budget 2016
-
నా వల్లే మోదీ సర్కార్ వెనక్కి తగ్గింది!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఉపసంహరణపై పన్ను విధించాలన్న వివాదాస్పద నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపసంహరించుకుంది. తన ప్రయత్నాలు, ఒత్తిడి వల్లే మోదీ సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పుకొచ్చారు. 'మధ్యతరగతి ప్రజల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూసింది. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టాలని నేను నిర్ణయించాను. నా ఒత్తిడి పనిచేసింది' అని 45 ఏళ్ల రాహుల్ పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణ 40శాతం మించితే పన్ను విధిస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను తప్పపడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. మధ్య తరగతి ఉద్యోగులు, కార్మికుల నుంచి కూడా ఈ ప్రతిపాదనపై తీవ్ర వ్యతికేత వ్యక్తమైంది. దీంతో ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈపీఎఫ్ పై అసంబద్ధమైన పన్ను విధించాలనుకున్న కేంద్రం ప్రజల మాట వినేలా ఒత్తిడి తెచ్చామని, ఈ ప్రభుత్వానికి ప్రజావ్యతిరేక ధోరణి అని రాహుల్ విరుచుకుపడ్డారు. -
'ఈసారి ఆ విషయం ఎందుకు చెప్పలేదో'
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి ఆమోదం తర్వాత సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి దేశ రక్షణ బడ్జెట్ ఎంతో చెప్పలేదు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత అసలు డిఫెన్స్ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారనే విషయాన్ని ఆయన చదవలేదు. ఏడవ సెంట్రల్ కమిషన్ సూచించిన వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) చెల్లింపులు ఈసారి బడ్జెట్‌కు అదనపు భారం అంటూ చెప్పిన ఆయన డిఫెన్స్ బడ్జెట్ ఎంత అనే విషయం మాత్రం సభలో ప్రస్తావించలేదు. అయితే, మొత్తం బడ్జెట్లో దాదాపు పది శాతంగానీ, అంతకంటే ఎక్కువగానీ డిఫెన్స్‌కు కేటాయించడం పరిపాటి. గత ఏడాది డిఫెన్స్ రంగానికి రూ.2,46,727కోట్లు కేటాయించారు. -
'ఆ కల నెరవేరడం ఇంపాజిబుల్'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదొక కలగూర గంప బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ వెనుక పెద్ద ఆలోచనేది చేయనట్లు కనిపిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయాలు రెండింతలు అవుతాయని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా చెప్పిందని.. అది ముమ్మాటికీ సాధ్యం కాని ఐడియా మాత్రమే అన్నారు. 'ఇది మిశ్రమ అంశాలతో నింపిన సంచిలాంటి బడ్జెట్. ప్రధాని నిన్న ప్రకటించిన ఒక ఐడియా తప్ప దీని వెనుక పెద్ద ఆలోచనేది చేయనట్లు కనిపిస్తోంది. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం డబుల్ అవుతుందని చెప్పారు. అది తీరే కలమాత్రం కాదు. పోని ఎలా సాధిస్తారో కూడా వివరించలేదు' అని మన్మోహన్ సింగ్ బడ్జెట్‌పై స్పందించారు. -
ఈసారి ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?
న్యూఢిల్లీ: సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనగానే కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారంతా తమకు ఇష్టమైనవి ఈసారి ఏ విధంగా లభిస్తాయి? తాము ఊహించిన దానికంటే తక్కువ ధరకే లభిస్తాయా లేక జేబుకు చిల్లు పెట్టి అందకుండా పోతాయా అని చూస్తుంటారు. అయితే, సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం అలా ఎదురు చూసిన వారికి కొందరికి నిరాశ కొందరికి ఊరట కలిగించారు. ఎప్పటిలాగే పొగరాయుళ్లను వదిలిపెట్టని జైట్లీ అదే సమయంలో బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేసేవారిచే మరోసారి అబ్బో అనిపించారు. రెస్టారెంట్లకు వెళ్లేవారు కూడా ఈసారి కాస్త ఆలోచించుకోవాల్సిందే. కానీ, ఈసారి పాదరక్షలు రోటర్స్, బ్రాడ్ బాండ్ మోడెమ్స్, సెట్ టాప్ బాక్స్‌లు, డిజిటల్ వీడియో, సీసీటీవీ కెమెరాలు వంటివి తగ్గించి సామాన్యుడికి కాస్తంత ఊరట కల్పించారు. అసలు ఆయన బడ్జెట్‌తో ఈ ఏడాది ఏ వస్తువుల కొండెక్కి కూర్చుంటాయో.. ఏవి అందుబాటులో ఉంటాయో ఓసారి పరిశీలిస్తే.. పెరిగేవి.... కార్లు సిగరెట్లు, పొగాకు, కాగితం బీడీలు, గుట్కా రెస్టారెంట్లలో భోజనాలు, విమాన ప్రయాణం రూ.వెయ్యి పైబడిన రెడీమేడ్ గార్మెంట్స్, బ్రాండెడ్ వస్తువులు వెండి మినహా బంగారం, ఇతర అభరణాలు దిగుమతి చేసుకునే ఆభరణాలు మినరల్ వాటర్ రూ.2లక్షల పై బడిన వస్తు రవాణా అల్యూమినీయం ప్లాస్టిక్ బ్యాగులు, సాక్స్‌లు రోప్ వే, కేబుల్ కారు ప్రయాణాలు పరిశ్రమల్లో వాడే సోలార్ వాటర్ హీటర్స్ లీగల్ సర్వీసులు లాటరీ టిక్కెట్లు ప్రైవేటు అద్దె వాహనాల్లో ప్రయాణం ఈ-రీడింగ్ డివైస్‌లు వాయిస్ ఓవర ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ) విదేశీ గోల్ఫ్ కార్ట్లు బంగారు కడ్డీలు తగ్గేవి.... పాద రక్షలు సోలార్ పంపులు రోటర్స్, బ్రాడ్ బాండ్ మోడెమ్స్, సెట్ టాప్ బాక్స్‌లు, డిజిటల్ వీడియో, సీసీటీవీ కెమెరాలు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ డయాలసిస్ పరికరాలు 60 చదరపు మీటర్లలో నిర్మించే ఇళ్లు జానపద కళాకారులకు చెల్లించే మొత్తాలు రిఫ్రిజిరేటర్ కంటెయినర్స్ పెన్షన్ ప్లాన్స్ మైక్రో వేవ్ ఓవెన్స్ సానిటరీ ప్యాడ్స్ బ్రెయిలీ పేపర్ -
'బడ్జెట్లో ఏపీకి తీవ్ర నిరాశే మిగిలింది'
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించి ఏ ఒక్కదానిపై కేటాయింపు లేదని ఎంపీ మిథున్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి నిరాశే ఎదురైందని మిథున్ రెడ్డి అన్నారు. విభజన చట్టం హామీల అమలుకు నిధులు ఇవ్వలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేక హోదాపై బడ్జెట్లో ఊసే లేదని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమ పార్టీ ఎంపీలు ఎక్కడ అవకాశం వచ్చినా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నామన్నారు. ఇక రైల్వే బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక జోన్ ఇస్తామని చెప్పి, చివరకు దాని ఊసే ఎత్తలేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాగా బడ్జెట్లో కేంద్రం ...ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన సోమవామిరమిక్కడ మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపులు, రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి ఆరోగ్య విషయంలోనూ ప్రతి కుటుంబానికి లక్ష హామీ ఇవ్వడం జరిగిందని, అయితే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2లక్షల భరోసా భరోసా కల్పించిన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే రోడ్లు, ఇన్ఫ్రా రంగంలోనూ కేటాయింపులు పెంపు జరిగిందన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు తూతూ మంత్రంగానే నిధుల కేటాయింపు జరిగిందని, కేంద్రం విభజన హామీలు పూర్తిగా పక్కన పెట్టిందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో శంకుస్థాపన చేసిన 'సెయిల్'పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నిర్మాణానికి నిధులు లేవని, మౌలిక రంగానికి నిధులు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు, రైతులకు చేయూత ఇచ్చేలా నిధుల కేటాయింపు సంతోషకరమని ఎంపీలు బుట్టా రేణుకా, వరప్రసాద్ అన్నారు.