ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గాడ్‌ఫాదర్‌గా పేరొందిన జెఫ్రీ హింటన్ (Geoffrey Hinton) గత వారం టెక్ దిగ్గజం గూగుల్‌కు రాజీనామా చేసినట్లు తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన ఏఐ విభాగంలో కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో మానవాళిని సైతం ప్రమాదంలోకి నెట్టే ఏఐపై పనిచేయడంపై విచారం వ్యక్తం చేశారు.
‘భవిష్యత్‌ను నాశనం చేసే ప్రమాదాల గురించి ఇప్పుడు నేను నిర్భయంగా మాట్లాడొచ్చు. అవి మనల్ని బయపెట్టొచ్చు. కానీ అవి మన (మనుషులు) కంటే ఇంటెలిజెన్స్ కాదన్న ఆయన.. త్వరలో మనుషుల కంటే శక్తివంతులు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్ధులతో కలిసి
2012లో టొరంటోలో ఇద్దరు గ్రాడ్యుయేట్ విద్యార్థులతో కలిసి జెఫ్రీ హింటన్ ఏఐ అల్గారిథంపై పనిచేశారు. ఆ సమయంలో ఏఐ సాయంతో ఈ ముగ్గురూ ఫోటోలను విశ్లేషించి,కుక్కలు, కార్లను గుర్తించేలా అల్గారిథమ్‌ను రూపొందించారు. అతనితో కలిసి ప్రాజెక్ట్‌లో పనిచేసిన విద్యార్థులలో ఒకరు ఇప్పుడు ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.
చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment