బ్రసిలియా: ఐరాస సర్వసభ సమావేశంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచదేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ ఒక్కటే మహమ్మారిని అడ్డుకోగలదని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, అలా వేసుకోని వాళ్లని పలు ప్రాంతాల్లోకి కూడా వారిని రానివ్వడం లేదు.
తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో బృందం న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే ఆయనకు టీకా సర్టిఫికేట్ లేదని ఆ హోటల్ యాజమాన్యం వారిని లోపలికి రావివ్వలేదు. దీంతో చేసేదేమిలేక బొల్సొనారో, ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఆదివారం రాత్రి రోడ్డు పక్కనే నిల్చుని పిజ్జా తిన్నారు. అయితే దీనిపై బోల్సోనారో మద్దతుదారులు మాన్హాటన్ హోటల్ సమీపంలోని వీధిలో పిజ్జా తినడం సంతోషంగా ఉన్న తమ నాయకుడి సింప్లిసిటీకి ఇది నిదర్శమని కామెంట్లు పెడుతున్నారు.
న్యూయార్క్ మేయర్ నగరంలో జరిగే ఐరాస సమావేశానికి హాజరయ్యే ముందు అందురూ టీకాలు వేయించుకోవాలని "ముఖ్యంగా బొల్సొనారోతో సహా ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది నాయకులు మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేమని వీడియో స్టేట్‌మెంట్‌ను పంపుతున్నారు.
చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...!
Comments
Please login to add a commentAdd a comment