ప్రముఖ టెక్ దిగ్గజం జీమెయిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఆండ్రాయిడ్ ఆధారిత అండ్రాయిడ్ యూజర్లకు ఏఐని జోడిస్తున్నట్లు తెలిపింది.ఇందుకోసం రిప్లయ్ సజెషన్స్ ఫ్రం జెమిని పేరిట వ్యవహరిస్తున్న ఈ ఫీచర్‌పై పనిచేస్తుందని, ఈ ఫీచర్ సాయంతో ఈమెయిల్స్‌కు రిప్లయి ఇచ్చేలా యూజర్లు వినియోగించుకునే అవకాశం కలగనుంది.
గూగుల్ ఇప్పటికే గూగుల్ వన్ ఏఐ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ద్వారా గూగుల్ డ్రైవ్, డాక్స్ వంటి సర్వీస్‌లలో జెమిని అడ్వాన్స్‌డ్ పవర్డ్ ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు తన మొబైల్ జీమెయిల్ అప్లికేషన్‌లో ఏఐని ఇంటిగ్రేట్ చేసే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
నివేదిక ప్రకారం.. కొత్త ఏఐ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చిన మెయిల్స్‌ను విశ్లేషించడం, సూచనలిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా మెయిల్స్ పంపే సమయంలో అందులో ఉన్న కంటెంట్ సరిగ్గా ఉందా, లేదంటే ఇంకా ఏమైనా జోడించాల్సి ఉంటుందా అనే సలహాలు ఇస్తుంది. అవసరమైతే మెయిల్స్‌లో యూజర్‌కు కావాల్సిన కంటెంట్‌ను ఏఐ అందిస్తుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే త్వరలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ వన్ ఏఐ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి రానుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment