ఏప్రిల్‌లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా? అయితే జాగ్రత్త. ఏప్రిల్‌లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే అని గుర్తుంచుకోవాలి. మీరు ఈ సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులను పూర్తీ చేసుకుంటే మంచిది. అలాగే, మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి మీ లావాదేవీలనుముందే ప్లాన్ చేసుకోవడం అవసరం.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేయబడతాయి. ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి.
ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు:
- ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత
- ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 4: ఆదివారం
- ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
- ఏప్రిల్ 10: రెండవ శనివారం
- ఏప్రిల్ 11: ఆదివారం
- ఏప్రిల్ 13: ఉగాది పండుగ
- ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
- ఏప్రిల్ 18: ఆదివారం
- ఏప్రిల్ 21: శ్రీరామ నవమి
- ఏప్రిల్ 24: నాల్గవ శనివారం
- ఏప్రిల్ 25: ఆదివారం
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment