( ఫైల్ ఫోటో )
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అతిపెద్ద సమీకృత ప్రత్యామ్నాయ ఇంధన స్టోరేజి ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. లోక్‌సభలో శుక్రవారం ఇంధన పరిరక్షణ సవరణ బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీ తరపున ఆయన పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం, ప్రపంచలోనే అతిపెద్ద సమీకృత ప్రత్యామ్నాయ ఇంధన స్టోరేజి ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇంధన రంగం కోసం యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్‌తో పనిచేస్తున్నారు. సుమారు 5300 మెగావాట్ల పంప్ స్టోరేజి కెపాసిటీతో నిర్మిస్తోంది. కాబట్టి, ఈ అంశంలో రాష్ట్రానికి సహకరించాలని ఎంపీ మిథున్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఎనర్జీ అభివృద్ది రంగంలో ఏపీ 22 శాతం అభివృద్ధితో ఉందని తెలిపిన ఆయన.. ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రోత్సాహం కోసం జిఎస్టీని తగ్గంచాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 250 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతితో ఖజానాపై భారం పడుతోంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా 33 గిగావాట్ల ఇంధన పంప్ స్టోరేజీని నిర్మించాలి. ఒక్క ఏడాది బొగ్గు దిగుమతి ఖర్చుతో.. దీన్ని శాశ్వత ఇంధన వనరుగా మార్చుకోవచ్చు. దీంతో ఇంధన రంగంలో దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది. ఇదొక గేమ్ చేంజర్‌గా మారుతుంది. అదే సమయంలో ఏపీ ఒక హబ్‌గా, బ్యాటరీగా మారుతుంది. గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు వస్తాయి అని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు.
‘‘పంప్ స్టోరేజీకి కాంక్రీట్, ఎర్త్ వర్క్ మాత్రమే చాలు. అంతా స్వదేశీయంగానే తయారు చేసుకోవచ్చు. బొగ్గు దిగుమతికి డాలర్లలో ఖర్చు పెడుతున్నాం. అదే పంప్ స్టోరేజికి వచ్చే 25 ఏళ్లకు ఫిక్స్డ్ ధర నాలుగు రూపాయలకే సరఫరా చేయొచ్చు. అంతేకాదు పవర్ బిల్లు, బొగ్గు దిగుమతి బిల్లు తగ్గుతుంది.పెట్టుబడులు, ఉద్యోగ కల్పన పెరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ పెరిగి గ్రీన్ ప్రొడక్ట్స్ డిమాండ్ వస్తుందని ఎంపీ మిథున్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment