
Comfortable Wardrobe Ideas For Monsoon: అసలే ముసురు. అలాగని వెచ్చగా ఇంట్లో మునగదీసుకుని పడుకుందామంటే చదువులెలా సాగుతాయి? ఉద్యోగాలెలా చేస్తాం? రెయిన్ కోటు తగిలించుకునో గొడుగేసుకునో బయటికి వెళ్లక తప్పదు. అయితే మనం ధరించే దుస్తులు మాత్రం వానకు తగ్గట్టు లేకపోతే అసౌకర్యం తప్పదు మరి. అలాకాకుండా ఈ వానలకు ఎలాంటి దుస్తులయితే బాగుంటుంది, యాక్సెసరీస్ ఏవి బాగుంటాయి... చూద్దాం.
వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడినప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడటం ఉత్తమం. ఎందుకంటే వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి ముదురు రంగు దుస్తులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగని భారీగా ఉండకూడదు. తేలికపా వి అయితేనే మంచిది. వాటిలో తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం
ఇవి బాగుంటాయి!
►కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడటం మంచిది.
►సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి.
►స్కిన్ టైట్, లెగ్గింగ్స్ కూడా బాగుంటాయి.
►అదే విధంగా చీరలు, చుడిదార్లు ధరించే వారు శాండిల్స్, షూస్ వంటి వాటిని వేసుకుంటే మంచిది.
►హ్యాండ్ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి అయితేనే నయం.
ఇవి వద్దు! ఇలా చేస్తే మేలు!
►మరో విషయం ఏమిటంటే... వర్షాకాలం లో పారదర్శకంగా అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం ఉత్తమం.
►బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు.
►తెలుపు రంగు బట్టలకు మురికి పట్టిందంటే తొందరగా వదలదు.
►ఏ చిన్న మరక పడ్డా అల్లంత దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది కాబట్టి ముదురు రంగు బట్టలు వాడితే మంచిది.
►ముసురు తగ్గాక దుప్పట్లు, రగ్గులు, బొంతలు, దిళ్లు, పరుపులు, మందపాటి బట్టలను కాసేపు అలా ఎండలో వేస్తే బావుంటాయి. వాసన కూడా రాదు.
►శరీరం ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలో వుండేలా చూసుకోవాలి.
►శరీర ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు క్రిములు దాడి చేసే ప్రమాదం ఎక్కువ.
►వానాకాలం అన్నాళ్లూ బయటికెళ్లేటప్పుడు గొడుగు/రెయిన్‌కోట్ వెంట వుండాలి.
►వర్షాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోకపోవడమే మంచిది.
జీన్స్ అసలే వద్దు!
►ఈ కాలంలో జీన్స్ జోలికి వెళ్లకూడదు. మరీ ముఖ్యంగా టైట్ జీన్స్ అసలు వద్దు.
►అలాగే వర్షాకాలంలో స్లిప్పర్స్ కంటే షూ వాడడం బెటర్. లేదంటే శాండిల్స్ అయినా ఫరవాలేదు.
►స్లిప్పర్స్ వేసుకుంటే మాత్రం బట్టలపై బురద మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి.
►అంతేకాకుండా బురదగా ఉన్న ప్రదేశంలో చెప్పులు వేసుకుని నడిస్తే జారిపడే అవకాశం ఉంది.
చదవండి: Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ?
Comments
Please login to add a commentAdd a comment