న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించి ఏ ఒక్కదానిపై కేటాయింపు లేదని ఎంపీ మిథున్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి నిరాశే ఎదురైందని మిథున్ రెడ్డి అన్నారు. విభజన చట్టం హామీల అమలుకు నిధులు ఇవ్వలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేక హోదాపై బడ్జెట్లో ఊసే లేదని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమ పార్టీ ఎంపీలు ఎక్కడ అవకాశం వచ్చినా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నామన్నారు. ఇక రైల్వే బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక జోన్ ఇస్తామని చెప్పి, చివరకు దాని ఊసే ఎత్తలేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే
కాగా బడ్జెట్లో కేంద్రం ...ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం చేసిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన సోమవామిరమిక్కడ మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపులు, రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి ఆరోగ్య విషయంలోనూ ప్రతి కుటుంబానికి లక్ష హామీ ఇవ్వడం జరిగిందని, అయితే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2లక్షల భరోసా భరోసా కల్పించిన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే రోడ్లు, ఇన్ఫ్రా రంగంలోనూ కేటాయింపులు పెంపు జరిగిందన్నారు.
ఇక పోలవరం ప్రాజెక్టుకు తూతూ మంత్రంగానే నిధుల కేటాయింపు జరిగిందని, కేంద్రం విభజన హామీలు పూర్తిగా పక్కన పెట్టిందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో శంకుస్థాపన చేసిన 'సెయిల్'పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నిర్మాణానికి నిధులు లేవని, మౌలిక రంగానికి నిధులు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు, రైతులకు చేయూత ఇచ్చేలా నిధుల కేటాయింపు సంతోషకరమని ఎంపీలు బుట్టా రేణుకా, వరప్రసాద్ అన్నారు.
'బడ్జెట్లో ఏపీకి తీవ్ర నిరాశే మిగిలింది'
Published Mon, Feb 29 2016 1:52 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM
Advertisement
Advertisement