
నిన్న మొన్నటి వరకు అతడు పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తుండేవాడు. అనుకోకుండా ఒక రోజు న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కంటపడ్డాడు. అంతే, అతడి అదృష్టం మారిపోయింది. ఉన్నపళాన ఫ్యాషన్ మోడల్‌గా మారిపోయాడు. ఫ్యాషన్ మోడల్‌గా మారిన ఈ ఇరవైనాలుగేళ్ల పిజ్జా మేకర్ పేరు క్రిస్టియానో వెన్‌మన్. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే ‘స్కార్స్’ అనే పిజ్జా దుకాణంలో పిజ్జా తయారు చేస్తూ ఉండేవాడు.
న్యూయార్క్‌లోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విల్లీ షవారియా అసిస్టెంట్లలో ఒకరు ‘స్కార్స్’ పిజ్జా సెంటర్‌కు వచ్చినప్పుడు క్రిస్టియానో అతడి కంటపడ్డాడు. ఆకట్టుకునే రూపంతో ఉన్న క్రిస్టియానో ఫ్యాషన్ మోడలింగ్‌కు బాగా పనికొస్తాడని అంచనా వేశాడు. ఇదే విషయాన్ని తన బాస్ విల్లీకి చెప్పాడు. విల్లీ వెంటనే అతణ్ణి పిలిపించి, మోడలింగ్‌లో అవకాశం ఇచ్చాడు.
విల్లీ చలవతో క్రిస్టియానో ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌వాక్ చేసి, ఫ్యాషన్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ దెబ్బతో క్రిస్టియానోకు అవకాశాల వెల్లువ మొదలైంది. అంతేకాదు, ‘హీరో’, డేజ్‌డ్’ వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ పత్రికలు క్రిస్టియానో ఫొటోలతో ప్రముఖంగా వ్యాసాలను ప్రచురించడం మరో విశేషం.
(చదవండి: Vomiting During Pregnancy: ప్రెగ్నెన్సీలో వాంతులవుతుంటే నార్మల్ డెలివరీ అవ్వదా..?)