India And Modi Craze Goes Viral After PM State Visit To US - Sakshi
Sakshi News home page

వన్‌ అండ్‌ ఓన్లీ భారత్‌ అండ్‌ మోదీ.. ఆ క్రేజ్‌ చూస్తే మతిపోవడం ఖాయం

Published Sat, Jun 24 2023 11:19 AM | Last Updated on Sat, Jun 24 2023 11:34 AM

India And Modi Craze Viral After PM Official US Visit - Sakshi

గౌరవాన్ని అవతలివాళ్ల నుంచి కోరుకోకూడదు.. అదే మనల్ని వెతుకుంటూ రావాలన్నాడు ఓ పెద్దాయన. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌.. అగ్రరాజ్యల లిస్ట్‌కు ఎప్పుడూ దూరమే. అలాగని సమకాలీన వ్యవహరాల్లో భారత్‌ పాత్రను ఏమాత్రం తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా సైతం భారత్‌ స్నేహం కోసం వెంపర్లాడుతుంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి అమెరికా గడ్డపై లభించిన ట్రీట్‌మెంట్‌.. నెవర్‌ బిఫోర్‌గా అనిపిస్తోంది. 

నరేంద్ర మోదీ.. రాజకీయాలు పక్కనపెడితే ప్రపంచవ్యాప్తంగా ఈయనకు ఉన్న క్రేజ్‌ మామూలుగా లేదు. సోషల్‌ మీడియా వన్‌ ఆఫ్‌ ది టాప్‌ మోస్ట్‌ ఫాలోవర్స్‌ ఉన్నప్రముఖుడిగా ఉన్నారీయన. అలాగే.. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లిన భారత ప్రధాని హోదాలో ఆయనకు దక్కే ఘన స్వాగతం.. బహుశా మరేయితర ప్రపంచనేతలకు దక్కి ఉండదని చెబితే అతిశయోక్తి కాదేమో. తాజాగా అమెరికా పర్యటనలోనూ అలాంటి దృశ్యాలే కనిపించాయి. 

మూడు రోజల అమెరికా పర్యటనలో అడుగడుగునా నమోకు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ దక్కింది. ఎయిర్‌పోర్ట్‌ బయట స్వాగతం మొదలు.. వైట్‌హౌజ్‌, అమెరికన్‌ కాంగ్రెస్‌(పార్లమెంట్‌).. అంతెందుకు ఆయన వెళ్లే తోవలో మోదీ మోదీ నినాదాలు మారుమోగాయి. ఇందులో ప్రవాస భారతీయులే కాదు.. అమెరికన్‌ పౌరులు సైతం పాలు పంచుకోవడం నిజంగా ప్రత్యేకమే. 

మోదీ పాదాలను తాకి.. 
మేరీ జోరీ మిల్బెన్‌..  అమెరికన్‌ సింగర్‌. వరుసగా ముగ్గురు అమెరికా అధ్యక్షుల ముందు ప్రదర్శనలు ఇచ్చిన ఏకైక గాయకురాలిగానూ ఆమెకంటూ ఓ పేరుంది. అంతేకాదు ప్రపంచంలోని పలువురు ప్రముఖుల సమక్షంలోనూ ఆమె షోలు నిర్వహించారు. అలాంటి సింగర్‌.. రొనాల్డ్‌ రీగన్‌ బిల్డింగ్‌లో జరిగిన కార్యక్రమంలో భారత జాతీయ గీతం జనగణమన ఆలాపించారు. అంతేకాదు.. ఆ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ప్రధాని మోదీ వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. మరో విశేషం ఏంటంటే.. 2020 ఆగష్టులో జరిగిన 74వ స్వాతంత్ర్య వేడుకల్లోనూ ఆమె జగగణమనను ఆలాపించారు కూడా. 

న్యూయార్క్‌ వీధుల్లో భారీ బ్యానర్‌
మోదీ అమెరికా పర్యటన(రెండోది) ప్రతిష్టాత్మకంగా కొనసాగింది. ఈ పర్యటన చారిత్రాత్మకంగా భావించి.. చాపర్‌ ద్వారా ఓ భారీ బ్యానర్‌ను న్యూయార్క్‌ వీధుల గుండా ఎగరేశారు. మోదీతో పాటు బైడెన్‌ ఫొటో కూడా ఉంది అందులో. 

ఆ భవనాలపై మువ్వన్నెల రంగు
భారత ప్రధాని మోదీ పర్యటనలో మరో అరుదైన దృశ్యం కనిపించింది. లోయర్‌ మాన్‌హట్టన్‌లోని వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌ భవనంపై మువ్వన్నెల జెండా రంగుల కాంతుల్ని ప్రదర్శించారు. అంతేకాదు.. న్యూయార్క్‌ ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌పైనా ఈ దృశ్యం దర్శనమిచ్చింది. గతంలో అమెరికాను ఎంతో మంది ప్రపంచ అధినేతలు సందర్శించి ఉండొచ్చు. భారత్‌ నుంచి కూడా ఆ లిస్ట్‌ ఉండొచ్చు. కానీ, ఇప్పుడు మోదీకి దక్కిన ఆతిథ్యం.. అభిమానం మాత్రం నెవర్‌భిపోర్‌ అనే చెప్పాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement