ఈసారి ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి?
న్యూఢిల్లీ: సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనగానే కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారంతా తమకు ఇష్టమైనవి ఈసారి ఏ విధంగా లభిస్తాయి? తాము ఊహించిన దానికంటే తక్కువ ధరకే లభిస్తాయా లేక జేబుకు చిల్లు పెట్టి అందకుండా పోతాయా అని చూస్తుంటారు. అయితే, సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం అలా ఎదురు చూసిన వారికి కొందరికి నిరాశ కొందరికి ఊరట కలిగించారు.
ఎప్పటిలాగే పొగరాయుళ్లను వదిలిపెట్టని జైట్లీ అదే సమయంలో బ్రాండెడ్ వస్తువులను కొనుగోలు చేసేవారిచే మరోసారి అబ్బో అనిపించారు. రెస్టారెంట్లకు వెళ్లేవారు కూడా ఈసారి కాస్త ఆలోచించుకోవాల్సిందే. కానీ, ఈసారి పాదరక్షలు రోటర్స్, బ్రాడ్ బాండ్ మోడెమ్స్, సెట్ టాప్ బాక్స్లు, డిజిటల్ వీడియో, సీసీటీవీ కెమెరాలు వంటివి తగ్గించి సామాన్యుడికి కాస్తంత ఊరట కల్పించారు. అసలు ఆయన బడ్జెట్తో ఈ ఏడాది ఏ వస్తువుల కొండెక్కి కూర్చుంటాయో.. ఏవి అందుబాటులో ఉంటాయో ఓసారి పరిశీలిస్తే..
పెరిగేవి....
కార్లు
సిగరెట్లు, పొగాకు, కాగితం బీడీలు, గుట్కా
రెస్టారెంట్లలో భోజనాలు, విమాన ప్రయాణం
రూ.వెయ్యి పైబడిన రెడీమేడ్ గార్మెంట్స్, బ్రాండెడ్ వస్తువులు
వెండి మినహా బంగారం, ఇతర అభరణాలు
దిగుమతి చేసుకునే ఆభరణాలు
మినరల్ వాటర్
రూ.2లక్షల పై బడిన వస్తు రవాణా
అల్యూమినీయం
ప్లాస్టిక్ బ్యాగులు, సాక్స్లు
రోప్ వే, కేబుల్ కారు ప్రయాణాలు
పరిశ్రమల్లో వాడే సోలార్ వాటర్ హీటర్స్
లీగల్ సర్వీసులు
లాటరీ టిక్కెట్లు
ప్రైవేటు అద్దె వాహనాల్లో ప్రయాణం
ఈ-రీడింగ్ డివైస్లు
వాయిస్ ఓవర ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ)
విదేశీ గోల్ఫ్ కార్ట్లు
బంగారు కడ్డీలు
తగ్గేవి....
పాద రక్షలు
సోలార్ పంపులు
రోటర్స్, బ్రాడ్ బాండ్ మోడెమ్స్, సెట్ టాప్ బాక్స్లు, డిజిటల్ వీడియో, సీసీటీవీ కెమెరాలు
హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్
డయాలసిస్ పరికరాలు
60 చదరపు మీటర్లలో నిర్మించే ఇళ్లు
జానపద కళాకారులకు చెల్లించే మొత్తాలు
రిఫ్రిజిరేటర్ కంటెయినర్స్
పెన్షన్ ప్లాన్స్
మైక్రో వేవ్ ఓవెన్స్
సానిటరీ ప్యాడ్స్
బ్రెయిలీ పేపర్