cotton dress
-
సకల శుభాల శోభ
ఉగాది రావడంతోనే వేసవి మనకు పరిచయం అవుతుంది. షడ్రుచులతో కొత్త చిగురుల సందడి మొదలవుతుంది.సకల శుభాలను మోసుకువచ్చే ఉగాదికి సకల హంగులూ అద్దేవి మన చేనేతలే. పండగ రోజులే కాకుండా వేసవి మొత్తం కాటన్ డ్రెస్సులతోనే కలర్ఫుల్గా కనిపించడం ఎలాగా అని ఆలోచించేవారికి సరైన ఎంపికతోనే సిద్ధంగా ఉన్నాయి. అచ్చతెలుగు అమ్మాయిలా లంగాఓణీలో కనిపించాలనుకున్నా, లెహంగాలో గ్రాండ్ లుక్‌తో మెరిసి΄ోవాలన్నా, చుడీదార్‌తో ఆధునికం అనిపించాలన్నా, చీర అంచుతోనే అందాన్ని చుట్టేయాలన్నా మన చేనేతలు ఎప్పుడూ అగ్రభాగాన ఉంటాయి. పట్టుకున్నప్రా ముఖ్యత కాటన్స్కు లేదు అనుకునేవారికి సరైన ఎంపిక అవుతున్నాయి. వాటిలో ఖాదీ, మంగళగిరి, ఇక్కత్, నారాయణపేట్, గద్వాల్, వెంకటగిరి... వంటి కాటన్ హంగులు తీరైన నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి. ప్రతిరోజూ పండగే అనిపించే శోభను మోసుకువస్తున్నాయి. ఈ వేసవిని శోభకృతుతో ఇంపైన కళగా మార్చేద్దాం. -
Fashion Tips: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్!
Comfortable Wardrobe Ideas For Monsoon: అసలే ముసురు. అలాగని వెచ్చగా ఇంట్లో మునగదీసుకుని పడుకుందామంటే చదువులెలా సాగుతాయి? ఉద్యోగాలెలా చేస్తాం? రెయిన్ కోటు తగిలించుకునో గొడుగేసుకునో బయటికి వెళ్లక తప్పదు. అయితే మనం ధరించే దుస్తులు మాత్రం వానకు తగ్గట్టు లేకపోతే అసౌకర్యం తప్పదు మరి. అలాకాకుండా ఈ వానలకు ఎలాంటి దుస్తులయితే బాగుంటుంది, యాక్సెసరీస్ ఏవి బాగుంటాయి... చూద్దాం. వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడినప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడటం ఉత్తమం. ఎందుకంటే వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి ముదురు రంగు దుస్తులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగని భారీగా ఉండకూడదు. తేలికపా వి అయితేనే మంచిది. వాటిలో తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం ఇవి బాగుంటాయి! ►కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడటం మంచిది. ►సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. ►స్కిన్ టైట్, లెగ్గింగ్స్ కూడా బాగుంటాయి. ►అదే విధంగా చీరలు, చుడిదార్లు ధరించే వారు శాండిల్స్, షూస్ వంటి వాటిని వేసుకుంటే మంచిది. ►హ్యాండ్ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి అయితేనే నయం. ఇవి వద్దు! ఇలా చేస్తే మేలు! ►మరో విషయం ఏమిటంటే... వర్షాకాలం లో పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. ►బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు. ►తెలుపు రంగు బట్టలకు మురికి పట్టిందంటే తొందరగా వదలదు. ►ఏ చిన్న మరక పడ్డా అల్లంత దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది కాబట్టి ముదురు రంగు బట్టలు వాడితే మంచిది. ►ముసురు తగ్గాక దుప్పట్లు, రగ్గులు, బొంతలు, దిళ్లు, పరుపులు, మందపాటి బట్టలను కాసేపు అలా ఎండలో వేస్తే బావుంటాయి. వాసన కూడా రాదు. ►శరీరం ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలో వుండేలా చూసుకోవాలి. ►శరీర ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు క్రిములు దాడి చేసే ప్రమాదం ఎక్కువ. ►వానాకాలం అన్నాళ్లూ బయటికెళ్లేటప్పుడు గొడుగు/రెయిన్‌కోట్ వెంట వుండాలి. ►వర్షాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోకపోవడమే మంచిది. జీన్స్ అసలే వద్దు! ►ఈ కాలంలో జీన్స్ జోలికి వెళ్లకూడదు. మరీ ముఖ్యంగా టైట్ జీన్స్ అసలు వద్దు. ►అలాగే వర్షాకాలంలో స్లిప్పర్స్ కంటే షూ వాడడం బెటర్. లేదంటే శాండిల్స్ అయినా ఫరవాలేదు. ►స్లిప్పర్స్ వేసుకుంటే మాత్రం బట్టలపై బురద మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి. ►అంతేకాకుండా బురదగా ఉన్న ప్రదేశంలో చెప్పులు వేసుకుని నడిస్తే జారిపడే అవకాశం ఉంది. చదవండి: Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ? -
కాటన్ బట్టలతో టేకాఫ్
విమానాలకు, వాడేసిన దుస్తులకూ సంబంధం ఏమిటి? మామూలుగా చూస్తే ఈ రెండింటి మధ్య పెద్దగా లింక్ ఉన్నట్లు అనిపించదు. కానీ ఇది 21వ శతాబ్దమని, టెక్నాలజీ అనేది అసాధ్యాలనూ సుసాధ్యం చేస్తుందని అనుకుంటే మాత్రం విమానాలు మనం వాడేసిన దుస్తులతోనే నడుస్తాయి! అవునండి... వాడేసిన కాటన్ దుస్తులను విమాన ఇంధనంగా వాడే ఎథనాల్‌గా మార్చడంలో జపాన్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ (జెప్లాన్) విజయం సాధించింది. పులియబెట్టడం ద్వారా పత్తి పోగుల్లోని చక్కెరలను ఆల్కహాల్‌గా మార్చడం ఈ టెక్నాలజీలోని కీలక అంశం. జెప్లాన్ వ్యవస్థాపకుడు, పారిశ్రామిక వేత్త మిచిహికో ఇవమోటో 2007 మొదలు దాదాపు ఐదేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టోక్యోలోని గ్రీన్ ఎర్త్ ఇన్స్టిట్యూట్, జెప్లాన్లు ఈ వినూత్న ఎథనాల్‌తో విమానాలను నడిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2020 నాటికి తొలి పరీక్షలు చేస్తారు. ఆ తరువాత పదేళ్లకు అంటే 2030 నాటికల్లా పూర్తిస్థాయిలో ఎథనాల్ వాడకం మొదలుపెడతారు. జెప్లాన్ ఇప్పటికే ఇయాన్, ముజి అనే రెండు ఫ్యాషన్ బ్రాండ్లతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా ఉన్న స్టోర్ల ద్వారా పాత బట్టల్ని సేకరించడం ఈ ఒప్పందం ఉద్దేశం. ఇంకేముంది... కొన్నేళ్లలో జపాన్ విమానాలు మొత్తం ఈ ఎథనాల్తోనే ఎగురుతాయి అనుకుంటున్నారా? చిన్న చిక్కుంది. దుస్తుల నుంచి తయారయ్యే ఎథనాల్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. వంద టన్నుల దుస్తుల నుంచి దాదాపు పదివేల లీటర్ల ఎథనాల్ మాత్రమే వస్తుందని అంచనా. (విమానం ఎగరడానికి సెకనుకు నాలుగు లీటర్ల ఇంధనం అవసరం అవుతుంది) అయితే.. ఈ టెక్నాలజీని దుస్తులకు మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరం లేదని, కాగితం మొదలుకొని అనేక సేంద్రియ పదార్థాల ద్వారా ఎథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చునని, దుస్తులతో ఎథనాల్ ఒక ఆరంభం మాత్రమేనని అంటున్నారు ఇవమోటో.