Gmail app
-
జీమెయిల్ యూజర్లకు శుభవార్త
ప్రముఖ టెక్ దిగ్గజం జీమెయిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఆండ్రాయిడ్ ఆధారిత అండ్రాయిడ్ యూజర్లకు ఏఐని జోడిస్తున్నట్లు తెలిపింది.ఇందుకోసం రిప్లయ్ సజెషన్స్ ఫ్రం జెమిని పేరిట వ్యవహరిస్తున్న ఈ ఫీచర్‌పై పనిచేస్తుందని, ఈ ఫీచర్ సాయంతో ఈమెయిల్స్‌కు రిప్లయి ఇచ్చేలా యూజర్లు వినియోగించుకునే అవకాశం కలగనుంది. గూగుల్ ఇప్పటికే గూగుల్ వన్ ఏఐ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ద్వారా గూగుల్ డ్రైవ్, డాక్స్ వంటి సర్వీస్‌లలో జెమిని అడ్వాన్స్డ్ పవర్డ్ ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు తన మొబైల్ జీమెయిల్ అప్లికేషన్లో ఏఐని ఇంటిగ్రేట్ చేసే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. నివేదిక ప్రకారం.. కొత్త ఏఐ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చిన మెయిల్స్‌ను విశ్లేషించడం, సూచనలిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా మెయిల్స్ పంపే సమయంలో అందులో ఉన్న కంటెంట్ సరిగ్గా ఉందా, లేదంటే ఇంకా ఏమైనా జోడించాల్సి ఉంటుందా అనే సలహాలు ఇస్తుంది. అవసరమైతే మెయిల్స్‌లో యూజర్‌కు కావాల్సిన కంటెంట్‌ను ఏఐ అందిస్తుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే త్వరలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ వన్ ఏఐ సబ్స్క్రైబర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం. View this post on Instagram A post shared by BSTech (@bstechofficial) -
గూగుల్‌పే, జీమెయిల్ క్రాష్ అవుతోందా? ఇలా చేయండి!
గత కొన్నిరోజులుగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు యాప్ క్రాష్ అయిందని అకస్మాత్తుగా నోటిఫికేషన్లు వస్తోండంతో వినియోగదారులు నిర్ఘాంతపోతున్నారు. ఫలానా యాప్‌కు చెందిన నోటిఫికేషన్‌ను క్లిక్ చేసినప్పుడు యాప్ ఓపెన్ అవ్వడంలేదు. తరుచుగా క్రాష్ అవుతున్న యాప్స్‌లో గూగుల్‌పే, జీ మెయిల్, క్రోమ్ కూడా ఉన్నాయి. ఈ సమస్యకు గల కారణాన్ని గూగుల్ వెంటనే పసిగట్టింది. ఈ సమస్య వోఎస్‌లోని ఆండ్రాయిడ్ వెబ్ వ్యూ యాప్ ద్వారా ఏర్పడిందని గూగుల్ తెలిపింది. కొంతమంది వినియోగదారులకు జీ-మెయిల్ యాప్ పనిచేయడంలేదనే విషయం కంపెనీ దృష్టికి వచ్చిందని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. తొందరలోనే సమస్యను పరిష్కారిస్తా మన్నారు. అంతేకాకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారు అత్యవసర సేవల కోసం ఫోన్లోని జీమెయిల్ యాప్‌కు బదులుగా డెస్క్ టాప్ వెబ్ ఇంటర్‌ఫేజ్‌ను వాడమని పేర్కొన్నారు. కాగా, యాప్ క్రాష్ సమస్యను ఎదుర్కొంటున్న వినియోగదారులు అత్యధికంగా ఉన్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన మొబైల్ ఫోన్లనే ఎక్కువశాతం వినియోగదారులు వాడుతున్నారు. ఫలానా బ్రాండ్ అనే తేడా లేకుండా అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ఫోన్లలో ఈ సమస్య ఏర్పడింది. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్లు ఎక్కువగా యాప్ క్రాష్ సమస్యకు గురైయ్యాయి. ఈ సమస్య మరింత జటిలం కావడంతో శాంసంగ్ తన యూజర్లను వెబ్ వ్యూ యాప్‌ను ఆన్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఈ విధంగా చేస్తే యాప్ క్రాష్ అవ్వదు..! ఈ సమస్య పరిష్కారం కోసం శాంసంగ్ సపోర్ట్ పలు సూచనలు చేసింది. వెబ్‌వ్యూ ఆప్డేట్ను ఆన్ఇన్స్టాల్ చేసి, తిరిగి ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయమంది. తరువాత ఈ స్టెప్లను ఫాలో అవ్వండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అక్కడ యాప్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. పక్కన కనిపించే త్రీ డాట్స్‌ను క్లిక్ చేసి షో సిస్టమ్ యాప్స్ లో ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూ లోకి వెళ్లి..అన్ఇన్స్టాల్ ఆప్‌డేట్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. శాంసంగ్ యూజర్లు మాత్రమే కాకుండా అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఈ విధంగా చేస్తే యాప్ క్రాష్ సమస్యనుంచి తప్పించుకోవచ్చు. అయితే వెబ్‌వ్యూ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు అప్రమత్తత అవసరమని కూడా హెచ్చరించింది. (చదవండి: ఐటెల్ ఆండ్రాయిడ్ టీవీలు వచ్చేశాయ్!) -
ఇన్‌బాక్స్‌కు గుడ్‌బై చెబుతున్న గూగుల్
గూగుల్ తన ‘ఇన్‌బాక్స్’ యాప్‌కు గుడ్‌బై చెప్పబోతుంది. జీమెయిల్‌కు రీఫోకస్ చేసే క్రమంలో ఈ ఈ-మెయిల్ యాప్‌ను నిలిపివేస్తుంది. 2019 మార్చి నుంచి ఇన్‌బాక్స్ గుడ్‌బై చెప్పడంటూ గూగుల్ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నవారంతా జీమెయిల్‌కు మారేందుకు గడువు ఇచ్చింది గూగుల్. వాస్తవానికి గూగుల్‌కు జీమెయిల్ యాప్ ఉంది. అయినా 2014లో ఈ 'ఇన్‌బాక్స్' యాప్‌ని రూపొందించింది. అయితే 'ఇన్‌బాక్స్' యాప్‌కు అంత స్పందనేమీ రాలేదు. అందుకే సేవల్ని నిలిపివేసి, జీమెయిల్‌పై రీఫోకస్ చేయాలని గూగుల్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇన్‌బాక్స్ యూజర్లు ఆన్లైన్ గైడ్ ద్వారా జీమెయిల్‌తో అనుసంధానం కావాలంటూ గూగుల్ జీమెయిల్ ప్రొడక్ట్ మేనేజర్ మాథ్యూ ఇజట్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. జీమెయిల్లో మీ సంభాషణలన్నీ ఇప్పటికే వేచిచూస్తున్నాయంటూ మాథ్యూ పేర్కొన్నారు. అంటే స్టోర్ చేసుకున్న ఈమెయిల్స్‌ను యూజర్లు బదిలీ చేసుకోవాల్సినవసరం లేదని తెలిసింది. 'ఇన్‌బాక్స్' యాప్‌లో ఇమెయిల్ స్నూజ్, ఏఐ, స్మార్ట్ రిప్లై, హై ప్రియారిటీ నోటిఫికేషన్స్, స్మార్ట్ కంపోజ్ లాంటి ఫీచర్లున్నాయి. ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఈ యాప్‌లో ఉన్న ఫీచర్స్‌తో ఇటీవలే జీమెయిల్ యాప్‌ను గూగుల్ సరికొత్త డిజైన్‌లో అప్డేట్ చేసింది. దాంతో 'ఇన్‌బాక్స్' యాప్ తన ప్రత్యేకతను కోల్పోయి, యూజర్లూ తగ్గారు. అందుకే ఇక ఈ యాప్‌ను నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది. -
'జీమెయిల్ యాప్'కు గూగుల్ న్యూ లుక్!
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా న్యూలుక్ తో జీమెయిల్ యాప్ కు గూగుల్ కొత్త హంగుల్ని అందించడానికి సిద్ధమైంది. అయితే అప్ డేటెడ్ వెర్షన్ జీమెయిల్ యాప్ ఇంకా గూగూల్ ఇండియా ప్లే స్టోర్ లో అందుబాటులోకి రాలేదు. దశల వారిగా జీమెయిల్ యాప్ ను రీడిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యాప్ త్వరలోనే భారతీయ యూజర్లకు అందుబాటులోకి రానుందని గూగుల్ కంపెనీ వెల్లడించింది. ప్రతి మెసెజ్ కు అనువైన రిప్లై బటన్ పై గూగుల్ దృష్టి పెట్టినట్టు సమాచారం. అంతేకాకుండా వినియోగానికి చాలా సులభంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్ లో యాప్ ను వినియోగిస్తే.. ఇన్ బాక్స్ లో వివిధ కేటగిరిలో మార్పులు గమనిస్తారని ఓ బ్లాగ్ పోస్ట్ లో గూగుల్ పేర్కొంది. కొత్త యాప్ ద్వారా అన్ని ఈమెయిల్ ప్రొవైడర్లు యాహూ మెయిల్, అవుట్ లుక్.కామ్ ఈమెయిల్ ను పీంఓపి/ఐఎంఏపీ ద్వారా వినియోగించుకోవచ్చని గూగుల్ తెలిపింది. Follow @sakshinews