హమ్మయ్య.. గండం గట్టెక్కింది.. మహారాష్ట్రకు పయనమైన పులి | Tiger Crossed Adilabad Forest Border Moved To Maharashtra | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. గండం గట్టెక్కింది.. మహారాష్ట్రకు పయనమైన పులి

Published Wed, Nov 23 2022 9:11 AM | Last Updated on Wed, Nov 23 2022 9:22 AM

Tiger Crossed Adilabad Forest Border Moved To Maharashtra - Sakshi

బెజ్జూర్‌: కుమురంభీం జిల్లా వాసు లకు పెద్దపులి నుంచి ఊరట కలిగింది. కుమురంభీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా హడలెత్తించిన పెద్దపులి మహారాష్ట్ర వైపు పయనమైనట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బెజ్జూర్‌ రేంజ్‌ పరిధిలోని నాగవెళ్లి, మొగవెల్లి గ్రా మాల సమీపంలోని ప్రాణహిత నది దాటినట్లు ఆనవాళ్లను గుర్తించారు.

దీంతో సమీప గ్రామాల ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని వాంకిడిలో ఓ రైతును బలిగొన్న పెద్దపులి మరికొ న్ని పశువులపై కూడా దాడి చేసింది. దీంతో జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది.
చదవండి: తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement