'ఈసారి ఆ విషయం ఎందుకు చెప్పలేదో'
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి ఆమోదం తర్వాత సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి దేశ రక్షణ బడ్జెట్ ఎంతో చెప్పలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత అసలు డిఫెన్స్ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారనే విషయాన్ని ఆయన చదవలేదు.
ఏడవ సెంట్రల్ కమిషన్ సూచించిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) చెల్లింపులు ఈసారి బడ్జెట్కు అదనపు భారం అంటూ చెప్పిన ఆయన డిఫెన్స్ బడ్జెట్ ఎంత అనే విషయం మాత్రం సభలో ప్రస్తావించలేదు. అయితే, మొత్తం బడ్జెట్లో దాదాపు పది శాతంగానీ, అంతకంటే ఎక్కువగానీ డిఫెన్స్కు కేటాయించడం పరిపాటి. గత ఏడాది డిఫెన్స్ రంగానికి రూ.2,46,727కోట్లు కేటాయించారు.