pv mithun reddy
-
ఏపీ మెగా ప్రాజెక్టు ఒక గేమ్ చేంజర్.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అతిపెద్ద సమీకృత ప్రత్యామ్నాయ ఇంధన స్టోరేజి ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. లోక్‌సభలో శుక్రవారం ఇంధన పరిరక్షణ సవరణ బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ తరపున ఆయన పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం, ప్రపంచలోనే అతిపెద్ద సమీకృత ప్రత్యామ్నాయ ఇంధన స్టోరేజి ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇంధన రంగం కోసం యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్‌తో పనిచేస్తున్నారు. సుమారు 5300 మెగావాట్ల పంప్ స్టోరేజి కెపాసిటీతో నిర్మిస్తోంది. కాబట్టి, ఈ అంశంలో రాష్ట్రానికి సహకరించాలని ఎంపీ మిథున్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎనర్జీ అభివృద్ది రంగంలో ఏపీ 22 శాతం అభివృద్ధితో ఉందని తెలిపిన ఆయన.. ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రోత్సాహం కోసం జిఎస్టీని తగ్గంచాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 250 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతితో ఖజానాపై భారం పడుతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా 33 గిగావాట్ల ఇంధన పంప్ స్టోరేజీని నిర్మించాలి. ఒక్క ఏడాది బొగ్గు దిగుమతి ఖర్చుతో.. దీన్ని శాశ్వత ఇంధన వనరుగా మార్చుకోవచ్చు. దీంతో ఇంధన రంగంలో దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది. ఇదొక గేమ్ చేంజర్‌గా మారుతుంది. అదే సమయంలో ఏపీ ఒక హబ్‌గా, బ్యాటరీగా మారుతుంది. గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు వస్తాయి అని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. ‘‘పంప్ స్టోరేజీకి కాంక్రీట్, ఎర్త్ వర్క్ మాత్రమే చాలు. అంతా స్వదేశీయంగానే తయారు చేసుకోవచ్చు. బొగ్గు దిగుమతికి డాలర్లలో ఖర్చు పెడుతున్నాం. అదే పంప్ స్టోరేజికి వచ్చే 25 ఏళ్లకు ఫిక్స్డ్ ధర నాలుగు రూపాయలకే సరఫరా చేయొచ్చు. అంతేకాదు పవర్ బిల్లు, బొగ్గు దిగుమతి బిల్లు తగ్గుతుంది.పెట్టుబడులు, ఉద్యోగ కల్పన పెరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ పెరిగి గ్రీన్ ప్రొడక్ట్స్ డిమాండ్ వస్తుందని ఎంపీ మిథున్‌రెడ్డి వివరించారు. -
kuppam: పెద్దాయన యంత్రాంగం.. మిథున్ మంత్రాంగం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో ఎప్పుడు ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. తిరుపతి లోక్‌సభ ఎన్నిక, బద్వేలు శాసనసభ ఉపఎన్నికల్లో బాధ్యత తీసుకుని ఏకపక్ష విజయాలను అందించిన ట్రాక్ రికార్డు ఆయనది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి వరుసగా ఏకపక్ష విజయాలను అందిస్తూ వచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఏడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి జరిగిన తొలి ఎన్నికకు పెద్దాయన తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కూడా తోడయ్యారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెద్దిరెడ్డి గత కొంతకాలంగా విస్తృతంగా పర్యటించారు. దీంతో పాటు తిరుపతి వేదికగా జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సమావేశ నిర్వహణ చూస్తూనే కుప్పం ఎన్నికల బాధ్యతను పర్యవేక్షించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు పెద్దిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యక్తిగతంగానూ తూలనాడారు. అయినా సరే సంయమనం పాటించారు. ఆ సందర్భంలోనే బాబు వ్యాఖ్యలపై స్పందించాలని పెద్దిరెడ్డిని మీడియా కోరగా ఇప్పుడేమీ మాట్లాడనని, కుప్పంలో గెలిచిన తరువాతే మాట్లాడుతానని స్పష్టం చేశారు. బాబు విమర్శలకు దీటుగా ప్రచార ఉధృతిని పెంచి ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కుప్పంవాసులకు జరిగిన మేలును వివరించారు. మరోవైపు మిథున్‌రెడ్డి కుప్పంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భరత్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. చేతికి గాయమైనప్పటికీ ఆసుపత్రి నుంచి నేరుగా కుప్పం ప్రచారంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కొంతకాలంగా కుప్పంలో ఉంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆత్మస్ఖైర్యం నింపారు. చంద్రబాబు, లోకేష్‌లు కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయించారు. అయితే వైఎస్సార్సీపీ శ్రేణులు డీలా పడకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. ఫలితంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తంగా తండ్రి, తనయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ నేతల సమష్టి కృషితో కుప్పంలో అరుదైన విజయం నల్లేరు మీద నడకలా సాగడం విశేషం. బాబు పతనం ఇలా.. ► 1989లో కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన బాబు 2019 వరకు గెలుస్తూ వస్తున్నారు. ► తొలిసారిగా 6,918 ఓట్ల మెజారిటీ సాధించిన బాబు.. 1994, 1999లో 60 శాతం వరకు మెజారిటీ సాధించారు. ► 2004లో 42 శాతం, 2009లో 46 శాతం మెజారిటీ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ 28 శాతానికి పడిపోయింది. ► 2019లో జరిగిన ఎన్నికల్లో 30వేల ఓట్ల తేడాతో కేవలం 16 శాతం మెజారిటీ. ► తాజా స్థానికసంస్థల ఎన్నికల్లో శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం జెడ్పీటీసీలను, ఎంపీపీలను, 62 ఎంపీటీసీ, 74 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. టీడీపీని చావుదెబ్బ కొట్టింది. -
'పవన్ కల్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు'
సాక్షి, తిరుపతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కులాల మధ్య చిచ్చురేపుతున్నారంటూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పవన్ కల్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆయనకు కనిపించడం లేదు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి మ్యానిఫెస్టోలోని హామీలను అమలుపరచడం పవన్‌కు కనిపించడం లేదా?. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వంలో సోమల, సదుం మండలాల్లో భూముల రికార్డులు టాంపరింగ్, అక్రమాలు జరిగాయి. సీఐడీ విచారణలో అక్రమాలు వెలుగులోకి వస్తాయి' అని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. చదవండి: (ప్యాకేజీ పెంచుకునేందుకే శ్రమదానం) -
అఫ్గాన్ విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలను రూపొందించాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావడంతోపాటు అక్కడ భారత్ పెట్టుబడులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అఫ్గాన్‌లో చాలామంది తెలుగు వారు పనిచేస్తున్నారని మిథున్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాలిబన్లతో చర్చలు జరిపి అందరినీ క్షేమంగా తీసుకురావాలన్నారు. తాను సూచించిన అంశాలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నోట్ చేసుకున్నారని తెలిపారు. అఫ్గాన్ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని చెప్పారన్నారు. కాగా, అఫ్గాన్‌లో ఇప్పటిదాకా భారత్ పెట్టిన 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో వివరించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. -
అనర్హతపై జాప్యంతో అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పేర్కొంది. ఈమేరకు పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో అసాధారణ జాప్యం జరుగుతున్నందున అర్హత లేని వ్యక్తి ప్రాతినిథ్యం వహించడం ద్వారా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. లేఖలో వివరాలివీ.. 2020 జూలై 3న అనర్హత పిటిషన్ ఇచ్చాం.. నాతో పాటు పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి బృందం 2020 జులై 3న మిమ్మల్ని (లోక్‌సభ స్పీకర్) కలసి రఘురామకృష్ణరాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ సమర్పించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం పిటిషన్ సమర్పించాం. గౌరవ సభాపతిని స్వయంగా కలిసి ఇచ్చినందున పిటిషన్‌ను పద్ధతి ప్రకారమే సమర్పించామని భావించాం. ఆ తర్వాత వైఎస్సార్సీపీ సభ్యులు మిమ్మల్ని పలుమార్లు కలిసి వేగంగా పరిష్కరించాలని కోరారు. సమయానుసారం చర్యలు తీసుకుంటామని అనేక సందర్భాల్లో మీరు హామీ ఇచ్చారు. జూన్ 11, 2021న వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ విప్ మిమ్మల్ని స్వయంగా మీ నివాసంలో కలిసి పిటిషన్‌ను పరిష్కరించాలని కోరారు. జూన్ 17న పార్టీ లోక్‌సభాపక్ష నేత మిమ్మల్ని స్వయంగా కలసి రఘురామకృష్ణరాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తగిన సాక్ష్యాలతో లేఖను మీకు అందజేశారు. 2020 జూలై 3 నాటి అనర్హత పిటిషన్‌ను పరిష్కరించాలని అభ్యర్థించారు. 11 నెలల తరువాత సవరించాలని సూచనా? పిటిషన్ దాఖలు చేసిన తరువాత 11 నెలలు గడిచిన తరువాత మీ కార్యాలయం నుంచి జవాబు వచ్చింది. పిటిషన్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించి కాకుండా పిటిషన్‌ను సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం సవరించాలని అందులో పేర్కొన్నారు. తర్కబద్ధంగా పరిశీలిస్తే ఈ జవాబు క్లరికల్ జవాబు. పార్లమెంట్ రెండు సెషన్లు పూర్తయిన తరువాత కాకుండా ఆ విషయాన్ని మా పరిశీలనకు ఎప్పుడో తీసుకురావాల్సింది. పిటిషన్లో ఏవైనా లోపాలు ఉంటే దాఖలు చేసిన పార్టీ దృష్టికి చాలా ముందుగానే తీసుకురావాల్సింది. ఏమైనప్పటికీ మీ కార్యాలయం లేఖలో సూచించిన వివరాలన్నింటితో మరో తాజా పిటిషన్‌ను సమర్పిస్తాం. దురదృష్టకరం: నిబంధనలు, దక్షత విషయంలో సభాపతి కార్యాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఆదర్శంగా ఉంటుందని పరిగణించాల్సిన పరిస్థితుల్లో అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవాలని అనేకమార్లు కోరాల్సి రావడం దురదృష్టకరం. సుప్రీం తీర్పునకు విరుద్ధం.. మేం సమర్పించబోయే తాజా అనర్హత పిటిషన్‌ను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతున్నాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయినందున దీనిపై స్వయంగా దృష్టి పెట్టాలి. ఒక పార్లమెంటు సభ్యుడు చట్టబద్ధంగా, నైతికంగా, ప్రవర్తనాపరంగా సభలో ఉండాల్సిదగిన వ్యక్తి కానప్పుడు సభకు హాజరుకానివ్వడం వాంఛనీయం కాదు. చర్యలు తీసుకోవడంలో చోటు చేసుకునే అసాధారణమైన జాప్యం.. కె.మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పునకు విరుద్ధం అవుతుంది. ఇలాంటి అనర్హత పిటిషన్లను పరిష్కరించేందుకు మూడు నెలల సమయాన్ని ఆ తీర్పులో సుప్రీం కోర్టు నిర్దేశించింది. -
ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెంచిన వైఎస్సార్సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై పార్లమెంట్ వేదికగా వైఎస్సార్ సీపీ మరోసారి కేంద్రంపై ఒత్తిడి పెంచింది. లోక్‌సభలో మంగళవారం ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ.. కేంద్రమంత్రి సూటిగా సమాధానమివ్వాలని మిథున్‌రెడ్డి కోరారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్రం సమాధానంతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని, హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేస్తారా అని అడగ్గా.. మిథున్‌రెడ్డి అనుబంధ ప్రశ్న అడిగారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ.. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2014లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ముగిసిపోయిందన్నారు. స్టీల్ ప్లాంట్ దేశానికి, ఏపీకి గొప్ప ఆస్తి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తరఫున గట్టిగా వ్యతిరేకిస్తున్నామని మిథున్‌రెడ్డి కేంద్రానికి స్పష్టం చేశారు. ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్‌కు మైన్స్ కేటాయించి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దితే దేశానికి, రాష్ట్రానికి గొప్ప ఆస్తిగా మిగులుతుందని వివరించారు. పోలవరం నిర్మాణం కీలక దశలో ఉందని, కేంద్రం వేగవంతంగా స్పందించాలన్నారు. ఏపీలో 16 కొత్త వైద్య కళాశాలలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సహకారం అందించాలని కోరారు. వివిధ పద్దుల కింద పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తగదు. దీని ప్రైవేటీకరణ దిశగా వేసే ఏ అడుగైనా రాష్ట్రానికి నష్టమే. అందువల్ల ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం..’ అని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రణాళికను పరిగణనలోకి తీసుకుని ప్లాంటును పరిరక్షించాలని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికను పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఏపీలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ రంగ యూనిట్ ఇది. ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి అందిస్తోంది. పరోక్షంగా మరో 20 వేలకు మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో దశాబ్దకాలం పోరాటం తర్వాత ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దీనిపై ఏపీ ప్రజలకు అపారమైన సెంటిమెంట్ ఉంది. అందువల్ల ప్రధాన మంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటికే దీనిపై లేఖ రాశారు. స్టీల్ ప్లాంటు తెలుగు ప్రజల సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంటును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉక్కు శాఖతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నెలకు రూ. 200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. 6.3 మిలియన్ టన్నుల మేర వార్షిక ఉత్పత్తి చేస్తోంది. ఇదే తరహా పనితీరు స్థిరంగా కొనసాగాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి..’ అని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఒప్పందాల రద్దుకు అనుమతి ఇవ్వండి ‘గత టీడీపీ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ గరిష్టంగా రూ.5.90ల చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు మేము యూనిట్ ధరను రూ.2.49కి తీసుకొచ్చాం. గణనీయమైన ఆదా చేస్తున్నాం. అందువల్ల కుడిగి, వల్లూరు థర్మల్ ప్లాంట్లతో డిస్కమ్‌లు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వండి..’ అని కోరారు. అవి సరెండర్ చేస్తే ఏటా రూ. 325 కోట్ల మేర రాష్ట్రానికి ఆదా అవుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలి ‘ప్రత్యేక హోదా హామీ అమలు చేయాలి. విభజన చట్టంలో పేర్కొన్న ఇతర హామీలు కూడా నెరవేర్చాలి..’ అని మిథున్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని తెలిపారు. మతపరమైన రాజకీయాలకు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. కాగా, ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి కేంద్రం నుంచి సమాధానం కావాలని మిథున్‌రెడ్డి కోరారు. -
పోలవరానికి వారంలో రూ.2,300 కోట్లు!
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,300 కోట్లను రీయింబర్స్మెంట్ చేసేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సోమవారం ఆయన సంబంధిత ఫైలుపై సంతకం చేసి ఆర్థిక శాఖకు పంపారు. బహిరంగ మార్కెట్లో బాండ్లద్వారా రుణాలను సేకరించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించనుంది. వారంలోగా రూ.2,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ► పోలవరం కోసం 2014 ఏప్రిల్ 1వ తేదీకి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,177.62 కోట్లకు సంబంధించి లెక్కలు పక్కాగా ఉన్నట్లు నిర్ధారిస్తూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇచ్చిన ఆడిటెడ్ నివేదికను కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు ఇప్పటికే అందచేశారు. కోరిన వివరాలన్నీ అందచేసిన నేపథ్యంలో పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేసేలా నిధులు విడుదల చేసి సహకరించాలని కోరుతూ గత నెల 25న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ► సీఎం జగన్ ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌లతో కలిసి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌తో భేటీ అయ్యారు. పీపీఏ ప్రతిపాదించిన మేరకు రూ.2,300 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని, మిగతా రూ.1,758.02 కోట్లను మలిదఫాలో ఇస్తామని షెకావత్ హామీ ఇచ్చారు. వేగంగా రీయింబర్స్: మంత్రి అనిల్‌కుమార్ కేంద్ర మంత్రితో సమావేశానంతరం అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.4 వేల కోట్ల రీయింబర్స్మెంట్ నిధులను త్వరితగతిన విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆర్థిక శాఖతో మాట్లాడి నిధులు త్వరగా విడుదలయ్యేలా చూస్తామని, రాష్ట్రానికి అన్నివిధాలా సహకారమందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని షెకావత్‌ను కోరామన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని షెకావత్ చెప్పారన్నారు. పునరావాసానికి సంబంధించి త్వరితగతిన నిధులిస్తే డిసెంబర్ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. -
భూ దోపిడీపై నిగ్గు తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో రాజధాని అమరావతిలో వేల ఎకరాల భూ దోపిడీకి పాల్పడటంపై సీబీఐతో దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. పార్టీ ఎంపీలు ఆదివారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నానిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వల్లభనేని బాలశౌరి, బీవీ సత్యవతి, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, కోటగిరి శ్రీధర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రూ.40 వేల కోట్లకుపైగా దోపిడీ: ఎంపీ కోటగిరి శ్రీధర్ ► ప్రతి ఇంటికీ పథకాల లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 15 నెలలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. వలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనను సామాన్యుడి చెంతకే చేర్చింది. మేం రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచాం. వైఎస్సార్సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. ప్రజలంతా మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు. ► 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏపాటిదో ఇప్పుడు కనబడుతోంది. ఆ అనుభవం మతవిద్వేషాలను రెచ్చగొడుతోంది. బీజేపీలో ఉన్న తన సన్నిహితులతో రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నారు. అమరావతిలో 4 వేల ఎకరాలను తన సొంత మనుషులకు, అప్పటి అడ్వొకేట్ జనరల్‌కు, జడ్జిల కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. భూముల కుంభకోణంలో రూ. 40 వేల కోట్ల మేర దోపిడీ జరిగింది. ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయి? ఎక్కడ కొన్నారు? రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని సీబీఐ దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలి. ► చంద్రబాబు అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు ఎంపీలను తీసుకెళితే ఎన్నికల్లో ఆయనకు ముగ్గురే మిగిలారు. వచ్చే ఎన్నికల్లో మీకు ఒక్క ఎంపీ మాత్రమే మిగులుతారు. ► రికార్డు స్థాయిలో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి అత్యధిక సీట్లు గెల్చుకున్నా.. ప్రతి విషయానికి కోర్టులు అడ్డుపడుతున్నాయి. వైఎస్సార్ సీపీ సామాన్యుడి కోసం పుట్టిన పార్టీ. అభివృద్ధి పనులతో ప్రజల మనసులను గెలుచుకుంటాం. ప్రజలు అంతా గమనిస్తున్నారు: మోపిదేవి వెంకట రమణారావు ► అమరావతిలో భూముల అక్రమాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో నిలదీశారు. వీటిని వెలుగులోకి తెచ్చేందుకు అధికారంలోకి వచ్చాక కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దర్యాప్తుల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ► వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలియకూడదని సాక్షాత్తూ న్యాయస్థానం నిబంధన విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతవరకు సమంజసం? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే స్టే, సామాన్యుడు ఇంగ్లిష్ అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తే దానిపై స్టే, రాజధాని భూముల కుంభకోణంపై దర్యాప్తుజరగకుండా స్టే.. ఇలా ఏ పనిచేసినా స్టే వస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. తప్పు చేయబట్టే అడ్డుకుంటున్నారు: వల్లభనేని బాలశౌరి చంద్రబాబు మొదటి నుంచి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బతుకుతున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి అన్ని స్కాముల్లో ఇదే వైఖరి. ఏ తప్పు చేయనప్పుడు, దర్యాప్తు నిలిపివేయమని అడగాల్సిన పని ఏముంది? తప్పు చేశారు కాబట్టే అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎన్నో రోజులు కుదరదు. రాష్ట్ర ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. దర్యాప్తు జరిపే వరకు పార్లమెంటులో నిరసన వ్యక్తంచేస్తూనే ఉంటాం. -
టీడీపీ లాయర్లే జడ్జిలు
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి, సిటీ బ్యూరో: అమరావతిలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాల కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జాతీయ స్థాయిలో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలతోపాటు 13 మంది అమరావతిలో అక్రమంగా భూములు కొనుగోలు చేయడంపై ఏసీబీ నమోదు చేసిన కేసు దర్యాప్తును రాష్ట్ర హైకోర్టు నిలిపివేయడం.. ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించకూడదు/ ప్రసారం చేయకూడదని ఉత్తర్వులు ఇవ్వడాన్ని దేశ వ్యాప్తంగా రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులు, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. టీడీపీ తరఫున వాదించిన లాయర్లే జడ్జిలయ్యారని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో సాగిన అవినీతిని వెలికి తీస్తామనే నినాదంతోనే అధికారంలోకి వచ్చామని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్లో, వెలుపలా శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడమేంటని పలువురు ప్రముఖులు నిప్పులు చెరిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. శాసన వ్యవస్థ నిర్మాణం నాశనం అవుతోంది : మిథున్‌రెడ్డి ► ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొచ్చుకు వస్తోంది. తద్వారా శాసన వ్యవస్థ నిర్మాణం నెమ్మది నెమ్మదిగా నాశనం అవుతోంది. మా రాష్ట్రంలో టీడీపీ తరఫున వాదించిన న్యాయవాదులు న్యాయమూర్తులయ్యారు. ఇలాంటప్పుడు మా రాష్ట్రంలో నిష్పాక్షికమైన తీర్పులు ఆశించలేం. (చదవండి: భావ ప్రకటనకు సంకెళ్లా..?) ► న్యాయమూర్తుల ఎంపికలో న్యాయమైన చర్చ జరగాలి. ఈ తీర్పులు సక్రమంగా లేవు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య పలుచని రేఖ ఉంది. న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ అధికారాల్లోకి చొరబడరాదు. దేశం ప్రగతి మార్గాన పయనించాలంటే మొత్తం కొలీజియం వ్యవస్థనే తొలగించాలి. దీనిపై పునరాలోచించాలి. ► ఎన్డీయే వరసగా రెండు సార్లు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలేంటంటే వాళ్లు అవినీతిని పెకిలించి వేస్తారని, వ్యవస్థలోకి వెళ్లిన అవినీతి సొమ్మును ఖజానాలో జమ చేస్తారని ప్రజలు నమ్మారు. ► సీబీడీటీ ఫిబ్రవరి 13న ఒక ప్రెస్ నోట్ జారీ చేసింది. దాని ప్రకారం.. ఆదాయ పన్ను శాఖ దాడుల్లో రూ.2 వేల కోట్ల మేర నల్లధనం వెలుగు చూసిందని చెప్పింది. ఈ దాడులు ఒక ప్రముఖుడి పర్సనల్ సెక్రటరీ వద్ద జరిగాయని ఆ ప్రెస్‌నోట్ వెల్లడించింది. ఆ ప్రముఖుడు ఎవరో కాదు.. మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ► ప్రధాన మంత్రి మా రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి అమరావతిని ఒక కుంభకోణంగా మార్చారని అన్నారు. అవినీతికి ఏటీఎంలాగా మార్చారని వ్యాఖ్యానించారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. బీజేపీ ఏపీ యూనిట్ కూడా సీబీఐ దర్యాప్తు కోరింది. ఇక్కడ గొడవ చేస్తున్న టీడీపీ ఎంపీలు సీబీఐ దర్యాప్తు డిమాండ్‌కు మద్దతు ఇస్తారనుకుంటున్నా. సంకెళ్లు.. ఇప్పుడు హైకోర్టుల వంతు ప్రజా ప్రయోజన సమాచార వ్యాప్తికి సంకెళ్లు వేయడం ఇప్పుడు హైకోర్టుల వంతైంది. ఇన్సైడర్ సమాచారంతో అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారికి వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదు ఇందుకు ఒక ఉదాహరణ. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఈ కేసును మీడియా ప్రచురించరాదని, ప్రసారం చేయరాదని నిషేధం విధించింది. – సుబ్రమణియన్ స్వామి,న్యాయవాది, బీజేపీ ఎంపీ గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది ప్రొ.నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ, రాజ్యాంగ విశ్లేషకుడు ‘గత ప్రభుత్వాల విధానాలను సమీక్షించకూడదని కోర్టులు అంటే ఎలా? విశృంఖల అధికారాలు ప్రభుత్వాలకే కాదు కోర్టులకు కూడా లేవు’ అని మాజీ ఎమ్మెల్సీ, రాజ్యాంగ విశ్లేషకుడు ప్రొ.నాగేశ్వర్ స్పష్టం చేశారు. మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెబుతున్న కేసును దర్యాప్తు చేయొద్దని.. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని, అది సరైందికాదని చెప్పారు. ఈ మేరకు ఓ టీవీ చానల్లో చర్చలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► అసలు అవకతవకలు జరగలేదని హైకోర్టు ఎలా సర్టిఫికెట్ ఇస్తుంది? అవినీతి జరిగిందన్న ఆరోపణపై విచారణ జరుగుతోంది. ఆరోపణలను కోర్టులు విచారణ స్థాయిలోనే అడ్డుకుంటామంటే ఎలా? విచారించకుండానే అది నిజం కాదని చెబుతున్నారా? ► ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చట్టబద్ధంగానే ఏర్పడింది. అందువల్ల ఈ ప్రభుత్వానికి అంతకుముందు ప్రభుత్వాలు చేసిన వాటిని సమీక్షించే అధికారం ఉంటుంది. ఆ అధికారం ప్రజలే ఇచ్చారు. కాదనే అధికారం ఎవరికీ లేదు. ► గత ప్రభుత్వాల నిర్ణయాలను సమీక్షించకూడదని చెప్పడానికి కోర్టులు ఎవరు? ప్రభుత్వం ఓ విధానాన్ని సమీక్షించాలా వద్దా.. విచారణ జరపాలా వద్దా అన్నది పరిపాలనా వ్యవస్థ నిర్ణయం. అసలు మీరు విచారణే జరపొద్దు అంటే ఎలా? ► టీడీపీ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని ఆ పార్టీ న్యాయవాదులు వాదించడంలో అర్థం ఉంది. కానీ టీడీపీ ప్రభుత్వం తప్పు చేయలేదు అంటూ విచారణ జరపొద్దని కోర్టు చెబుతుందా? ఇది విచిత్రం. ► హైకోర్టు తీర్పు అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. ప్రభుత్వాల పరిపాలనా అధికారంలోకి ప్రవేశించి కోర్టులు అనవసర జోక్యం చేసుకుంటున్నాయనే భావన బలపడుతోంది. ఇది కోర్టు గౌరవాన్ని ఇనుమడింపజేయదు. కోర్టులు ఎప్పుడూ ప్రజల హక్కుల గురించే పోరాడాలి తప్ప, రాజకీయపరమైన అంశాలలోకి వెళ్లకూడదు. ► న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదు.. విమర్శించకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కూడా కాదు. ఇక ఎంపీలు పార్లమెంటు లోపల మాట్లాడిన అంశాలపై ఏ కోర్టు కూడా ప్రశ్నించడానికి లేదు. అది శాసన వ్యవస్థ రాజ్యాంగ బద్ధ అధికారం. కోర్టుల తీర్పులను ప్రశ్నిస్తూ పార్లమెంట్ కొత్త చట్టాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్‌లో రూ. 2 వేల కోట్ల అవినీతి.. ► ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో ప్రజా సొమ్ము దుర్వినియోగమైంది. 10 లక్షల సెట్‌టాప్ బాక్సులు కొనుగోలు చేశారు. ప్రతి సెట్ టాప్ బాక్స్‌ను రూ.4,400కు కొనుగోలు చేశారు. నాలుగో తరగతి పిల్లాడు వెళ్లి షాపులో కొన్నా రూ.2 వేలలోపే కొనుగోలు చేయొచ్చు. ► ఈ పది లక్షల సెట్ టాప్ బాక్స్‌ల్లో 2 లక్షల బాక్స్‌లు పని చేయడం లేదు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని కేంద్రానికి లేఖ రాశాం. ఇందులో రూ.2 వేల కోట్లకు పైగా అవినీతి జరిగింది. రాజకీయ కక్షపూరిత ఆరోపణల ముద్ర లేకుండా మేం పారదర్శక, నిష్పాక్షిక విచారణ కోరుతున్నాం. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. (టీడీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్యానెల్ స్పీకర్ ఎన్.కె.ప్రేమ్‌చంద్రన్ జోక్యం చేసుకుంటూ.. ఎంక్వైరీ మీద మాట్లాడొచ్చు.. నో ప్రాబ్లెమ్.. అన్నారు..) భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం ఈరోజు పార్లమెంట్ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరం నిరసన తెలియజేస్తున్నాం. అమరావతి భూ కుంభకోణం దర్యాప్తు ఆపాలని హైకోర్టు చెప్పడం దురదృష్టకరం. తెల్లరేషన్‌కార్డుదారులు రూ.కోట్లు వెచ్చించి భూములు ఎలా కొనుగోలు చేశారు? బినామీ యాక్ట్ దీనికి వర్తించదా? దేశంలో అతి పెద్ద స్కామ్ ఇది. ఇలాంటి స్కామ్ గురించి విచారణ జరగొద్దు.. దీని గురించి మీడియాలో రాయొద్దు అంటే ఎలా? ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం. – మార్గాని భరత్, లోక్‌సభలో పార్టీ విప్ ఎంపీ ఇందులో పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారనే.. చిన్న చిన్న కేసులు కూడా సీబీఐకి ఇస్తున్నారు. ఫోన్ టాపింగ్ అవుతోందని ఒక పత్రిక ప్రచురించిన కథనం ఆధారంగా, సాక్ష్యాధారాలు ఏవీ లేకున్నప్పటికీ, దానిపై కూడా దర్యాప్తునకు పూనుకున్నారు. అలాంటిది ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటై బినామీలకు సంబంధించిన ఆధారాలు సహా కోర్టుకు సమర్పిస్తే.. దర్యాప్తు ఆపమంటారా? పెద్ద పెద్దవాళ్ల పేర్లు ఇందులో వచ్చాయి. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలి. – లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ ప్లకార్డులతో ప్రదర్శన పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎంపీలు ధర్నా నిర్వహిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై, ఏపీ ఫైబర్‌నెట్‌పై, అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సురేష్, భరత్, శ్రీనివాసుల రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బోస్, మోపిదేవి, పోచ బ్రహ్మానందరెడ్డి, కోటగిరి శ్రీధర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు జైట్లీ మాటలు నిజమయ్యాయి.. ► 2016లో ఆర్థిక బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి ‘న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొచ్చుకువస్తోంది.. క్రమక్రమంగా ఇటుకపై ఇటుక పేర్చినట్టుగా.. భారత శాసన వ్యవస్థ స్వరూపం నాశనమైపోతోంది’ అని అన్నారు. ► సరిగ్గా అరుణ్‌జైట్లీ చెప్పిన రీతిలోనే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తును ఏపీ హైకోర్టు నిలిపివేసింది. సమాచార ప్రచురణను, ప్రసారాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే మాజీ అడ్వొకేట్ జనరల్ పేరు, ఓ న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నందునే ఇలా జరిగింది. ఇది మంచిది కాదు. ► ఈ అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్రం రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి. రాజ్యాంగ వ్యతిరేక చర్య : ధర్నాలో వి.విజయసాయిరెడ్డి ► సమాచార నిషేధ ఉత్తర్వు రాజ్యాంగ వ్యతిరేక చర్య. ఆర్టికల్ 14ను ఉల్లంఘించే చర్య. ఈ కేసులో అసలు నిజంగా స్టే ఇచ్చే అధికారం హైకోర్టుకు ఉందా అన్న అంశాన్ని పరిశీలించాలి. దీనికంటే ముందు కొన్ని వివరాలు మీకు (మీడియా) చెబుతా. ► మూడు అంశాల ప్రాతిపదికగా మా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉద్యమించాం. ఈ రోజుకు కూడా దానికి కట్టుబడి ఉన్నాం. రెండోది.. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పాం. అందుకోసమే మా పార్టీ పుట్టింది. మూడోది.. గత ప్రభుత్వంలో ఏవైతే లక్షల కోట్ల రూపాయల స్కామ్స్ జరిగాయో.. ఆ ప్రజా సొమ్మును చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు ఏ విధంగా దోచుకున్నాడో దానిని రికవరీ చేసి తిరిగి ఖజానాకు జమ కట్టాలన్న అంశాల ప్రాతిపదికగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ► ఏపీ హైకోర్టు పోలీసుల దర్యాప్తుపై స్టే ఇచ్చింది. సమాచార నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ రెండు ఎంతవరకు చట్టబద్ధంగా జారీ చేశారు? హైకోర్టుకు నిజంగా ఆ అధికారం ఉందా? అన్న అంశాలను పరిశీలించాలి. ఇదొక రాజ్యాంగ వ్యతిరేక చర్య. ఆర్టికల్ 14ను ఉల్లంఘించే చర్య. హైకోర్టుకు ఈ అధికారం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ► ఈ కేసును అవినీతి నిరోధక చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం నమోదు చేశారు. ఇదే చట్టంలోని సెక్షన్ 19 (3) క్లాజ్ ‘సి’ ప్రకారం.. ఏ కోర్టు కూడా, ఏ ఇతర ప్రాతిపదికపై కూడా, ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వరాదు. ఏదైనా ఎంక్వైరీ ట్రయల్, అప్పీలు లేదా ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులను రివిజన్ చేసేందుకు ఏ కోర్టుకు అధికారం లేదు. చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎలా స్టే ఇచ్చారన్నదే ప్రశ్న. కొన్ని ప్రత్యేక, అత్యవసర పరిస్థితుల్లో స్టే ఇవ్వచ్చని నిన్ననే చెప్పాను. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అవి ఈ కేసుకు అన్వయించవచ్చా? పోలీస్ మీద నమ్మకం లేకపోతే దర్యాప్తును సీబీఐకి ఇవ్వొచ్చు కదా?. -
అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కుంభకోణంపై సిట్ దర్యాప్తు జరుగుతుండగా హైకోర్టు దానిపై విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చిందన్నారు. అంతేకాకుండా సదరు వ్యవహారం మీడియాలో రాకుండా ‘నిషేధిత’ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఓ న్యాయమూర్తి కుటుంబీకులు ఇందులో ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రధానమంత్రి నుంచి సామాన్యుడి వరకు ఒకేలా ఉండాలన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో బుధవారం ఈ అంశంపై మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ► ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధాని ఏర్పాటులో నాలుగు వేల ఎకరాల భారీ భూకుంభకోణం జరిగింది. ఆ భూముల విలువ రూ.లక్షల నుంచి ఇప్పుడు రూ.కోట్లకు చేరింది. ► అప్పటి సీఎం రాజధాని తిరువూరులో, ఇతర ప్రాంతాల్లో వస్తుందని అధికారికంగా ప్రకటించి.. తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేశారు. ఇది అధికారిక రహస్యాల్ని స్వప్రయోజనాలకు వాడుకోవడమే. ► ఇదొక భారీ కుంభకోణం. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వాళ్లు, తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లు కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొన్నారంటేనే వాళ్లు బినామీలని అర్థమవుతోంది. ► దేశం చూసిన అతిపెద్ద స్కాముల్లో ఇదొకటి. అందువల్ల సీబీఐ దర్యాప్తు జరపాలని ఇప్పటికే మా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ► అలాగే ఫైబర్‌గ్రిడ్ నెట్‌వర్క్‌లో కూడా రూ.2 వేల కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయి. దీనిపైనా, అంతర్వేది రథం దగ్ధం ఘటనపైన కూడా దర్యాప్తు జరపాలి. -
కరోనా: వైఎస్సార్సీపీ ఎంపీల విరాళం
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తమ వంతు సాయం అందించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ముందుకొచ్చారు. అందులో భాగంగా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఒక నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ కారణంగా మానవాళికి తీవ్ర సంక్షోభం తలెత్తిందని విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు సాహసోపేతంగా పనిచేస్తున్నారని అభినందించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయని గుర్తుచేశారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇంటికి పరిమితం కావడం చాలా ముఖ్యమని తెలిపారు. పనిచేస్తే కానీ తిండి దొరకని వారికి అన్ని రకాల సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పేద ప్రజలకు అండగా ఉండేందుకే ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. కరోనాపై పోరాటానికి భావసారూప్యత ఉన్న వ్యక్తులు కూడా తమ వంతు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. చదవండి : తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్ ఫ్లిప్‌కార్ట్ సర్వీసులు నిలిపివేత -
మంత్రి సానుకూలంగా స్పందించారు : బుగ్గన
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. బుగ్గన మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. బుగ్గనతోపాటు వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, బల్లి దుర్గప్రసాద్, వంగా గీత, బ్రహ్మానందరెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. సివిల్ సప్లై కార్పొరేషన్ పేరుతో గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి.. ఆ డబ్బులను ఇతర పనులకు వినియోగించిందని విమర్శించారు. దీంతో సివిల్ సప్లై కార్పొరేషన్‌కు మార్కెట్ నుంచి డబ్బులు సమకూరే పరిస్థితి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ధాన్యం సేకరణ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కేంద్రానికి వివరించినట్టు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర పరిస్థితిని పరిగణలోకి తీసుకునే అంశంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరాను. ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాను. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని.. ఎఫ్ఆర్బీఎం పరిమితి సడలించాలని కోరాను. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతోందని మంత్రికి వివరించాను. రెవెన్యూ లోటు గ్రాంట్ ఇవ్వాలని కోరాను. వెనకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడంతోపాటు.. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ కు నిధులు ఇవ్వాలని కోరాను. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. ఏదో ఒకరోజు ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో కేంద్రం నుంచి గ్రాంట్లు ఇవ్వాలని కోరాను. 2011 జనాభా లెక్కలు, రాష్ట్ర విభజన, గత ఐదేళ్ల ప్రభుత్వ వైఫల్యం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను 15వ ఆర్థిక సంఘం చైర్మన్ కు వివరించాను. జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలను శిక్షించ వద్దని కోరాను. టీడీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేయడం వల్ల బయట నుంచి రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి ఉంది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధుల లేమి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు గ్రాంట్లు ఇవ్వాలని కోరాను. ఉద్దానం కిడ్నీ బాధితులకు , గోదావరి, ప్రకాశం, కడప జిల్లాల యురేనియం ప్రాంతాలకు వాటర్ ఇవ్వాల్సిన నేపథ్యంలో వీటికి నిధులు ఇవ్వాలని కోరాను. కరువుతో అల్లాడుతున్న రాయలసీమను ఆదుకునేందుకు కెనాల్ క్యాటరింగ్ కెపాసిటీ పెంచేందుకు నిధులు ఇవ్వాలని కోరాను. ఉత్తరాంధ్ర రాయలసీమ లో పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను. కేంద్రం నుంచి జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉంద’ని తెలిపారు.(చదవండి : ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోండి) -
తలసేమియా, హీమోఫిలియా వ్యాధుల చికిత్సకు ఆర్థిక సాయం
సాక్షి, న్యూఢిల్లీ: తలసేమియా, హీమోఫిలియా, సికిల్‌సెల్ ఎనీమియా తదితర వ్యాధుల చికిత్సకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఔషధాలకు, రక్త సంబంధిత అవసరాలకు వీలుగా కేంద్రం సాయం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ తదితర చికిత్స అవసరమైనప్పుడు రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్ఏఎన్), ఆరోగ్య మంత్రి విచక్షణా నిధి, ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.15 లక్షల వరకు సాయం అందుతుందని వివరించారు. మరో ఉప ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ మంగళగిరి ఎయిమ్స్ పూర్తిస్థాయి కార్యకలాపాలు చేపట్టే దశలో ఈ వ్యాధులకు సంబంధించి అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2022 నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఆరోగ్య ఉప కేంద్రాలను 2022 డిసెంబర్ నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అసంక్రమిత వ్యాధులు, మానసిక ఆరోగ్యం, ఈఎన్టీ, కంటి వైద్యం, దంత వైద్యం, ట్రామాకేర్ వంటి చికిత్సలన్నీ ఉచితంగా అందరికీ అందించనున్నట్టు తెలిపారు. అయితే ఆయుష్మాన్ భారత్ అమలులో అనేక సవాళ్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య కేంద్రాల సంఖ్య తక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఏపీలో 1,197 పీహెచ్‌సీలు అవసరం కాగా 1,147 మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు. సీహెచ్‌సీలు 299 అవసరం కాగా 193 మాత్రమే ఉన్నాయని వివరించారు. ఏపీలో పీహెచ్సీ స్థాయిలో 222 వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సీహెచ్‌సీ స్థాయిలో 149 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంధత్వం, వినికిడి లోపం నివారణ పథకం కింద రూ.39 కోట్లు అంధత్వం, వినికిడి లోపం నివారణ జాతీయ పథకం కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.39 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీఎంఎంవీవై కింద 3.25 లక్షల మందికి ప్రయోజనం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) కింద ఆంధ్రప్రదేశ్‌లో 2018–19లో 3.25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కోటగిరి శ్రీధర్, చంద్రశేఖర్ బెల్లాన అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉపాధి హామీ సగటు పని దినాలు 58.32 ఉపాధి హామీ పథకంలో ఏపీలో 2016–17లో ఒక్కో కుటుంబానికి సగటు పని దినాలు 51.49, 2018–19లో 58.32 లభించాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. -
లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి తాజాగా లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహిస్తారు. రాజంపేటలో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించారు. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. -
'బడ్జెట్లో ఏపీకి తీవ్ర నిరాశే మిగిలింది'
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించి ఏ ఒక్కదానిపై కేటాయింపు లేదని ఎంపీ మిథున్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బడ్జెట్ చూస్తే రాష్ట్రానికి నిరాశే ఎదురైందని మిథున్ రెడ్డి అన్నారు. విభజన చట్టం హామీల అమలుకు నిధులు ఇవ్వలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేక హోదాపై బడ్జెట్లో ఊసే లేదని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమ పార్టీ ఎంపీలు ఎక్కడ అవకాశం వచ్చినా ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నామన్నారు. ఇక రైల్వే బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక జోన్ ఇస్తామని చెప్పి, చివరకు దాని ఊసే ఎత్తలేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాగా బడ్జెట్లో కేంద్రం ...ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన సోమవామిరమిక్కడ మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపులు, రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి ఆరోగ్య విషయంలోనూ ప్రతి కుటుంబానికి లక్ష హామీ ఇవ్వడం జరిగిందని, అయితే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2లక్షల భరోసా భరోసా కల్పించిన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే రోడ్లు, ఇన్ఫ్రా రంగంలోనూ కేటాయింపులు పెంపు జరిగిందన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు తూతూ మంత్రంగానే నిధుల కేటాయింపు జరిగిందని, కేంద్రం విభజన హామీలు పూర్తిగా పక్కన పెట్టిందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో శంకుస్థాపన చేసిన 'సెయిల్'పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నిర్మాణానికి నిధులు లేవని, మౌలిక రంగానికి నిధులు కేటాయించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు, రైతులకు చేయూత ఇచ్చేలా నిధుల కేటాయింపు సంతోషకరమని ఎంపీలు బుట్టా రేణుకా, వరప్రసాద్ అన్నారు. -
ప్రత్యేక చిక్కులు!
* ఏపీ, తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాలు కోరుతున్నాయి * రెండు రాష్ట్రాలకూ పరిశీలనలో పన్ను మినహాయింపు * లోక్‌సభకు తెలిపిన కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, పన్ను మినహాయింపులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(1) ప్రకారం రెండు రాష్ట్రాలకు పన్ను మినహాయింపు అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పన్ను మినహాయింపును పరిశీలిస్తామన్న మంత్రి.. స్పెషల్ స్టేటస్‌పై ఆచితూచి స్పందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఒడిశా, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. ‘జార్ఖండ్, ఒడిశా, రాజస్తాన్ రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ హోదా పొందేందుకు జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) నిబంధనలు అంగీకరించటం లేదని కేంద్రం ఇప్పటికే తెలియచేసింది. బిహార్ విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్(ఐఎంజీ) పేర్కొంది’ అని వివరించారు. ఎన్డీసీ నిబంధనల ప్రకారం స్పెషల్ కేటగిరీ హోదా దక్కాలంటే పర్వత శ్రేణులతో కూడుకున్న ప్రాంతం, తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా ఎక్కువగా ఉం డడం, పొరుగు దేశాల సరిహద్దుల్లో ఉండడం, ఆర్థిక, మౌలికపరమైన వెనకబాటుతనం, ఆర్థిక చిక్కుల్లో ఉండడం లాంటి నిబంధనలను సంతృప్తి పరచాల్సి ఉంటుందన్నారు.