ఉగాది రావడంతోనే వేసవి మనకు పరిచయం అవుతుంది. షడ్రుచులతో కొత్త చిగురుల సందడి మొదలవుతుంది.సకల శుభాలను మోసుకువచ్చే ఉగాదికి సకల హంగులూ అద్దేవి మన చేనేతలే. పండగ రోజులే కాకుండా వేసవి మొత్తం కాటన్ డ్రెస్సులతోనే కలర్‌ఫుల్‌గా కనిపించడం ఎలాగా అని ఆలోచించేవారికి సరైన ఎంపికతోనే సిద్ధంగా ఉన్నాయి.
అచ్చతెలుగు అమ్మాయిలా లంగాఓణీలో కనిపించాలనుకున్నా, లెహంగాలో గ్రాండ్ లుక్‌తో మెరిసి΄ోవాలన్నా, చుడీదార్‌తో ఆధునికం అనిపించాలన్నా, చీర అంచుతోనే అందాన్ని చుట్టేయాలన్నా మన చేనేతలు ఎప్పుడూ అగ్రభాగాన ఉంటాయి. పట్టుకున్నప్రా ముఖ్యత కాటన్స్‌కు లేదు అనుకునేవారికి సరైన ఎంపిక అవుతున్నాయి.
వాటిలో ఖాదీ, మంగళగిరి, ఇక్కత్, నారాయణపేట్, గద్వాల్, వెంకటగిరి... వంటి కాటన్ హంగులు తీరైన నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి. ప్రతిరోజూ పండగే అనిపించే శోభను మోసుకువస్తున్నాయి. ఈ వేసవిని శోభకృతుతో ఇంపైన కళగా మార్చేద్దాం.
Comments
Please login to add a commentAdd a comment