ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ అప్లికేషన్ గూగుల్ మాదిరిగానే సెర్చ్ ఇంజన్‌లా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ఉన్న దిమ్మతిరిగే ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రారంభించిన ఐదు రోజుల్లోనే 1 మిలియన్ మంది యూజర్లను సంపాదించుకున్నదంటేనే దీని క్రేజ్ ఏంటో ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ చాట్ జీపీటీలో ఏముంది? దీన్ని ఏ కంపెనీ ఆవిష్కరించింది? గూగుల్ సెర్చ్‌కు దీనికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
(ఇదీ చదవండి: ఎక్కడ చూసినా ఇదే చర్చ.. చాట్ జీపీటీ! గూగుల్‌ని మించి? ఏది అడిగినా..)
చాట్ జీపీటీ Vs గూగుల్ సెర్చ్
చాట్ జీపీటీ అంటే జెనెరేటివ్ ప్రీట్రైయిన్డ్ ట్రాన్స్‌ఫార్మర్.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
గూగుల్ సెర్చ్‌కు ఇంటర్నెట్ అవసరం.
అమెరికాకు చెందిన ఓపెన్‌ఏఐ సంస్థ చాట్ జీపీటీని రూపొందించింది.
చాట్ జీపీటీ మనకు కావాల్సిన సమాచారాన్ని ఒకే సమాధానంగా ఇస్తుంది.
వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సమయం ఆదా అవుతుంది.
చదువులకు సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తుంది.
కష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్స్ కూడా సెకన్లలో రాసిస్తుంది.
గూగుల్ సెర్చ్‌లో అడిగిన దానికి సంబంధించి అనేక లింక్స్‌ను ఇస్తుంది.
ఈ లింక్స్ నుంచి సమాచారం వెతుక్కోవాలి.
చాట్‌జీపీటీ ముందుగా (2021 వరకు) నిక్షిప్తం చేసిన సమాచారం మాత్రమే ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment