
తెలంగాణ ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర తిప్పేశ్వర్ ప్రాంతంలోని పులుల సంరక్షణ కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. తిప్పేశ్వర్ అభయారణ్యంలో పులులను తిలకించేందుకు సందర్శకులు ఆసక్తిగా తరలి వస్తున్నారు. తిప్పేశ్వర్ అటవీ ప్రాంతంలో మొత్తం 18 పులులు, 2 చిరుత పులులున్నాయని అక్కడి సిబ్బంది తెలిపారు. సఫారీలో పర్యాటకులు పులులను తిలకిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఈ అటవీ ప్రాంతం ఆదిలాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment