ఈ నూతన సంవత్సరాన ఈ రాశి వారికి ఋణ విషయాలలో విచిత్ర స్థితి | Gemini-Mithunam-Raashi-Ugadi-Panchangam-2024 | Sakshi
Sakshi News home page

ఈ నూతన సంవత్సరాన ఈ రాశి వారికి ఋణ విషయాలలో విచిత్ర స్థితి

Published Sun, Apr 7 2024 12:08 PM | Last Updated on Sun, Apr 7 2024 12:08 PM

Gemini-Mithunam-Raashi-Ugadi-Panchangam-2024 - Sakshi

మిథున రాశి

ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–3, అవమానం–6.
మృగశిర 3,4 పాదములు (కా, కి)
ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)
పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)

గురువు మే 1 వరకు మేషం (లాభం)లోను తదుపరి వృషభం (వ్యయం)లోను సంచరిస్తారు. శని కుంభం (భాగ్యం)లోను రాహువు మీనం (దశమం)లోను కేతువు (చతుర్థం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలిసీ తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరినీ నమ్మి, ఎవరి మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ పరిథిలో ఉన్న పనులు మాత్రమే చేయండి. వీలైనంత వరకు కొత్త వ్యవహారాలు చేపట్టవద్దు. మీకు కొన్ని సందర్భాలలో మంచి గురువులు మంచి సూచనలు చేస్తారు. ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు ఎప్పుడూ సహకరించనివారు కూడా ఈ సంవత్సరంలో సహకారం అందిస్తారు. కొన్ని సందర్భాలు విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అలాగే అధికారులతో కూడా జాగ్రత్తలు పాటించాలి.

మితభాషణ చాలా అవసరం. తోటివారు కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. వర్కర్స్‌తో బహుజాగ్రత్తలు పాటించడం, వాక్కును నియంత్రించుకోవడం అవసరం. ఇంటిలో ఉండే పనివారితో కూడా జాగ్రత్తలు అవసరం. వ్యాపార విషయాలు అనుకూలమే. నూతన ప్రయత్నాలకు అనుకూలత తక్కువ. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని కోణాలలోనూ గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులు అందరితోనూ కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లల నడవడిక మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాల నిర్వహణ విషయంగా ధనవ్యయం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భములలో అధిక ధనలాభం చేకూరుతుంది.

అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు సాగుతాయి. ఋణ విషయాలలో విచిత్ర స్థితి ఉంటుంది. కావలసిన కొత్త ఋణాలు ఆలస్యంగా అందుతాయి. భార్యాపిల్లలు తరచుగా ప్రయాణాలు చేయుట వలన ధనవ్యయం అధికం అవుతుంది. ఆరోగ్య విషయంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మంచి వైద్యం లభిస్తుంది. చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి. హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. కుటుంబ విషయాలు, సాంఘిక వ్యవహారాలను సమర్థంగా నడుపగలుగుతారు. అందరి నుంచి సహకారం ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయసంచారం దృష్ట్యా మే నుంచి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి.

షేర్‌ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు కానీ, నష్టాలు మాత్రం ఉండవు. మంచికాలమే. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా వ్యాసంగంలో వారికి అనుకూలత తక్కువ. ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి కాలం అనుకూలం. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతుంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురువు వ్యయస్థితి సంచార ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాలి. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా, నష్టం మాత్రం ఉండదు.

మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి అసహనం పెరుగుతుంది. గొప్ప కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నమ్మి పనులు తలపెట్టవద్దని ప్రత్యేక సూచన. మితభాషణ మీకు రక్షణ. 

ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. అవమానకర ఘటనలు, అధిక ధనవ్యయం చికాకు పెడతాయి. వాహన లాభం ఉంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా నష్టం జరుగుతుంది. ఋణ, ఆరోగ్య విషయాలు ద్వితీయార్ధంలో చికాకు కలిగిస్తాయి.

శాంతి మార్గం: మే నెలలో గురుశాంతి చేయించండి. తెల్లజిల్లేడు, మారేడు, గరికలతో గణపతి అర్చన, ప్రాతఃకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజూ ‘గజేంద్ర మోక్షం’ పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్ష ధరించండి.

ఏప్రిల్‌: ఈనెల శుభవార్తలు వింటారు. అన్ని రంగాలలో రాణిస్తారు. అధికారలాభం, అనుకూల స్థానచలనం. రాజకీయరంగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు, కార్యజయం కలుగుతాయి. షేర్‌ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులకు శ్రమ ఎక్కువైనా, లాభం ఉంటుంది. మార్కెటింగ్‌ ఉద్యో గులు ఇబ్బంది పడతారు. స్వబుద్ధితో చేసే పనులన్నీ లాభిస్తాయి. రైతులకు చికాకులు ఉంటాయి.

మే: అనుకున్న పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శత్రుబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. నిత్య శివదర్శనం, తీర్థస్నానాలు మంచివి. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. విద్యార్థులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడతారు.

జూన్‌: ప్రయాణాలవల్ల శారీరక అలసట. లాభాలు ఉన్నా, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన మంచిది. కోర్టు, ఋణ వ్యవహారాల్లో పరిష్కారమార్గం దొరుకుతుంది. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. 

జులై: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతాయి. నిత్యం శివ, సుబ్రహ్మణ్య ధ్యానం మంచిది. అధికారులు ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎప్పుడు ఆగ్రహిస్తారో తెలియని పరిస్థితి. స్థిరాస్తి కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు, షేర్‌ వ్యాపారాలు, ఫైనాన్స్‌ వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. రైతులకు, విద్యార్థులకు, మార్కెటింగ్‌ ఉద్యోగులకు అనుకూలం.

ఆగస్ట్‌: ఈనెలలో అన్నివిధాలా బాగుంటుంది. ఆర్థికపుష్టి కలుగును, శుభవార్తలు వింటారు. పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నెలాఖరున కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. 15వ తేదీ నుంచి మృగశిర నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి.

కొత్త ఋణాలు సమయానికి అందుతాయి. పాతవి తీర్చగలుగుతారు. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంలో అనుకూలత ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల దర్శనం చేస్తారు.

సెప్టెంబర్‌: కుటుంబ పరిస్థితులు అనుకూలం. వృత్తిలో ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. çసంతాన సౌఖ్యం, గృహ, వస్తు వాహన లాభం. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. రుద్రాభిషేకం, శివకుటుంబ ఆరాధన మంచిది. ఆర్ద్రా నక్షత్రం వారు కొంచెం ఇబ్బందికి గురవుతారు. షేర్‌ వ్యాపారులకు మంచి ఫలితాలు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం అవుతుంది. విదేశీ, స్థిరాస్తి ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు ఉంటాయి.

ముఖ్యమైన లావాదేవీలను గోప్యంగా ఉంచడం మంచిది. అక్టోబర్‌: ఈనెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉంది. బంధువర్గంతో సమస్యలు, పనుల్లో ఆలస్యం, శారీరక శ్రమ ఉంటాయి. తరచు వివాదాలు ఉండే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అభిషేకం, శ్రీరామరక్షాస్తోత్రం పారాయణ మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు. షేర్‌ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు, పనిముట్ల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాలక్షేపం ప్రమాదకరం కాగలదు.

నవంబర్‌: కుటుంబ ఖర్చులు పెరిగినా, అవసరానికి తగ్గ ధనం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడతాయి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ మంచిది. షేర్‌ వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు కొంచెం అనుకూల స్థితి తక్కువ.

డిసెంబర్‌: ఈనెల గ్రహసంచారం ప్రతికూలం. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులను ఇతరుల సహాయంతో అధిగమిస్తారు. వ్యర్థ ప్రయాణాలు, వృథా ఖర్చులు, లాభాలు అంతంత మాత్రం. నవగ్రహ శాంతి చేసుకోవాలి. ఋణ బాధల వల్ల ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. షేర్‌ వ్యాపారులకు చికాకులు. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత. 

జనవరి: ఉద్వేగపూరిత ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు. బంధువర్గం అనుకూలత, మిత్ర సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక చికాకులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులకు శ్రమ ఎక్కువ. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. షేర్‌ వ్యాపారులకు శుభసూచకం. ఆర్ద్రా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు. ఫిబ్రవరి: కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పనికీ అధిక ప్రయత్నం అవసరం. విష్ణు ఆరాధన శుభప్రదం. ఆర్ద్రానక్షత్రం వారికి లాభదాయకం. «శ్రమ ఎక్కువైనా కార్య సాఫల్యావకాశాలు బాగున్నాయి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. మార్చి : ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పెను మార్పులు. మీ మాటకు విలువ పెరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement