
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కనువిందు చేసిన ఉల్కాపాతం
ఆసిఫాబాద్/కోటపల్లి/రెబ్బెన: ఉగాది రోజు శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉల్కాపాతం కనువిందు చేసింది. ఆదిలాబాద్ జిల్లా తాంప్సీ, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి మీదుగా సుపాక, ఆలుగామ గ్రామం వైపు మహారాష్ట్రలోని తేకడా గ్రామం వరకు ఉల్కలు జారిపడ్డాయి.
కుమ్రుంభీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్, వాంకిడి, బెజ్జూర్, రెబ్బెన మండలాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దులోని పలువురు ప్రజలు ఉల్కాపాతాన్ని వీక్షించారు. తోకచుక్కల మాదిరి ఉల్కలు భూమి మీదకు దూసుకు వస్తుండడంతో కొందరు సెల్‌ఫోన్లతో చిత్రీకించారు. నిప్పులు కక్కుతూ ఉల్కలు నేలరాలినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఉల్కాపాతం పడుతుందని టీవీ చానళ్లలో, సోషల్ మీడియాల్లో వార్తలు రావడంతో గ్రామస్తులు కొంత ఆందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment