సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వారం రోజులపాటు "శ్రీమద్ భాగవత సప్తాహం" కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఉగాది రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగపూర్ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సమాపణోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్రావు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, టీటీడీ పూర్వ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ వారం రోజులపాటు కార్యక్రమంలో వేర్వేరు తేదీలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రధాన నిర్వాహకులు రత్న కుమార్ కవుటూరు, నీలం మహేందర్, ఊలపల్లి భాస్కర్, మరియు రాంబాబు పాతూరి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, రమేష్ గడప తదితరులు డాక్టర్ మేడసాని కి ఇతర అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియజేసి ప్రపంచ నలుమూలల నుండి తెలుగువారందరూ కలసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవసిన ఆవశ్యకత ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment