ్వాసం కాదు. ఇతర దేశాలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు పెట్టుకునే సంవత్సరం కేవలం విశ్వాసంతో కూడినది కానీ మన సంవత్సరం విశ్వాసం మాత్రమే కాదు. ఖగోళంతో కూడిన సర్వసంబంధాలు భూమికి సంబంధం కలగడం వలన ప్రత్యక్ష ప్రచారంలో అనుభవ సిద్ధమైనది. మరి ఇంత విశాలమైన ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికాలతో కూడిన ఈ ప్రపంచం అనే ప్రకృతి ఎలా సృష్టించబడింది?.. అది ఎప్పుడు? అంటే దానిని తెలియజేసేదే మన యుగాది. సృష్టి ఆరంభం... మన ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటున్నాం. ధర్మసింధులో ఆ రోజున సృష్టి ప్రారంభమైనట్లు ఉంది. హేమాద్రిలో కూడా ‘చైత్రే మాసి జగత్ బ్రహ్మ ససర్జ ప్రధమేఒహని’ అన్నాడు. అంటే బ్రహ్మ చైత్ర శుద్ధి పాడ్యమి నాడు జగత్తును సృష్టించాడని ఉంది. అయితే ఒక వస్తువు సృష్టి కావాలంటే దానిని సృష్టించేవాడు, దేశం, కాలం అనేవి కావాలి కదా. బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడు అంటే అతను ఎక్కడ ఉండి ఎప్పుడు సృష్టించాడు? దానికి దేశం, కాలం చెప్పవలసి ఉంది. అలా అంగీకరిస్తే దేశాన్ని కాలాన్ని అతను సృష్టించ లేదనే కదా? అంతేకాదు దేశం, కాలం అనేవి జగత్తులోనే అంతర్గతాలు. కనుక జగత్తుని ఎక్కడ సృష్టించాలి. ఎప్పుడు సృజించాలి అనే ప్రశ్నలే పుట్టవు. శ్రుతి ఇలా చెప్పిందే కాని సృష్టి జరిగిందని ఎప్పుడూ నిరూపించలేదు. సృష్టి జరిగితే బంధం అనేది సత్యం అవుతుంది. కనుక బంధ నివృత్తి ఎప్పుడూ కాదు. సత్యానికి నివృత్తి ఎక్కడిది? అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ నకర్త్నత్వం, న కర్మోణి లోకస్య సృజతి ప్రభుః...అని అన్నారు. అంటే ఈ సృష్టిని చేయనేలేదని, అజ్ఞానం చేత పరమాత్మనే జగత్తు అని భ్రాంతి పొందుతున్నామని అన్నారు. మట్టిని వీడి కుండ లేదు అంతా మన్నే అన్నట్లు పరమాత్మ చేత జగత్తు పుట్టింది అంటే పరమాత్మను వదలి జగత్తు లేదు అంతా పరమాత్మయే అనే జ్ఞానం ఉపదేశించడానికే ఈ సృష్టి ప్రక్రియ ఒక ఉపాయం అని శ్రీగౌడపాదాచార్యులు ‘ఉపాయః స్నోవతామామ’ అని అన్నారు. ఉగాది పండగ అంటే ఏమిటి? ఈ చైత్ర మాసంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చెట్లు చేమలు తమ పాత ఆకులను రాల్చి కొత్త చిగుళ్ళతో కళకళలాడుతూ ప్రకృతి అంతా నవనవలాడుతుంది. అలాగే భక్తుడు ఈ ఉగాది నుండి అయినా సద్గురువులను ఆశ్రయించి తనలోని దోషం, క్రోధం, అసూయ, మిధ్యాజ్ఞానం, దురభిమానం అనే పాత భావాలను రాల్చి శాంతి.. దయ, విద్య మొదలగునవి సంపాదించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిలాగే మనగలిగే అనేక మానసిక ఒత్తిడులకు తలొగ్గక ధీరులై ఉండి మనందరి ఆత్మీయ విశ్వం, పరమార్థం అనే సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడమే ఉగాది పండుగ. అంతేగాని ఆ రోజు రకరకాల పిండివంటలు తిని ఉగాది బాగా జరిగింది అని అనుకుంటే అది భ్రాంతే. అయితే ఈ కొత్త సంవత్సరం వికారి నామసంవత్సరం పెద్దలు, యువకులు, సకల ప్రాణులు పరమాత్మ దయ వలన ఈ సంవత్సరమంతా బాగుండాలి. పంటలు పండాలి. అన్నం పెట్టే రైతు బాగుండాలి. సమర్థవంతమైన పాలన ఉంటుంది వికారి నామసంవత్సరంలో రాజు శని అయినందున మంత్రులు సమర్థవంతంగా పరిపాలన సాగిస్తారు. రాజకీయపరంగా ప్రతిపక్షంలో ఉన్న వారు బలం చూపించుకునే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయితే రవిగ్రహం మంత్రి అయిన కారణం చేతను రవి, శని శత్రువులు అయిన కారణంగానూ పరిపాలన విషయంలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ధనుస్సునందు గురు, శని, కేతు గ్రహాలు ఉండి ఈ రాశికి ఆరవ రాశినందు కుజుడు ఉండడం వలన అధికార, ప్రతిపక్షాలకు పోరు అధికంగా ఉంటుంది. ఈ గ్రహ యుద్ధంలో చివరి నిమిషంలో అధికార పక్షానికి ప్రమాదం ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఈ సమయంలో వాహన, అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. పంటలు బాగా పండుతాయి జనవరి నెలలో చాతుర్గ్రహ కూటమి కారణం చేత సరిహద్దు ప్రాంతాలలో యుద్ధ వాతావరణం ఉండే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉండే అవకాశం ఉంది. బుధుడు సస్యాధిపతి కావడం వల్ల పంటలు బాగా పండుతాయి. పెసలకు మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధ వ్యాపారాలు బాగుంటాయి. చంద్రుడు ధాన్యాధిపతి అయిన కారణంగా మంచి వర్షాలు కురుస్తాయి. పశుసంపద పెరుగుతుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. ఈ సంవత్సరం ప్రధానంగా ధనుస్సునందు గురు, శని, కేతువుల కలయిక వలన దేశారిష్టయోగం ఉంది. దీని నివారణార్థం అధికారులు పీఠాధిపతులను, గురువులను సంప్రదించి శాంతి కర్మ ఆచరించిన తరువాత అంతా శుభాలు కలుగుతాయి. స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పంచాంగం..‘వికారి’ ప్రవర్తన... ‘తిథిర్యారంభ యోగఃకరణమేవచ పంచాంగమతి విశ్యాతం లోకోయం కర్మ నాథక’ అంటారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంశాలతో కూడుకుని ఉన్న దానిని పంచాంగం అంటారు. అసలు పంచాంగాలతో ఎవరికి ఉపయోగం? దాని వలన ప్రయోజనం ఏమిటి? అనే సందేహాలు నేటితరంలో అందరినీ బాధిస్తున్నాయి. ఈ పంచాంగాలు వృద్ధులకు మాత్రమే సంబంధం మాకు కాదు అంటారు యువకులు. నిజానికి ఈ పంచాంగం అంటే వ్యక్తిగత విషయం కాదు అని గ్రహించాలి. వైయుక్తిక విషయముల కంటే సార్వత్రిక విషయాలే పంచాంగాల ముఖ్య లక్షణం. అది ఎలాగో పరిశీలిద్దాం. పంచాంగ గణితం మనకు అమావాస్య, పౌర్ణమి రూపంలో ప్రత్యక్ష ప్రమాణంగా సామాన్యులకు సైతం ఉన్నది. వర్షాల విషయంలో కూడా ప్రామాణికంగా తెలియజేస్తున్నాయి. ప్రధానంగా గ్రహణాలు ఏ నిమిషానికి ప్రారంభమయి ఏ నిమిషంలో అంతమవుతాయి– అనే విషయంలో కూడా పంచాంగాలే ప్రామాణికం. పై విషయాలను నేటి సాంకేతిక విజ్ఞానంతో శాస్త్రవేత్తలు ఎన్నో కోట్ల వ్యయంతో పరిశ్రమ చేసి తెలుసుకుంటూ ఉంటే అవే విషయాలను శాస్త్రవేత్తలకు ఏ మాత్రమూ తీసిపోకుండా మన పంచాంగ కర్తలు కేవలం కాగితం, కలం సహాయంతో తెలుసుకుంటున్నారు... నిరూపిస్తున్నారు. ఇటువంటి పంచాంగం మన సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది. దీనినే ఉగాది అంటారు. యుగాది అనే శబ్దం నుంచి ఉగాది అనే మాట వాడుకలోకి వచ్చింది. ఈ రోజున అభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణం, షడ్రసాత్మకమయిన ఉగాది పచ్చడిని తినడం, పెద్దలకు నమస్కరించడం, పంచాంగ శ్రవణం చేయడం మన తెలుగువారికి ఆచారం. - సమ్మంగి భాస్కర రావు, సాక్షి, పెందుర్తి -
వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని.. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ తెలుగు సంవత్సరంలో సకాలంలో వానలు పడి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పాడిపంటలతో రైతులు వర్ధిల్లాలని, పల్లెలు కళకళలాడాలని సకల వృత్తులూ పరిఢవిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అభివృద్ధి ఫలాలను మెండుగా అందుకోవాలని ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి ఎనలేని జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని అభిలషించారు. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకునే సమయంలో ప్రచార సభలతో ఇబ్బంది పెట్టరాదన్న ఉద్దేశంతో రేపు(ఏప్రిల్ 6న) వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రచారానికి విరామం ప్రకటించారు. అమరావతిలోని స్వగృహంలో వైఎస్ జగన్ ఉగాది పండుగను జరుపుకోనున్నారు. -
తలపుల్లో ఊరు.. బతుకుల్లో కన్నీరు..
సాక్షి, కొత్తూరు (శ్రీకాకుళం): లక్షలాది మంది ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన వంశధార నిర్వాసితులు ఉగాది పండగ రాకతో కన్న ఊరును తలచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇదివరకు ఉగాది రోజు సాంప్రదాయబద్ధంగా పొలాల్లో మొదటి ఏరుపూసి, పంటలు బాగా పండాలని భూదేవికి పూజలు చేసేవారు. కానీ ప్రస్తుతం కన్న ఊరు, పంట పొలాలను విడిచి పునరావాస కాలనీకి రావడంతో గుండెల్లో బాధతో ఒకింత ఉద్వేగానికి లోనవుతున్నారు. మన అనే వాళ్లందరితో మమేకవుతూ జరుపుకునే పండగను ఒంటరిగా జరుపుకుంటున్నామని కుంగిపోతున్నారు. మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం 19 నిర్వాసిత గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన అనేక మంది రైతులు సొంత ఊరును, పంట పొలాలను వదులుకొని కొత్తూరు, హిరమండలం, ఎఎల్ఎన్పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలకు తరలి వచ్చారు. అయితే పునరావాస కాలనీకి వారు వచ్చిన తర్వాత మొదటిసారి ఉగాది పండగ వస్తోంది. దీంతో ఏరు పూసేందుకు సొంత భూములను లేకపోవడంతో గతం గుర్తు చేసుకుంటూ గుండెను రాయి చేసుకుంటున్నారు నిర్వాసితులు. నిజానికి వీరిలో చాలామందికి భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీచేసి పునరావాస కాలనీలకు వచ్చారు. దీంతో సాంప్రదాయాన్ని వీడలేక ఇంటి ముందరనే బంగారు ఉంగరాలతో భూమిపై గీటువేసి సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. బంధం తెగిపోయింది భూములతో తరాలు నుంచి బంధం తెగిపోయింది. ఉగాది పండగకు మొదటి ఏరు పూసి ఉగాది పండగను చేసుకోవడం అనవాయితీ. కానీ గ్రామాలు నుంచి పునరావాస కాలనీలకు చేరడంతో తరాలు నుంచి వస్తున్న భూములు లేక ఎంతో బాధగా ఉంది. - బి.రామకృష్ణ, పాడలి గ్రామం, నిర్వాసితుడు కన్నీరు వస్తోంది ఇదివరకు తాతలు నుంచి వస్తున్న భూముల్లో ఉగాది రోజు మొదటి ఏరు పూసి భూదేవికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ నిర్వాసిత గ్రామాలు నుంచి పునరావాస కాలనీలకు చేరడంతో సెంటు భూమి లేక ఉగాది పండగ అనగానే కన్నీరు వస్తోంది. - పి. శేషగిరి, నిర్వాసితుడు, ఇరపాడు, పునరావాస కాలనీ -
ఉగాది రోజు వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టో
సాక్షి, హైదరాబాద్ : ఉగాది పర్వదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం పది గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు ఉదయం 8:15 నిమిషాలకు ‘ఉగాది ఆస్థానానికి చేరుకోవటం, తదుపరి గురు వందనం, పంచాంగానికి అర్చన, పంచాంగ శ్రవణం, వేదస్వస్తి, ఉగాది ప్రసాదం స్వీకరించటం, ఆఖరిలో పండిత సత్కారం’ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉగాది పూజా కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని, అనంతరం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు. ఈ ఉగాది వేడుకల్లో పార్టీ నేతలంతా పాల్గొనాలని ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలోని కమిటీ మ్యానిఫెస్టోను రూపొందించింది. నవరత్నాలతో పాటు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను ఈ మ్యానిఫెస్టోలో చేర్చారు. -
టీఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
చికాగో: చికాగో మహా నగర తెలుగు సంస్థ(టీఏజీసీ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చికాగోలోని స్ట్రీమ్వుడ్ హై స్కూల్ ఆడిటోరియంలో ఏప్రిల్ 14న జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 1000మంది తెలుగు వారు పాల్గొన్నారు. 325 మంది స్థానిక కళాకారులు వివిధ కార్యక్రమాలతో అతిథులను అలరించారు. కిడ్స్ కామెడీ స్కిట్, బాల రామాయణం, దివంగత నటి శ్రీదేవికి నివాళి, ఉగాది, శ్రీరామనవమికి సంబంధించి కార్యక్రమాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, కల్చరల్ కమిటీ ఛైర్మన్ రంగారెడ్డి లెంకల, కో ఛైర్స్ ఉమా అవదూత, శ్వేత జనమంచి, మాధవి కొనకొల్లలు, కల్చరల్ కమిటీ సభ్యులు, కో ఆర్డినేటర్స్ గత 6 వారాలుగా ఈ వేడుకల కోసం అహర్నిశలు కృషి చేశారు. వేడుకల డెకరేషన్ పనులను వాణి యెంట్రింట్ల దగ్గరుండి చూశారు. టీఏజీసీ మెంబర్షిప్ కమిటీ, ప్రవీణ్ వేములపల్లి, మమత లంకల, విజయ్ బీరం, మమత లంకలలు అతిథులను సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఎంఎస్‌ఐకి చెందిన అశోక్ లక్ష్మణన్, టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి, మాజీ అధ్యక్షులు ప్రదీప్ కందిమళ్ల, యూత్ ఛైర్ అవినాష్ లటుపల్లి ఎంపిక చేసిన యువతకు ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్(పీవీఎస్ఏ) సర్టిఫికెట్స్ అందజేశారు. ఫుడ్ కమిటీ ఛైర్ శ్రీనివాస్ కంద్రు ఉగాది పచ్చడితోపాటూ, రుచికరమైన వంటకాలను అతిథుల కోసం ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంజి రెడ్డి కందిమల్ల, సంపత్ సప్తగిరిలు ఆహారం సరఫరా, ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాలంటీర్లకు జ్యోతి చింతలపాణి కృతజ్ఞతలు తెలిపారు. -
స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది వేడుకలు
సాక్షి, ఎడింబరో : స్కాట్లాండ్లోని తెలుగు ప్రవాసులు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్కాట్లాండ్ తెలుగు సంఘం(టాస్) ఆధ్వర్యంలో శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 7న ఎడింబరోలోని డల్కిత్ హై స్కూల్ ప్రాంగణం ఆడిటోరియంలో వైభవంగా జరిగాయి. టాస్ కార్యవర్గ సభ్యులు వేడుకలకు వచ్చిన వారందరికీ ఉగాది పచ్చడి అందించి స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో ఉగాది 2018 వేడుకలు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న తెలుగు వారి పిల్లలు సంస్కృతిక శ్లోకాలు, వేమన పద్యాలు పాడి, సాంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యంతో అతిథులను ఆశ్చర్యపరిచారు. టాస్ ఛైర్మన్ సత్య శ్యాం కుమార్ మాట్లాడుతూ తెలుగు వారిగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉందని, అందుకు ఇలాంటి వేడుకలు వేదిక అనీ అన్నారు. టాస్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యచరణపై వివరించారు. ఈ సందర్భంగా ఆధ్యక్షుడు నాగుబండి రంజిత్ తెలుగు భాష ప్రత్యేకతను తెలియజేసే సిలికాన్ ఆంధ్ర మనబడిలో ఎక్కువ మార్కులు సాధించిన చిన్నారులకు, బహుమతుల ప్రదానం చేశారు. స్కాట్లాండ్లోని తెలుగు వారి పిల్లలు అందరూ తెలుగు నేర్చుకోవాలని సూచించారు. జనరల్ సెక్రటరీ చింపిరి శివ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ గీతం "జన గణ మణ" వందన సమర్పణతో స్కాట్లాండ్ తెలుగు సంఘం ఉగాది 2018 వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలోనే టాస్ నూతన కార్యవర్గ (2018 - 2020) సభ్యుల ఎన్నిక జరిగింది. టాస్ నూతన కార్యవర్గం(2018 - 2020) - జయంతి సత్య శ్యాం కుమార్ - సభాపతి (ఛైర్మన్) - కెంబూరి మైథిలి - ఆధ్యక్షుడు (ఫ్రెసిడెంట్) - చింపిరి శివ - ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రెటరి) - గడ్డం వెంకటేష్ - కోశాధ్యక్షులు (ట్రెజరర్) - కుచాడి ఉదయ్ కుమార్ - సాంస్కృతిక కార్యదర్శి (కల్చరల్ సెక్రెటరి) - అప్పరల రవి తేజస్వి - మహిళా కార్యదర్శి (విమెన్స్ సెక్రెటరి) - ప్రతిపటి చైతన్య - సాంకేతిక & (ఐ. టి. సెక్రెటరి) - నూక నిరంజన్ - పౌర సంబంధాల కార్యదర్శి (పి. ఆర్ సెక్రెటరి) - నరుకుళ్ళ రంగనాథ్ - క్రీడా కార్యదర్శి (స్పోర్ట్స్ సెక్రెటరి) - అప్పరాల మాధవి లత - ప్రాజెక్టుల కార్యదర్శి -
దక్షిణాఫ్రికాలో ఘనంగా ఉగాది వేడుకలు
జొహన్నెస్‌బర్గ్ : ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(ఆశా) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జొహన్నెస్‌బర్గ్‌లోని దాదాపు 800మంది తెలుగు వారు ఈ ఉగాది సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలకి, పెద్దలకి ఆటల పోటీలు నిర్వహించారు. సంప్రదాయక నృత్యాలు, డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. పురోహితుడు పంచాంగ శ్రవణం చేశారు. అతిథులకు ఉగాది పచ్చడితోపాటూ రుచికరమైన ఆంధ్ర వంటకాలను ఏర్పాటు చేశారు. అనంతపురం వంటకం ఒలిగలు( బొబ్బట్లు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ కాన్సుల్ జనరల్ కేజే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రెసిడెంట్ కుమార్ ఎద్దులపల్లి ఆశా ప్రస్థానం గురించి వివరించారు. ఆశా రైతు సంఘం తరపున అనంతపురం జిల్లా ఎద్దులపల్లిలో ఏడుగురు పేద రైతులకి వడ్డిలేని ఋణం కింద రూ. 4,55,000 ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఆశా చైర్మన్ సుబ్రమణ్యం చిమట ఉగాది వేడుకలను విజయవంతం చేయడంలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. -
న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
ఆక్లాండ్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(ట్యాంజ్) ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆక్లాండ్‌లోని మౌంట్ రాస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హానరరీ ఇండియన్ హై కమిషన్ అఫ్ న్యూజిలాండ్ భావ్ దిల్లోన్, ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భికూ బాణాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలతోపాటు ఇతర రాష్ట్రాల వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఉగాది ప్రాముఖ్యతను ఉమా రామారావు రాచకొండ వివరించగా, ఆచార్య సందీప్ కుమార్ ప్యారాక పంచాంగ శ్రవణం చేశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పలు సంస్కృతిక, నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. వండర్ గర్ల్స్, తెలంగాణ హార్ట్ బీట్ గ్రూప్స్ ఆధ్వర్యంలో చేసిన డ్యాన్స్, ఫ్యాషన్ షోలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. కార్యక్రమానికి విచ్చేసిన అందరికి ఉగాది పచ్చడితో పాటు, తెలంగాణ శాఖాహార విందును ప్రసన్న, గిరిధర్, శ్రీహరి ఏర్పాటు చేశారు. ట్యాంజ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి ఉగాది కరదీపికలు ముద్రించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ఉగాది సంబురానికి విచ్చేసిన అతిథులకు పుస్తకాలను అందించడానికి సహకరించిన తెలంగాణ సంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ మామిడికి, టీఆర్ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కోసినకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు ప్రపంచ మహాసభలు జరపడం, తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చెయ్యడం గొప్ప పరిణామమని తెలిపారు. అలాగే తెలుగును న్యూజిలాండ్‌లో ప్రోత్సహించేందుకు వీలుగా ఇండియన్ అసోసియేషన్ టాగోర్ లైబ్రరీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, భాష, యాస సూచికలైన పలు పుస్తకాలను ఉంచబోతున్నట్టు వెల్లడించారు. తెలుగును రెండవ భాష ఆప్షన్‌గా పాఠశాలలో భోధించేలా న్యూజిలాండ్ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ట్యాంజ్ కోర్ అడ్వైజర్ నరేందర్ రెడ్డి పటోళ్ల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ట్యాంజ్ కార్యవర్గ సభ్యులు నర్సింగ రావు పట్లొరి, విజేత రావు, రామ రావు రాచకొండ , జగన్ రెడ్డి వాడ్నలా, రామ్మోహన్ దంతాల, రామ్ రెడ్డి తాటిపత్రి, వినోద్ రావు ఎర్రబెల్లి , సురేందర్ రావులు తమ వంతు కృషి చేశారు. -
సింగపూర్‌లో ఉగాది కల్చరల్ నైట్
-
చికాగోలో ఘనంగా ఉగాది వేడుకలు
చికాగో తెలుగు అసోసియేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. చికాగోలోని బాలాజీ ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు 600 మందికి ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ఆటా, పాటలతో ఈ వేడుక ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. రమ్య కపిల, అన్వితల గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. సురేష్ బాదం, అన్వితలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వేమన, సుమతి శతకాల నుంచి చిన్నారులు పద్యాలను పాడుతూ, అర్థాన్ని వివరించారు. ఉగాది పచ్చడి పోటీల్లో టాప్ 10 మందిని ఎంపిక చేసి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఆచార్యులు సుబ్రమణ్యం పంచాంగ శ్రవణం చేశారు. ఇటీవల మృతిచెందిన ప్రముఖ నటి శ్రీదేవి జ్ఞాపకార్థం అనిత గోలి, భవాని నైనాల పర్యవేక్షణలో 20 మంది చిన్నారులు శ్రీదేవి నటించిన చిత్రాల్లోని పాటలకు డ్యాన్సులు వేశారు. కల్చరల్ టీమ్ సభ్యులు అనిత గోలి, అనుష విడపలపాటి, సుజన ఆచంట, రాణి వేగె, భవాని అమి, హవిలా దేవరపల్లి, సురేష్ బాదం, అన్విత, కౌసల్య గుత్త, రమ్య కపిలలు సమిష్టిగా సంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగా, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు నవీన్ గంటా, హరి ప్రసాద్, భూషణ్, ఆనంద్ పిల్లి, నాగభూషణం బీమిశెట్టి, రామ్ గోపాల్ దేవరపల్లి, ప్రమోద్ పైడిపెల్లి, ధీరజ్ మంతేన, చైతన్య కాకర్ల, మురళి పరిమి, ఉమాదేవి సన, విష్ణు, జలగం, మైథిలి జలగం, అనిల్ మోపర్తి, భవాని సరస్వతిలు సహాయ సహకారాలు అందించారు. సీటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ తళ్లూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు అందజేశారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రవీణ్ మొటూరు, రమేష్ మర్యాల, డా. పాల్ దేవరపల్లి, రావు ఆచంట, అశోక్ పగడాల, రాహుల్ విరాటపు, కమ్యునిటీ సభ్యులు ఆజాద్ సుంకవల్లి, క్రిష్ణ ముశ్యం, క్రిష్ణ రంగరాజు, రత్నాకర్ కరుమూరిలు ఈ వేడుకలు విజయవంతం కావడానికి తమవంతు కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కల్చరల్ టీమ్ సభ్యులు, అతిథులకు సీటీఏ అధ్యక్షులు నాగేంద్ర వేగె కృతజ్ఞతలు తెలిపారు. -
కాన్సస్‌లో ఉగాది వేడుకలు
కాన్సస్ : అమెరికాలోని కాన్సస్ సిటీలో తెలుగు అసొసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ(టీఏజీకేసీ) ఆధ్వర్యంలో శ్రీ విళంభి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఓవర్ ల్యాండ్ పార్క్‌లోని బ్లూ వ్యాలీ నార్త్ వెస్ట్ హై స్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 800 మందికి పైగా తెలుగు వాళ్లు పాల్గొన్నారు. దేవాలయ పూజారి శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. ప్రొగ్రామ్ కమిటీ ఛైర్ విశేషు రేపల్లె అతిథులందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రావణి మేక, దీప్తి జొన్నలగడ్డలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పిల్లలు ప్రదర్శించిన శాస్త్రీయ, సినిమా పాటల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. టీఏజీకేసీ అధ్యక్షులు సురేష్ గుండు తన కార్యవర్గ సభ్యులను పాట ద్వారా వేడుకపైకి ఆహ్వానించారు. తెలుగు సాహితి, సంస్కృతిలను కాపాడుతూ, ముందు తరాలవారికి అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సురేష్ పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవ కనుక ఎవరికి తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయాలని కోరారు. టీఏజీకేసీ ట్రస్ట్ బోర్డ్ ఛైర్ శిరీష మంచెల్ల ట్రస్ట్ బోర్డ్ కార్యవర్గాన్ని అందరికి పరిచయం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సంఘానికి సేవలు చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ముగ్గులపోటీలు, చెస్, క్యారం బోర్డ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యక్షులు శివ తియాగుర కార్యక్రమ విజయానికి సహాయం అందించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. -
ఓర్లాండోలో 'మౌర్యచరితం'
ఓర్లాండో(అమెరికా) : అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రదర్శించిన మౌర్యచరితం పద్యనాటకం ఆహుతులను ఎంతగానో అలరించింది. బుర్రకథను పద్యనాటకాన్ని కలుపుతూ తయారు చేసిన కథనం, కథనానికి ధీటుగా సంభాషణలు సాగాయి. ప్రవాస యువకవి తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి రాసిన పద్యాలు సంభాషణలకు ప్రాణం పోశాయి. చాణక్య పాత్రలో శర్మమొదలి అద్భుతంగా నటిస్తే, చంద్రగుప్తమౌర్యునిపాత్రలో సాయిప్రభాకర్ యెర్రాప్రగడ అభినయం ఒక కొత్త ఒరవడి సృష్టించే విధంగా సాగింది. గ్రీకు చక్రవర్తిగా ఈశ్వర్ కనుమూరి అభినయం అందరిని ఆకట్టుకుంది. బుర్రకథ పాటని చంద్రశేఖర్ అయ్యలరాజు, సత్యమంతెన, కళ్యాణ్ తటవర్తి చక్కగా పాడారు. శిరీష ఖండవిల్లి, జాహ్నవీ తటవర్తిలు సంగీతం అందించగా, కూర్పు చేసిన రవి ఖండవిల్లిని వేడుకలకు వచ్చిన వారందరూ ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి కొత్తతరహా పద్యనాటకాలు మరింత రావాలని, తెలుగు భాషను సుసంపన్నం చేయాలని ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో తమ కరతాళధ్వనులద్వారా తెలిపారు. -
దక్షిణ కొరియాలో ఉగాది, శ్రీరామ నవమి సంబరాలు
సియోల్ : దక్షిణ కొరియాలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఆదివారం ఉగాది, శ్రీరామ నవమి పండగలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. దేశ రాజధాని సియోల్ సమీపంలోని సువన్ నగరంలో గల సంగుక్వాన్ (ఎస్‌కేకేయూ) విశ్వవిద్యాలయంలో ఈ వేడుకలు జరిగాయి. దక్షిణ కొరియా తెలుగు సంఘం(టీఏఎస్కే) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక తెలుగు విద్యార్థులు, పలు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఉగాది పచ్చడి రుచి చూసి, పంచాగ శ్రవణం చేశారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పానకం పంచారు. ఆటపాటలతో అలరించారు. టాస్క్ కోర్ కమిటీ సభ్యలు డాక్టర్ సుశ్రుత కొప్పుల, డా. వేణు నూలు, అనిల్ కావల, డా. కొప్పాలి స్పందన రాజేంద్ర, అంకంరెడ్డి హరినారాయణ, సంపత్ కుమార్, సాయి కృష్ణ చిగురుపాటి నేతృత్వం వహించారు. అనంతరం మహిళలు కోలాటంతోను, చిన్నారులు ఫ్యాషన్ షోతోను అలరించారు. -
సింగపూర్‌లో ఉగాది కల్చరల్ నైట్
సింగపూర్ సిటీ : తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలు సింగపూర్ నగరంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక కల్లాంగ్ థియేటర్, వన్ స్టేడియం వాక్‌లో ఈ వేడుకలను సింగపూర్ తెలుగు సమాజం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 1,700 మంది స్థానిక తెలుగు వారు హాజరయ్యారు. పాటల రచయిత చంద్రబోస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాంకర్ శ్యామల, సింగర్స్ సత్య యామిని, అనుదీప్, ప్రవీణ్ కుమార్, వీఆర్ లక్ష్మీ , కమెడియన్స్ మాస్ అవినాష్, కెవ్వు కార్తీక్, తాగుబోతు రాజమౌళి, డ్యాన్సర్స్ ఆట సందీప్ టీమ్‌తో పాటు ఢీ జోడి ఫేమ్ ప్రియాంకలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. రచయిత చంద్రబోస్ తన ఇరవై మూడేళ్ల సాహితీ ప్రస్థానాన్ని పాటలహారంగా మలచి సింగపూర్ తెలుగు ప్రజల ముందుంచారు. తెలుగుభాష పరివ్యాప్తికి, పరిరక్షణ గురించి పాటుపడుతున్న తెలుగు సమాజం కృషిని, తాపత్రయాన్ని ఆయన అభినందించారు. త్వరలో జరగనున్న కార్మిక దినోత్సవ కార్యక్రమ సన్నాహాకాల్లో భాగంగా నిర్వహించే క్రికెట్ పోటీలను చంద్రబోస్ ఆరంభించారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరూ కలిసిమెలిసి ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కివక్కాణించారు. ఉగాది కల్చరల్ నైట్ 2018కు ముఖ్య స్పాన్సర్స్ గా ఉన్న యప్ టీవీ, గ్రీన్ ఏకర్స్, ఆదిత్య బిల్డర్స్ తదితర స్పాన్సర్స్ కు, అశేషంగా ఆదరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి కోటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులు సత్య ఎస్, జ్యోతీశ్వర్, నాగేష్, వినయ్, రామ్, అనిల్, ప్రదీప్, ప్రసాద్, మల్లిక, ఇతర స్వచ్ఛంద కార్యకర్తల కృషిని కార్యదర్శి సత్య చిర్ల కొనియాడారు. -
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకొని, రాబోయే సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని తిరుమల తరహాలో సుప్రభాతసేవ, తోమాలసేవ, తిరుమంజనం, సహస్రనామార్చన, ఇతర విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉగాది వేడుకలకు భారీ ఎత్తున స్థానిక తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొన్నారు. వేదమంత్రోచ్చరణలతో, భక్తుల గోవింద నామాలతో, భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పూజానంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అందరికీ షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి, అన్నదాన వితరణ చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సింగపూర్ తెలుగు సమాజం సభ్యులు సుమారు 3000 మంది స్థానిక తెలుగువారికి వేపపువ్వును ఉచితంగా అందించారన్నారు. ప్రాంతీయకార్యదర్శి అనిల్ పోలిశెట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక చాలామంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు. సమాజం సభ్యులకు, దాతలకు, కార్యకర్తలకు, వాలంటీర్లకు కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఐదుగురు మంత్రులకు ఉద్వాసన?
సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన ప్రగతితో అగ్రగామిగా దూసుకుపోతోన్న తెలంగాణ నిజంగా దేవభూమి అని, రాష్ట్రం దేవరాష్ట్రమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడ జరిగినన్ని పూజలు దేశంలో మరెక్కడా జరగవని, ఆలయాలు, మసీదులు, చర్చీలను సమానంగా చూస్తున్న ఘనత ఒక్క తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తనను తాను అభివృద్ధి చేసుకుంటూ దేశనిర్మాణంలోనూ తెలంగాణ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నదని చెప్పారు. ఆదివారం ప్రగతి భవన్లో జరిగిన ఉగాది వేడుకలో పంచాంగ శ్రవణం అనంతరం సీఎం మాట్లాడారు. పంచాంగం గొప్ప సైన్స్: పూర్వకాలంలోనే గ్రహణాలకు సంబంధించి ఖచ్చితమైన సమయాన్ని లెక్కకట్టేవారని, పురాణాలు, ఇతిహాసాల ద్వారా అద్భుతమైన విజ్ఞానం మనకు సంక్రమించాయని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ‘‘పంచాంగమంటే ఆషామాషీ వ్యవహారం కాదు గొప్ప సైన్స్. పంచాగ రచన అనేది శాస్త్రీయ రచనే. ఇందులో మూల సిద్ధాంతం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. చెప్పేవారు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవచిస్తారు. ఈ ఏడాది తెలంగాణకు అన్ని రకాలుగా బాగుంటుందని పండితులు చెప్పారు. రాష్ట్రంలోని దుర్మార్గుల ప్రకోపం కూడా తగ్గుతుందని అంటున్నారు. తనను తాను అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్న తెలంగాణ.. దేశ నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నది. ఇక రాజకీయాలకొస్తే.. కొన్ని రాశులవారికి ఎమ్మెల్యే టికెట్లు కష్టమని పండితులు అంటున్నారు. ఆయా రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్‌లో కూర్చోకుండా ప్రజల మధ్యకు వెళ్లి పనిచేయాలి..’ అని సీఎం చెప్పారు. మంత్రులకు ఉద్వాసన? ప్రగతి భవన్ ఉగాది వేడుకల్లో పంచాగ శ్రవణం చేసిన బాచంపల్లి సంతోశ్‌కుమార్ శర్మ.. పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. అతి త్వరలోనే 5 నుంచి 8 మంది మంత్రులకు ఇబ్బందులు తప్పవని, మళ్లీ వారికి పదవులు లభించడం కష్టమేనని చెప్పడం, కొన్ని రాశులవారికి ఎమ్మెల్యే టికెట్లు దక్కవని హెచ్చరించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దేవాదాయ శాఖలో అవినీతికి ఆస్కారం ఉందని, పశువులకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి పశుసంవర్థకశాఖ అప్రమత్తంగా ఉండాలని, అక్టోబర్‌లో వానలు.. డిసెంబర్లో వరదలు వస్తాయని సంతోశ్ శర్మ చెప్పారు. సూర్య గ్రహ బలంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. ఎక్కడైనా చక్రం తిప్పగలరని పేర్కొన్నారు. మీడియా వార్తల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.. శుక్రప్రభావంతో 365 రోజులూ వార్తలే వార్తలుంటాయని చమత్కరించారు. -
మోదీ ఎగతాళి చేశారు: చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ‘‘దేశంలోనే సీనియర్ నాయకుడిని నేనే. నా తరువాతే అందరూ ముఖ్యమంత్రులయ్యారు. అలాంటి 29 సార్లు అడిగినా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదా?’అని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆదివారం విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన మాట్లాడుతూ బీజేపీపై నిప్పులుచెరిగారు. ‘‘నాలుగేళ్లు ఓపికగా తిరిగాను. 29 సార్లు అడిగాను. కానీ కేంద్రం ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. చివరాఖరి బడ్జెట్ చూసిన తర్వాత ఇక భరించలేకపోయాను. అందుకే గళం విప్పాను. బీజేపీని నమ్ముకుంటే మోసం చేశారు. ఇప్పుడు వాళ్లే యుద్ధం చేస్తామంటున్నారు. రాష్ట్రంలో లేనిపోని సమస్యలు సృష్టించే దిశలో బీజేపీ ప్రవర్తిస్తోంది. నాలుగు సంవత్సరాలు మాతో స్నేహంగా ఉండి.. ఒక్కసారే విమర్శలు చేస్తున్నారు. తెలుగువారు ఆత్మగౌరవం చంపుకొని ఉండలేరని ప్రధానమంత్రి మోదీతో చెబితే.. ఆయన పార్లమెంటులో ఎగతాళిగా మాట్లాడారు. దేశ సైన్యానికి ఖర్చుచేసే డబ్బులు కూడా అడుగుతారా అని జెట్లీ ఎద్దేవా చేశారు..’’ అంటూ ఆవేదనచెందారు చంద్రబాబు. ప్యాకేజీ వద్దు హోదానే కావాలి: పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన హక్కు ప్రత్యేక హోదా అని, దాన్ని సాధించేదాకా తెలుగుజాతి విశ్రమించొద్దని ముఖ్యమంత్రి అన్నారు. హక్కుల పోరాటంలో కళాకారులు, విద్యార్దులు ముందుకు రావాలని కోరారు. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని కేంద్రం అంటోదని, ఆ ప్యాకేజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోనని, ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి కావాలని స్పష్టంచేశారాయన. -
విళంబికి స్వాగతం
తెలుగువారు ఉత్సాహంతో, ఉల్లాసంతో, ప్రేమతో జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది ఉగాది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి దీనికే సంవత్సరాది అని కూడా పేరు. ఈ వేళ ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, దైవారాధన చేసి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభించడం సంప్రదాయం. గుడికి వెళ్లి, దేవుణ్ణి సందర్శించి, కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణ ం చేయడం ఆచారం. ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతోనూ, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. నిజానికి ఉగాది అనేది పూర్తి తెలుగుమాట కాదు. దీనికి సంస్కృత మూలం ‘యుగాది‘. అలా పలకలేక, ఉగాది అనే వికృతి రూపం సంతరించుకుంది. (ప్రకృతి– వికృతిలలో వికృతి. అంతేకాని, వికృత కాదు). బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేశాడట. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ‘ అని పేరు. అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ‘ అంటే నాశనం అని అర్థం. కల్పాంతంలో సృష్టి నాశనమయ్యేది కూడ ‘క్షయ‘ సంవత్సరంలోనే. సృష్టి ఆరంభమైన శుభదినం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని, మత్సా్యవతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాలను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. వసంత ఋతువు అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయాలు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) సంప్రదాయం. పంచాంగ శ్రవణం మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించాలని వ్రతగ్రంథ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి... వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది పూజ అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు. ఉగాది పచ్చడి ‘ఉగాది పచ్చడి‘ ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని, ఖాళీ పొట్టతో తీసుకోవడం మరీ మంచిదనీ అంటారు. నిజానికి ఈ వేపపూత పచ్చడిని శ్రీరామనవమి వరకూ సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరమంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం. ఒక్కో రుచీ ఒక్కో అనుభవం షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవాలు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఉంది. బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం ఉప్పు – జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతం వేప పువ్వు – చేదు –బాధకలిగించే అనుభవాలు చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు. మీకు తెలుసా? ♦ ఈ రోజు ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం శుభప్రదం. ♦ కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున, త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు, ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజునా ఉగాది జరుపుకునే వారు. ♦ శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. ♦ వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. ♦ పంచాంగ శ్రవణం చేస్తే గంగాస్నానం చేసినంత పుణ్యం. ♦ ‘పంచాంగం‘ అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. విళంబి అంటే ఆలస్యమని, జాగు అనే అర్థాలున్నాయి. జీవితంలో ఏది∙ఆలస్యం చేయాలో, ఏది తొందరగా చేయాలో తెలుసుకోవడం ప్రధానం. విళంబికి స్వాగతం పలుకుదాం. – డి.వి.ఆర్. -
కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మందమాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించమంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించుకోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్‌లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ -
రవితేజ ‘నేల టిక్కెట్టు’ కన్ఫామ్!
సాక్షి, సినిమా: రాజా ది గ్రేట్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజ్ రవితేజ తరువాత టచ్‌చేసి చూడు సినిమాతో తడబడ్డాడు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ స్టార్ 'నేల టిక్కెట్టు' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సంవత్సరాది ఉగాదికి కొత్త కొత్తగా కనిపించి అభిమానులకు పండగ ఉత్సాహాన్ని డబుల్ చేయనున్నారు హీరో రవితేజ. తన అభిమానులకు ఉగాది కానుకగా నేల టిక్కెట్టు మూవీ ఫస్ట్ లుక్‌ను శనివారం సోషల్ మీడియాలో రవితేజ విడుదల చేశారు. పల్లెటూరి బ్రాక్‌డ్రాప్ తో ఈ ఫొటోలో హీరో రవితేజతో పాటు ఆయన చుట్టూ ఉన్న వారి చేతుల్లోనూ చాయ్ గ్లాస్‌తో సరదాగా ఉన్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మాతగా ఈ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాళవిక శర్మ, రవితేజతో జోడీగా కనిపించనున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ‘నేల టిక్కెట్టు’ అనే టైటిల్‌ను అనుకున్నా.. అధికారికంగా ఉగాది కానుకగా ఓ రోజు ముందు టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. కాగా, సినిమాకు సంబందించిన డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌ను ఓ ప్రముఖ టీవీ ఛానల్ 25 కోట్లకు సొంతం చేసుకుంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాను మే 24న విడుదల చేయనున్నారు. NELA Tickets available from May 24th 😊😉 pic.twitter.com/F7FIoiSMc6 — Ravi Teja (@RaviTeja_offl) 17 March 2018 -
విళంబిని జుర్రుకోండి
విళంబి నామ సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అనుకున్నంత తొందరగా జరక్కపోవచ్చు. ఈ ఉగాది పచ్చడి ఈ షడ్రుచులు మాత్రం అనుకున్నదాని కంటే ముందే జుర్రుకుంటారు. సంవత్సరం పాటు షడ్రుచులను ఆస్వాదిస్తూ జీవితాన్ని ఉగాదిమయం చేసుకోండి. చేదు కూడా చేరదీయదగ్గదే... వేప పువ్వు ముద్ద కూర కావలసినవి: ఎండబెట్టిన వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – ఒక టీ స్పూను; రసం పొడి – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 2; కరివేపాకు – 2 రెమ్మలు; చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో; బెల్లం పొడి – రెండున్నర టీ స్పూన్లు; సెనగ పప్పు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ♦ అర గ్లాసు నీళ్లలో చింతపండును సుమారు పది నిమిషాలు నానబెట్టి, చిక్కటి రసం తీసి పక్కన ఉంచాలి ♦ స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక టీ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ♦ సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, ఎండు మిర్చి ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాక, వేప పువ్వు వేసి దోరగా వేయించాలి ♦ చిక్కగా తీసిన చింతపండు రసం జత చేసి బాగా కలపాలి ♦ బెల్లం పొడి, రసం పొడి, ఉప్పు జత చేసి మరోమారు బాగా కలిపి, సుమారు ఏడెనిమిది నిమిషాలు స్టౌ మీద ఉంచి దింపేయాలి. కరివేపాకుతో అలంకరించాలి ∙పొంగల్, రాగి సంగడితో అందిస్తే రుచిగా ఉంటుంది. పుల్లనగా జిల్లనగా చింతపండు పచ్చి పులుసు కావలసినవి: చింతపండు రసం – రెండు కప్పులు (కొద్దిగా పల్చగా తీసిన రసం); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొత్తిమీర – చిన్న కట్ట బెల్లం పొడి – టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత పోపు కోసం ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – చిటికెడు; ఎండుమిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4; నూనె – కొద్దిగా తయారీ: ♦ ఒక బౌల్లో చింతపండు రసం, కొత్తిమీర, బెల్లం పొడి, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు వేసి చేతితో బాగా కలపాలి (ఉప్పు, తీపి తగ్గినట్టుగా అనిపిస్తే, మరింత జత చేసుకోవచ్చు) ♦స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ∙కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు జత చేసి బాగా వేగిన తరువాత తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చిపులుసులో వేసి కలపాలి ♦ అన్నంలోకి రుచిగా ఉంటుంది. కొంచెం కారంగా... కొంచెం గారంగా... మిరియాల ఫ్రైడ్ రైస్ కావలసినవి: బాస్మతి బియ్యం – మూడు కప్పులు; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; నల్ల మిరియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వులు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – రుచికి తగినంత తయారి: ♦ ముందుగా బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, గంటసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ♦ బాణలిలో నూనె లేకుండా మిరియాలు, నువ్వులు, కరివేపాకు వేసి దోరగా వేయించి తీసి, బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ♦ బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ♦ జీలకర్ర జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ♦ ఉడికించిన అన్నం జత చేసి కలపాలి ♦ మెత్తగా పొడి చేసిన మిరియాల పొడి మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు కలిపి దింపేయాలి. ♦ అప్పడాలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. తెలుగువారి నుడి ఉగాది పచ్చడి కావలసినవి: నీళ్లు – మూడు గ్లాసులు; చింతపండు – పెద్ద నిమ్మకాయ పరిమాణం; చిన్న చిన్న చెరకు ముక్కలు – 20; అరటి పండు – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); బెల్లం పొడి – ఒక కప్పుడు; వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; మామిడి కాయ – 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఉప్పు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి) తయారీ: ♦ ముందుగా చింతపండును ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టి, రసం తీసి ఒక గిన్నెలో పోయాలి ♦ మూడు గ్లాసుల మంచి నీళ్లు జతచేయాలి. బెల్లం పొడి, ఉప్పు జత చేసి బాగా కలపాలి ♦ వేప పువ్వు, అరటి పండు ముక్కలు, మామిడికాయ ముక్కలు, చెరకు ముక్కలు, పచ్చి మిర్చి జత చేసి బాగా కలిపి గ్లాసులలో పోసి అందించాలి. తీపే కదా తొలి రుచి చెరకురసం ఖీర్ కావలసినవి : చెరకు రసం – 2 కప్పులు బాస్మతి బియ్యం – ఒక కప్పు (శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి అరగంటసేపు నానబెట్టాలి); బెల్లం పొడి – అర కప్పు; పాలు – 2 కప్పులు; జీడి పప్పు – 3 టేబుల్‌స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ♦ ఒక పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. ♦ నానబెట్టిన బియ్యం జత చేసి ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి). ♦ చెరకురసం జత చేసి సుమారు అయిదారు నిమిషాలు ఉడికించి దింపేయాలి. ♦ బెల్లం పొడి, కొబ్బరి తురుము, జీడిపప్పులు జత చేసి కలిపి అందించాలి. వగరుకు లేదు తిరుగు మామిడికాయ డ్రింక్ కావలసినవి: మామిడికాయలు – 2; మిరియాల పొడి – చిటికెడు; నల్ల ఉప్పు – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బెల్లం పొడి – 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒక గ్లాసు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్లు; పుదీనా – కొద్దిగా తయారీ: ♦ మామిడి కాయలను శుభ్రంగా కడగాలి ∙ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి, కడిగిన మామిడి కాయలను జతచేసి, కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ♦ బాగా చల్లారాక, మామిడి కాయల తొక్క వేరు చేసి, మామిడి గుజ్జును చేతితో మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ ఒక పాత్రలో ముప్పావు కప్పు నీళ్లు, మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి కరిగించి, స్టౌ మీద ఉంచి, ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి ♦ బ్లెండర్లో మామిడికాయ గుజ్జు, జీలకర్ర పొడి, బెల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి, నల్ల ఉప్పు, ఆరేడు పుదీనా ఆకులు వేసి మిక్సీ పట్టాక, ఒకటిన్నర కప్పుల చల్లని నీళ్లు జత చేసి మరోమారు తిప్పి తీసేసి, గ్లాసులలో పోసి అందించాలి. -
తెలంగాణ సర్కార్ ఉగాది కానుక..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా కరదీపిక పేరుతో తీసుకొచ్చిన హ్యాండ్ బుక్ అందరినీ విశేషంగా ఆకట్టుకొంటోంది. ఇందులో 20 రకాల అంశాలను పొందుపరిచారు. వర్ణమాల, తెలుగు సంవత్సరాలు, తిథులు – వారాలు, పక్షాలు – ఆయనాలు, మాసాలు, రుతువులు, కార్తెలు, నక్షత్రాలు – రాశులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, యుగాలు, ప్రాచీన కాలగణనం, తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు, ప్రాచీన సంఖ్యామానం, పండుగలు, పండుగల పాటలు, రాష్ట్ర చిహ్నాలు, తెలంగాణ కళలు, వాయిద్య పరికరాలు, మన పంటలు – ఆహారం, మన ఆటలు, నీతి పద్యాలు, తెలంగాణను పరిపాలించిన రాజవంశాలు ఉన్నాయి. మొత్తం 56 పేజీల పుస్తకం సమగ్ర సమాచారంతో అందరినీ ఆకట్టుకొంటోంది. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి, సంప్రదాయాలను మరచిన నేటి తరానికి మన ప్రాచీన జ్ఞానం తెలియాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కరదీపికను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి ఇంటికీ దీన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన 1.30 కోట్ల కుటుంబాలకు ఈ కరదీపికను డీఈవోలు, రెవెన్యూ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించిన ముద్రణా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ హ్యాండ్ బుక్కులను సరఫరా చేస్తారు. కలెక్టర్లు గ్రామాలకు చేరుకొని ఈ హ్యాండ్ బుక్‌ను ప్రతి ఇంటికీ అందజేస్తారు. జిల్లాల్లో కలెక్టర్లు కూడా ఈ పుస్తకాల్ని లక్ష వరకు ప్రింట్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఉగాది కరదీపిక కోసం లింక్‌ను క్లిక్ చేయండి -
ఖైదీలకు క్షమాభిక్ష
ఉగాది పర్వదినం జీవిత ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపనుంది. నెల్లూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు సత్ప్రవర్తన పేరుతో క్షమాభిక్ష పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ జీఓ ద్వారా ఉత్తర్వులు ఇచ్చేందుకు మార్గం సుగమం చేశారు. జిల్లా జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 17 మంది స్వేచ్ఛావాయువులు పీల్చనున్నారు. వీరిలో ఒక మహిళా ఖైదీ ఉన్నారు. అధికార పార్టీ నాయకుల, మంత్రుల లాబీయింగ్‌తో మొద్దు శీను హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మల్లెల ఓం ప్రకాష్ పేరు ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కారాగారాల్లో జీవితఖైదు అనుభవిస్తూ సత్ప్రవర్తన కల్గిన ఖైదీలను క్షమాభిక్ష కింద విడుదల చేసేందుకు ఈ ఏడాది జనవరి 23వ తేదీన మార్గదర్శకాల (జీఓ నంబర్ 8)ను ప్రభుత్వం జారీచేసింది. వీటిని అనుసరించి జిల్లా కేంద్రకారాగార సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్ 17 మందితో కూడిన జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. జాబితాను పరిశీలించిన హైలెవల్ కమిటీ 17మంది ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. అయితే జాబితా గణతంత్ర దినోత్సవ సమయంలో ఆమోదం పొందినా పలు సాంకేతిక కారణాలతో విడుదల కాలేదు. అధికారపార్టీ ఒత్తిడితో ఓంప్రకాష్ విడుదల రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మొద్దుశీను హత్యకేసులో నిందితుడు మల్లెల ఓంప్రకాష్ క్షమాభిక్ష పొందిన ఖైదీల జాబితాలో ఉన్నట్లు సమాచారం. 2008 నవంబర్ 9వ తేదీన అనంతపురం జైలులో టీడీపీ నేత పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన జూలకంటి శ్రీనివాసులురెడ్డి అలియాస్ మొద్దు శీనును ఓం ప్రకాష్ సిమెంట్ డంబెల్‌తో కొట్టి హత్యచేసిన విషయం విదితమే. దీంతో జైలు అధికారులు ఆయనను అక్కడ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడ నుంచి వరంగల్ జైలుకు తరలించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014మే 18న ఆయన్ను నెల్లూరు జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. అప్పటినుంచి ఓం ప్రకాష్ జిల్లా కేంద్రకారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్నారు. ఆయన విడుదలకు రాష్ట్ర మంత్రితో పాటు అధికారపార్టీ నేతలు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు ఓంప్రకాష్ విడుదలకు మార్గం సుగమమైంది. విడుదలయ్యే వారి జాబితా ఇదే.. 2016 జనవరి 26వ తేదీన జిల్లా కేంద్రకారాగారంలోని 22 మందిని, కడప నుంచి వచ్చిన ఎనిమిది మందిని మొత్తం 30 మంది ఖైదీలను విడుదల చేశారు. రెండేళ్ల అనంతరం తిరిగి సత్ప్రవర్తన కల్గిన జీవితఖైదీలను విడుదల చేసేందుకు జైళ్లశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 17మంది ఖైదీలు జిల్లా కేంద్రకారాగారం నుంచి విడుదల కానున్నారు. తాజాగా ఉన్నతాధికారులు ఆమోదించిన జాబితాలో 17మందిలో ఒక మహిళాఖైదీ ఉన్నారు. 2013లో విడుదలకు నోచుకోని ఓ జీవితఖైదీ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో కోర్టు విడుదలకు ఆదేశాలు జారీచేసింది. టి.సురేష్, వి.నరసింహ, జి.శ్రీనివాసులు, ఎం.మల్లికార్జున, ఐ.సుబ్బారావు, ఎం.ఓంప్రకాష్, ఆర్.సుధాకర్‌రెడ్డి, టి.నారాయణరెడ్డి, పి.విజయశేఖర్‌రాజు, ఎస్.శ్రీను అలియాస్ శ్రీనివాస్ అలియాస్ సన్నికాంతి, ఎన్.చిన్నబ్బాయి, డి.గొట్టం వీరన్న, డి. చిన్నవీరన్న, షేక్ చిన్న మౌలాలి, జి.శ్రీను అలియాస్ దొంగ శ్రీను, ఎం.మంజుల, పి.సుబ్బారావు విడుదలఅయ్యే వారి జాబితాలో ఉన్నారు. -
సుమంత్‌కు జోడిగా ఈషా?
సరైన హిట్‌లేక సతమతమవుతున్న సుమంత్‌కు మళ్ళీరావా పెద్ద ఊరటనిచ్చింది. ఇలాంటి క్లాస్‌హిట్ తర్వాత సుమంత్ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. మళ్ళీరావా ఇచ్చిన ఊపుతో వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు సుమంత్. అయితే తాజాగా మరో సినిమాను ప్రారంభించే పనిలో ఉన్నాడు ఈ హీరో. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఈషారెబ్బాను హీరోయిన్గా ఎంపిక చేశారని సమాచారం. అమీతుమీ సినిమాలోని నటన, తన అందంతో ఈషాకు తర్వాత అవకాశాలు పెరిగాయి. ఈ భామ రీసెంట్గా అ! సినిమాలో నటించింది. ప్రస్తుతం సుమంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఉగాదికి ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు తెలస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉగాదికి కొత్తగా...
తెలుగు సంవత్సరాది ఉగాదికి కొత్త కొత్తగా కనిపించి అభిమానులకు పండగ ఉత్సాహాన్ని డబుల్ చేయనున్నారు హీరో రవితేజ. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాళవిక శర్మ కథానాయిక. ఈ సినిమాకు ‘నేల టిక్కెట్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను తెలుగువారి మొదటి పండుగ ఉగాది సందర్భంగా ఈనెల 18న విడుదల చేయాలనుకుంటున్నారు. రీసెంట్గా చిత్రబృందం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించింది. ఆల్మోస్ట్ 60 శాతం సినిమా చిత్రీకరణ పూరై్తంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు నటిస్తున్న ఈ సినిమాను మే లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్ కార్తీక్. -
వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 18 న ఉగాది పర్వదినం సందర్భంగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేసి.. అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని జరిపారు. ఆలయ మహద్వారం మొదలు గర్భాలయం వరకు, ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించి.. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
18న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీన విళంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి వేర్వేరుగా తిరుమంజనం నిర్వహించి, విశేషాభరణాలతో అలంకరిస్తారు. తర్వాత ఉత్సవమూర్తులను ఘంటామండపంలో వేంచేపు చేసి, పడిప్రసాదాలు, అన్నప్రసాదాలతో నివేదిస్తారు. అనంతరం ఆస్థాన వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఉన్న పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయిస్తారు. తిథి, వారనక్షత్ర, నూతన సంవత్సర ఫలితాలు, లాభనష్టాలు, నవగ్రహాల గతులు, సవ్యవృద్ధి, పశువృద్ధి, 27 నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజపూజ్యత అవమానాలు ఈ పంచాంగ శ్రవణంలో శ్రీవారికి వినిపిస్తారు. ఈ ఉగాది ఆస్థానం నేపథ్యంలో 18వ తేదీ నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. 14న అన్నమయ్య 515వ వర్ధంతి ఉత్సవం.. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి 515వ వర్ధంతి మహోత్సవాన్ని ఈనెల 14వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఇక్కడి నారాయణగిరి ఉద్యానవనంలో ఉత్సవమూర్తులు వేంచేపు చేసి, సాయంత్రం 6.00 గంటల నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టిగానం నిర్వహించనున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది