Craze
-
ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్ ఇతనే..
ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్‌కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్‌లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్‌గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్‌గా లోపలికి అడుగుపెట్టాడు.యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది. -
వన్ అండ్ ఓన్లీ భారత్ అండ్ మోదీ
గౌరవాన్ని అవతలివాళ్ల నుంచి కోరుకోకూడదు.. అదే మనల్ని వెతుకుంటూ రావాలన్నాడు ఓ పెద్దాయన. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్.. అగ్రరాజ్యల లిస్ట్‌కు ఎప్పుడూ దూరమే. అలాగని సమకాలీన వ్యవహరాల్లో భారత్ పాత్రను ఏమాత్రం తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా సైతం భారత్ స్నేహం కోసం వెంపర్లాడుతుంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి అమెరికా గడ్డపై లభించిన ట్రీట్మెంట్.. నెవర్ బిఫోర్‌గా అనిపిస్తోంది. నరేంద్ర మోదీ.. రాజకీయాలు పక్కనపెడితే ప్రపంచవ్యాప్తంగా ఈయనకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్నప్రముఖుడిగా ఉన్నారీయన. అలాగే.. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లిన భారత ప్రధాని హోదాలో ఆయనకు దక్కే ఘన స్వాగతం.. బహుశా మరేయితర ప్రపంచనేతలకు దక్కి ఉండదని చెబితే అతిశయోక్తి కాదేమో. తాజాగా అమెరికా పర్యటనలోనూ అలాంటి దృశ్యాలే కనిపించాయి. మూడు రోజల అమెరికా పర్యటనలో అడుగడుగునా నమోకు స్పెషల్ ట్రీట్మెంట్ దక్కింది. ఎయిర్పోర్ట్ బయట స్వాగతం మొదలు.. వైట్‌హౌజ్, అమెరికన్ కాంగ్రెస్(పార్లమెంట్).. అంతెందుకు ఆయన వెళ్లే తోవలో మోదీ మోదీ నినాదాలు మారుమోగాయి. ఇందులో ప్రవాస భారతీయులే కాదు.. అమెరికన్ పౌరులు సైతం పాలు పంచుకోవడం నిజంగా ప్రత్యేకమే. Goosebumps 🇮🇳#ModiInUSA pic.twitter.com/nLGH6AkJ7y — Satnam Singh Sandhu (@satnamsandhuchd) June 22, 2023 మోదీ పాదాలను తాకి.. మేరీ జోరీ మిల్బెన్.. అమెరికన్ సింగర్. వరుసగా ముగ్గురు అమెరికా అధ్యక్షుల ముందు ప్రదర్శనలు ఇచ్చిన ఏకైక గాయకురాలిగానూ ఆమెకంటూ ఓ పేరుంది. అంతేకాదు ప్రపంచంలోని పలువురు ప్రముఖుల సమక్షంలోనూ ఆమె షోలు నిర్వహించారు. అలాంటి సింగర్.. రొనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో జరిగిన కార్యక్రమంలో భారత జాతీయ గీతం జనగణమన ఆలాపించారు. అంతేకాదు.. ఆ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ప్రధాని మోదీ వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. మరో విశేషం ఏంటంటే.. 2020 ఆగష్టులో జరిగిన 74వ స్వాతంత్ర్య వేడుకల్లోనూ ఆమె జగగణమనను ఆలాపించారు కూడా. Deeply moved by @MaryMillben's gesture of respect as she touched the feet of Prime Minister shri @narendramodi ji after delivering a captivating rendition of our #NationalAnthem. It's truly admirable when international artists embrace and honor Indian culture. 🙏🇮🇳 #Respect… pic.twitter.com/to3s3SJkEr — Pushyamitra Bhargav (@advpushyamitra) June 24, 2023 న్యూయార్క్ వీధుల్లో భారీ బ్యానర్ మోదీ అమెరికా పర్యటన(రెండోది) ప్రతిష్టాత్మకంగా కొనసాగింది. ఈ పర్యటన చారిత్రాత్మకంగా భావించి.. చాపర్ ద్వారా ఓ భారీ బ్యానర్‌ను న్యూయార్క్ వీధుల గుండా ఎగరేశారు. మోదీతో పాటు బైడెన్ ఫొటో కూడా ఉంది అందులో. Meanwhile in the sky of New York in United States of America 🇮🇳 pic.twitter.com/j7PcS8aHep — Kiren Rijiju (@KirenRijiju) June 23, 2023 ఆ భవనాలపై మువ్వన్నెల రంగు భారత ప్రధాని మోదీ పర్యటనలో మరో అరుదైన దృశ్యం కనిపించింది. లోయర్ మాన్‌హట్టన్‌లోని వన్ వరల్డ్ ట్రేడ్‌సెంటర్ భవనంపై మువ్వన్నెల జెండా రంగుల కాంతుల్ని ప్రదర్శించారు. అంతేకాదు.. న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పైనా ఈ దృశ్యం దర్శనమిచ్చింది. గతంలో అమెరికాను ఎంతో మంది ప్రపంచ అధినేతలు సందర్శించి ఉండొచ్చు. భారత్ నుంచి కూడా ఆ లిస్ట్ ఉండొచ్చు. కానీ, ఇప్పుడు మోదీకి దక్కిన ఆతిథ్యం.. అభిమానం మాత్రం నెవర్భిపోర్ అనే చెప్పాలి. New York's Empire State Building lit up in tricolour as PM Modi is on an official State visit to the United States pic.twitter.com/gcQCeqL7dc — ANI (@ANI) June 23, 2023 #HistoricStateVisit2023#IndiaUSAPartnership Testimony to the friendship between India and the US, the iconic lower Manhattan landmark @OneWTC sparkling in the lights of tricolor, welcoming @narendramodi on the historic State Visit.@IndianEmbassyUS@ANI@Yoshita_Singh… pic.twitter.com/oZw4gSqWhU — India in New York (@IndiainNewYork) June 23, 2023 My PM My Pride 🤩#ModiInUSA pic.twitter.com/kvIDZFgtgT — Gaurav🇮🇳 (@IamGMishra) June 21, 2023 1st Standing Ovation for Prime Minister Modi at US House of Representatives 👏👏👏 There have been many advances in AI- Artificial Intelligence. At the same time, there have been even more momentous development in another AI- America and India 👏👏👏#ModiInAmerica #ModiInUSA pic.twitter.com/Cpyww6fYF0 — Rosy (@rose_k01) June 22, 2023 -
‘బంగినపల్లి’కి అరబ్ దేశాల్లో క్రేజ్
కర్నూలు(అగ్రికల్చర్): అద్భుతమైన రుచి.. ఆకట్టుకునే రూపం.. గుబాళించే సువాసన.. మన బంగినపల్లి మామిడి సొంతం. భారతీయులతోపాటు అరబ్, యూరోప్ దేశాల ప్రజలు కూడా ఈ మధుర ఫలాన్ని లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బంగినపల్లి (బేనీషా) మామిడికి పుట్టినిల్లు అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగుచేస్తున్న పండ్లకు అరబ్ దేశాల్లో అత్యంత ఎక్కువగా క్రేజ్ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 25వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. గత ఏడాది సగటున ఎకరాకు 2 నుంచి 3 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 3-4 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో లక్ష టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. దీనిలో 80 నుంచి 90 శాతం వరకు బంగినపల్లి ఉంటుంది. బంగినపల్లి రకం మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో రెండు, మూడేళ్లుగా రైతులు నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గూడూరు, ఓర్వకల్, వెల్దుర్తి, ప్యాపిలి, బేతంచెర్ల, బనగానపల్లి, కల్లూరు, కర్నూలు, దేవనకొండ, డోన్, క్రిష్ణగిరి తదితర మండలాల్లో కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నారు. చీడపీడల బెడద, కెమికల్స్ ప్రభావం మామిడిపై పడకుండా ఫ్రూట్ కవర్స్ కూడా వినియోగిస్తున్నారు. దీంతో పండ్ల నాణ్యత పెరుగుతోంది. రైతులకు ఉద్యానవనశాఖ అధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. చదవండి: AP: సచివాలయాల ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ బడా వ్యాపారులు వచ్చి కొనుగోలు.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి బడా వ్యాపారులు ఇక్కడికి వచ్చి మామడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. తోటల్లోనే 20 కిలోల బాక్సుల్లో పండ్లను ప్యాకింగ్ చేసి ఆయా నగరాలకు తరలిస్తున్నారు. అక్కడ ప్రాసెసింగ్ చేసి అరబ్, యురోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పండిన పండ్లలో 40 శాతం ముంబైకి తీసుకువెళ్లి, అక్కడి నుంచి అరబ్ దేశాలైన దుబాయ్, సౌదీ, కువైట్‌కు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది 2,500 టన్నుల వరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశారు. టన్ను ధర రూ.80 వేల నుంచి రూ.1.05లక్షల వరకు లభించింది. ఈ ఏడాది 5వేల టన్నుల వరకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మామిడి కొనుగోలు కోసం మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు తరలివస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో మామిడికి ఎన్నడూ లేని విధంగా టన్ను ధర రూ.లక్షకు పైగా పలికింది. ఇటీవల మార్కెట్‌కు మామిడి తాకిడి పెరిగిన తర్వాత ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టన్ను ధర రూ.40 వేల వరకు లభిస్తోంది. నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి మామిడిలో నాణ్యత పెరిగింది. 50 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చేశాం. ఇందులో 85 శాతం చెట్లు బేనీషా రకానికి చెందినవే. ఎగుమతులకు అనువైన నాణ్యత ఉండాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా రసాయనాలు వాడటం లేదు. ఇందువల్ల మామిడిలో నాణ్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి కావడంలేదు. ముంబై, తమిళనాడు, హైదరాబాద్ వ్యాపారులు వచ్చి మామిడి కొంటున్నారు. – గొల్ల శ్రీరాములు, గూడూరు -
ఫ్యాన్సీ నంబర్లకు పెరిగిన క్రేజ్.. ఎన్ని రూ.లక్షలు పెట్టేందుకైనా రెడీ..!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ వాడుతున్న ఫ్యాన్సీ నంబర్ 6666.. ఈ సంఖ్యకు ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పోటీ ఉంది. ఉమ్మడి ఏపీలో రాజకీయరంగ ప్రవేశం అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన వాహనాలకు వాడిన నంబర్లు 999, 9999... ఇటీవల టీఎస్ 09 ఎఫ్‌జెడ్ 9999 అనే ఫ్యాన్సీ నంబర్ కోసం ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఓ సంస్థ వెచ్చించిన మొత్తం రూ. 9,50,999. గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో టీఎస్ 09 ఎఫ్ఎక్స్ 9999 అనే నంబర్‌కు పలికిన ధర ఏకంగా రూ.13.50 లక్షలు. టీఎస్ 09 జీఏ 0001 నంబర్ పొందేందుకు ఒక సంస్థ రూ.7.25 లక్షలు చెల్లించగా టీఎస్ 09 జీఏ 0007 అనే నంబర్ కోసం మరో సంస్థ రూ. 1.35 లక్షలు వెచ్చించింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫ్యాన్సీ నంబర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. లగ్జరీ వాహనాలకు నంబర్లు కూడా ప్రత్యేకంగా ఉండాలనే ఆకాంక్ష వాహనదారుల్లో పెరుగుతోంది. సంఖ్యాశాస్త్రం, జ్యోతిషంపై విశ్వాసం వల్లనో లేదా అదృష్టం కలసి వస్తుందనే నమ్మకంతోనో, సామాజిక హోదాను చాటేందుకో వాహనదారులు ప్రత్యేక నంబర్లపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీనటులు, రాజకీయ నాయకులు, సాఫ్ట్వేర్ సంస్థలు ఈ తరహా నంబర్లపట్ల ఎక్కువ ఆదరణ చూపుతున్నాయి. ఆర్టీఏకు భారీ ఆదాయం.. రవాణా శాఖ ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసే ప్రత్యేక నంబర్లలో ఆన్లైన్ (9999) నంబర్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తోంది. ఈ నంబర్ ప్రతి సిరీస్‌లోనూ దాదాపు రూ. 10 లక్షలు పలుకుతోంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉన్న 2020–21 ఆర్థిక సంవత్సరం మినహాయించి రవాణాశాఖకు ఏటా ఆదాయం పెరుగుతోంది. నాలుగైదేళ్ల క్రితం వరకు పెద్దగా ఆదరణలేని నంబర్లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ లభిస్తోంది. ప్రత్యేక నంబర్ల వేలం నిర్వహించిన ప్రతిసారీ ఖైరతాబాద్ కార్యాలయంలోనే సుమారు రూ. 30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఒక్కో నంబర్‌కు 10 మంది పోటీ.. ఆర్టీఏలో విడుదల చేసే కొత్త సీరిస్ నంబర్లలో 2,500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటున్నాయి. ఒక్కో నంబర్‌కు సగటున 5 నుంచి 10 మంది వాహన యజమానులు పోటీకి వస్తుండగా, నచ్చిన నంబర్లు లభించని వాహనదారులు తదుపరి వేలం కోసం 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా ఎదురు చూస్తున్నారు. అదృష్టం కోసమే ఎక్కువ మంది.. ► జ్యోతిషాన్ని నమ్మేవారే ఎక్కువగా తమ గ్రహస్థితి ప్రకారం అదృష్ట సంఖ్య పేరిట ఫ్యాన్సీ నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ► ఒకటో నంబర్‌ను నాయకత్వానికి, రెండో నంబర్‌ను శాంత స్వభావానికి, 3ను తెలివితేటలకు, ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తున్నారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్న వాళ్లు, పోరాడేతత్వం ఉన్నవాళ్లు ‘9’ని కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తూ ఈ నంబర్‌ను ఇష్టపడుతున్నారు. వాహనాలకు ఆయా నంబర్ల వాడకం వల్ల తాము వృద్ధిలోకి వస్తామని చాలా మంది నమ్ముతున్నారు. నంబర్లే బహుమతులు.. ► ఇటీవల కాలంలో చాలా మంది తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా అందించడంతోపాటు వారి పుట్టినరోజు కలిసొచ్చే విధంగా రిజి్రస్టేషన్ నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ► ‘1313’నంబర్ అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీన్ని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ► ‘5121’అనే నంంబర్ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు.‘143’, ‘214’, ‘8045’ వంటి నంబర్లకు కూడా ఎంతో క్రేజ్ ఉంది. క్రేజ్ పెరిగింది.. గతంకంటే ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్లకు అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది.లగ్జరీ వాహనాలు బాగా పెరిగాయి. ఏటా 10 వేలకుపైగా ఖరీదైన కార్లు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. అలాగే రూ. 50 లక్షల విలువైన బైక్‌లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ వాహనాల స్థాయికి తగినట్లుగానే వాహనదారులు నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. – జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: హైదరాబాద్‌లో ఈస్ట్‌జోన్‌వైపే మధ్యతరగతి ప్రజల ఆసక్తి -
చాట్‌జీపీటీకి అంత క్రేజ్ ఇందుకే..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ అప్లికేషన్ గూగుల్ మాదిరిగానే సెర్చ్ ఇంజన్‌లా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ఉన్న దిమ్మతిరిగే ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రారంభించిన ఐదు రోజుల్లోనే 1 మిలియన్ మంది యూజర్లను సంపాదించుకున్నదంటేనే దీని క్రేజ్ ఏంటో ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ చాట్ జీపీటీలో ఏముంది? దీన్ని ఏ కంపెనీ ఆవిష్కరించింది? గూగుల్ సెర్చ్‌కు దీనికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. (ఇదీ చదవండి: ఎక్కడ చూసినా ఇదే చర్చ.. చాట్ జీపీటీ! గూగుల్‌ని మించి? ఏది అడిగినా..) చాట్ జీపీటీ Vs గూగుల్ సెర్చ్ చాట్ జీపీటీ అంటే జెనెరేటివ్ ప్రీట్రైయిన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. గూగుల్ సెర్చ్‌కు ఇంటర్నెట్ అవసరం. అమెరికాకు చెందిన ఓపెన్ఏఐ సంస్థ చాట్ జీపీటీని రూపొందించింది. చాట్ జీపీటీ మనకు కావాల్సిన సమాచారాన్ని ఒకే సమాధానంగా ఇస్తుంది. వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సమయం ఆదా అవుతుంది. చదువులకు సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తుంది. కష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్స్ కూడా సెకన్లలో రాసిస్తుంది. గూగుల్ సెర్చ్‌లో అడిగిన దానికి సంబంధించి అనేక లింక్స్‌ను ఇస్తుంది. ఈ లింక్స్ నుంచి సమాచారం వెతుక్కోవాలి. చాట్‌జీపీటీ ముందుగా (2021 వరకు) నిక్షిప్తం చేసిన సమాచారం మాత్రమే ఇస్తుంది. (ఇదీ చదవండి: ఇక చైనా ‘చాట్‌బాట్’.. రేసులో ఆలీబాబా!) -
జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదుగా..
-
బిర్యానీ తగ్గేదేలే..!
నాన్ వెజ్ ప్రియుల నిలయమని నగరం నిరూపించుకుంది. రంజాన్ పండగ వేళ ఈ వంటకాల విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. కులమతాలకు అతీతంగా ఆరగించే హలీం అమ్మకాల్లో ముందున్నా, చికెన్ బిర్యానీకి ఉన్న డిమాండ్ఏ మాత్రం తగ్గకపోవడం విశేషమని ఇప్పటికీ ఆర్డర్ల పరంగా అదే నంబర్ వన్ అని.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ అధ్యయనం తేల్చింది. సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, అభి‘రుచుల’ నిలయం నగరం. ఇక్కడి నాన్‌వెజ్ వంటకాల్లో బిర్యానీకి ఉన్న క్రేజ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇక రంజాన్ సమయంలో అన్ని వంటకాల్నీ వెనక్కి నెట్టేస్తోంది హలీం. ఈ ఏడాది మాత్రం చికెన్ బిర్యానీ తన క్రేజ్‌ను నిలబెట్టుకుని హలీమ్ కన్నా డిమాండ్‌లో ఉందని స్టడీలో వెల్లడైంది. ‘ఆరు’గించినవి అవే.. రంజాన్ పండగ ప్రారంభమైన తర్వాత ఈ నెల 2 నుంచి 22 వరకూ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఆర్డర్ల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిప్రకారం అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఆరగించిన వంటకాల్లో.. చికెన్ బిర్యానీ, హలీమ్, నీహారిస్, సమోసాలు, రబ్డి, మాల్పువా అగ్రస్థానంలో ఉన్నాయి. బిర్యానీ...అదే క్రేజ్... హలీమ్ హవా ఉన్నప్పటికీ బిర్యానీ పట్ల డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదని స్టడీ తేల్చింది. కేవలం 20రోజుల్లో 8 లక్షల చికెన్ బిర్యానీలు నగరవాసులు హాంఫట్ అనిపించారు. కేవలం ఒక్క డోర్‌డెలివరీ యాప్ ఆర్డర్ల ద్వారానే ఈ స్థాయిలో డిమాండ్ ఉంటే ఇక మొత్తంగా చూస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ‘ఆహా’లీం.. ఏడాదికోసారి జిహ్వల్ని పలకరించే హలీంను గత ఏడాది కన్నా 33 రెట్లు ఎక్కువగా సిటిజనులు ఆరగించారు. దీనిలో మటన్ హలీం తొలిస్థానం కాగా స్పెషల్ హలీం, చికెన్ హలీం, ముర్గ్ హలీంలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే విరివిగా లభించే నిహారీ కూడా గత ఏడాదితో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా ఆదరణ పొందింది. అత్యధిక ఆర్డర్లు అందుకున్న వాటిలో ఇఫ్తార్ వంటకాలైన సమోసా, భజియా, రబ్డి, ఫిర్నీ, మాల్పువా.. ఉన్నాయి. ఇవి ఈ 20 రోజుల్లో ఏకంగా 4.5లక్షల ఆర్డర్లు సాధించాయి. ఇవి కాకుండా పనీర్ బటర్ మసాలా, చికెన్ 65, మసాలా దోశెలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇడ్లీలు సైతం 17వేల ఆర్డర్లు పొందడం విశేషం కాగా. డిసర్ట్స్‌లో గులాబ్‌జామూన్, రస్‌మలాయి, డబుల్ కా మీఠాలు టాప్ త్రీలో ఉన్నాయి. టేస్టీ.. యూనిటీ.. కుటుంబం మొత్తాన్నీ ఒకే చోట చేర్చడమే రంజాన్ గొప్పతనం. ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. అందర్నీ ఏకం చేసేలా విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకే వీలున్నన్ని రంజాన్ వంటకాలను రుచిచూడాలని భావిస్తాం. – మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్– మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
ఆ గోల్డ్.. మహా బోల్డ్
నరసాపురం (పశ్చిమ గోదావరి): వజ్రాలు, రత్నాల్లాంటి రాళ్లు పొదిగిన నెక్లెస్.. రూపాయి కాసంత కట్ ఉంగరం.. స్వర్ణ కంకణం సైజులో గాజులు.. నగిషీలతో తీర్చిదిద్దిన జూకాలు.. విభిన్న ఆకృతుల్లో వడ్డాణాలు.. అందాలు చిందే అర వంకీలు.. తలపై మెరిసే పాపట బొట్టు.. మెడలో హారం.. నడుముకు వడ్డాణం.. కాళ్లకు పట్టీలు.. వీటిలోనూ వందల రకాలు. బంగారు ఆభరణాల తళుకు బెళుకులకు ఏమాత్రం తీసిపోనివిధంగా అధునాతన డిజైన్లలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ ఆభరణాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. గీటు పెడితేనే గాని అవి గోల్డో, రోల్డ్ గోల్డో కనుక్కోలేని విధంగా వీటిని తయారు చేస్తున్నారు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా వీటిదే హవా. పేద, ధనిక భేదం లేకుండా మహిళలంతా వీటినే ధరిస్తున్నారు. బంగారాన్ని తలదన్నేలా.. బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ నగల వ్యాపారం పైపైకి ఎగబాకుతోంది. బంగారం ధర బరువెక్కిన పరిస్థితుల్లో అది ధనికులకు పెట్టుబడి వ్యవహారంగా మారిపోయింది. ఇంకోవైపు నగలు ఇంట్లో పెట్టుకున్నా.. ధరించి వీధిలో తిరిగినా దొంగల భయం. దీంతో మహిళలు ఇటీవల కాలంలో ఫంక్షన్లలో సైతం రోల్డ్ గోల్డ్ ఆభరణాలనే ధరిస్తున్నారు. తక్కువ ఖర్చుతో.. కోరుకున్న డిజైన్లలో ఈ నగలు లభిస్తుండడంతో మహిళలు వీటిని ధరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంపన్న వర్గాలకు చెందిన మహిళలు సైతం ఫంక్షన్లలో రోల్డ్ గోల్డ్ వస్తువులు ధరించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులను సైతం ఇమిటేషన్ జ్యూవెలరీ విశేషంగా ఆకర్షిస్తోంది. వారి అభిరుచులకు తగ్గట్టుగా వందలాది డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా రాగిని ఉపయోగించి వివిధ లోహాల మిశ్రమంతో వీటిని తయారు చేస్తున్నారు. పైన బంగారం పూత పూయడంతో ఈ నగలకు పసిడి వన్నెలు వస్తున్నాయి. ఇలా తయారుచేసిన ఆభరణాలకు క్వాలిటీని బట్టి ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. మెరుపు తగ్గినప్పుడు పూతవేస్తే తిరిగి అవి కొత్త వాటిలా తళతళలాడుతున్నాయి. అందుబాటులో ధరలు రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు మార్కెట్లో వివిధ క్వాలిటీలలో లభిస్తున్నాయి. సాధారణంగా ధరించే చెవి పోగులు, బుట్ట దుద్దులు, తాళ్లు లాంటివి రూ.50 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. చెయిన్లు, గాజులు, రాళ్ల గాజులు రూ.300 నుంచి రూ.1,500 వరకు ఉన్నాయి. వడ్డాణాలు, ముత్యాల నెక్లెస్‌లు, ముత్యాల హారాలు లాంటివి నాణ్యతను బట్టి రూ.10 వేల వరకు ధరలు ఉన్నాయి. రంగంలోకి బడా కంపెనీలు కొంతకాలం క్రితం వరకు కృష్ణా జిల్లా చిలకలపూడిలో తయారయ్యే రోల్డ్ గోల్డ్ వస్తువులు మార్కెట్‌కు విరివిగా వచ్చేవి. రోల్డ్ గోల్డ్ కొత్త ట్రెండ్ సంతరించుకోవడంతో బడా కంపెనీలు రోల్డ్ గోల్డ్ వస్తువులను తయారు చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం రోల్డ్ గోల్డ్ నగలకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ముంబై, సూరత్, అమృత్సర్, ఆగ్రా, చెన్నై ప్రాంతాల్లో యంత్రాలపై తయారుచేసిన ఆభరణాలు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. డిమాండ్ అంతా.. ఇంతా కాదు బంగారు ఆభరణమైతే అవసరానికి సొమ్ము చేసుకోవచ్చు. కానీ రోల్డ్ గోల్డ్ వస్తువులపై పెట్టిన సొమ్ము వృథా. అయినా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. చిన్న మొత్తమే కాబట్టి వృథా అయినా ఫర్వాలేదన్న ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. బంగారు ఆభరణాలకు మించి రోల్డ్ గోల్డ్ ఆభరణాల అమ్మకాలు సాగుతుండటం విశేషం. కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇమిటేషన్ జ్యూవెలరీ విక్రయించే దుకాణాలు 700 వరకు ఉన్నాయి. ఇళ్లల్లో సైతం చిన్నపాటి షాపులు నిర్వహిస్తూ మహిళలు వీటి అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో సీజన్లో అయితే రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బంగారు ఆభరణాల అమ్మకాలు సాగుతున్నాయి. ఇమిటేషన్ జ్యూవెలరీ అమ్మకాలు రోజుకు రూ.40 లక్షల వరకు సాగుతున్నట్టు అంచనా. ఒకప్పుడు పట్టణానికి ఒకటి, రెండు రోల్డ్ గోల్డ్ షాపులు ఉండేవి. ప్రస్తుతం ప్రతి పట్టణంలో 20 నుంచి 30 వరకు షాపులు ఉన్నాయి. గ్రామాలకే వెళ్లి వన్ గ్రాము వస్తువులు తీసుకెళ్లి విక్రయించేవారు సైతం పెరిగారు. రోల్డ్ గోల్డ్ ఆభరణాలే బెటర్ అరకాసు బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాలి. మాకు నచ్చిన డిజైన్లలో రోల్డ్ గోల్డ్ వస్తువులు దొరుకుతున్నాయి. బంగారం కంటే ఎక్కువ డిజైన్లు వీటిలో లభిస్తున్నాయి. వాటిని ధరిస్తే రోల్డ్ గోల్డ్ అన్న ఆలోచనే రాదు. ప్రస్తుత తరుణంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలే బెటర్. – అద్దేపల్లి రాధిక, గృహిణి బంగారు కంటే మిన్నగా.. ఇదివరకు రోల్డ్ గోల్డ్ వస్తువులు వేసుకుంటే అవి బంగారం కాదని చాలా ఈజీగా తెలిసిపోయేది. పెద్దగా నాణ్యత ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. రోల్డ్ గోల్డ్ వస్తువులు బంగారం వస్తువుల కంటే బాగుంటున్నాయి. రూ.5 వేలు పెట్టి రోల్డ్ గోల్డ్ వస్తువు కొని పెట్టుకుంటే మంచి అందంగా ఉంటుంది. అదే వస్తువు బంగారంతో చేయించాలంటే రూ.5 లక్షలకు పైనే పెట్టాలి. ఇదే బెటర్ కదా. – కె.సత్యవాణి, గృహిణి అమ్మకాలు బాగా పెరిగాయి రోల్డ్ గోల్డ్ వస్తువుల అమ్మకాలు బాగా పెరిగాయి. మా షాపులకు మధ్య తరగతివారే కాకుండా సంపన్న వర్గాలు వారు కూడా వస్తున్నారు. ప్రస్తుతం మంచి మంచి డిజైన్లలో వస్తువులు దొరుకుతున్నాయి. చెన్నై, ముంబై ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతాం. – శిరం చంటి, రోల్డ్ గోల్డ్ షాపు యజమాని, నరసాపురం -
రష్మిక మందన్న.. ఇప్పుడొక సెన్సేషన్!
రష్మిక మందన్న. సౌతిండియన్ సినీ పరిశ్రమలో ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్. తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో సూపర్‌హిట్ సినిమాలతో దూసుకుపోతోన్న ఈ స్టార్‌కు ముఖ్యంగా యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. తెలుగు సినిమాకు పరిచయం కాకముందు రష్మికకు ‘కర్ణాటక క్రష్’ అనే పేరుంది. ఇప్పుడైతే ఆమె పాపులారిటీ సౌతిండియా మొత్తం పాకేసింది కాబట్టి, రష్మికను ‘యూత్ క్రష్’ అని చెప్పేసుకోవచ్చు. ఈ స్టార్ గురించి కొన్ని విశేషాలు... చిన్నప్పట్నుంచీ యాక్టివ్... రష్మిక సినిమాల్లో ఎంత హుషారుగా కనిపిస్తుందో, నిజజీవితంలోనూ అంతే యాక్టివ్! టీనేజ్‌లో ఉన్నప్పట్నుంచే సినిమాలంటే పిచ్చి. అలా పద్దెనిమిదేళ్లకే మోడలింగ్‌లోకి వచ్చి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు చాలా కమర్షియల్ యాడ్స్‌కు రష్మిక టాప్ ప్రయారిటీగా ఉండేది. మోడలింగ్‌లో ఆ క్రేజే ఆమెకు సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. కిరాక్ ఆఫర్ 2016. కన్నడలో ‘కిర్రిక్ పార్టీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. అందులో హీరోయిన్ పాత్రకు ఒక ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని నిర్మాతలు అనుకుంటున్న టైమ్‌లో రష్మికను ఒక యాడ్‌లో చూశారు మేకర్స్. ఆడిషన్స్ చేసి, రష్మికను సెలెక్ట్ చేసి, సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించి, అదే ఏడాది చివరికి రిలీజ్ చేశారు. సినిమా పెద్ద హిట్. అందులో హీరోయిన్ రష్మిక అయితే ఒక్కసారే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ‘కర్ణాటక క్రష్’ అన్న పేరు సంపాదించుకునేంతగా యూత్ మనసు దోచేసుకుంది. ఛలో తెలుగు ‘కిర్రిక్ పార్టీ’ సక్సెస్‌తో రష్మికకు తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలైంది. అలా వచ్చిందే నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’! ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా చిన్న బడ్జెట్ సినిమాల్లో బ్లాక్‌బస్టర్. ఈ సక్సెస్‌తో కన్నడ సినిమాలకు కూడా నో చెప్పేంతగా తెలుగులో బిజీ అయిపోయింది రష్మిక. ప్రస్తుతం ఆమె ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘దేవదాస్’ సినిమాల్లో హీరోయిన్గా కనిపించనుంది. రిలేషన్షిప్ స్టేటస్:ఎంగేజ్డ్ రష్మిక వయస్సు ఇప్పుడు 22 ఏళ్లు. మామూలుగా అయితే హీరోయిన్గా పేరొస్తున్న వాళ్లు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటారు. రష్మిక ఇవేవీ పట్టించుకోకుండా చిన్న వయసులోనే పెళ్లికి రెడీ అయిపోయింది. ‘కిర్రిక్ పార్టీ’లో తన కో స్టార్ రక్షిత్ శెట్టితో గతేడాది రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. గీత మేడమ్! ‘ఛలో’ సినిమా రిలీజ్ అయి హిట్టయ్యాక రష్మిక పాపులర్ అయితే, ‘గీత గోవిందం’ అనే సినిమా విడుదల కాకముందే ఇందులో ఆమె చేసిన పాత్ర పాపులర్ అయింది. ‘గీతా మేడమ్.. గీతా మేడమ్..’ అని పిలుస్తూ ట్రైలర్లో హంగామా చేస్తోన్న విజయ్‌దేవరకొండ ఈ సినిమాలో హీరో. ఈ సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాట గత నెల రోజులుగా ఆన్లైన్లో బాగా పాపులర్ అయిన పాట. ఇందులో గీత మేడమ్‌కు.. అదే రష్మికకు.. ఆమె ఫ్యాన్స్ ఇప్పటికే ఫిదా అయిపోయారు. -
‘కుమార వర్మ’కు జపనీయుల జేజేలు
భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలికి.. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోని నటీ నటులకు కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది. బాహుబలి 2లో కుమార వర్మ పాత్ర పోషించిన సుబ్బరాజుకు జపాన్ అభిమానులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజు పాత్ర వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన కోసం సోషల్ మీడియాలో సైతం విపరీతమైన చర్చ నడించింది. ఇటీవల జపాన్ వెళ్లిన సుబ్బరాజ్‌కు అక్కడి అభిమానులు జేజేలు పలికారు. సుబ్బరాజు కూడా కుమార వర్మ వేషంలోనే బహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్‌కు వెళ్లి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాహుబలి టీమ్ ట్విటర్లో షేర్ చేసింది. మా కుమార వర్మపై మీ ప్రేమకు ధన్యవాదాలు.. అతని ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అంటూ పేర్కొంది. సుబ్బరాజు జపాన్ వెళ్లడంపై అక్కడి అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బరాజ్ కూడా వారితో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అక్కడి అభిమానుల కోరిక మేరకు బాహుబలి 2లోని కత్తితో చెక్కను రెండుగా చీల్చే సన్నివేశాన్ని సరాదాగా చేసి చూపించారు. సుబ్బరాజు జపాన్ రావడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో బల్లాలదేవ పాత్రలో నటించిన రానా కూడా సుబ్బరాజుకు ట్విటర్లో అభినందనలు తెలిపారు. -
సుబ్బరాజుకు జపాన్ అభిమానులు ఫిదా
-
ఫిఫా... ఇంట్రెస్ట్ పోయింది
న్యూయార్క్: ఫుట్‌బాల్ అంటే మక్కువ చూపే దేశాల్లో బ్రెజిల్ ఒక్కటి. 13 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బ్రెజిల్లో ఆ ఆట అంటే పడి చచ్చిపోతారు. అయితే అది ఒకప్పటి మాట. ప్రస్తుతం బ్రెజిల్ వాసులు ఆ ఆట మీద ఏ మాత్రం మక్కువ చూపటం లేదని ఓ సర్వే తేల్చింది. పైగా రికార్డు స్థాయిలో ఆ గేమ్ మీద ఆసక్తి కోల్పోయారని షాకింగ్ నివేదికనే సమర్పించింది. సర్వే వివరాలు... ఫిఫా వరల్డ్ కప్-2018 నేపథ్యంలో న్యూయార్క్‌కు చెందిన నీల్సెన్ స్పోర్ట్స్ సంస్థ ఆన్లైన్ ద్వారా సర్వే చేపట్టింది. నివేదిక ఆధారంగా మొత్తం 30 దేశాలతో ఓ జాబితాను రూపొందించింది. అందులో అత్యధికంగా 80 శాతంతో యూఏఈ దేశ ప్రజలు ఫుట్‌బాల్ మీద ఆసక్తికనబరుస్తున్నట్లు వెల్లడించింది. తర్వాతి స్థానంలో థాయ్‌లాండ్(78 శాతం), చిలీ, పోర్చుగల్, టర్కీ నిలవగా, బ్రెజిల్ అనూహ్యంగా 13వ స్థానంలో నిలిచింది. 2013లో 73 శాతం మంది బ్రెజిల్ ప్రజలు ఆట మీద మక్కువ ప్రదర్శించగా.. ఇప్పుడు అది గణనీయంగా పడిపోయినట్లు(ఎంత శాతం అన్నది స్పష్టం చేయలేదు) గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో ఫిఫా క్రేజ్ మిగతా దేశాలను పరిశీలిస్తే... గత నివేదికతో(2013) పోలిస్తే ప్రస్తుతం మిగతా దేశాల్లో సాకర్‌పై మక్కువ పెరిగిపోయింది. చైనాలో 5 శాతం(ఇంతకు ముందు 27.. ఇప్పుడు 32),అమెరికాలో 4 శాతం(ఇంతకు ముందు 28.. ఇప్పుడు 32), ఇండియాలో కాస్త ఎక్కువగా 15 శాతం (ఇంతకు ముందు 30.. ఇప్పుడు 45) ఫుట్‌బాల్‌పై మక్కువ కనబరుస్తున్నట్లు నివేదిక తెలిపింది. జర్మనీతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత దృశ్యం కారణం అదేనా?... ఒకానోక టైంలో ఫుట్‌బాల్ అంటేనే గుర్తొచ్చే పేరు బ్రెజిల్. అలాంటిది పరిస్థితి ఇంత దారుణంగా పడిపోవటానికి కారణాలు సైతం ఆ సర్వే విశ్లేషించింది. గత ఫిఫా వరల్డ్ కప్ వేదిక బ్రెజిల్ అన్న విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ఏడాది నుంచి బ్రెజిల్ ఫెర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోతూ వచ్చింది. దీనికి తోడు సొంత దేశంలో సెమీ ఫైనల్లో జర్మనీ చేతిలో 7-1 తేడాతో బ్రెజిల్ చిత్తుగా ఓడిపోవటాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆటపై ఆదరణ క్రమక్రంగా తగ్గిపోతూ వస్తోంది. వాతావరణం అనుకూలించకపోయినా ఆట కోసం మైదానాలకు ఎగబడిపోయే బ్రెజిల్ ప్రేక్షకులు.. బ్రెజిలియన్ ఛాంపియన్ షిప్ మ్యాచ్‌ల సమయంలో అంతంత మాత్రంగా హాజరుకావటం... పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో తెలిపింది. ప్రస్తుతం ఫుట్‌బాల్ పట్ల అక్కడి ప్రజలు అంత ఆసక్తికనబరచటం లేదని స్పష్టమౌతోంది. ఫిఫా వరల్డ్‌కప్ 2018 సందర్భంగా ఫుట్‌బాల్ సంబంధిత ఉత్పత్తులు అంతగా అమ్ముడుపోకపోవటం( గతంలో కంటే 50 శాతానికి పైగా పడిపోయినట్లు అమ్మకపు కంపెనీలు చెబుతున్నాయి), ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రష్యాకు చేరుకుంటున్న వారి సంఖ్య బాగా తగ్గిపోయిందని స్వయానా బ్రెజిల్ ఫుట్‌బాల్ అసోషియేషన్ ప్రకటించటం గమనార్హం. ఓటమి తర్వాత బ్రెజిల్ ప్రేక్షకుల కంటతడి మెస్సీ కంటే రొనాల్డోనే... సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఇందుకు సంబంధించిన ట్రోల్ గురించి పరిచయం అక్కర్లేదు. మెస్సీ కంటే రొనాల్డోనే గ్రేట్ అని.. లేదు రొనాల్డో కంటే మెస్సీనే గొప్ప అంటూ ఇద్దరు ఆటగాళ్ల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఫిఫా నేపథ్యంలో ఎవరికి క్రేజ్ ఎక్కువ అన్నదానిపై నీల్సెన్ స్పోర్స్ట్ సర్వే జరిపింది. ఇందులో లియోనెల్ మెస్సీ(అర్జెంటీనా)పై క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగల్) పైచేయి సాధించాడు. సోషల్ మీడియాలో(ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అన్ని కలిపి) మెస్సీ కంటే రొనాల్డోకే ఫాలోవర్లు ఎక్కువ. పైగా గత ఐదు నెలలుగా రొనాల్డో ఫాలోయింగ్ గణనీయంగా పెరిగిపోతూ వస్తోందని సర్వే తేల్చింది. -
ఖలీఫా ఇంట పండగ
ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గొప్ప ధర్మనిష్టాపరులు. తన ధనాగారంలో ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగించేవారు. అది రమజాన్ నెల. ఈద్ జరుపుకోవడానికి ప్రజలంతా ఎవరి ఏర్పాట్లు వాళ్లు చేసుకుంటున్నారు. ఖలీఫా గారి ఇంటిలో మాత్రం అలాంటి సందడేమి కనిపించడం లేదు! స్నేహితులంతా కొత్తకొత్త బట్టలు కొనుక్కుంటుంటే ఖలీఫా పిల్లలకూ కొత్తబట్టలపై మోజు పుట్టింది. తండ్రి కొత్త బట్టలు తెస్తారన్న ఆతృతతో రోజూ ఎదురు చూడసాగారు. కానీ వాళ్లకు నిరాశే మిగిలేది. చిన్నారుల ఆవేదనను అర్థం చేసుకున్న ఆ తల్లి... ఇంటికి వచ్చిన భర్తతో ‘ఏమండీ... ఊళ్లో వాళ్లంతా తమ పిల్లలకు పండుగకోసం కొత్త్త దుస్తులు కొంటున్నారు. మనకు లేకపోయినా పర్వాలేదు. కనీసం పిల్లలకైనా చెరో జత బట్టలు తీసుకురండి’ అని భర్తను ప్రాధేయపడింది. ‘వాళ్లకు కొత్త బట్టలు ఇప్పించాలని నాకు మాత్రం లేదా చెప్పు. కాని ఏం చేయమంటావు, నాకొచ్చే జీతంతో ఇల్లు గడవడమే గగనం. ఇక పిల్లలకు కొత్త బట్టలు కొనే స్థోమత ఎక్కడిది’ అని దీనంగా చెప్పుకొచ్చారు ఖలీఫా. ‘మన్నించండి.. పసిపిల్లల ఆవేదన చూడలేక అడిగానే కానీ నాకు మాత్రం తెలియదా?’ అని భర్తను ఓదార్చింది. ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొని ‘నేను ఖలీఫానే. నా అధీనంలో ఎనలేని ధనరాశి ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ నేను కేవలం దానికి కాపలాదారుడ్ని మాత్రమే. ఆ ధనాన్ని ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలి. అందులో ఆవగింజంతైనా అవకతవక జరిగితే రేపు ప్రళయదినాన పరలోకంలో ఆ విశ్వప్రభువు ముందు పట్టుబడిపోవలసి వస్తుంది. కనుక ఉన్నదాంట్లోనే పండుగ జరుపుకుందాం’ అని చెప్పారు ఖలీఫా. రమజాన్ ఉపవాసాలు ఆశించేది ఇలాంటి దైవభీతినే. – తహూరా సిద్దీఖా -
తెరతరాల చరిత
సినిమా అంటే ఓ క్రేజ్.. ఓ అద్భుత ప్రపంచం. సామాన్యుడి నుంచి స్థితిమంతుడి వరకు తమ జీవితాలను సినిమాల్లోని పాత్రలకు అన్వయించుకుని మురిసిపోతుంటారు. హీరో, హీరోయిన్లను అనుకరిస్తూ ముందుకుసాగుతుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రజల జీవితాల్లో సినిమాలు ఓ భాగమైపోయాయి. సినిమాలు ప్రదర్శించే థియేటర్లలో కాలక్రమేణా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పటి టూరింగ్ టాకిస్ల నుంచి నేటి మల్టీఫ్లెక్స్‌ల స్థాయికి చేరుకున్నాయి. అడుగడుగునా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అబ్బురపరుస్తున్నాయి. సాంకేతికత పుణ్యమా అని భారీనష్టాల నుంచి లాభాల దిశగా థియేటర్లు పయనిస్తున్నాయి. సినిమా థియేటర్ల ప్రస్థానంపై ఈ వారం సండే స్పెషల్. కొవ్వూరు రూరల్ : జిల్లాలో ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లిన సినిమా థిథియేటర్లు దశాబ్ద కాలం నుంచి రెండేళ్ల కిందటి వరకు భారీ నష్టాలతో మూతపడ్డాయి. చాలా థియేటర్లు షాపింగ్ కాంప్లెక్స్‌లుగా, రైస్‌మిల్లులుగా రూపాంతరం చెందాయి. పాతతరంలో ఎన్ని థియేటర్లు ఉన్నా తక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవడం వల్ల ఎక్కువ రోజులు ఆడి థియేటర్ల యజమానులకు లాభాలు పండించేవి. రానురాను వారం ఆడితే చాలు అనే స్థాయికి సినిమాలు మారిపోవడంతో థియేటర్ల యజమానులకు కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం 100 థియేటర్లు ఒకప్పుడు పల్లెటూళ్లలో టూరింగ్ టాకిస్లు ఉండేవి. చుట్టూ తడికలు కట్టి రాత్రిపూట మాత్రమే సినిమా ప్రదర్శించేవారు. వాటిస్థానంలో సినిమా థియేటర్లు వచ్చాయి. ఇరవై ఏళ్ల కిందట సుమారుగా 200 సినిమా థియేటర్లు జిల్లాలో ఉండేవి. అయితే రానురాను వీటి నిర్వహణ తలకుమించిన భారం కావడంతో పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 100 థియేటర్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా 75 శాతం ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. ప్రేక్షకుల సౌకర్యార్థం సెంట్రల్ ఏసీ, ఈజీ చైర్స్, డీటీఎస్డాల్బీ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా ప్రదర్శించడంతో తిరిగి సినిమా థియేటర్లు పూర్వ వైభవాన్ని పొందుతున్నాయని చెప్పవచ్చు. జిల్లాలో కొత్తగా థియేటర్లు నిర్మాణంలో ఉన్నాయంటే లాభాలు బాగున్నాయని అర్థం చేసుకోవచ్చు. రీల్ నుంచి శాటిలైట్ వైపు సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో రీల్ నుంచి శాటిలైట్‌కు మార్పు చెంది నేడు సినిమా ప్రదర్శన జరుగుతోంది. థియేటర్ యాజమాన్యాలకు కూడా కొంత నిర్వహణ ఖర్చులు తగ్గడంతో ప్రస్తుతం లాభసాటిగానే ఉందని పలువురు యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమా రిలీజ్ అయితే శాటిలైట్ ద్వారా యూఎఫ్ఓ, క్యూబ్, ఆర్గవిస్ట్న్ వంటి సంస్థలు నేరుగా థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇద్దరు ఆపరేటర్లు, ఇద్దరు హెల్పర్లు పనిచేసే స్థానంలో ఇప్పుడు ఇద్దరు పనిచేస్తే చాలు. దీంతో సిబ్బంది వేతనాల ఖర్చు తగ్గింది. శాటిలైట్ ద్వారా సినిమాలను ప్రదర్శిస్తుండడంతో ఎన్నిసార్లు వేసినా క్వాలిటీలో ఎటువంటి మార్పు రాదు. అదే రీల్ ద్వారా ప్రదర్శిస్తే రీల్ నలిగి క్వాలిటీలో తేడా వచ్చేది. సాంకేతిక మార్పులకు రూ.కోటి ఖర్చు ప్రేక్షకుడికి సౌకర్యంగా ఉండేలా నేటి సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకుని థియేటర్లను మార్చు చేయాలంటే ప్రస్తుతం రూ. కోటి వరకూ పెట్టుబడి అవసరమవుతుంది. ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ (డీటీఎస్) మార్పుకు రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ ఖర్చవుతుంది. అంతే కాకుండా పాత థియేటర్లలో ఉన్న సీట్లను తొలగించి సౌకర్యవంతంగా ఉండే సీట్లు ఏర్పాటు చేయాలంటే ఒక్కో సీటుకు సుమారుగా రూ.5 వేలు ఖర్చవుతుంది. 300 నుంచి 400 వరకూ ప్రేక్షకులు కూర్చునేందుకు సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిని బట్టి సుమారుగా రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల మొత్తం అవసరమవుతుంది. అంతే కాకుండా థియేటర్ ముందుభాగం ఆకట్టుకునే విధంగా చేసేందుకు, ఇతర మరమ్మతులకు మిగిలిన మొత్తం అవసరం అవుతుంది. పర్సంటేజ్‌ల నుంచి అద్దెల విధానానికి మార్పు గతంలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా పర్సంటేజ్ రూపేణా థియేటర్ యాజమాన్యానికి నిర్మాతలు చెల్లించేవారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పర్సంటేజ్‌ల వల్ల ఒక్కోసారి నిర్మాతలకు నష్టాలు వస్తున్నాయి. సినిమా సక్సెస్ అయినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ థియేటర్ల యాజమాన్యాలకు ఇవ్వాల్సి వస్తుందన్న భావన నిర్మాతల్లో కలగడంతో మార్పు అనివార్యమైంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పలు థియేటర్లు ఎగ్జిబిటర్లతో అద్దె చెల్లించే విధంగా ఏడాది, ఆపై రోజులకు యాజమాన్యాలు ఆగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెద్ద పట్టణాల్లో రోజుకు రూ.15 వేల వరకూ, చిన్న పట్టణాల్లో రూ.10 వేల వరకూ అద్దె చెల్లిస్తున్నారు. సినిమా ప్రదర్శన బాధ్యత ఎగ్జిబిటర్లే తీసుకుంటున్నారు. నిర్వహణ పోను లాభ, నష్టాలతో సంబంధం లేకుండా అద్దె చెల్లిస్తుండంతో కొంత మేరకు ప్రస్తుతం థియేటర్ల యజమానులకు అనుకూలంగానే ఉంది. థియేటర్లు తగ్గినా పెరిగిన స్క్రీన్లు ప్రస్తుతం ఒకే థియేటర్లో రెండు లేదా మూడు స్క్రీన్లు ఏర్పాటు చేయడం ద్వారా యాజమాన్యాలు లాభాలు పొందుతున్నాయి. ఒకే రోజు మూడు చిత్రాలను ప్రదర్శించగలుగుతున్నాయి. ఉదాహరణకు ఏలూరులో రెండు థియేటర్లలో మూడు స్క్రీన్లు, మరో రెండింటిలో రెండేసి స్రీన్లు ఏర్పాటు చేశారు. ఇవి గతంలో ఒకే స్క్రీన్‌తో సినిమాను ప్రదర్శించిన థియేటర్లే. అధిక ధరలతో ప్రేక్షకుడికి భారం ప్రస్తుతం పలు చోట్ల టిక్కెట్ ధరలు ప్రేక్షకుడికి భారంగా మారాయి. సినిమాకు నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే సుమారుగా రూ.వెయ్యి వదిలించుకోవాల్సిందే. రిలీజ్ సినిమాకు ప్రభుత్వ ధరలతో సంబంధం లేకుండా టిక్కెట్‌కు రూ.100 నుంచి రూ.150 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. అంతే కాకుండా తినుబండారాల ధరలు కూడా బయటకన్నా ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తుండడంతో నేటికీ సినిమాకు సామాన్యుడు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
సెల్ఫీ కష్టాల్లో మావోయిస్టు అగ్రనేత
విశాఖపట్నం: చిన్నా పెద్దా అందరికీ సెల్ఫీ ల మోజు సామాన్యమైంది కాదు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సెల్ఫీ వివాదంలో ఓ మావోయిస్ట్ అగ్రనేత చిక్కుకోవడంతో వైజాగ్ రూరల్ పోలీసులు సంబరాలు చేసుకుంటున్నారు. అవును...చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉండి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మావోయిస్ట్ అగ్రనేత చలపతి ఉనికి ఇపుడు ప్రమాదంలో పడింది. చలపతి ఆచూకీ లభ్యం కాక ..కనీసం అతని ఫోటో కూడా దొరకక తలపట్టుకున్న పోలీసులకు .. అతను భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీ లభ్యం కావడం ఆసక్తకరంగా మారింది. మావోయిస్టు నేత, కోరాపూట్- శ్రీకాకుళం డివిజన్ కమిటీ డిప్యూటీ కమాండర్, మోస్ట్ వాంటెడ్ చలపతి అలియాస్ అప్పారావు, అతని భార్య అరుణఫోటో పోలీసులకు చిక్కింది. దీంతో ఇదే అదునుగా భావించిన అధికారులు ఏజెన్సీ ఏరియాల్లో పోస్టర్లు అతికించడం కలకలం రేపింది. అయితే ఏడాది మే14న జరిగిన ఎన్ కౌంటర్ లో అరుణ సోదరుడు, మావోయిస్ట్ అజాద్ సహా, మరోఇద్దర్ని పోలీసులు కాల్చిచంపారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో ఆయుధాలు, కిట్ బ్యాగులు,ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చలపలి సెల్ఫీ ఫోటోను సేకరించారు పోలీసులు. వైజాగ్, తూర్పు గోదావరి జిల్లాల తూర్పు డివిజన్ కార్యదర్శి కూడా అయిన చలపతిపై 20 లక్షల రివార్డు ఉండగా, అరుణపై 5 లక్షల రివార్డు ఉంది. ఎప్పుడో 90ల్లో దిగిన సరిగా కనిపించని ఫొటోతోనే ఇన్నాళ్లూ పోలీసులు చలపతి కోసం గాలించారు. కానీ ఇప్పుడు ఏకంగా అతడే ఇలా సెల్ఫీతో తన ఆనవాళ్లు అందించడంతో తమ పని సులువైందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత సెల్ఫీని లాప్టాప్లో దాచుకోవడం వాళ్లు చేసిన పెద్ద పొరపాటని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోటోల సహాయంతో చలపతి ని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ పోస్టర్లు, సెల్ఫీ వార్తలపై అటు మావోయిస్టు వర్గాలనుంచి గానీ, ఇతర విప్లవ పార్టీలనుంచి గానీ ఎలాంటి స్పందనా రాలేదు. -
సెల్ఫీ వ్యామోహం ఉన్నవారికి 'టీ రెక్స్ హ్యాండ్'
సెల్ఫీల వ్యామోహం ఉన్నవారికి ఇదో మంచి అవకాశం. అనేక వినూత్న భంగిమల్లో ఫొటోలు తీసుకోవాలని మనసు పడేవారికి, ఎప్పుడూ విభిన్నంగా కనిపించాలని ఇష్టపడేవారికి లేటెస్ట్ ట్రెండ్‌గా టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) హ్యాండ్స్ పోజును లండన్ కు చెందిన ఓ బ్యూటీ బ్లాగర్ పరిచయం చేసింది. చేతి వేళ్లను ముఖానికి దగ్గరగా అనేక భంగిమల్లో ఉంచుతూ ఫొటోలు తీసుకొని ఆ అందాలను మీరే స్వయంగా చూసుకోవాలని సలహా ఇస్తోంది. సెల్ఫీల ధోరణి ఎక్కువైన నేటికాలం జనానికి కొత్త రకం సెల్ఫీ స్టైల్ ను పరచయం చేసింది.. లండన్ కు చెందిన బ్యూటీ బ్లాగర్, ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీ హుడా కట్టమ్. థైబ్రోస్, డక్ ఫేస్ లాంటి విభిన్న చిత్రాలను తీసుకోవడం సైతం పాత పద్ధతిగా మారిన నేపథ్యంలో... వినూత్నంగా టీ రెక్స్ ప్రయోగాన్ని ఆమె తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది. మీరు సెల్ఫీ తీసుకునే సమయంలో రెండు చేతులను ఉపయోగించి, ముఖానికి దగ్గరగా ఉంచుకొని ఫొటో తీసుకుంటే టీ రెక్స్ ప్రభావం మీకే తెలుస్తుందంటూ ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించిన సదరు మహిళ వివరించింది. తాను స్వయంగా ఆ అనుభవాన్ని ఆస్వాదించినట్లు కట్టమ్ ఇన్ స్టా గ్రామ్ లో తెలిపింది. ఓ కొత్త పోజులో మీరు కనిపించాలనుకున్నపుడు కెమెరా పట్టుకున్న మీ చేతులను కళాత్మకంగా ముడుస్తూ.. ముఖం దగ్గర, గడ్డం మీద, జుట్టు మీద ఉంచి చూడమంటోంది. మీరు చేతిని, చేతి వేళ్లను కదులుస్తూ, ముఖంలోని ఒక్కో భాగంపై పెడుతూ టి రెక్స్ ను ఉపయోగించి చూస్తే సెల్ఫీ మజా ఏమిటో తెలుస్తుందంటోంది. ముఖ్యంగా వేళ్లను నుదుటిపై ఉంచినపుడు టి రెక్స్ అద్భుతంగా కనిపిస్తుందని, అలాగే ముఖంలోని ప్రతి భాగం విభన్నంగా కనిపిస్తుందని కట్టమ్ చెప్తోంది. టి రెక్స్ థెరోపాడ్ డైనోసార్ హ్యాండ్ పద్ధతిలో తీసుకున్న సెల్ఫీలు సెలబ్రిటీ ప్రపంచాన్ని ఆకట్టుకుంటూ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో హల్ చల్ చేస్తున్నాయి. -
ఫ్యాన్సీ నెంబర్లపై అదే క్రేజ్ ( 0909 @రూ. 2.09 లక్షలు)
ఫ్యాన్సీ నెంబర్లపై అదే క్రేజ్ నచ్చిన నెంబర్ కోసం రూ.లక్షలు ఒక్క రోజే రూ.8.71 లక్షల ఆదాయం సిటీబ్యూరో : ఖరీదైన వాహనాలతో పాటే నగరంలో ఆకర్షణీయమైన ఫ్యాన్సీ నెంబర్లకు సైతం క్రేజీ పెరిగింది. నచ్చిన నెంబర్ల కోసం వాహనదారులు రూ. లక్షలు వెచ్చిస్తున్నారు. సామాజిక హోదాకు, అదృష్టానికి ప్రతీకగా భావిస్తూ ఫ్యాన్సీ , లక్కీ నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాహనాల నెంబర్లకు జరిగిన వేలంలో కాసులు కురిశాయి.‘టీఎస్ 09 ఇజే 0909’ నెంబర్ కోసం ఆదిత్య అండ్ కో అనే సంస్థ తమ బిఎండబ్ల్యూ కారు కోసం రూ.2.09 లక్షలు చెల్లించి నెంబర్‌ను సొంతం చేసుకుంది. అఖిల్ ఇంటర్నేషనల్ అనే మరో సంస్థ తమ వోల్వో కారు కోసం వేలంలో రూ.2.05 లక్షలు చెల్లించి ‘టీఎస్ ఇజె 999’ నెంబర్‌ను దక్కించుకున్నారు. రూ.15.35 లక్షల ఖరీదు చేసే హార్లీడేవిడ్సన్ బైక్ కోసం కృష్ణకుమార్ అనే వ్యక్తి ఏకంగా రూ.1.48 లక్షలు చెల్లించి ‘టీఎస్ 09 ఇజె 1111’ నెంబర్‌ను సొంతం చేసుకున్నారు. మొత్తంగా గురువారం ఒక్క రోజే అన్ని నెంబర్లపైన రూ.8.71 లక్షల ఆదాయం లభించింది. ఆ ఒక్క నెంబర్ ఉండాల్సిందే... నగరంలోని ఇతర ప్రాంతాల కంటే ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలోనే ఫ్యాన్సీ నెంబర్లకు పోటీ ఎక్కువగా ఉండడం గమనార్హం. ఎక్కడా లేని విధంగా ఖైరతాబాద్ నెంబర్ ‘టీఎస్ 09’తో మొదలు కావడం, ప్రతి ఒక్కరు ‘9’ నెంబర్‌ను ప్రతిష్టాత్మకంగా భావించడంతో రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దీంతో రవాణాశాఖకు ఏటా రూ.కోట్లల్లో ఆదాయం లభిస్తుంది. ‘9999’ వంటి నెంబర్ల కోసం వాహనదారులు రూ.లక్షలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో నగరంలో సుమారు 5 వేల హైఎండ్ వాహనాల విక్రయాలు జరిగాయి. బీఎండబ్ల్యూ,ఆడి,వోల్వో, రోల్స్‌రాయిస్, హార్లీ వంటి ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసే వాహనదారులు తమ హోదాకు తగిన విధంగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. ఈ మేరకు ఒక్క ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలోనే ఏటా రూ.5 నుంచి రూ.8 కోట్ల ఆదాయం లభిస్తుంది. -
క్రేజ్ తగ్గని బాలాపూర్ లడ్డూ!
-
స్పీడ్ పెంచిన నిత్యా మీనన్
-
‘ప్లాస్టిక్’తో అందాలు
కోటేరు లాంటి ముక్కు... నవ్వితే దానిమ్మ గింజల్లా మెరిసిపోయే పలువరుస... సిగ్గుపడితే బుగ్గనసొట్ట... ఇలాంటి అందమైన ఆకృతి వద్దనుకునే అమ్మాయిలు ఏవరైనా ఉంటారా? కచ్చితంగా ఉండరు కాగా ఉండరు. పుట్టుకతోనే ఇంతటి సౌందర్య లక్షణాలు సంక్రమించకపోతే! అయితే అందంగా కనిపించే భాగ్యం మనకు లేదా? వీటన్నింటికి సమాధానమిస్తోంది ఆధునిక వైద్య విజ్ఞానం. ఔను ప్రస్తుతం ముఖారవిందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ ఒక్కటే మార్గం కావడంతో చాలా మంది ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. కొంత కాలం క్రితం వరకు కేవలం సెలబ్రిటీలకే పరిమితమైన ఈ సర్జరీ విధానం ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. మెట్రో యువతుల్లో రోజురోజుకూ ఈ ప్లాస్టిక్ సర్జరీపై క్రేజ్ పెరుగుతోంది. అమ్మాయిలే కాదండి... అబ్బాయిలు కూడా ఇలాంటి సర్జరీలపై మక్కువ చూపుతుండడం గమనార్హం. - సాక్షి, బెంగళూరు ముక్కుపై మక్కువ... ప్రస్తుతం బెంగళూరులాంటి మహానగరాల్లో ప్లాస్టిక్ సర్జరీల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. తమ ఆకృతిని మార్చుకునేం దుకు ప్లాస్టిక్ సర్జరీల వైపు చూస్తున్న యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీరిలో ఎక్కువ శాతం మంది వివాహానికి ముందు ఇలాంటి సర్జరీలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా రినోప్లాస్టీ (ముక్కుకు సర్జరీ) చేయించుకోవడంపై చాలా మంది శ్రద్ధ కనబరుస్తున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాస్త లావుగా ఉన్న ముక్కును చెక్కేసి స న్నగా కోటేరులా తీర్చిదిద్దుతున్నారు. ఇందు కోసం సర్జరీ చే యించుకునే వారి శరీరంలో ఏదో ఒక భాగం నుంచి కణజాలా న్ని సేకరిస్తారు. ఒక వేళ ఆ కణజాలం వారికి సరిపోకపోతే రక్తసంబంధీకుల నుంచి కణజాలాన్ని సేకరించి సర్జరీ చేసిన చోట ఆ కొత్త కణజాలాన్ని పరచి ఆకృతినే మార్చేస్తున్నారు. ‘ఒక మనిషి అందాన్ని నిర్ణయించడంలో ముక్కు ప్రముఖ పాత్ర వహిస్తుంది. ముక్కు చక్కగా, నాజుకుగా ఉంటే మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది అమ్మాయిలు రినోప్లాస్టీపై మక్కువ చూపుతున్నారు. వివాహాలు నిశ్చయమైన అమ్మాయిలను వారి తల్లిదండ్రులే పిలుచుకొచ్చి ఈ తరహా సర్జరీలు చేయిస్తున్నారు.’ అని బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ మధు పేర్కొన్నారు. అబ్బాయిల్లోనూ క్రేజ్... ప్లాస్టిక్ సర్జరీల కోసం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఎ గబడుతున్నారు. అమ్మాయిలు ఎక్కువగా ముక్కు, గడ్డం, పెదవులకు సర్జరీలు చేయించుకోవడానికి ఇష్టపడుతుంటే అబ్బాయిలు మాత్రం అబ్డామినో ప్లాస్టీ(పొట్టను తగ్గించుకోవడం)పై ఆసక్తి చూపుతున్నారు. దీనినే టమ్మీ టకింగ్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ముఖంపై ఉన్న మడతలు పోగొట్టుకోవడానికి కూడా నగరంలోని యువకులు ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీనే ఆశ్రయిస్తున్నారు. సర్జరీలలోని రకాన్ని బట్టి ఒక్కొ సర్జరీకి రూ. 25వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని సర్జన్లు చెబుతున్నారు. జాగ్రత్తలు కూడా అవసరం ‘ఇంతకు ముందు శరీరం కాలిగాయాలైతేనే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేవారు. అయితే ఇపుడు ముఖాకృతి కోసం, ముడతలు పోగొట్టుకోవడానికి మధ్యతరగతి వారు కూడా ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏదో ఒక భాగానికి సర్జరీ చే యించుకున్నంత మాత్రాన మొత్తం రూపమే మారిపోతుందనుకుంటే పొరపాటు. ఒక్కొసారి సరైన నైపుణ్యం లేని డాక్టర్ల వద్ద సర్జరీ చేయించుకుంటే రక్తం గడ్డకట్టడం, బ్లీడింగ్ అవడం జరుగుతుంటాయి. అందుకే సర్జరీ చేయించుకోవాలనుకున్నపుడు నిపుణులైన సర్జన్లను సంప్రదించి వారి కౌన్సిలింగ్ తీసుకోవాలి. వారి సలహాలను పాటిస్తూ సర్జరీ చేయించుకుంటే అందమైన ఆకృతిని సొంతం చేసుకోవచ్చు.’ - డాక్టర్ చేతన్, ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్, బెంగళూరు సొట్టబుగ్గలు, పలువరుసలు కూడా... అమ్మాయిలకు దానిమ్మ గింజల్లా కనిపించే అందమైన పలువరుస, సొట్ట బుగ్గలు ఊహించుకుంటే ఎంత బాగుందో కదా.. అందుకే ప్రస్తుతం అమ్మాయిలు వీటిపై క్రేజీగా ఉన్నారు. అదనంగా ఉన్న కణజాలాన్ని తీసేసి చీక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా బుగ్గలపై సొట్టలను సృష్టిస్తున్నారు సర్జన్లు. అంతేకాదు ఇంతకు ముందు పన్ను మీద పన్నుంటే ఇష్టపడేవారు కాదు. అయితే ఇప్పుడదే ప్యాషన్ అయింది. పన్నుమీద పన్నును ఇంప్లాంట్ చేయించుకోవడానికి ఆస్పత్రులకు వెళ్లే యువతుల సంఖ్య పెరుగుతోంది. అంతేకారు పెదవుల ఆకృతి సరిగా లేని అమ్మాయిలు లిప్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సర్జరీలోనూ ఎన్నో రకాలు..... ప్లాస్టిక్ సర్జరీల్లో ప్రస్తుతం ఎక్కువగా బ్లెపారో ప్లాస్టీ( కనుబొమ్మలను తీర్చిదిద్దడం), ఓటో ప్లాస్టీ( చెవులు), చిన్ ఇంప్లాంట్(గడ్డం), చీక్ ఇంప్లాంట్ (చెంపలు), టమ్మీ టకింగ్లకు డిమాండ్ ఉంది. ఈ సర్జరీల్లో సైతం ఆటోగ్రాఫ్ట్స్, అల్లో గ్రాఫ్ట్స్, క్సెనోగ్రాఫ్ట్ అనే రకాలున్నాయి. ఆటోగ్రాఫ్ట్స్: సర్జరీ చేయించుకునే వ్యక్తి లేదా రక్తసంబంధీకుల కణజాలాలు సరిపోకపోతే ఓ కొత్తకణజాలాన్ని టెస్ట్‌ట్యూబ్‌లో సృష్టించి దానితో సర్జరీ పూర్తిచేస్తారు. అల్లోగ్రాఫ్ట్స్: ఒకే జాతికి చెందిన(ఆడవారికి సర్జరీ చేయాలంటే ఆడవారి నుంచి, మగవారికి సర్జరీ చేసేటపుడు మగవారి నుంచి కణజాలాన్ని తీసుకోవడం) వారి నుంచి తీసుకొని సర్జరీ చేయడం క్సెనోగ్రాఫ్ట్స్: మానవ శరీరం నుంచి కాకుండా వేరే జంతువుల కణజాలాన్ని సేకరించి సర్జరీ చేయడం -
తెలుగు యాప్స్.. భలే క్రేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాప్స్ యాప్స్ యాప్స్.. ఇప్పుడు ఎవరి నోట విన్నా యాప్స్ గురించే. అంతలా వ్యక్తిగత జీవితంలోనూ యాప్స్ మమేకమయ్యాయి. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని లక్షలాది యాప్ డెవలపర్లు పుట్టుకొస్తున్నారు. డెవలపర్లకు భాష కూడా వ్యాపార వస్తువు కావడంతో ప్రాంతీయ భాషల్లో ‘స్మార్ట్’ యాప్స్ వస్తున్నాయి. పలక, బలపానికి బదులు స్మార్ట్ఫోన్పైనే అక్షరాలు దిద్దుకునేలా టెక్నాలజీని మార్చేశాయి. కథలు, సామెతలు, వంటలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు, బైబిల్, ఖురాన్, పొడుపు కథలు, జోక్స్ ఇలా వందలాది తెలుగు యాప్స్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు పుస్తకాల కోసం దుకాణాల చుట్టూ తిరిగే అవసరం లేకుండానే ఎంచక్కా ఒక్క క్లిక్‌తో కళ్ల ముందుకు తీసుకొస్తున్నాయి. యాప్ పాపులర్ అయిందో డెవలపర్‌కు లాభాల పంటే. సామాన్యుడికీ చేరువ.. ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసేలా స్మార్ట్ఫోన్లు రావడంతో డెవలపర్లకు నూతన అవకాశాలు వచ్చిచేరాయి. రూ.2 వేల నుంచే ఆన్‌డ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. దీంతో సామాన్యుడికీ చేరువ అయ్యేందుకు వీలు కలిగిందంటున్నారు క్రిఫీ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ డెరైక్టర్ కొవ్యూరి కృష్ణారెడ్డి. డెవలపర్లకు మార్కెట్ ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. ఇక పిల్లల విషయానికి వస్తే వారు మొబైల్ ఫోన్‌ను అమితంగా ఇష్టపడతారు. పుస్తకాలకు బదులు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ద్వారా అంశాలను నేర్చుకోవడానికి ఉత్సాహం కనబరుస్తారని టెక్నాలజీ కంపెనీ ఏథెనా డోయెన్స్ అంటోంది. తల్లిదండ్రులకు భారం తగ్గుతుందని చెబుతోంది. తెలుగు భాషను ఆధారంగా చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంత కాదన్నా 1,500 మంది డెవలపర్లు ఉంటారని సమాచారం. ఆదాయం కూడా..: యాప్‌ను ముందు ఉచితంగా ఇచ్చి ఆ తర్వాత పెయిడ్‌గా మారుస్తున్నారు. యాప్‌ను అలవాటు చేసేందుకు కొంత భాగం ఉచితంగా ఇవ్వడం, మిగిలిన భాగానికి చార్జీ (ఇన్-యాప్ పర్చేజ్) చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన కామ్ప్రింట్ మూడేళ్లలో 200 తెలుగు యాప్స్‌ను అభివృద్ధి చేసింది. ఏడాదిలో మరో 500 యాప్స్ రూపొందిస్తామని కంపెనీ ఎండీ జి.సత్యనారాయణ చెప్పారు. యాప్స్ అన్నింటినీ ఉచితంగా అందిస్తున్నట్టు తెలి పారు. యాప్స్‌లో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని గూగుల్ తమకు పంచుతోందని, నెలకు రూ.50 వేలు వస్తున్నాయన్నారు. ‘రూ.2 లక్షల ఖర్చుతో యాప్‌ను రూపొందించాం. కొద్ది రోజుల్లోనే ఆ మొత్తం మా చేతుల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఏటా రూ.2 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాం’ అని ఓ కంపెనీ వ్యవస్థాపకుడు చెప్పారు. క్రిఫీ రూపొందించిన తెలుగు స్లేట్ యాప్ 15 లక్షలకుపైగా డౌన్లోడ్స్ నమోదు చేసింది. ఈ యాప్‌తో తెలుగు అక్షరాలు సుల భంగా నేర్చుకోవచ్చు. తెలుగు రైమ్స్, చిట్టి చిలకమ్మ, చందమామ రావే, చుక్‌చుక్ రైలు తదితర యాప్స్ కామ్ప్రింట్కు పేరుతెచ్చాయి. 15 లక్షలకుపైగా డౌన్లోడ్స్ను కామ్ప్రింట్ యాప్స్ సొంతం చేసుకున్నాయి. -
తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి!
‘‘ఈ ప్రపంచంలో ఎవరి స్థానమూ సుస్థిరం కాదు. ఇవాళ ఒకరున్న స్థానంలో రేపు ఇంకొకరు ఉంటారు. అందుకే శాశ్వతం కాని వాటి కోసం ఆరాటపడకూడదు’’ అంటున్నారు ఇలియానా. ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ ఉంటుంది. కానీ, సినిమా తారలకు వంట్లో ఓపిక, ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నంత కాలం సినిమాలు చేయొచ్చు. ఒకవేళ క్రేజ్ తగ్గి, బలవంతంగా రిటైర్ కావాల్సి వస్తే మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్న ‘‘ఈ ప్రపంచంలో ఎవరి స్థానమూ సుస్థిరం కాదు. ఇవాళ ఒకరున్న స్థానంలో రేపు ఇంకొకరు ఉంటారు. అందుకే శాశ్వతం కాని వాటి కోసం ఆరాటపడకూడదు’’ అంటున్నారుముందుంచితే - ‘‘సినిమాల్లోకి వచ్చేటప్పుడు మా అమ్మ ‘వృత్తిపై ఎక్కువగా మమకారం పెంచుకోవద్దు. తామరాకు మీద నీటిబొట్టులా ఉండటం శ్రేయస్కరం’ అని చెప్పింది. ఆ మాటలు బాగా జీర్ణించుకున్నాను. ప్రతి సినిమాని ప్రేమించి చేస్తాను. కానీ, ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీని వదిలేయాల్సి వస్తే, హ్యాపీగా గుడ్‌బై చెప్పేస్తా. ఎందుకంటే, ‘మేం చూడలేకపోతున్నాం బాబూ’ అని ప్రేక్షకులు నెత్తీ నోరూ బాదుకునే లోపే సర్దుకుంటే మంచిది కదా. ఇక్కడ ఇంకో విషయం కూడ చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ ఓ టైముంటుంది. ఆ టైమ్‌లో ఎవరు వద్దన్నా, కాదన్నా వెలుగులు విరజిమ్ముతారు. ఆ టైమ్ అయిన తర్వాత ఆ స్థానంలో ఇంకొకరు వస్తారు. ఈ మార్పుని ఆహ్వానించగలిగితే ఆనందంగా ఉండగలుగుతాం’’ అని చెప్పారు. -
స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న క్రేజ్
-
ప్రియా.. దత్తత తీసుకోండి ప్లీజ్...!
సెలబ్రిటీలు తమకున్న క్రేజ్‌ను ఆస్వాదించడమే కాకుండా.. సమాజం పట్ల కాస్తంత బాధ్యతను కూడా తీసుకుంటే.. వారిపై అభిమానం మరింత పెరుగుతుంది. ఆ బాధ్యతలో ఇంకాస్త నిజాయితీ, జాలి, దయ మిక్స్ అయ్యాయంటే అభిమానం ఎన్నో రెట్లకు పెరుగుతుంది. అలాంటి వ్యక్తిత్వంతో అభిమానధనాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధులు చాలా మంది ఉన్నారు. ప్రధానంగా జంతువులను దత్తత తీసుకుని వార్తల్లోకి వచ్చిన వారికి మంచి గుర్తింపు దక్కింది. గుప్తంగా సాటి మనుషులకో, అనాథలకో సహాయం చేసే సెలబ్రిటీల కన్నా జంతువులను దత్తత తీసుకుంటున్న సెలబ్రిటీలకు ఎక్కువ క్రేజ్ లభిస్తోంది. ఇలా భూతదయను చూపించడం ద్వారా సదరు సెలబ్రిటీలు అభిమానుల్లో దయార్ధ్రహృదయులుగా పేరు తెచ్చుకొంటున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు జూ లోని జంతువులను దత్తత తీసుకొంటే అది పెద్ద వార్తే అవుతోంది. ఈ నేపథ్యంలో చాలా జూ ల నుంచి సెలబ్రిటీలకు ప్రతిపాదనలు వెళుతున్నాయి. తమ జూ లోని జంతువులను దత్తత తీసుకొమ్మని జూ అధికారులు సినిమా వాళ్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు విజ్ఞప్తులు పంపుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు రాంచీ జూ అధికారులు ఇటువంటి ప్రతిపాదనే ఒకటి పంపారట. ఒక ఆడసింహాన్ని, ఒక పులిని, ఒక మర్కటాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా జూ అధికారులు కోరారట. దీనిపై ప్రియాంక చోప్రా కుటుంబం సానుకూలంగానే స్పందించింది. ప్రియాంక తల్లి ఇటీవలే రాంచీ జూను సందర్శించి అక్కడి జంతువులను చూసి వచ్చారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని చెబుతామని ఆమె జూ అధికారులకు చెప్పారట. ప్రియాంక తల్లి స్పందనపై జూ అధికారులు ఆనందపడుతున్నారు. ఇప్పటికే జంతువులను దత్తత తీసుకోవడంలో ప్రియాంక కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. 2011 లో తొలిసారి ప్రియాంక ‘దుర్గ’ అనే ఆడపులిని దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఏడాది ఈ మాజీ విశ్వసుందరి ‘సుందరి’ అనే ఆడ సింహాన్ని ఏడాది పాటు దత్తత తీసుకొంది. ఆ దత్తత సమయం ముగిసిపోవడంతో అధికారులు ఇప్పుడు ప్రియాంకకు మూడు జంతువుల విషయంలో ప్రతిపాదనలు పంపారు. మరి ప్రియాంక ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పులి లేదా సింహాన్ని ఒక ఏడాది పాటు దత్తత తీసుకోవాలంటే దాదాపు రు.2.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అదే మర్కట పోషణకు అయితే రు.13 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరి ప్రియాంక ఈసారి ఎన్ని జంతువులను దత్తత తీసుకుంటుందో!