
సాక్షి, అమరావతి : వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని.. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ‘ఈ నూతన సంవత్సరంలో మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రచారానికి విరామం
ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకునే సమయంలో ప్రచార సభలతో ఇబ్బంది పెట్టరాదన్న ఉద్దేశంతో నేడు(ఏప్రిల్ 6న) వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రచారానికి విరామం ప్రకటించారు. అమరావతిలోని స్వగృహంలో వైఎస్ జగన్ ఉగాది పండుగను జరుపుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment