diffence
-
చాట్‌జీపీటీకి అంత క్రేజ్ ఇందుకే..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ అప్లికేషన్ గూగుల్ మాదిరిగానే సెర్చ్ ఇంజన్‌లా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ఉన్న దిమ్మతిరిగే ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రారంభించిన ఐదు రోజుల్లోనే 1 మిలియన్ మంది యూజర్లను సంపాదించుకున్నదంటేనే దీని క్రేజ్ ఏంటో ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ చాట్ జీపీటీలో ఏముంది? దీన్ని ఏ కంపెనీ ఆవిష్కరించింది? గూగుల్ సెర్చ్‌కు దీనికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. (ఇదీ చదవండి: ఎక్కడ చూసినా ఇదే చర్చ.. చాట్ జీపీటీ! గూగుల్‌ని మించి? ఏది అడిగినా..) చాట్ జీపీటీ Vs గూగుల్ సెర్చ్ చాట్ జీపీటీ అంటే జెనెరేటివ్ ప్రీట్రైయిన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేస్తుంది. గూగుల్ సెర్చ్‌కు ఇంటర్నెట్ అవసరం. అమెరికాకు చెందిన ఓపెన్ఏఐ సంస్థ చాట్ జీపీటీని రూపొందించింది. చాట్ జీపీటీ మనకు కావాల్సిన సమాచారాన్ని ఒకే సమాధానంగా ఇస్తుంది. వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సమయం ఆదా అవుతుంది. చదువులకు సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇస్తుంది. కష్టమైన ప్రోగ్రామింగ్ కోడ్స్ కూడా సెకన్లలో రాసిస్తుంది. గూగుల్ సెర్చ్‌లో అడిగిన దానికి సంబంధించి అనేక లింక్స్‌ను ఇస్తుంది. ఈ లింక్స్ నుంచి సమాచారం వెతుక్కోవాలి. చాట్‌జీపీటీ ముందుగా (2021 వరకు) నిక్షిప్తం చేసిన సమాచారం మాత్రమే ఇస్తుంది. (ఇదీ చదవండి: ఇక చైనా ‘చాట్‌బాట్’.. రేసులో ఆలీబాబా!) -
అస్త్ర పరీక్షల కేంద్రంగా విశాఖ
నౌకాదళ ఆయుధ పరీక్షలకు విశాఖ కేంద్ర బిందువుగా మారనుంది. ప్రధానంగా సముద్రంలో జరిగే యుద్ధాల్లో వినియోగించే ఆయుధాల పరీక్షా కేంద్రాన్ని రక్షణ శాఖ నెలకొల్పుతోంది. ఇలాంటి కేంద్రం దేశంలో విశాఖలోనే ఏర్పాటు కానుండటం గమనార్హం. అలాగే క్షిపణులు, రాకెట్ల పరీక్షా కేంద్రం కూడా ఇక్కడ నిర్మితమవుతోంది. భారీ టార్పెడోల పరీక్షలకూ ఈ కేంద్రాన్ని వినియోగించుకునే వీలుంది. తీర ప్రాంత రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈఎన్సీ (ఈస్ట్రన్ నేవల్ కమాండ్) స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. భీమిలిలో క్షిపణులు, రాకెట్ల పరీక్ష కేంద్రం ఇప్పటికే యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల స్థావరంగా ఉన్న విశాఖ తీరం తాజాగా మరో రెండు ముఖ్యమైన రక్షణ వ్యవస్థలకు కేంద్రంగా మారుతోంది. దేశంలోనే తొలిసారిగా భారీ టార్పెడోలు, అండర్ వాటర్ వెపన్స్ పరీక్ష కేంద్రాన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) నిర్మించనుంది. భీమిలిలో అన్ని రకాల క్షిపణులు, రాకెట్లను పరీక్షించే కేంద్రం ఏర్పాటుకు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా ఇటీవల శంకుస్థాపన చేశారు. రెండు టన్నుల భారీ టార్పెడోలను సైతం... గత జూలైలో గుజరాత్ తీరంలోని భారత సముద్ర జలాల పరిధిలోకి పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌక (పీఎన్ఎస్ అలంగీర్) చొచ్చుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. మన నౌకాదళాలు వెంటనే గుర్తించడంతో పాకిస్థాన్ పాచికలు పారలేదు. మహారాష్ట్ర తీర ప్రాంతంలో కూడా ఓ విదేశీ చిన్న పడవ ఆయుధాలతో వచ్చింది. అయితే అది ఆస్ట్రేలియన్ దంపతులదని తేలింది. తీర రక్షణ ఎంత కీలకమన్న విషయాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు నౌకాదళ కేంద్రంగా ఉన్న విశాఖ తీరంలో ఎన్విరాన్మెంటల్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు బాధ్యతను ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా బీడీఎల్‌కు అప్పగించారు. ఇప్పటికే టార్పెడోలు, అండర్ వాటర్ వెపన్స్ తయారీ యూనిట్‌ను భారత్ డైనమిక్స్ విశాఖలోనే ఏర్పాటు చేసింది. అయితే వాటిని పరీక్షించే కేంద్రం లేకపోవడంతో దాన్ని కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలని నౌకాదళం నిర్ణయించింది. దీనిలో భాగంగా 8 మీటర్ల పొడవు, 2 టన్నుల బరువైన భారీ టార్పెడోల్ని సైతం ఈ టెస్టింగ్ సెంటర్లో పరీక్షించేలా అత్యాధునిక వైబ్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. థర్మల్ చాంబర్, వాకింగ్ చాంబర్లను ఏర్పాటు చేసి అండర్ వాటర్ వెపన్స్‌నూ అణువణువూ పరీక్షించేలా యూనిట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం వైబ్రేషన్ టెస్ట్‌లతో పాటు పర్యావరణహిత పరీక్షలు కూడా ఇందులో నిర్వహించేలా ఏర్పాటవుతున్న ఈ పరీక్ష కేంద్రం నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో అండర్‌వాటర్ వెపన్స్, టార్పెడోల్ని మిత్ర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం లభిస్తుంది. క్రమంగా టార్పెడోలతో పాటు ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణులు, యుద్ధ విమానాలతో పాటు గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఆయుధాలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్‌నూ ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంటుందని ఈ సందర్భంగా నౌకాదళాధికారులు భావిస్తున్నారు. ఇతర ప్రయోగాలకూ వేదికగా భీమిలి సముద్ర గర్భంలో ఆయుధాలతో పాటు రాకెట్లు, క్షిపణులనూ పరీక్షించేందుకు వీలుగా భీమిలిలో స్టాటిక్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటవుతోంది. ఐఎన్ఎస్ కళింగ సమీపంలోని కన్స్ట్రక్షన్ ఆఫ్ నేవల్ ఆర్న్‌మెంట్ టెస్టింగ్ కాంప్లెక్స్(సీఎన్ఏఐ)– ఈస్ట్ కాంప్లెక్స్‌లో దీన్ని నిర్మించేందుకు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా కొద్దిరోజుల కిందట శంకుస్థాపన చేశారు. సుమారు రూ.4.40 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. అన్ని రకాల క్షిపణులు, రాకెట్లను పరీక్షించడంతో పాటు వాటి జీవితకాలాన్ని పొడిగించేలా మార్పులు, ఇతర ప్రయోగాలకు వేదికగా భీమిలి మారనుంది. ఏర్పాటైన సంవత్సరం – 1968 మార్చి 1 కమాండింగ్ ఇన్ చీఫ్ – త్రీ స్టార్ ఫ్లాగ్ ఆఫీసర్ (వైస్ అడ్మిరల్ ర్యాంక్) ప్రస్తుత వైస్ అడ్మిరల్ – బిస్వజిత్ దాస్‌గుప్తా బలం – 58 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు ఫ్లాగ్ షిప్ – ఐఎన్ఎస్ జలశ్వ ఈఎన్సీ పరిధిలో నేవల్ బేస్‌లు – 15 విశాఖలో నేవల్ బేస్‌లు – 8 కొత్తగా నిర్మిస్తున్న నేవల్ బేస్‌లు – విశాఖలో–1, ఒడిశాలో 2 తూర్పు నౌకాదళం సిబ్బంది, అధికారులు – సుమారు 40,500 మంది (కె.జి.రాఘవేంద్రారెడ్డి – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) -
పాక్ ఏజెంట్లకు రహస్య సమాచారం.. నలుగురు డీఆర్డీఓ ఉద్యోగుల అరెస్టు
సాక్షి, బాలాసోర్(భువనేశ్వర్): పాకిస్తాన్ ఏజెంట్లకు రహస్య సమాచారం అందిస్తున్న నలుగురు డీఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. బాలాసోర్‌జిల్లా డీఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ రేంజ్లో పనిచేస్తున్న వీరిని తొలుత ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్రన్ రేంజ్ ఐజీ హిమాంన్షు కుమర్ చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందన్నారు. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని, వీరికి పలు ఐఎస్డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందిందన్నారు. వెంటనే నలుగురు డీఎస్పీలతో ఏర్పాటైన పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించామని చెప్పారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు. అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. వీరిపై చాందీపూర్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై డీఆర్డీఓ స్పందించేందుకు నిరాకరించింది. 2014లో కూడా బాలాసోర్ నుంచి రహస్య సమాచారం విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చదవండి: క్రిమినల్ కేసుల వివరాల్లేవ్.. మమత నామినేషన్ తిరస్కరించండి -
లాక్డౌన్ తర్వాత వ్యూహం ఏంటి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు వారాలుగా కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెల 3తో ముగియనుండగా.. తదుపరి అనుసరించాల్సిన మార్గాలపై ప్రధాని నరేంద్ర మోదీ.. హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, రైల్వే శాఖల మంత్రి పీయూష్‌గోయల్‌తో శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశ వివరాలపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. గత కొన్ని రోజులుగా ప్రధాని అనేక అంశాలపై సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రభు త్వ వర్గాలు పేర్కొన్నాయి. 3వ తేదీ తర్వాత పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్ ప్రాంతాలకే పరిమితం చేయవచ్చని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించడం, ఆర్థిక రంగ వృద్ధి ప్రేరణ కోసం అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ప్రధాని గురువారం కూడా ఒక సమావేశం నిర్వహించడం గమనార్హం. రక్షణ రంగం, మైనింగ్, మినరల్స్ శాఖపైనా ఆయన సమీక్షలు జరిపారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకు కేంద్రం తొలి విడతగా రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా, వివిధ రంగాలకు ప్రోత్సాహకాలతో మరో ప్యాకేజీని త్వరలో ప్రకటించనుందని తెలుస్తోంది. పౌర విమానయాన రంగం పటిష్టతపై దృష్టి దేశీయంగా పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగానూ ప్రధాని మోదీ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారత గగనతలాన్ని మరింత ప్రభావవంతంగా వినియోగించుకోవాలని, ప్రయాణ సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ఇది ఎయిర్‌లైన్స్ సంస్థల వ్యయాలను తగ్గించేందుకు తోడ్పడనుంది. సైనిక వ్యవహారాల విభాగంతో కలసి సన్నిహిత సహకారం ద్వారా దీన్ని చేపట్టనున్నట్టు అధికారిక ప్రకటన ద్వారా ప్రభుత్వం తెలిపింది. మరింత ఆదాయం రాబట్టడం, విమానాశ్రయాల్లో సమర్థతను తీసుకొచ్చే లక్ష్యంతో.. పౌర విమానాయాన శాఖ 3 నెలల్లో మరో 6 విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో అప్పగించేం దుకు టెండర్ ప్రక్రియ ఆరంభించాలని కోరింది. బ్యాంకర్లతో నేడు ఆర్బీఐ గవర్నర్ భేటీ న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక రంగ స్థితిగతులు తెలుసుకునేందుకు, పరిశ్రమకు ఊతమిచ్చే చర్యలపై చర్చించేందుకు బ్యాంకుల చీఫ్‌లతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం సమావేశం కానున్నారు. వడ్డీ రేట్ల కోత ప్రయోజనాల బదలాయింపు, పరిశ్రమకు నిధులపరమైన తోడ్పాటు అందించడం సహా రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ప్రకటించిన పలు చర్యల అమలుపై కూడా చర్చించవచ్చని సమాచారం. అలాగే, చిన్న, మధ్యతరహా సంస్థలు.. గ్రామీణ రంగం కోసం ప్రకటించిన విధానాలను సమీక్షించనున్నారు. ఎకానమీపై ఒత్తిడి తగ్గించేందుకు తీసుకోతగిన చర్యల గురించి బ్యాంకర్లు కూడా ఈ సమావేశంలో తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రులతో మోదీ భేటీ -
నగరంలో వరల్డ్ క్లాస్ డిఫెన్స్ యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు యూఎస్-ఇండియా డిఫెన్స్ ఒప్పందాలపై సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సదస్సును ఉద్దేశిస్తూ.. ఆయన ప్రసంగించారు. 'టీఎస్ఐపాస్ ద్వారా ఐదేళ్లలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అమెజాన్ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. తెలంగాణ డిఫెన్స్ హబ్‌గా మారుతుంది. 12కు పైగా డిఫెన్స్ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. 25 ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయి. బోయింగ్ లాంటి సంస్థలు నగరంలో ఉన్నాయి. ఆదిబట్లలో ప్రత్యేకంగా ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేశాం. తెలంగాణ ఆకాడమీ ఆఫ్ స్కిల్స్ ద్వారా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నాం. వరల్డ్ క్లాస్ డిఫెన్స్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ తక్కువ ధరకే వస్తువును ఉత్పత్తి చేయవచ్చు. టీహబ్ భారత్‌లోనే అతిపెద్ద స్టార్టప్ హబ్. హార్డ్‌వేర్ స్టార్టప్‌కు ప్రోత్సాహం అందిస్తున్నామని' మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో యూఏవీల తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరింది. మానవ రహిత విమానాల (యూఏవీ) తయారీకి హైదరాబాద్ కేంద్రం అయింది. విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్... తన అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ద్వారా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఇజ్రాయెల్ దిగ్గజం ఎల్బిట్ సిస్టమ్స్‌తో కలిసి సంయుక్తంగా శంషాబాద్ సమీపంలో 20 ఎకరాల్లో అదానీ ఎల్బిట్ యూఏవీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ హెర్మెస్ 900 యూఏవీలను రూపొందిస్తారు. వీటిని భారత్‌తోపాటు వివిధ దేశాల్లోని ఎల్బిట్ కస్టమర్లకు విక్రయిస్తారు. భారత్‌లో ప్రైవేటు రంగంలో అన్–మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ) తయారీకి ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇది. అలాగే ఎల్బిట్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ వెలుపల ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రం కూడా ఇదే. అదానీ ఏరోస్పేస్ పార్క్ సైతం ఇక్కడ కొలువుదీరింది. అదానీ, ఎల్బిట్ ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఈ రెండు కేంద్రాలను తెలంగాణ హోం శాఖ మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. ప్రపంచంలో 15 దేశాల్లో.. అత్యాధునిక హెర్మెస్ 900 యూఏవీలను ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని సైన్యం నిఘా, ఇంటెలిజెన్స్ కోసం విజయవంతంగా వినియోగిస్తోంది. 150 యూఏవీల కోసం ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఆఫర్ చేసిన టెండర్లలో అదానీ ఎల్బిట్ల జాయింట్ వెంచర్ పోటీపడుతోంది. ఇక హైదరాబాద్ సెంటర్లో తొలి ఉత్పాదన మార్చికల్లా సిద్ధం కానుంది. తొలుత ఏటా నాలుగు వాహనాలను తయారు చేస్తారు. 2020 చివరికల్లా ప్లాంటు సామర్థ్యం ఏడాదికి 18 వెహికిల్స్ స్థాయికి చేరనుందని అదానీ డిఫెన్స్, ఏరోస్పేస్ హెడ్ ఆశిష్ రాజవంశీ మీడియాకు వెల్లడించారు. కాంప్లెక్సులో 110 మంది ఇంజనీర్లు, టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నట్టు చెప్పారు. ట్రైనింగ్, ఆర్అండ్డీ సెంటర్ స్థాపిస్తున్నామని, పరిశ్రమకు అవసరమైన మానవ వనరులకు ఇక్కడ శిక్షణ ఇస్తామని వివరించారు. 2019 సెప్టెంబరు నుంచి హెలికాప్టర్ల గేర్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ తయారు చేస్తామన్నారు. హైదరాబాద్ సెంటర్‌కు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసినట్టు ఎల్బిట్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ బెజలెల్ మెషిలిస్ వెల్లడించారు. -
'ఈసారి ఆ విషయం ఎందుకు చెప్పలేదో'
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి ఆమోదం తర్వాత సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి దేశ రక్షణ బడ్జెట్ ఎంతో చెప్పలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత అసలు డిఫెన్స్ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారనే విషయాన్ని ఆయన చదవలేదు. ఏడవ సెంట్రల్ కమిషన్ సూచించిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) చెల్లింపులు ఈసారి బడ్జెట్‌కు అదనపు భారం అంటూ చెప్పిన ఆయన డిఫెన్స్ బడ్జెట్ ఎంత అనే విషయం మాత్రం సభలో ప్రస్తావించలేదు. అయితే, మొత్తం బడ్జెట్లో దాదాపు పది శాతంగానీ, అంతకంటే ఎక్కువగానీ డిఫెన్స్‌కు కేటాయించడం పరిపాటి. గత ఏడాది డిఫెన్స్ రంగానికి రూ.2,46,727కోట్లు కేటాయించారు.