Google Tells Employees Not To Share Confidential Materials With AI Chatbots Including Bard - Sakshi
Sakshi News home page

‘AI’ టూల్స్‌ చాట్‌జీపీటీ, బార్డ్‌ వినియోగం..ఉద్యోగులకు గూగుల్‌ వార్నింగ్‌!

Published Fri, Jun 16 2023 5:28 PM | Last Updated on Fri, Jun 16 2023 6:26 PM

Google Warning Employees About Using Chatgpt And Bard Ai - Sakshi

కృత్తిమ మేధ ఆధారిత టూల్స్‌ గూగుల్‌ బార్డ్‌, చాట్‌జీపీటీ వినియోగంపై గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ అప్రమత్తమైంది. సంస్థకు సంబంధించిన సున్నితమైన డేటా బహిర్ఘతంగా కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు ఏఐ టూల్స్‌ ఉపయోగంపై హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

అయితే, ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసిన ఉద్దేశం..సంస్థ రహస్యాలు బయటకు పొక్కకుండా ఉండేందుకేనని గూగుల్‌ చెబుతోంది. కంపెనీలో సున్నితమైన సమాచారంపై మోడరేటర్స్‌ విభాగానికి చెందిన ఉద్యోగులు రివ్యూలు నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఏఐ చాట్‌ బాట్‌లకు రివ్యూల గురించి సమాచారం తెలిస్తే తీవ్రం నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గూగుల్‌ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.



మితిమీరిన వినియోగంతో 
ఈ ఏడాది మైక్రోసాఫ్ట్‌ ఏఐ టూల్‌ చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్‌ ‘బార్డ్‌’ను విడుదల చేసింది. అనంతరం, గూగుల్‌ ఉద్యోగులు సైతం బార్డ్‌ బలాలు, బలహీనతలు పరీక్షించేలా పరిధికి మించి వినియోగిస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చింది. ఈ తరుణంలో కృత్తిమ మేధ టూల్స్‌ను కొన్ని పరిమితులకు లోబడి ఉపయోగించాలని తెలిపింది. ఇంజనీర్లుకు సైతం చాట్‌బాట్‌లను అందించే కోడ్‌ను నేరుగా వినియోగించొద్దని తెలిపింది.  

శాంసంగ్‌ దెబ్బకు దారికొచ్చిన కంపెనీలు
ఇక, గూగుల్‌ ఉద్యోగులకు జారీ చేసిన హెచ‍్చరికలతో భద్రత విషయంలో కంపెనీలు తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రతిధ్వనిస్తున్నాయి. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌కు చెందిన ఉద్యోగులు చాట్‌జీపీటీ వినియోగించే సమయంలో ఓ ప్రాజెక్ట్‌ రహస్యాల్ని షేర్‌ చేశారు. దీంతో ఏఐ టూల్స్‌ను వినియోగించకుండా బ్యాన్‌ చేసింది. 

జాగ్రత్త పడుతున్నాయ్‌
ఈ పరిణామంతో ప్రపంచ దేశాలు సంస్థలు ఏఐ టూల్స్‌ విషయంలో జాగ్రత్త పడుతున్నాయి. సంస్థ రహస్యాలు పొక్కకుండా.. లేదంటే ఏఐ టూల్స్‌తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కొత్త కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. తాజాగా, గూగుల్‌ సైతం చాట్‌జీపీటీ, బార్డ్‌లపై ఆంక్షలు విధించినట్లు వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌లు హైలెట్‌ చేస్తున్నాయి. 

చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్‌.. డబుల్‌ శాలరీలను ఆఫర్‌ చేస్తున్న కంపెనీలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement