'ఆ కల నెరవేరడం ఇంపాజిబుల్'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదొక కలగూర గంప బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ వెనుక పెద్ద ఆలోచనేది చేయనట్లు కనిపిస్తోందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయాలు రెండింతలు అవుతాయని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా చెప్పిందని.. అది ముమ్మాటికీ సాధ్యం కాని ఐడియా మాత్రమే అన్నారు.
'ఇది మిశ్రమ అంశాలతో నింపిన సంచిలాంటి బడ్జెట్. ప్రధాని నిన్న ప్రకటించిన ఒక ఐడియా తప్ప దీని వెనుక పెద్ద ఆలోచనేది చేయనట్లు కనిపిస్తోంది. వచ్చే ఐదేళ్లలో రైతుల ఆదాయం డబుల్ అవుతుందని చెప్పారు. అది తీరే కలమాత్రం కాదు. పోని ఎలా సాధిస్తారో కూడా వివరించలేదు' అని మన్మోహన్ సింగ్ బడ్జెట్పై స్పందించారు.